ధరలు పెరగని మహానేత పాలన: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ధరలు పెరగని మహానేత పాలన: షర్మిల

ధరలు పెరగని మహానేత పాలన: షర్మిల

Written By news on Monday, December 10, 2012 | 12/10/2012

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో ధరలు అసలు పెరగలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల గుర్తు చేశారు. మరోప్రజాప్రస్థానంలో భాగంగా పాలమూరు జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరులో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఆమె ఇక్కడకు వస్తున్న సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆమె ప్రసంగానికి విశేష స్పందన లభించింది. వైఎస్ హయాంలో పన్నులు పెంచలేదు, గ్యాస్ ధరలు గానీ, ఇతర ఛార్జీలుగానీ పెరగలేదని చెప్పారు. ఇంకా పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించారన్నారు. ఇప్పుడు అన్ని ధరలు పెరిగిపోయాయి ప్రజలు అల్లాడుతున్నారని చెప్పారు. వడ్డీలేని రుణాలు ఎవరికీ అందడంలేదని, అది ప్రకటనలకే పరిమితమన్నారు. సీఎం బంధువులు ఎవరికైనా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారేమో తనకు తెలియదన్నారు. 

విద్యుత్ బిల్లు చెల్లించలేదని రైతులను జైలులో పెట్టిన ఘనుడు చంద్రబాబు అన్నారు. రైతు వ్యతిరేకి చంద్రబాబు అని, ఆయన హయాంలో నాలుగువేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్ మద్యపాన నిషేధం అమలు చేస్తే, బాబు దానిని ఎత్తివేశారు. ఎన్టీఆర్ ఇచ్చిన రెండు రూపాయల బియ్యం ధరను బాబు పెంచారని గుర్తు చేశారు. 

రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన జగనన్నను కుట్ర చేసి జైలులో పెట్టించారన్నారు. జగనన్న త్వరలో బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ రాజన్న పాలన వస్తుందని చెప్పారు.
Share this article :

0 comments: