సమస్యలపై కెసిఆర్ గొంతెత్తారా?: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమస్యలపై కెసిఆర్ గొంతెత్తారా?: షర్మిల

సమస్యలపై కెసిఆర్ గొంతెత్తారా?: షర్మిల

Written By news on Wednesday, December 5, 2012 | 12/05/2012

ఈ ప్రాంతం ప్రజల ఓట్లతో ఎంపీగా గెలిచిన టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్జర్ల నేతాజీ సెంటర్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. తాగునీరు కోసం కేసీఆర్ ఒక్కసారైనా గొంతెత్తి మాట్లాడారా? అని ప్రశ్నించారు. ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారే తప్ప ఇక్కడి ప్రజల గోడు పట్టించుకోవడంలేదన్నారు. ఆయన జీవితం సగం ఫామ్ హౌస్ కు, మిగిలిన సగం ఢిల్లీకే సరిపోతుందని ఎద్దేవా చేశారు.

కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి ప్రాజెక్ట్లులు వైఎస్ హయాంలోనే 80 శాతం పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన 20 శాతం పనులను పూర్తి చేయకుండా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. వైఎస్ బతికిఉంటే నాలుగవ లిప్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి అయ్యేదన్నారు. ఆయన రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేవారని చెప్పారు. మైనార్టీలు అంటే వైఎస్ కు ఎంతో అభిమానం అన్నారు. ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు అందించిన ఘనత వైఎస్ కే దక్కుతుందన్నారు. దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించాలని ఆయన జాతీయస్థాయిలో కృషి చేశారని చెప్పారు. నేడు అధికారంలో ఉన్న కిరణ్ ప్రభుత్వం వైఎస్ పథకాలకు తూట్లు పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నారు. పావలా వడ్డీ పేరుతో ప్రచారం చేసుకుంటున్న ఈ ప్రభుత్వం వారి నుంచి 2 రూపాయల వడ్డీ వసూలు చేస్తోందన్నారు. వైఎస్ హయాంలో 100 రూపాయల నుంచి 130 రూపాయలు వచ్చిన ఉపాధిహామీ కూలీ, నేడు 30 రూపాయలకే పరిమితమైందన్నారు. కూలీల శ్రమను కూడా దోపిడి చేస్తున్నారని బాధపడ్డారు. చంద్రబాబు హయాంలో 140 రూపాయల నుంచి 305 రూపాయల వరకు గ్యాస్ రేటు పెరిగిందని గుర్తు చేశారు. వైఎస్ హయాంలో ఒక్కరూపాయి కూడా గ్యాస్ రేటు పెరగలేదని చెప్పారు. కిరణ్ పాలనలో 420 రూపాయలకు సబ్సిడీ గ్యాస్,1000 రూపాయలకు సబ్సిడీ లేని గ్యాస్ కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వైఎస్ఆర్ విద్యార్థులను కన్నబిడ్డలుగా చూసుకున్నారని చెప్పారు. తండ్రి స్థానంలో నిలబడి తన బిడ్డలు ఉన్నత చదువులు చదవాలని ఆశించారని, ఆ ప్రకారమే పేద విద్యార్థుల చదువులకు ఫీజులు చెల్లించారని తెలిపారు.

గత మూడేళ్లుగా ప్రతిపక్ష బాధ్యతను టీడీపీ విస్మరించిందని విమర్శించారు. మంచివాడని పిల్లనిచ్చిన ఎన్టీఆర్ కే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. ప్రతిపక్ష బాధ్యతను చంద్రబాబు గాలికొదిలేశారన్నారు. ఈ అసమర్థ ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం పెట్టనే పెట్టరట అన్నారు. కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కయి ఒక పార్టీని మరో పార్టీ కాపాడుకుంటున్నాయని విమర్శించారు. అందుకే బాబుపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించటం లేదని చెప్పారు. ఐఎంజీ అనే బోగస్ కంపెనీకి 850 ఎకరాలు దోచిపెట్టినా పట్టించుకోరా? అని ప్రశ్నించారు. వ్యవసాయం దండగ అని, ప్రజలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదని గతంలో చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కాని చంద్రబాబు నేడు ఎడాపెడా పాదయాత్రలు చేస్తున్నారన్నారు. వైఎస్ హయాంలో చేసినవి తాను కూడా చేస్తానంటూ హామీలు గుప్పిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు పాదయాత్రలో పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారన్నారు. తన అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టకుండా ఉండేందుకు ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారన్నారు.

కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ప్రజాసమస్యలపై ఉద్యమిస్తున్న జగనన్నను కుట్రపూరితంగా జైలు పాలు చేశారని చెప్పారు. జగన్ బయట ఉంటే తమ దుకాణాలు మూసుకోవాల్సివస్తుందన్న భయంతోనే ఆ రెండు పార్టీలు సీబీఐను పావుగా చేసుకున్నాయన్నారు. జగన్ కు బెయిల్ రాకుండా కాంగ్రెస్ అడ్డుకుంటోందని చెప్పారు.
Share this article :

0 comments: