అన్యాయంగా జగన్ ను జైల్లో పెట్టారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అన్యాయంగా జగన్ ను జైల్లో పెట్టారు

అన్యాయంగా జగన్ ను జైల్లో పెట్టారు

Written By news on Wednesday, December 19, 2012 | 12/19/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఎస్ సిలు, ఎస్ టిలు, బిసిలు కోసం పోరాడి జైలులోకి వెళ్లలేదన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఖండించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. సిఎం వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ పార్టీని కాదని బయటకు వచ్చినందున జగన్ జైలుకు వెళ్లారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ఓడిస్తున్నందున జైలుకు వెళ్లారు అని చెప్పారు. జగన్ ను అన్యాయంగా జైలులో పెట్టారన్నారు. కాకమ్మ కథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టవద్దని ఆయన ముఖ్యమంత్రి సలహా ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి 24 శాసనసభా స్థానాలు మాత్రమే గెలిచిన రికార్డు ఉందని, 2014 ఎన్నికలలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 16 సీట్లు మాత్రమే గెలుచుకొని ఆ రికార్డును బ్దదలుకొడతారని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మబాటలో సీఎం పాత చింతకాయపచ్చడి కబుర్లు చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, ఉద్యోగుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆవేదన వ్వక్తం చేశారు. నక్కజిత్తులు ఉపయోగించి జగన్ ను అణచాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

టిడిపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి రాజీనామాను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తిరస్కరిస్తారన్న విషయం అందరికీ తెలిసిందేన్నారు. టిడిపి ఎంపిలు అందరూ చంద్రబాబుకు తెలిసే రాజ్యసభలో జరిగిన చిల్లర వ్యాపారాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ డిఐ) బిల్లు ఓటింగ్ కు గౌర్హాజరయ్యారని చెప్పారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ తీవ్రమైన నష్టాల్లో ఉందని, దానిని లాభాల్లోకి తీసుకురావడానికి విదేశీ పెట్టుబడులు అవసరం ఉందన్నారు. అందువల్లే ఆ బిల్లు విషయంలో వారు ప్రభుత్వానికి సహకరించాని చెప్పారు. హెరిటేజ్ లో విదేశీ పెట్టుబడులు పెట్టం అని చంద్రబాబు చెప్పాలన్నదానికి ఇంతవరకు స్పందనలేదన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ తో కుమ్మక్కయినట్లు అనేక సందర్భాలలో వక్తమయిందన్నారు. 

రెచ్చగొట్టే యత్నాలను టీఆర్ఎస్ నేతలు మానుకోవాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ హింసావాదాన్ని ప్రోత్సహించదని చెప్పారు. 

మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో కాలికి గాయమై ఆపరేషన్ చేయించుకున్న షర్మిలకు మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు తెలిపారు. ఆ తరువాత ఎక్కడైతే పాదయాత్ర ఆగిందో అక్కడ నుంచి మళ్లీ పాదయాత్ర కొనసాగిస్తారని చెప్పారు.

sakshi
Share this article :

0 comments: