1/21/2012
జనాదరణ ఉన్న నేత జగన్_ గాదె
Written By ysrcongress on Saturday, January 21, 2012 | 1/21/2012
1/21/2012
23 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా సమావేశాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత వ్యవహారాలపై చర్చించడానికి ఈ నెల 23వ తేదీ నుంచి జిల్లాల వారీగా విస్త్రత సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. తొలి విడతగా రోజు కొకటి చొప్పున ఐదు జిల్లాల సమావేశాలు పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతాయి. 23న నిజామాబాద్, 24న నల్లగొండ, 25న మహబూబ్‌నగర్, 27న ఆదిలాబాద్, 30వ తేదీన కరీంనగర్ జిల్లాల సమావేశాలు ఉంటాయని పార్టీ సంస్థాగత వ్యవహారాల సమన్వయకర్త పి.ఎన్.వి.ప్రసాద్ జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్లకు లేఖలు పంపారు.
ఈ విస్త్రత సమావేశాల్లో పార్టీ అడ్‌హాక్ కమిటీ జిల్లా కన్వీనర్లు, పరిశీలకులు, జిల్లా సమన్వయకర్తలు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల పార్టీ అడ్‌హాక్ కన్వీనర్లు, మున్సిపాలిటీ కన్వీనర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కన్వీనర్లు, అధికార ప్రతినిధులు, జిల్లాల్లోని పార్టీ ముఖ్య నేతలు, ఇతర జిల్లాల్లో పార్టీ విధులు నిర్వహిస్తున్న నాయకులు, కేంద్ర పాలక మండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ పార్లమెంటు సభ్యులు పాల్గొనాలని ఆయన సూచించారు. సమావేశానికి పై వారంతా పాల్గొనేలా సంబంధిత జిల్లా కన్వీనర్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఆహ్వానితులు సమావేశానికి వచ్చేటపుడు తమ ఫోటోలు రెండింటిని తీసుకురావాలని కూడా ఆయన సమాచారం పంపారు.
కమిటీల ఏర్పాటుపై శ్రద్ధ
పార్టీ సభ్యత్వ కార్యక్రమం వేగవంతం చేసేందుకు వీలుగా ఆయా జిల్లాల్లో అన్ని స్థాయిల్లోనూ కమిటీలను ఏర్పాటు చేయడంపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమించారు. వారంతా ఏ మేరకు మండల కమిటీలను ఏర్పాటు చేశారనే అంశం కూడా ప్రస్తావనకు రావచ్చు. కొత్తగా ఏర్పడిన పార్టీ కనుక వివిధ శ్రేణుల, నాయకుల విధులను, బాధ్యతలను గురించి ఈ సమావేశంలో స్పష్టంగా నిర్దేశిస్తారు. సంస్థాగత నిర్మాణానికి సంబంధించి కీలకమైన అంశాలు చర్చిస్తారు కనుక సాధ్యమైనంత వరకూ ఆహ్వానితులందరినీ సమావేశంలో పాల్గొనేలా చూడాలని ఇప్పటికే జిల్లా కన్వీనర్లకు ఆదేశాలు వెళ్లాయి.

జగన్ వెంట జనం: ఎంపి రాయపాటి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ప్రజాదరణ గల నాయకుడన్న మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి వ్యాఖ్యలతో తాను పూర్తీగా ఏకీభవిస్తున్నట్లు ఎంపి రాయపాటి సాంబశివరావు చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వంద శాతం వాస్తవం అన్నారు. కనపడుతుంది గదా, జగన్ వెంట జనం వస్తున్నారు అని అన్నారు.
కమ్మవారిని టాయిలెట్ పేపర్ లాగా వాడుకొని పారవేస్తున్నారని బాధపడ్డారు. మంత్రి వర్గ విస్తరణలో ముఖ్యమంత్రికి మరింత స్వేచ్చ ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు. మంత్రి పదవులు తీసుకున్నవారు రానున్న ఎన్నికలలో అభ్యర్థులను గెలిపించవలసిన బాధ్యత తీసుకోవాలన్నారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత తగ్గిస్తున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తేనే ఎన్నికలలో పార్టీ గెలవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.

'రిలయన్స్ పెట్టుబడులపై రామోజీ మౌనం వీడాలి'
'ఈనాడు'లో రిలయన్స్ పెట్టుబడులపై రామోజీ రావు మౌనం వీడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాశిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడారు. జగతి పబ్లికేషన్స్ పై రామోజీ కాకమ్మ కథనాలను ప్రజలు నమ్మడంలేదన్నారు. దొంగే దొంగ..దొంగ.... అన్నట్లుగా రామోజీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సాక్షిలో పెట్టుబడులపై తమ పార్టీ అధినేత జగన్మోహన రెడ్డి 50, 60 సార్లు వివరణ ఇచ్చినట్లు తెలిపారు. పది రూపాయల షేర్ ని 350 రూపాయలకు కొనుగోలు చేయడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఈనాడు 100 రూపాయల షేర్ ని 5 లక్షల 28వేల 630 రూపాయలకు ఎలా కొనుగోలు చేశారని ఆమె ప్రశ్నించారు. 19 వందల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న టివి18 ఈనాడు వాటాలను ఎలా కొనుగోలు చేసిందన్నారు. ఈనాడు, సాక్షి మధ్య వ్యాపారాత్మకమైన, రాజకీయమైన పోటీ నెలకొందని చెప్పారు. ఆ క్రమంలోనే సాక్షిపై ఈ దాడి జరుగుతోందని ఆమె స్పష్టం చేశారు. దేశంలోనే 8వ అతి పెద్ద పత్రికగా సాక్షి నిలిచిందని ఆమె తెలిపారు. ఈనాడు కథనాలను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని చెప్పారు. ఈనాడులో రిలయన్స్ కి సంబంధించిన పెట్టుబడులు మాటేమిటని ఆమె ప్రశ్నించారు. కెజి బేసిన్ లో రిలయన్స్ కు అనేక రాయితీలు ఇచ్చినందునే ఆ సంస్థ ఈనాడులో పెట్టుబడులు పెట్టినట్లు స్పష్టమవుతోందన్నారు. |
1/21/2012
జనాదరణ ఉన్న నేత జగన్: గాదె వెంకట రెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డికి నాయకత్వ లక్షణాలు లేవని ఎవరు అంచనా వేసినా తప్పేనని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి అన్నారు. జగన్‌కు జనాదరణ ఉందన్నారు. ఆయన సభలకు జనం విపరీతంగా వస్తున్నారని గాదె గుర్తు చేశారు. ఆయనకు రాజకీయ లక్షణాలు లేవని తానెన్నడూ అనలేదన్నారు.
సీనియర్ల సేవలు అవసరం లేదని పార్టీ భావిస్తోందేమోనన్న సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో కులభావన పెరుగుతోందని చెప్పారు. ఎన్నికల్లో అన్ని పార్టీలు కులాల ప్రాతిపదికనే టికెట్లు ఇస్తున్నాయని, ఈ విధానం సరికాదని గాదె అన్నారు
కేబినెట్‌లో తెలంగాణ ప్రాంతానికి ప్రాంతీయ సమతుల్యత దెబ్బతిందన్నారు. దామాషా ప్రకారం తెలంగాణ ప్రాంతానికి మరికొన్ని మంత్రి పదవులు రావాలని పరోక్షంగా ముఖ్యమంత్రికి ఆయన చురకలంటించారు.

బహిరంగంగా ప్రకటించాల్సిన పెట్టుబడులపై రిలయన్స్ గోప్యత ఎందుకు పాటించింది?
|
1/21/2012
దెబ్బలు తింటున్నా.. దయ లేదు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన
ఈ ప్రభుత్వం రైతులు సేద్యం చేసుకోలేని పరిస్థితులను కల్పించింది
నాసిరకం విత్తనాల సరఫరాతో పత్తి, మిరప పంటల్లో దిగుబడి భారీగా తగ్గింది
అకాల వర్షానికి తడిసి మొలకెత్తిన వడ్లు కొనే నాథుడే కనపడటం లేదు
ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘మానవత్వం లేని ఈ ప్రభుత్వం ఇవాళ గ్రామాల్లో రైతన్నలు సేద్యం చేసుకోలేని పరిస్థితులను కల్పించింది. గ్రామాల్లో ఉండి వ్యవసాయం చేయకపోతే పరువు, మర్యాద పోతుందేమో అనే బాధతో రైతన్నలు వ్యవసాయం చేస్తే ప్రాణమే పోయే పరిస్థితులు వచ్చాయి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 52వ రోజు శుక్రవారం ఆయన పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు, అచ్చంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. నాలుగు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. పెదపాలెంలో చిలకా మరియమ్మ కుటుంబాన్ని, ఆవులవారి పాలెంలో ద్రోణాదుల శ్రీనివాసరావు కుటుంబాన్ని, హస్సానాబాద్‌లో షేక్ గారపాటి గాలీసా కుటుంబాన్ని ఓదార్చారు. పలు గ్రామాల్లో ఆయన ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..
ఈ రోజు రైతన్న దగ్గరకు పోయి ఎలా ఉన్నావన్నా అని అడిగితే.. ‘గ్రామాల్లో ఉన్నాం కదా..! వ్యవసాయం చేయకపోతే పరువు పోయినట్లు ఉంటుంది. వ్యవసాయం చేస్తే ప్రాణమే పోయేట్టుగా ఉంది మాకు’ అని రైతన్న సమాధానం చెప్తున్నాడు. ఇవాళ ఈ గ్రామానికి రాక ముందు పొలాల్లో అక్కడక్కడ పసుపు తోటలు కనపడ్డాయి. పసుపు అమ్మితే రూ. 3500 నుంచి రూ.4000 కూడా గిట్టని పరిస్థితుల్లో రైతన్న వ్యవసాయం చేస్తున్న పరిస్థితులున్నాయి. వడ్ల గురించి ఆలోచన చేస్తే అకాల వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యం కొనే నాథుడే లేడు. అకాల వర్షానికి ముందు కోసిన వరి ధాన్యానికి బస్తా రూ. 750 కంటే ఎక్కువ పడే అవకాశం లేదు. ఉల్లి పరిస్థితి మరీ దారుణం. కేజీ రూ.2కు కూడా అమ్ముకోలేని అధ్వాన పరిస్థితిలో రైతన్న ఉన్నాడు. ఇవాళ క్వింటాల్‌కు రూ.4 వేలు కూడా రాని పరిస్థితి మిర్చి రైతుది.
వైఎస్ పోయాక..
దివంగత నేత వెళ్లిపోయిన తరువాత రైతన్న పరిస్థితి అధ్వానంగా తయారైంది.
రైతులు, రైతు కూలీలను పట్టించుకోవాల్సిన, వారికి అండగా నిలవాల్సిన పెద్దలే.. ఇవాళ రైతు సమస్యలను గాలికి వదిలేశారు. నాసిరకం విత్తనాల వల్ల అనుకున్న దిగుబడి రాని పరిస్థితి.. ఇవాళ పత్తిలో కనపడుతోంది, మిర్చీలోనూ కనబడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ యూనివర్శిటీ విత్తనాల నాణ్యతను పరీక్షించి, సర్టిఫికెట్ ఇస్తుంది. మన ఖర్మ ఏమిటంటే గత 12 నెలలుగా వ్యవసాయ యూనివర్శిటీకి వైస్ చాన్స్‌లర్ లేడు. 10 నెలలుగా వ్యవసాయ శాఖ మంత్రే లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటే వీళ్లకు రైతుల మీద ఉన్న ప్రేమ ఎంతో అర్థమవుతోంది.
చంద్రబాబు అన్నీ మ్యానేజ్ చేయగలుగుతారు..
ఇవాళ రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయంటే ప్రజల తరుపున ఎవరూ మాట్లాడటం లేదు. పేదవాడి కష్టాలు ఎవరికీ కనబడటం లేదు. చేసేదల్లా డ్రామాలు. ఆడేదల్లా నాటకాలు. చంద్రబాబు నాయుడుకైతే ఆ దివంగత నేత పేరు చెప్పందే ఒక్కరోజు కూడా గడవదు. కాంగ్రెస్ పెద్దలతో కుమ్మక్కై అన్నీ ఆ దివంగత నేత మీద బురదజల్లే ప్రయత్నాలే. దివంగత నేత నిజంగా గొప్ప వ్యక్తి... తాను చనిపోయిన తరువాత కూడా చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఇవాళ అన్యాయమైన ఈ రాజకీయ వ్యవస్థను చూస్తే బాధనిపిస్తోంది. చాలా బాధనిపిస్తోంది. చనిపోయిన వైఎస్సార్‌కు ఒక న్యాయమట.. బతికి ఉన్న చంద్రబాబు నాయుడుకు వేరొక న్యాయమట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్నీ మ్యానేజ్ చేయగలుగుతారు. వైఎస్సార్‌ను అప్రదిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు ఈ ఇద్దరూ కలిసి పూర్తిగా అధికార దుర్వినియోగం చేస్తున్నారు. విలువలు లేని, విశ్వసనీయత లేని, న్యాయం లేని, ధర్మం లేని రాజకీయాలు చేస్తున్నారు.
దెబ్బలు తింటున్నా.. దయ లేదు
అంగన్‌వాడీలు గత 12 నెలలుగా దెబ్బలు తింటున్నారు.. సమ్మె చేస్తున్నారు. అయినా ఈ పాలకులు వాళ్ల గురించి పట్టించుకోవడం లేదు. 104 ఉద్యోగులు గత ఆరు నెలల నుంచీ నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారి గురించీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఆదర్శ రైతులకైతే ఎనిమిది నెలల నుంచి జీతాలు అందటం లేదు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలా తయారైందీ అంటే.. ప్రజలను, ప్రజా సమస్యలను గాలికి వదిలేసింది.
ఈ ప్రభుత్వం రైతులు సేద్యం చేసుకోలేని పరిస్థితులను కల్పించింది
నాసిరకం విత్తనాల సరఫరాతో పత్తి, మిరప పంటల్లో దిగుబడి భారీగా తగ్గింది
అకాల వర్షానికి తడిసి మొలకెత్తిన వడ్లు కొనే నాథుడే కనపడటం లేదు
ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘మానవత్వం లేని ఈ ప్రభుత్వం ఇవాళ గ్రామాల్లో రైతన్నలు సేద్యం చేసుకోలేని పరిస్థితులను కల్పించింది. గ్రామాల్లో ఉండి వ్యవసాయం చేయకపోతే పరువు, మర్యాద పోతుందేమో అనే బాధతో రైతన్నలు వ్యవసాయం చేస్తే ప్రాణమే పోయే పరిస్థితులు వచ్చాయి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 52వ రోజు శుక్రవారం ఆయన పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు, అచ్చంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. నాలుగు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. పెదపాలెంలో చిలకా మరియమ్మ కుటుంబాన్ని, ఆవులవారి పాలెంలో ద్రోణాదుల శ్రీనివాసరావు కుటుంబాన్ని, హస్సానాబాద్‌లో షేక్ గారపాటి గాలీసా కుటుంబాన్ని ఓదార్చారు. పలు గ్రామాల్లో ఆయన ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..
ఈ రోజు రైతన్న దగ్గరకు పోయి ఎలా ఉన్నావన్నా అని అడిగితే.. ‘గ్రామాల్లో ఉన్నాం కదా..! వ్యవసాయం చేయకపోతే పరువు పోయినట్లు ఉంటుంది. వ్యవసాయం చేస్తే ప్రాణమే పోయేట్టుగా ఉంది మాకు’ అని రైతన్న సమాధానం చెప్తున్నాడు. ఇవాళ ఈ గ్రామానికి రాక ముందు పొలాల్లో అక్కడక్కడ పసుపు తోటలు కనపడ్డాయి. పసుపు అమ్మితే రూ. 3500 నుంచి రూ.4000 కూడా గిట్టని పరిస్థితుల్లో రైతన్న వ్యవసాయం చేస్తున్న పరిస్థితులున్నాయి. వడ్ల గురించి ఆలోచన చేస్తే అకాల వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యం కొనే నాథుడే లేడు. అకాల వర్షానికి ముందు కోసిన వరి ధాన్యానికి బస్తా రూ. 750 కంటే ఎక్కువ పడే అవకాశం లేదు. ఉల్లి పరిస్థితి మరీ దారుణం. కేజీ రూ.2కు కూడా అమ్ముకోలేని అధ్వాన పరిస్థితిలో రైతన్న ఉన్నాడు. ఇవాళ క్వింటాల్‌కు రూ.4 వేలు కూడా రాని పరిస్థితి మిర్చి రైతుది.
వైఎస్ పోయాక..
దివంగత నేత వెళ్లిపోయిన తరువాత రైతన్న పరిస్థితి అధ్వానంగా తయారైంది.

చంద్రబాబు అన్నీ మ్యానేజ్ చేయగలుగుతారు..
ఇవాళ రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయంటే ప్రజల తరుపున ఎవరూ మాట్లాడటం లేదు. పేదవాడి కష్టాలు ఎవరికీ కనబడటం లేదు. చేసేదల్లా డ్రామాలు. ఆడేదల్లా నాటకాలు. చంద్రబాబు నాయుడుకైతే ఆ దివంగత నేత పేరు చెప్పందే ఒక్కరోజు కూడా గడవదు. కాంగ్రెస్ పెద్దలతో కుమ్మక్కై అన్నీ ఆ దివంగత నేత మీద బురదజల్లే ప్రయత్నాలే. దివంగత నేత నిజంగా గొప్ప వ్యక్తి... తాను చనిపోయిన తరువాత కూడా చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఇవాళ అన్యాయమైన ఈ రాజకీయ వ్యవస్థను చూస్తే బాధనిపిస్తోంది. చాలా బాధనిపిస్తోంది. చనిపోయిన వైఎస్సార్‌కు ఒక న్యాయమట.. బతికి ఉన్న చంద్రబాబు నాయుడుకు వేరొక న్యాయమట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్నీ మ్యానేజ్ చేయగలుగుతారు. వైఎస్సార్‌ను అప్రదిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు ఈ ఇద్దరూ కలిసి పూర్తిగా అధికార దుర్వినియోగం చేస్తున్నారు. విలువలు లేని, విశ్వసనీయత లేని, న్యాయం లేని, ధర్మం లేని రాజకీయాలు చేస్తున్నారు.
దెబ్బలు తింటున్నా.. దయ లేదు
అంగన్‌వాడీలు గత 12 నెలలుగా దెబ్బలు తింటున్నారు.. సమ్మె చేస్తున్నారు. అయినా ఈ పాలకులు వాళ్ల గురించి పట్టించుకోవడం లేదు. 104 ఉద్యోగులు గత ఆరు నెలల నుంచీ నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారి గురించీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఆదర్శ రైతులకైతే ఎనిమిది నెలల నుంచి జీతాలు అందటం లేదు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలా తయారైందీ అంటే.. ప్రజలను, ప్రజా సమస్యలను గాలికి వదిలేసింది.
1/21/2012
బాబు ఓ పిచ్చికుక్క
బాబు ఓ పిచ్చికుక్క: అంబటి రాంబాబు
బాబువి సంధి ప్రేలాపనలు: కొణతాల
వైఎస్ విగ్రహాల తొలగింపు తరం కాదు: బోస్
చెయ్యేస్తే బాబుకి రాజకీయ సమాధి: కరుణాకర్‌రెడ్డి
బాబుకు మళ్లీ కోటింగ్ తప్పదు: మారెప్ప
గుంటూరు/అనపర్తి (తూర్పుగోదావరి)/తిరుపతి/హైదరాబాద్/అనకాపల్లి (విశాఖ), న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం తీవ్రంగా మండిపడింది. ‘‘విశ్వసనీయత లేని బాబు ఎన్ని డ్రామాలాడినా ప్రజలు, రైతులు నమ్మడం లేదు. అందుకే డిప్రెషన్‌కు లోనై, తీవ్ర నిరాశా నిస్పృహలతోనే వైఎస్‌పై నీచాతినీచంగా నోరు పారేసుకున్నారు’’ అంటూ దుయ్యబట్టింది. బాబు పిచ్చికుక్క మాదిరిగా మహా నేతను తూలనాడుతున్నారంటూ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తూర్పారబట్టారు. ‘‘మామను, తోడల్లుణ్ని, చివరికి తోడబుట్టినవాణ్ని కూడా మోసగించిన ఘనుడు బాబు.
దేశంలో ఏ నాయకుడూ అనుసరించని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడు. ప్రజాదరణకు దూరమై, రెండుసార్లు వైఎస్ చేతిలో ఓడినా అధికారంపై ఇంకా ఆశ చావలేదు. వైఎస్ విషయంలో బాబు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే ప్రజలు సహనం కోల్పోయి తిరగబడటం ఖాయం. బాబు వైఖరి మారకుంటే ఓటనే ఆయుధంతో ఆయన నాలుక కోస్తాం’’ అని గుంటూరులో విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. వైఎస్ అభిమానులకు తక్షణం బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాబువి సంధి ప్రేలాపనలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త, మాజీ మంత్రి కొణతాల అనకాపల్లిలో ధ్వజమెత్తారు. ‘‘జగన్ భయం, బాలయ్య రూపంలో సొంతింటి కుంపటితో బాబుకు ఊపిరాడటం లేదు’’ అన్నారు.
జోలికెళ్తే తెలుస్తుంది: బోస్
వైఎస్ విగ్రహాల తొలగింపు బాబు తరం కాదని మాజీ మంత్రి సుభాష్ చంద్రబోస్ అన్నారు. వైఎస్ విగ్రహాల జోలికెళ్తే ప్రజాగ్రహమేమిటో తెలుస్తుందంటూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో హెచ్చరించారు. వైఎస్ విగ్రహాలపై చెయ్యేస్తే జనమే బాబుకు రాజకీయంగా సమాధి కడతారని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి తిరుపతిలో అన్నారు. ‘‘ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకుంటున్న వైఎస్ విగ్రహాలను చూసి బాబు బెంబేలెత్తుతున్నాడు. బాబు పోరుబాట డ్రామాను నమ్మే స్థితిలో జనం లేరు’’ అన్నారు. బాబుపై నక్సల్స్ దాడి చేసినా, ప్రజలు సానుభూతి చూపకపోగా, అధికారంలో నుంచి తొలగించి ఛీత్కరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు గుర్తు చేశారు. ‘‘ఈ జన్మలో అధికారంలోకి రాలేనని తెలిశాక బాబు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నాడు’’ అన్నారు. రెండు ఎన్నికల్లో ఓడించి ప్రజలు సూపర్ కోటింగిచ్చినా బాబు మారలేదని, వైఎస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వారి చేతుల్లో ఆయనకు మళ్లీ కోటింగ్ తప్పదని మాజీ మంత్రి మూలింటి మారెప్ప పేర్కొన్నారు.

తిరుపతి : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల మీద చేయి పెడితే రాష్ట్ర ప్రజలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రాజకీయ సమాధి కడతారని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. ఈ రోజు ఇక్కడ జరిగిన వార్డుబాట కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మామను వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారని ఆరోపించారు. ఎన్‌టీఆర్ చనిపోయి 16 సంవత్సరాలు కావస్తున్నా తన సొంత ఊరు నారావారిపల్లెలో ఆయన విగ్రహం పెట్టించాలనే ఆలోచన కూడా చంద్రబాబుకు రాలేదన్నారు. అన్న తీరు నచ్చక ఆయన తమ్ముడు రామ్మూర్తినాయుడు ఎన్‌టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయించారన్నారు. ప్రజల గుండెల్లో దేవుడిలా కొలువైన వైఎస్ రాజశేఖరరెడ్డిని వారి గుండెల నుంచి చెరిపేసేందుకు చంద్రబాబు నానా రకాల పాట్లు పడుతున్నారని విమర్శించారు. విద్యుత్ చార్జీలు పెంచి, రైతులపై కాల్పులు జరిపించి వారిని హత్య చేయించిన చంద్రబాబు ఇప్పుడు రైతు జపం చేస్తూ జరుపుతున్న పోరుబాట డ్రామాను జనం నమ్మే స్థితిలో లేరన్నారు. అధికారంలో ఉండగా రైతులను చంపించిన చంద్రబాబు ఇప్పుడు వారి పేరుతోనే నీచ రాజకీయాలకు పాల్పడటం సిగ్గు చేటని జిల్లా కన్వీనర్ నారాయణస్వామి విమర్శించారు. |
1/21/2012
రూ. 2,500 కోట్ల భారం నుంచి ఊరట!ఈఆర్‌సీ జారీ చేసిన ఉత్తర్వులను తప్పుపట్టిన ధర్మాసనం
రూ. 2,500 కోట్ల భారం నుంచి ఊరట! 2008-09 సర్‌చార్జీల వసూళ్లకు డిస్కంలను అనుమతిస్తూ ఈఆర్‌సీ జారీ చేసిన ఉత్తర్వులను తప్పుపట్టిన ధర్మాసనం డిస్కంల ప్రతిపాదనల్లో ఆలస్యాన్ని మాఫీ చేసే అధికారం ఈఆర్‌సీకి లేదు.. కాల వ్యవధిని పెంచే అధికారం కూడా లేదు 2008-09కి సంబంధించి డిస్కంల ప్రతిపాదనలు చెల్లుబాటు కావు.. అవి కాలపరిమితి దాటిన ప్రతిపాదనలు ఈఆర్‌సీ ఏకపక్షంగా వ్యవహరించింది: హైకోర్టు ధర్మాసనం 2009-10 సర్‌చార్జీలపై కూడా తీర్పు ప్రభావం ![]() డిస్కంలు సహేతుకమైన పద్ధతిలో చార్జీలు వసూలు చేసుకునేలా చూడాలి. కానీ ఈ కేసులో ఈఆర్‌సీ ఏకపక్షంగా వ్యవహరించింది’ అని ధర్మాసనం ఆక్షేపించింది. వాస్తవానికి ప్రతి మూడు నెలలకొకసారి డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించాలి. కానీ వెయ్యిరోజులు, ఐదు వందల రోజుల అసాధారణ జాప్యంతో ప్రతిపాదనలు సమర్పిస్తున్నాయి. ఇదే విధంగా 2008-09 సంవత్సరానికి గృహ వినియోగదారులు, పరిశ్రమలు, వాణిజ్య వర్గాల నుంచి రూ.1649 కోట్ల సర్‌చార్జీ వసూలు చేసుకునేందుకు డిస్కంలకు అనుమతినిస్తూ ఈఆర్‌సీ 2010 జూన్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ పలు కంపెనీలు, రైస్ మిల్లర్లు, తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలను విచారించిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎన్.వి.రమణ ప్రతిపాదనలు సరైన పద్ధతిలోలేవని, బహిరంగ విచారణ అనంతరం మళ్లీ ప్రతిపాదనలు సమర్పించాలని పేర్కొంటూ తీర్పునిచ్చారు. నిర్ణీతకాల వ్యవధిలోపు డిస్కంలు ప్రతిపాదనలను సమర్పించలేని పక్షంలో.. కాల వ్యవధిని పెంచే అధికారం ఈఆర్‌సీకి ఉందని పేర్కొన్నారు. దీనిని సవాలు చేస్తూ హైకోర్టు ధర్మాసనం ముందు వేర్వేరుగా 153 అప్పీళ్లు దాఖలయ్యాయి. వినియోగదారుల తరఫున న్యాయవాది డి.వి.నాగార్జునబాబు, చల్లా గుణరంజన్, దూళిపాళ్ల రవిప్రసాద్ తదితరులు వాదనలను వినిపించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. కొత్త నిబంధన ప్రకారం కాలవ్యవధి పొడిగింపు కుదరదు: ‘నిర్ణీత కాల వ్యవధిని పొడిగించే అధికారం నిబంధన 59 ప్రకారం ఈఆర్‌సీకి ఉంది. అయితే దీనిని సవరిస్తూ ప్రభుత్వం కొత్త నిబంధన (45-బి(4) తీసుకొచ్చింది. కొత్త నిబంధన ప్రకారం నిర్ణీత కాల వ్యవధిలోపు డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించకుంటే.. కాల వ్యవధి పొడిగించే అధికారం అసలు ఈఆర్‌సీకి లేదు. అందువల్ల కాల వ్యవధిని పొడిగించే అధికారం ఈఆర్‌సీకి ఉందన్న సింగిల్ జడ్జి వాదనతో మేం అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో 2008-09 సంవత్సరానికి డిస్కంలు సమర్పించిన సర్‌చార్జీల వసూలు ప్రతిపాదనలు కాలవ్యవధి దాటినవే అవుతాయి’ అని ధర్మాసనం తన తీర్పులో తేల్చి చెప్పింది. ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు 2009-10 సంవత్సరానికి రూ.1,407 కోట్లు వసూలు చేసుకునేందుకు ఈఆర్‌సీ ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులపై కూడా ప్రభావం చూపనున్నది. 2009-10 ఆర్థిక సంవత్సరపు సర్దుబాటు చార్జీల ప్రతిపాదనలను కూడా డిస్కంలు ఆలస్యంగా సమర్పించాయి. అందువల్ల రూ.1,407 కోట్లను కూడా వినియోగదారుల నుంచి వసూలు చేసుకునే అవకాశం డిస్కంలకు ఉండదు. ఫలితంగా గృహ వినియోగదారుల నుంచి యూనిట్‌కు అదనంగా 33.88 పైసలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థల నుంచి యూనిట్‌కు 78 పైసలు చొప్పున ఫిబ్రవరి నుంచి వసూలు చేయాల్సిన మొత్తం రూ.3 వేల కోట్ల సర్దుబాటు చార్జీలకు బ్రేక్ పడినట్లయింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల నేపథ్యంలో బహిరంగ విచారణ నిర్వహించిన ఈఆర్‌సీ 2008-09, 2009-10 సర్దుబాటు చార్జీలకు అనుమతినిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 2008-09 సంవత్సరానికి సంబంధించిన మొత్తం చార్జీల్లో.. గృహ వినియోగదారులకు సంబంధించిన రూ.502 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరించేలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లోనే నిర్ణయం తీసుకున్నారు. |
1/21/2012
ఓదార్పుయాత్ర 21-1-2012 శనివారం షెడ్యూల్
జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర శనివారం గుంటూరు జిల్లా మండల కేంద్రం క్రోసూరు నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
వివరాలు..
21-1-2012 శనివారం
క్రోసూరు మండలం
* క్రోసూరు నుంచి యాత్ర ప్రారంభం
* అనంతవరంలో నాలుగు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
అచ్చంపేట మండలం
* చిగురుపాడులో విగ్రహావిష్కరణ
* కోగంటివారిపాలెంలో విగ్రహావిష్కరణ
* అచ్చంపేటలో మూడు విగ్రహాల ఆవిష్కరణ, బహిరంగసభ

వైఎస్‌ఆర్‌పిసి ఎన్నికల పరిశీలకుల నియామకం
రానున్న మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవడంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరికొన్ని జిల్లాలకు ఎన్నికల పరిశీలకులను నియమించింది. చిత్తూరు జిల్లాకు డి.సి.గోవిందరెడ్డి, రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలను, నిజామాబాద్ జిల్లాకు బి.జనక్‌ప్రసాద్, కృష్ణా జిల్లాకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి, మెదక్ జిల్లాకు డాక్టర్ శ్రవణ్, మహబూబ్‌నగర్ జిల్లాకు ఎ.సుధీర్‌రెడ్డిలను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జి పీఎన్వీ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
1/20/2012
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్
Written By ysrcongress on Friday, January 20, 2012 | 1/20/2012
సర్‌చార్జిల రూపంలో ప్రజల నడ్డి విరించేందుకు ప్రయత్నించిన రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి హైకోర్టు గట్టి షాకిచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. గతంలో సింగిల్ జడ్డి ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపట్టింది. లక్షలాది మంది గృహ వినియోగదారులకు ఊరట నిచ్చేలా హైకోర్టు తీర్పు నిచ్చింది. సుమారు మూడు వేల కోట్ల రూపాయలను సర్‌చార్జీల రూపంలో వసూలు చేసేందుకు ఏపీఈఆర్‌సీ ఇచ్చిన సడలింపులను తీవ్రంగా తప్పుపట్టింది. ఈ విషయంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి హద్దులు దాటిందని ఆక్షేపించింది. మూడేళ్ల కింది సర్‌చార్జిలను ఇప్పుడెలా వసూలు చేస్తారంటూ ప్రశ్నించింది. సర్‌చార్జీల పేరుతో పెట్టిన ప్రతిపాదనకు ఏ మాత్రం పారదర్వకత లేదని ఆభిప్రాయపడింది.
1/20/2012
శ్రీనివాసరావు కుటుంబానికి జగన్ ఓదార్పు
ఆవులవారిపాలెం:గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న ఓదార్పుయాత్రలో భాగంగా ఆవులవారిపాలెంలోని ద్రోణాదుల శ్రీనివాసరావు కుటుంబాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి పరామర్శించారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే అంతులేని అభిమానాన్నిశ్రీనివాసరావు చూపించేవారు. వైఎస్ ఆకస్మిక మరణాన్ని టెలివిజన్‌లో చూసి తట్టుకోలేక .. అలాగే గోడకు చేరబడి... ప్రాణాలు వదిలారు. దాంతో నిరుపేద శ్రీనివాసరావు కుటుంబం కష్టాల్లోకి జారుకుంది.
కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని వైఎస్ జగన్ శుక్రవారం మధ్యాహ్నం పరామర్శించారు. కుటుంబ కష్టసుఖాల్ని విచారించారు. తనను కూడా ఆ ఇంటి బిడ్డగానే భావించమంటూ.. ఆ ఇంటి ఇల్లాలికి కొండంత భరోసానందించారు. తన తండ్రి కోసం ప్రాణాలు వదిలిని శ్రీనివాసరావుని అభిమానిగా అనుకోవడం లేదని.. సొంత మనిషిగా భావిస్తున్నానని జగన్ అన్నారు. ఎలాంటి సహాయానికైనా తానున్నానన్న సంగతి మరవకూడదని జగన్ గుర్తు చేశారు.

17 మంది ఎమ్మెల్యేలకు సెల్యూట్: జగన్
రైతుల కోసం అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచిన 17 మంది ఎమ్మెల్యేలకు సెల్యూట్ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లాఓదార్పుయాత్రలో భాగంగా జగన్ దొడ్లేరు గ్రామానికి చేరుకున్నారు. దోడ్లేరులో ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని అప్రతిష్టపాలు చేయడానికి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నాయన్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ చెడిపోయిందని.. దాని బాగు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మహానేత రెక్కల కష్టంతోనే కేంద్రంలోనూ, రాష్ర్టంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి తగినంత బలం లేనప్పుడు అవిశ్వాస తీర్మానం చంద్రబాబు పెట్టలేదని...ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లోవిలీనం చేశాక చంద్రబాబుకు ధైర్యం వచ్చిందని.. ఆతర్వాతనే కాంగ్రెస్ పెద్దలకు సైగ చేసి... ఆయన అవిశ్వాస తీర్మానం పెట్టారని ఆయన విమర్శించారు. |
1/20/2012
బాబు గోబెల్స్ ప్రచారం మానుకోవాలి: గోనె
వైఎస్‌ఆర్, జగన్ మోహన్ రెడ్డిలపై చంద్రబాబు గోబెల్స్ ప్రచారం మానుకోవాలని ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాషరావు హితవు పలికారు. సంస్కారహీనంగా మాట్లాడుతున్న బాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు.
ప్రజలు అభిమానంతో వైఎస్ విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటే వాటిని బాబు రాజకీయ చేస్తున్నారని గోనె విమర్శించారు. 2014లో అధికారమంటూ పగటి కలలు కంటున్న చంద్రబాబు రానున్న ఉపఎన్నికల్లో తన స్థానమేంటో నిరూపించుకోవాలని గోనె సవాల్ విసిరారు.

క్రోసూరు నుంచి వైఎస్ జగన్ ఓదార్పు
గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర ప్రజల ప్రేమ, ఆదరణ మధ్య విజయవంతంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం క్రోసూరు నుంచి వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను ప్రారంభించారు. పెదపాలెంలో చిలకా మరియమ్మ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. కొండూరులో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
దొడ్లేరులో రెండు విగ్రహాల ఆవిష్కరణ, ఆవులవారిపాలెంలో ద్రోణాదుల శ్రీనివాసరావు కుటుంబానికి ఓదార్పు, హస్సానాబాద్‌లో విగ్రహావిష్కరణ, షేక్ గారపాటి గాలిసా కుటుంబానికి ఓదార్పు, గుడిపాడులో నాలుగు విగ్రహాలను జగన్ ఆవిష్కరించనున్నారు.ఓదార్పుయాత్రలో భాగంగా వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం అచ్చంపేట మండలం పెదపాలెంలో మహానేత మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన చిలకా మరియమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మంచాన పడ్డ మరియమ్మ మరణించింది. ఆమెకు ముగ్గురు కుమారులు. వీరంతా కూలిపనులతోనే జీవనం సాగిస్తున్నారు. మరియమ్మ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన జగన్ వారికి అన్నివిధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

వీణ-వాణిల పోషణపై అటు తల్లిదండ్రులు, ఇటు ప్రభుత్వం లెక్కలు
|
1/20/2012
భారం విద్యుత్ వినియోగదారులపై ఇక ఏ నెలకానెల
*విద్యుత్ సర్దుబాటు చార్జీలపై సీఈఆర్‌సీ ఆదేశాలు
*డిస్కంల నుంచి నెలవారీగా ప్రతిపాదనలు తీసుకోవాలని ఈఆర్‌సీలకు సూచన
*డిస్కంలు సమర్పించకుంటే సుమోటోగా తీసుకోవాలని స్పష్టీకరణ
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్‌ఎస్‌ఏ) భారం విద్యుత్ వినియోగదారులపై ఇక ఏ నెలకానెల పడనుంది. ఇందుకు సంబంధించి కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ) కొద్దిరోజుల క్రితం రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండళ్లకు (ఈఆర్‌సీలు) ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంలు) నుంచి ఇకపై నెలవారీగా ప్రతిపాదనలు తీసుకోవాలని సూచించింది. ఒకవేళ డిస్కంలు సకాలంలో ప్రతిపాదనలు సమర్పించకపోతే.... సుమోటాగా ప్రతిపాదనలు తీసుకుని ఆదేశాలు జారీ చేయాలని కూడా సీఈఆర్‌సీ ఆదేశించింది.
ప్రస్తుతం సర్దుబాటు చార్జీల ప్రతిపాదనలను మూడు నెలలకు ఒకసారి డిస్కంలు సమర్పిస్తున్నాయి. ఉదాహరణకు.... ఏప్రిల్-జూన్ త్రైమాసికపు ప్రతిపాదనలను జూలై చివరినాటికి సమర్పిస్తున్నాయి. అయితే సీఈఆర్‌సీ తాజా ఆదేశాల నేపథ్యంలో... ఏప్రిల్ నెలకు సంబంధించిన సర్దుబాటు చార్జీల ప్రతిపాదనలను డిస్కంలు మే మొదటి వారంలోనే సమర్పించాల్సి ఉంటుంది. వీటిపై మే చివరినాటికి ఈఆర్‌సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మేరకు సర్దుబాటు భారం జూన్ నెల బిల్లులోనే వినియోగదారులపై పడుతుంది. ఈ విధంగా ఎప్పటికప్పుడు అంటే ఏ నెలకానెల బిల్లులో సర్దుబాటు చార్జీలు విధిస్తారన్నమాట.
పొంచి ఉన్న మరో రూ. 5 వేల కోట్ల భారం
రెండు రోజుల క్రితం 2008-09, 2009-10 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన రూ.3 వేల కోట్ల సర్దుబాటు భారాన్ని ఈఆర్‌సీ రాష్ట్ర వినియోగదారులపై మోపింది. ఫలితంగా ఫిబ్రవరి నుంచి గృహ వినియోగదారులపై యూనిట్‌కు 33.88 పైసలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపై యూనిట్‌కు 78.38 పైసలు చొప్పున భారం పడనుంది. వీటితో పాటు మరో రూ.5,238 కోట్ల భారం కూడా పొంచి ఉంది.
2010-11 ఆర్థిక సంవత్సరంతో పాటు 2011-12 ఆర్థిక సంవత్సరంలో రెండు త్రైమాసికాలకు సంబంధించిన సర్దుబాటు చార్జీల ప్రతిపాదనలను డిస్కంలు ఇప్పటికే ఈఆర్‌సీకి సమర్పించాయి. వీటిపై కూడా ఈఆర్‌సీ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఫలితంగా యూనిట్‌కు సగటున 50 పైసల మేరకు అదనంగా వినియోగదారులపై భారం పడనుంది. గృహ వినియోగదారులపై సుమారు రూ.1,600 కోట్ల మేరకు భారం పడనుంది.
*డిస్కంల నుంచి నెలవారీగా ప్రతిపాదనలు తీసుకోవాలని ఈఆర్‌సీలకు సూచన
*డిస్కంలు సమర్పించకుంటే సుమోటోగా తీసుకోవాలని స్పష్టీకరణ
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్‌ఎస్‌ఏ) భారం విద్యుత్ వినియోగదారులపై ఇక ఏ నెలకానెల పడనుంది. ఇందుకు సంబంధించి కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ) కొద్దిరోజుల క్రితం రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండళ్లకు (ఈఆర్‌సీలు) ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంలు) నుంచి ఇకపై నెలవారీగా ప్రతిపాదనలు తీసుకోవాలని సూచించింది. ఒకవేళ డిస్కంలు సకాలంలో ప్రతిపాదనలు సమర్పించకపోతే.... సుమోటాగా ప్రతిపాదనలు తీసుకుని ఆదేశాలు జారీ చేయాలని కూడా సీఈఆర్‌సీ ఆదేశించింది.
ప్రస్తుతం సర్దుబాటు చార్జీల ప్రతిపాదనలను మూడు నెలలకు ఒకసారి డిస్కంలు సమర్పిస్తున్నాయి. ఉదాహరణకు.... ఏప్రిల్-జూన్ త్రైమాసికపు ప్రతిపాదనలను జూలై చివరినాటికి సమర్పిస్తున్నాయి. అయితే సీఈఆర్‌సీ తాజా ఆదేశాల నేపథ్యంలో... ఏప్రిల్ నెలకు సంబంధించిన సర్దుబాటు చార్జీల ప్రతిపాదనలను డిస్కంలు మే మొదటి వారంలోనే సమర్పించాల్సి ఉంటుంది. వీటిపై మే చివరినాటికి ఈఆర్‌సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మేరకు సర్దుబాటు భారం జూన్ నెల బిల్లులోనే వినియోగదారులపై పడుతుంది. ఈ విధంగా ఎప్పటికప్పుడు అంటే ఏ నెలకానెల బిల్లులో సర్దుబాటు చార్జీలు విధిస్తారన్నమాట.
పొంచి ఉన్న మరో రూ. 5 వేల కోట్ల భారం

2010-11 ఆర్థిక సంవత్సరంతో పాటు 2011-12 ఆర్థిక సంవత్సరంలో రెండు త్రైమాసికాలకు సంబంధించిన సర్దుబాటు చార్జీల ప్రతిపాదనలను డిస్కంలు ఇప్పటికే ఈఆర్‌సీకి సమర్పించాయి. వీటిపై కూడా ఈఆర్‌సీ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఫలితంగా యూనిట్‌కు సగటున 50 పైసల మేరకు అదనంగా వినియోగదారులపై భారం పడనుంది. గృహ వినియోగదారులపై సుమారు రూ.1,600 కోట్ల మేరకు భారం పడనుంది.
Subscribe to:
Posts (Atom)