వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు 2013 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా .. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు 2013 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ..

వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు 2013 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ..

Written By news on Sunday, December 30, 2012 | 12/30/2012

వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని ఏడు నెలలుగా అక్రమ నిర్బంధంలో ఉంచినందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు 2013 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని పార్టీ అగ్రనేతలు పిలుపు నిచ్చారు. పార్టీ ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు డి.ఏ.సోమయాజులు, బాజిరెడ్డి గోవర్థన్, అధికార ప్రతినిధి బి.జనక్‌ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ ఏడు నెలలుగా జైల్లో ఉన్న జగన్ వివిధ కోర్టుల్లో ఎనిమిది సార్లు బెయిల్ పిటిషన్ వేస్తే కుట్ర బుద్ధితో సీబీఐ అడ్డుకున్నదని విమర్శించారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక నిర్బంధంలో ఉంచి తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ పన్నిన కుట్రలను ఛేదించేందుకు పార్టీ కార్యకర్తలు 2013 జనవరి ఒకటో తేదీన ‘జగన్ కోసం జనం సంతకాలు’ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేపట్టాలని వారు కోరారు. మేకపాటి మాట్లాడుతూ ఇది పార్టీ నిర్ణయం ఎంత మాత్రం కాదని పార్టీలోని పెద్దలు కూర్చుని చేసిన ఆలోచన అని వివరించారు. డిసెంబర్ 21వ తేదీన జగన్ జన్మది

నం నాడు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పటికి 30 లక్షల సంతకాలను కార్యకర్తలు చేపట్టారని త్వరలో కోటి సంతకాలను పూర్తి చేసి రాష్ట్రపతికి అందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో వచ్చే కొత్త సంవత్సరాలన్నీ బాగుంటాయని పార్టీకి మంచి రోజులు ఉంటాయని అయితే 2013 జనవరి 1వ తేదీని మాత్రం నిరసన దినంగా పాటించాలని కార్యకర్తలు మరింత పట్టుదలతో సంతకాల సేకరణ విసృ్తతంగా చేయించాలని ఆయన కోరారు. 

జగన్‌కు జైలు... సహ నిందితులకు స్వేచ్ఛా...! 
జగన్ కేసుల విషయంలో సీబీఐ కక్ష సాధింపుతో రాజకీయ దురుద్దేశ్యాలతో వ్యవహరిస్తోందని సోమయాజులు దుయ్యబట్టారు. ఈ కేసుల్లో నలభై సహనిందితులుగా ఉంటే జగన్‌ను మరొకరిని నిర్బంధించి మిగతా వారిని స్వేచ్ఛగా తిరుగనివ్వడంలో ఔచిత్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సహ నిందితుల్లో మంత్రులు, ఫైళ్లపై సంతకాలు చేసిన ప్రభుత్వ కార్యదర్శులున్నారని ఆయన అన్నారు. 2004-09 మధ్య కాలంలో ఏనాడూ ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా లేని జగన్ మాత్రం జైల్లో ఉంచారని ఆయన అన్నారు. మోపిదేవి వెంకటరమణారావును అరెస్టు చేసి ధర్మాన గురించి ఆలోచించడం లేదని ఆయన అన్నారు. అందరినీ అరెస్టు చేయాలని తాము డిమాండ్ చేయడం లేదని అయితే ఇదెంత అన్యాయమో ప్రజల దృష్టికి తెస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 

శంకర్‌రావు వేసిన పిటిషన్‌ను పురస్కరించుకుని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లోని 52వ పేరాలో జగన్‌ను 52వ ప్రతివాదిగా ఉంటే ఆయనను తొలి ముద్దాయిగా సీబీఐ చేర్చిందని అందులోనూ తన తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డితో కలిసి జగన్ నేరపూరితమైన కుట్రకు పాల్పడ్డారని అసంబద్ధమైన ఆరోపణలు చేశారన్నారు. క్విడ్ ప్రొ కో(ఫలానికి ప్రతిఫలం) అనేది ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో ఏమైనా అక్రమాలు జరిగి ఉంటే కదా అని ఆయన ప్రశ్నించారు. ఈ జీవోలు సక్రమమేనని ముఖ్యమంత్రి చెప్పారని, మరోవైపు సుప్రీంకోర్టులో రాష్ట్ర మంత్రులు వేసిన అఫిడవిట్లలో కూడా జీవోల్లో అక్రమం ఏదీ లేదని వివరించారని అన్నారు. జీవోలు అక్రమం కానపుడు ఇక క్విడ్ ప్రొకో ఎక్కడిదని ఆయన అన్నారు. సుమారు 15, 16 నెలలు దర్యాప్తు చేసిన సీబీఐ జగన్ ఆస్తుల విషయంలో కొత్తగా కనుగొన్నది ఏమీ లేదని ఆయన అన్నారు. 

జగన్ తన వ్యాపార సంస్థల గురించి పెట్టుబడుల వివరాలను ఆదాయపుపన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌లకు సమర్పించారని ఆయన వెల్లడించిన దానికన్నా సీబీఐ ఒక్క విషయం కూడా కొత్తగా కనిపెట్టలేక పోయిందని ఆయన అన్నారు. జగన్‌పై కేసులు మొత్తం రాజకీయ ప్రేరేపితమైనవిగా ఆయన వ్యాఖ్యానించారు. కనిమొళి, రాజా, కల్మాడీలకు బెయిల్ వచ్చినపుడు జగన్‌కు రాకుండా సీబీఐ అడ్డుపడటంలో అర్థం లేదన్నారు. బెయిల్‌పై విడుదలైన వారు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో ఉన్నారని కేసులో సాక్షాలను వారు తారు మారు చేయలేరని భావించినపుడు ఎలాంటి పదవిలో లేని జగన్ చేయగలరా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. బయట ఉన్న రాష్ట్ర మంత్రులకు లేని అధికారం జగన్‌కు ఉందా అని కూడా ఆయన అన్నారు. 

బాజిరెడ్డి గోవర్థన్ మాట్లాడుతూ మోపిదేవిని అరెస్టు చేయడం, ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి లాంటి వారిని ఏమీ అనక పోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. బెయిల్ పిటిషన్ వచ్చినపుడల్లా ఏదో ఒక డ్రామా చేసి సీబీఐ బెయిల్ రాకుండా అడ్డుకుంటోందని దీన్ని ప్రజా మద్దతు ద్వారా కార్యకర్తలు ప్రతిఘటించాలని ఆయన అన్నారు. సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా, డీఎల్‌ఎఫ్ లావాదేవీల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని కూడా ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ మాత్రం నైతికత లేని జాయిండ్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ ద్వారా సీబీఐ దర్యాప్తు చేయిస్తోందని ఆయన విమర్శించారు. సీఈసీ సభ్యుడు కె.శివకుమార్ కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
Share this article :

0 comments: