01 January 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

సమస్యలను గాలికివదిలేసిన కాంగ్రెస్, టిడిపి:జగన్

Written By ysrcongress on Saturday, January 7, 2012 | 1/07/2012

రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను గాలికి వదిలివేశాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మోసాపురం గ్రామంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. న్యాయం, ధర్మం, విలువలు, విశ్వసనీయతలేని కాంగ్రెస్, టిడిపిలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ఫీజుల కోసం ధర్నాలు చేయవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆ మహానేత బతికి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. రాష్ట్రంలో చనిపోయిన వైఎస్ కు ఒక న్యాయం, బతికి ఉన్న చంద్రబాబుకు ఒక ధర్మం అన్నారు.
 మోసాపురం బిసి కాలనీలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.


హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి కేసు విషయంలో సిబిఐ ఒంటెద్దు పోకడపోతోందని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు విమర్శించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కేసులో ఒక లాగా, జగన్ కేసులో మరోలా వ్యవహరిస్తోందన్నారు. 'జగన్ విషయంలో మొత్తం మూలాలలోకి వెళ్లాలి. చంద్రబాబు నాయుడు విషయంలో అక్కడే ఉండాలి' అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పైనుంచి ఆడిస్తున్న నాటకమా? లేక కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి చేస్తున్న కుతంత్రమా? అని ఆయన ప్రశ్నించారు. సిబిఐ అంటే బాబు, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాగా ఉందని అన్నారు. సిబిఐ తీరు మారకపోతే దేశవ్యాప్తంగా సిబిఐ కార్యాలయాల ముందు నిరసనలు తెలియజేస్తామని ఆయన హెచ్చరించారు.

‘తోట’కు తుది వీడ్కోలు

కాకినాడ, న్యూస్‌లైన్ ప్రతినిధి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తోట గోపాలకృష్ణ మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తన తండ్రి వైఎస్‌తో కలిసి ఉన్నప్పుడు తనను ఎంతో ఆప్యాయతతో పలకరించే నేత లేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. గోపాలకృష్ణ హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందిన సంగతి తెలిసిందే. 

ఆయన అంత్యక్రియలు స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో శుక్రవారం జరిగాయి. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డికి ఈ విషయం తెలిసి శుక్రవారం మధ్యాహ్నం కిర్లంపూడి వచ్చారు. గోపాలకృష్ణ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. జగన్‌ను చూడగానే గోపాలకృష్ణ కుమారుడు సుబ్బారావునాయుడు కన్నీరు పెట్టుకున్నారు. జగన్ ఆయన భుజం తట్టి ఓదార్చారు. 

అనంతరం జగన్.. గోపాలకృష్ణ భార్య అచ్యుతామణి, తల్లి వీరరాఘవమ్మ, కుమార్తె మంగాదేవిలను పరామర్శించారు. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్వించే అన్న గోపాలకృష్ణకు ఇలా జరుగుతుందని ఊహించలేకపోయానని జగన్ విచారం వ్యక్తం చేశారు. పెద్దాయన మరణం తనను కలచివేస్తోందని, మీ కుటుంబానికి పెద్ద బిడ్డగా ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటానని అచ్యుతామణికి ధైర్యం చెప్పారు. గోపాలకృష్ణ ఆస్పత్రికి వెళ్లే ముందు కూడా తనను కలిసి ప్రజాబలం మనవైపే ఉందని ధైర్యం చెప్పిన విషయాన్ని జగన్ గుర్తుతెచ్చుకున్నారు. అనంతరం సామర్లకోట, రాజమండ్రి మీదుగా గుంటూరు వెళ్లారు.


‘తోట’కు తుది వీడ్కోలు 
గోపాలకృష్ణ భౌతిక కాయాన్ని కడసారి చూసి నివాళులర్పించేందుకు జిల్లా నలుమూలల నుంచి నేతలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కిర్లంపూడి వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. మంత్రి తోట నరసింహం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా పరిశీలకుడు తోట నవీన్ గోపాలకృష్ణ భౌతికకాయం ఉన్న పాడెను మోశారు. మధ్యాహ్నం స్థానిక కుమ్మరివీధిలో ఉన్న శ్మశానవాటికలో సుబ్బారావునాయుడు.. తన తండ్రి చితికి నిప్పంటించారు. గోపాలకృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, జీవీ హర్షకుమార్, ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబూరావు, వంగా గీత, పంతం గాంధీమోహన్, రౌతు సూర్యప్రకాశరావు తదితరులున్నారు.

సీఎం, బొత్స సంతాపం..
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తోట కుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శించారు. హైదరాబాద్ నుంచి ఫోన్‌లో గోపాలకృష్ణ కుమారుడు సుబ్బారావునాయుడిని పరామర్శించి కుటుంబానికి సంతాపం తెలిపారు.

పులివెందుల సీఐ అరెస్టుకు ఆదేశం

ఇద్దరు ఎస్‌ఐలు, పోలీసులకు నాన్‌బెయిలబుల్ వారంట్
27లోపు అరెస్టుకు డీఎస్పీకి ఆదేశం

కడప (వైఎస్సార్ జిల్లా),న్యూస్‌లైన్: అధికార దుర్వినియోగానికి పాల్పడి, అమాయకులపై దాడి చేసిన పులివెందుల సీఐ శంకరయ్యతో పాటు ఎస్‌ఐలు యుగంధర్, గౌస్‌పీర్‌లు సహా మరికొందరి అరెస్టుకు పులివెందుల జూనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు నాయక్ శుక్రవారం ఆదేశించారు. సీఐ శంకరయ్యతో పాటు ఆయనకు సహకరించినవారిపై నాన్‌బెయిలబుల్ వారంటు జారీ చేశారు. ఈనెల 27వ తేదీలోపు వారిని అరెస్టు చేయాలని డీఎస్పీ జయచంద్రుడిని ఆదేశించారు. ఈ ఆదేశాలకు దారితీసిన రెండు ఘటనల పూర్వాపరాలు ఇలా ఉన్నాయి... పులివెందుల పట్టణానికి చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముల్లా రహంతుల్లాను అక్టోబర్ 8న పులివెందుల పోలీసులు విచక్షణారహితంగా కొట్టారు. 

దీనిపై స్పందించిన కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల స్టేషన్ వెలుపల శాంతియుతంగా ధర్నాకు ఉపక్రమించారు. దీంతో జగన్‌తో పాటు 355 మందిపై అక్టోబర్ 9న నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు. దీనిపై నవంబర్ 4న రహంతుల్లా పులివెందుల మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. రహంతుల్లాతో పాటు జగన్‌మోహన్‌రెడ్డి, మరో 355 మందిపై పెట్టిన కేసు అక్రమ కేసుగా ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని విచారణ సందర్భంగా కోర్టు అంచనాకు వచ్చింది. దీంతో 171, 148, 341, 323, 324, 355, 187, ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ సెక్షన్ల కింద సీఐ శంకరయ్యతో పాటు ఎస్‌ఐ గౌస్‌పీర్, ఏఎస్‌ఐ అన్నయ్య, మరో ఐదు మంది పోలీసులకు నాన్ బెయిలబుల్ వారంటు జారీ చేసింది. 

ఇప్పట్లలో గ్రామస్తులపై దాడి

వైఎస్సార్ జిల్లా లింగాల మండలం ఇప్పట్ల గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డిపై ఓ కేసు నమోదు కాగా, పోలీసుస్టేషన్‌లో కాకుండా నేరుగా కోర్టులో లొంగిపోయారు. ఈ ఘటనతో ఆగ్రహించిన సీఐ శంకరయ్య, అప్పటి లింగాల ఎస్‌ఐ యుగంధర్ మూడు జీపుల్లో పోలీసులను తీసుకుని 2011 జూన్ 28 రాత్రి లింగాలకు వెళ్లారు. సుధాకర్‌రెడ్డి అన్న కుమారుడు శశిభూషణ్‌రెడ్డిని చితకబాదారు. అతడిని జీపులో వేసుకుని స్టేషన్‌కు వెళుతుండగా అడ్డగించిన గ్రామస్తులను కూడా విచక్షణారహితంగా కొట్టారు. సుధాకర్‌రెడ్డి భార్య గాయత్రితో పాటు మరికొందరు మహిళలను స్టేషన్‌కు తీసుకువెళ్లి నిర్బంధించారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ గాయత్రి 30న పులివెందుల కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. కేసు విచారించిన జూనియర్ సివిల్ జడ్జి శుక్రవారం సీఐ శంకరయ్య, ఎస్‌ఐ యుగంధర్, వారికి సహకరించిన నారాయణస్వామి, రామయ్యలపై 342, 323, 354, 355, 109, 506 ఐపీసీ సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్ అరెస్టు వారంటును జారీ చేస్తూ తీర్పునిచ్చారు. ఈ నేపథ్యంలో శంకరయ్యను బదిలీ చేయాలని గాయత్రి డిమాండ్ చేశారు.

ఇండియా సిమెంట్‌కు 1996లోనే 0.013 టీఎంసీ కేటాయించిన టీడీపీ ప్రభుత్వం

జగన్ కేసులో ఆద్యంతం వివక్షపూరితంగా సీబీఐ వైఖరి!
‘నిర్ధారిత ఎజెండా’ మేరకే ఏకపక్షంగా సాగుతున్న విచారణ
ఇండియా సిమెంట్‌కు వైఎస్ హయాంలో నీటి కేటాయింపులపై వైఖరే నిదర్శనం
ప్రతిగా జగన్ కంపెనీల్లో ఆ సంస్థ రూ.140 కోట్లు పెట్టిందంటూ అసంబద్ధ వాదనలు
ఇండియా సిమెంట్‌కు 1996లోనే 0.013 టీఎంసీ కేటాయించిన టీడీపీ ప్రభుత్వం
ఆ మేరకు జీవో 244 జారీ.. ఈ వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగానే ‘విస్మరించిన’ సీబీఐ
2009 నాటి ఉత్తర్వుల్లో స్పష్టంగా ‘244 జీవో’ ప్రస్తావన.. అయినా పట్టించుకోని సంస్థ
ఎలాగైనా వైఎస్‌ను, ఆయన తనయుడు జగన్‌ను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యం
అందుకోసం ప్రభుత్వ విధానాలకూ యథేచ్ఛగా దురుద్దేశాలు ఆపాదిస్తున్న సీబీఐ

ఇండియా సిమెంట్ (అప్పట్లో విశాఖ ఇండస్ట్రీస్) కంపెనీకి 1996లో చంద్రబాబు ప్రభుత్వం 0.013 టీఎంసీ నీటిని కేటాయించింది. ఆ మేరకు జీవో ఎంఎస్ నంబర్ 244ను జారీ చేసింది.2009లో... ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం పెరిగినందున నీటి కేటాయింపు పెంచాలన్న ఇండియా సిమెంట్ అభ్యర్థన మేరకు మరో 0.013 టీఎంసీని వైఎస్ ప్రభుత్వం కేటాయించింది. తద్వారా టీడీపీ ప్రభుత్వ విధానాన్నే కొనసాగించింది. ఆ మేరకు ఇచ్చిన ఉత్తర్వుల్లో కూడా, 1996లో బాబు హయాంలో ఇచ్చిన 244 జీవోను స్పష్టంగా ప్రస్తావించింది!

అయినా సరే.. వైఎస్ ప్రభుత్వ కేటాయింపులు సీబీఐకి తప్పుగా కన్పించాయి. ఇవి కచ్చితంగా ‘క్విడ్ ప్రొ కో’ వ్యవహారమేనని ఆ సంస్థ తేల్చేసింది! అంతకు రెండేళ్ల ముందు, అంటే 2007లో జగన్ కంపెనీల్లో ఇండియా సిమెంట్ పెట్టిన పెట్టుబడులకు బదులుగా ఈ కేటాయింపులు జరిగాయని తనకు తానుగా నిర్ణయానికి వచ్చేసింది. పైగా ఈ కేటాయింపులు అంతర్రాష్ట్ర జల విధానాలకే విరుద్ధమంటూ కోర్టులో బల్లగుద్ది మరీ వాదిస్తోంది. అంతేకాదు, వైఎస్ ప్రభుత్వం ఏకంగా 13 టీఎంసీలు కేటాయించిందంటూ న్యాయస్థానాన్నే తప్పుదోవ పట్టించింది!

- కానీ, 1996లో బాబు సర్కారు చేసిన అవే కేటాయింపుల్లో మాత్రం సీబీఐకి ఎలాంటి తప్పూ కన్పించలేదు. అంతేకాదు, అసలు ఆ కేటాయింపే దేశంలోకెల్లా అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ నిఘా నేత్రానికి ‘కన్పించలేదు’!

నిజానిజాలను నిగ్గుదేల్చేందుకు నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాల్సిన కేంద్ర సంస్థ వైఖరిలో... రెండు ప్రభుత్వాలు తీసుకున్న ఒకే తరహా నిర్ణయాల పట్ల ఇంతటి ద్వంద్వ ప్రమాణాలెందుకు? ఈ వైఖరి తాలూకు ఆంతర్యమేమిటి? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసులో సీబీఐ అనుసరిస్తున్న ఈ తీరు పట్ల న్యాయనిపుణులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు పేరుతో ఆ సంస్థ వేస్తున్న ప్రతి అడుగులోనూ కసి, తీసుకుంటున్న ప్రతి చర్యలోనూ కక్షపూరిత వైఖరి కొట్టొచ్చినట్టుగా కన్పిస్తూనే ఉన్నాయని వారంటున్నారు. ఇండియా సిమెంట్ ఉదంతం దీనికి మరింతగా బలం చేకూరుస్తోందని అభిప్రాయపడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ను, ఆయన కుమారుడు జగన్‌ను ఎలాగైనా సరే అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా సీబీఐ దర్యాప్తు సాగుతోందన్న అభిప్రాయం ఇప్పటికే సర్వత్రా నెలకొన్న విషయం తెలిసిందే. అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీలకు కావాల్సినట్టుగా, అచ్చంగా ఆ పార్టీలు కోరుకుంటున్న రీతిలోనే విచారణ సాగుతోందని సీబీఐ వ్యవహార శైలి కూడా అసందిగ్ధంగా ధ్రువపరుస్తూనే వస్తోంది.

పాత విధానాన్నే కొనసాగించినా...

రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమలకు నీటి వసతి కల్పించడం ప్రభుత్వ విధి విధానాల్లో భాగం. తాండూరు ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యం పెరిగినందున అదనపు నీటి సౌకర్యం కల్పించాలని ఇండియా సిమెంట్ 2009లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ మేరకు కాగ్నా నది నుంచి ఫ్యాక్టరీకి మరో 0.013 టీఎంసీ నీటిని కేటాయిస్తూ 2009 ఆగస్టులో వైఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఫ్యాక్టరీకి తొలుత 1996లో బాబు అధికారంలోకి రాగానే 0.013 టీఎంసీని కేటాయించడాన్ని జీవో నంబరుతో పాటు ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా ప్రస్తావించారు. 

అయినా టీడీపీ హయాం నాటి ఈ కేటాయింపులు సీబీఐకి అసలు కన్పించనే లేదు. కానీ, వాటికి కొనసాగింపుగా, అంతే పరిమాణంలో వైఎస్ ప్రభుత్వం చేసిన కేటాయింపు మాత్రం ‘క్విడ్ ప్రొ కో’గా దర్యాప్తు సంస్థకు తోచింది. 2007లో జగతి పబ్లికేషన్స్‌లో ఆ సంస్థ పెట్టిన పెట్టుబడులనే అందుకు సాక్ష్యంగా ప్రస్తావించింది. ప్రభుత్వ విధి విధానాల్లో భాగంగా, అదీ గత ప్రభుత్వ విధానాన్ని కొనసాగించినందుకు ప్రతిగా, సాక్షిలో ఇండియా సిమెంట్స్ రూ.140 కోట్లు పెట్టిందని ఆరోపించింది. అదే నిజమనుకుంటే, తొలుత నీటిని కేటాయించినందుకు ప్రతిఫలంగా సీబీఐ లెక్క ప్రకారం బాబు ప్రభుత్వం ఎంత తీసుకున్నట్టు? కానీ ఇండియా సిమెంట్‌కు బాబు సర్కారు చేసిన నీటి కేటాయింపులను సీబీఐ అసలు పట్టించుకోవడమే లేదు. అంటే ఆ నిర్ణయంలో తప్పేమీ లేదని భావిస్తున్నట్టేనా? అలాంటప్పుడు, అచ్చంగా అదే విధానాన్ని తరవాతి ప్రభుత్వం కొనసాగిస్తే అది క్విడ్ ప్రొ కో ఎలా అవుతుంది? ఒకవేళ, 2004-09 మధ్య జరిగిన వ్యవహారాలపైనే దర్యాప్తు చేయాలన్న హైకోర్టు ఆదేశాల కారణంగా, 1996 నాటి నీటి కేటాయింపుల గురించి సీబీఐ పట్టించుకోవడం లేదా? అలాగైతే జగన్ కేసులో మాత్రం అవసరం లేకపోయినా 2004కు ముందు పరిణామాలను ఎందుకు దర్యాప్తు పరిధిలోకి తీసుకొస్తున్నట్టు? ఈ ప్రశ్నలకు సీబీఐ ఏమని సమాధానం చెబుతుంది?

ఓఎంసీ కేసులోనేమో అలా...

టీడీపీ ఆరోపణల ఆధారంగా విచారణ సాగిస్తున్న సీబీఐకి, ఆ పార్టీ హయాంలో తీసుకున్న నిర్ణయాలు మాత్రం పట్టడం లేదెందుకు? ఎల్లో మీడియా రాతల ఆధారంగా 2004కు ముందు నాటి జగన్ వ్యాపార కార్యకలాపాలను భూతద్దంలో చూస్తున్న దర్యాప్తు సంస్థ, ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? ఎమ్మార్ కుంభకోణం, ఓబుళాపురం మైనింగ్ ఉదంతాల్లో సీఎంగా చంద్రబాబు పాత్రను సంస్థ ఎందుకు శోధించడం లేదు? ఈ విషయమై జగన్ స్వయంగా జీవో కాపీని అందజేసినా కూడా సీబీఐ మౌనముద్ర దాల్చడం వెనక కారణమేమిటి? ఓబుళాపురం మైనింగ్ బిడ్‌లో 15వ స్థానంలో నిలిచిన వ్యక్తి, బిడ్‌లో పాల్గొనొద్దంటూ జగన్ తనను బెదిరించారంటూ వాంగ్మూలమివ్వగానే సీబీఐ హడావుడి చేసింది. బిడ్‌లో తొలి స్థానంలో ఉండి ఉపసంహరించుకున్న, లేదా రెండో స్థానంలో ఉన్న వ్యక్తి ఆరోపించారంటే సరే అనుకోవచ్చు. 

కానీ, 15వ స్థానంలో ఉన్న వ్యక్తి ఫిర్యాదు చేయడమే ఆలస్యం.. ‘సాక్ష్యమివ్వండి’ అంటూ దానిపై హుటాహుటిన జగన్‌కు నోటీసులిచ్చి మరీ ఆయన వాంగ్మూలాన్ని సీబీఐ నమోదు చేసింది! 2002లోనే బాబు హయాంలోనే ఓఎంసీకి లీజు బదిలీ అయిందని వాంగ్మూలమిస్తూ జగన్ పేర్కొన్నారు. సంబంధిత జీవో కాపీతో సహా ఈ విషయాన్ని స్వయంగా సీబీఐ దృష్టికి తెచ్చారు. మరి, సీబీఐ ఆరోపిస్తున్నట్టు ఓబుళాపురంలో అక్రమ మైనింగ్ జరిగితే, కేసును దాని మూలాల నుంచి పరిశోధించాల్సిన బాధ్యత ఆ సంస్థది కాదా? అలాంటప్పుడు, బాబు హయాంలోనే జనార్దనరెడ్డికి లీజు బదిలీ అయిందని ఆధారాలతో సహా వెల్లడైనా పట్టించుకోలేదేం? బాబును కనీసం దీనిపై ప్రశ్నించలేదేం? జగన్ ఆస్తుల కేసులో 2004 నుంచి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించినా, అంతకుముందు నాటి వ్యాపార కార్యకలాపాలపై విచారణ చేస్తున్న సీబీఐ... ఎమ్మార్, ఓఎంసీ వ్యవహారాలకూ అదే ప్రాతిపదికను ఎందుకు వర్తింపజేయడం లేదు?

ఎమ్మార్‌లోనూ అంతే...

ఎమ్మార్ అనే దుబాయ్ సంస్థకు భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నది చంద్రబాబు ప్రభుత్వం. దానితో ఒప్పందం కుదుర్చుకున్నదీ చంద్రబాబు సర్కారే. ఏపీఐఐసీ ప్రమేయం లేకుండా థర్డ్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చంటూ ఒప్పందం జరిగిపోయింది కూడా టీడీపీ హయాంలోనే. నిర్దిష్ట కారణాలు లేకుండా ఆ ఒప్పందంలో జోక్యం చేసుకునే అధికారం ఏపీఐఐసీకి లేదంటూ స్పష్టంగా పేర్కొన్న కారణంగానే స్టైలిష్ హోం ఏర్పాటైంది. ఎమ్మార్ కుంభకోణానికి మూలం ఈ స్టైలిష్ హోమే! అయినా సరే, ఈ ఉదంతంలోనూ నాటి సీఎం చంద్రబాబును సీబీఐ కనీసం విచారించను కూడా లేదు. 

ఓఎంసీ, ఎమ్మార్ వంటి రెండు ప్రధాన కేసుల్లో టీడీపీ ప్రభుత్వ పాత్ర స్పష్టంగా కనిపిస్తున్నా, అటువైపు కనీసం కన్నెత్తి చూడటానికి కూడా సీబీఐకి మనసొప్పడం లేదు. వైఎస్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా సీబీఐ దర్యాప్తు సాగుతోందని ఈ భిన్నమైన వైఖరులు చెప్పకనే చెబుతున్నాయని సీబీఐలో సుదీర్ఘకాలం పని చేసిన విశ్రాంత ఐపీఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ‘సీబీఐ దర్యాప్తు జరుగుతున్న తీరు చూసి నేను ఖిన్నుడనయ్యా. ఓఎంసీ వ్యవహారంలో చంద్రబాబు పాత్రను తక్కువ చేసి చూపేందుకు సీబీఐ ఉన్నతాధికారి ఒక ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించదగ్గవి. ముందే కూడబలుక్కుని చేస్తున్న వ్యవహారంగా దీనిని పరిగణించి చూడక తప్పదు’ అని ఆయనన్నారు.
- న్యూస్‌లైన్, హైదరాబాద్

సీబీఐ ‘నీటి’మాటలు

మీకు నీళ్లు కావాలి. హైదరాబాద్‌లో ఫోన్ చేస్తే ఇంటికి నేరుగా ట్యాంకర్ వస్తుంది. రూ.250 చెల్లిస్తే 5000 లీటర్లను మీరు చెప్పినచోట గుమ్మరించి వెళుతుంది. అంటే... లీటర్‌కు మీరు చెల్లిస్తున్నది 5 పైసలు. 
ఈ లెక్కన ఇండియా సిమెంట్స్‌కు రంగారెడ్డి జిల్లాలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేటాయించిన నీటి విలువెంత? 0.013 టీఎంసీలంటే సెకనుకు ప్రవహించేది 11.5 లీటర్లు. ఇదేనీరు 365 రోజులూ 24 గంటలూ ప్రవహిస్తే ఏడాదికి పంపే మొత్తం నీరు 36,26,64,000 లీటర్లు. లీటరు 5 పై. చొప్పున లెక్కిస్తే అయ్యే మొత్తం రూ.1.81 కోట్లు. 

మరి ఏడాదికి రూ.1.81 కోట్లు చెల్లిస్తే పోయేదానికి ఎవరైనా ఏకమొత్తంగా రూ.140 కోట్లు చెల్లిస్తారా? ఈ 140 కోట్లను కనీసం బ్యాంకులో డిపాజిట్ చేసినా... కనిష్టంగా 8 శాతం వడ్డీ వచ్చినా ఏడాదికి రూ.11.2 కోట్లు వస్తుంది కదా!! దాన్లో మహా అయితే 2 కోట్లు పడేస్తే పని అయిపోతుందిగా! ఇంకా అసలు మొత్తం అలాగే ఉండటంతో పాటు ఏటా రూ.9.2 కోట్లు ఆదాయం కూడా ఉంటుందిగా!! బుర్ర ఉన్న ఏ పారిశ్రామికవేత్త అయినా ఇలాగే ఆలోచిస్తాడు. దేశంలో అగ్రగామి సంస్థయిన ఇండియా సిమెంట్స్‌కు ఈ మాత్రం తెలివి లేదనుకోవాలా? లేక తమ వ్యాపార నిర్ణయాల్లో భాగంగానే వారు ‘సాక్షి’లో పెట్టుబడి పెట్టారనుకోవాలా? ఏ కాస్త ఆలోచించేవారైనా ఈ రెండోదే కరెక్టని తేలిగ్గానే ఊహిస్తారనుకోండి!!.

13 టీఎంసీలంటే మాటలా...?

సీబీఐ కోర్టులో వాదిస్తూ వైఎస్ ప్రభుత్వం 13 టీఎంసీలు కేటాయించిందని చెప్పినట్టు పలు పత్రికలు పేర్కొన్నాయి. అదే నిజమైతే అంతకన్నా అన్యాయమైన వాదనేమైనా ఉంటుందా? అసలు 13 టీఎంసీలంటే మాటలా...!! 75 లక్షల జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మొత్తానికే ఏడాదికి 12 టీఎంసీలు సరిపోతోంది. అదికూడా కృష్ణా తొలి, రెండవ దశల్లోను... హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, సింగూరు, మంజీర అన్ని జలాశయాలను కలిపితే ఇంత నీరొస్తోంది. మరి రంగారెడ్డి జిల్లాలో ఇండియా సిమెంట్స్‌కు 13 టీఎంసీలిచ్చే జలాశయం ఎక్కడుంది? కనీసం ఇలాంటి వాదనలు చేసేటపుడైనా, రాసేటపుడైనా ఒకసారి సరిచూసుకోవాల్సిన అవసరం లేదా..? లేక చనిపోయిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి వచ్చి ఎలాగూ వివరణ ఇవ్వలేరు కదా అనే ధీమాతో నోటికొచ్చినట్టు ఇలాగే అభాండాలు వేస్తుంటారా...?

7-1-2012 శనివారం ఓదార్పుయాత్ర వివరాలు

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర శనివారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడి నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. 

వివరాలు..

7-1-2012 శనివారం

సత్తెనపల్లి మండలం
* కొమెరపూడి నుంచి యాత్ర ప్రారంభం

మేడికొండూరు మండలం
* మేడికొండూరులో మూడు వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ
* పాలడుగులో మూడు విగ్రహాల ఆవిష్కరణ

పెదకూరపాడు మండలం
* పొడపాడులో పర్యటన
* ముసాపురంలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* పాటిబండ్లలో పర్యటన
* జలాలపురంలో పర్యటన
* కంభంపాడులో పర్యటన

అమరావతి మండలం
* మండేపూడిలో రెండు విగ్రహాల ఆవిష్కరణ (నామాల నాగరాజు కుటుంబానికి ఓదార్పు).

నేటి ‘ఓదార్పు’ కుటుంబం
మారాజు.. మరిక లేడని..
పేరు: నామాల నాగరాజు
ఊరు: మండెపూడి ఎస్సీ కాలనీ, అమరావతి మండలం
వృత్తి: వ్యవసాయ కూలీ
తల్లిదండ్రులు: రామకోటి, నాగరత్నమ్మ

చిన్నతనంలోనే చదువు మానేసిన నాగరాజు తండ్రికి చేదోడువాదోడుగా కూలి పనులకు వెళుతుండేవాడు. అతడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని. ఆయన మరణవార్త విని తట్టుకోలేకపోయాడు. తీవ్ర ఆవేదనతో సెప్టెంబర్ నాలుగున పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికందిన కొడుకు చనిపోగా తల్లిదండ్రులు నామాల రామకోటి, నాగరత్నమ్మ వ్యవసాయకూలీలుగా జీవనం సాగిస్తున్నారు.

గాయపడిన గోపాలరావును పరామర్శించిన జగన్

 గుంటూరు ఓదార్పుయాత్రలో గాయపడిన ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ ఉద్యోగి గోపాలరావును వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. డిసెంబర్ 17వ తేదీన ఓదార్పుయాత్రో కాన్వాయ్ నుంచి జారిపడి గోపాలరావు కాలుకు గాయమైంది. విషయం తెలుసుకున్న జగన్.. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఉన్న గోపాలరావును కలుసుకుని పరామర్శించారు. జగన్ స్వయంగా వచ్చి పలకరించడంతో గోపాలరావు ఆనందం వ్యక్తం చేశారు.

పులివెందుల సిఐకి అరెస్ట్ వారెంట్

Written By ysrcongress on Friday, January 6, 2012 | 1/06/2012

 పులివెందుల సిఐ శంకరయ్యకు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మహిళల పట్ల సిఐ అసభ్యంగా ప్రవర్తించాడంటూ పులివెందుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2011 మే నెలలో జరిగిన ఉప ఎన్నికలలో సిఐ శంకరయ్య, ఎస్ఐ యుగంధర్, పోలీసులు రెచ్చిపోయి మహిళలను చితకబాదారని ఆరోపణలు ఉన్నాయి.

విజయసాయి రెడ్డి ధైర్యాన్ని చూసి ఆ పత్రికలకే చుక్కలు

ప్రముఖ ఆడిటర్ విజయసాయి రెడ్డికి సిబిఐ చుక్కలు చూపిస్తోందని కొన్ని పత్రికలలో కథనాలు వచ్చాయని, వాస్తవానికి ఆయన ధైర్యాన్ని చూసి ఆ పత్రికలకే చుక్కలు కనిపిస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాశిరెడ్డి పద్మ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. పాత్రికేయ విలువలను సమాధి చేస్తున్నట్లుగా ఆ పత్రికల కథనాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఎల్లో మీడియా రాతలు చూసి కోర్టులు, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి కేసులో సిబిఐ ఎందుకు అత్యుత్సాహం చూపిస్తోందని ఆమె ప్రశ్నించారు. 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాలనలో రైతులు ప్రత్యక్ష నరకం చూశారని తెలిపారు. ఆయన ఇప్పుడు రైతుల గురించి మాట్లాడితే ఎవరూ నమ్మరన్నారు. తెలంగాణ అంశంలో ఆయన మాట తప్పారని విమర్శించారు. తొలుత తెలంగాణకు అనుకూలం అని చెప్పి, ఆ తరువాత రెండు కళ్ల సిద్ధాంతం అన్నారన్నారు. ఈ విషయంలో ఆయన దాటవేత ధోరణి అవలంభిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరి అవలంభించకపోవడం వల్లే సమస్య తలెత్తిందన్నారు.

Infosys BPO walk-in interview in Hyderabad


Rediff.com article about AP politics

YSR Congress President Jaganmohan Reddy
Vicky Nanjappa in Bengaluru
The Congress in Andhra Pradesh has chalked out a new strategy to fight the force of Jaganmohan Reddy. Sources say the party has decided to take a backseat while the Telugu Desam Party ups ante against the YSR Congress president.
Telugu Desam Party supermo Chandrababu Naidu's visit to Karnataka Governor H R Bharadwaj on Tuesday set tongues wagging in Andhra Pradesh. Rumour mills were abuzz that the former Andhra Pradesh chief minister was in Karnataka to hand over some documents pertaining the mining scam to Bharadwaj. But at the same time there is also speculation that Naidu's visit was intended at planning a strategy against YSR Congress President Jaganmohan Reddy.

A few months ago, Jagan had slammed the TDP saying that there was no opposition in Andhra since Naidu's party worked alongside the Congress. Today, this is a popular belief in political circles in the state and the proximity between the TDP and the Congress is being looked at as an attempt to wipe out Jagan.

When Jagan quit the Congress, it was clearly a war between him and the party. During various public meetings, Jagan often accused the Congress of trying to finish him and wipe out his father's Y S Rajasekhara Reddy's legacy from the state. Battlelines in Andhra were drawn -- YSR versus Sonia Gandhi. The YSR Congress chief even roped in MLAs from the Congress.

The Congress also hit back. First, they tightened the screws around the YSR Congress and then a number of cases were slapped against Jagan.

Today, every political party in Andhra are aware that Jagan is a force to reckon with and he will put a fight in the next elections. Various exit polls also show that there is no stopping Jagan.
`

05/01/2012 odharpu images

కోర్టును సైతం సీబీఐ తప్పుదోవ పట్టిస్తోంది.

* ఇండియా సిమెంట్‌కు 13 టీఎంసీలు కేటాయించారన్న సీబీఐ
* కేటాయించింది 0.013 టీఎంసీ మాత్రమే
* అది కూడా ప్రభుత్వ విధానంలో భాగంగానే 
* అయినా జల విధానాన్ని ఉల్లంఘించా రంటూ వాదన.. వాటినే వాస్తవాలనే రీతిలో రిపోర్ట్ చేసిన కొన్ని పత్రికలు
* ‘13 టీఎంసీల’ వాదనను ఖండించిన ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్
 దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తప్పిదాలు జరిగినట్టు చూపేందుకు సీబీఐ చేయని ప్రయత్నమంటూ లేదు. అందుకోసం ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చెప్పడానికి, చూపడానికి కూడా వెనకాడటం లేదు! నేరారోపణలను ఎలాగైనా నిజం చేయాలనే రాజకీయ ఉద్దేశాలతో కోర్టును సైతం సీబీఐ తప్పుదోవ పట్టిస్తోంది. ఆ క్రమంలో పచ్చి అబద్ధాలు చెప్పేందుకు కూడా సిద్ధమైంది. బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో జరిగిన వాదనలే ఇందుకు నిదర్శనం. పరిశ్రమలకు నీటి కేటాయింపు విధానంలో భాగంగా 2009లో రంగారెడ్డి జిల్లా తాండూరు సమీపంలో ఇండియా సిమెంట్ లిమిటెడ్‌కు కాగ్నా నది నుంచి 13 ఎంసీఎఫ్‌టీ నీటిని కేటాయించారు. 

ఇది ఒక టీఎంసీ కంటే చాలా చాలా తక్కువ. కచ్చితంగా చెప్పాంటే 0.013 టిఎంసీ. కానీ సీబీఐ న్యాయవాది మాత్రం ఆ కంపెనీకి ఏకంగా 13 టీఎంసీలు కేటాయించినట్టు కోర్టులో వాదించారు! పైగా, ఇంత ‘భారీగా’ నీటిని కేటాయించిన ందుకు ప్రతిగానే జగతి పబ్లికేషన్‌లో ఇండియా సిమెంట్ రూ.140 కోట్ల మేర పెట్టుబడి పెట్టిందన్నారు! వాస్తవ కేటాయింపులకు, సీబీఐ ఆరోపిస్తున్న దానికీ అక్షరాలా హస్తిమశకాంతరం ఉంది. పైగా, ఈ నీటి కేటాయింపు ప్రభుత్వ విధానంలో భాగంగానే జరిగింది. అయినా సరే, ఇది అంతర్రాష్ట జల విధానాన్ని ఉల్లంఘిస్తూ జరిగిందని కూడా సదరు న్యాయవాది వాదించారు! కొన్ని పత్రికలు కూడా యథాతథంగా అదే విషయాన్ని రిపోర్ట్ చేశాయి!!

ఇండియా సిమెంట్‌కు నీటి కేటాయింపుపై సీబీఐ వాదనకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి సాగునీటి అధికారులు అవాక్కయ్యారు. తాము కేటాయించింది కేవలం 0.013 టీఎంసీలు అయితే, సీబీఐ మాత్రం ఏకంగా 13 టిఎంసీలుగా పేర్కొనడం పట్ల విస్మయం వెలిబుచ్చారు. ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ బి.వేణుగోపాల ఆచార్య ఈ మేరకు గురువారం ఒక ఖండన విడుదల చేశారు. సర్కార్ నిబంధనలకు లోబడే ఇండియా సిమెంట్ కంపెనీకి నీటి కేటాయింపు జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి ఉల్లంఘనలూ జరగలేదని పేర్కొన్నారు. 

ఈ కేటాయింపు అంతర్రాష్ట జల ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనన్న సీబీఐ న్యాయవాది వాదనను కూడా ఇరిగేషన్ అధికారులు ఖండించారు. నదీ జలాల్లో రాష్ట్రానికి కేటాయించిన కోటా నుంచే పరిశ్రమలకు సరఫరా చేస్తున్నామని, ఇందులో అంతర్రాష్ర్ట జల ఒప్పందాల ఉల్లంఘనలేవీ జరగలేదని స్పష్టం చేశారు! దివంగత నేతకు ఏదోలా నేరం ఆపాదించేందుకు ఎంతకైనా తెగిస్తున్నారనేందుకు పై ఉదంతం మచ్చుతునక మాత్రమే. కొద్ది నెలలుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలను పరిశీలించినా, సీబీఐ వ్యవహార శైలిని చూసినా అడుగడుగునా ఈ విషయం స్పష్టమవుతుంది. 

వైఎస్సార్ తప్పిదాలు చేశారని న మ్మించడం, తద్వారా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దోషిగా చిత్రించడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ ప్రహసనంలో కొన్ని పత్రికలు కూడా చేయి కలిపి ఇలాంటి వార్తలను వీలైనంతగా ప్రచారం చేస్తున్నాయి! నీటి కేటాయింపులకు ప్రతిగానే జగన్ కంపెనీల్లో ఇండియా సిమెంట్ ఏకంగా రూ.140 కోట్లు పెట్టిందన్న సీబీఐ చేస్తున్న వాదనే నిజమైతే... రాష్ర్టంలో వేలాది కంపెనీలకు గత 40, 50 ఏళ్లుగా నీటిని కేటాయిస్తూనే ఉన్నారు. అలా నీరు పొందిన సంస్థలన్నీ ఇలా ప్రభుత్వ పెద్దలకు కోట్లాది రూపాయలు చెల్లించాలంటే రాష్ట్రంలో అసలు ఒక్క సంస్థ కూడా పరిశ్రమ నెలకొల్పే పరిస్థితే ఉండదు.

ఇదీ విధానం..
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వాలు విద్యుత్, వ్యాట్ రాయితీల వంటివి కల్పిస్తాయి. ఇందుకోసం ప్రతి ఐదేళ్లకోసారి ఏకంగా పారిశ్రామిక విధానాలను కూడా ప్రకటిస్తుంటాయి. చంద్రబాబు హయాంలోనూ పారిశ్రామిక విధానముంది. వైఎస్ అధికారంలోకి వచ్చాక 2005-10కి పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. తర్వాత రోశయ్య హయాంలో 2010-15కు విధానాన్ని తయారుచేశారు. పరిశ్రమను నెలకొల్పేందుకు భూమి, నీటి కేటాయింపులతో పాటు రోడ్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.

ప్రస్తుతం పరిశ్రమలకు కరెంటుపై యూనిట్‌కు 75 పైసల రాయితీ, స్థాయిని బట్టి 25 నుంచి 50% దాకా వ్యాట్ రాయితీ, పెట్టుబడిపై 20 నుంచి 50 శాతం రాయితీతో పాటు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల్లో కూడా రాయితీ ఇస్తున్నారు. రాష్ట్రంలో కార్ల తయారీ యూనిట్లకైతే ఏకంగా 100 శాతం వ్యాట్ రాయితీ ఇచ్చేందుకు కూడా కిరణ్ సర్కారే ముందుకొచ్చింది! రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షే తప్ప, ఫలానా పరిశ్రమకు మేలు చేయడం, అందుకు ప్రతిగా లబ్ధి పొందడం వంటివి పారిశ్రామిక విధానంలో ఉండవు. వైఎస్ హయాంలోనూ అదే జరిగింది. దానికి కూడా సీబీఐ వక్రభాష్యాలు చెబుతోంది. అందుకోసం వాస్తవాలను కూడా ఇష్టానికి వక్రీకరిస్తోంది!

Popular Posts

Topics :