నేడు విజయమ్మ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు విజయమ్మ పర్యటన

నేడు విజయమ్మ పర్యటన

Written By news on Tuesday, November 6, 2012 | 11/06/2012

వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ముందు అనుకున్న ప్రకారం ఆమె సోమవారమే జిల్లాకు రావాల్సి ఉండగా, పశ్చిమగోదావరి జిల్లాలో బాధితులు అడుగడుగునా ఆపి తమ గోడు చెప్పుకోవడంతో ఆ జిల్లా పర్యటనలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ఆమె సోమవారం రాత్రి భీమవరంలో బసచే సి, మంగళవారం ఉదయం జిల్లాలోకి ప్రవేశించనున్నారు. దిండి వద్ద జిల్లాలో అడుగుపెట్టనున్న విజయమ్మ రాజోలు, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో తుపాను, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. ముంపు బారిన పడిన కాలనీలకు, గ్రామాలకు వెళ్లి సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడిన బాధితులను పరామర్శిస్తారు. వారి వెన్నుతట్టి ధైర్యం చెపుతారు. ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలిస్తారు.

పర్యటన సాగనుందిలా...

* మంగళవారం ఉదయం 10 గంటలకు : భీమవరం నుంచి చించినాడ బ్రిడ్జి మీదుగా జిల్లాలోకి ప్రవేశం 
* 11 గంటలకు : రాజోలు మండలం శివకోడులో ముంపుబారిన పడ్డ వరి చేల పరిశీలన, రైతులకు పరామర్శ
* మధ్యాహ్నం 12 గంటలకు : పి.గన్నవరం నియోజకవర్గంలోని నాగుల్లంక వద్ద పంటపొలాల పరిశీలన
* ఒంటి గంటకు : అమలాపురంలో పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ఇంటి వద్ద భోజన విరామం
* 2.00 గంటలకు : ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి వద్ద పంట పొలాల పరిశీలన, రైతులకు పరామర్శ
* 2.30 గంటలకు : ముమ్మిడివరం లోని ఎయిమ్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న పంట పొలాల పరిశీలన, రైతులకు పరామర్శ
* 3.30 గంటలకు : కాకినాడ రూరల్ మండలం పగడాలపేటలో మత్స్యకారుల కాలనీ సందర్శన
* సాయంత్రం 4.30 గంటలకు : పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో చేనేత కాలనీ సందర్శన
* 5.00 గంటలకు : కత్తిపూడి, అన్నవరం పరిసర ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
* 6.30 గంటలకు : తునిలో జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశం, అనంతరం రాత్రికి అక్కడే బస 

పర్యటన ప్రాంతాల్లో బోస్, కుడుపూడి పరిశీలన
విజయమ్మ మంగళవారం జిల్లాలో జరిపే పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విజయమ్మ పర్యటించనున్న ప్రాంతాలను సోమవారం వారు పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ఎయిమ్స్ కాలేజీ, అన్నంపల్లి ఎస్సీకాలనీ, నాగుల్లంక, శివకోడు తదితర ప్రాంతాల్లో విజయమ్మ చూడనున్న ముంపు బారినపడ్డ పంటపొలాలను పరిశీలించారు. అనంతరం పర్యటన ఏర్పాట్లపై పార్టీ ముఖ్యనేతలతో సమీక్షించారు. పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఏజేవీబీ మహేశ్వరరావు, జిల్లా కిసాన్‌సెల్ కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ, నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి, పార్టీ జిల్లా కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, తాడి విజయభాస్కరరెడ్డి, భూపతిరాజు సుదర్శనబాబు, గుత్తుల సాయి, మండల కన్వీనర్లు మట్టపర్తి నాగేంద్ర, జగతా బాబ్జి, కాళే రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: