జగన్ పై లక్ష కోట్ల ఆరోపణ చేసే చంద్రబాబు నాయుడు ఇప్పుడు రిలయన్స్ పై లక్షపది వేల కోట్ల ఆరోపణలు వచ్చినా స్పందించరే? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ పై లక్ష కోట్ల ఆరోపణ చేసే చంద్రబాబు నాయుడు ఇప్పుడు రిలయన్స్ పై లక్షపది వేల కోట్ల ఆరోపణలు వచ్చినా స్పందించరే?

జగన్ పై లక్ష కోట్ల ఆరోపణ చేసే చంద్రబాబు నాయుడు ఇప్పుడు రిలయన్స్ పై లక్షపది వేల కోట్ల ఆరోపణలు వచ్చినా స్పందించరే?

Written By news on Thursday, November 1, 2012 | 11/01/2012

చంద్రబాబుకు కొత్త చిక్కు వచ్చి పడింది. కెజి బేసిన్ లో గ్యాస్ ధర సమస్యపై జైపాల్ బదిలీ వెనుక రిలయన్స్ హస్తం ఉందని విమర్శలు వస్తున్నాయి. రిలయన్స్ కంపెనీకి లక్ష కోట్ల లాభం చేకూరేలా కేంద్రంలో అప్పటి మంత్రి మురళీ దేవర సహకరించారని అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు కేజ్రీవాల్ ఆరోపించారు.అలాగే ప్రణబ్ ముఖర్జీ కూడా రిలయన్స్ కు పది వేల కోట్ల లాభం చేశారని కూడా ఆయన విమర్శించారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆయా రాజకీయ పక్షాలు పెద్ద ఎత్తున స్పందిచాయి. సాధారణంగా అయితే దేశస్థాయిలో జరిగే పరిణామాలపై చంద్రబాబు ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి వ్యాఖ్యానిస్తుంటారు. అలాంటిది రిలయన్స్ పై ఆరోపణలు వస్తే ఇంతవరకు ఆయనగాని, ఆయన పార్టీ నేతలు కాని స్పందించలేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మూడేళ్ల క్రితం వై.ఎస్. హత్య వెనుక ఈ సంస్థ హస్తం ఉందని రష్యాకు చెందిన ఒక వెబ్ సైట్ ఒక కధనాన్ని ఇచ్చింది. దాని ఆధారంగా ఇక్కడ కొన్ని టీవీ చానళ్లు కధనాలు , చర్చలు నడిపాయి.ఆ మీదట కొందరు రిలయన్స్ షాపులపై దాడులు చేశారు. ఆ మరుసటి రోజే చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి రిలయన్స్ పై దాడిని తీవ్రంగా ఖండించారు. అంతవరకు బాగానే ఉంది.జగన్ పై లక్ష కోట్ల ఆరోపణ చేసే చంద్రబాబు నాయుడు ఇప్పుడు రిలయన్స్ పై లక్షపది వేల కోట్ల ఆరోపణలు వచ్చినా స్పందించరేమిటని కొంతమంది ప్రశ్నించడం ఆరంభించారు.తప్పు ఎక్కడ జరిగినా తప్పే. కాని రాజకీయ నాయకులు తమకు ఉన్న సంబంధాలతో కొంత రిజర్వుడుగా వ్యవహరిస్తుంటారు.అలాంటి ప్రభావం చంద్రబాబుపైన కూడా ఉందనుకోవాలా?అయితే కేజ్రీవాల్ రిలయన్స్ కు కాంగ్రెస్ ,బిజెపిలు రెండూ సన్నిహితమేనని వ్యాఖ్యానించిన విషయం చూస్తే రాజకీయ పార్టీలు, కార్పొరేట్ సంస్థలకు మధ్య పెనవేసుకున్న అనుబంధం అర్ధం కావడం లేదూ?

source:kommineni
Share this article :

0 comments: