కాంతి కిరణం కడలి తరంగం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంతి కిరణం కడలి తరంగం

కాంతి కిరణం కడలి తరంగం

Written By news on Sunday, December 30, 2012 | 12/30/2012


రాష్ట్ర రాజకీయ చరిత్రలో అలుపెరగని పోరాట ధీరుడు, చరిత్రను తిరగరాసిన వ్యక్తి జగన్. ఎందుకంటే నేను ఈ రోజు ఇలా పత్రికాముఖంగా రాస్తున్నానంటే, అంతా వైఎస్సార్‌గారి చలవే! ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ ద్వారా నేను బతికినవాణ్ని. మూడేళ్ల క్రితం నాకు ‘హార్ట్ స్ట్రోక్’ రావడం, ఆసుపత్రిలో చేరడం, ఆరోగ్యశ్రీ ద్వారా అన్నీ చకచకా అమరడం జరిగిపోయాయి. ఆ సమయంలో ఆ వార్డులో అందరూ నాలాంటి వాళ్లే. అందరూ ఆయన గురించి మాట్లాడుతుంటే, నా కళ్లు చెమర్చాయి. నాలాంటి వాళ్లందరూ కలిసి ఆయనకు కన్నీళ్లతో పాదాభిషేకం చేసినా రుణం తీరదు. కాని విధి ఆడిన వింత నాటకంలో ఆయన మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. ఆ రోజు ఆయన పెట్టిన పథకాలన్నీ ఈరోజు తుంగలోనే తొక్కేస్తున్నారు నేటి రాజకీయ రాబందులు. అందుకే నేనున్నానంటూ ఓ కాంతి కిరణంలా, అల్లూరి సీతారామరాజులా, ఉవ్వెత్తున లేచిన కెరటంలా ప్రజలను ఓదార్చడానికి వస్తున్నానని జగన్ బయలుదేరితే, కొన్ని దుష్టశక్తులు దిగమింగుకోలేక, నానా రకాలుగా ఆయనను ఇబ్బందిపెట్టి, వేధింపులకు గురిచేసి ఆఖరికి జైలుకి పంపించారు.

కాని ఈ నాయకులు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. జగన్ సీఎం అయ్యే రోజు వస్తుంది. ఆ రోజుకోసం మాలాంటివాళ్ల వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాం. జగనన్నపై ప్రజల్లో ఉన్న ఆదరణకు ఈ రోజు షర్మిల పాదయాత్రకు లభిస్తున్న ఆదరణే సాక్ష్యం. ఆ తల్లి వేసిన ప్రతి అడుగూ నాయకుల గుండెల్లో దడ పుట్టించింది. అలాగే ఆమె వేయబోయే ఒక్కొక్క అడుగూ ప్రతి నాయకుడి గుండెనూ చీలుస్తుంది. ఇది నిజం. త్వరలోనే కాంగ్రెస్ నాయకులు పశ్చాత్తాప్పడే రోజు వస్తుంది. ఒక వ్యక్తిమీద ఇంత కక్ష్యా? ఇంత అమానుషమా? ఎందుకు? ఇంత కుళ్లు, కుతంత్రాలు ఎందుకు? ప్రతి పేదవాడి పక్షాన జగన్ నిలబడ్డాడు. సమయం వచ్చినప్పుడు అదే పేదవాడు ఆయనను అందలం ఎక్కిస్తాడు. ఆ పరిణామానికి ప్రతి రాజకీయనాయకుడు జగన్‌కు దాసోహం అనే రోజు ఎంతోదూరంలో లేదు.
- వాండ్రంగి ప్రసాద్, శ్రీకాకుళం

ప్రజాకోర్టులో జగన్ నిర్దోషి

గత ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కారణమైన ఏకైక వ్యక్తి వైఎస్సార్. దేశంలో ఏ ముఖ్యమంత్రీ అమలు చేయని సంక్షేమ పథకాలు ఆయన అమలు చేశారు. ఇతర ముఖ్యమంత్రులకు ప్రాయులయ్యారు. వై.ఎస్. హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచింది. దురదృష్టవశాత్తూ ఆయన మరణానంతరం రాష్ట్రం అన్నింట్లోనూ అథోగతి పాలై అథమ స్థానానికి దిగజారింది. ప్రజల కష్టసుఖాలు పట్టించుకునే నాథుడే కరువైనాడు. పాలక పక్షం, ప్రతిపక్షం రెండూ కలిసి జగన్‌ను జైలుకు పంపించేందుకు కుట్ర పన్నాయి తప్ప, ప్రజాసమస్యలపై దృష్టి పెట్టలేదు.

రాజ్యాంగపరంగా మనదేశంలో న్యాయవ్యవస్థకు అత్యున్నత స్థానం ఉంది. అటువంటి న్యాయ వ్యవస్థనే కాంగ్రెస్ నాయకులు తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేశారు. సీబీఐని అడ్డం పెట్టుకుని, ప్రభుత్వం జగన్‌ని దోషిగా నిరూపించాలని ఎంత ప్రయత్నించినా గడిచిన ఉప ఎన్నికల్లో వై.ఎస్.జగన్ నాయకత్వం వహించిన వైఎస్సార్ పార్టీకి ప్రజలు (ప్రజాకోర్టులో) అఖండ మెజార్టీనిచ్చి, జగన్ నిర్దోషి అని నిరూపించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మనదేశంలో ప్రజాతీర్పే శిరోధార్యం. ఎంతటివారైనా ప్రజాతీర్పుకు కట్టుబడాల్సిందే. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం విశ్వాసం ఉన్నా ప్రభుత్వం, ప్రతిపక్షం ఇకనైనా ప్రజాతీర్పుకు కట్టుబడి, వక్ర బుద్ధి మార్గాలు మాని, కళ్లు తెరవాలని కోరుతూ... త్వరలోనే రాజన్న రాజ్య స్థాపన కోసం జగనన్న నిర్దోషిగా బయటికి రావాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నాం.

- బలిరెడ్డి రామచంద్ర
బాట జంగాలపాలెం, సబ్బవరం, విశాఖపట్నం


చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: