వైఎస్సార్సీపీ అభిప్రాయాన్ని హర్షిస్తున్నాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » వైఎస్సార్సీపీ అభిప్రాయాన్ని హర్షిస్తున్నాం

వైఎస్సార్సీపీ అభిప్రాయాన్ని హర్షిస్తున్నాం

Written By news on Sunday, December 30, 2012 | 12/30/2012

 తెలంగాణపై కేంద్ర హోంశాఖ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్సీపీ వెల్లడించిన అభిప్రాయాన్ని తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు ప్రత్యేక ఆంధ్రసాధన సమితి పేర్కొంది. ఈ మేరకు ఆ సంస్థ కన్వీనర్ చేగొండి హరరామజోగయ్య శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్ని సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఎవరికీ అన్యాయం జరుగకుండా త్వరగా ఈ సమస్యకు ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని చెప్పడాన్ని తాము హర్షిస్తున్నామన్నారు. ఇరు ప్రాంతాల ప్రజల సమస్యలనే వైఎస్సార్సీపీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లుగా తాము భావిస్తున్నామని, సమస్యను జటిలం చేయకుండా వెంటనే ఓ పరిష్కారం కావాలనే వారి సంకల్పానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. 
Share this article :

0 comments: