YS Jagan bail plea adjourned to Nov 28 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » YS Jagan bail plea adjourned to Nov 28

YS Jagan bail plea adjourned to Nov 28

Written By news on Friday, November 23, 2012 | 11/23/2012

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లపై- నాంపల్లి సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు ఈనెల 28కి వాయిదా పడింది. సీఆర్ పీసీ సెక్షన్‌ 167(2) కింద వేసిన స్టాట్యుటరీ బెయిల్‌ పిటిషన్‌పై జగన్‌ తరపున సీనియర్ న్యాయవాది పద్మనాభరెడ్డి వాదనలు పూర్తిచేశారు. సీబీఐ తరపు న్యాయవాది బళ్ళా రవీంధ్రనాథ్‌ ఇదే అంశంపై ప్రతివాదనలు వినిపించారు. బెయిల్‌ కోరుతూ గత వారం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్టాట్యుటరీ బెయిల్‌ పిటిషన్‌, రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ పేరిట రెండు పిటిషన్లు దాఖలు చేశారు. బెయిల్‌ను వ్యతిరేకిస్తున్న సీబీఐ.. కోర్టుకు కౌంటర్‌ సమర్పించింది. వాస్తవానికి నవంబర్ నెల 21నే కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించినా.... మరో రెండు రోజులు గడువు ఇవ్వాలని సీబీఐ విజ్ఞప్తి చేసింది. జగన్‌ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని.... సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించింది. సుప్రీంలో పిటిషన్‌ వేసేనాటికి 90 రోజుల గడువు పూర్తికాలేదని, అందుకనే ఈ అంశాన్ని అక్కడ ప్రస్తావించలేక పోయామని వాదనల్లో భాగంగా పద్మనాభరెడ్డి చెప్పారు. ఇపుడు 90 రోజుల గడువు పూర్తి అయింది కాబట్టి దీన్ని దాఖలు చేశామని, ఇదేమీ సుప్రీం తీర్పునకు విరుద్ధం కాదని స్పష్టం చేశారు. 

గడువులోగా ఛార్జిషీట్‌ వేయడంలో సీబీఐ విఫలమయిందని, అందువలన 167(2) కింద వైఎస్‌ జగన్‌ బెయిల్‌కు అర్హుడని జగన్ తరపు పీనియర్ న్యాయవాది పద్మనాభరెడ్డి వాదనలను వినిపించారు. దర్యాప్తులో మిగిలిన అంశాలన్నీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నవేనని, అవేమీ దర్యాప్తులో భాగంగా కొత్తగా బయటకు వచ్చిన అంశాలు కావు అని పద్మనాభరెడ్డి కోర్టుకు తెలిపారు. బెయిల్ పిటిషన్ కు 90 రోజుల గడువు కూడా ముగిసిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్‌ జగన్ బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో కొనసాగుతున్న విచారణలో పద్మనాభరెడ్డి బలంగా వాదనలు వినిపించారు.
Share this article :

0 comments: