చంద్రబాబు వచ్చారు.. పంటంతా తొక్కారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు వచ్చారు.. పంటంతా తొక్కారు

చంద్రబాబు వచ్చారు.. పంటంతా తొక్కారు

Written By news on Thursday, October 18, 2012 | 10/18/2012


ఆదోని(కర్నూలు), న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర బుధవారం కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో సాగింది. ఆయన యాత్రలో అక్కడక్కడా పంట పొలాల్లోకి వెళ్లి రైతులను కలిశారు. ఆయన రాకతో రైతులు మాత్రం బెంబేలెత్తారు. ఆదోని పట్టణ శివారులో హుళేబీడు బసప్ప అనే రైతు కూలీలతో కలిసి సజ్జ పంట కోస్తుండగా.. చంద్రబాబు వచ్చారు. నేతలతో కలిసి బాబు పొలాల్లోని వారి వద్దకు వెళ్లారు. ఆయన వెంట నేతలు, కార్యకర్తలు, మీడియా ప్రతి నిధులు పరుగులు తీశారు. దీంతో ఆ పంట నేలపాలైంది. పెట్టుబడి ఎంత, గిట్టుబాటు అవుతుందా.. దిగుబడి ఎంత రావచ్చు లాంటి ప్రశ్నలు వేసిన చంద్రబాబు తాను సీఎం అయిన తరువాత కష్టాలు తీరుస్తానని చెప్పి వెళ్లిపోయారు. అందరూ వెళ్లిపోగానే తొక్కిసలాటలో నేలపాలైన పంటను చూసి బసప్ప ఘొల్లుమన్నాడు.

వర్షాభావంతో సజ్జ సాగుకు పెట్టిన పెట్టుబడిలో రూ.5వేలు విలువైన పంట రావచ్చని అంచనా వేసుకున్నానని, తొక్కిసలాటలో పంటంతా నాశనమై నష్టం మరింత పెరిగిందంటూ బసప్ప మీడియా ప్రతినిధుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆలూరు నియోజకవర్గంలో మూడు రోజులపాటు కొనసాగిన యాత్రకు ఆశించిన మేరకు జనం రాలేదు. అయితే ఆదోనిలో మాత్రం టీడీపీ నాయకులు ఓ మేర జనాన్ని సమీకరించగలిగారు. బాబు యాత్ర ఉదయం 11 గంటలకు ఢణాపురం గ్రామంలో ప్రారంభమై ఆరేకల్లు గ్రామం వరకు కొనసాగింది.

మొత్తం 20 కి.మీ. మేరనడిచారు. ఢణాపురం, ఆదోని మధ్యలో రెండు చోట్ల పొలాల్లో పని చేస్తున్న రైతు కూలీలను తెలుగు మహిళా నాయకురాలు బాబు మాట్లాడతారు రమ్మని రోడ్డుపైకి తీసుకొచ్చారు. అయితే బాబు వారితో మాట్లాడకుండానే ముందుకు సాగారు. విరుపాపురం గ్రామానికి చెందిన బిందు అనే చిన్నారి కిడ్నీ వ్యాధితో బాధపడుతుండగా భూపాల్ స్వచ్ఛంద సంస్థ బాబు చేతుల మీదుగా రూ.25వేలు అందించింది. పట్టణంలోని ట్రాన్స్‌కో కార్యాలయం పక్కనే రోడ్డుపై పూరి గుడిసెలో నివాసం ఉంటున్న రంగమ్మ అనే వృద్ధురాలితో బాబు మాట్లాడారు. పింఛన్ వస్తుందా లేదా అని ఆరా తీశారు. తాను ముఖ్యమంత్రి అయితే పింఛన్‌ను రూ.600కు పెంచుతానని చెప్పి చేతిలో రూ.5వేలు ఉంచిన ఓ కవర్ అందించారు.

ఆ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదేం?
ఢణాపురం సమీపంలోని భీమా ఇంజనీరింగ్ విద్యార్థులతో కూడా చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా సిద్దార్థ అనే విద్యార్థి టమాట జ్యూస్ ఫ్యాక్టరీ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రి అయితే జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని చెప్పగా.. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హామీ ఇచ్చారని ఆ విద్యార్థి గుర్తు చేస్తుండగానే చంద్రబాబు వినిపించుకోకుండా ముందుకు కదిలారు.

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=470913&Categoryid=1&subcatid=33
Share this article :

0 comments: