లాఠీచార్జీ అమానుషం: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లాఠీచార్జీ అమానుషం: విజయమ్మ

లాఠీచార్జీ అమానుషం: విజయమ్మ

Written By news on Sunday, December 23, 2012 | 12/23/2012

దేశ రాజధానిలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపేందుకు వెళ్లిన విద్యార్థులపై ఢిల్లీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మహిళలు అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మాగాంధీ అన్నారు. నేటికి కూడా దేశ రాజధానిలోనే పట్టపగలు మహిళలు ఒంటరిగా సంచరించే పరిస్థితి లేదు. ఢిల్లీ నడివీధుల్లో ఓ వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందంటే, పరిస్థితులు ఎంతగా దిగజారాయో అర్థమవుతోంది’ అని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు కారణమైన మూలాలపై అధ్యయనం చేయకుండా, నిరసనకారులపై లాఠీలు ప్రయోగించడం అమానుషమన్నారు.
Share this article :

0 comments: