29 January 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Ambati Comments on CBI

Written By ysrcongress on Saturday, February 4, 2012 | 2/04/2012

కృష్ణదాస్ కుమారుడి వివాహానికి జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం విశాఖపట్నంలో ఎమ్మెల్యే కృష్ణదాస్ కుమారుడి వివాహానికి హాజరయ్యారు. నూతన దంపతులను ఆయన ఆశీర్వదించారు. ఈ వివాహ కార్యక్రమానికి ఎంపీ మేకపాటి రాజగోపాల్ కూడా హాజరయ్యారు.

konathala press meet

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అధికార యంత్రాంగం అభద్రతాభావంలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఐఏఎస్‌లు రాజకీయ బలిపశువులుగా మారారని అన్నారు. వేధింపులపై ఐఏఎస్‌లు ముఖ్యమంత్రిని కలవడం రాష్ట్రంలో ఇదే తొలిసారని గుర్తు చేశారు. సీబీఐ దర్యాప్తు సాగుతున్న తీరు పట్ల కొణతాల అభ్యతరం వ్యక్తం చేశారు.

Ys Jagan Tribute to Satyanarayana Raju

నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు తండ్రి సత్యనారాయణరాజు భౌతికకాయానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ శనివారం మధ్యాహ్నం శ్రద్ధాంజలి ఘటించారు. తండ్రిని పోగొట్టుకున్న ఎమ్మెల్యే ప్రసాదరాజును జగన్ పరామర్శించారు. పిల్లీ సుభాష్‌చంద్రబోస్, మేకా శేషుబాబు ఇతర నేతలు జగన్ వెంట ఉన్నారు. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యనారాయణరాజు మృతి చెందారు. పొలం నుంచి ఇంటికి వెళ్తున్న ఆయన రోడ్డు దాటుతుండగా అంతర్వేది నుంచి వస్తున్న నరసాపురం డిపో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆయన తలకు తీవ్ర గాయమై దుర్మరణం చెందారు.

YSRCP CONVENERS

Jagan East Godavari Tour





మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నదానికి అనుగుణంగా ‘బిజినెస్ రూల్’ ప్రకారం జీవోలను


రాష్ర్ట ఎన్నికల సంఘం కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డిని తాత్కాలిక దర్యాప్తు కార్యాలయం దిల్‌కుశ అతిథి గృహంలో సీబీఐ అధికారులు శుక్రవారం కూడా విచారించారు. ఉదయం 10.30 నుంచి మూడు గంటలపాటు విచారణ కొనసాగింది. విచారణ అనంతరం రమాకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవోలకు సంబంధించి సీబీఐ అధికారులు వివరణ అడిగారని, ఆయా రికార్డులను పరిశీలించిన అనంతరం స్పష్టమైన వివరాలను తెలియజేశానని చెప్పారు. మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నదానికి అనుగుణంగా ‘బిజినెస్ రూల్’ ప్రకారం జీవోలను జారీచేసినట్లు స్పష్టంచేశానన్నారు. 

జీవోలు ఇచ్చేందుకు తనపై ఎవరి ఒత్తిడీలేదని తెలిపానని మరోమారు పునరుద్ఘాటించారు. మరికొన్ని పరిశీలించాల్సిన జీవోలు ఉన్నందునే సీబీఐ అధికారులు శుక్రవారం మళ్లీ రావాలని కోరారని, అన్ని జీవోలకు సంబంధించి వివరణ ఇవ్వడం పూర్తయిందని తెలిపారు. జగన్ సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ అధికారులు తనను ఏమీ అడగలేదని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీబీఐ విచారణకు మళ్లీ వస్తారా?... అంటూ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘సీబీఐ అధికారులు మాత్రం మళ్లీ రమ్మని కోరలేదు. నేను మళ్లీ విచారణకు రావాలని మీరు కోరుకుంటున్నారా?’ అని మీడియాను ఉద్దేశించి చమత్కరించారు. సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో విచారణ కొనసాగింది.

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే ప్రసాదరాజు తండ్రి మృతి

యలమంచిలి (పశ్చిమగోదావరి), న్యూస్‌లైన్: నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు తండ్రి సత్యనారాయణరాజు (62) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ సంఘటన యలమంచలి మండలం కలగంపూడిలో శుక్రవారం రాత్రి జరిగింది. పొలం నుంచి ఇంటికి వెళ్తున్న ఆయన రోడ్డు దాటుతుండగా అంతర్వేది నుంచి వస్తున్న నరసాపురం డిపో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆయన తలకు తీవ్ర గాయమై దుర్మరణం చెందారు. 2009లో కాజ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన సత్యనారాయణరాజుకు భార్య వెంకట సరోజిని, కుమారుడు ప్రసాదరాజు, కుమార్తె రాధిక ఉన్నారు. ప్రమాద విషయం తెలియగానే తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలో ఉన్న ప్రసాదరాజు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తదితరులు ప్రసాదరాజును పరామర్శించారు.

మూడు వేల కోట్లతో స్థిరీకరణ నిధి

వచ్చే సువర్ణయుగంలో నేతన్నలు, వృద్ధుల పింఛన్‌ను రూ.700కు పెంచుతాం
ప్రతి నేత కార్మికుడికీ రూ.లక్ష చొప్పున వడ్డీ లేని రుణాలిస్తాం
దేశంలో ఎక్కడా లేనంత మంచి పాలసీని నేత కార్మికులకు అమలు చేస్తాం
నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ పాలకులకు కనపడడం లేదా?
రుణ మాఫీ నిధులు, ఫీజు బకాయిలు విడుదలకు 12 నుంచి ధర్మవరంలో దీక్ష
మూడు రోజులపాటు... 48 గంటల దీక్ష చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా

రాజమండ్రి, న్యూస్‌లైన్: చేనేత కార్మికుల కష్టాలు తీరిపోయే రోజు త్వరలోనే వస్తుందని, రాబోయే ఆ సువర్ణయుగంలో 50 ఏళ్లు నిండిన నేతన్నలకు, వారితోపాటే వృద్ధులకు పింఛన్‌ను రూ.200 నుంచి రూ.700కు పెంచుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రతి నేత కార్మికుడికీ రూ.లక్ష చొప్పున వడ్డీ లేని రుణాలిస్తామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరుగుతున్న అఖిల భారత దేవాంగ మహాసభల వేదికపై జగన్ ఈ హామీలిచ్చారు. మూడురోజులపాటు సాగే ఈ సభలకు తొలిరోజు శుక్రవారం జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

ఇక్కడికి రాకముందు ఒక విషయం నా దృష్టికి వచ్చింది. ఈ రోజు (శుక్రవారం) ధర్మవరంలో ఇద్దరు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిసింది. ఇవాళ వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలోకి వెళుతున్నారంటే.. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? లేదా? అన్న సంశయం కలుగుతోంది. చేనేత కార్మికుల రుణమాఫీ కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రెండోసారి అధికారంలోకి వచ్చాక రూ.312 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. ఆయన మరణించాక నేతన్నలను పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ఆయన కేటాయించిన రూ.312 కోట్లలో కనీసం రూ.100 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వానికి అసలు సిగ్గుందా? లేదా అన్నది అర్థంకావడం లేదు. ఈ వ్యక్తిగత రుణాలను మాఫీ చేసి, రూ.లక్ష వడ్డీ లేని రుణాన్ని ఇచ్చి ఉంటే ప్రతి చేనేత కార్మికుడు ఇది నా ప్రభుత్వం అని కాలర్ ఎగరేసి చెప్పుకునేవాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వారిని గాలికి వదిలేసింది. మనసున్న మారాజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ చేనేత కార్మికుల బతుకులు మారతాయి. వైఎస్ మాత్రమే అలా మనసున్న మారాజులా ఆలోచించారు.

ధర్మవరంలో మూడు రోజుల దీక్ష

చేనేత కార్మికులను పట్టించుకోని ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా, నేతన్నలకు మద్దతుగా ధర్మవరంలో ఈ నెల 12 నుంచి మూడురోజులపాటు 48 గంటల నిరాహార దీక్ష చేస్తానని ప్రకటిస్తున్నా. మరికొద్ది రోజుల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నందున వైఎస్సార్ ప్రకటించిన రూ.312 కోట్ల రుణ మాఫీ నిధులను విడుదల చేయాలంటూ ఈ దీక్ష ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. పేద విద్యార్థుల చదువుల కోసం వైఎస్ రూపొందించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నీరుగారుస్తోంది. ఆ బకాయిలు కూడా తక్షణం విడుదల చేసే విధంగా దీక్ష ద్వారా ఒత్తిడి తెస్తాం. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్టిజన్ కార్డులను చేనేత కార్మికులకు అందజేయగా, అవి చెత్తబుట్టలో వేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసింది. వచ్చే సువర్ణయుగంలో.. ఆ కార్డులున్న ప్రతిఒక్కరూ గర్వంగా చెప్పుకునేలా, వాటిని తిరిగి పునరుద్ధరించి వైఎస్ గర్వపడేలా చర్యలు తీసుకుంటాం. ఆర్టిజన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.లక్ష వడ్డీలేని రుణం అందించేలా కృషి చేస్తాం. వచ్చే సువర్ణయుగంలో.. దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలోనూ లేని మంచి పాలసీని చేనేత కార్మికుల కోసం రూపొందిస్తాం.

తరలివచ్చిన నేతలు: ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, దేవాంగుల కులగురువు, హంపి హేమకూట గాయత్రీ పీఠాధిపతి దయానందపురి మహాస్వామీజీ, దేవాంగ మహాసభల నిర్వాహక కమిటీ అధ్యక్షులు బొమ్మన రాజ్‌కుమార్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యేలు వడ్డి వీరభద్రరావు, చిర్ల జగ్గిరెడ్డి, కుడుపూడి చిట్టబ్బాయి, వరుపుల సుబ్బారావు, పెండెం దొరబాబు, పాతపాటి సర్రాజు తదితరులు పాల్గొన్నారు.

మూడు వేల కోట్లతో స్థిరీకరణ నిధి: జగన్

రైతులకు ఎప్పుడు ఏ కష్టమొచ్చినా తక్షణమే స్పందించి ఆదుకునేందుకు వీలుగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3 వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని జగన్ చెప్పారు. శుక్రవారం అమలాపురంలో పార్టీ నేత కుడుపూడి చిట్టబ్బాయి నివాసంలో తనను కలిసిన రైతు సంఘాల నేతలకు ఈ మేరకు హామీనిచ్చారు. ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ కూడా ప్రవేశపెడతామని వారికి చెప్పారు.

మరి మంత్రులను ఎందుకు విచారించడం లేదు?


ముఖ్యమంత్రితో భేటీ అయిన 60 మందికిపైగా ఐఏఎస్‌లు
తమను అవినీతిపరులుగా చిత్రీకరిస్తూ సీబీఐ వేధిస్తోందని ఆగ్రహం
కేబినెట్ నిర్ణయాలను అమలు చేస్తే మమ్మల్నెలా తప్పుబడతారని ప్రశ్న

కేబినెట్ నిర్ణయాలు అమలు చేయడమే మా బాధ్యత.. మరి మంత్రులను ఎందుకు విచారించడం లేదు?
దర్యాప్తు జరుగుతున్న ఆ ప్రాజెక్టులను రద్దయినా చేయండి లేదా సమర్థించండి
సీఎంకు తేల్చిచెప్పిన ఐఏఎస్ అధికారులు... ఈ పరిణామం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి
బిజినెస్ రూల్స్ ఎలా ఉంటాయో తెలియకుండానే సీబీఐ దర్యాప్తు సాగుతోంది..
పీపీపీ విధానంపై కూడా సీబీఐకి కనీస అవగాహన లేనట్టుగా ఉంది
విచారణల పేరుతో పిలిస్తే.. పత్రికల్లో ఫొటోలు వస్తే.. మా కుటుంబసభ్యులు బాధపడరా?
సీనియర్ అధికారులను విచారించేటప్పుడు గౌరవమర్యాదలుండాలి.. ఇక్కడవేమీ జరగడం లేదు
అధికారులను న్యాయపరంగా ప్రభుత్వమే బలపరచాలి.. మొత్తం ఆరు డిమాండ్లతో కిరణ్‌కు వినతిపత్రం
తక్షణం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి.. సరిగా స్పందించని సీఎం కిరణ్!
అరెస్టు చేయడం అంటే శిక్ష కాదని, బెయిల్ తీసుకోవచ్చునని ముఖ్యమంత్రి వ్యాఖ్యానం!
ఐఏఎస్ అధికారుల సంఘం అసంతృప్తి.. రేపు జనరల్ బాడీలో భవిష్యత్ కార్యాచరణ 

సహాయ నిరాకరణ, సామూహిక సెలవు యోచన!

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో వివిధ అంశాలకు సంబంధించి సీబీఐ దర్యాపు చేస్తున్న తీరుపై ఐఏఎస్‌ల సంఘం తీవ్రంగా మండిపడింది. కీలక నిర్ణయాలు చేసే మంత్రులను, మంత్రివర్గాన్ని వదిలేసి అధికారులను బలిపశువులను చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎస్ అధికారులను దోషులుగా చిత్రీకరిస్తున్న తీరు, విచారణల పేరుతో వారి కుటుంబాలను మనోవేదనకు గురిచేస్తున్న తీరును నిరసించింది. ‘‘సీబీఐ విచారిస్తున్న కేసుల్లోని ప్రాజెక్టులను రద్దు చేయండి... లేదంటే ఆ ప్రాజెక్టుల నిర్ణయాలను సమర్థించండి...’’ అంటూ ఐఏఎస్‌ల సంఘం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అల్టిమేటం ఇచ్చింది. సీబీఐ విచారణలో ఉన్న ఎస్‌ఈజెడ్‌లు, పోర్టుల ఏర్పాటు, ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, గనుల కేటాయింపులతో పాటు మరికొన్ని పరిశ్రమలకు కేటాయించిన భూములను రద్దు చేయాలని, లేదంటే సమర్థించాలని స్పష్టం చేసింది. సీబీఐ దర్యాప్తు పేరుతో అధికారులను అవినీతిపరులుగా చిత్రీకరిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం ఉదయం ఐఏఎస్‌ల సంఘం కార్యవర్గం సమావేశమై సీబీఐ దర్యాపు తీరుతెన్నులు, మంత్రులను వదిలేసి అధికారులనే టార్గెట్ చేస్తున్న తీరుపై సుదీర్ఘంగా చర్చించింది. సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో దాదాపు 60 మందికి పైగా ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి తో సమావేశమై సీబీఐ దర్యాప్తు తీరుపై తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐఏఎస్‌ల సంఘం ఆరు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు సమర్పించింది. సీబీఐ దర్యాప్తు తీరు.. అధికారులను ఏ విధంగా బలిపశువులను చే స్తున్నారు, అధికారులు కేబినెట్ నిర్ణయాలను అమలు చేస్తే వారిని ఏ విధంగా తప్పుపడతారనే విషయాలపై గంటకు పైగా సీఎంకు వివరించింది. సీబీఐపై ఐఏఎస్‌ల సంఘం నిరసన గళం విప్పడం, ఏకంగా సీఎంను కలిసి ఫిర్యాదు చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. 


‘అధికారుల పాత్ర ఉంటే వెంటనే అరెస్ట్ చేయమనండి. ఇలా విచారణల పేరుతో పిలవడమేంటి? పత్రికల్లో ఫొటోలు రావడం ఏమిటి? మాకు కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు ఉండరా? వారెంత మనోవేదనకు గురవుతారు? బిజినెస్ రూల్స్ ప్రకారమే ప్రభుత్వంలో అన్నీ జరుగుతాయి. కేబినెట్ నిర్ణయాలనే అధికారులు అమలు చేస్తారు. అలాంటిది కేబినెట్‌ను వదిలేసి సీబీఐ.. అధికారులను టార్గెట్ చేయడంలోని ఆంతర్యం ఏమిటి’ అని పలువురు ఐఏఎస్‌లు సీఎంను ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో అమల్లో భాగంగా కొన్ని నిర్ణయాలను తీసుకుంటుందని, ప్రజా తీర్పుతో ఎన్నికైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని, ఈ విషయంపై కనీస అవగాహన లేకుండా సీబీఐ విచారణ జరుగుతోందని వివరించారు. బిజినెస్ రూల్స్ ఎలా ఉంటాయో కూడా అవగాహన లేకుండా సీబీఐ దర్యాప్తు సాగుతోందని వారు పేర్కొన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో చేపట్టే ప్రాజెక్టులు ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించేందుకేనని.. సీబీఐ తీరు చూస్తుంటే దీనిపై కూడా అవగాహన లేనట్టుగా ఉందనిచెప్పారు. సీఎంను కలిసిన అనంతరం ఐఏఎస్‌ల సంఘం ఉపాధ్యక్షుడు ప్రశాంత మహాపాత్ర మీడియాతో మాట్లాడారు. దర్యాప్తులో భాగంగా సీబీఐ కేవలం అధికారులనే వేధిస్తోందన్నారు. ‘సీనియర్ అధికారులను సాక్షిగా విచారిస్తున్నారు. విచారణ తీరులో కూడా సరైన గౌరవ మర్యాదలుండాలి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలి, ఇవేవీ ఇక్కడ జరగడం లేదు’ అని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు ఏ విధంగా పనిచేయగలరని ప్రశ్నించారు. వెంటనే జోక్యం చేసుకుని అధికారులు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సీఎంను కోరామని, పరిశీలిస్తామని సీఎం చెప్పారని మహాపాత్ర వివరించారు. 

సరిగా స్పందించని సీఎం! 

తమ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించిన తీరు ఐఏఎస్‌లను ఆగ్రహానికి గురిచేసినట్లు సమాచారం. సీబీఐ దర్యాప్తు సాగుతున్న తీరుపై ఐఏఎస్‌లు ఫిర్యాదు చేసినప్పుడు... అరెస్ట్ చేయడమంటే శిక్షకాదని, బెయిల్ తీసుకోవచ్చునని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తప్పు చేయని అధికారులకు అన్యాయం జరగనీయబోమని పేర్కొన్నట్లు సమాచారం. కేబినెట్ నిర్ణయాలనే అధికారులు అమలు చేస్తున్నారని, ఆ నిర్ణయాలు తప్పంటే రద్దు చేయాలని ఐఏఎస్‌లు కోరడంపై సీఎం స్పందిస్తూ న్యాయపరమైన సలహా తీసుకుంటామని పేర్కొన్నట్లు తెలిసింది. సీఎం స్పందన పట్ల అసంతృప్తితో ఉన్న ఐఏఎస్ అధికారుల సంఘం ఆదివారం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది.

సహాయ నిరాకరణ...సామూహిక సెలవు! 

సీఎం నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో తమ నిరసనను ఉధృతం చేయాలని ఐఏఎస్‌లు భావిస్తున్నట్టు సమాచారం. సర్వీసులో ఎంతోకాలంగా కాపాడుకున్న పరుపు ప్రతిష్టలను మంటగలుపుతున్న సీబీఐ విషయంలో ముఖ్యమంత్రి నుంచి కనీస మద్దతు లభించకపోవడంతో.. అవసరమైతే సహాయ నిరాకరణకు దిగాలన్న ఆలోచనలో ఐఏఎస్‌ల సంఘం ఉన్నట్టు సమాచారం. సామూహికంగా క్యాజువల్ సెలవు పెట్టాలనే యోచనలో కూడా ఐఏఎస్‌ల సంఘం ప్రతినిధులు ఉన్నారు. ఈ విషయాలపై ఆదివారం జరిగే సర్వసభ్య సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం తమకు సహకరించనప్పుడు మంత్రులు చెప్పే పనులకు తామెందుకు సహకరించాలని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.

సుప్రీం తీర్పే ఆదర్శంగా...

సీబీఐ విచారణ చేస్తున్న 2 జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో 122 లెసైన్సులను సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో.. ఆ తీర్పును స్ఫూర్తిగా చేసుకునే ఐఏఎస్‌లు ‘ప్రాజెక్టులను రద్దు చేయండి లేదా సమర్థించండి’ అంటూ సీఎంను డిమాండ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసుల్లోని పలు ప్రాజెక్టులకు సంబంధించిన నిర్ణయాలన్నీ తమ వల్లే జరిగినట్టుగా సీబీఐ చిత్రీకరించడంపై ఐఏఎస్‌లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రంలో జరిగిన పలు ఒప్పందాలు, ఇచ్చిన అనుమతుల్లో అక్రమాలు జరిగినట్టుగా సీబీఐ భావిస్తున్నందున వీటిపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావలసిన అవసరం ఉందని వారంటున్నారు. 

సీఎంను కలిసిన వారిలో సీనియర్ ఐఏఎస్‌లు

సీఎంను కలిసినవారిలో సీనియర్ అధికారులు ఐవైఆర్ కృష్ణారావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, వసుధా మిశ్రా, రాజీవ్ రంజన్ మిశ్రా, కృష్ణయ్య, ప్రేమ్‌చంద్రారెడ్డి, ఆదిత్యనాథ్ దాస్, అజయ్ మిశ్రా, పూనమ్ మాలకొండయ్య, అజయ్ జైన్, మహాపాత్ర, వినయ్‌కుమార్, శేఖర్‌బాబు, కృష్ణబాబు, శాలినీమిశ్రా, వినోద్‌కుమార్ అగర్వాల్, రేమాండ్ పీటర్, గుల్జార్, సునీల్‌శర్మ, పీషీ జోషి, ప్రవీణ్‌ప్రకాశ్, శ్యాంబాబు, జయలక్ష్మి, రాజేశ్వర్ తివారీ, సీవీఎస్‌కే శర్మ, శామ్యూల్, విజయకుమార్, అనంతరాము, నీరబ్ కుమార్ ప్రసాద్, ఎంజీ గోపాల్, నవీన్ మిట్టల్, చంద్రవదన్, కాడ్మియల్, శివశంకర్, హీరాలాల్ సమారియా, రమేష్‌కుమార్ తదితరులు ఉన్నారు. 

ఐఏఎస్‌ల ఆరు డిమాండ్లు... 

* ప్రభుత్వం తీసుకున్న కీలకమైన ఆర్థిక అంశాలతో కూడిన నిర్ణయాలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ నిర్ణయాలు సంబంధిత రాజకీయ నిర్వాహకులకు తెలియకుండా తీసుకున్నవి కాదు. సంబంధిత మంత్రులను కాదని అధికారులు ఏ నిర్ణయాలూ తీసుకుని అమలు చేయలేరు. ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను మంత్రిమండలి, మంత్రుల ఆమోదంతోనే అమలు చేశాం. వారికి తెలియకుండా ఏదీ చేయలేదు. అయినప్పటికీ సీబీఐ రాజకీయ నేతలను వదిలిపెట్టి.. అధికారులనే బలిపశువులను చేస్తోంది.

* ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో అక్రమాలు జరిగాయని వేలెత్తి చూపిస్తున్నారు. ఈ నిర్ణయాలకు సంబంధించిన పత్రాలను ప్రాసెస్ చేసిన అధికారులను ప్రశ్నిస్తున్నారు. అయితే అక్రమ నిర్ణయాలని భావిస్తున్న సంబంధిత ప్రతిపాదనలను మాత్రం ఇప్పటివరకు వెనక్కు తీసుకోలేదు. అక్రమం అంటున్న నిర్ణయాల ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులు.. ఇంకా లబ్ధి పొందుతూనే ఉన్నారు. కానీ ఆ పత్రాలను ప్రాసెస్ చేసిన ఐఏఎస్ అధికారులను నేర విచారణ, ప్రాసిక్యూషన్‌లతో వేధింపులకు గురి చేస్తున్నారు. ఒక పక్క అక్రమం అంటూ దర్యాప్తు చేస్తున్న నిర్ణయాలనే అమలు చేస్తూ ఉండటం తగదు. ప్రభుత్వం అత్యవసరంగా వాటిని సమీక్షించి ఆ నిర్ణయాలను రద్దు చేయడమో లేదా వాటిని సమర్థించడమో చేయాలి.

*విధి నిర్వహణలో భాగంగా బాధ్యతలు నిర్వర్తించిన అధికారులు ఇప్పుడు నేర విచారణ ఎదుర్కొంటున్నారు. అటువంటి వారిని ప్రభుత్వమే న్యాయపరంగా బలపరచాలి. ప్రభుత్వ నిర్ణయాల్లో భాగంగానే అధికారులు పని చేసినందున న్యాయసేవల వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలి.

ఐఏఎస్ అధికారులపై నేర విచారణ చేయడానికి ముందు వారు పనిచేస్తున్న ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిందిగా సీబీఐకి సూచించాలి. ప్రాసిక్యూషన్‌కు ముందే డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్, కేంద్ర ప్రభుత్వం అనుమతులను అదనంగా తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక అనుమతి ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాదు. 

* సీబీఐ విచారణ బృందంలో బిజినెస్ రూల్స్, ప్రభుత్వం ఏ విధంగా విధాన నిర్ణయాలు తీసుకుంటుందనే విషయాలు తెలిసిన అనుభవ జ్ఞులైన అధికారులను సభ్యులుగా చేర్చాలి. ఆ నిర్ణయాల్లో అధికారులకు ఉన్న దురుద్దేశాలు, వారి పాత్ర ఎంతవరకు ఉందనే విషయాల ఆధారంగా క్రమశిక్షణ లేదా కఠిన చర్యలను విభజించాలి. 

* సాక్షులుగా మంత్రులను వారి ఇళ్లకు వెళ్లి సీబీఐ గౌరవంగా ఎలా విచారిస్తోందో.. అదే తరహాలోనే సీనియర్ అధికారులను, సంబంధిత అధికారులను వారి చాంబర్లలోనే విచారించాలి.

వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శనివారం నాటి పర్యటనలో మార్పులు

యువనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శనివారం నాటి పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు తండ్రి శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. దీంతో ప్రసాదరాజు కుటుంబాన్ని పరామర్శించడానికి శని వారం పాలకొల్లు వెళ్లాలని జగన్ నిర్ణయించారు. ఆయన శనివారం ఉదయం నగరంలోని పోర్టు కళావాణి స్టేడియంలో జరిగే శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు కుమారుడు, నర్సీపట్నం శాసనసభ్యురాలు బోళెం ముత్యాలపాప కుమార్తె వివాహానికి హాజరవుతారు. నగరంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

అనంతరం నేరుగా న ర్సాపురం ఎమ్మెల్యే స్వగ్రామం పాలకొల్లుకు బయల్దేరి వెళ్తారు. అనుకోని ఈ పరిణామాలతో జగన్ పాయకరావుపేట నియోజకవర్గంలో నిర్వహించ తలపెట్టిన పర్యటన, రోడ్డుషోను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి నగరంలో శనివారం ఉదయం వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం పాయకరావుపేట పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే తాజా పరిణామాలతో పాయకరావుపేట పర్యటనను వాయిదా వేశారు. జగన్ పాయకరావుపేట నియోజకవర్గంలో తిరిగి పర్యటించే తేదీని త్వరలో ప్రకటిస్తారు.

వైఎస్సార్ సీపీ మహిళా కన్వీనర్ల నియామకం

Written By ysrcongress on Friday, February 3, 2012 | 2/03/2012

వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం విజయవాడ సిటీ కన్వీనర్‌గా ఎల్.సునీత, నెల్లూరు జిల్లా కన్వీనర్‌గా బండ్లమూడి అనితను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలా కుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

YS Jagan 48 Hours Deeksha at Dharmavaram

చేనేత సమస్యలపై 48 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. రాజమండ్రి దేవాంగుల సభలో వైఎస్ జగన్మాట్లాడుతూ.. చేనేతల కోసం ఉత్తమ విధానాన్ని రూపొందిస్తామన్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 12 తేదిన ధర్మవరంలో నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.

రీజన్సీ ఫ్యాక్టరీని ప్రభుత్వం తెరిపించాలి: జగన్

యానాంలోని రీజన్సీ సిరామిక్స్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి డిమాండ్ చేశారు. కార్మికులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్ర ప్రజలకు పొరుగు రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తోందని ఆయన ప్రశ్నించారు. 30 ఏళ్లుగా నడుస్తున్న ఫ్యాక్టరీకి లాకౌట్ ఎలా ప్రకటిస్తారని ఆయన అడిగారు. 

యానాం కార్మికులకు న్యాయం జరగాలన్నది తన ఆకాంక్ష అన్నారు. వారికి తోడుగా, అండగా తాము ఉంటామని చెప్పారు. వారికి న్యాయం జరుగకపోతే తమ పార్టీ తరపున ధర్నా చేసేందుకు కూడా వెనుకాడం అన్నారు.యానాం పోలీసులపై చర్యకు డిమాండ్ చేయాలన్నారు. మంచి న్యాయవాదుల ను పెట్టుకోమని కార్మికులకు సలహా ఇచ్చారు. మంచి న్యాయవాదులను సమకూర్చే బాధ్యత తాము తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్ అనుబంధ సంఘాల కన్వీనర్లు

 వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న మైనారిటీ విభాగం, సేవాదళం, సాంసృ్కతిక విభాగం జిల్లా శాఖలకు కన్వీనర్ల నియామకం జరిగింది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సంబంధిత విభాగాల రాష్ట్ర కన్వీనర్లు ఈ నియామకాలను చేశారు. మైనారిటీ జిల్లా విభాగాలకు కె.ఎస్.ఎస్.బి.నూర్‌బాబా (అనంతపురం), ఎస్.ఏ.కరీముల్లా (వైఎస్సార్ కడప), ఎస్.ఎం.డి.షఫీ (వైఎస్సార్ కడప సిటీ), ఎస్.నూరుల్లా(తిరుపతి సిటీ), సయ్యద్ గౌసుద్దీన్ ముక్తార్(నిజామాబాద్), మహమూద్ ఫారూఖ్ అలీ(మెదక్) కన్వీనర్లుగా నియమించినట్లు రాష్ట్ర కన్వీనర్ హెచ్.ఏ.రెహ్మాన్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రకటించారు. మిగిలి జిల్లాలకు కూడా ఈ నెల 15వ తేదీ తరువాత కన్వీనర్లను నియమిస్తామని ఆయన వెల్లడించారు. 

సేవాదళం 

శ్రీనివాస్ గౌడ్ (ఆదిలాబాద్), ఆవుల చంద్రశేఖర్ రెడ్డి(ప్రకాశం), శరత్ యాదవ్(తిరుపతి సిటీ), మిద్ది భాస్కర్ రెడ్డి (అనంతపురం), గొల్లపూడి రాంప్రసాద్(ఖమ్మం)ను ఆయా జిల్లాల సేవాదళం కన్వీనర్లుగా నియమించినట్లు రాష్ట్ర కన్వీనర్ కోటింరెడ్డి వినయ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 

సాంసృ్కతిక విభాగం 

పురిపండ జయశివ సూర్య (శ్రీకాకుళం), ఎం.సన్యాసినాయుడు(విజయనగరం), జమి శివఅప్పలరాజు(సింగర్ రాజ)-(విశాఖ పట్టణం), దనపల్లి శ్రీమన్నారాయణ (విశాఖపట్టణం అర్బన్), కాశీ విశ్వనాథ్(కృష్ణా), మంజుశ్రీ(విజయవాడ సిటీ), గూడూరు శారదారాణి(ప్రకాశం), చిత్రపు రామకృష్ణ శేషగిరి(తిరుపతి సిటీ), గంధం నాయుడు(వైఎస్సార్ కడప), బాల నాగరాజు(అనంతపురం), మోహన్‌నాయక్ పవార్(ఆదిలాబాద్), పాట మహేష్(నిజామాబాద్), ఎన్.మహేష్(మెదక్), మారపాక ఉదయ్(నల్లగొండ), బిల్‌పాడి రమాదేవి(మహబూబ్‌నగర్)ను ఆయా జిల్లాలకు కన్వీనర్లుగా నియమించినట్లు రాష్ట్ర సాంసృ్కతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉష ఒక ప్రకటనలో తెలిపారు.

Chandrababu's Quid Pro Co.

2జి స్పెక్ట్రమ్ పాపం యుపిఏదే

 2జి స్పెక్ట్రమ్ పాపం యుపిఏదేనని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ కూపంలోకి రాజాని నెట్టివేసి పెద్దలు తప్పుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజాని బలి చేశారని విమర్శించారు. వాస్తవానికి ఈ స్కాంలో కేంద్ర మంత్రి వర్గందే బాధ్యత అన్నారు. రాజ్యాంగంలోని 74వ ఆర్టికల్ ఇదే చెబుతోందని చెప్పారు. 

స్కాంలో నుంచి కేంద్ర మంత్రి చిదంబరంని ఎలా తొలగిస్తారని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో సీనియర్ మంత్రి ప్రణబ్ ముఖర్జీయే ఈ స్కాంలో చిదంబరంకు ప్రమేయం ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. 

ఎమ్మార్ ప్రాపర్టీస్ విషయంలో ఎండిని బలి చేశారన్నారు. మంత్రి మాత్రం క్షేమంగా ఉన్నారన్నారని చెప్పారు. మంత్రులను, నేతలను సిబిఐ వదిలివేసిందన్నారు. మంత్రి వర్గ ఉపసంఘాన్ని కూడా సిబిఐ వదిలివేసిందని విమర్శించారు.

కార్మికనేత మురళి కుటుంబాన్ని ఓదార్చిన జగన్(videos)

కార్మిక నేత మురళీమోహన్‌ కుటుంబాన్ని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరామర్శించారు. ఘటన వివరాలను ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మురళీమోహన్‌ చేసిన తప్పేంటని ప్రశ్నించారు. కార్మిక నేతను పోలీసులు కొట్టి చంపడం అన్యాయమన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించక పోవడం దారుణమన్నారు. చివరకు మురళీమోహన్‌ గుండెపోటుతో చనిపోయారని చిత్రీకరించడం బాధాకరమన్నారు. యాజమాన్య ప్రతినిధి చనిపోవడం కూడా బాధాకరం అన్నారు. పాండిచ్చేరి ప్రభుత్వ తీరును కూడా జగన్‌ ఎండగట్టారు. 

కార్మిక నాయకుడు మురళి కార్మికుల హక్కుల కోసం పోరాడటం నేరమా అని ప్రశ్నించారు. మురళి మృతితోనే కార్మికులు ఆందోళన చేశారన్నారు. 9 మంది కార్మికులు గాయపడితే ప్రభుత్వం నిద్రపోతుందా? అని జగన్ ప్రశ్నించారు.








2జీ స్పెక్ట్రమ్ అంటే...


తీగల అవసరం లేకుండా ధ్వని, సమాచార ప్రసారానికి ఉపయోగించిన రెండో తరం టెక్నాల జీని 2జీ అని పిలుస్తున్నారు. ఈ టెక్నాలజీ వాడకంలో పాటించాల్సిన పద్ధతులను గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్(జీఎస్‌ఎం) ద్వారా నిర్ణయించారు. అప్పట్లో మాటలతోపాటు ఎస్‌ఎంఎస్ సందేశాలు పంపేం దుకు మాత్రమే ఈ టెక్నాలజీ ఉపయోగపడింది. రేడియో తరంగాల స్థానంలో విద్యుదయస్కాంత తరంగాలను ఉపయోగించడం ద్వారా తక్కువ స్పెక్ట్రమ్‌లోనే ఎక్కువ సంఖ్యలో కాల్స్‌ను ప్రసారం చేయడం ఈ టెక్నాలజీ ద్వారా వచ్చిన లాభం. అంతేకాకుండా నిర్ణీత ప్రాంతాలను చిన్నభాగాలు గా చేసుకుని (సెల్స్) సమాచార ప్రసారం చేయడం మొదలైందీ ఇక్కడి నుంచే!

ఆకాశంలో హరివిల్లును మీరు చూసే ఉంటారు. ఊదా రంగు మొదలుకొని ఎరుపు వరకూ ఏడు రంగులతో హరివిల్లు ఉంటే... రంగుల స్థానంలో విద్యుదయస్కాంత తరంగాలను ఉంచుకుంటే అది స్పెక్ట్రమ్ అవుతుంది. అతిబలహీనమైన కిలోహెర్ట్జ్ స్థాయి నుంచి అత్యంత బలమైన గిగాహెర్ట్జ్ వరకూ విస్తరించి ఉండే ఈ స్పెక్ట్రమ్ ద్వారా సెల్‌ఫోన్ ప్రసారాలతోపాటు టెలివిజన్, రేడియో ప్రసారాలు కూడా జరుగుతాయి. మిలటరీ, విమానయాన సర్వీసుల కోసం కొంతభాగాన్ని ఉపయోగిస్తారు. 

తొలిగా వాడిందెవరు?

1991లో ఫిన్లాండ్‌కు చెందిన ‘రేడియోలింజ’ అనే కంపెనీ వాణిజ్యస్థాయిలో ఉపయోగించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ కంపెనీ ‘ఎలిసా’అనే కంపెనీలో విలీనమైంది.

ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సిస్(ఎఫ్‌డీఎంఏ): రేడియో స్టేషన్‌లో నిర్ణీత తరంగదైర్ఘ్యం వద్ద ఒక్కో చానల్ వచ్చినట్లు ఎఫ్‌డీఎంఏ టెక్నాలజీలోనూ మొత్తం స్పెక్ట్రమ్‌ను చిన్నచిన్న భాగాలుగా చేస్తారు. 

టైమ్ డివిజన్ మల్టిపుల్ యాక్సిస్ (టీడీఎంఏ): పేరులో ఉన్నట్లే ఇందులో స్పెక్ట్రమ్‌ను కాకుండా ప్రతి సెల్‌ఫోన్ కాల్‌కు ఒక్కో తరంగదైర్ఘ్యంలో కొంత సమయం కేటాయిస్తారు. 

కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సిస్: (సీడీఎంఏ): పైన పేర్కొన్న రెండు టెక్నాలజీలకు భిన్నమైంది. ఇందులో ప్రతి కాల్‌కు నిర్దిష్ట రహస్య కోడ్ కేటాయిస్తారు. అంతేకాదు. స్పెక్ట్రమ్‌లో ఇది అందుబాటులో ఉన్న భిన్న ఫ్రీక్వెన్సీలకు పంచుతారు. తద్వారా పరిమితమైన ఫ్రీక్వెన్సీలోనే ఎక్కువ సంఖ్యలో కాల్స్‌ను నిర్వహించవచ్చు.

ఎంఎంఎస్, నెట్‌లకు తెరతీసిన 2.5జీ: మొబైల్‌ఫోన్ల ద్వారా ఇంటర్నెట్‌ను అందుకునేందుకు వీలు కల్పించిన టెక్నాలజీ 2.5జీ. జీపీఆర్‌ఎస్ వంటి టెక్నాలజీల అభివృద్ధితో ఇది సాధ్యమైంది. అయితే ఇందులో నెట్ స్పీడ్ 56 కేబీపీఎస్ నుంచి 115 కేబీపీఎస్ వరకూ మాత్రమే ఉండేది. తరువాతి కాలంలో ఎడ్జ్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో మొబైల్‌ఫోన్ల ద్వారా సెకనుకు 238 కిలోబిట్ల వరకూ సమాచారం పంపుకోవడం సాధ్యమైంది. దీన్ని 2.75జీగా పిలుస్తారు. ప్రస్తుతం విసృ్తతంగా ఉపయోగిస్తున్న 3జీ టెక్నాలజీలో హెచ్‌ఎస్‌పీడీఏ , యూఎంటీఎస్ వంటి పద్ధతులను ఉపయోగించడం ద్వారా నెట్ స్పీడ్‌ను 14.4 ఎంబీపీఎస్ స్థాయికి పెంచగలిగారు.

2జీపై సుప్రీం కొరడా, లైసెన్సుల రద్దుకు ఆదేశం

2008లో జారీ అయిన 122 లైసెన్సులు బుట్టదాఖలు
వాటిని బహిరంగంగా వేలం వేయాలంటూ తీర్పు
యూపీఏ సర్కారును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీం ధర్మాసనం
జాతి సంపదను కారుచౌకగా రాసిచ్చారంటూ రాజాపై ధ్వజం
2001 నాటి ధరలనే సిఫార్సు చేసినందుకు ట్రాయ్‌కీ అక్షింతలు
{పస్తుత లెసైన్సులు 4 నెలల పాటు కొనసాగేందుకు అనుమతి

లైసెన్సుల జారీ, స్పెక్ట్రం కేటాయింపులపై రెండు నెలల్లో కొత్త సిఫార్సులు చేయాలని ట్రాయ్‌కి ఆదేశం
నెల లోపు వేలం నిర్వహించాలని కేంద్రానికి ఆదేశం
న్యాయ సమీక్షకు అతీతమన్న వాదనను తోసిపారేసిన సుప్రీం
చిదంబరంపై సీబీఐ దర్యాప్తుపై ట్రయల్ కోర్టే నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్య

‘‘ఏకపక్ష, చట్టవిరుద్ధ, రాజ్యాంగవిరుద్ధమైన, ప్రజాప్రయోజనాలకు విరుద్ధమైన, ఏ మాత్రం మతిలేకుండా జరిపిన కేటాయింపులివి. సమానత్వ సిద్ధాంతాన్ని అడ్డంగా ఉల్లంఘిస్తూ, ఖజానాకు అపార నష్టం కలిగిస్తూ, కొన్ని కార్పొరేట్ కంపెనీలకు ఉద్దేశపూర్వకంగా లబ్ధి చేకూరుస్తూ తీసుకున్న నిర్ణయాలు’’

‘ప్రధాని, కేంద్ర న్యాయమంత్రి ఇచ్చిన సలహాలను కూడా రాజా పెడచెవిన పెట్టారు. 2జీ వంటి అతి విలువైన జాతి సంపదను దాదాపుగా కారుచౌకగా రాసిచ్చేశారు.

‘‘జాతి సంపద పంపిణీకి వేలమే ఏకైక పారదర్శక విధానం. 2జీ లెసైన్సుల కేటాయింపుల్లోనూ దాన్ని అనుసరిస్తే దేశానికి కొన్ని వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరేది.

‘‘ప్రధానమైన రాజ్యాంగ పదవుల్లో, విస్తృత ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా విధులు నిర్వహించిన కొందరు అవగాహనాపరులైన పౌరులు.. సుపరిపాలన కోసం, రాజ్యాంగబద్ధమైన సంస్థల్లో జవాబుదారీతనం కోసం నిరంతరం పోరాడుతున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలే గనుక పూనుకుని.. 2జీ లెసైన్సుల కేటాయింపు ప్రహసనాన్ని జాగరూకతతో పరిశీలించని పక్షంలో.. అత్యంత పరిమితమైన ఈ జాతి సంపదను ధనబలమున్న, వ్యవస్థను ప్రభావితం చేయగల శక్తులు అడ్డంగా చేజిక్కించుకున్న వైనం జాతికి, అమాయకులైన దేశ ప్రజలకు ఎప్పటికీ తెలిసేదే కాదు!’’


న్యూఢిల్లీ: దేశ చరిత్రలోనే అతి పెద్దదిగా భావిస్తున్న 2జీ కుంభకోణం ఉదంతంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో కన్నెర్రజేసింది. ఈ కేసులో కేంద్రంతో పాటు టెలికాం కంపెనీలపైనా గురువారం కొరడా ఝళిపించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలో పడేసేలా, మొత్తంగా దేశ టెలికం రంగాన్నే తీవ్రంగా ప్రభావితం చేసేలా సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. యూపీఏ-1 హయాంలో ఎ.రాజా టెలికం మంత్రిగా 2008లో కేటాయించిన 122 2జీ స్పెక్ట్రం లైసెన్సులను రద్దు చేసింది. తద్వారా కొన్నేళ్లుగా తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ 2జీ కేటాయింపులను బుట్టదాఖలు చేసి యూపీఏ సర్కారుకు భారీ షాకిచ్చింది. అంతేగాకుండా... ‘‘ఇవి పూర్తిగా ఏకపక్ష, చట్టవిరుద్ధ, రాజ్యాంగవిరుద్ధమైన, ప్రజాప్రయోజనాలకు విరుద్ధమైన, ఏ మాత్రం మతిలేకుండా జరిపిన కేటాయింపులు. సమానత్వ సిద్ధాంతాన్ని అడ్డంగా ఉల్లంఘిస్తూ, ఖజానాకు అపార నష్టం కలిగిస్తూ, కొన్ని కంపెనీలకు ఉద్దేశపూర్వకంగా లబ్ధి చేకూరుస్తూ తీసుకున్న నిర్ణయాలు’ అంటూ న్యాయమూర్తులు జస్టిస్ ఏకే గంగూలీ, జీఎస్ సింఘ్వీలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. స్పెక్ట్రం కేటాయింపులకు కేంద్రం అనుసరించిన ‘మొదట వచ్చిన వారికి మొదట’ విధానాన్నేతీవ్రంగా తప్పుబట్టింది. అది పూర్తిగా లోపభూయిష్టమైన తప్పుడు విధానమంటూ ఆక్షేపించింది. దానికి బదులు వేలం ద్వారా స్పెక్ట్రాన్ని కేటాయించాల్సిందని వ్యాఖ్యానించింది. ఆర్థిక అంశాలకు సంబంధించిన విధాన నిర్ణయాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావన్న కేంద్రం వాదనను పూర్తిగా కొట్టిపారేసింది. ‘‘ప్రభుత్వం, లేదా ప్రభుత్వ సంస్థ రూపొందించిన విధానం ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉంటే.. ప్రజాప్రయోజనార్థం వాటిని సమీక్షించడం, సరైన చర్యలు తీసకోవడం కోర్టుల విధి’’ అంటూ కుండబద్దలు కొట్టింది. రిలయన్స్ గ్యాస్ వివాదం వంటివాటిని ఉదాహరించింది. లైసెన్సుల జారీ ప్రక్రియలో చేతివాటం చూపారంటూ రాజాపై దుమ్మెత్తిపోసింది. ‘ప్రధాని, కేంద్ర న్యాయ మంత్రి సలహాలను కూడా రాజా పెడచెవిన పెట్టారు. అత్యంత ప్రధానమైన జాతీయ సంపదను దాదాపుగా కారుచౌకగా రాసిచ్చేశారు. టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) అనుసరించిన తలకిందుల విధానాన్ని అందుకు చక్కగా వాడుకున్నారు’ అంటూ ఆయనను తీవ్రంగా అభిశంసించింది. 2జీ కుంభకోణంలో ట్రాయ్ పాత్రను కూడా తీవ్రంగా తప్పుబట్టింది. 2001 నాటి ధరలకు స్పెక్ట్రంను కేటాయించాలని సిఫార్సు చేయడం ద్వారా మంత్రిమండలి నిర్ణయానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించిందంటూ విమర్శించింది. ప్రస్తుత 2జీ లైసెన్సులు మరో 4 నెలల పాటు కొనసాగేందుకు బెంచ్ అనుమతించింది. అనంతరం రద్దు ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ‘‘ఆలోపు 22 సర్కిళ్లలోని 2జీ లెసైన్సులను వేలం ద్వారా విక్రయించాలి. లెసైన్సుల జారీ, 2జీ స్పెక్ట్రం కేటాయింపులకు రెండు నెలల్లోగా ట్రాయ్ తాజాగా సిఫార్సులు చేయాలి. ఆ తర్వాత నెల లోపు వాటికి అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకోవాలి’’ అంటూ ఆదేశాలు జారీ చేసింది. కేటాయింపులతో లబ్ధి పొంది, తర్వాత 2జీ లెసైన్సులను భారీ లాభాలకు అమ్ముకున్న టెలికాం కంపెనీలకు జరిమానాలు విధించింది! 2జీ కుంభకోణంలో నాటి కేంద్ర ఆర్థిక మంత్రిగా చిదంబరం పాత్రపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించేందుకు నిరాకరించింది. దీనిపై 2 వారాల్లోగా నిర్ణయం వెలువరించాల్సిందిగా సీబీఐ ప్రత్యేక కోర్టుకు సూచించింది. 2జీ కేసు దర్యాప్తుకు సంబంధించిన కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కి ఎప్పటికప్పుడు స్థాయీ నివేదికను సమర్పించాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. అయితే.. ఈ కేసులో సీబీఐ, ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థల విచారణను గానీ.. దాన్ని ఎదుర్కొంటున్న వారిని గానీ తమ వ్యాఖ్యలు, నిర్ధారణలు, ఆదేశాలు ఏ విధంగానూ ప్రభావితం చేయబోవని స్పష్టం చేసింది. అలాగే సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఓపీ సైనీ కూడా తమ ఆదేశాలతో ప్రభావితం కాకుండా చిదంబరంపై తీర్పు వెలువరించాలని సూచించింది. ఇకపై సహజ వనరుల విక్రయానికి వేలం విధానాన్ని అనుసరించడం ద్వారా ఎలాంటి అక్రమ, చట్ట విరుద్ధ, ఏకపక్ష ధోరణులకూ తావు లేకుండా చూడాలని కేంద్రానికి సూచించింది. తద్వారా అర్హులందరికీ అందులో పాల్గొనే అవకాశం కల్పించాలంది. అలాగాక మరే విధానాన్ని అనుసరించినా.. రాజ్యాంగ సూత్రాలు, విలువల పట్ల ఏమాత్రం గౌరవం లేని, గరిష్ట స్థాయిలో ఆర్థిక లబ్ధి పొందడమే లక్ష్యంగా పెట్టుకున్న నీతిబాహ్యులైన వ్యక్తులు దేశ సహజ వనరులను, సంపదను దుర్వినియోగపరుస్తారంటూ హెచ్చరించింది.

నాటకం నడిపించిన రాజా...: 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో భారీ కుంభకోణం చోటుచేసుకుందంటూ జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్య స్వామి, సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (సీపీఐఎల్) అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు బెంచ్ గురువారం తీర్పు వెలువరించింది. 2జీ కుంభకోణంలో టెలికం మంత్రిగా రాజా కీలక పాత్ర పోషించారంటూ సోదాహరణంగా వివరించింది. ‘‘జాతీయ సంపద పంపిణీకి ఏకైక పారదర్శక విధానమైన వేలాన్ని అనుసరిస్తే 2జీ లైసెన్సుల కేటాయింపు ద్వారా దేశానికి కొన్ని వేల కోట్ల రూపాయల మేరకు లబ్ధి చేకూరేది. కానీ 2007 సెప్టెంబర్-2008 మార్చి మధ్య రాజా నేతృత్వంలో టెలికం అధికారులు చేపట్టిన ప్రక్రియ ఇందుకు పూర్తి విరుద్ధంగా సాగింది. అంతేకాకుండా స్పెక్ట్రం వంటి పరిమిత వనరు కేటాయింపులో పారదర్శకత, నిష్పాక్షికత ఉండేలా చూడాలన్న ప్రధాని సలహాను రాజా పట్టించుకోలేదు. కేటాయింపుల్లో పారదర్శకత పాటించాలంటూ 2007 నవంబర్ 2న ప్రధాని లేఖ రాస్తే, అందులోని సూచనలన్నింటినీ కొద్ది గంటల్లోనే తిరస్కరించారాయన! వేలం వేస్తే కొత్త దరఖాస్తుదారులకు సమానావకాశం దక్కదు గనుక అది అన్యాయం, వివక్షాపూరితం, ఏకపక్షం, మతిలేని నిర్ణయం కాగలదని వాదించారు. 

పైగా కేవలం టెలికాం సేవల్లో ఏ అనుభవమూ లేని కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా, లెసైన్సుల కోసం దరఖాస్తుల కటాఫ్ తేదీని టెలికాం శాఖ ప్రకటించిన 2007 అక్టోబర్ 1 నుంచి ఏకపక్షంగా, తనంతతానుగా సెప్టెంబర్ 25కు తగ్గించారు! సదరు రియల్టీ కంపెనీలన్నీ అందుకు సరిగ్గా ఒక్క రోజు ముందు దరఖాస్తు చేసుకున్నాయి! ఇక 2008 జనవరి 10న నిర్వహించిన టెలికం కంపెనీలకు లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ జారీ ప్రక్రియంతా ముందస్తు వ్యూహం ప్రకారం పక్కాగా ఆడిన నాటకమే. ముందుగానే, అంటే 2004, 2006ల్లో దరఖాస్తు చేసుకున్న పలు కంపెనీలను దీని ద్వారా కిందకు నెట్టారు. ‘ముందుగా వచ్చిన వారికి ముందుగా’ సూత్రం అమల్లో చోటుచేసుకున్న మార్పును తెలుసుకుని, 2007 ఆగస్టు-సెప్టెంబర్ మధ్య వచ్చిన వాటికేమో ఎక్కువ సీనియారిటీ, తద్వారా ప్రాధాన్య క్రమంలో స్పెక్ట్రం కేటాయింపులకు అర్హత దక్కేలా చేశారు. ట్రాయ్ సిఫార్సులను అమలు చేసేముందు రాజీ విధిగా కేంద్ర ఆర్థిక శాఖను సంప్రదించాల్సింది. స్పెక్ట్రం ధరల నిర్ధారణపై వారితో మాట్లాడాల్సింది. కానీ.. 2001 ధరలకు స్పెక్ట్రం కేటాయింపుల పట్ల ఆర్థిక శాఖ కార్యదర్శి అప్పటికే అభ్యంతరం తెలిపారన్న వాస్తవం రాజాకు బాగా తెలుసు. అందుకు ఆర్థిక శాఖను గానీ, అధికారులను గానీ ఆయన సంప్రదించనే లేదు. దాంతో 2007 జనవరి 10న టెలికాం కమిషన్ భేటీలో పాల్గొన్న ఆ శాఖ అధికారులకు.. లైసెన్సల కేటాయింపులో రాజా చెప్పినట్టు చేయడం తప్ప మరో మార్గమే లేకపోయింది. లేదంటే ఆయన ఆగ్రహాగ్నిని వారు చవిచూడాల్సి వచ్చేది’’ అని వ్యాఖ్యానించింది.

ట్రాయ్‌పై న్యాయ సమీక్ష

‘‘ట్రాయ్ మంచి నైపుణ్యమున్న సంస్థే. కానీ 2జీ లైసెన్సుల కేటాయింపులో దాని సిఫార్సులు చాలా కోణాల్లో లోపభూయిష్టమేనని చెప్పేందుకు ఎన్నో రుజువులున్నాయి. వాటిని టెలికం శాఖ యథాతథంగా అమలు చేయడంతో జాతీయ టెలికం విధానం లక్ష్యాలే పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇలాంటి వ్యవహారాలపై న్యాయ సమీక్షకు ఉన్న అవకాశాలు అత్యంత స్వల్పమే అయినా.. కోర్టు దృష్టికి వచ్చిన పలు అంశాల ఆధారంగా పై వ్యాఖ్యలు చేసేందుకు మేమెంత మాత్రమూ సంశయించడం లేదు’’ అని స్పష్టం చేసింది! ట్రాయ్ సిఫార్సులపై న్యాయ సమీక్ష జరగాల్సిందేనని పేర్కొంది.

జోక్యం చేసుకోకుండా ఉండలేం...

ప్రభుత్వ విధాన నిర్ణయాలకు కోర్టులు దూరంగా ఉండాలన్న అటార్నీ జనరల్ జీఈ వాహన్‌వతి వాదనను బెంచ్ కొట్టిపారేసింది. ‘‘విధానాలను రూపొందించే ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థలపై కోర్టు తన అభిప్రాయాలను రుద్దజాలదనడం నిజమే. కానీ జాతీయ ప్రయోజనాల పరిరక్షణ ప్రభుత్వ పవిత్ర విధి. జాతీయ వనరులను ఎప్పుడూ దేశ ప్రయోజనాల కోసమే తప్ప ప్రైవేటు ప్రయోజనాల కోసం వాడరాదు. అలాంటి విధానాలు ప్రజాప్రయోజనాలకు, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని బాధ్యతాయుత పౌరులు కోర్టు దృష్టికి తెచ్చినప్పుడు, అది నిజమని స్పష్టంగా నిరూపితమైనప్పుడు తన న్యాయ పరిధిని ఉపయోగించి వాటిని సమీక్షించడం కోర్టు విధి. ప్రజలు తమ విశ్వాసాన్ని ఉంచిన.. రాజ్యాంగానికి, చట్టానికి లోబడి, భయం, పక్షపాతం, దురుద్దేశాలు లేకుండా విధులు నిర్వహిస్తామంటూ ప్రమాణం చేసిన వారి నుంచే వ్యవస్థాపరమైన సమగ్రతకు విఘాతం కలగకుండా చూడాల్సింది కూడా కోర్టులే. ఎందుకంటే వారు కూడా తమ విధులకు బద్ధులే’’ అని స్పష్టం చేసింది. ‘ముందుగా వచ్చిన వారికి ముందుగా’ అన్నది తప్పుడు విధానమైతే, 2001 నుంచీ జరిపిన కేటాయింపులన్నింటినీ రద్దు చేయాలన్న సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనను బెంచ్ కొట్టిపారేసింది.

ఇవీ జరిమానాలు: ఏకపక్ష విధానంలో 2జీ లైసెన్సులను సొంతం చేసుకుని, అనంతరం ఈక్విటీ రాబట్టుకునే సాకుతో వేల కోట్లకు వాటికి విక్రయించిన ఎటిసలాట్ డీబీ టెలికం (స్వాన్ టెలికం లిమిటెడ్), యూనిటెక్ వైర్‌లెస్ గ్రూప్, టాటా టెలీ సర్వీసెస్ లిమిటెడ్‌లకు రూ.5 కోట్ల చొప్పున జరిమానా విధించింది. లూప్ టెలికాం, ఎస్-టెల్, అలియాంజ్ ఇన్‌ఫ్రాటెక్, సిస్టెమా శ్యాం టెలీ సర్వీసెస్ కూడా రూ.50 లక్షల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇందులో 50% మొత్తాన్ని నిరుపేద కక్షిదారులకు సాయం చేసేందుకు వీలుగా సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ వద్ద , మిగతా మొత్తాన్ని ప్రధాని సహాయ నిధికి జమ చేయాలని పేర్కొంది.

లైసెన్సులు రద్దయిన కంపెనీలివే...
యూనినార్(22 లెసైన్సులు), సిస్టెమా శ్యామ్ టెలీ సర్వీసెస్ లిమిటెడ్. ప్రస్తుతం ఎంటీఎస్ ఇండియా.(21), లూప్ మొబైల్. గతంలో బీపీఎల్ మొబైల్.(21), వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్. (21), ఎటిసలాట్-డీబీ(15), ఐడియా సెల్యులార్(9), టాటా టెలీ సర్వీసెస్(3),ఎస్ టెల్(6), స్పైస్(ఐడియా)(4)

సీనియర్లతో ప్రధాని మంతనాలు
2జీ స్పెక్ట్రమ్ లైసెన్సులను సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ ఈ అంశంపై సీనియర్ మంత్రులతో గురువారం సంప్రదింపులు జరిపారు. సుప్రీం తీర్పు వల్ల ఎదురయ్యే పరిణామాలపై చర్చిం చారు. కేబినెట్ భేటీతోపాటు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశానంతరం ఆయన ఈ మంతనాలు సాగించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఇదేం ‘పాలసీ’?
‘ముందుగా వచ్చిన వారికి ముందుగా’ విధానాన్ని బెంచ్ తీవ్రంగా తప్పుబట్టింది. అధికార వర్గాల్లో అత్యున్నత, లేదా అట్టడుగు స్థాయిలో ప్రవేశమున్న వారెవరికైనా సదరు నిర్ణయాలు, కాంట్రాక్టులు, లైసెన్సుల కేటాయింపుల గురించి ముందుగానే తెలుసుకుని, అయాచిత లబ్ధి పొందేందుకు ఇది పూర్తిగా వీలు కల్పించేలా ఉండటం దీనిలోని మౌలిక లోపమని వ్యాఖ్యానించింది. తద్వారా, వాటిని పొందేందుకు అదనపు అర్హతలున్న ఇతరులు నష్టపోతారని గుర్తు చేసింది. పారదర్శకమైన బహిరంగ వేలమే అత్యుత్తమ విధానమని స్పష్టం చేసింది.

‘పౌరులకు’ జేజేలు
అవగాహనాపరులైన కొందరు పౌరుల జాగరూకతే 2జీ వంటి అతి పెద్ద కుంభకోణాన్ని బయట పెట్టిందంటూ కోర్టు కొనియాడింది. స్వచ్ఛంద సంస్థ ఎస్‌పీఐఎల్ వ్యవస్థాపకుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీఎం తార్కుండేతో పాటు లోక్‌సత్తా, టెలికం వాచ్‌డాగ్, కామన్‌కాజ్ వంటి స్వచ్ఛంద సంస్థలను తన తీర్పులో ప్రస్తుతించింది. ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్లు జేఎం లింగ్డో, టీఎస్ కృష్ణమూర్తి, ఎన్.గోపాలస్వామి, మాజీ సీవీసీ పి.శంకర్, ఐపీఎస్ అధికారి జూలియో ఎఫ్.రిబెరో, సీనియర్ జర్నలిస్టు పీఆర్ గుహ, మాజీ నావికా దళాధిపతి ఆర్‌హెచ్ తహిల్యానీ, జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామిలను ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందించింది.

రివ్యూ పిటిషన్ వేయనున్న కంపెనీలు
లైసెన్సుల రద్దుపై టెలికాం కంపెనీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. తమ ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు సిస్టెమా-శ్యామ్, ఎటిసెలాట్ డీబీ తెలిపాయి. ప్రభుత్వ ప్రక్రియలో జరిగిన తప్పిదాలకు కోర్టు తమపై జరిమానా విధించిందని యూనినార్ వ్యాఖ్యానించింది. తాము దరఖాస్తు చేసుకున్న 18 నెలల తర్వాత జనవరి 2008లో లెసైన్సులు జారీ కావడమే సమస్యగా మారిందని ఐడియా సెల్యులార్ ఆవేదన వ్యక్తం చేసింది. తమ లైసెన్సులన్నీ 2001కన్నా ముందే జారీ అయ్యాయి కాబట్టి లైసెన్సుల రద్దు అంశం తమపై ప్రభావం చూపబోదని రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) తెలిపింది.

సాయిరెడ్డికి నార్కో పరీక్షకు నో


జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో రెండో నిందితునిగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డికి సత్యశోధన పరీక్షలు (నార్కోఅనాలసిస్) నిర్వహించాలన్న సీబీఐ ప్రయత్నాలకు సీబీఐ న్యాయస్థానం బ్రేకులు వేసింది. సత్యశోధన పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ పరీక్షలకు అనుమతించడం రాజ్యాంగం నిందితునికి కల్పించిన ప్రాథమిక హక్కును హరించడమే అవుతుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది. సాయిరెడ్డికి సత్యశోధన పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలంటూ సీబీఐ వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి బి.నాగమారుతిశర్మ గురువారం కొట్టివేశారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ఇటువంటి పరీక్షల నిర్వహణకు అనుమతించలేమని స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థ ఇటువంటి పరీక్షలు నిర్వహించడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు సెల్వి వర్సెస్ కర్ణాటక స్టేట్ కేసులో స్పష్టం చేసిన విషయాన్ని న్యాయమూర్తి తన తీర్పులో ప్రస్తావించారు. బైర్రాజు రామలింగరాజు వర్సెస్ సీబీఐ కేసులోనూ ఇటువంటి పరీక్షలు చట్ట, రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు ఇద్దరు న్యాయమూర్తులు స్పష్టమైన తీర్పును వెలువరించిన విషయాన్ని ఉత్తర్వుల్లో ఉదహరించారు. ‘‘సీఆర్‌పీసీ-161(2) కింద తనకు వ్యతిరేకంగా సేకరించే సాక్ష్యాల గురించి చెప్పకుండా మౌనంగా ఉండే హక్కు ప్రతి ఒక్కరికీ చట్టం కల్పించింది. తాము అడిగిన ప్రశ్నలకు కచ్చితంగా సమాధానం చెప్పితీరాలన్నది చట్టంలో నిషేధం. సత్యశోధన పరీక్షలో ఉపయోగించే మత్తు పదార్థాలతో మనిషి సహజసిద్ధమైన స్పృహను కోల్పోతారు. తనను అడిగే ప్రశ్నలకు స్పృహలో ఉండి సమాధానాలు చెప్పలేరు. సత్యశోధన, పాలిగ్రాఫ్, బీప్‌టెస్ట్‌ల ద్వారా తప్పనిసరిగా తమకు కావాల్సిన సమాచారం ఇవ్వాలని కోరడం రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఆర్టికల్ 21, 20(3)కి పూర్తిగా విరుద్ధం. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం. 

అది మానసిక స్థితిలోకి బలవంతంగా ప్రవేశించడమే అవుతుంది’’ అని జడ్జి ఉత్తర్వుల్లో అభిప్రాయపడ్డారు. సత్యశోధన పరీక్షల సమయంలో ‘సోడియం పెంటథాల్’ను ఇస్తారని, ఇది ఏ మాత్రం మోతాదు ఎక్కువైనా కోమాలోకి వెళ్లడం గానీ ప్రాణాలుపోయే అవకాశం ఉందని సాయిరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. సత్యశోధన పరీక్షలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. తన మనస్సాక్షికి వ్యతిరేకంగా తమకు అనుకూలంగా చెప్పాలని దర్యాప్తు సంస్థలు ఎవరినీ బలవంతపెట్టలేవని, ఇది రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 20(3), 21కు విరుద్ధమని నివేదించారు. దర్యాప్తు అధికారులు ప్రశ్నించినప్పుడు మౌనంగా ఉండే హక్కును కూడా రాజ్యాంగం కల్పించిందని స్పష్టం చేశారు. సాయిరెడ్డి అరెస్టుకు ముందు 32 రోజులపాటు దాదాపు 300 గంటలపాటు సుదీర్ఘంగా విచారించారని, కస్టడీలో 10 రోజులపాటు మరో 80 గంటలపాటు సీబీఐ విచారించిందని నివేదించారు. తనకు తెలిసిన అన్ని విషయాలను సాయిరెడ్డి సీబీఐ అధికారులకు వెల్లడించారని, అయినప్పటికీ దర్యాప్తునకు సహకరించలేదని, వాస్తవాలు వెల్లడించలేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు సత్యశోధన పరీక్షలకు అనుమతించాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లే

ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కనుమరుగవుతుందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో 24 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లేనని అన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పదవీ కాలం ముగిసి సంవత్సరమవుతున్నా మండల, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేనిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. గ్రామాల్లోకి వెళ్లడానికి కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చేపట్టిన పథకాలన్నీ అమలు కావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. తనపై అనర్హత వేటు వేయాలంటే పీఆర్పీ విలీనం కాకుండా ఉండాలన్నారు. పార్టీయే లేనపు్పుడు విప్ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు.


కొందరిని కాపాడుతూ, మరికొందరిని ఇరికిస్తోంది
బాబు హయాంలో తప్పులు జరిగితే ఆయన బాధ్యత ఉండదా?
వైఎస్ హయాంలో జరిగిన వాటికి మాత్రం వైఎస్సే బాధ్యుడా?

దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థయిన సీబీఐ కొందరు నాయకుల గుప్పిట్లో ఉంటూ, ఒక రాజకీయ పార్టీ చెప్పినట్లుగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ ధ్వజమెత్తారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో వేసిన చార్జిషీటులో తాను కావాలనుకున్న వారిని కాపాడి, కాదనుకున్న వారిని ఇరికించడమే ఇందుకు నిదర్శనమని దుయ్యబట్టారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... 2002లో 359 జీవో ద్వారా ఎమ్మార్‌కు 535 ఎకరాల భూమిని కేటాయించడంలో లోపాలు జరిగాయని ఐఏఎస్ అధికారులు ఎల్.వి.సుబ్రమణ్యం, కె.వి.రావులను ముద్దాయిలుగా చేసిన సీబీఐ, అపుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడుకు మాత్రం అందులో ఎలాంటి సంబంధం లేదని ఎలా భావించిందని సూటిగా ప్రశ్నించారు. బాబు హయాంలో జరిగిన తప్పులతో ఆయనకేమీ సంబంధం లేదన్నట్లుగా వదలి వేసి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జారీ అయ్యాయని చెబుతున్న జీవోలకు వైఎస్సార్‌ను, ఆయన తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డినీ నిందితులుగా ఎలా చేరుస్తారని నిలదీశారు. 

జగన్‌పై వేసిన కేసులు కాంగ్రెస్ మాజీ మంత్రి, టీడీపీ నేతలు కలిసి చేసినవేనని గుర్తు చేశారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి కారణమయ్యాయని ఆరోపిస్తూ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న 26 జీవోల్లో దుర్వినియోగం జరిగిందేమో సీబీఐ నిరూపించిందా...? ఈ విషయమై మంత్రులను, అధికారులను విచారించిందా? అని ఆయన నిలదీశారు. బాబును వదిలేసి వైఎస్‌నూ, ఆయన కుమారుడిని నిందితులుగా చేస్తున్నారంటే దీని వెనుక టీడీపీ, కాంగ్రెస్ మిలాఖత్ అయినట్లు స్పష్టంగా తెలుస్తోందని ధ్వజమెత్తారు. ఎమ్మార్ ఉదంతంలో కొలాబరేషన్ ఒప్పందం కూడా బాబు హయాంలో జరిగినా సీబీఐ పట్టించుకోలేదని తప్పుబట్టారు. తనపై సీబీఐ విచారణ జరక్కుండా చంద్రబాబు కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నారనీ, ఆయన దర్యాప్తునకు సిద్ధపడితే ప్రజలు హర్షిస్తారని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడతానని చంద్రబాబు హామీ ఇచ్చినందుకు ప్రతిఫలంగానే ఆయనపై సీబీఐ విచారణ లేకుండా కాంగ్రెస్ అధిష్టానం చూస్తోందని ఆరోపించారు. విజయసాయిరెడ్డిని నార్కో పరీక్షలకు అనుమతిని నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన స్వాగతించారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధమని గతంలో కూడా సుప్రీంకోర్టు తీర్పు నిచ్చిన విషయం తెలిసి కూడా సీబీఐ పిటిషన్ వేసిందని కొణతాల విమర్శించారు. 

బాబు వ్యాఖ్యలు అసంబద్ధం

తన హయాంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు పునీతులనీ, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో వారంతా అవినీతి పరులయ్యారనీ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయని కొణతాల ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ఎవరున్నా అధికార యంత్రాంగం ఒక్కటేననీ, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడ్డం అభ్యంతరకరమని విమర్శించారు. దువ్వూరి సుబ్బారావు రిజర్వుబ్యాంకు గవర్నర్ కావడం, సంపత్ కేంద్ర ఎన్నికల కమిషనర్ కావడం కూడా తన గొప్పేనని టీడీపీ అధినేత చెప్పుకోవడం వింతగా ఉందన్నారు. వాస్తవానికి వీరిద్దరూ కూడా చంద్రబాబు రాజకీయాల్లోకి రాక మునుపే 1973 సంవత్సరంలో ఐఏఎస్‌లైన అధికారులని చెప్పారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న వారంతా సివిల్ సర్వీసెస్‌ద్వారా వచ్చిన వారైతే... బాబు తానే ఒక స్కూలును స్థాపించి వారికి శిక్షణ ఇచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బాబు తన గొప్ప కోసం ఒక వ్యవస్థనే నిర్వీర్యం చేసే విధంగా మాట్లాడుతున్నారని ఆయన తప్పుబట్టారు. 

Popular Posts

Topics :