టీడీపీ 'ఫిక్సింగ్' బట్టబయలు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ 'ఫిక్సింగ్' బట్టబయలు!

టీడీపీ 'ఫిక్సింగ్' బట్టబయలు!

Written By news on Friday, December 7, 2012 | 12/07/2012

గత కొద్దికాలంగా రాష్ట్రంలో ప్రతిపక్ష, అధికార పక్షాలు కలిసి పనిచేస్తున్నాయనే ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా రాజ్యసభ వేదికగా నిలిచింది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కలిసి రాష్ట్రంలో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నారని అనేక సందర్భాల్లో రుజువయ్యాయి. తాజాగా రాజ్యసభ సాక్షిగా టిడిపి గుట్టు రట్టయింది. ఎఫ్‌డీఐ తీర్మానంపై జరిగిన కీలక ఓటింగ్‌లో ముగ్గురు దేశం ఎంపీలు డుమ్మా కొట్టారు. పరోక్షంగా కాంగ్రెస్‌కు కావాల్సిన సాయమందించారు. పైకి శత్రువులమని చెప్పుకుంటూ లోలోన చేతులు కలిపేశారని ఇప్పుడు తెలుగుదేశంపై ఇతర పార్టీలు విరుచుకుపడుతున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీయే తమ ప్రధాన ప్రత్యర్థి అంటూ, ఎఫ్ డీఐలకు తాము వ్యతిరేకమంటూ పాదయాత్రలో డైలాగులు చెప్పిన బాబు.. తన పార్టీని మాత్రం రాజ్యసభలో రాంగ్ రూటులో నడిపించారు. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి అయిదుగురు ఎంపీలున్నారు. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో ప్రభుత్వానికి ఓటమి తప్పకపోవచ్చని అందరూ భావించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బద్దశత్రువులు పార్లమెంట్ లో కలిసి పోయి యూపీఏకు దాసోహమన్నారు.

చివరిక్షణం వరకు ఉత్కంఠ రేపిన ఓటింగ్ లో ప్రతి ఎంపీ ఓటు అత్యంత కీలకంగా మారింది. రాజ్యసభలో ఏమి జరగబోతోందనని దేశమంతా ఉత్కంఠగా చూస్తున్న వేళ.. దేశంలోని రైతులు, చిన్నవ్యాపారులకు శాపంగా మారే ఎఫ్ డీ ఐల అడ్డుకునేందుకు ప్రయత్నించక పోగా.. బాధ్యతారహిత్యానికి ఒడిగట్టి తెలుగుదేశానికి చెందిన ముగ్గురు టిడిపి ఎంపీలు సభకు డుమ్మా కొట్టారు.

సభలో సమయానికి ఉండి ఓటు వేయాల్సిన గుండు సుధారాణి, సుజనా చౌదరీ, దేవేందర్‌ గౌడ్‌.. కనిపించకుండా పోవడం అందర్ని విస్మయానికి గురిచేసింది. వీరి ఆచూకి కోసం ప్రయత్నించిన వారికి కనీసం ఫోన్‌లోనూ అందుబాటులోకి రాలేదు. తీరా ఓటింగ్‌ జరిగి విషయం బయటపడడంతో స్కూల్‌ పిల్లలు చెప్పే విధంగా కారణాలు చెప్పి నమ్మించడానికి ప్రయత్నించారు. ముందుగానే అధినేత అనుమతి తీసుకున్నామని, ఓటు వేసినా, వేయకపోయినా ఒకటే కాబట్టి.. వ్యక్తిగత పనుల వల్ల దూరంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. తనకు డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ ఉందని, అందుకే సభకు రాలేదని దేవేందర్‌ గౌడ్‌ చెప్పగా, అసలు ఓటింగ్‌ జరిగే సమయమే ఐదింటికని అనుకున్నానని సుజనా చౌదని తెలిపారు. ఇక గుండు సుధారాణి సంగతి దేవుడెరుగు.

రీటైల్‌ రంగంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయంపై రాజ్యసభలో జరిగిన ఓటింగ్ ఓటింగ్ లో బీఎస్పీ, ఎస్పీ, టీడీపీలు పాల్గొనకపోవడంతో యూపీఏ ప్రభుత్వం గట్టెక్కింది. దేవేందర్ గౌడ్, సుజానా చౌదరీ, గుండు సుధారాణిలు గైర్హాజరయ్యారు. రాజ్యసభలో జరిగిన ఓటింగ్ లో 123 ఓట్లు ప్రభుత్వానికి అనుకూలంగా, 109 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. ఓటింగ్‌ సమయంలో సభలో 232 మంది సభ్యులున్నారు. మ్యాజిక్‌ నెంబర్‌ 117కన్నా ప్రభుత్వానికి ఆరు ఓట్లు ఎక్కువ వచ్చాయి.

రైతుల ప్రయోజనాల్ని దెబ్బ తీసే ఎఫ్ డీ ఐలకు వ్యతిరేకమంటూ ఇన్నాళ్లు చెప్పుకొచ్చిన టిడిపి.. రాజ్యసభలో తాజా చర్యతో విలన్‌గా మారింది. కాంగ్రెస్ పవర్ మేనేజ్ మెంట్ కు ముగ్గురు టిడిపి ఎంపీలు తలవంచి దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. 


http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=53866&Categoryid=28&subcatid=0
Share this article :

0 comments: