మహిళా రక్షణ చట్టాలను సమీక్షించాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మహిళా రక్షణ చట్టాలను సమీక్షించాలి

మహిళా రక్షణ చట్టాలను సమీక్షించాలి

Written By news on Sunday, December 30, 2012 | 12/30/2012

దేశ రాజధానిలో సామూహిక అత్యాచారానికి గురైన యువతి నిర్భయ మృతి నేపథ్యంలో మహిళలకు రక్షణ కల్పించే చట్టాల సమీక్షకు తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. శనివారమిక్కడ ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బాధితురాలి కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలిపారు. దేశంలో మహిళల రక్షణకు పెనుమార్పులు తేవాల్సిన ఆవశ్యకతను ఈ ఉదంతం చాటిచెబుతోందన్నారు. 
యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన తీరు అత్యంత గర్హనీయమని మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న యువతను ఎలా అదుపు చేయాలనే ప్రభుత్వం ఆలోచిస్తోందని, మహిళల రక్షణపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. శాంతి భద్రతల కోణంలో ఆలోచించే విషమ పరిస్థితిలో ఉన్న నిర్భయను ఢిల్లీ నుంచి సింగపూర్‌కు తరలించారన్నారు. బాధితురాలిని తరలించవద్దని వైద్యులు సూచించినా పట్టించుకోలేదంటే ఇందులో రాజకీయ కోణం ఉందని సోనియా నివాసమైన 10 జన్‌పథ్‌లో ఈ నిర్ణయం జరిగినట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. మహిళలు అర్థరాత్రి పూట ఎందుకు తిరగాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటాన్ని చూస్తుంటే స్త్రీల పట్ల ఆయనకు ఎంత చులకన అభిప్రాయం ఉందో అర్థమవుతోందన్నారు. నిరసనలో పాల్గొంటున్న వారిని ఉద్దేశించి రాష్ట్రపతి కుమారుడు అభిజిత్ చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. 

నిర్భయకు వైఎస్సార్ సీపీ నివాళులు

సింగపూర్‌లో చికిత్స పొందుతూ బాధితురాలు నిర్భయ మృతి చెందినట్లు తెలిసిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు. వాసిరెడ్డి పద్మతోపాటు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకురాలు గాయత్రి, పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Share this article :

0 comments: