జగన్ ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు: షర్మిల

జగన్ ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు: షర్మిల

Written By news on Friday, October 26, 2012 | 10/26/2012

ధర్మవరం: ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి, తన అన్న జగన్మోహన రెడ్డిని కూడా ఎవరూ ఆపలేరని షర్మిల అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి ఈ సాయంత్రం షర్మిల పాదయాత్ర చేరుకుంది. అధిక సంఖ్యలో జనం వచ్చి ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జనసద్రమైన ధర్మవరంలో భారీస్థాయిలో మహాప్రస్థానం బహిరంగ సభ జరిగింది. అశేష జనవాహిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ అనంతపురం అల్లుడని, తన తల్లి విజయమ్మ ఈ జిల్లా ఆడపడుచు అని చెప్పారు. జగన్ మీ మేనల్లుడు అన్నారు. షర్మిల మాటలకు జనం నుంచి అద్వితీయమైన స్పందన లభించింది.

రాజస్థాన్ తర్వాత అతితక్కువ వర్షపాతం నమోదైయ్యేది అనంతపురమేనని, అందుకే వైఎస్ఆర్‌కు ఈ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ ఉండేదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్ట్‌కు చంద్రబాబు 2 సార్లు శిలాఫలకం వేసి వదిలేశారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ 4వేల కోట్లతో పనులు చేపట్టారని, ప్రస్తుతం 40 కోట్ల రూపాయలు విడుదల చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. ఫీజు రీయింబర్స్ విషయంలో అరకొర నిధులు కేటాయిస్తున్నారని విమర్శించారు. సీఎం కిరణ్ నిద్రపోతున్నారని అనుకుంటే, పోటీగా చంద్రబాబు కూడా నిద్రపోతున్నారన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, మద్యపాన నిషేధాన్ని చంద్రబాబు తంగలో తొక్కారన్నారు. చంద్రబాబుది మాటమీద నిలబడే నైజం కాదని విమర్శించారు. చంద్రబాబుకు మునీశ్వరుడి శాపం ఉందని, నిజం చెబితే తల వెయ్యిముక్కలవుతుందన్నారు.
జగన్‌పై టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకున్నారన్నారు. తన అవినీతిపై విచారణ వద్దని, ప్రతిఫలంగా అవిశ్వాసం పెట్టనని బాబు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాదయాత్ర డ్రామా ఆడుతున్నారన్నారు.

ధర్మవరం రైల్వేస్టేషన్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ విజయమ్మ, షర్మిలలు పూలమాలు వేసి నివాళులర్పించారు.
Share this article :

0 comments: