ఈ కష్టాలు కొన్నాళ్లే ఓపిక పట్టండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ కష్టాలు కొన్నాళ్లే ఓపిక పట్టండి

ఈ కష్టాలు కొన్నాళ్లే ఓపిక పట్టండి

Written By news on Thursday, December 13, 2012 | 12/13/2012

త్వరలోనే రాజన్న రాజ్యం
నాన్న ప్రతి మాటను జగనన్న సాకారం చేస్తారు
కరెంటు బిల్లులు వేలల్లో వస్తున్నాయ్
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు
‘మరో ప్రజాప్రస్థానం’లో షర్మిల

రంగారె డ్డి జిల్లా, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘త్వరలోనే జగనన్న వస్తాడు... మనందరినీ రాజన్న రాజ్యం వైపు తీసుకెళతాడు... ఈ కష్టాలు, కన్నీళ్లు మరో ఆర్నెల్లో.. సంవత్సరమో.. ఓపిక పట్టండి. మన బతుకులు బాగుపడతాయి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రె డ్డి సోదరి షర్మిల అన్నారు.‘మరో ప్రజా ప్రస్థానం’లో భాగంగా బుధవారం మహేశ్వరం మండలం మన్సాన్‌పల్లి నుంచి తుక్కుగూడ వరకు పాదయాత్ర సాగింది. ఇందులో భాగంగా మహేశ్వరం, సిరిగిరిపురం గ్రామంలో జరిగిన ‘రచ్చబండ’లో స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్న షర్మిల చలించిపోయారు. వైఎస్సార్ మరణం తర్వాత ప్రజలకు కష్టాలొచ్చిపడ్డాయని, వీటన్నింటికీ కాంగ్రెస్ సర్కారే కారణమని ధ్వజమెత్తారు. నాన్నకు ఒక కల ఉండేది. రచ్చబండలో ఇల్లులేదని పేదలెవరూ చేయి ఎత్తకూడదని, ప్రతి ఒక్కరికీపక్కా ఇల్లు ఉండాలని, గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చాలని, అందుకే కేంద్ర సర్కారు 47 లక్షల ఇళ్లు కట్టిస్తే... మన రాష్ర్టంలో 47 లక్షల ఇళ్లు క ట్టించారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రానికి రూ.6 వేల లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తామన్నారు...కానీ ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రానికి పరిశ్రమలు రావడలేదు. కరెంట్ సంక్షోభంతో ఉన్నవి మూతపడుతున్నాయి. 

ఉద్యోగాలు ఊడిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెండు, మూడు గంటలు కూడా కరెంట్ సరఫరా చేయకుండా.. వేలల్లో బిల్లులు వేస్తున్నారని, ఈ ప్రభుత్వానికి మనస్సులేదు.. మానవత్వం లేదంటూ షర్మిల తూర్పారపట్టారు. ఒకవైపు కరువు.. మరోవైపు కరెంట్ కోతలతో రైతాంగం అల్లాడుతుంటే.. ఉపాధి హామీ పనులు కూడా నిలిపివేయడం అన్యాయమన్నారు. ‘రేషన్ షాపుల్లో 20 కిలోల బియ్యం ఇస్తుంటే నగదు బదిలీ కింద రూ.20 ఇవ్వాలని ఈ ప్రభుత్వం చూస్తోంది. ఈ అన్యాయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు.జగనన్న చేతులు కట్టుకొని కూర్చోరు. మీ తరఫున పోరాడేందుకు సిద్ధంగా ఉంటారు’ అని షర్మిల భరోసా ఇచ్చారు. రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడు తండాలను పంచాయతీలుగా మార్చాలని భావించారని, ఆయున మరణంతో గిరిజనుల బతుకులు దుర్భరంగా తయారయ్యాయని ఆమె అన్నారు.

పావలావడ్డీ రుణాలను సర్కారు ఇవ్వడంలేదని, ఇచ్చిన వారి నుంచి రూ.2 మేర వడ్డీని వసూలు చేస్తోందన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వడ్డీలేకుండా రుణాలు ఇస్తామని, వృద్ధులు, వితంతువులకు రూ.700 పెన్షన్ అందజేస్తామని హామీ ఇచ్చారు. నాన్న ఇచ్చిన ప్రతిమాటను జగనన్న చేసి చూపిస్తారు.. అప్పటివరకు ఓపికపట్టండి అని అన్నారు. 

ఎన్నికలంటే సర్కారుకు భయం
ఈ ప్రభుత్వానికి ఎన్నికలంటే భయం.. ఎన్నికలు పెడితే వైఎస్సార్ సీపీ గెలుస్తుందని భయం. అందుకే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడంలేదని షర్మిల పేర్కొన్నారు. పల్లెల్లో సమస్యలు కొలువుదీరినా.. అధికారులు రాకున్నా ఈ సిగ్గుమాలిన ప్రభుత్వానికి పట్టదని ఆమె అన్నారు. మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్‌దేనని, మైనార్టీల్లో వెలుగురేఖలు నింపేందుకు ఆయన ఆహార్నిషలు కృషి చేశారని పేర్కొన్నారు. పాదయాత్రలో షర్మిలతోపాటు పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, శివకుమార్, రాజ్‌ఠాకూర్, జనార్దన్‌రెడ్డి, వెంకట ప్రసాద్, కొండా రాఘవరెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, సిద్ధేశ్వర్, అమృతాసాగర్, తదితరులు పాల్గొన్నారు. 

పార్టీలో చేరిన సామల రంగారెడ్డి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సరూర్‌నగర్ మాజీ ఎంపీపీ సామల రంగారెడ్డి బుధవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వందలాది అనుచరగణంతో మన్సాన్‌పల్లిలో షర్మిలను కలిసిన అనంతరం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
Share this article :

0 comments: