26 February 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

తెలంగాణ కోసం పదవిపోవడం సంతోషం

Written By ysrcongress on Saturday, March 3, 2012 | 3/03/2012

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఎమ్మెల్యే పదవిని కోల్పోవడం తనకు చాలా సంతోషంగా ఉందని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. తెలంగాణ రాజకీయ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకే అవిశ్వాసం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు ఆమె చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదని అవిశ్వాసానికి మద్దతిచ్చానన్నారు. తెలంగాణ కోసం తాను చేసిన కృషి పరకాల ప్రజలు తప్పకుండా ఆదరిస్తారన్నారు. పరకాలలో తనపై టీఆర్‌ఎస్ పోటీ చేస్తే అది స్వయంకృతాపరాదమే కాకుండా తెలంగాణ వాదాన్ని నీరుగార్చటం అవుతుందన్నారు. ఆమె తన నివాసంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ విషయంలో తన చిత్తశుద్దిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు. తాను రెండు సార్లు రాజీనామా చేశానని చెప్పారు. ఇప్పటికీ స్పీకర్ వద్ద ఒకటి పెండింగ్‌లోనే ఉందన్నారు. విప్ దిక్కరించినందుకు అనర్హత వేశారే కానీ తన రాజీనామాను డిస్మిస్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించలేదన్నారు.

పరకాలలో తనపై టీఆర్‌ఎస్ పోటీ చేయదని భావిస్తున్నట్లు చెప్పారు. ఒక వేళ పోటీ చేస్తే రాజకీయ జేఏసీ, విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వచ్చే అవకాశముందని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఎక్కడా ప్రవర్తించలేదన్నారు. సెంటిమెంట్‌ను గౌరవించినందు వల్లే తెలంగాణ కోసం పదవులు వదులుకున్న స్థానాల్లో తమ పార్టీ పోటీ చేయడంలేదని వివరించారు. తెలంగాణపై కాంగ్రెస్ నాన్చుడి ధోరణి వల్లే ఎన్నో కుటుంబాలు తమ పిల్లల్ని కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇప్పటికీ కేసులతో వేధింపులకు గురవుతున్నారని గుర్తు చేశారు. అందుకే ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండరాదనే అవిశ్వాసానికి మద్దతిచ్చానని చెప్పారు. అవిశ్వాసానికి రెండ్రోజుల ముందు కూడా ఇదే విషయాన్ని చెప్పానన్నారు. తెలంగాణను ఏ విధంగా కాంగ్రెస్ అణగదొక్కుతుందో వచ్చే ఉప ఎన్నికల్లో ప్రజలకు వివరిస్తానన్నారు. అంతేకాదు ఎవరి రెక్కల కష్టంపై అధికారం చేపట్టిందో అదే కుటుంబాన్ని కేసులతో వేధింపులకు గురిచేస్తుందన్నారు. అవినీతి ముద్రవేసి కక్షసాధింపులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్-టీడీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆమె హెచ్చరించారు. త్వరలో వచ్చే ఉప ఎన్నికల్లో వైఎస్ సంక్షేమ పథకాలను, తెలంగాణ సెంటిమెంట్ రెండిటినీ ప్రచారాస్త్రాలుగా చేసుకోనున్నట్లు ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు.

లక్ష్మీరాజ్యంకు వైఎస్ఆర్ సిపి పదవి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళావిభాగం గుంటూరు జిల్లా కన్వీనర్ గా దాడి వెంకట లక్ష్మీ రాజ్యంని నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి ఆదేశాల మేరకు ఆమెని నియమించినట్లు పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పిఎన్ వి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

మార్చి 30న రాజ్యసభ ఎన్నికలు

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రధాన ఎన్నికల కమీషన్ శనివారం ప్రకటించింది. మార్చి 12న ఎన్నికల నోటిఫికేషన్ జారీకానుంది. ఈ నెల 19 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. దేశంలోని 58 స్థానాలకుగానూ, రాష్ట్రంలో 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మార్చి 30న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

కాంగ్రెస్-టీడీపీ కుయుక్తులను ఎండగడ్తాం: పిన్నెల్లి

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సూచన మేరకు రైతులు, రైతు కూలీల పక్షాన నిలిచినందుకు తనకు చాలా తృప్తిగా ఉందని వైఎస్ అభిమాన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. 1994 నుంచి వైఎస్ కుటుంబం ఆశీస్సులతో రాజకీయాల్లో కొనసాగుతున్నానని చెప్పారు. ఇక ముందు కూడా ఆ కుటుంబానికి వెన్నంటి ఉంటానన్నారు. కాంగ్రెస్-టీడీపీ చేస్తున్న కుయుక్తులను ప్రజలకు వివరిస్తానని చెప్పారు. త్వరలో వచ్చే ఉప ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో బంఫర్ మెజార్టీతో అసెంబ్లీలో అడుగుపెడతామని ధీమా వ్యక్తం చేశారు.

బానిస సంకెళ్ల నుంచి బయటపడ్డాం

రైతుల కోసం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పీకర్ ముందే ఓటు వేసిన ఇన్నాళ్ల తర్వాతనైనా చర్య తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని వైఎస్ అభిమాన మాజీ ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు అన్నారు. ఇప్పుడు తామంతా బానిస సంకెళ్ల నుంచి బయటపడ్డాం అన్నారు. వైఎస్ రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం ద్వేషంతో ఆ కుటుంబంపై కొనసాగిస్తున్న కక్ష సాధింపు చర్యలను ప్రజలకు వివరిస్తామన్నారు. అదే విధంగా మహానేత ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడుస్తున్న విధానాన్ని కూడా తెలియజేస్తామని చెప్పారు. అసెంబ్లీలో విజయమ్మనుద్దేశించి వైఎస్ బిక్ష ద్వారా పదవులు పొందిన మంత్రులు అవహేళనగా మాట్లాడటాన్ని సమాజం చూస్తూనే ఉందని ఆయన హెచ్చరించారు. త్వరలో రానున్న ఉప ఎన్నికలను దేవుడిచ్చిన వరంలా భావిస్తామన్నారు.. ఏది మంచో, ఏది చెడో ప్రజలకు బాగా తెలుసన్నారు. ధర్మం, అధర్మానికి, విలువలు విశ్వసనీయతకు జరిగే ఎన్నికల్లో వారే తగిన తీర్పునిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఇవే విలువలు కొనసాగిస్తాం: గడికోట శ్రీకాంత్‌రెడ్డి

రాజకీయాల్లో ఉన్నన్నాళ్లు దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి చూపిన మార్గంలో నడుస్తూ విలువలు, విశ్వసనీయతను ఇక ముందు కూడా కొనసాగిస్తామని వైఎస్ అభిమాన మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. తామంతా ఏ కారణం చేతనైతే అనర్హతకు గురయ్యామో ప్రజలకు వివరిస్తామన్నారు. రైతులు, రైతుకూలీల కోసం కొందరు తలపాగా చుట్టుకొని పోరుయాత్రలంటూ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కానీ తాము తమ పదవులను అన్నదాత కోసం తృణప్రాయంగా వదులుకున్నామని చెప్పారు.

ప్రభుత్వం పడిపోదని నిర్దారించుకున్నాకే చంద్రబాబు అవిశ్వాసమంటూ దొంగ నాటకం ఆడారని విమర్శించారు. ఆ విషయం తెలిసినప్పటికీ రైతు పక్షాన నిలిచినందుకు తమకు చాలా గర్వంగా ఉందన్నారు. స్పీకర్ రాజ్యాంగబద్దంగా వ్యవహరించి ఉంటే ప్రజలపై భారం కాస్త త గ్గేదన్నారు. తమను అప్పుడే అనర్హులుగా ప్రకటించి ఉంటే, ప్రస్తుత ఏడు స్థానాలలో జరిగే ఉప ఎన్నికలతో పాటు ఈ స్థానాలకు జరిగేవని వివరించారు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్నందున తమపై ఇంతకాలం చర్యలు తీసుకోకుండా తాత్సర్యం చేశారన్నారు. తామంతా రైతుల కోసం నిలబడినందున ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు తమని తప్పకుండా ఆశీర్వదిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు

FAN GURTHUKE MANA VOTE


హైదరాబాద్: కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎన్నికల సంఘం ఫ్యాన్ గుర్తు కేటాయించింది.

హైదరాబాద్: కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎన్నికల సంఘం ఫ్యాన్ గుర్తు కేటాయించింది. దాంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో ఈ పార్టీ తరపున పోటీ చేసిన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డికి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు కూడా ఫ్యాన్ గుర్తునే కేటాయించారు. దాంతో ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డికి కూడా ఫ్యాన్ గుర్తు రావడంతో కార్యకర్తల ఆనందానికి అవధులులేవు. తాము కోరుకున్న గుర్తే వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఫ్యాన్ గాలికి ప్రత్యర్థులు కొట్టుకుపోతారన్నారు.

ప్యాకేజ్డ్ పాలల్లో ప్రమాదకర బ్యాక్టీరియా

 ప్యాకెట్ పాలు వాడుతున్నారా? బహుపరాక్.. ఇందులో విషం ఉందని తేలింది. ప్యాకెట్ పాలను పూర్తిగా మరగబెట్టి తాగకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరంలో పలు డెయిరీలు రోజూ విక్రయిస్తున్న ప్యాకేజ్డ్ పాలల్లో ఇ-కోలి, కోలిఫాం వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఆనవాళ్లను ప్రభుత్వ ఫుడ్ ల్యాబొరేటరీ గుర్తించింది. నగరంలో నిత్యం 12కి పైగా ప్రముఖ డెయిరీలు దాదాపు 20 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తున్నాయి. ఇందులో అత్యధిక మార్కెట్ వాటా కలిగిన ఆరు డెయిరీ ఉత్పత్తుల శాంపిళ్లను ‘సాక్షి’ సేకరించి నాచారంలోని ప్రభుత్వ ఆహార పరిశోధనశాలలో పరీక్షలు చేయించింది. ఇందులో పరీక్షించిన ఉత్పత్తులన్నీ నిర్ణీత ప్రమాణంలో లేవని తేలింది. 

అమెరికా, యూరప్ దేశాల్లో విక్రయించే ప్యాకెట్ పాలల్లో ఇ-కోలి, కోలిఫాం వంటి బ్యాక్టీరియా ఉండటానికి వీల్లేకపోగా, మన దేశంలో మాత్రం అర లీటరు పాలల్లో 10 గ్రాముల వరకు ఉండొచ్చని నిర్ణయించారు (ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ ఫుడ్ ఆడిటివ్ రెగ్యులేషన్ యాక్ట్-2011 ప్రమాణాల మేరకు). కానీ మార్కెట్‌లో 20 శాతానికి పైగా అమ్ముడవుతున్న ఓ డెయిరీ ప్యాకెట్ పాలల్లో 100 గ్రాములకుపైగా కోలిఫాం బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉండగా, 13 శాతం మార్కెట్ వాటా కలిగిన మరో డెయిరీ పాలల్లో ఏకంగా 2000 గ్రాముల వరకు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. నాలుగు శాతం వాటా కలిగిన మరో ప్రైవేటు డెయిరీ ప్యాకెట్ పాలల్లో 1060 గ్రాముల కోలిఫాంతో పాటు, ప్రమాదకరమైన ఇ-కోలి బ్యాక్టీరియాను సైతం గుర్తించారు. ‘సాక్షి’ పరీక్షలు చేయించిన ఆరు శాంపిళ్లలోనూ బ్యాక్టీరియాను నిర్ధారించి అవి యథావిధిగా తాగేందుకు శ్రేయస్కరం కాదని నిపుణులు తేల్చారు. పాల సేకరణ, నిల్వ, పంపిణీలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవటమే బ్యాక్టీరియా వృద్ధికి కారణమని వారంటున్నారు.

పచ్చిపాలు ప్రమాదం..
గేదె పొదుగును మల, మూత్రాలు అంటిపెట్టుకుని ఉంటాయి. దీంతో పాటు పా లు పితికేటపుడు చేతుల ద్వారా, కలుషిత నీళ్లు కలపడం వల్ల పాలలోకి ఇ-కోలి బ్యాక్టీరియా చేరుతుంది. 161 డిగ్రీలపై 15 సెకన్ల పాటు పాలను వేడి చేస్తే బ్యాక్టీరియా చనిపోతుంది. కానీ నగరంలో తీరిక లేని వేళల వల్ల చాలామంది తమ పిల్లలకు పచ్చిపాలనే పట్టిస్తున్నారు. వీటిని తాగడం వల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. కాలేయం, కిడ్నీల పని తీరుపై ప్రభావం చూపుతుంది. వాం తులు, విరేచనాలు కలిగి బ్లడ్, యూరిన్ ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది. టైపాయిడ్, తద్వారా కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది. 
- డాక్టర్ సుజాతస్టీఫెన్, 
న్యూట్రిషనిస్టు, అవేర్ గ్లోబల్ ఆస్పత్రి 

100 డిగ్రీల వరకు మరగబెట్టాల్సిందే..
ప్యాకెట్ పాలల్లో (పచ్చివి) విషపూరిత బ్యాక్టీరియా ఆనవాళ్లు పుష్కలంగా ఉండటంతో వాటిని 100 డిగ్రీల సెల్సియస్ వరకు కాచి వినియోగించాల్సి ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఏ రకమైన బ్యాక్టీరియా కూడా 90 నుంచి 100 డిగ్రీల వరకు వేడిచేస్తే తప్ప నాశనం కాదని, అందువల్లే బాగా మరగబెట్టిన తర్వాతే ప్యాకెట్ పాలను వినియోగించాలని సూచిస్తున్నారు. ఒకవేళ ప్యాకెట్ పాలను పైపైనే మరగబెట్టి తాగితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.

17 స్థానాలకూ ఉప ఎన్నికలు రాకుండా ఇంత కాలం తాత్సారం

అంతా కాంగ్రెస్ కనుసన్నల్లోనే...
స్పీకర్ సమక్షంలో అవిశ్వాసానికి అనుకూలంగా ఓటువేసినా అనర్హతపై జాప్యం
వేటుకు అభ్యర్థించినా, వైఎస్సార్ కాంగ్రెస్ కండువాలతో అసెంబ్లీకొచ్చినా తాత్సారం
ఇప్పటివరకూ దింపుడు కల్లం ఆశలతో నెట్టుకొచ్చిన కాంగ్రెస్ నాయకత్వం 
17 స్థానాల్లో ఉప ఎన్నికలకు భయపడి ఇంతకాలం సాగదీసిన వైనం 
తెలంగాణ ప్రాంత ఉపఎన్నికలతో కలిసి రాకుండా జాగ్రత్తలు 
ఏడు స్థానాల నోటిఫికేషన్ తరువాత నిర్ణయం వెలువడేలా పథకం 
ఇంకా ఆలస్యం చేద్దామనుకున్నా అడ్డొచ్చిన రాజ్యసభ ఎన్నికలు 
ఆ ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో విధిలేక అనర్హత నిర్ణయం ప్రకటన
అసెంబ్లీలో సీఎం వెల్లడించిన మరునాడే అనర్హత నిర్ణయం ప్రకటించిన స్పీకర్
స్పీకర్ నిర్ణయంపై వైఎస్ అభిమాన ఎమ్మెల్యేల హర్షం

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో రైతుల సమస్యలను గాలికొదిలేసిన సర్కారు తీరుకు నిరసనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో.. ఆద్యంతం కాంగ్రెస్ పెద్దల డెరైక్షన్‌లోనే కథను నడిపించిన పెద్దలు ఎట్టకేలకు దానికి ముగింపు పలికారు. 17 మంది వైఎస్ అభిమాన ఎమ్మెల్యేల విషయంలో అంతా ఊహించినట్లే.. ప్రజలందరూ అనుమానించినట్లే జరిగింది. మాజీ మంత్రి శంకర్రావు లేఖ ఆధారంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేయటం, ఎఫ్‌ఐఆర్‌లో దివంగత వై.ఎస్. పేరును చేర్చటం మొదలు.. దేనికైనా తెగించినట్లు వ్యవహరించిన కాంగ్రెస్ నాయకత్వం.. వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు ప్రస్తుత ప్రభుత్వంపై అసెంబ్లీ సాక్షిగా ‘అవిశ్వాసం’ ప్రకటించటంతో ఖంగుతిన్నది. విప్‌ను ధిక్కరించిన వారిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేయటానికి కూడా వారం రోజుల సమయం తీసుకుంది. ఫిర్యాదు చేసిన తర్వాత కూడా.. అనర్హతపై నిర్ణయం తీసుకోకుండా దింపుడు కళ్లం ఆశతో ఇన్నాళ్లూ సాగదీస్తూ వచ్చింది. ఆ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో స్పీకర్ సమక్షంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినా.. తాము విప్‌ను ధిక్కరించామని, తమను అనర్హులుగా ప్రకటించాలని వారంతా స్పీకర్‌ను బహిరంగంగానూ, వ్యక్తిగతంగానూ కోరినా.. చివరికి తమను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గుర్తించాలంటూ ఆ పార్టీ కండువాలతో అసెంబ్లీకి హాజరైనా కూడా నిర్ణయం తీసుకోలేదు. ఏమో గుర్రం ఎగరావచ్చు.. వారి మనసు మారా వచ్చు.. అని కాంగ్రెస్ పెద్దలు ఆశలు పెట్టుకున్నారు. వారిని లొంగదీసుకునేందుకు సామ దాన బేధ దండోపాయాలనూ ప్రయోగించారు. వారిలో గందరగోళం సృష్టించేందుకు అనేక రకాల దుష్ర్పచారాలకూ తెరతీశారు. అయినా వారి ఆశలు ఫలించలేదు.
ఇతరత్రా కారణాలతో ఖాళీ అయిన ఏడు నియోజకవర్గాలతో కలిసి వారి 17 స్థానాలకూ ఉప ఎన్నికలు రాకుండా ఇంత కాలం తాత్సారం చేసింది. అన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరిగితే వచ్చే ఫలితాలను, వాటి ప్రభావాన్ని ఊహించుకుని భయపడుతూ నిర్ణయం ప్రకటించకుండా ఉంది. కానీ.. రాజ్యసభ స్థానాలకు అతి త్వరలో ఎన్నికలు రానుండటం వంటి కారణాలతో.. ఇక వేటు వేయక తప్పలేదు. 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు ప్రకటించగా ఒక ఎమ్మెల్యే సమర్పించిన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. దీంతో.. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల కనుసన్నల్లో రూపొందిన కథ, స్క్రీన్‌ప్లే ప్రకారం సాగిన అనర్హత విచారణకు తెరపడినట్లయింది.

ఎన్నెన్ని కుట్రలో... 

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై తెరవెనుక నుంచి అనేక కుయుక్తులు పన్నారు. దివంగత మహానేత వైఎస్, ఆయన కుటుంబ ప్రతిష్టను దెబ్బతీయటానికి చేయని ప్రయత్నమంటూ లేదు. సీబీఐ విచారణ పేరిట సాగిన తంతులో మహానేత పేరును ఉద్దేశపూర్వకంగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్పించి కాంగ్రెస్ తెరవెనుక రాజకీయ డ్రామాకు తెరలేపింది. సీబీఐ వేసిన కేసులకు సంబంధించి ప్రభుత్వం తరఫున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఉన్నతన్యాయ స్థానం పలుమార్లు ఆదేశాలు జారీచేసినా సర్కారు పెద్దలు మౌనం దాల్చారు. కేసు విచారణ సమయంలో న్యాయస్థానంలో హాజరు కావలసిన అడ్వొకేట్ జనరల్ కూడా ఆ దరిదాపులకూ వెళ్లలేదు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లుగా కాంగ్రెస్‌లోనే విమర్శలు వెల్లువెత్తాయి. వైఎస్‌ఆర్ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినందుకు నిరసనగా ఆయన అభిమాన ఎమ్మెల్యేలు స్పీకర్‌కు మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పించారు. ఈ రాజీనామాలన్నిటినీ భావోద్వేగాల నేపథ్యంలో చేసినవిగా ప్రకటిస్తూ స్పీకర్ వాటిని తిరస్కరించారు. 

అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు కూడా అందించారు. అప్పట్నుంచి పార్టీ ఎమ్మెల్యేలు జగన్ వెంట వెళ్లకుండా కాంగ్రెస్ నేతలు అనేకరకాల ప్రలోభాలకు తెరతీశారు. ఢిల్లీ పెద్దల ఆదేశాలతో పదవులు సహా అనేక ఆశలు ఎరచూపారు. కొంతమందిని నయానో భయానో లొంగ దీసుకొనే ప్రయత్నాలూ చేశారు. జగన్‌కు ప్రజల్లో ఆదరణ లేదని పార్టీలోని ఎమ్మెల్యేల్లో దురభిప్రాయం కల్పించేందుకు టీడీపీతో కుమ్మక్కై అనేక తెరవెనుక వ్యూహాలను నడిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలు జిల్లాల్లో టీడీపీతో కలసి వైఎస్ అభిమాన అభ్యర్థులను ఓడించేందుకు ఆ రెండు పార్టీలూ శతథా ప్రయత్నించాయి. ఎన్ని ప్రయత్నాలు సాగించినా వైఎస్ పేరుతో బరిలోకి దిగిన అభ్యర్థులు విజయపథాన నిలిచి కాంగ్రెస్, టీడీపీలకు షాక్ ఇచ్చారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎమ్మెల్యేలు జగన్ వైపే మొగ్గుచూపుతుండటం పార్టీ అధిష్టానానికీ మింగుడుపడనిదిగా మారింది. ప్రభుత్వం వైఎస్ ఆశయాలను విస్మరించి ఆయన ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలను తుంగలో తొక్కేప్రయత్నమూ కాంగ్రెస్ నేతలు చేశారు. దీనికి నిరసనగా వైఎస్ జగన్ నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు భాగస్వాములు అయ్యారు. 

చిరంజీవిని కలుపుకుని... 

వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలతో ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందన్న భయంతో కాంగ్రెస్ పెద్దలు.. చివరకు ప్రజారాజ్యం పార్టీ నేత చిరంజీవికి తాయిలాలు ఆశచూపి తమవైపు తిప్పుకున్నారు. అప్పటివరకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా టీడీపీ కాంగ్రెస్‌కు అన్ని రకాలుగా సహకారం అందిస్తూ వచ్చింది. ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసినా అవిశ్వాసం పెట్టాలన్న డిమాండ్లు వచ్చినా తప్పించుకుంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సవాల్‌తో తీర్మానాన్ని ప్రతిపాదించింది. చిరంజీవి వర్గ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో కలవటంతో అవిశ్వాసం పెట్టినా.. ప్రభుత్వానికి ముప్పు ఉండదన్న అభిప్రాయానికి వచ్చాకనే చంద్రబాబు అవిశ్వాసానికి తెరతీశారు. వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు రైతు సంక్షేమం దృష్ట్యా ఈ అవిశ్వాసానికి మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని విస్మరించి రైతు వ్యతిరేకిగా మారినందుకే అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు. వీరిని అడ్డుకునేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ పెద్దలు అనేక ప్రయత్నాలు సాగించినా ఎమ్మెల్యేలెవరూ లొంగలేదు. కొందరు ఎమ్మెల్యేలకు భారీ ఆశలు చూపి ఓటింగ్‌కు గైర్హాజరయ్యేలా చేయబోయారు. చివరకు కిరణ్ తన సొంత జిల్లాకు చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యేను ఓటింగ్‌కు రాకుండా చూసుకోగలిగారు. అవిశ్వాసానికి మద్దతు పలికితే సభలోనే అనర్హత వేటు పడుతుందనీ ఎమ్మెల్యేలను భయపెట్టినా 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక పీఆర్పీ ఎమ్మెల్యే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసంపై ఓటు వేశారు. 

పరాజయ భయం... 

ఇన్ని ప్రయత్నాలు సాగించినా చివరకు కాంగ్రెస్‌కు దిమ్మతిరిగింది. ఉప ఎన్నికలు వస్తే ఘోర పరాజయం తప్పదన్న భయం ఆ పార్టీకి పట్టుకుంది. ఎమ్మెల్యేలపై అనర్హత ఫిర్యాదు ఇవ్వటానికే పది రోజులు సమయం తీసుకుంది. ఫిర్యాదు ఇవ్వకున్నా పరువుపోతుందన్న భయంతో చివరకు స్పీకర్‌కు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా అనర్హత ఫిర్యాదులు ఇచ్చింది. వాటిపై కూడా స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోకుండా తెరవెనుక డ్రామాను నడిపించింది. నెల తరువాత స్పీకర్ ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. వాటికి ఎమ్మెల్యేలు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. తనకు నోటీసులు అందకపోవ టంతో కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం) అదే విషయాన్ని వివరించారు. శోభానాగిరెడ్డి తన వివరణతో పాటు రాజీనామా లేఖనూ అందించారు. స్పీకర్ సమక్షంలోనే అవిశ్వాసాన్ని ప్రకటించినందున తమపై వెంటనే వేటు వేయాలని కోరుతూ వారంతా లిఖితపూర్వకంగా లేఖలు అందజేశారు. అయినా స్పీకర్ వారిపై చర్యలు తీసుకునే బదులు న్యాయ ప్రక్రియ అంటూ కొత్త తతంగానికి తెరతీశారు. కోర్టుకు హాజరుకావాలని నోటీసులు పంపగా తాము ఇప్పటికే స్పష్టంచేసినందున రాలేమని, అనర్హత ప్రకటించాలని వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు ప్రకటించారు. తెలంగాణలోని ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు కోవూరు ఎమ్మెల్యే రాజీనామాలు స్పీకర్ ఆమోదించినప్పటికీ.. ఆ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై నిర్ణయం వెలువరించకుండా కాంగ్రెస్ మోకాలడ్డుతూ వచ్చింది. చివరకు ఏడు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కూడా ఆలస్యం జరిగేలా ఎత్తుగడ వేసింది. 


ఇప్పట్లో ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు చావుదెబ్బ తప్పదన్న భయంతో వెనుకడుగు వేయించింది. కానీ త్వరలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరుగనుండటంతో నిర్ణయం ప్రకటించక తప్పలేదు. అనర్హతపై స్పీక ర్ నిర్ణయం ప్రకటించటానికి ముందు రోజు గురువారమే సీఎం అసెంబ్లీలో అనర్హత నిర్ణయంపై ప్రకటించటం గమనార్హం. శుక్రవారం అనర్హతపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర ముఖ్యనేతలు అసెంబ్లీలో చర్చించారు. ఢిల్లీ నేతలతోనూ సంప్రదింపులు చేపట్టారు. స్పీకర్ మీరాకుమార్ పర్యటనలో భాగంగా రాజ్‌భవన్‌కు రాగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమెతో చర్చించారు. ఆ తరువాత అనర్హత నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయంపై సదరు ఎమ్మెల్యేలంతా హర్షం వ్యక్తం చేశారు.

పల్లం అగ్నిప్రమాద బాధితులకు జగన్ పరామర్శ

మేలోగా ఎన్నికలు జరగకపోతే సెప్టెంబర్ 2 వరకు గడువు

ఎట్టకేలకు 17 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేశారు. ఈ స్థానాలకు ఎప్పటిలోగా ఉప ఎన్నికలు జరుగుతాయన్నది ఇప్పుడు ప్రధానాంశం. ప్రస్తుతం రాష్ట్రంలో 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై ఇంతకు ముందే వేటు వేసి ఉంటే, వాటితోపాటే, ఈ 17 స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగేవి. వీటన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరిగితే రాజకీయంగా ఇబ్బంది తప్పదని గ్రహించిన కాంగ్రెస్ నాయకత్వం అనర్హతలపై నిర్ణయం విషయంలో జాప్యం చేసింది. ఉప ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగియడంతో, ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. మరో ఆరు నెలల వరకు ఈ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగవన్న ధీమాతోనే కాంగ్రెస్ నాయకత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ప్రస్తుతం జరుగుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (ఈనెల 6వ తేదీ) వెలువడిన వెంటనే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూలు వెలువడనుంది. ఏప్రిల్ 4తో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటికి ఈనెల మొదటి వారంలో షెడ్యూలు వెలువడే అవకాశముంది. ఈ తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన కారణంగానే 17 మంది శాసన సభ్యులపై వేటు వేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోపక్క.. ప్రస్తుత రాష్ట్రపతి పదవీ కాలం జూలై 24 తో ముగియనుంది. ఆ తేదీకి 60 రోజుల ముందే అంటే మే రెండో వారంలోనే రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూలు వెలువడే అవకాశాలున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి ఎన్నికలకు ముందే ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయాలన్న సంప్రదాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పాటిస్తోంది. అందువల్ల ఈ 17 స్థానాలకు మే నెల రెండో వారంలోగా ఎన్నికలు నిర్వహించే వీలుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెల్లూరు లోక్‌సభ స్థానం కూడా ఖాళీగా ఉంది. ఈ ప్రకారం ఎన్నికలు జరగని పక్షంలో సెప్టెంబరు 2వ తేదీలోగా ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఎన్నికలకు సిద్ధంగా లేమని అధికారపక్షం ఎన్నికల సంఘానికి చెప్పే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

బాబు పాత్రను విస్మరించిన సీబీఐ


హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం మూలాల్లోకి సీబీఐ అసలు వెళ్లడంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఈ కుంభకోణంలో దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని ఇరికించి అరెస్టు చేయాలన్న ఉద్దేశంతోనే సీబీఐ దర్యాప్తును సాగిస్తోందని విమర్శించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పద్మ మాట్లాడుతూ ఎమ్మార్ కుంభకోణం 2000లోనే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వేళ్లూనుకుందని, సీబీఐ మాత్రం ఆ దిశగా దృష్టి సారిండచంలేదని చెప్పారు. ‘‘2000లో హైదరాబాద్‌లో దుబాయ్ కంపెనీల ప్రతినిధులతో జరిగిన సదస్సులోనే ఎమ్మార్ సంస్థను రాష్ట్రంలోకి తీసుకు రావడానికి అవగాహన కుదిరింది. 

చంద్రబాబు ప్రోత్సాహంతోనే ఆ కంపెనీ ఇక్కడ రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు అంకురార్పణ చేసింది. గోల్ఫ్ కోర్సు, హోటల్, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి బాబు ప్రభుత్వం తొలుత 250 ఎకరాలను ఎమ్మార్‌కు ధారాదత్తం చేసింది. ఆ తరువాత బాబుకు విల్లాల నిర్మాణంపై ఉన్న మోజుతో ఎవరి ప్రతిపాదనలు, సిఫార్సులుగానీ లేకుండా మరో 250 ఎకరాలు కేవలం ఒక నోట్‌ఫైల్ ద్వారా, నోటి మాట ద్వారా కేటాయించారు. ఎమ్మార్ ప్రతినిధులు కూడా అడక్కుండానే, మంత్రివర్గం ఆమోదం లేకుండానే, అధికారులెవ్వరూ ప్రతిపాదనలు చేయకుండానే చంద్రబాబు అదనంగా 250 ఎకరాలు కేటాయించడానికి ఎందుకు ఆమోదం తెలిపారు? ఎమ్మార్ ప్రతినిధి కోనేరు రాజేంద్రప్రసాద్‌కు మేలు చేయాలనే ఉద్దేశంతోనే బాబు ఇలా చేశారు. సీబీఐ వారికి ఈ ఉల్లంఘన ఎందుకు కనిపించలేదు? నోట్‌ఫైల్‌పై రాయడం ద్వారా 250 ఎకరాల భూమిని ఎమ్మార్‌కు ధారాదత్తం చేశారని కొన్ని పత్రికలు వెలుగులోకి తెచ్చే వరకూ తెలుసుకోలేని దుస్థితిలో సీబీఐ ఉందా? సీబీఐకి, చంద్రబాబుకు ఉన్న బంధం ఏమిటి? ఆయనపై ఎందుకు విచారణ జరపడంలేదు? పైగా ఎమ్మార్ విషయంలో 2001 నుంచీ దర్యాప్తు చేస్తున్నట్లు సుప్రీం కోర్టుకు సీబీఐ నిస్సిగ్గుగా వివరణ ఇచ్చింది. నిజంగా మీరు పరిశోధించి ఉంటే 2000లో చేసుకున్న ఒప్పందం వెనుకనున్న నిజాలేమిటనేది నిగ్గు తేల్చారా? సీబీఐ ఈ అంశం మూలాల్లోకి వెళ్లడంలేదనడానికి ఇంతకంటే ఉదాహరణ, నిదర్శనం, తార్కాణం ఏంకావాలి’’ అని ప్రశ్నించారు. 

నోట్‌ఫైల్ ద్వారా 250 ఎకరాలు ఎమ్మార్‌కు కేటాయించిన విషయంపై చంద్రబాబు నోరు విప్పాలని పద్మ డిమాండ్ చేశారు. ఏమాశించి ఈ నిర్ణయం తీసుకున్నారో ఆయన చెప్పి తీరాలని అన్నారు. నిబంధనలను ఉల్లంఘించి అవకతవకలకు పాల్పడిన చంద్రబాబే కాలర్ ఎత్తుకుని అసెంబ్లీలో అందరినీ అవినీతిపరులుగా నిందిస్తూ ఉంటే ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. బాబు వైఖరి చూస్తే దొంగే... దొంగ.. దొంగ అని అరిచినట్లుగా ఉందని అన్నారు. ఎమ్మార్‌కు టెండర్లు కట్టబెట్టిన తీరే అనుమానాలకు తావిస్తున్నదని గతంలో కూడా చెప్పామన్నారు. ఐదు కంపెనీలు పోటీ పడితే ప్రభుత్వమే రెండింటిని తిరస్కరించిందని, మిగిలిన మూడింటి నుంచి కూడా రెండు వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గేలా చేశారని తెలిపారు. గ్లోబల్ టెండర్లలో ఒక్క కంపెనీయే ఉన్నప్పుడు వాటిని రద్దు చేసి మళ్లీ టెండర్లు ఎందుకు పిలవలేదనే విషయం సీబీఐకి పట్టదా? అని ప్రశ్నించారు. ఎమ్మార్ కుంభకోణం మూలాలను వదలివేసి విల్లాలు అమ్మిన సొమ్ము సాక్షిలోకి ఏమైనా వెళ్లిందా అని అనుమానిస్తూ వైఎస్‌ఆర్ కుటుంబీకులను ఇరికించి అరెస్టు చేయాలని చూస్తున్నారని పద్మ విమర్శించారు.

రామోజీ మరో కబ్జాపై సర్వే

కొహెడ భూముల్లోనూ ప్రారంభం 
411, 412 సర్వే నంబర్లలో ఈటీఎస్ పద్ధతిలో సర్వే
మూడురోజుల్లో హద్దులు నిర్ధారిస్తామన్న అధికారులు
15 ఎకరాల మిగులు భూముల్ని ఇళ్లస్థలాల కోసం ఇవ్వాలంటున్న గ్రామస్తులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: నగర శివారు హయత్‌నగర్ మం డలం కొహెడ గ్రామంలో రామోజీ ఫిలింసిటీ కబ్జాలో ఉందని భావిస్తున్న భూమి సర్వేపై కొంతకాలంగా నాన్చుడు ధోరణి అవలంబించిన అధికారులు ఎట్టకేలకు కదిలారు. కొహెడలోని 15 ఎకరాల సీలింగ్ భూమినీ రామోజీరావు కబ్జా చేసిన వైనంపై.. శుక్రవారం ‘సాక్షి’టీవీలో ప్రసారమైన కథనం నేపథ్యంలో వెంటనే స్పందించారు. శుక్రవారమే ఆ భూమిలో సర్వే ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా సర్వే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ అంబర్‌సింగ్ ఆధ్వర్యంలో సర్వే నం-411, 412లో సర్వే మొదలు పెట్టారు. ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ (ఈటీఎస్) పద్ధతిలో సర్వేను చేపట్టారు. 411, 412 సర్వే నంబర్లలో సుమారు 15 ఎకరాల పట్టాభూమిని కొన్న రామోజీరావు మరో 15 ఎకరాల మిగులుభూమిని తన అధీనంలో ఉంచుకున్నట్లు గుర్తిం చిన గ్రామస్తులు (ఉమర్‌ఖాన్‌గూడ) అధికారులకు ఫిర్యాదు చేశారు. 

ఆరు నెలల క్రితం రామోజీ అధీనంలో ఉన్న మిగులు భూమిని ఇళ్ళ స్థలాల కోసం చదును చేసేందుకు ఉపక్రమించారు. అయితే ఫిలింసిటీ సిబ్బంది గ్రామస్తులను అడ్డుకున్నారు. ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో జోక్యం చేసుకున్న అధికారులు రామోజీ భూములపై సర్వే నిర్వహించి మిగులు భూములుంటే గుర్తిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అప్పటికి గొడవ సద్దుమణగగా ఆ తర్వాత అధికారులు గ్రామస్తులకు ఇచ్చిన హామీని మరిచిపోయారు. దీంతో భూమిని సర్వే చేయాలని కోరుతూ గ్రామస్తులు అనేకసార్లు జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. 

అయినా అధికారులు స్పందించలేదు. సర్వేపై కుంటిసాకులు చెబుతూ కాలయాపన చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఉదంతంపై శుక్రవారం సాక్షి టీవీలో కథనం ప్రసారమైంది. దీంతో కదిలిన అధికారులు సర్వే మొదలుపెట్టారు. సర్వేను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని అంబర్‌సింగ్ తెలిపారు. శుక్రవారంతో ఈటీఎస్ మిషన్ సర్వే పూర్తవుతుందని అనంతరం మ్యాప్‌ను రూపొందించి సీలింగ్ భూమికి, పట్టా భూమికి హద్దులు నిర్ధారిస్తామని చెప్పారు. మూడురోజుల్లో ఈ మేరకు పూర్తి నివేదికను తహశీల్దార్‌కు ఇస్తామని వెల్లడించారు. అయితే రామోజీ చెర నుంచి మిగులు భూములను అధికారులు ఎప్పటిలోగా విడిపిస్తారో అనే అంశంపై గ్రామస్తుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వే నెం- 411, 412లో మొత్తం సుమారు 30 ఎకరాల భూమి ఉందని, రామోజీరావు కొన్న భూమి పోను మిగులు భూమిని ఇళ్ళ స్థలాలుగా ఇవ్వాలని ఉమర్‌ఖాన్‌గూడ గ్రామస్తులు కోరుతున్నారు. మరోవైపు సర్వే చేసిన అధికారులు చదునుగా ఉన్న భూమిని రామోజీరావుకు ఇచ్చి గుట్టలు, రాళ్ళతో కూడిన భూమిని సీలింగ్ భూమిగా చూపిస్తారేమోనని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సర్వే జరిగినంతసేపు ఫిలింసిటీ ల్యాండ్ సూపర్‌వైజర్ పాపిరెడ్డితో పాటు నలుగురు సిబ్బంది అధికారుల వెంట ఉండడం గ్రామస్తుల అనుమానాలకు బలం చేకూరుస్తోంది. నివాసయోగ్యమైన భూమిని ఇళ్ళ స్థలాలకు ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. అనాజ్‌పూర్ గ్రామ పరిధిలోనూ 60.10 ఎకరాల మిగులు భూమి రామోజీ ఫిలిం సిటీ పడగ కింద ఉన్నట్లు ఇటీవలి సర్వేలో తేలడంతో దానిని మిగులుభూమిగా నిర్ధారించిన జాయింట్ కలెక్టర్ కోర్టు.. దీనిపై రామోజీ వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఉషాకిరణ్‌మూవీస్ హైకోర్టును ఆశ్రయించింది.

ముఖ్యమంత్రే వచ్చి ఉంటే ఆనందించేవాణ్ణి.. చేతులు జోడించి అర్థిస్తున్నా.. స్పందించండి!


పల్లం అగ్నిప్రమాద బాధితులకు జగన్ పరామర్శ
ముఖ్యమంత్రే వచ్చి ఉంటే ఆనందించేవాణ్ణి.. చేతులు జోడించి అర్థిస్తున్నా.. స్పందించండి!
మత్స్యకారుల పాత రుణాలు మాఫీ చేయాలి.. యుద్ధప్రాతిపదికన పక్కా ఇళ్లు కట్టించాలి
వారికి సాయాన్ని ఐదు నెలలు కొనసాగించాలి.. చేపల వలలు, స్మోకింగ్ బిన్స్ అందించాలి
గంటిపెదపూడి వద్ద జరిగిన స్కూల్ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు పరామర్శ
ఏ అవసరానికైనా తానున్నానంటూ భరోసా...

కాట్రేనికోన/పి.గన్నవరం (తూర్పు గోదావరి), న్యూస్‌లైన్: ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానంటూ భరోసానిచ్చే మానవత్వమున్న ముఖ్యమంత్రి అవసరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘రాష్ర్టంలో ఇటీవల విషాద ఘటనలు, ఘోర ప్రమాదాలు సంభవించాయి. వేలాదిమంది కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. అయినా ప్రభుత్వానికి పట్టడంలేదు. సీఎం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. బాధితులను ఆదుకోవాలి’’ అని విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల ఘోర అగ్నిప్రమాదం సంభవించిన కాట్రేనికోన మండలం పల్లం గ్రామాన్ని జగన్ శుక్రవారం సందర్శించారు. అగ్నికి ఆహుతైన పూరిళ్లను పరిశీలించారు. కట్టుబట్టలతో నిరాశ్రయులైన బాధితులను ఓదార్చారు. బాధాకరమైన సన్నివేశాల మధ్య పల్లం గ్రామానికి రావాల్సి వచ్చిందన్నారు. ‘‘400 ఇళ్లు కాలిపోయి 750 కుటుంబాలు వీధిన పడ్డాయంటే మాటలు కాదు. ఇలాంటివి జరిగినప్పుడు ఎలా స్పందించాలో చూపడానికి నేనిక్కడికి వచ్చా. ఈ గ్రామంలో పూరిళ్లకు బదులు పక్కా ఇళ్లుండి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.50 వేలు మంజూరు చేస్తున్నారు. అది చాలదని, రెట్టింపు చేయాలని నాన్న ఆలోచించేవారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే రూ.లక్షతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలి.

ప్రభుత్వం రూ.8,000, 50 కిలోల బియ్యం, రెండు చీరలు, రెండు దుప్పట్లు ఇచ్చిందని అక్కాచెల్లెళ్లు నాతో చెప్పారు. దాన్ని తక్షణ సాయంగా మాత్రమే పరిగణించాలి. చేపల వేటపైనే ఆధారపడ్డ ఈ మత్స్యకార గ్రామం కోలుకునే వరకు కనీసం ఐదు నెలల పాటు బాధితులను నిరాశ్రయులుగా భావించి ఈ సాయాన్ని కొనసాగించాలి. తరచు ముంపు సమస్య ఎదుర్కొంటున్న ఈ తీర గ్రామస్తులకు రూ.లక్షన్నరతో ఎత్తయిన పునాదులపై పక్కా ఇళ్లను యుద్ధప్రాతిపదికన నిర్మించివ్వాలి. ప్రస్తుతానికి చేపల వేటకు వెళ్లే పరిస్థితి లేనందున వారి పాత రుణాలను మాఫీ చేస్తూ కొత్త వలలు పంపిణీ చేయాలి. చేపలు ఎండ బెట్టుకోవడానికి స్మోకింగ్ బిన్స్ ఇవ్వాలి. మానవతా దృక్పథంతో స్పందించాలని ఈ ప్రభుత్వాన్ని చేతులు జోడించి మరీ అర్థిస్తున్నా. ఇలాంటివి జరిగినప్పుడు ముఖ్యమంత్రే స్పందించి స్వయంగా ఇక్కడి వచ్చి ఉంటే బాగుండేది. అదే జరిగితే ఆనందపడేవాళ్లలో మొదటి వ్యక్తిని నేనే. జగన్ వచ్చాడు కదాని స్పందించకపోవడం సరికాదు. అది మానవతా దృక్పథం అనిపించుకోదు. ఇప్పటికైనా సీఎం కళ్లు తెరిచి చూడాల్సిన అవసరముంది’’ అని అన్నారు.

సమయం లేకున్నా చిన్నారుల ఇళ్లకు...

గంటిపెదపూడి వద్ద పి.గన్నవరం పంట కాల్వలో స్కూల్ బస్సు బోల్తాపడి దుర్మరణం పాలైన విద్యార్థులు అడ్డాల రోహిత్(9), చినమిల్లి బిందుమాధవి (9) కుటుంబాలను సమయాభావాన్ని పక్కన పెట్టి మరీ జగన్ పరామర్శించారు. ఆయన హైదరాబాద్ తిరుగు ప్రయాణం ఆలస్యమవుతుందని జిల్లా నేతలు తొలుత ఆ కార్యక్రమాన్ని రద్దుచేశారు. అప్పటికే రావులపాలెం వెళ్లిపోయిన జగన్.. ‘ప్రయాణం ఆలస్యమైనా పర్లేదు, చిన్నారుల కుటుంబాలను చూడాల్సిందే’ అంటూ గోదావరి లంకల్లోని గంటిపెదపూడి, బూరుగులంక వెళ్లి రెండు కుటుంబాలనూ పరామర్శించారు. బిందుమాధవి తండ్రి సత్యనారాయణ హైదరాబాద్‌లో టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్న విషయం తెలుసుకుని, ఏ అవసరానికైనా అక్కడ తనను కలుసుకోవాల్సిందిగా చెప్పారు. ప్రమాదం నుంచి కూతురు దుర్గ బయటపడ్డా చిన్న కొడుకు బలయ్యాడంటూ విలపించిన రోహిత్ తల్లిదండ్రులు శ్రీను, వెంకటల క్ష్మిలను ఓదార్చారు. ‘‘ఉన్న పిల్లల్లో రోహిత్‌ను చూసుకోండి. వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దండి’’ అంటూ ధైర్యం చెప్పారు. దుర్గను ఆప్యాయంగా పలకరించారు. ఎలాంటి సాయం కావాలన్నా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డితో కలిసి హైదరాబాద్ రండని వారికి చెప్పారు. రామచంద్రపురం, నర్సాపురం ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ముదునూరి ప్రసాదరాజు, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి, కేంద్రపాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు పర్యటనలో జగన్ వెంట ఉన్నారు.

రూ.5,000 సాయం ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు: ఆపదలో ఉన్న వారికి ‘నేనున్నా’నంటూ భరోసా ఇచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. సముద్రతీర ప్రాంత మత్స్యకార గ్రామమైన పల్లం, గోదావరి తీరాన పి.గన్నవరం మండలం గంటి పెదపూడిలో ఆయన పర్యటన సాగింది. పల్లంలో ఘోర అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిర్వాసితులైన 750 బాధిత కుటుంబాలను పరామర్శించారు. తమను పలకరించి సాంత్వన చేకూర్చేందుకు తొలిసారి వచ్చిన జన నేతతో మత్స్యకారులు, ప్రధానంగా మహిళలు, వృద్ధులు గోడు వెళ్లబోసుకున్నారు. బూడిద కుప్పలు, మంటల్లో మాడి మసైన వంట సామగ్రి తదితరాలను చూపుతూ భోరున విలపించారు. ఈ సందర్భంగా పార్టీలకతీతంగా పల్లం ఊరు ఊరంతా ఒక్కటై జగన్ వెన్నంటి సాగింది. రాళ్లురప్పలతో కాలు తీసి కాలువేసే వీలు కూడా లేని ఇరుకు సందుల్లో జనం ఆద్యంతం ఆయనను అనుసరించారు. తమ ఇళ్లకు రావాలంటూ పట్టుబట్టి మరీ తీసుకెళ్లారు. గ్రామానికి గ్రామం కదలివచ్చి పొలిమేర నుంచే సాదరంగా ఆహ్వానించిన తీరుకు జగన్ కళ్లు చెమర్చాయి. వయోభారంతో బాధపడుతున్న మహిళలు కూడా తాత్కాలిక గుడారాల నుంచి బయటికొచ్చి జగన్‌తో చేయి కలిపేందుకు పోటీపడ్డారు. ప్రతి ఒక్కరికీ చేయందిస్తూ, వృద్ధులను, పిల్లలను దగ్గరకు తీసుకుంటూ ఆయన భరోసా ఇచ్చారు. ప్రతి కుటుంబానికీ రూ.5,000 చొప్పున సాయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా పార్టీ నేతలు ప్రకటించారు. ముమ్మిడివరం, యానాం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పొన్నాడ సతీశ్, మల్లాడి కృష్ణారావు పల్లంలో జగన్‌ను కలిశారు.

హైదరాబాద్ చేరుకున్న జగన్

హైదరాబాద్/గన్నవరం (కృష్ణా), న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సాయంత్రం గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. శనివారం సాయంత్రం ఆయన నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికల ప్రచారానికి బయల్దేరి వెళ్తారు. 4, 5, 6 తేదీల్లో అక్కడ ప్రచారంలో పాల్గొంటారు.

Speaker disqualifies 16 MLAs

Written By ysrcongress on Friday, March 2, 2012 | 3/02/2012

వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలపై అనర్హతవేటు

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి రాజీనామాని స్పీకర్ ఆమోదించారు. 

Remaining  MLA 

 


వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలపై అనర్హతవేటు

వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు 16 మందిని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనర్హులుగా ప్రకటించారు. 
సిబిఐ ఛార్జిషీట్ లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని చేర్చడంతో మన:స్తాపం చెందిన వీరు ఆగస్టు 24న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి రాజీనామాని స్పీకర్ ఆమోదించారు. ఈ 17 మంది అవిశ్వాస తీర్మానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ అంశానికి సంబంధించి సుదీర్ఘంగా జరిగిన డ్రామాకు
తెరపడింది.

In Any Moment take action on Jagan Vargam

'వైఎస్ కుటుంబీకులే లక్ష్యంగా సీబీఐ దర్యాప్తు'

ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం మూలాల్లోకి సీబీఐ అసలు వెళ్లడం లేదనీ ఎంత సేపూ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని ఇరికించి అరెస్టు చేయాలన్న ఉద్దేశ్యంతోనే దర్యాప్తును సాగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఆమె శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం 2000 సంవత్సరంలోనే ఎన్.చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే వేళ్లూనుకుందనీ కానీ సీబీఐ మాత్రం ఆ దిశగా తమ దృష్టిని సారిండచం లేదని ధ్వజమెత్తారు. 

2000 సంవత్సరంలో హైదరాబాద్‌లో దుబాయ్ కంపెనీల ప్రతినిధులతో జరిగిన ఒక సదస్సులోనే ఎమ్మార్ సంస్థను రాష్ట్రంలోకి తీసుకు రావడానికి అవగాహన కుదిరిందనీ బాబు ప్రోత్సాహంతోనే ఆ కంపెనీ ఇక్కడ రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు అంకురార్పణ చేసేందుకు ఉపక్రమించారని పద్మ వివరించారు. గోల్ఫ్‌కోర్సు, హోటల్, కన్వెన్షన్ సెంటర్ నిర్మించడానికి తొలుత బాబు ప్రభుత్వం 250 ఎకరాలను ఎమ్మార్‌కు ధారాదత్తం చేసిందనీ ఆ తరువాత బాబుకు విల్లాల నిర్మాణంపై గల మోజుతో ఎవరి ప్రతిపాదనలు గానీ, సిఫార్సులు గానీ లేకుండా మరో 250 ఎకరాలు కేవలం ఒక నోట్‌ఫైల్‌పై సంతకం ద్వారా ఒక నోటి మాట ద్వారా కేటాయించారని ఆమె వివరించారు. 

ఎమ్మార్ కంపెనీ ప్రతినిధులు కూడా అడక్కుండానే మంత్రివర్గం ఆమోదం లేకుండానే, అధికారులెవ్వరూ ప్రతిపాదనలు చేయకుండా చంద్రబాబు 250 ఎకరాలు అదనంగా కేటాయించాలని ఎందుకు నోట్‌ఫైలు రాసి ఆమోదం తెలిపారని ఆమె ప్రశ్నించారు. ఎమ్మార్ ప్రతినిధి కోనేరు రాజేంద్రప్రసాద్‌కు మేలు చేయాలనే ఉద్దేశ్యంతోనే బాబు ఇలా చేశారని ఆమె అన్నారు. సీబీఐ వారికి ఈ ఉల్లంఘన ఎందుకు కనిపించలేదు? నోట్‌ఫైల్‌పై రాయడం ద్వారా 250 ఎకరాల భూమిని ఈ సంస్థకు ధారాదత్తం చేశారని కొన్ని పత్రికలు వెలుగులోకి తెచ్చే వరకూ తెలుసుకోలేని దుస్థితిలో సీబీఐ ఉందా? అని ఆమె ప్రశ్నించారు. 

అసలు సీబీఐకి చంద్రబాబుకు ఉన్న బంధం ఏమిటనే అంశం జోలికి సీబీఐ ఎందుకు పోవడం లేదని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. పైగా ఈ విషయంలో 2001 నుంచీ దర్యాప్తు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు నిస్సిగ్గుగా వివరణ ఇచ్చిందని పద్మ విమర్శించారు. నిజంగా మీరు పరిశోధించి ఉంటే 2000 సంవత్సరంలో చేసుకున్న ఒప్పందం వెనుక చోటు చేసుకున్న నిజాలేమిటనేది నిగ్గు తేల్చారా? అని ఆమె నిలదీశారు. సీబీఐ అసలు ఏ అంశం మూలాల్లోకి వెళ్లడం లేదనడానికి ఇంతకంటే ఉదాహరణ, నిదర్శనం, తార్కాణం ఏంకావాలని ఆమె అన్నారు. నోట్‌ఫైల్ ద్వారా 250 ఎకరాలు ఎమ్మార్‌కు కేటాయించిన విషయంపై చంద్రబాబు నోరు విప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఏమాశించి ఈ నిర్ణయం తీసుకున్నారో ఆయన చెప్పి తీరాలని ఆమె డిమాండ్ చేశారు. నిబంధనలను ఉల్లంఘించి అవకతవకలకు పాల్పడిన చంద్రబాబే కాలర్ ఎత్తుకుని అసెంబ్లీలో అందరినీ అవినీతి పరులుగా నిందిస్తూ ఉంటే ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని పద్మ వ్యాఖ్యానించారు. 

బాబు వైఖరి దొంగే...దొంగ...దొంగ అని అరిచినట్లుగా ఉందని ఆమె పేర్కొన్నారు. అసలు ఎమ్మార్‌కు టెండర్లు కట్టబెట్టిన తీరే అనుమానాలకు తావిస్తున్నదని గతంలో కూడా చెప్పామన్నారు. ఐదు కంపెనీలు పోటీ పడితే ప్రభుత్వమే రెండింటిని తిర్కరించిందనీ మిగిలిన మూడింటి నుంచి కూడా వ్యూహాత్మకంగా వెనక్కితగ్గేలా చేశారన్నారు. గ్లోబల్ టెండర్లలో ఒక కంపెనీయే ఉన్నపుడు రద్దు చేసి తాజా టెండర్లను ఎందుకు పిలవలేదనే విషయం సీబీఐకి పట్టదా? అని ఆమె అన్నారు. ఎమ్మార్ కుంభకోణం మూలాలను వదలి వేసి విల్లాలు అమ్మిన సొమ్ము సాక్షిలోకి ఏమైనా వెళ్లిందా అని అనుమానిస్తూ వై.ఎస్.ఆర్ కుటుంబీకులను ఇందులో ఇరికించి అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆమె అన్నారు.

Article about babu

Greatandhra Article:

Popular Posts

Topics :