రైతుల తరపున పోరాటం: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతుల తరపున పోరాటం: విజయమ్మ

రైతుల తరపున పోరాటం: విజయమ్మ

Written By news on Tuesday, November 6, 2012 | 11/06/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగేవరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. పంట నష్టపోయిన రైతుకు ఎకరానికి కనీసం రూ.10 వేలు నష్టపరిహారం చెల్లించాలని విజయమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులతో పాటు కౌలు రైలతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు.

రెండువేల కోట్లతో గోదావరిని ఆధునీకరణ చేయాలని వైఎస్ఆర్ భావించారని, మూడేళ్లుగా పనుల్లో పురోగతి లేదని విజయమ్మ అన్నారు. గోదావరి ఆధునీకరణ పూర్తి కాకపోవటం వల్లే ప్రజలకు కష్టాలు తప్పటం లేదన్నారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు. భాదితుల్ని ఆదుకోవల్సిన ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి కూర్చున్నారని విజయమ్మ విమర్శించారు.

source:sakshi
Share this article :

0 comments: