కోటి ఆశల భారం...ఆ భుజాలపైనే... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోటి ఆశల భారం...ఆ భుజాలపైనే...

కోటి ఆశల భారం...ఆ భుజాలపైనే...

Written By news on Saturday, December 29, 2012 | 12/29/2012


వందమంది దోషులు తప్పించుకున్నా ఫరవాలేదు కానీ ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదన్న చర్వితచర్వణమైన ప్రజా స్వామ్యపు చిలకపలుకులు చిన్నప్పటినుంచీ వినీవినీ మా చెవులు తుప్పు పట్టిపోయాయి. మనదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమని నమ్మిన మా మనసుల్లో ... ఇప్పుడు అది అవాస్తవమేమోనన్న అనుమానపు బీజాలు మొలకెత్తుతున్నాయి.

భూమాత సహనాన్ని పుణికిపుచ్చుకుని ఓర్పుతో జైలు గోడల మధ్య నలిగిపోతున్నా... కోట్లాదిమంది ఆశల్ని అచంచలమైన దీక్షతో భుజాన మోస్తున్న ఆ మనిషిని చూసిన తర్వాత కూడా ఇది ప్రజాస్వామ్యమేనని ఎలానమ్మాలి? అసత్యాల, అవాస్తవాల కలబోతను న్యాయస్థానమనే తెరమీద ప్రదర్శిస్తూ... ఆ నాటకాన్ని రక్తికట్టించడానికి నిస్సిగ్గుగా రోజుకొక పాత్రను తెరమీదకు తెస్తున్న హస్తిన కుతంత్రాన్ని అసహ్యించుకోవాల్సి వస్తోంది. వాస్తవాలను విస్మరించి, అబద్ధాన్ని విశ్వవ్యాప్తం చేసే కుట్రలో ప్రజాస్వామ్యపు మూలస్తంభాలు సైతం పాత్రధారులు కావడం ఏ ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా భావించాలి?

ఆయన మీకు రాజకీయ శత్రువే కావచ్చునేమో కానీ, తండ్రి వాత్సల్యం కోసం తపిస్తున్న ఇద్దరు బిడ్డల తండ్రి కూడా. భర్తను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తల్లికి సాంత్వన కలిగించాల్సిన పుత్రుడు కూడా. తను కన్నీరు కారిస్తే... భర్తనే నమ్ముకున్న ప్రజలు ఎక్కడ నిరాశానిస్పృహలకు లోనవుతారోనని గుండెలోతుల్లోంచి తన్నుకొస్తున్న బాధని పంటి బిగువున అదిమిపెట్టిన ఒక మహిళకు జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త కూడా. కోట్లాదిమంది అనుభవిస్తున్న కష్టాలను ఆకళింపు చేసుకున్న జ్ఞాని కూడా...

ఇప్పటికైనా ప్రజల ఆవేశాన్ని ప్రామాణికంగా తీసుకోండి. పదే పదే అదే అబద్ధాన్ని ప్రజల హృదయాలలోకి బలవంతంగా చొప్పించడం ద్వారా జనం హృదయాల్లో ఇప్పటికే గాఢంగా ముద్రితమైపోయిన ఆ వాస్తవాన్ని బయటకు పంపించలేరన్న వాస్తవాన్ని గుర్తించండి. ఇప్పుడో అప్పుడో ఆ తండ్రి వస్తాడని, మోకాళ్ల మీద కూర్చుని... తమ చెక్కిలి మీద వెచ్చటి కన్నీటిని తుడుస్తాడని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ఆ చిన్నారుల క్షోభ మీకు శాపంగా పరిణమించకముందే మేల్కొనండి. అన్న ఆశయాన్ని ప్రజల్లో సజీవంగా ఉంచేందుకు తపనపడుతున్న ఆ సోదరి ఆవేశం మీ అహంకారపు పునాదుల్ని పెకలించకముందే జాగ్రత్తపడండి.

ప్రజల అవసరాలను, ఆశలను, ఆచరణలోకి మళ్లించిన ఆ ‘పెద్దాయన’ గుర్తుల్ని బలవంతంగా చెరిపివేసే రాక్షసక్రీడను ఇప్పటికైనా ఆపండి. ప్రజల కన్నీటి ఉప్పెనలో మీ అత్యాశాసౌధం పేకమేడలా కూలకముందే వాస్తవాన్ని గ్రహించండి. జైలుగోడల మధ్య ఉంచి మంచితనపు స్వరూపాన్ని ప్రజలకు దూరం చేశామన్న మీ పైశాచికపు కుడ్యానికి ప్రజాభిమానపు గవాక్షం ఒకటి ఎక్కడో తెరిచే ఉందన్న వాస్తవం గ్రహించే ప్రయత్నం చేయండి.

- వాసవీ మోహన్,
సూరారం, హైదరాబాద్


భయం లేదు జగనన్నా!

అన్నా జగనన్నా,
భయం లేదురన్నా
జగమంతా నీవైపే
జనమంతా నీవైపే

సీబీఐ చేస్తున్నది
చిన్న పెద్దకు తెలుసు
జైలులోన నిన్ను పెట్టి
జాగీరులు పొందుతోంది
జనులు ఎరుగరనుకుంది

బెయిలివ్వక చేస్తుంది
బెబ్బులివని బెదురుతోంది
భయం లేదు జగనన్నా
భువి అంతా నీవైపే

రెండు వేల పద్నాలుగు
రానున్నది త్వరగన్నా
ముఖ్యమంత్రి నీవన్నా
మురిపం ప్రజ తీర్పన్నా
ఇది దేవుని ఆదేశం
జనసంద్రం సందేశం

- కోట చినసత్యనారాయణ
తెర్లాం మండలం, విజయనగరం
Share this article :

0 comments: