19 February 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Y.S.R CONGRESS PARTY IT STATE COMMITTEE MEMBERS

Written By ysrcongress on Saturday, February 25, 2012 | 2/25/2012

Y.S.R CONGRESS PARTY IT STATE COMMITTEE MEMBERS
(Approved by YSRCP President, MP Sri Y.S. Jagan Mohan Reddy)


1 Sri. Harsha Vardhan Reddy Guntur

2 Sri Surendra Abbavaram Chittor

3 Sri Madhusudhan Rao. Sampathi Visakhapatnam

4 Sri Mummadireddy Sujit Kumar YSR Kadapa

5 Sri Gurram Pati Devendar YSR Kadapa

6 Sri Sudharshan Talla Guntur

7 Sri K. Rajesh Reddy Prakasam

8 Sri V. Satish Warngal

9 Sri Kethu Malyadri Prakasam

10 Sri L.M Sandeep Reddy Chittor

11 Sri Jaya Deep Baluvuri Khammam

12 Smt Tanuja Reddy Alluri Nellore

13 Smt N. Sailaja priya Darshani Hyderabad

14 Marsha Mridhull Wellington Khammam

15 Sri Katukuri Suresh Warangal

16 Sri Supesh Samuel Kurnool

17 Sri Ravindra Reddy Kondapalli Krishna

18 Sri Arun Kumar Garala Hyderabad

19 Sri Rama Bhaskar East Godavari

20 Sri Y.Vijaya Bhaskar Reddy YSR Kadapa

21 Sri Syed Taher YSR Kadapa

22 Sri Lakhinana Kishore Srikakulam

23 Sri Palleti Aditya Reddy YSR Kadapa

24 Sri Permula Prakash Rao Rangareddy

25 Sri Suresh Goud Anantapur

26 Sri G Nagaraj YSR Kadapa

27 Sri Gowri Shankar pati West Godavari

28 Sri Subba Rao Hyderabad

29 Sri Srinivasulu Reddy Prakasam

రామోజీని జైల్లో పెట్టే దమ్ముందా?: గట్టు

రామోజీ ఫిలింసిటీలో 60 ఎకరాల పది గుంటల ప్రభుత్వ, అసైన్‌మెంట్ భూములున్నట్లు తేలినందున ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, బీసీ విభాగం కన్వీనర్ గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధునాతనమైన ఇటిఎస్ పద్ధతిలో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ చేయించిన సర్వేలో రామోజీ ఆక్రమణలు బయట పడిన విషయాన్ని వెల్లడించారు. ఫిలింసిటీలో ప్రభుత్వ భూములున్నాయనే విషయం తన దృష్టికి వచ్చినపుడు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అక్కడికి పంపిన టీంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి కూడా ఒక సభ్యుడనే విషయాన్ని గట్టు గుర్తు చేశారు.

అప్పట్లో అక్కడ 275 సర్వే నెంబర్‌లో 4 ఎకరాలు, 281లో 32 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు తహశీల్దార్ వెల్లడించారని గట్టు అన్నారు. దీనిపై తదుపరి చర్యలు తీసుకుంటూ ఉండగా రామోజీరావు అప్పీలు చేసుకున్నారనీ అంతిమంగా తాజా సర్వేలో 60 ఎకరాల పైచిలుకు ప్రభుత్వ భూమి ఉన్నట్లు జేసీ వెల్లడించారని వివరించారు. ప్రభుత్వ భూమి రామోజీ ఆక్రమణలో ఉన్నట్లు స్పష్టంగా వెల్లడైనందున కిర ణ్‌కుమార్ రెడ్డి ఏం చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో పరస్పరం ప్రజలు చూడ్డానికి దూషించుకుంటున్న చంద్రబాబు, కిరణ్‌లో లోలోపల మాత్రం ఒప్పందం ప్రకారం పని చేస్తున్నారన్నారు. ై

జెలుకు వెళ్లాల్సిన వారని ఒకరినొకరు తిట్టుకుంటున్న ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతలు ఎందుకు రామోజీరావు భూకబ్జా గురించి మాట్లాడరని ఆయన నిలదీశారు. అసలు రామోజీని జైల్లో పెట్టే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. కిరణ్ తనకూ బాబుకు ఉన్న మైత్రిని పక్కన బెట్టి రామోజీతో చంద్రబాబుకున్న మైత్రీ బంధాన్ని గుర్తించి ఆయన భూకబ్జాపై చర్యలు తీసుకోవాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నారని స్పష్టంగా వెల్లడైన ప్రస్తుత తరుణంలో రామోజీని ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకుంటుందా లేదా అని ఆయన నిలదీశారు.

ప్రజలు రామోజీ బాగోతాన్ని, ఈ విషయంలో అధికార ప్రతిపక్షాల నిష్క్రియాపరత్వాన్ని చూస్తున్నారని బాబు, కిరణ్ కుమ్మక్కై ఊరకున్నా ప్రజలు మాత్రం ఊరుకోరని ఆయన హెచ్చరించారు. రామోజీ ఫిలింసిటీలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే దాకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపడుతుందని ఆయన అన్నారు. అందరికీ నీతులు చెప్పే రామోజీ కుడితిలో పడ్డట్లు అయిందని ఆయన అన్నారు. ఊరందరికీ నీతులు చెప్పే రామోజీ తన భూకబ్జా గురించి ఏం చెబుతారని ఆయన అన్నారు. రామోజీ ఫిలింసిటీ పుట్టుకే అవినీతి మయం అని ఆయన వ్యాఖ్యానించారు.

గొర్రెల పెంపకం కేంద్రం పెడతానని ఎకరా 4 నుంచి 7 వేల రూపాయల ధరకే వందలాది ఎకరాలు కొనుగోలు చేసిన రామోజీ ఆ తరువాత దానిని వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకుంటున్నారన్నారు. ఫిలింసిటీ ప్రధాన ద్వారం నిర్మించిన ప్రదేశం ఒక రిటైర్డు సీఐదనీ ఆయన ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి అనాజ్‌పూర్ వరకూ గల రోడ్డునే ఆక్రమించి తనదని చెబుతున్నారని ఆయన అన్నారు. రామోజీ వ్యాపారాలన్నీ అవకతవకల మయయేనని ఆయన అన్నారు.

div dir="ltr" style="text-align: left;" trbidi="on">

Nallapureddy files nomination papers in Kovuru



YS Jagan unveiled YSR's Statue at Lingamguntla

కోవూరులో జగన్ ప్రచార షెడ్యూల్ ఖరారు

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రచార కార్యక్రమం ఖారారైంది. మార్చి 2 తేదిన విడవలూరు, మార్చి 3 తేదిన కొడవలూరు, మార్చి 4 తేదిన ఇందుకూరు పేటలో జగన్ ప్రచారం చేయనున్నారు. కోవూరు నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి బరిలో ఉన్నారు.

రామోజీ కబ్జాలో 60 ఎకరాలకు పైగా సీలింగ్ భూములు


అధికారుల సర్వేలో బట్టబయలు
రామోజీ పిటిషన్‌ను కొట్టివేసిన జాయింట్ కలెక్టర్
రూ. 200 కోట్ల విలువైన ఆ భూములు ప్రభుత్వం పేదలకు అసైన్ చేసిన స్థలాలుగా సమాచారం
అసైన్ చేసినవని తేలితే క్రిమినల్ కేసులు తప్పదు
రామోజీ కబ్జాలో 36 ఎకరాల మిగులు భూములు ఉన్నట్లు గతంలోనే తేల్చిన తహశీల్దార్, ఆర్డీఓ
జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కోర్టులో సవాల్ చేసి అడ్డంగా దొరికిపోయిన రామోజీ
ఈటీఎస్ పద్ధతిలో సర్వేకు ఆదేశించిన జేసీ
ఫిల్మ్‌సిటీలో మొత్తం 60.10 ఎకరాల మిగులు భూములున్నట్లు తేల్చిన సర్వే 
ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో పరిశీలించాల్సి ఉంది: జేసీ జగన్నాధం

రంగారెడ్డి జిల్లా, న్యూస్‌లైన్ ప్రతినిధి: ఈనాడు అధినేత రామోజీరావు మరోసారి అడ్డంగా దొరికిపోయారు. ఊళ్లకు ఊళ్లే స్వాహా చేస్తున్న రాజ గురివింద భూదందా మరొకటి బట్టబయలైంది. పట్టా భూముల ముసుగులో మిగులు భూములను సొంతం చేసుకున్న వైనం నిర్ధారణైంది. వ్యవసాయ మిగులు భూముల కింద చాలా ఏళ్ల క్రితం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సుమారు రూ.200 కోట్ల విలువైన భూములు ఇప్పుడు రామోజీ కబ్జాలో ఉన్నట్టు అధికారికంగా తేలింది. రామోజీ కోట ఫిల్మ్ సిటీలోని ఆ భూములను గతంలోనే ప్రభుత్వం పేదలకు అసైన్‌మెంట్ కింద జారీ చేసినట్టు సమాచారం. దీనిపై అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అవి అసైన్డ్ భూములే అయితే రామోజీపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా రామోజీ అడ్డూఅదుపూ లేకుండా అక్రమాలకు పాల్పడ్డారు. ఇదే క్రమంలో మిగులు భూములు స్వాహా చేసిన వైనాన్ని.. హయత్‌నగర్ మండల తహశీల్దార్ గతంలోనే తేల్చారు. ఏ వివాదాన్నీ తేలనీయకుండా కోర్టుల్లోనే కొనసాగించే అలవాటున్న రామోజీరావు తహశీల్దార్ తేల్చిన అంశాన్ని కూడా తొలుత అప్పిలేట్ అథారిటీ వద్ద, తర్వాత జాయింట్ కలెక్టర్ కోర్టులో సవాల్ చేశారు. అయితే అక్కడా రాజగురివిందకు ఎదురుదెబ్బ తగిలింది. అంతేకాదు రామోజీ తానే స్వయంగా తీగలాగి డొంకను కదిలించారు. ఆయన కబ్జాలో 36.27 ఎకరాలున్నట్లు మండలాధికారులు తేల్చితే.. జాయింట్ కలెక్టర్ సర్వేలో మొత్తం 60 ఎకరాలకు పైగా మిగులు భూమిని రామోజీ మింగేసినట్లు తాజాగా నిర్ధారణ అయింది. దీంతో రామోజీ పిటిషన్‌ను జేసీ కొట్టివేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలు తప్పని పరిస్థితి ఏర్పడింది.

పట్టాభూముల ముసుగులో..

రామోజీ ఫిల్మ్‌సిటీ విస్తరించి ఉన్న అనాజ్‌పూర్ గ్రామ శివారులో వ్యవసాయ మిగులు భూములను ప్రభుత్వం కొన్ని దశాబ్దాల క్రితం స్వాధీనం చేసుకుంది. వీటిలో కొన్నిటిని నిరుపేదలకు అసైన్ చేసింది. ఈ సర్వే నంబర్లలోనే పట్టాభూములు కూడా ఉండటంతో రామోజీరావు వాటిని కొన్నాడు. ఆ క్రమంలోనే ప్రభుత్వం అప్పట్లో స్వాధీనం చేసుకున్న మిగులు భూములు కూడా ఆయన ఇలాఖాలోకి చేరిపోయాయి. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన మండల అధికారులు, రామోజీ కబ్జాలో మిగులు భూములున్న విషయాన్ని స్వయంగా పరిశీలించి తేల్చారు. సర్వే నంబర్ 275లో 4 ఎకరాలు, సర్వే నంబర్ 281లో 32.27 ఎకరాల మిగులు భూములు రామోజీ కబ్జాలో ఉన్నట్లుగా పేర్కొంటూ కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. రామోజీకి కూడా నోటీస్ జారీ చేశారు. దీంతో కంగుతిన్న రాజగురివింద తహశీల్దార్ నివేదిక తప్పని పేర్కొంటూ ఆర్డీఓ ఆధ్వర్యంలోని అప్పిలేట్ అథారిటీలో సవాల్ చేశారు. పూర్వాపరాలను పరిశీలించిన అప్పిలేట్ అథారిటీ తహశీల్దార్ నివేదిక సరైందేనని తీర్పు వెలువరించింది. ఆ తీర్పును కూడా సవాల్ చేస్తూ రామోజీ జాయింట్ కలెక్టర్ కోర్టును ఆశ్రయించారు. జాయింట్ కలెక్టర్ జగన్నాథం ఈ కేసును పరిశీలించే క్రమంలో గత నవంబర్ 16న ఆ భూములను స్వయంగా పరిశీలించారు. రామోజీ వేసిన ఫెన్సింగ్‌ను పరిశీలించిన క్రమంలో మిగులు భూములు కూడా అందులో కలిసిపోయినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అయితే దీన్ని ధ్రువీకరించుకోవాలన్న ఉద్దేశంతో జేసీ ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ (ఈటీఎస్) పద్ధతిలో సర్వేకు ఆదేశించారు. 

రెట్టింపు స్థలాల గుట్టు రట్టు

ఈ సర్వేకు ముందువరకు రామోజీ కబ్జాలో కేవలం 36.27 ఎకరాల మిగులు భూములు మాత్రమే ఉన్నాయని అధికారులు భావించారు. కానీ ఆధునిక ఈటీఎస్ పద్ధతిలో నిర్వహించిన సర్వేలో మొత్తం 60.10 ఎకరాల మిగులు భూములను రామోజీ మింగేశారనే విషయం బట్టబయలైంది. సర్వే నంబర్ 275/2 నుంచి 275/5 వరకు 4 ఎకరాలు, సర్వే నంబర్ 281/32 నుంచి సర్వే నంబర్ 281/65 వరకు 56.10 ఎకరాలు ఆయన కబ్జాలో ఉన్నట్టు తేలింది. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్టు.. రామోజీ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ కారణంగా.. ఆయన సొంతం చేసుకున్న మిగులు భూముల ఖాతా చిన్నది కాదనే విషయం బట్టబయలైంది.

రివిజన్ పిటిషన్‌ను కొట్టేసిన జేసీ

హయత్‌నగర్ తహశీల్దార్, అప్పిలేట్ అథారిటీ హోదాలో ఆర్డీఓ తీర్పులను సవాల్ చేస్తూ రామోజీ దాఖలు చేసుకున్న రివిజన్ పిటిషన్‌ను, తాజా సర్వే నివేదికను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ జగన్నాథం శుక్రవారం పిటిషన్‌ను కొట్టేశారు. ‘కేవలం కాగితాల్లోని లెక్కలు, అంకెలను చూడ్డం కాదు... నేను స్వయంగా రామోజీ ఫిల్మ్ సిటీలోని భూముల వద్దకు వెళ్లి వాటిని పరిశీలించాను. అక్కడి పరిస్థితులు చూస్తే నాకు వెంటనే అనుమానం వచ్చింది. ఈటీఎస్ పద్ధతిలో సర్వేకు ఆదేశించటంతో నా అనుమానం నిజమని రూఢీ అయింది. దీంతో రామోజీ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ కొట్టేశాను. ఇక సర్వే వివరాల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో పరిశీలించాల్సి ఉంది’’ అని జేసీ జగన్నాథం శుక్రవారం ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. 

అధికారులపై టీడీపీ, కాంగ్రెస్ నేతల ఒత్తిడి!

రామోజీ భూదందా నిగ్గు తేల్చేందుకు జేసీ జగన్నాథం సర్వేకు ఆదేశించింది మొదలు రామోజీని భుజాన మోసే కొందరు నేతలు అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తేవడం ప్రారంభించారు. తహ శీల్దార్, అప్పిలేట్ అథారిటీల వద్ద చుక్కెదురైన క్రమంలో.. జేసీ సర్వేలో కూడా ఎలాగూ నిజాలే వెల్లడవుతాయని రామోజీ ఆందోళన చెందారు. దీంతో తన వందిమాగధులైన నేతలను పురమాయించి ఆయనపై ఒత్తిడి ప్రారంభించారు. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుచరులతో పాటు తాజా ‘కుమ్మక్కు’ నేపథ్యంలో అధికారపార్టీకి చెందిన కొందరు నేతలు రాజ గురివిందకు వత్తాసు పలకడం గమనార్హం. చంద్రబాబు- కిరణ్ మైత్రికి నిదర్శనంగా ఇప్పటికే ఎన్నో ఉదంతాలు వెలుగు చూసిన నేపథ్యంలో చంద్రబాబు కనుసన్నల్లోనే కాంగ్రెస్ నేతలు.. రామోజీ వ్యవహారం బయటపడకుండా చేసేందుకు అన్నిరకాలుగా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే నవంబర్ 16న రామోజీ ఫిల్మ్‌సిటీ భూములను సందర్శించినప్పుడు వారం రోజుల్లో సర్వే నివేదిక ఇవ్వాలని జేసీ అధికారులను ఆదేశించినా.. మూడు నెలలు గడిచినా నివేదిక జాడే లేకుండా పోయింది. అధికారుల తీరుపై ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. తప్పని పరిస్థితుల్లో రెవెన్యూ అధికారులు మూడు నెలల తర్వాత నివేదికను బహిర్గతం చేశారు. ఐదు రోజుల క్రితం అది జేసీకి చేరింది. నివేదిక మేరకు రామోజీ పిటిషన్‌ను కొట్టివేస్తూ జేసీ నిర్ణయం తీసుకున్నారు.

Ceiling Lands in Ramoji Kabza:


కోవూరులో దళిత చైతన్య యాత్ర

ఉప ఎన్నికలు జరుగుతున్న కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దళితులను చైతన్య పరచడానికి చైతన్య యాత్రలు నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. యాత్ర నిర్వహణ కోసం పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జూపూడి ప్రభాకరరావు, నల్లా సూర్యప్రకాష్, ఎం.మారెప్ప, కొల్లి నిర్మల కుమారి సభ్యులుగా ఉంటారు.

ఆరోగ్యశ్రీని కాపాడండి

నిరుపేదల కోసం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చవద్దని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆరోగ్యశ్రీపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కింద ఇప్పటివరకూ ఉన్న 153 జబ్బులకు సంబంధించి చికిత్సను కార్పొరేట్ ఆసుపత్రుల జాబితా నుంచి తొలగించి ప్రభుత్వ ఆసుపత్రుల కింద చేర్చారని తెలిపారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంబంధిత వ్యాధుల చికిత్సకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించారా? అని ప్రశ్నించారు. మౌలిక సదుపాయాలు లేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేద రోగులు అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయకుమార్ జోక్యం చేసుకుంటూ... ‘ఆరోగ్యశ్రీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. వైఎస్ కాదు’ అని అన్నారు. ఈ నేపథ్యంలో శోభా నాగిరెడ్డి ప్రతిస్పందిస్తూ... ‘ఈ పథకాన్ని వైఎస్ ప్రవేశ పెట్టలేదని భావిస్తే ఆ మాట రాష్ట్ర ప్రభుత్వం చేత చెప్పించండి’ అని సవాల్ చేశారు.

జైలుకెళ్లాల్సిన బాబును ఎందుకు కాపాడినట్లు?


సీఎం బహిరంగపర్చాలన్న బాజిరెడ్డి 
చంద్రబాబు ఏజెంట్ కిరణ్

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎమ్మార్ కేసులో జైలుకెళ్లాల్సిన టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎందుకు కాపాడారో బహిరంగపర్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. కిరణ్-చంద్రబాబుల వ్యవహారం ‘లోపల కుస్తీ... బయట దోస్తీ’ అన్న చందంలా ఉందని విమర్శించారు. చంద్రబాబుకు ఏజెంట్‌లా సీఎం పనిచేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాసనసభలో ఇద్దరూ ఒకరి ప్రయోజనాలు మరొకరు కాపాడుకుంటూ అధికారపక్ష పాత్రలో కిరణ్, ప్రతిపక్షపాత్రలో చంద్రబాబు రక్తి కట్టించారని దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు వీరిద్దరూ చేస్తున్న అరాచకాలు, కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. 

‘‘ఎమ్మార్‌లో విల్లాలు కొనుగోలు చేసిన వారందరినీ విచారించిన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ... చంద్రబాబు కోడలు బ్రహ్మణిని నేరుగా ఎందుకు విచారించలేదు? కాంగ్రెస్‌తో ఉన్నఫిక్సింగ్ కారణంగానే వారి వద్దకు వెళ్లలేదా? ఈ కేసులో జైలుకెళ్లాల్సిన చంద్రబాబును కూడా అందులో భాగంగానే సీఎం కిరణ్ ఆదుకున్నట్లా?’’ అని నిలదీశారు. వైఎస్ మరణం తర్వాత శంకర్రావు పిటిషన్ మొదలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, బాన్సువాడ ఉప ఎన్నిక, మానవహక్కుల కమిషన్ చైర్మన్ ఎంపిక, అవిశ్వాస తీర్మానం... ఆఖరికి సమాచార కమిషనర్ల దాకా ఇలా అన్నింట్లో కాంగ్రెస్‌తో చంద్రబాబు చేసుకున్న మ్యాచ్‌ఫిక్సింగ్‌ను ఆయన వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఇన్నాళ్లుగా చెబుతున్న వాటినే తాజాగా పీసీసీ చీఫ్ బొత్ససత్యనారాయణ, మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చెబుతున్నారని తెలిపారు. 

లోకేష్ ‘చదివింపు’లు బయటపెట్టాలి

చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కు విదేశాల్లో చదువుకు ఖర్చు చేసిన మొత్తానికి సంబంధించి ఐటీ రిటర్న్, బ్యాంక్ లావాదేవీలను ప్రజల ముందుంచాలని గోవర్ధన్ డిమాండ్ చేశారు. అతని యూనివర్సిటీ ప్రవేశానికి కారణమైన జీమ్యాట్ స్కోర్‌ను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లోకేష్ చదువుకు సత్యం రామలింగరాజు రూ.60 కోట్లు చెల్లించారని దివంగత వైఎస్‌ఆర్ అసెంబ్లీలో బయటపెడితే దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా ఇన్నాళ్ల తర్వాత చంద్రబాబు స్పందించడంలో మర్మమేమిటని నిలదీశారు. లోకేష్ చదువులకు తానే డబ్బు కట్టినట్లయితే ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తప్పుడు మాటలు, అసత్యాలతో కాలం వెళ్లదీసే చంద్రబాబు... తాను గొప్ప సత్యహరిశ్చంద్రుడినని చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి

రాష్ట్రంలో మూడో పార్టీ, మూడో మనిషే ఉండకూడదట 
ప్రజలు కాంగ్రెస్, టీడీపీలకు మాత్రమే ఓట్లేయాలట
మీ నీచమైన రాజకీయాలను దేవుడు చూస్తున్నాడు 
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీ రెండు పార్టీలకూ డిపాజిట్లు కూడా దక్కకుండా చేస్తాడు

ఓదార్పు యాత్ర నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ఇవాళ ఈ రాష్ట్రంలో మూడో పార్టీ.. మూడో మనిషి ఉండకూడదన్న దురాలోచనతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమ్మక్కై కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. ‘ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, లేదంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే ఉండాలంటూ వీరు దారుణమైన రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలను మోసం చేయడానికే..ఇద్దరు కూడా కలసి కనికట్టు చేస్తున్నారు’ అని విమర్శించారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 65వ రోజు శుక్రవారం జగన్‌మోహన్‌రెడ్డి నరసరావుపేట పట్టణంలో పర్యటించారు. యాత్రలో ఎనిమిది వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. ప్రకాష్ నగర్‌లోని 60 అడుగుల రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జగన్ మాట్లాడారు. ఈ ప్రసంగం సారాంశం ఆయన మాటల్లోనే..

విలువలు కనపడడం లేదు: ఇవాళ రాష్ట్రంలో రాజకీయా లు ఎంతగా దిగజారిపోయాయీ అంటే ఈ రాజకీయ వ్యవస్థలో విలువలు కనపడటం లేదు.. విశ్వసనీయత అన్న పదానికి అర్థం పోయింది. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇద్దరు కూడా కుమ్మక్కై నీచమైన స్థాయిలోకి రాజకీయాలను దిగజార్చారు. మీ ఇద్దరికీ ఒక్కటే చెప్తున్నా.. మీ నీచమైన రాజకీయాలు ఎవరూ చూడటం లేదు అనుకుంటున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఏం చేసినా నడుస్తుందని అనుకుంటూ ఉండొచ్చేమో! కానీ ఒక్కటైతే చెప్తున్నా.. పై నుంచి దేవుడనేవాడు చూస్తున్నాడు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి దేవుడు చేస్తాడని, మనుషులు చేస్తారని ఈ ఇద్దరికీ కూడా ఇవాళ నేను చెప్తున్నా.

వైఎస్‌లాగా తపన పడే నేత లేడు: వైఎస్సార్ కంటే ముందు, ఆయన తరువాత చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు.. కానీ వైఎస్సార్ మాత్రమే సువర్ణ యుగాన్ని ఇవ్వగలిగారు. కారణం ఏమిటంటే.. వైఎస్సార్ మాత్రమే మండుతున్న ఎండను లెక్కచేయకుండా 1,500 కిలోమీటర్లు కాలినడకన ప్రతిపేదవాడి గుండె చప్పుడు వినటానికి బయలుదేరారు. తాను ముఖ్యమంత్రి అయితే..ఏమి చేస్తే ఆ పేదవాడి ముఖాన చెరగని చిరునవ్వు ఉంటుందన్న ఆలోచనతో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చే శారు కాబట్టే ఆయన సువర్ణయుగాన్ని ఇవ్వగలిగారు. చనిపోయిన తరువాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతికే ఉండాలన్న తపన, తాపత్రయం ఒక్క వైఎస్సార్‌కు మాత్రమే ఉండేది కాబట్టే ఆయన సువర్ణ పాలనను ఇవ్వగలిగారు. ఇప్పుడు అలా పేదవాడి కోసం తపన, తాపత్రయం పడే నాయకుడు ఒక్కరంటే ఒక్కరు కూడా కనపడడం లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో రైతన్న పరిస్థితి చూసినప్పుడు బాధనిపిస్తోంది.. గిట్టుబాటు లేక, దయనీయమైన పరిస్థితుల్లో ఉండి లక్ష ఎకరాల్లో పంట వేయకుండా సమ్మెకు దిగి.. నా గోడు వినండీ అని రైతన్న ప్రార్థన చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. రైతన్న దగ్గరకు వెళ్లి అన్నా.. ఎలా ఉన్నావని పలకరిస్తే.. ‘వ్యవసాయం చేయడం కంటే ఉరి వేసుకోవడం మేలు’ అనే మాట వినపడుతోంది. 

రాష్ట్రమంతటా సమ్మెలే: ఇవాళ రాష్ట్రంలో ఐకేపీ(ఇందిరా క్రాంతి పథం)ఉద్యోగులు సమ్మెకు దిగినా పట్టించుకున్న నాథుడు లేడు. జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నా పట్టించునే దిక్కు లేదు. అంగన్‌వాడీ కార్యకర్తలు సంవత్సరాల తరబడి సమ్మెలు చేస్తూ... దెబ్బలు తింటున్నా పట్టించుకునే దిక్కు లేదు. ఆదర్శ రైతులకు 8-10 నెలల నుంచి జీతాలు అందని పరిస్థితులు ఉన్నాయి. 108, 104 సిబ్బంది నిరాహార దీక్షలు చేస్తున్నా వాళ్లకు దిక్కూ దివానా లేని పరిస్థితులు రాష్ట్రంలో కన్పిస్తున్నాయి. మొత్తానికి ఇవాళ రాష్ట్రంలో పేదవాడి గురించి ఆలోచించే వారు లేరు.. ఒక్క సోనియా గాంధీ గురించి మాత్రమే ఆలోచన చేసే వాళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు.

YSR Statue By Children's at Shalem Nagar

25-2-2012 శనివారం నేటి ఓదార్పు యాత్ర షెడ్యూల్

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర శనివారం గుంటూరుజిల్లా నరసరావుపేట పట్టణం నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు తెలిపారు. 

వివరాలు..
25-2-2012 శనివారం నరసరావుపేట పట్టణంలో..

= శ్రీరాంపురం నుంచి యాత్ర ప్రారంభం
= వరవకట్టలో పర్యటన
= ప్రకాష్‌నగర్‌లో పర్యటన
= రిక్షా సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
= రెడ్ల బజార్‌లో విగ్రహావిష్కరణ
= షాలేమ్ నగర్‌లో విగ్రహావిష్కరణ 

వినుకొండ పట్టణంలో..
= వినుకొండలో బహిరంగ సభ

రాజకీయాల్లో చిరంజీవి ఫెయిల్: పీఆర్పీ ఎమ్మెల్యే గాంధీ మోహన్

రాజకీయాల్లో చిరంజీవి ఫెయిల్ అయ్యాడని పీఆర్పీ ఎమ్మెల్యే గాంధీ మోహన్ అన్నారు. అయితే కష్టాల్లో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఆదుకోవడంలో సక్సెస్ అయ్యారని ఆయన తెలిపారు. రాజమండ్రిలో జరిగిన యువజన సభలో పాల్గొన్న గాంధీ మోహన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో వేదికపై ఉన్న చిరంజీవి కంగుతిన్నారు

Kiran Kumar Reddy is binami for Chandrababu

Written By ysrcongress on Friday, February 24, 2012 | 2/24/2012

 సీఎం కిరణ్, చంద్రబాబు ఏజెంట్: బాజిరెడ్డి గోవర్దన్

హైదరాబాద్, న్యూస్‌లైన్:ఎమ్మార్ కేసులో జైలుకెళ్లాల్సిన టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎందుకు కాపాడారో బహిరంగపర్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్దన్ డిమాండ్ చేశారు. కిరణ్-చంద్రబాబుల వ్యవహారం ‘లోపల కుస్తీ... బయట దోస్తి’ అన్న చందంలా ఉందని విమర్శించారు. చంద్రబాబుకు ఏజెంట్‌లా సీఎం పనిచేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

శాసనసభలో ఇద్దరూ ఒకరి ప్రయోజనాలు మరొకరు కాపాడుకుంటూ అధికారపక్ష పాత్రలో కిరణ్, ప్రతిపక్షపాత్రలో చంద్రబాబు రక్తి కట్టించారని దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు వీరిద్దరూ చేస్తున్న అరాచకాలు, కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. 

‘‘ఎమ్మార్‌లో విల్లాలు కొనుగోలు చేసిన వారందరినీ విచారించిన సీబీఐ జేడీ లక్ష్మినారాయణ... చంద్రబాబు కోడలు బ్రహ్మణిని ఎందుకు విచారించలేదు? కాంగ్రెస్‌తో ఉన్నఫిక్సింగ్ కారణంగానే వారి వద్దకు వెళ్లలేదా? ఈ కేసులో జైలుకెళ్లాల్సిన చంద్రబాబును కూడా అందులో భాగంగానే సీఎం కిరణ్ ఆదుకున్నట్లా?’’ అని నిలదీశారు. వైఎస్ మరణం తర్వాత శంకర్రావు పిటిషన్ మొదలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, బాన్సువాడ ఉప ఎన్నిక, మానవహక్కుల కమిషన్ చైర్మన్, శాసనసభలో అవిశ్వాస తీర్మానం... ఆఖరికి సమాచార కమిషనర్ల దాకా ఇలా అన్నింట్లో కాంగ్రెస్‌తో చంద్రబాబు చేసుకున్న మ్యాచ్‌ఫిక్సింగ్‌ను ఆయన వివరించారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ ఇన్నాళ్లుగా చెబుతున్న వాటినే తాజాగ పీసీసీ చీఫ్ బొత్ససత్యనారాయణ, మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చెబుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్న అవేవి పట్టని ప్రతిపక్షనేత చంద్రబాబు దివంగత వైఎస్‌ఆర్ ఏ విధంగా అప్రతిష్ట పాలుచేయాలనే ఆలోచనతో ఉన్నారని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ సక్రమంగా అమలు కాకపోయినా చంద్రబాబు కిమ్మనడం లేదంటే వీరిద్దరి మధ్య సహకార బంధం ఎంత బలంగా ఉందో అర్థమవుతుందన్నారు. 

లోకేష్ ‘చదివింపు’లు బయటపెట్టాలి

చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కు విదేశాల్లో చదువుకు ఖర్చు చేసిన మొత్తానికి సంబంధించి ఐటీ రిటర్న్, బ్యాంక్ లావాదేవీలను ప్రజల ముందుంచాలని గోవర్దన్ డిమాండ్ చేశారు. అతని యూనివర్సిటీ ప్రవేశానికి కారణమైన జీ మ్యాట్ కోర్‌ను విడుదల చేయాలన్నారు. లోకేష్ చదువుకు సత్యం రామలింగరాజు రూ.60 కోట్లు చెల్లించారని దివంగత వైఎస్ అసెంబ్లీలో బయటపెడితే దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగిన చందంగా ఇన్నాళ్ల తర్వాత చంద్రబాబు స్పందించడంలో మర్మమేమిటని నిలదీశారు. 

లోకేష్ చదువులకు తానే డబ్బు కట్టినట్లయితే ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ తప్పుడు మాటలు, అసత్యాలతో కాలం వెళ్లదీసే చంద్రబాబు... తాను గొప్ప సత్యహరిశ్చంద్రుడనని చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. చంద్రబాబు అవకాశవాదాన్ని గమనించినందునే తెలుగు ప్రజలు రెండుసార్లు ఛీ కొట్టారని గోవర్దన్ వివరించారు.
అయినా ఈ విషయమై ఆరోపణలు చేసిన ఆరు నెలలకు ఇప్పుడు స్పందిస్తారా? అని ప్రశ్నించారు. ఖర్చు పెడితే లోకేష్ చదువుకు అయిన 60 కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పాలని నిలదీశారు. 

సమయం సందర్భంలేకుండా మహానేత డాక్టర్ వైఎస్ గురించి మాట్లాడుతున్నారని బాజిరెడ్డి అన్నారు.

విజయమ్మకు ఘన స్వాగతం

వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ విజయమ్మ శుక్రవారం ఉదయం తిరుపతి చేరుకున్నారు. నగరి మాజీ మున్సిపల్‌ చైర్మన్‌, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఎల్‌వి రావు కుమారుడి వివాహానికి ఆమె హాజరవుతారు. రేణిగుంట విమానాశ్రయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు విజయమ్మకు ఘన స్వాగతం పలికారు. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. విజయమ్మ వెంట పార్టీ నేత రోజా కూడా ఉన్నారు.

Sonia gandhi IT returns citing privacy

ఆదాయపు పన్ను వివరాలు అందించబోనని సోనియాగాంధీ ఆర్టీఐకి స్పష్టం చేశారు. భద్రత కారణాల దృష్ట్యా ఆదాయ పన్ను వివరాలు ఇవ్వలేనని చెప్పారు. గత పదేళ్లుగా సోనియాకు సంబంధించిన ఐటీ రిటర్న్స్ వివరాలు తెలపాలంటూ చెన్నైకి చెందిన ఆర్టీఐ కార్యకర్త దరఖాస్తు చేశారు. ప్రజా జీవనంలో ఉన్న వ్యక్తులు మూడో పార్టీకి వివరాలు ఇవ్వడం ఆదాయపన్ను చట్టం సెక్షన్ 138 ప్రకారం కుదరదని సోనియా ఆర్టీఐకి తెలిపారు.

చంద్రబాబు కాలనీలో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ

నరసరావుపేట చంద్రబాబు కాలనీలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఇక్కడకు వచ్చిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జగన్ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. 

ఆ తరువాత ఆయన మిట్టబజార్ లో మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు క్రిష్టియన్ పాలెంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. నరసరావుపేటలో మొత్తం 9 వైఎస్ఆర్ విగ్రహాలను ఏర్పాటు చేశారు.

ఉపఎన్నికలు కచ్చితంగా రెఫరెండమే:బాలినేని

రాష్ట్రంలో జరగబోయే ఉప ఎన్నికలు ప్రభుత్వానికి కచ్చితంగా రెఫరెండమేనని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో ప్రభుత్వం ఎన్ని కట్రలు చేసినా ఓటమి తప్పదని బాలినేని జోస్యం చెప్పారు. ప్రకాశం జిల్లాలో మంత్రి మహీధర్‌ రెడ్డిని జనమంతా శాడిస్టుగా చూస్తున్నారని బాలినేని విమర్శించారు.

ఈనాడులో కట్టుకథలు-‘అనకొండ పెన్నా కథనం ఈనాడు- సీబీఐ కుమ్మక్కుకు నిదర్శనం


‘అనకొండ పెన్నా’ కథనం వీరి కుమ్మక్కుకు నిదర్శనం
కోర్టులో ఎదురుదెబ్బతో ఈనాడులో కట్టుకథలు
సాయిరెడ్డికి బెయిల్ రానివ్వకుండా చేసేందుకు తప్పుడు రాతలు
ముందుగా అరెస్టులు.. తర్వాత ఆధారాల కోసం వెతుకులాటలు.. ఇదీ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, చంద్రబాబు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తీరు

సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, ఈనాడు అధినేత రామోజీరావు కుమ్మక్కై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై బురదజల్లే కార్యక్రమం చేపట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. విజయసాయిరెడ్డికి బెయిల్ రానివ్వకుండా చూడాలనే దురుద్దేశంతోనే సీబీఐ ఈనాడుతో తప్పుడు రాతలు రాయిస్తోందని పేర్కొన్నారు. ఈ కుట్రలో భాగంగానే శ్రీలక్ష్మి, రాజగోపాల్‌లను తమ కస్టడీకి అప్పగించాలంటూ కోర్టులో పిటిషన్ వేసిందని ధ్వజమెత్తారు. గురువారం రాత్రి పద్మ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 

ప్రకటన పూర్తి పాఠం...

‘‘దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం మీద బురదజల్లే కార్యక్రమంలో రామోజీరావు నేతృత్వంలోని ఈనాడు, సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఎంతగా పెనవేసుకుపోయి సహకరించుకుంటున్నారో గురువారం ఈనాడు ప్రచురించిన పతాక శీర్షిక వార్త ద్వారా వెల్లడయింది. ‘అనకొండ పెన్నా’ అంటూ ప్రచురించిన ఆ వార్తలో బాక్సైట్‌ను మింగడానికే ‘రస్‌అల్ ఖైమా’ ముసుగు తొడిగారంటూ పేర్కొంది. అయితే శాసనసభ సమావేశాలు, విద్యుత్ చార్జీల దొంగ దెబ్బకు సర్కారు సిద్ధపడటం వంటి ప్రజలకు మేలు చేసే అంశాలను వదిలిపెట్టి రామోజీ పత్రిక ఉన్నట్టుండి పెన్నా సిమెంట్‌ను తెరపైకి తేవడం వెనుక ఉన్న కుతంత్రాన్ని ప్రజలకు వివరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ భావిస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులు, వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలపై కాంగ్రెస్, టీడీపీలు కలిసి దాఖలు చేసిన వ్యాజ్యం ఆధారంగా రాష్ట్ర హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడం...అదే సమయంలో చంద్రబాబు, ఆయన బినామీల ఆస్తులపై సీబీఐ విచారణ అవసరం లేదంటూ పిటిషన్ కొట్టి వేయడం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయాలే. సాక్షికి లభిస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక రామోజీరావు పత్రిక రాసిన అభూత కల్పనలనే ఆధారాలుగా భావించి ఇంతకాలం దర్యాప్తు జరిపిన సీబీఐ...అవి రూఢీకాక, లేనిపోని ఆరోపణలు.. అభాండాలతో కక్ష సాధింపునకు పూనుకోవడం న్యాయకోవిదుల దృష్టిని దాటి పోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ నమ్ముతోంది. 

జగన్ ఆస్తులకు సంబంధించిన కేసులో శ్రీలక్ష్మి, రాజగోపాల్‌లను కూడా విచారించాలన్న సీబీఐ పిటిషన్ వెనుక ఉద్దేశాలు సుస్పష్టం. ఈ కేసుకు సంబంధించి అసలు విజయసాయిరెడ్డి అరెస్టే అక్రమం. ఆయన ఏనాడూ పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం పరిధిలోకి వచ్చిన వ్యక్తి కానే కాదు. అయినా ఆయనను అరెస్టు చేసి...సాక్షి పెట్టుబడులన్నీ వైఎస్ అధికార దుర్వినియోగం కారణంగానే వచ్చాయని చెప్పించడానికి సీబీఐ తన పరిధికి మించి వ్యవహరిస్తూ చేయరాని పనులెన్నో చేసుకుపోతోంది.

ఇప్పుడిక విజయసాయిరెడ్డిని ఎందుకు అరెస్టు చేశారో స్పష్టమైన ఆధారాలు చూపాలి. లేదంటే ఆయన్ను విడుదల చేయాల్సిన పరిస్థితి. అయితే 60 రోజుల తర్వాత కూడా విజయసాయిరెడ్డిని ఎలాగైనా జైల్లోనే ఉంచాలనే కుట్రపూరితమైన ఆలోచనతోనే.. శ్రీలక్ష్మి, రాజగోపాల్‌ల విచారణకు అనుమతించాలని సీబీఐ కోరుతోందనే విషయం స్పష్టం అవుతోంది. ముందుగా అరెస్టులు...ఆ తరువాత ఆధారాల వెతుకులాటలు! ఇదీ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా, గతంలో చంద్రబాబు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా రాష్ట్రంలో తిరుగులేని కీర్తి సంపాదించిన సీబీఐ వ్యవహారశైలి. దీన్ని విచారణ అంటారా? లేక నియంతృత్వ దేశాల్లో కిరాయి సంస్థల రాజకీయ కక్ష సాధింపులకు ఇది సమానమైన వ్యవహారమా? అని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఈ కిరాయి కార్యక్రమానికి ‘ఈనాడు’ను, మరికొన్ని పత్రికలను సీబీఐ ఎంచుకుందనేది ఈ రాష్ట్రంలోని పాత్రికేయ మిత్రులందరికీ తెలిసిన విషయమే. 

ఈ కేసు విచారణ ప్రారంభం నుంచీ సీబీఐ ఏయే పత్రికలకు మెటీరియల్ సరఫరా చేసి జగన్ సంస్థలకు వ్యతిరేకంగా వార్తలు రాయించిందో.. ఆయా పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టు మిత్రులు కొందరికి కూడా ఈ విషయం తెలుసు. విజయసాయికి బెయిల్ లభించకుండా చేసేందుకు సీబీఐ పన్నిన పన్నాగం బయట పడుతూనే ఉంది. అది సీబీఐ కోర్టులో పారక పోయేసరికి, రామోజీతో కలిసి ఓ కట్టు కథనాన్ని సీబీఐయే వండించిందనే విషయం.. ఈ అంశాలను నిశితంగా పరిశీలించే వారెవరికైనా అర్థం అవుతుంది. రామోజీ.. నీకెందుకు వైఎస్ అనే రెండు అక్షరాలంటే అంత భయం? మహానేత మరణించిన రెండున్నరేళ్ల తర్వాత కూడా నీకు ఎందుకంత దడపుడుతున్నట్లు ? ఈ రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు కొందరిని ఎంచుకుని నువ్వు చేస్తున్న దాడులకు ప్రాతిపదిక ఏమిటి? ఇప్పుడు వైఎస్ కుటుంబం అధికారంలో లేదే! ఈ ప్రశ్నలకు బయటకు వచ్చి సమాధానం చెప్పే ధైర్యం ఏనాడూ నీకు లేదు, 

ఇక పెన్నా సిమెంట్ ప్రతాపరెడ్డి సాక్షి పత్రికలో ఎందుకు పెట్టుబడులు పెట్టారో.. ఒకటి కాదు, రెండు కాదు పదే పదే రామోజీ పత్రిక తన అవసరాన్ని బట్టి ఎన్నో కథనాలు ప్రచురిస్తూ వచ్చింది. బంజారాహిల్స్‌లోని తన స్థలంలో ఓ హోటల్ నిర్మించుకోవడానికి ప్రతాపరెడ్డికి కొన్ని నిర్మాణ మినహాయింపులు ఇవ్వడం వల్లే ఆయన పెట్టుబడులు పెట్టారన్నది కొన్ని సంవత్సరాలుగా టీడీపీ, దాని అధిష్టానమైన ఈనాడుల వాదన. ఈ వాదననే సీబీఐ నెత్తికి ఎత్తుకుని నిన్న మొన్నటి వరకు దర్యాప్తు జరిపింది. అదంతా డొల్ల వాదన అని అర్థం అవుతున్న నేపథ్యంలో ఇపుడు కొత్త పాట మొదలు పెట్టారు. 

యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భాగమైన ‘రస్ అల్ ఖైమా’కు చెందిన సంస్థ భాగస్వామిగా ఉన్న అల్యూమినియం ప్రాజెక్టులో పెన్నా ప్రతాపరెడ్డి వాటాయే ఎక్కువ ఉందని ‘ఈనాడు’ తాజాగా కనిపెట్టిందట! నిజానికి పెన్నా సంస్థకు విశాఖ బాక్సైట్ తవ్వకాలకు ఏ సంబంధమూ లేదు. అదీ కాక ఒక సంస్థలో వాటాలు తగ్గడం, పెరగటం అన్నది నేరం అన్నట్లుగా రాయవచ్చని రామోజీకి ఎవరు చెప్పారు? పెన్నా ప్రతాపరెడ్డి ఆంధ్రప్రదేశ్ గర్వించదగిన పారిశ్రామికవేత్తల్లో ఒకరు. 

ఆయనేమీ పచ్చళ్లు-పత్రిక అనే విచిత్రమైన కాంబినేషన్‌తో వందలకోట్లు సంపాదించానని చెప్పుకునే వ్యక్తి కాదే! రామోజీవి కళ్లు బైర్లు కమ్మి, కళ్లు మూసుకుని రాస్తున్న కిరాయి రాతలు. అమెరికన్ ఐఎంజీ పేరుతో బిల్లీరావుతో కంపెనీ పెట్టించి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేబినెట్ ఆమోదం లేకుండానే జీవో జారీ చేయించి...ఆరుసూత్రాల పథకంలో భాగంగా ఏర్పడిన సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 450 ఎకరాలను కాజేసే కుట్రకు చంద్రబాబు పాల్పడినపుడు మీ కళ్లు ఏమయ్యాయి? ఇదే దుబాయ్ ప్రసాద్ అలియాస్ కోనేరు ప్రసాద్ ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో పొందిన వాటా ఎంత? ఎమ్మార్‌లో దుబాయ్ ప్రభుత్వం వాటా ఎంత? ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడైన ప్రధానుల్లో ఒకరిగా పేరొందిన చంద్రబాబు ఆప్తమిత్రుడు మహతీర్ మహ్మద్ కొడుక్కి సంబంధించిన కంపెనీని ముందు పెట్టి...టీడీపీ ఒకప్పటి ఎంపీ బోళ్ల బుల్లిరామయ్య దగ్గరి వ్యక్తులకు, చంద్రబాబుకున్న అనేక బినామీల్లో ఒకరిగా భావించే కేవీరావుకు కాలక్రమంలో కాకినాడ పోర్టు ఎలా అందిందో అదే ఆర్‌ఓసీలో చూడాలని రామోజీకి ఏనాడూ ఎందుకు అనిపించలేదు? ఇంతకీ కాకినాడ పోర్టులోని చంద్రబాబు విదేశీ మిత్ర కంపెనీలు ఏమయ్యాయి? వాటి డబ్బును విత్‌డ్రా చేసి చంద్రబాబు ఏయే దేశాల్లో ఎంతెంత మూటలు కట్టుకుంటున్నారో పరిశోధించాలని ఎందుకు అనిపించ లేదు? అంతెందుకు? చంద్రబాబునాయుడు కోడలు ఎక్కువకాలం సింగపూర్‌లోనే ఎందుకు ఉంటోందో నిగ్గు తేల్చాలని మీకెందుకు అనిపించడం లేదు? రామోజీ ఎవరికోసం నీ జర్నలిజం...? ఏ ప్రయోజనాల కోసం మీ రాతలు? విశాఖ బాక్సైట్‌కు సంబంధించిన నిజాలను వెలికితీస్తే అందులో బయటపడేది చంద్రబాబు నాయుడు మాత్రమే. సీబీఐకి కళ్లుంటే చూడాల్సిన అంశాల్లో మొదటిది అసలు రస్ అల్ ఖైమానుగానీ, దుబాయ్ అల్యూమినియం కంపెనీ (దుబాల్)ను గానీ ఈ రాష్ట్రానికి తీసుకువచ్చింది ఎవరు? చంద్రబాబుకు బినామీగా పేరొందిన వ్యక్తులు 2000కు పూర్వమే రంగం సిద్ధం చేసుకుని యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ప్రభుత్వాలను ముందుంచి మన రాష్ట్రంలో ఎందుకు కాలు మోపారు? చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యుల మలేసియా, సింగపూర్, యూఏఈ, ఐరోపా పర్యటనల్లో అసలు మర్మం ఏమిటి? ఇలా.. సీబీఐ ఏ కేసును తవ్వినా అవినీతి మూలాలు తేలేది, చంద్రబాబు ఇంట్లోనే. అయినా మీ పత్రికకు పారిశ్రామికవేత్తలు అనకొండలు....చంద్రబాబు కుటుంబసభ్యులు బంగారు కొండలు! జనం చూస్తున్నారు. కనీసం మీ రాతలకు మీరు సిగ్గుపడండి రామోజీ! 

ఇక విశాఖ బాక్సైట్ విషయానికొస్తే... ఇవీ నిజాలు

1)గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ హక్కులు గిరిజనులకు మాత్రమే చెందుతాయని సమతా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రపదేశ్ అండ్ అదర్స్ కేసులో సుప్రీంకోర్టు చెప్పినా...2000లోనే విశాఖ బాక్సైట్‌ను చంద్రబాబు తన ఖాతాలోకి లాగించేసుకోవడానికి దుబాయ్ బాబులను రంగంలోకి దింపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు సంబంధిత శాఖలో అందుబాటులో ఉన్నాయి.

2)గిరిజన చట్టాలను తుంగలో తొక్కి, సుప్రీంకోర్టు సమతా కేసులో ఇచ్చిన తీర్పును కూడా కాదని...2000 మే 24న విశాఖపట్నం గిరిజన కార్పొరేషన్‌లో గిరిజన సలహా మండలి సమావేశం నిర్వహింపజేసి...మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్‌మెంట్ అండ్ రిజిస్ట్రేషన్) యాక్ట్ 1957లోని సెక్షన్ 5ను నిర్వీర్యం చేసింది చంద్రబాబునాయుడే. ఈ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో మైనింగ్ లీజులను షెడ్యూల్డ్ తెగ కు చెందనివారికి ఇచ్చే వీల్లేదు. దాన్ని చంద్రబాబునాయుడు గిరిజన సలహా మండలితోనే మార్పించారు. అంటే గిరిజనుల అభివృద్ధికి మాత్రమే కృషి చేయాల్సిన చట్టబద్ధ సంస్థ వేలితోనే గిరిజనుల కళ్లు పొడిపించారు.

3)మైనింగ్ చట్టాలకు చంద్రబాబు తూట్లు పొడిచిన నేపథ్యంలో విశాఖ బాక్సైట్ మైనింగ్‌ను ప్రైవేటు వ్యక్తులకు నేరుగా కట్టబెట్టే అవకాశం ప్రభుత్వాలకు లభించింది. 

4)దుబాల్‌ను ముందు పెట్టుకుని...చంద్రబాబు తరఫున కోనేరు రాజేంద్రప్రసాద్ మంత్రాంగం నడుపుతున్నపుడు...కోనేరుకు అల్యూమినియం రంగం లో ఉన్న అనుభం ఏమిటని ‘ఈనాడు’ ఒక్క ముక్క అయినా రాస్తే ఒట్టు!
5)ఇదే కోనేరు ప్రసాద్ కు హైదరాబాద్‌లో అత్యంత విలువైన 535 ఎకరాల భూముల్ని కేటాయిస్తున్నప్పుడు...ఎమ్మార్ వాటా ఎంత? అసలు కోనేరు ప్రసాద్ నడిపే వ్యవహారం ఏమిటన్న ఆలోచన కూడా పాఠకుడికి రాకుండా రామోజీ వల్లమాలిన తెలివి ప్రదర్శించారు.

6)ఇక రస్ అల్ ఖైమా విషయానికి వస్తే... ఆ సంస్థకు పశ్చిమగోదావరి జిల్లా పెద్దాపురం పక్కనే ఏకంగా 200 ఎకరాల భూములను అప్పగిస్తూ ఎంవోయూ కుదుర్చుకున్నది సాక్షాత్తు చంద్రబాబు మాత్రమే.

7)అప్పట్లో దుబాయ్ ప్రసాద్‌గా పేరొందిన కోనేరు ప్రసాద్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన దుబాల్.. విశాఖ బాక్సైట్ గనుల లీజులను కూడా తమకు అప్పగించాలని పట్టుబట్టింది. 2004లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఉంటే ఆ పని కూడా జరిగిపోయేదే.

8)వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని ఏ ప్రైవేటు వ్యక్తికీ అప్పగించలేదు. వాటి లీజులు మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నాయి. 

9)మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు, పెన్నా ప్రతాపరెడ్డి పెట్టుబడులు పెట్టిన సంస్థకు మధ్య ఉన్నది బాక్సైట్ కొనుగోలు ఒప్పందం మాత్రమే. ఈ బాక్సైట్‌ను ఇక్కడే అల్యూమినియంగా మార్చే కర్మాగారం నెలకొల్పితే, ఇక్కడివారికి ప్రత్యేకించి గిరిజనులకు ఉద్యోగావకాశాలు భారీగా ఉంటాయన్నది వైఎస్ సంకల్పం.

10)ఏపీఎండీసీకిగానీ, గిరిజనులకు గానీ అత్యధిక ప్రయోజనాలు కల్పించేలా వైఎస్ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది. ఒడిశాలో వేదాంతతోగానీ దేశంలో మరే సంస్థతోగానీ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం కంటే.. వైఎస్ ప్రభుత్వం మేలైన ఒప్పందం కుదుర్చుకుంది. ఇంతకంటే మెరుగైన ఒప్పందాన్ని చూపగల సత్తా ఎవరికైనా ఉందా? అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది.

11)కర్మాగారాలు నెలకొల్పటం అంటే పారిశ్రామికవేత్తలకు వందలూ వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే వ్యవహారం. ఇందులో ముడుపులు అందాయనుకుంటే మరి కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల ప్రైవేటీకరణలో ఆయా కంపెనీల నుంచి చంద్రబాబు కొట్టిన కమీషన్లు ఎంత? పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలందరి నుంచి చంద్రబాబు ఇలా కమీషన్లు అడగబట్టే పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్లలో లక్షన్నర కోట్ల పెట్టుబడులు ప్రకటించినా.. వంద కోట్లు కూడా రాలేదని భావించవచ్చా?

12)ప్రభుత్వ సంస్థలు మినరల్స్‌కు సంబంధించిన ఎగుమతులు, అమ్మకాలు చేస్తాయి. ఉదాహరణకు సింగరేణి.. బొగ్గును అనేక సంస్థలకు అమ్ముతుంది. కొనుగోలు చేసిన సంస్థలు సింగరేణికో, ముఖ్యమంత్రికో లంచాలు ఇస్తాయని చంద్రబాబు రామోజీకి ఏమైనా చెప్పారా?

ఎలాంటి తర్కంతోను, నీతి నియమాలతోనూ సంబంధం లేకుండా సాగుతున్న రామోజీ పాత్రికేయంలో ఎన్నెన్ని వికృత రూపాలు ఉన్నాయో ఈనాడు రాతల్లో బయటపడుతోంది. జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేని సన్నాసులందరితో జతకట్టి సీబీఐ దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన దర్యాప్తు నాటకం ఆడుతోంది. గిట్టని పత్రికలు, గిట్టని చానళ్ళు, గిట్టని రాజకీయపార్టీలు... ఇన్నింటితో కుమ్మక్కై ఒక్క మనిషిని వేధించటాన్ని తెలుగు ప్రజానీకం ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నమ్ముతోంది. ఇలాంటి కుట్రలూ కుహకాలతోనే దశాబ్దాలుగా బతుకుతున్న వ్యక్తులకు ప్రజలే బుద్ధి చె ప్పే రోజు వస్తుందని విశ్వసిస్తోంది.’’

24-2-2012 శుక్రవారం జగన్‌ ఓదార్పుయాత్ర











ఈ చేతులు నీకు జై కొట్టేందుకే.. ఈ కాళ్లు నీ వెంట నడిచేందుకే

ఓదార్పు దారిలో జనకేతనం రెపరెపలాడుతోంది. అలుపన్నదే ఎరుగని జననేతతో ప్రజలంతా కలిసి నడుస్తున్నారు. ఆయన అడుగులో అడుగు వేస్తున్నారు. తమ క్షేమం కోరిన జననేతకు ఊరూవాడా కలిసి అపూర్వ స్వాగతం పలుకుతోంది. ఈ చేతులు నీకు జై కొట్టేందుకే.. ఈ కాళ్లు నీ వెంట నడిచేందుకే.. అన్నంతగా యువకులు అభిమానం చాటుతున్నారు. ‘నిన్ను చూస్తే.. మాకు అడగకుండానే వరాలిచ్చిన ఆ మహానేత గుర్తుకొస్తున్నాడు. నువ్వు చల్లగా ఉండాలి బాబూ..’ అంటూ వృద్ధులు మనసారా దీవిస్తున్నారు. మహిళలు తమ ఆత్మీయ బంధువు ఇంటికొచ్చినట్లు, బొట్టుపెట్టి హారతిచ్చి స్వాగతిస్తున్నారు. మా కష్టాలు తీర్చే నాథుడు నువ్వే.. అంటూ అన్నదాత ఆశిస్తున్నాడు. అందరి సమస్యలు వింటూ.. కొండంత భరోసా ఇస్తూ ఓదార్పు యాత్రలో జగన్ ముందుకు సాగుతున్నారు. 
రొంపిచర్ల, న్యూస్‌లైన్ : అభిమానం వెల్లివిరిసింది. పల్లెల్లో ప్రజలు జగన్‌ను అక్కున చేర్చుకున్నారు. ఓదార్పు యాత్రలో 64వ రోజైన గురువారం నరసరావుపేట నియోజకవర్గంలో రొంపిచర్ల మండలంలోని పది గ్రామాల్లో 27 కిలోమీటర్లు జగన్ పర్యటించారు. పది వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. యాత్ర సాగిందిలా.. గురువారం ఉదయం 9.45 గంటలకు రొంపిచర్లలో పార్టీ నాయకులు మెడికొండ శ్రీనివాసరెడ్డి నివాసం నుంచి ఓదార్పుయాత్రను ప్రారంభించారు. తొలుత బీసీ కాలనీ చేరుకుని అక్కడ కూలీలను పలకరించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తంగెడుమల్లి మేజర్ కాలువ వద్ద రైతులు, రైతు కూలీలు జగన్‌ను కలసి తమ సమస్యలను విన్నవించారు. అనంతరం కొనకంచివారిపాలేనికి చేరుకున్న జగన్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. తెలుగు బాప్టిస్టు చర్చిలో ఫాదర్ తిరుపాల్ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో జగన్ పాల్గొన్నారు. 

అనంతరం పాలకేంద్రం సెంటర్ చేరుకుని అక్కడ వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడినుంచి గోగులపాడు పయనమైన జగన్‌కు మార్గం మధ్యలో మిర్చి రైతు పొనుగోటి వెంకటేశ్వర్లు పూర్తిగా నష్టపోయామంటూ కష్టాలను విన్నవించారు. అనంతరం గోగులపాడు చేరుకుని తొలుత ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఎస్సీ కాలనీలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్థానిక నాయకులు దావులూరి అంజయ్య, పొందూరి శ్రావణ్‌కుమార్, తుర్లపాటి వీరాంజనేయులు నేతృత్వంలో 800 మంది కార్యకర్తలు జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం సెవెన్త్‌డే అడ్వంటిస్ట్ చర్చిలో ఫాదర్ సాతులూరు శ్యామ్‌సన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో జగన్ పాల్గొన్నారు. అనంతరం దావులూరు అంజయ్య నివాసంలో అల్పాహార విందులో పాల్గొన్నారు. ఆ తర్వాత సీతారామాంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి లూథరన్ చర్చి చేరుకుని ఫాదర్ జి.మోహన్‌రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అలవాలలో ఘనస్వాగతం..
అక్కడ నుంచి అలవాల చేరుకున్న జగన్‌కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి జగన్ పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సెవెన్త్ డే అడ్వంటిస్ట్ చర్చిలో ఫాదర్ కడియం విక్టర్‌బాబు, తెలుగు బాప్టిస్టు చర్చిలో ఫాదర్ కాకాని ఏసోబు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం బీసీ కాలనీ చేరుకుని అంకమ్మగుడిలో పూజారి తన్నీరు వెంకటేశ్వర్లు చేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గ్రామ ప్రధాన సెంటర్‌కు చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. అనంతరం చిట్టిపోతులవారిపాలెంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత సుబ్బయ్యపాలెం వెళ్లి ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా వీరవట్నం గ్రామస్తులు జగన్ తమ గ్రామానికి రావాలని పట్టుపట్టారు. అన్నవరం అడ్డరోడ్డులోని ఎస్సీకాలనీలో వైఎస్సార్ విగ్రహాన్ని, రామాలయం సెంటర్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ మరో విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు మారెళ్ల శివారెడ్డి నివాసంలో అల్పాహార విందులో పాల్గొన్నారు. అక్కడ నుంచి వీరవట్నం చేరుకున్నారు. తొలుత గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పాత చర్చిలో ఫాదర్ ఇస్సాక్ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. 

అనంతరం గ్రామంలో మరణించిన సాయి కోటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి అక్కడ నుంచి పయనమై వడ్లమూడివారిపాలేనికి చేరుకున్నారు. అన్నెం సీతారెడ్డి నివాసంలో అల్పాహార విందులో పాల్గొని అనంతరం సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తర్వాత ఎస్సీ కాలనీలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బస్సుషెల్టర్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడినుంచి గ్రామ ప్రధాన సెంటర్‌కు చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. అక్కడ నుంచి తిరుగు పయమై అల్లూరివారిపాలెంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం నరసరావుపేట చేరుకొని పార్టీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసానికి రాత్రిబసకు చేరుకున్నారు.

ముఖ్యనేతల హాజరు
విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ సభాధ్యక్షత వహించారు. పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, కృష్ణాజిల్లా నేత పి.గౌతమ్‌రెడ్డి, గుంటూరు జిల్లా నాయకులు ఆర్కే, జిల్లా యువజన విభాగం కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, నసీర్ అహ్మద్, చిట్టా విజయభాస్కరరెడ్డి, ఆతుకూరి ఆంజనేయులు, డైమండ్‌బాబు, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి, డాక్టర్ గజ్జల నాగభూషణరెడ్డి, డాక్టర్ యజ్ఞనారాయణరెడ్డి, కట్టా సాంబయ్య, శాస్త్రి, మేరిగ విజయలక్ష్మి, దేవళ్ల రేవతి, శ్రీరెడ్డి, మండెపూడి పురుషోత్తం, ఇందూరి నరసింహారెడ్డి, సానికొమ్ము కోటిరెడ్డి, పిల్లి ఓబుల్‌రెడ్డి, చింతా సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కాంగ్రెస్‌పార్టీ నేత, పీఆర్పీ గుంటూరు నగర కన్వీనర్ షేక్ షౌకత్ కలిశారు. ఓదార్పుయాత్రలో భాగంగా గురువారం రొంపిచర్లలో బసచేసిన జగన్‌కు పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, జిల్లా నాయకులు ఆర్కే తదితరులు షౌకత్‌ను పరిచయం చేశారు. షౌకత్ గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున కార్పొరేటర్‌గా, అనంతరం ప్రజారాజ్యంపార్టీ నగర కన్వీనర్‌గా పనిచేశారు. 2009 ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలై రెండోస్థానంలో నిలిచారు.ప్రస్తుతం కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, అందుకే జగన్‌ను కలిసి తన మనోగతాన్ని వెల్లడించానని షౌకత్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరిగే ఓదార్పుయాత్రలో పాల్గొని జగన్ సమక్షంలో ఐదువేల మంది కార్యకర్తలతో పార్టీలో చేరనున్నట్లు వివరించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఆయనను పార్టీ జిల్లా ఇన్‌చార్జి జ్యోతుల నెహ్రూ, జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, జిల్లా నాయకులు ఆర్కే, నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు పార్టీలోకి ఆహ్వానించారు.


 

Popular Posts

Topics :