చంద్రబాబును వెంటాడుతున్న గతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబును వెంటాడుతున్న గతం

చంద్రబాబును వెంటాడుతున్న గతం

Written By news on Friday, November 23, 2012 | 11/23/2012



నీతి నిజాయితీలతో బ్రతికిన ఎవరికైనా జీవితంలో మరీ యవ్వనంలో ఆటు పోట్లు తప్పవు. అయితే నానాటికి పెరిగి పోతున్న కలి ప్రభావం కారణంగా కొద్దో గొప్పో నిజాయితి ప్రదర్శించిన వారిని సైతం లోకం ఎంతో గౌరవంగా చూస్తుంది.
బాబు మొదటి కోవకు చెందిన వారు కాదన్నది జగత్ప్రసిద్దం. రెండో కోవకు చెందిన వారూ కాదన్నది బాబు మద్దత్తు దారులే ఆంతరింగిక సంభాష్ణల్లో అంగీకరించే విషయం. ఈ నేపథ్యంలో వర్థమానం పచ్చగా లేకున్నా భవిష్యత్ భగ్నమని తేలి పోయినా కనీశం గతాన్ని తలుచుకుని విశ్రాంతి తీసుకోవలసిన పరిస్థితి వయస్సు బాబుది.కాని దురదృష్ఠ వశాస్తూ బాబు గతం ఒక పెను భూతంలా ఆయన్ని వెంటాడి వేదిస్తూంది.
“చంద్ర”బాబు ఎంతగా నవ్వడం నేర్చి ( మరీ దర్ద్రంగా ఉంది ఆ భలవంతపు నవ్వు ) పున్నమి చంద్రుడిలా ముస్తాబై ఎన్ని శ్రీరంగ నీతులు వల్లించినా అతని గతం అతన్ని అమావాశ్య చంద్రుడిక్రిందే చూపుతూంది.
పిల్లనిచ్చిన మామ పైనే పోటీకి సిద్దం అని బీరాలు పలకడం – తీరా అతను సి.ఎం కాగానే కాంగ్రెసుకు వెన్ను పోటు పొడిచి మామ చెంతన చేరడం – కుర్చీ ఎప్పుడు ఖాళి అవుతుందా అని ముళ్ళ పొదల చాటున గుంట నక్కలా కాచుక్కూర్చోవడం – తండ్రి సమానుడని -కోట్లాది మంది అభిమానుల ఆరాద్య దైవమని కూడ జంకక వెన్ను పోటు పొడిచి -గుండె పోటు తెప్పించడం .
ఇక్కడ మొదలు పెడితే బాబు గతమంతా మనకు కనిపించేవి :
అబద్రతా భావం – ఎలాగైనా ఎదగాలన్న కకృత్తి – తాను ఎదగడం కోసం ఏ పక్షానికైనా జై కొట్టే అవకాశ వాదం తనకు అధికారం వస్తుందంటే నమ్మిన వారిని నట్టేట ముంచడం – తనవారిని సైతం సదా అనుమానించడం – తన భలం పై తనకు నమ్మకం లెక పోవడంతో తనవారిలోనే గ్రూపులను ప్రోత్సహించడం.
తన స్వార్థం కోసం తానెన్ని గడ్డైనా కరవవచ్చుగాని – తన వారి పై ఏ మాత్రం నింద పడినా -అది నిజమో కాదో కూడ ఆలోచించక పక్కన పెట్టడం -స్వంత పార్టి ఎం.ఎల్.ఏలను ప్రజాప్రతినిదులను సైతం నమ్మక అధికారుల పై ఆధారపడటం.
బా.జ.పా పొత్తుతో నెగ్గి తనకేదో బలం ఉందని అతిగా ఊహించుకుని ఎన్.టి.ఆర్ కన్నా గొప్ప పాలకుడు కావాలన్న తుత్తరతో మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అనే స్థాయికి చేరారు. ( ఎన్.టి.ఆర్ గొప్ప వక్త అన్నది గమనార్హం – తనకు వక్తృత్వం లేక పోవడాన్ని కప్పి పుచ్చుకోవడమే కాక గొప్ప వక్త -మానవతావాది అయిన ఎన్.టి.ఆర్ ని పరోక్షంగా కించ పరచే వ్యాఖ్య ఇది.
ఏ వర్గ ప్రజలైతే తనను నమ్మి ఓటిచ్చారో ప్రత్యక్షంగా వారిని బాధించే చర్యలకు ఏమాత్రం జంకక పోవడం. తానో బ్రమలోకి వెళ్ళి పోయి -పిచ్చివాడిలా తయారై సహచర రాజకీయనాయకులంతా అవుట్ డేటడ్ అయినట్టు తానొకడే హైటెక్ అన్నట్టు బిల్డప్పు ఇవ్వడం మైంద్ సెట్ మార్చుకోమని సలహాలివ్వడం -అస్తమానం రాజకీయాలేనా..రాజకీయం అంటే అది ఎన్నికల సమయంలోనే అంటూ అసహనం వ్యక్తం చెయ్యడం. ఇల ఒకటి కాదు వెయ్యి విషయాలున్నాయి.
బాబు గతాన్ని తవ్విన కొద్ది ఇటువంటి శవపేటికలే భయిట పడతాయి. ఆ కళేబరాలు పెనుభూతమై బాబు వెంటాడి వేదిస్తున్నాయి.
పాపం బాబు ! ఇప్పటికీ గతంలో తాను గొప్పగా చేసాడని భావిస్తున్నారు. ఈ నిమిషం వరకు బాబువి అన్ని చార్తిత్రిక తప్పిదాలే.
వాటన్నింటిని లిస్ట్ అవుట్ చేసి శ్వేత పత్రం విడుదల చేసి 48 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి భయిటకొచ్చి ఒక్క మాట చెప్పినా నమ్మే పరిస్థితిలో జనం లేరు. ఎందుకంటే బాబు గతం బాబును మాత్రమే కాదు ఈ రాష్ఠ్ర్ర ప్రజలను సైతం -నిద్రలో సైతం భెదిరిస్తున్నాయి.
కాని బాబు మాత్రం ఇంకా తాను కరెక్ట్ అని భావిస్తుండడం – తన పరిపాలనకు తానే కితాబులిచ్చుకోవడం కౄయల్ జోక్.

http://sambargaadu.wordpress.com/2012/11/23/cn-jpg/
Share this article :

0 comments: