మాఫియాడాన్ చంద్రబాబు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మాఫియాడాన్ చంద్రబాబు

మాఫియాడాన్ చంద్రబాబు

Written By news on Wednesday, December 26, 2012 | 12/26/2012

అక్రమమార్గంలో వేల కోట్ల రూపాయలు దోచుకుని విదేశాల్లో అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మాఫియాడాన్ అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శిం చారు. వైఎస్‌ను మాఫియాతో పోల్చుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రసన్న తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే సెజ్‌ల పేరిట కొన్ని లక్షల ఎకరాలు ధారాదత్తం చేశారని ఆరోపించారు. తన అక్రమ సంపాదనతో ఆంధ్రప్రదేశ్ నుంచి దేశ నలుమూలలకు, మలేసియా, సింగపూర్ తదితర దేశాల్లో నారావారి అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన ఘనత బాబుదేనన్నారు. ఇంతటి ఘనత కలిగిన బాబుకి ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. బాబు సీఎంగా ఉన్నప్పుడే ఆయన కుమారుడు లోకేష్ ఇంటినుంచి రూ.500 నోట్ల కట్టల బస్తాను ఎత్తుకెళ్లిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. బాబు చదువుకునే రోజుల్లోనే యూనివర్సిటీలో ఒక రౌడీగా చెలామణి అయ్యారన్నారు. 
Share this article :

0 comments: