మూడు జిల్లాల్లో 'మరో ప్రజా ప్రస్థానం’ పూర్తి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మూడు జిల్లాల్లో 'మరో ప్రజా ప్రస్థానం’ పూర్తి

మూడు జిల్లాల్లో 'మరో ప్రజా ప్రస్థానం’ పూర్తి

Written By news on Friday, November 23, 2012 | 11/23/2012

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర గురువారానికి మూడు జిల్లాల్లో పూర్తయి తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఘనంగా అడుగుపెట్టింది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలంగాణ ప్రజలు షర్మిలను సాదరంగా ఆహ్వానించారు. ఉదయం కర్నూలులో యాత్ర చేసిన షర్మిల.. సరిగ్గా మధ్యాహ్నం 3.28 నిమిషాలకు కర్నూలు జిల్లా సరిహద్దులోని తుంగభద్ర బ్రిడ్జిదాటి మహబూబ్‌నగర్ జిల్లాలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో వీడ్కోలు పలికేందుకు రాయలసీమ ప్రజలు, మహబూబ్‌నగర్ జిల్లాలోకి ఆహ్వానించేందుకు తెలంగాణ ప్రజలు బ్రిడి ్జ మీదకు చేరుకున్నారు. జాతీయ రహదారిపై కిలోమీటర్ మేర ఇసుక వేస్తే రాలనంత జనం తరలి వచ్చారు. రెండు ప్రాంతాల ప్రజలు ఒకేసారి బ్రిడ్జి మీదకు రావడంతో తీవ్రంగా తోపులాట జరిగింది. షర్మిల వ్యక్తిగత సిబ్బంది, కర్నూలు, మహబూబ్‌నగర్ పోలీసులు అతికష్టం మీద తోపులాటను అదుపులోకి తెచ్చారు. అక్కడి నుంచి ప్రజలు తెలంగాణ సాంప్రదాయవాయిద్యం ‘డిల్లెంబెల్లెం’ మోగిస్తూ వీరుని నృత్యం చేస్తూ షర్మిలను పుల్లూరు గ్రామం గేటు వరకు తీసుకొని వచ్చారు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కొండా సురేఖ స్వాగతం పలికారు. ఇప్పటిదాకా ఐదున్నర రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో, పదిహేను రోజులు అనంతపురం జిల్లాలో, పద్నాలుగున్నర రోజులు కర్నూలు జిల్లాలో పాదయాత్ర సాగింది. గురువారం కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కలిపి మొత్తం 15.30 కిలో మీటర్లు షర్మిల నడిచారు. 
Share this article :

0 comments: