జగనన్న ఏ తప్పూ చేయలేదు: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగనన్న ఏ తప్పూ చేయలేదు: షర్మిల

జగనన్న ఏ తప్పూ చేయలేదు: షర్మిల

Written By news on Tuesday, December 11, 2012 | 12/11/2012

జగనన్న ఏ తప్పూ చేయలేదని, త్వరలోనే బయటకు వస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చెప్పారు. రంగారెడ్డి జిల్లా మన్ సాన్ పల్లెలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగనన్నపై అక్రమ కేసులు బనాయించారన్నారు. కాంగ్రెస్, చంద్రబాబు ఒకరినొకరు కాపాడుకుంటున్నట్లు తెలిపారు. ఎఫ్ డిఐలకు టీడీపీ మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ తో బాబు కుమ్మక్కయ్యారని తేలిపోయిందన్నారు. ఎఫ్ డిఐల అంశంలో తనకు తెలియకుండా తప్పు జరిగిందని బాబు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీలో చంద్రబాబు హిట్లర్ లాంటి వారని, ఆయనకు తెలియకుండా ఏదీ జరగదని చెప్పారు. అవిశ్వాసం పెట్టమని ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు స్పందించడంలేదన్నారు. తన సొంత డెయిరీ హెరిటేజ్ కోసం ఏపీ డెయిరీని దివాలా తీయించారని చెప్పారు. హెరిటేజ్ లో విదేశీ పెట్టుబడుల కోసం తన ఎంపీలతో పరోక్షంగా బాబు మద్దతిచ్చారన్నారు. 

రంగారెడ్డి జిల్లాను వైఎస్ఆర్ తన సొంత జిల్లా అనుకున్నారని చెప్పారు. ప్రజాప్రస్థానం యాత్రను రంగారెడ్డి నుంచే వైఎస్ఆర్ ప్రారంభించారు. వైఎస్ తన హయాంలో రంగారెడ్డి జిల్లాను ఎంతో అభివృద్ధి చేశారు. ముఖ్యమంత్రి అయిన తరువాత కిలో 2 రూపాయల బియ్యం, ఫీజు రీయింబర్స్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఈ జిల్లా నుంచే ప్రారంభించారు. ప్రాణహిత - చేవెళ్ల జాతీయ హోదా కోసం వైఎస్ ఎంతో కృషి చేశారు. వైఎస్ మరణంతో ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయి. ప్రాణహిత - చేవెళ్లను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. రంగారెడ్డి జిల్లా ప్రజలు సాగునీరు, తాగునీటి కోసం అల్లాడుతున్నారు. ప్రజలకు నీరివ్వలేని ప్రభుత్వం బతికున్నట్లా? చచ్చినట్లా? అని షర్మిల ప్రశ్నించారు.

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడిందన్నారు. పరిశ్రమలు మూతబడి ప్రజలు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదన్నారు. పాదయాత్రలో బాబు అబద్ధాలు చెబుతూ ఉత్తుత్తి వాగ్దానాలు చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలను అప్పుడెందుకు బాబు అమలు చేయలేదు? అని ప్రశ్నించారు. ఇప్పుడు తన పాదయాత్రలో వైఎస్ పథకాలనే బాబు అమలు చేస్తానని చెబుతున్నారన్నారు.
Share this article :

0 comments: