సిరిగిరిపూర్‌ లో షర్మిల రచ్చబండ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సిరిగిరిపూర్‌ లో షర్మిల రచ్చబండ

సిరిగిరిపూర్‌ లో షర్మిల రచ్చబండ

Written By news on Wednesday, December 12, 2012 | 12/12/2012

సిరిగిరిపూర్‌లో ఈరోజు జరిగిన రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్తులు తమ సమస్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిలకు చెప్పుకున్నారు. తాగునీటి సమస్యతో అల్లాడుతున్నమని చెప్పారు. సరైన మురుగుకాలువ వ్యవస్థలేక అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయని తెలిపారు. విద్యుత్ కోతలతో పరిశ్రమలు మూతబడుతున్నాయని వాపోయారు. బస్సు సౌకర్యం లేక పిల్లలు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారని చెప్పారు. విద్యుత్ బిల్లుల కింద నెలకు 2 వేల రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇంటి అద్దెలు కట్టాలా? విద్యుత్ బిల్లులు కట్టాలా? అర్ధంకావడంలేదన్నారు. నగదు బదిలీ పథకం పేరుతో రేషన్ షాపుల్లో బియ్యం, సరుకులు ఆపేస్తామంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్ రాకపోతే తాము ఎలా బతకాలని వారు ప్రశ్నించారు. పావలా వడ్డీ అని చెబుతూ 2 రూపాయల వడ్డీ వసూలు చేస్తున్నారని చెప్పారు. తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు.

షర్మిల మాట్లాడుతూ ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్తా, ఆయనను చొక్కా పట్టుకుని అడగండని అన్నారు. ఈ సర్కార్ రాబందుల సర్కార్ అన్నారు. రోజుకు 3-4 గంటలు విద్యుత్ సరఫరా చేస్తూ సర్‌ఛార్జీల పేరుతో బిల్లులు అమాంతం పెంచేశారన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్‌ఆర్ హయాంలో విద్యుత్, ఆర్టీసీ, గ్యాస్ ధరలు పెంచలేదని చెప్పారు. పన్నులు వేయకుండా సంక్షేమపథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ప్రతిఒక్కరికి పక్కా ఇళ్లు నిర్మిస్తారని హామీ ఇచ్చారు.
Share this article :

0 comments: