..కథ నడిపించింది బాబే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ..కథ నడిపించింది బాబే!

..కథ నడిపించింది బాబే!

Written By news on Saturday, December 8, 2012 | 12/08/2012

రాజ్యసభలో ఎఫ్‌డీఐ ఓటింగ్‌కు ముగ్గురు టీడీపీ ఎంపీలు దూరంగా ఉండేలా ఢిల్లీ పెద్దలతో కలిసి పక్కా పథకం ప్రకారం చంద్రబాబు కథ నడిపించారు! అత్యంత విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం... కేంద్రంలో కీలక శాఖ నిర్వహిస్తున్న ఒక మంత్రి, మరో కీలక నేత.. ‘మీకోసం’ పాదయాత్రలో ఉన్న బాబుతో ఈ విషయమై ముందే సంప్రదింపులు జరిపారు. తర్వాత బాబు ఆదేశాల మేరకే టీడీపీ ఎంపీలు ముగ్గురు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. తద్వారా మొత్తం సభ్యుల సంఖ్య, దాంతోపాటే మెజారిటీ మార్కు తగ్గి, ఎఫ్‌డీఐల గండం నుంచి రాజ్యసభలో యూపీఏ సులువుగా బయటపడగలిగింది. దీనిపై తర్వాత విమర్శలు రాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించిన బాబు.. ఈ కుమ్మక్కు వ్యవహారం తన వియ్యంకుడు, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ముందే చెబితే భవిష్యత్తులో ఆయన దాన్ని బయటపెట్టే ప్రమాదముందని భావించినట్టు తెలుస్తోంది. దాంతో హరికృష్ణ యథావిధిగా రాజ్యసభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచారు. ఇక మరో ఎంపీ సీఎం రమేశ్ కూడా.. టీడీపీ తరఫున తీర్మానాన్ని ప్రవేశపెట్టింది తానే గనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటేశారు. తీరా అంతా అయిపోయాక, గైర్హాజరైన ముగ్గురు ఎంపీలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారంటూ ఎంపిక చేసిన కొన్ని మీడియా సంస్థలకు టీడీపీ తరఫున లీకులిచ్చారు!

జగన్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన నాటి నుంచీ..

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష టీడీపీ సహకరించినట్టుగా మూడు ఏళ్ల కాలంలో అనేక ఉదంతాలు వెలుగు చూశాయి. జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొద్ది రోజులకే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో చిత్తూరు, అనంతపురం, వైఎస్‌ఆర్ జిల్లాలో జగన్ మద్దతుదారుల మంటూ స్వతంత్ర అభ్యర్ధులుగాా నిలబడిన వారిని ఓడించేందుకు రెండు పార్టీల పరస్పరం సహకరించుకున్నట్టు అప్పుడు పోలైన ఓటింగ్ సరళే స్పష్టం చేసింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన 18 అసెంబ్లీ, ఒక లోకసభ ఎన్నికల సమయంలో రెండు పార్టీ సహకరించుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం, పశ్చిమగోదావరి జిల్లా నరాసాపురం నియోజకవర్గాలలో టీడీపీకి అతి స్వలంగా ఓట్లు వచ్చి డిపాజిట్లు కోల్పోవడం ఆ అనుమానాలను మరింత ధృవపరిచాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ సమయాల్లో టీడీపీకి అండగా నిలిచిన కారణంగానే చంద్రబాబు సహా పలువురి ఆస్తులపై సీబీఐతో ప్రాధమికంగా విచారణ జరపాలని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా వెనువెంటనే అది ప్రారంభం కాకుండా టీడీపీ నేతలు కోర్టులలో స్టే తెచ్చుకునే వరకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు వారికి వెసులుబాటు కల్పించారన్న ఆరోపణలున్నాయి
Share this article :

0 comments: