10 రోజులు - 157.3 కిలోమీటర్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 10 రోజులు - 157.3 కిలోమీటర్లు

10 రోజులు - 157.3 కిలోమీటర్లు

Written By news on Sunday, December 2, 2012 | 12/02/2012

పాలమూరులో మరో ప్రజాప్రస్థానం
10 రోజులు - 157.3 కిలోమీటర్లు 

‘‘వెయ్యి బీడీలు చుడుతున్నా రూ.100 మాత్రమే కూలి ఇస్తున్నారు. ఉప్పు, పప్పు, కారం, నూనెల ధరలు పెరిగాయి. పూట గడవడం భారంగా మారిందమ్మా.. మా పిల్లలను పెద్ద చదువులు చదివించుకోవడం కూడా కష్టంగా ఉంది. మాకు ఇచ్చే కూలిని రూ.150కు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలమ్మా..’’అని చిన్నచింతకుంటలో బీడీ కార్మికుల తమ సమస్యలను షర్మిల దృష్టికితెచ్చారు. ‘‘మీ ఇబ్బందులను గుర్తించి యాజమాన్యాలను ఒప్పించి వైఎస్ హయాంలో రూ.150 చెల్లించే విధంగా జీఓజారీ చేసినా అమలయ్యేలోగా ఆయన మరణించడం దురదృష్టకరం’’అని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.

మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ ప్రతినిధి: దివంగ త నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి చావులేదు.. ఆయ న అమరుడు..పేదప్రజల గుండెల్లో ఉన్నంతకా లం బతికిఉన్నట్లేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అ ధినేత వైఎస్ జగన్‌మోహన్ సోదరి షర్మిల అ న్నారు. జగనన్నను ఆశీర్వదించి ముఖ్యమంత్రి ని చేస్తే వైఎస్ ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ పథకాలన్నీ తిరిగి అమలవుతాయని హామీఇచ్చారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా శనివారం ష ర్మిల దేవరకద్ర మండలం అల్లీపురం గ్రామం నుంచి నెల్లికొండి గ్రామం వరకు పాదయాత్ర కొనసాగించారు. 

కూలి పెంచడమ్మా: బీడీ కార్మికుల వినతి
అనంతరం చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమంలో బీడీ కార్మికులు మాట్లాడుతూ వెయ్యి బీ డీలు చుడుతున్నా రూ.100 మాత్రమే కూలి ఇస్తున్నారని, ఆ మొత్తాన్ని రూ.150లకు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

‘‘మీ ఇబ్బందులను గుర్తించి వైఎస్ రాజశేఖరరె డ్డి హయాంలో యాజమాన్యాలను ఒప్పించి రూ. 150లు చెల్లించే విధంగా జీఓజారీ చేసినా అమలయ్యేలోగా ఆయన మరణించడం దురదృష్టకరం’’అని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. పలువు రు విద్యార్థులు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం సక్రమంగా అమలు చేయకపోవడంతో తాము మధ్యలోనే చదువు మానేశామని ఆవేదన వ్యక్తం చేశారు. సుచరిత అనే బాలిక మాట్లాడుతూ పేదలపట్ల వైఎస్ జాలి చూపి పథకాలు అమలు చేయడం వల్లే మా అన్న ప్రస్తుతం బాసర త్రిపుల్ ఐటీలో బీటెక్ చదువుతున్నాడని గుర్తుచేశారు. ఉపాధి హామీ పనులకు వెళ్తున్నా కూలి రూ.50 నుంచి రూ.60కు మించి రావడం లేదని కూలీలు మొరపెట్టుకున్నారు. ఇకముందు మంచి కాలం వస్తుందని జగనన్న ముఖ్యమంత్రి అయ్యేవరకు ఓపికపట్టాలని కోరారు. 

ప్రాజెక్టులను మరిచారు
వైఎస్ హయాంలో మంజూరు చేసిన ప్రాజెక్టులను కూడా ఈ ప్రభుత్వం పూర్తిచేయలేకపోయిందని దుయ్యబట్టారు. దేవరకద్ర నియోజకవర్గంలోని మండలాలకు ఫేజ్-2 ద్వారా సాగునీరు అందించేందుకు, మక్తల్ పట్టణంలో భీమా మొదటి దశ పనులకు వైఎస్ రూ. 2158 కోట్లు కేటాయించి రూ. 1740 కోట్లు ఖర్చు చేసి 85 శాతం పనులు పూర్తిచేసినా మిగిలిన 15 శాతం పనులు చేయకుండా ఈప్రభుత్వం మూడేళ్లు గడిపిందన్నారు. ప్రాజెక్టులు పూర్తిచేయకపోవడంతో.. ఈ ప్రాంతంలో పనులు లేక కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని, అంతేకాకుండా కుటుంబ జీవనం కోసం పాఠశాలలకు వెళ్లే పిల్లలను సైతం కూలికి తీసుకెళ్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కారణంగానే ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ సంఖ్య పెరుగుతుందన్నారు. 

ఇది రాబందుల రాజ్యం
పెద్దవడ్లమాను గ్రామంలో ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో రూ.60 వచ్చే విద్యుత్ బిల్లులు ప్రస్తుతం రూ.300 నుంచి రూ.400 వరకు వస్తుందన్నారు. అదికూడా రోజుకు నాలుగు గంటలకు మించి కరెంట్ ఇవ్వలేకపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను పీక్కుతినే రాబందుల రాజ్యంగా మారిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యాత్ర వెంట మహిళలు పెద్దఎత్తున తరలొచ్చి హారతులు పట్టి షర్మిలకు ఘన స్వాగతం పలికారు. మద్దూరు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను షర్మిల ఆవిష్కరించారు. రచ్చబండలో స్థానిక మహిళలు చెప్పిన సమస్యలను షర్మిల ఓపిగ్గా విన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే ఏడాది పాటు ఓపికపట్టాలని, ఆ తర్వాత జగనన్న సీఎం అయితే సమస్యలు తీరుతాయని హామీ ఇచ్చారు. 
Share this article :

0 comments: