జగన్ పాలన కోసం జనం నిరీక్షణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ పాలన కోసం జనం నిరీక్షణ

జగన్ పాలన కోసం జనం నిరీక్షణ

Written By news on Thursday, November 1, 2012 | 11/01/2012

 కాంగ్రెస్, టీడీపీ నాయకుల వైఖరితో విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత అన్నారు. జగన్ నాయకత్వంలో రాబోయే వైఎస్ రాజశేఖరరెడ్డి తరహా సుపరిపాలన కోసం జనం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. 

టీడీపీ నుంచి తనను సస్పెండ్ చేయడం అన్యాయమని వాపోయారు. ముందస్తు నోటీసులూ ఇవ్వకుండా ఇలా నిర్ణయం తీసుకోవడం అప్రజాస్వామికమన్నారు. తనను సస్పెండ్ చేసినట్టు వచ్చిన వార్తలను టీవీల ద్వారా తెలుసుకున్నానని, ఇంతవరకూ పార్టీ నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు. జగన్‌ను జైలులో కలిశారనే వంకతో తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, మరి తాను జగన్‌ను గాని, విజయమ్మను గాని ఇంతవరకూ కలవనే లేదని, తననెందుకు సస్పెండ్ చేసినట్టు అని ప్రశ్నించారు. 

కొవ్వూరులో నవంబర్ 4న వైఎస్సార్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో తాను ఆ పార్టీలో చేరతానని ప్రకటించారు. తనతోపాటు నియోజకవర్గం నుంచి వందలాది మంది టీడీపీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరతారన్నారు.
Share this article :

0 comments: