షర్మిల వెంట ‘అనంత’ జనవాహిని - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిల వెంట ‘అనంత’ జనవాహిని

షర్మిల వెంట ‘అనంత’ జనవాహిని

Written By news on Tuesday, October 30, 2012 | 10/30/2012


12వ రోజు పాదయాత్రలో భాగంగా షర్మిల అనంతపురం ఎస్కేయూ నుంచి సోమవారం ఉదయం పది గంటలకు పాదయాత్రకు బయలుదేరారు. ఉదయం నుంచే అనంతపురం ప్రజలు పెద్ద ఎత్తున ఆమె వెన్నంటి ఉన్నారు. వేలాది మంది ఆమెతో కదం కలిపారు. వీధులన్నీ పోటెత్తగా షర్మిల ముందుకు సాగారు. మార్గమధ్యలో చియ్యేడుకు చెందిన రైతులు తాము కూలీలుగా మారిన పరిస్థితిని ఆమె దృష్టికి తెచ్చారు. నీరు లేక, కరెంటు లేక, పంటలు పండక, నష్టపరిహారం రాక ఈ దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం 11.20కి విన్సెంట్ పాఠశాలలో పిల్లలకు అభివాదం తెలిపి పాదయాత్ర కొనసాగించారు. తర్వాత ఇటుక బట్టీ కార్మికులతో మాట్లాడారు. షర్మిల ఇటుక మూసలో మట్టి పోసి రెండు మూడు ఇటుకలు తయారు చేశారు. మధ్యాహ్నం 12.15కు ఆర్డీటీ ఆసుపత్రి సమీపంలో భోజన విరామానికి ఆగారు. తిరిగి 3.30కు పాదయాత్రకు బయలుదేరారు. 4.45కు వాల్మీకి విగ్రహానికి హారతి ఇచ్చి, అక్కడ్నుంచి బహిరంగ సభ ప్రాంతమైన సప్తగిరి సెంటర్‌కు సాయంత్రం 5.15కు చేరుకున్నారు. అనంతపురం నగరమంతా అక్కడికి తరలిరావడంతో మెయిన్ రోడ్డు అంతా ట్రాఫిక్ జామైంది. యువతీయువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మైనారిటీ సోదరులు బంతిపూల తివాచీ పరిచి స్వాగతం పలికారు. రాత్రి 7.35 గంటలకు కల్యాణదుర్గం బైపాస్ రోడ్డులో రాత్రి బసకు చేరుకున్నారు. పాదయాత్రలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ డి.నారాయణరెడ్డి పాల్గొన్నారు.
Share this article :

0 comments: