శంకరరావు లేఖలు - నాడు,నేడు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » శంకరరావు లేఖలు - నాడు,నేడు!

శంకరరావు లేఖలు - నాడు,నేడు!

Written By news on Monday, December 24, 2012 | 12/24/2012

ఒకప్పుడు మాజీ మంత్రి శంకరరావు  ఉత్తరం రాస్తే హైకోర్టే స్పందించింది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై విచారణ చేయాలని ఆయన లేఖ రాస్తే అప్పట్లో హైకోర్టు వెంటనే స్పందించింది. చకచకా విచారణ జరిపి సిబిఐ దర్యాప్తు జరపాలని ఆధేశాలు ఇచ్చింది. ఎమ్.ఆర్.కేసులో శంకరరావు కోరితే అదే హైకోర్టు విచారణకు ఆదేశించింది.మరి ఇప్పుడు ఏమైందో కాని ఆయన కు పరిస్థితి ఎదురు తిరిగింది.ఆయన మంత్రి పదవి పోయింది. ఇప్పుడు ఆయన లేఖలను కూడా హైకోర్టు పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించి ఆరోపణలు చేస్తే అదే హైకోర్టు శంకరరావును మందలించింది.ఈ పిటిషన్ ను వెనక్కి తీసుకోకపోతే జరిమానా విధిస్తామని హైకోర్టు హెచ్చరించింది.శంకరరావు కొన్ని లేఖలు రాసిన ఫలితంగా మంత్రి పదవిలో ఉన్నవారు. ఎమ్.పి గా ఉన్నవారు, ఐఎఎస్ అధికారులు జైలుకు వెళ్లవలసి వచ్చింది. ఇప్పుడేమో శంకరరావు జరిమానాకు గురి అయ్యే పరిస్థితి వచ్చింది. 

http://kommineni.info/articles/dailyarticles/content_20121224_14.php
Share this article :

0 comments: