11 March 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

YS JAGAN THE PEOPLES LEADER

Written By news on Saturday, March 17, 2012 | 3/17/2012

Why Not 'Psycho-Analysis' Of Naidu?

Article from Greatandhra.com;

Andhra Jyothy Telugu daily, known for his blatant favouritism towards Telugu Desam Party president N Chandrababu Naidu, has carried a big story on Saturday, doing a “psycho-analysis” of YSR Congress party president Y S Jaganmohan Reddy.
The analysis was done by a so-called popular psychologist C Narasimha Rao who has written quite a few books on psychoanalysis. This gentleman also does a lot of political analysis and participates in the debates on political issues in various channels almost on a daily basis; and quite often, he speaks in favour of Chandrababu Naidu and his Telugu Desam Party. It is believed he belongs to the same community of Naidu.
In the story carried by Andhra Jyothy, Narasimha Rao made all sorts of observations on Jagan. In a nutshell, Jagan, according to this gentleman, is a megalomaniac, who cares only about himself and does not have any attachments towards anybody, though he tries to create an impression that he identifies with everybody. The article went on to describe Jagan as a character who has no concern about anybody.
One wonders whether AJ would do a similar analysis of Chandrababu Naidu, because there are more startling observations about him than Jagan.
Those who know Naidu in close quarters can say that he does not believe his own wife and son; leave alone party people. He always views people with a lot of suspicion and nobody comes close to his heart. That is why no leader can speak to him with an open mind; and scolds him after the meetings. There are many such observations, if anybody can do a real analysis.

YSR SCHMES 2004-2009









                                                                             
                                                                                     

యూసీఐఎల్ అధికారుల్ని నిలదీసిన జగన్

వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో యురేనియం కార్పొరేషన్‌ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కడప ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్‌ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ సీరియస్ అయ్యారు. ఆరు నెలల క్రితం నిర్వహించిన గ్రీవెన్స్‌ సెల్‌ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై పురోగతి లేకుండా రైతుల, గ్రామస్తుల సమస్యలను పరిష్కరించకుండా ఏ విధంగా సమావేశం పెట్టారని యురేనియం ప్లాంట్‌ అధికారులను జగన్‌ నిలదీశారు. 

యురేనియం ప్లాంట్‌వల్ల పులివెందుల ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటడమే కాకుండా, కాలుష్యమవుతున్నాయని అంతే కాకుండా భూములు కోల్పోయినవారికి ఇవ్వాల్సిన ఉద్యోగం, పరిహారం ఇవ్వడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో జగన్మోహరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గ్రేవెన్స్‌ కమిటీ సమావేశంలో ఇవే అంశాలపై చర్చించారు. రైతుల డిమాండ్లను తీర్చిన తర్వాతనే రెండో ప్లాంట్‌ మైనింగ్‌కు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. అయితే సమస్యలేవీ పరిష్కరించకుండా...ఈ రోజు అధికారులు పులివెందులలో సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ సమావేశ ప్రారంభంలోనే జగన్‌ అడిగిన ప్రశ్నలకు యురేనియం కార్పొరేషన్‌ అధికారులు నోరు మెదపలేదు. దీంతో జగన్‌ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇచ్చిన హామీలు నెరవేర్చరు..నెరవేర్చాలని ఆందోళన చేస్తే పోలీసు కేసులు పెడతారు...ఇక్కడంతా ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని అధికారుల తీరుపై ఆయన తీవ్రంగా స్పందించారు. 

ఇన్ని సమస్యలున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం సబబు కాదని సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాతనే గ్రీవెన్స్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని రెండో ప్లాంట్‌ గురించి మాట్లాడుకుందామని సమావేశాన్ని జగన్‌ బాయ్‌కాట్‌ చేశారు. ఆయనతోపాటు మిగతా సభ్యులందరూ సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేశారు. యురేనియం ప్లాంట్‌కు సంబంధించిన సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ గ్రామస్తులతో కలిసి పోరాటం చేస్తానని ఈ సందర్భంగా జగన్‌ హామీనిచ్చారు.

YS Jagan Unveiled YSR Statue at Vempalli Bypass Road

రాష్ట్రంలో ప్రజల సమస్యలు పట్టించుకునే నేతలే కరువయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ అన్నారు. అధికార కాంగ్రెస్ నాయకులు ప్రజా సమస్యలు గాలికి వదిలేసి తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని పసన్నంచేసుకోవడానికే పాకులాడుతున్నారని ఆయన విమర్శించారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లి బైపాస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని శనివారం సాయంత్రం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించిన ఆయన ప్రసంగించారు. 

వైఎస్సార్ బతికుంటే గండికోట రిజర్వాయర్‌కు నీళ్లు వచ్చేవని అన్నారు. సాగునీటి సంగతి అటుంచితే తాగడానికే నీళ్లే లేవన్నారు. రాష్ర్టంలో 10 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. పరీక్షలు వస్తున్నా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఊసే లేదన్నారు. మహానేత ఉండి ఉంటే తమకీ సమస్యలు ఉండేవి కావని ప్రతి ఒక్కరూ అంటున్నారని చెప్పారు.తనపై ప్రేమాభిమానాలు చూపుతున్న వారందరికీ జగన్ ధన్యవాదాలు తెలిపారు.

ప్రగతి నిరోధక బడ్జెట్: సోమయాజులు

యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు దిశ, దశ లేదని, అన్ని రంగాలను విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు డి.ఎ.సోమయాజులు విమర్శించారు. ప్రతి పౌరునికి ఆర్థిక స్వావలంబన, సాధికారత భ రోసా కల్పించాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. పార్టీనేత కొణతాల రామకృష్ణతో కలిసి శనివారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశం అభివృద్ది దిశలో నడిపించేందుకుగాను కీలక నిర్ణయాలు తీసుకోవడంలో యూపీఏ-2 ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పెట్టుబడులు లేకపోతే ప్రగతి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. 

‘‘కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కీలక రంగాలైన వ్యవసాయాన్ని, ఉత్పత్తి రంగాన్ని పూర్తిగా విస్మరించింది. ఎరువుల ధరలపై సబ్సిడీ ఎత్తేస్తే, ధ్యానానికి మద్దతు ధర ఇప్పుడున్న దాని కన్న రూ.500 పెంచాలి. కానీ కేంద్ర అవేవి పట్టించుకోకుండా మిన్నకుండి పోయింది. దీంతో 1981-91 మధ్య కాలంలో 5.2 శాతం అభివృద్ధిలో ఉన్న వ్యవసాయ రంగం, ఆ తర్వాత నుంచి క్షీణిస్తూ ప్రస్తుతం 2 శాతానికి పడిపోయింది. ఇదే పద్దతి కొనసాగితే వ్యవసాయ రంగం ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది. అయితే ఈ రంగాన్ని ఆదుకోవాల్సిన కేంద్రం బాధ్యతను పూర్తిగా బ్యాంకులపై నెట్టివేయడం చాలా దురదృష్టకరం. రైతులకు లక్ష రూపాయాల వరకు బ్యాంకులు రుణాలిస్తాయని చెబుతుంది. కానీ క్షేత్రస్థాయిలో జరిగే దాఖలాలు ఒక్కటీ కనిపించవు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తించాలి! సేద్యపు రంగానికి బ్యాంకులు కచ్చితంగా 18 శాతం నిధులు ఇవ్వాలని ఆర్‌బీఐ నిబంధనలున్నాయి. అవి ఏనాడు పూర్తిస్థాయిలో అమలుకాలేదు. ప్రభుత్వాలు ఈ రకంగా వ్యవహరిస్తే 60 శాతం మంది ఆధారపడుతున్న వ్యవసాయ రంగం మనుగడ కష్టమే’’ అని సోమయాజులు ఆందోళన వ్యక్తం చేశారు. 

వ్యవసాయం తర్వాత అత్యంత కీలకమైన తయారీ రంగాన్ని కూడా యూపీఏ పూర్తిగా పెడచెవిన పెట్టిందని విమర్శించారు. ‘‘తయారీ రంగంలోని త్రైమాసిక ఫలితాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఆ రంగం నెగిటివ్ 2 శాతంగా ఉంది. ఇదే పద్దతి కొనసాగితే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? ప్రభుత్వం పెట్టుబడులు పెట్టకపోతే దేశం ముందుకెలా వెళ్లేది?’’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేస్తేనే ప్రవేట్ సంస్థలు పది రూపాయలు ఖర్చు చేస్తాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. 

‘‘కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జీడీపీ వృద్ధిరేటు 9శాతం లక్ష్యంగా పెట్టుకుంటుంది. కానీ దురదృష్టం కొద్ది ప్రతి ఏటా లక్ష్యాన్ని చేరుకోలేకపోతుంది. 11వ పంచవర్ష ప్రణాళికలో కూడా 9శాతం లక్ష్యంగా పెట్టుకోగా 7.5 శాతాన్నే సాధించగలిగింది. ప్రస్తుతం అదే మాదిరిగా 9 % పెంచుతామని పాత పాటే పాడుతున్నారు’’ అని ఎద్దేవా చేశారు. రెవెన్యూ లోటు సున్న శాతానికి తీసుకురావాలనుకుంటున్న ప్రభుత్వం నికర వ్యయం ఖర్చు చేయకపోతే ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. పన్ను రేటు పెంచితే రెవెన్యూ ఆదాయం పెరగదన్న విషయం తెలిసి కూడా కేంద్రం అదే తప్పిదం చేస్తుందని విమర్శించారు.

జైరాం చర్యలతో దేశం మూడేళ్లు వెనక్కి!
కేంద్ర పర్యావరణ శాఖా మంత్రి జైరాం రమేష్ రెండేళ్లుగా చేపడుతున్న చర్యలతో దేశం మూడేళ్లు వెనక్కి పోయిందని సోమయాజులు ఆరోపించారు. పర్యావరణాన్ని సాకుగా చూపి బొగ్గు దిగుమతిని పూర్తిగా నిషేధించారని, దీంతో దేశంలో కరెంట్ కొరత ఏర్పడిందన్నారు. ఫలితంగా తయారీ రంగం పూర్తిగా మరుగునపడిందన్నారు. జైరాం చర్యలు చూస్తుంటే ‘‘అస్థిపంజరాన్ని డైటింగ్ చేయమన్నట్లుంది’’ అని ఎద్దేవా చేశారు. అభివృద్ది చెందని దేశంలో గ్లోబల్ ఫైర్ కు సంబంధమేంటి? అని నిలదీశారు. ఆయన చర్యల వల్లే దేశం మూడేళ్ల అభివృద్ది ఆగిపోయింది. ఈ విషయం తెలిసి కూడా ప్రధాని మన్మోహన్ ఎందుకు మిన్నకుండి పోయారో అర్థంకావడం లేదన్నారు.

పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్

నెల్లూరు జిల్లా కోవూరులో ఎన్నికల ప్రచారం ముగించుకుని శుక్రవారం రాత్రి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులకు చేరుకున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

నేడు జగన్ పర్యటన వివరాలు

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శనివారం ఉదయం పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో మమేకం కానున్నారు. 11 గంటలవరకు కార్యాలయంలోనే ఉండి స్థానిక అర్‌అండ్‌బీ అతిథి గృహంలో జరిగే యూసీఐఎల్ గ్రీవెన్స్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో వేంపల్లెలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారు.

టీడీపీ ఓటుకు రూ. 500 నుంచిరూ. 800 పంచితే కాంగ్రెస్ పార్టీ వెయ్యి నోట్లు

 దేశ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా నెల్లూరు జిల్లా కోవూరు ఉప ఎన్నికలో విచిత్ర రాజకీయ పర్వానికి తెర లేచింది. ఇప్పటి వరకూ జరిగిన ఏ ఎన్నికల్లో అయినా రాజకీయ పార్టీలు తమకు ఓట్లు సంపాదించుకోవడానికి డబ్బులు పంచుతూ వస్తున్నాయి. కోవూరులో మాత్రం కాంగ్రెస్, టీడీపీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటేయవద్దంటూ విచ్చల విడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నాయి. 

ఈ ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసే వాతావరణం ఏర్పడింది. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తాము గెలవడానికి కాకుండా, వైఎస్సార్ కాంగ్రెస్‌కు భారీ విజయం దక్కకుండా చేయాలని తీవ్రంగా కష్టపడుతున్నాయి. పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో ఈ రెండు పార్టీలు బుధవారం అర్ధరాత్రి నుంచి గ్రామాల్లో నోట్ల వరద పారిస్తున్నాయి. టీడీపీ ఓటుకు రూ. 500 నుంచిరూ. 800 పంచితే కాంగ్రెస్ పార్టీ వెయ్యి నోట్లు వెదజల్లుతోంది. ప్రజల ఫిర్యాదులతో పోలీసులు అరకొర దాడులు చేసినా పంపిణీ జోరు మాత్రం తగ్గలేదు.

వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, టీడీపీలకు కోవూరు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఎన్నిక ఫలితం ఎలా ఉండబోతుందో కాంగ్రెస్, టీడీపీలకు బాగా అర్థమైంది. తమ పార్టీల సిద్ధాంతాలు, అధినేతల ప్రసంగాలను న మ్మి జనం తమకు పట్టం కట్టరనే వాస్తవాన్ని వారు గుర్తించారు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఆధిక్యత దక్కితే ఈ రెండు పార్టీల్లో బ్లోఅవుట్ పేలే ప్రమాదం ముంచుకొస్తోంది. 

దీంతో ఈ రెండు పార్టీల అగ్రనాయకులు కోవూరులో విస్తృతంగా పర్యటించారు. రెండేళ్లుగా రోజూ ఏడుస్తున్న ఏడుపులే కోవూరు జనం ముందు ఏడ్చారు. అవినీతి పేరుతో అవాస్తవ ప్రచారం చేసి, జనం బుర్రలు పాడు చేసేందుకు శక్తికి మించి ప్రయత్నాలు చేశారు. తాము గెలిస్తే కోవూరును భూలోక స్వర్గం చేస్తామనే రీతిలో హామీల వర్షం కురిపించారు. ఇంతా చేసి నానా పాట్లు పడినా తమ కోరిక తీరే అవకాశమే లేదనే విషయం గుర్తించారు. చివరి ప్రయత్నంగా ఓటర్లను నోట్లతోను, మద్యం సీసాలతోను ప్రలోభాలకు గురి చేయడానికి బరితెగించారు.

కోట్లకు కోట్ల రూపాయల నోట్ల సంచులు నెల్లూరుకు దిగుమతి చేసుకున్నారు. టీడీపీ శ్రేణులు బుధవారం రాత్రి నుంచి గ్రామాల్లో నిద్దర పోతున్న వారిని లేపి ఓటుకు రూ. 500 నుంచి రూ. 800 వరకూ ముట్టజెప్పాయి. ఈ డబ్బు తీసుకుని ఓటు తమకు వేయక పోయినా ఫర్వాలేదు, వైఎస్సార్ కాంగ్రెస్‌కు మాత్రం వేయవద్దని వేడుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ మెజారిటీ ఎంత భారీగా తగ్గితే తమ రాజకీయ భవిష్యత్తుకు అంత గట్టి పునాది పడుతుందనుకుంటున్న కాంగ్రెస్ నేతలు జనాన్ని వెయ్యి రూపాయల నోట్లతో కొట్టే రాజకీయం ప్రారంభించారు. 

ఎన్నికల సంఘం, పోలీసు అధికారులు హడావుడి చేస్తున్నా ఏమాత్రం తొణుకు, బెణుకు లేకుండా యథేచ్చగా నోట్ల పంపిణీ కానిచ్చేస్తోంది. ఈ బరితెగింపు చూసి ఆగ్రహిస్తున్న జనం పోలీసులకు ఫోన్లు చేసి డబ్బులు పట్టుకోండంటూ సమాచారం ఇస్తున్నారు. రూ 50 వేలు, రూ లక్ష లాంటి చిన్నమొత్తాలను మాత్రం స్వాధీనం చేసుకుంటున్నారు. భారీ మొత్తాలు దొరికితే మాత్రం తమకెక్కడ ఇబ్బందులు ఎదురవుతాయోననే భయంతో వారు నిశ్చేష్టులై చూడడం మినహా ఏమీ చేయలేక పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గురువారం నుంచి నోట్ల పంపిణీ మరింత ఊపందుకుంది.

గ్రామాల్లో ఎక్కడ చూసినా నోట్ల జాతర సాగుతోంది. శుక్రవారం రాత్రి దాకా వెయ్యి నోట్లు చేరని గ్రామాల వాసులు ఇది తమ సొమ్మేలే అనే విధంగా నిద్దుర మేలుకుని ఎదురు చూస్తున్నారు. రెండు పార్టీల నేతలు మండలాల వారీగా మద్యం నిల్వలు సిద్ధం చేసుకుని గ్రామాలకు తరలించి మందుబాబులకు అందిస్తున్నారు. ఓటుకు వెయ్యిచ్చినందువల్ల తమకుపడే ఓట్లు గట్టిగా నిలవడంతో పాటు, వైఎస్సార్ కాంగ్రెస్‌కు వేయాలనుకున్న ఓట్లలో కొన్నయినా చీలకపోతాయా? అనే ఆశ కాంగ్రెస్‌లోనూ, ఇదే రకమైన అంచనా టీడీపీలోనూ వ్యక్తమవుతోంది. 

కోవూరు ఉప ఎన్నిక పుణ్యమా అని తమకు ఊహించనంత డబ్బులు అందుతుండటంతో ఓటర్లు ఆనందంగా ఉన్నారు. డబ్బు ఎవరు ఎంత ఇచ్చినా ఓటు మాత్రం తాము ఎవరికి వేయాలనుకుంటున్నామో వారికే వేస్తామని జనం చెబుతుండడం ఈ రెండు పార్టీలకు చెమటలు పట్టిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ భారీ మొత్తంలో నోట్లిచ్చి ఓట్లను ఏమాత్రం బదిలీ చేయించుకోగలిగారనే విషయం ఈనెల 21వ తేదీ తేలనుంది. 

నిఘా వైఫల్యం 
కోవూరు ఓటర్లకు డబ్బు పంపిణీ విచ్చలవిడిగా సాగుతున్నా అరికట్టడంలో పోలీసులు, నిఘా శాఖ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కోవూరు నియోజకవర్గం చుట్టుపక్కల భారీ ఎత్తున పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వచ్చే పోయే వాహనాలన్నీ తనిఖీ చేసి సామాన్యులను వేధిస్తూ హడావుడి చేస్తున్న పోలీసులకు డబ్బు ఎలా తరలి వెళుతున్నదనే విషయం పట్టడం లేదు. ఓవైపు నుంచి కాంగ్రెస్, మరో వైపు నుంచి టీడీపీ నాయకులు భారీ ఎత్తున ఓటర్లను కొనుగోలు చేసేందుకు గ్రామాల్లో జొరబడుతున్నా వారి కదలికలను మాత్రం నిఘా విభాగం సిబ్బంది పసిగట్ట లేక పోతున్నారా? అనే అనుమానం కలుగుతోంది. 

విషయం తెలిసి కూడా ఊరకుంటున్నారా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. ఉన్నత స్థాయిలో కాంగ్రెస్, టీడీపీలతో అధికారులు కుమ్మక్కు అయ్యారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఓటుకు రూ.500 నుంచి రూ.1000 రూపాయల వరకూ పంపిణీ జరుగుతోందంటే ఆ మేరకు కొన్ని పదుల కోట్లు కోవూరు పొలిమేరల్లో నుంచి లోపలికి వెళుతూ ఉండాలి. ఇంత పెద్దమొత్తం ప్రవహిస్తున్నా అధికారులు కళ్లు మూసుకున్నారంటే ఇక ఎన్ని పోలీసు చెక్‌పోస్టులు పెడితే మాత్రం ప్రయోజనం ఏమిటని అంటున్నారు.

సాయిరెడ్డితో ఏదో చెప్పించి జగన్‌ను అరెస్టు చేయాలని చూస్తోంది


సాక్షులను బెదిరిస్తారని ఆధారాలు లేకుండా ఆరోపిస్తోంది
సెక్షన్ 409 సాయిరెడ్డికి వర్తించదు.. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని వినతి
బెయిల్ పిటిషన్‌పై ఇరువురి 
వాదనలు పూర్తి.. 19న తీర్పు

హైదరాబాద్, న్యూస్‌లైన్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో కుట్రదారులను సీబీఐ వదిలేసిందని ఆడిటర్ విజయసాయిరెడ్డి తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి బి.నాగమారుతిశర్మ శుక్రవారం మరోసారి విచారించారు. ఈ కేసులో నేరానికి పాల్పడిన వారిపై సీబీఐ దర్యాప్తు జరపడంలేదని, రాజకీయ కోణంలో విచారణ జరుపుతోందని సుశీల్‌కుమార్ ఆరోపించారు. రాజకీయ కక్షతో కొందర్ని లక్ష్యంగా చేసుకొని సీబీఐ విచారణ చేస్తోందని, ఇది బహిరంగ రహస్యమేనని అన్నారు. సాయిరెడ్డితో ఏదో చెప్పించి జగన్‌ను అరెస్టు చేయాలని సీబీఐ ప్రయత్నిస్తోందన్నారు. 

ఈ కేసులో 90 రోజుల్లోపు కొందరు ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తులను అరెస్టు చేసి వారితో సాయిరెడ్డి కుట్రకు పాల్పడ్డారని ఆరోపించే అవకాశం ఉందని తెలిపారు. ఆడిటర్‌గా పనిచేసిన సాయిరెడ్డికి ఐపీసీ 409 (నేరపూరిత నమ్మకద్రోహం) వర్తించదని, ఇతర కేసుల్లో 60 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయకపోతే కోర్టు బెయిల్ మంజూరు చేయవచ్చని తెలిపారు. ‘‘సీబీఐ విచారణ పారదర్శకంగా జరగడంలేదు. ఈ కేసులో అసలు నేరస్తులు ఎవరు ? లబ్ధిచేకూర్చి పెట్టుబడులు పెట్టడానికి కారకులు ఎవరు? వారందరినీ విడిచిపెట్టారు. కేవలం డబ్బును పెట్టుబడుల రూపంలో మళ్లించారనే ఆరోపణలతో సాయిరెడ్డిని అరెస్టు చేశారు’’ అని వివరించారు. సాక్షులను బెదిరిస్తారనే సాకుతో బెయిల్‌ను అడ్డుకోలేరని, ఇందుకు సంబంధించిన ఆధారాలను తప్పకుండా సీబీఐ చూపాల్సి ఉంటుందని తెలిపారు. 

సాయిరెడ్డి బెదిరించారని ఒక్క సాక్షి అయినా ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు. దాదాపు 300 గంటలపాటు సీబీఐ విచారణకు హాజరైన సాయిరెడ్డి పారిపోయే అవకాశమే లేదని, బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన పత్రాల్లో సాయిరెడ్డి పాత్రకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని సీబీఐ డిప్యూటీ లీగల్ అడ్వైజర్ బళ్లా రవీంద్రనాథ్ తెలిపారు. జగన్ కంపెనీల్లో డెరైక్టర్‌గా ఉన్నందున ఏజెంట్ హోదాలో సాయిరెడ్డికి ఐపీసీ 409 వర్తిస్తుందని, అందువల్ల చార్జిషీట్ దాఖలు చేసేందుకు తమకు 90 రోజులు గడువు ఉందని నివేదించారు. సాయిరెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించడంతోపాటు ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నిస్తారని ఆరోపించారు. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును ఈనెల 19కి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా సాయిరెడ్డి రిమాండ్‌ను కోర్టు ఈనెల 30 వరకు పొడిగించింది. 

కూర్చోని సీబీఐ జేడీ: సాయిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సమయంలో సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణ కోర్టు హాల్ లో నిలబడే ఉన్నారు. న్యాయమూర్తిని చాంబర్‌లో కలవడంతోపాటు కోర్టు హాల్‌లో న్యాయవాదుల కుర్చీలో లక్ష్మీనారాయణ కూర్చోవడం, పీపీలకు సలహాలు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం వాదనలు జరిగిన 50 నిమిషాలసేపు ఆయన నిల్చొనే ఉన్నారు. కక్షిదారులు కూర్చునే స్థానాల్లో కూర్చోవాలని సీబీఐ సిబ్బంది సూచించినా ఆయన వినలేదు.

కోవూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యంపైనే పందేలు

ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములపై పందేలు కాయడం సహజం. అయితే, నెల్లూరు జిల్లా కోవూరు ఉప ఎన్నికపై మాత్రం ఇందుకు భిన్నంగా పందేలు కాస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారన్న విషయంపై అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. దీంతో ఆ విషయాన్ని పక్కనబెట్టి, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంత మెజార్టీతో గెలుస్తాడన్న అంశంపైనే రాష్ట్రావ్యాప్తంగా పందేలు కాస్తున్నారు. నెల్లూరు జిల్లాలోనే కాకుండా.. హైదరాబాద్, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, కరీంనగర్ జిల్లాలు, విజయవాడ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం ప్రచారం ముగియడంతో బెట్టింగుల జోరు మరింత పెరిగింది. పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తున్న అభ్యర్థికి 25 వేల మెజారిటీ వస్తుందని నిన్నటివరకు పందేలు నడవగా, చివరి రోజుల్లో జరిగిన ఉధృత ప్రచారంతో అంచనాలు, రేటు కూడా భారీగా పెరిగాయి. 40 వేల మెజారిటీ వస్తుందన్న సవాల్‌తో లక్షకు మూడు లక్షల రూపాయలిచ్చే స్థాయికి చేరింది. ఈ స్థానాన్ని భారీ ఆధిక్యంతో దక్కించుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తొలివిడతలో ఐదు రోజులపాటు పర్యటించిన ఆయన బుధ, గురు, శుక్రవారాల్లో మలివిడత ప్రచారం నిర్వహించారు. 2009లో గెలిచిన ఈ సీటును ఎలాగైనా దక్కించుకోవాలన్న కోరికతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మూడు విడతల ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరపున సీఎం కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే చిరంజీవి ప్రచారం చేశారు. అయితే.., పార్టీలతో సంబంధం లేకుండా.. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు, మద్దతుదారులు కూడా వారి అభ్యర్థులు గెలుస్తారని కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్‌కు రాబోయే మెజారిటీ మీదే పందేలు కాస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మెజారిటీ 15వేలు దాటదనే సంఖ్య నుంచి పందేలు మొదలయ్యాయి. మెజారిటీపై కోట్లల్లో కూడా బెట్టింగ్‌లు నడుస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ.20 కోట్ల వరకూ పందేలు కాసినట్టు విశ్వసనీయ సమాచారం. మెజారిటీ 25 వేలకు మించదనే సవాల్‌తో ఓ ప్రముఖుడు రూ.25 కోట్లకు పందెం కాసినట్లు రాజకీయవర్గాల సమాచారం. టీడీపీకి చెందిన ఒక శాసన సభ్యుడు (నెల్లూరు జిల్లా కాదు) వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి 25 వేల మెజారిటీతో గెలుస్తాడని రూ.3 లక్షలకు పందెం కాశారు. 

ఆయనతోపాటు పందెం కాసిన వ్యక్తి కూడా ముందుగానే డబ్బును మధ్యవర్తి వద్ద పెట్టారు. పార్టీ అధినేతల ప్రచారం ముగుస్తున్న దశలో ఆయా పార్టీల మద్దతుదారులు, పందెంరాయుళ్ల అంచనాలు మారిపోయాయి. బుధవారం నుంచి కొందరు నాయకులు మెజారిటీ 40 వేలు దాటుతుందంటూ పందెం కాశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ప్రముఖ కాంట్రాక్టర్ ఈ సంఖ్య మీద రూ.2 కోట్లకు పందెం కాశారు. టీడీపీ మద్దతుదారుడైన మరో కాంట్రాక్టర్ వైఎస్సార్ సీపీ అభ్యర్థికి 40 వేలు మెజారిటీ వస్తే లక్షకు 3 లక్షలు ఇస్తానని బెట్ కట్టారు. ఇద్దరికీ కావాల్సిన ఒక పెద్దమనిషి వద్దకు బుధవారం ఈ మొత్తం చేరింది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి 45 వేలకు లోపే మెజారిటీతో గెలుస్తాడని, ఈ సంఖ్య దాటుతుందని ఎవరైనా పందేనికి సిద్ధమైతే లక్షకు 4 లక్షలకు సిద్ధమంటూ మరికొందరు ముందుకొచ్చారు. ఓ రాజకీయ నాయకుడైతే 45 వేలకు ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందనే సవాల్‌తో గురువారం కోటి రూపాయలు అప్పగించడానికి సిద్ధమయ్యారు. ఆదివారం పోలింగ్ జరుగుతుండటంతో అప్పటికి మెజారిటీ అంకె మీద మరిన్ని కోట్లకు పందేలు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలింగ్ తర్వాత కూడా పందేలకు అనేకమంది సొమ్ములు సిద్ధం చేసుకున్నారు.

తెలంగాణలోనూ అదే తీరు..

హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఆరు అసెంబ్లీ స్థానాల ఫలితాలపైన కూడా పందేలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా మహబూబ్‌నగర్ స్థానంలో టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల జయాపజయాలపై బెట్టింగ్‌లు ఎక్కువగా సాగుతున్నట్లు సమాచారం. నాగర్‌కర్నూలు స్థానంలో నాగం జనార్ధన్‌రెడ్డి మెజారిటీపైన కూడా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. మిగతా స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు, మెజారిటీలపై పందేలు జోరుగా సాగుతున్నట్లు సమాచారం.

కాంగ్రెస్, టీడీపీ డబ్బు మూటలతో వస్తున్నాయి


(బుచ్చిరెడ్డిపాళెం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన తుగ్లక్ పాలనలాగా తయారైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన కోవూరు ఉప ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన శుక్రవారం బుచ్చిరెడ్డి పాళెం మండలంలోని పలుగ్రామాల్లో జరిగిన రోడ్‌షోల్లో మాట్లాడారు. ‘తుగ్లక్ పాలనకు నిదర్శనం ఏంటంటే ప్రచారం చేసుకోవడానికి ప్రచారరథానికి అనుమతిని ఇస్తారట...మాట్లాడానికి మైకుకు మాత్రం అనుమతించరట...అంతే కాదు, ప్రజా సమస్యల పరిస్థితీ అలాగే ఉంది...చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేసే విషయాన్ని విస్మరించారు. విద్యార్థులు ఫీజులు కట్టలేక పరీక్షల సమయంలో ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది.’ అని ఆయన అన్నారు.
ఆత్మసాక్షిగా ఓట్లు వేయండి
కాంగ్రెస్, టీడీపీ ఈ ఉప ఎన్నికల్లో డబ్బు మూటలతో ప్రజల ఆత్మీయానురాగాలను వేలం వేసి కొనుగోలు చేయాలని చూస్తున్నాయని విమర్శించారు. ప్రజలు తమ మనస్సాక్షి మేరకే ఓటు వేయాలని జగన్ కోరారు. ‘ఈ రోజు పొద్దున పత్రికల్లో కూడా చదివాను... కాంగ్రెస్, చంద్రబాబుగారి తెలుగుదేశం పార్టీల వద్ద డబ్బులు పుష్కలంగా ఉన్నాయి...వాళ్లు డబ్బు సంచులతో పట్టుబడ్డారు....ప్రతి అక్క, చెల్లి...ప్రతి అవ్వా, తాత, ప్రతి సోదరుడికి నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే... మీ మనస్సాక్షి ఎలా చెబితే అలా ఓట్లు వేయండి...’ అని కోరారు. 

తనకు ఇరువైపులా ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి , నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇద్దరూ నిన్నటి వరకూ ఎం.పిగా, ఎమ్మెల్యేగా ఉన్నారని, వారిద్దరూ రాజకీయాల్లో విలువలకు కట్టుబడి తమ పదవులకు రాజీనామాలు చేశారని జగన్ అన్నారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విలువలు, విశ్వసనీయత పెంపొందించాలని, నిజాయితీగా పేదవాడికీ, రైతుకూ అండగా నిలబడాలని వారు పదవులు కోల్పోయారన్నారు. అలాంటి వారికి చల్లని దీవెనలు ఇచ్చి ఓటర్లు తమ సంపూర్ణ మద్దతు తెలపాలని, తాను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నానని జగన్ అన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల గురించి పట్టించుకునే వారే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ రైతులకు గిట్టుబాటు ధర లేదంటే పట్టించుకోరు, కూలీలకు సరైన కూలీ రావడం లేదంటే పట్టించుకోరు, చేనేత కార్మికుల గురించి పట్టించుకోరు, వారి రుణాల మాఫీని విస్మరించారు..’ అని ఆయన రాష్ట్ర ప్రభుత్వ పనితీరును దుయ్యబట్టారు. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని దివంగత ప్రియతమ నాయకుడు వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108, ఆరోగ్యశ్రీ వంటి పథకాలన్నీ ఆయన మరణం తరువాత పడకేశాయని జగన్ విమర్శించారు. ప్రజా సమస్యలపై కనీసం ప్రతిపక్షమైనా పోరాడుతుందా అని ప్రజలు ఎదురు చూస్తుంటే చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారని ఆయన విమర్శించారు. అధికార, ప్రతిపక్షాలు రెండూ కుమ్మక్కై ఆర్టీఐ కమిషనర్ల పదవులను పంచుకున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. జగన్ వెంట రోడ్‌షోలో జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ సీహెచ్ బాలచెన్నయ్య, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం, నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. సాయంత్రం ప్రచారం పూర్తయ్యాక ఆయన ఆత్మకూరు మీదుగా కడపకు బయలుదేరి వెళ్లారు.



 



Dr YSR's Pada Yatra

Written By news on Friday, March 16, 2012 | 3/16/2012

YS Jagan By Election Camping in Nagaya kunta,Kovur

యువతకు ఆదర్శంగా నిలిచిన సచిన్: జగన్

వంద సెంచరీలు చేసి అంతర్జాతీయ క్రికెట్ లో చరిత్ర సృష్టించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అభినందనలు తెలిపారు. నేటి యువతకు సచిన్ ఆదర్శంగా నిలిచారన్నారు. సహనంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని సచిన్ రుజువు చేశారన్నారు. 

సాధారణ బడ్జెట్ లో ముఖ్య అంశాలు

కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెడుతున్న సాధారణ బడ్జెట్ లో ముఖ్య అంశాలు ఈక్రింది విధంగా ఉన్నాయి.
యూరప్ సంక్షోభం, మధ్యప్రాచ్య రాజకీయ పరిస్థితులు భారత్ పై ప్రభావం
వృద్ధిరేటు తగ్గుదల తీవ్ర ప్రభావం
2011-12లో వృద్ధిరేటు 6.9 శాతం
2011-12 సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు నిరాశాజనకం
ఆర్థిక పునరుజ్జీవనానికి అయిదు సూత్రాల ప్రణాళిక
వ్యవసాయం, సేవల రంగం మెరుగు
తయారీ రంగం పురోగతివైపు పయనం
సంస్కరణలు వేగవంతం చేయాలి
దేశీయ అవసరాలు తీర్చేందుకు ప్రైవేట్ భాగస్వామ్యం వైపు దృష్టి
ఆహార ద్రవ్యోల్బణ నియంత్రణలో రాష్ట్రాల సహకారం గణనీయం

2012-13 సంవత్సరానికి వృద్ధిరేటు 7.6 శాతంగా అంచనా
వ్యవసాయం, సేవల రంగాలు మెరుగ్గా ఉన్నాయి
ముడిచమురు కొనుగోళ్లకు గణనీయంగా వ్యయం
ఆరు నెల్లలో కిరోసిన్, ఎల్ పీజీ, సబ్సీడీలు నేరుగా లబ్ధిదారులకు అందేలా పైలట్ పథకం
ఎగుమతులు, దిగుమతుల మార్కెట్ల విస్తరణలో విజయం
నందన్ నీలేకని కమిటీ సిఫార్సులు పరిగణనలోకి తీసుకోవటం
వ్యవసాయం, అనుబంధ రంగాలు 2.5 శాతం వృద్ధి సాధించే అవకాశం
ఆసియా దేశాల ఎగుమతులు 33 శాతం నుంచి 50 శాతానికి పెరుగుదల
తొలి త్రైమాసికంలో 23 శాతం ఎగుమతులు పెరుగుదల
ప్రజాజీవితంలో నల్లధనం, అవినీతి లేకుండా చేయటం

సంస్కరణలు వేగవంతం చేయాల్సిన అవసరం
రాయితీల బదిలీకి నందన్ నీలేకన్ ఇచ్చిన సిఫార్సులు ఆమోదం
వచ్చే ఆరు నెలల్లో 50 జిల్లాల్లో పైలట్ పథకం
రాబోయే మూడేళ్లలో జీడీపీలో సబ్సడీని రెండు శాతం నుంచి 1.7 శాతం తగ్గింపు
రానున్న రెండేళ్లలో ఆహార భద్రత బిల్లు పూర్తి స్థాయిలో అమలు
బడ్జెట్ లో భాగంగానే ఎఫ్ ఆర్ బీఎమ్ సంస్కరణలు
ప్రభుత్వ రంగ సంస్థల్లో 51 శాతం వాటా కొనసాగింపు
త్వరలో ప్రత్యక్ష పన్నుల కోడ్ బిల్లు
నాబార్డు, ఇతర బ్యాంకులకు రూ.15,888 కోట్లు కేటాయింపు

నాబార్డు, ఇతర వ్యవసాయ బ్యాంకులకు రూ.15,888 కోట్లు కేటాయింపు
రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం దిగొచ్చే అవకాశం
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో నెస్ట్ పద్ధతి విజయవంతం
పదికోట్లకు పైబడిన ఐపీవో విడుదల, ఇకపై ఎలక్ట్రానిక్ ఫార్మాట్ తప్పనిసరి
ఇకపై ఐపీవో ప్రక్రియ సరళతరం
పారిశ్రామిక మౌలిక సదుపాయాల కోసం రూ.50 కోట్లు కేటాయింపు
గ్యాస్ పైలెట్ ప్రాజెక్ట్ మైసూర్ లో నడుస్తోంది

పబ్లిక్ బ్యాంకుల మూలధన అవసరాలకు ప్రత్యే సంస్థ ఏర్పాటుకు పరిశీలన
రక్షణ రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులు
మల్టీబ్రాండ్ రీటెయిలింగ్ లో 51 శాతం ఎఫ్ డీఐలకు ఏకాభిప్రాయం
జాతీయ రహదారుల సంస్థకు రూ.10వేల కోట్లు సమకూర్చటం

పబ్లిక్ బ్యాంకుల మూలధన అవసరాలకు ప్రత్యే సంస్థ ఏర్పాటుకు పరిశీలన
రక్షణ రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులు
మల్టీబ్రాండ్ రీటెయిలింగ్ లో 51 శాతం ఎఫ్ డీఐలకు ఏకాభిప్రాయం
జాతీయ రహదారుల సంస్థకు రూ.10వేల కోట్లు సమకూర్చటం
వెయ్యి జనాభా గల గ్రామాలకు బిజినెస్ కరస్పాండెంట్ లు
విమాన ఇంధనం నేరుగా విదేశాల నుంచి కొనుగోలు
ఈ ఏడాది ఆగస్ట్ నుంచి జీఎస్టీ అమలు
ప్రీ బాండ్ల ద్వారా రూ.50 కోట్లు సేకరణ
ఈ సమావేశాల్లోనే పెన్షన్, బ్యాంకింగ్ బిల్లులు
ఇఫ్రా రంగంలో రూ.50 లక్షల కోట్లు పెట్టుబడి
గుంటూరుజిల్లాలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చేనేత సముదాయాల ఏర్పాటు
ఈశాన్య రాష్ట్రాల కోసం స్వాభిమాన్ క్యాంఫైన్
విమానయాన రంగంలో విదేశీ పెట్టుబడులపై పరిశీలన
కృషి వికాస్ యోజనకు రూ.7860 కోట్లు

కిసాన్ క్రెడిట్ కార్డులకు ప్రాధాన్యత
ఈ కార్డుల ద్వారా రైతులు నేరుగా ఏటీఎంల నుంచి నగదు తీసుకునే సదుపాయం
అయిదేళ్లలో యూరియా ఉత్పత్తిని పెంచుతాం
వచ్చే దశాబ్దంలో వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యత
25 లక్షలలోపు గృహ రుణాలకు ఒక శాతం వడ్డీ రాయితీ
సకాలంలో వడ్డీ చెల్లించే రైతులకు అదనంగా 3శాతం వడ్డీ రాయితీ
విద్యుత్ రంగానికి రూ.10వేల కోట్లు కేటాయింపు
ఆక్వా రంగానికి రూ.5వేల కోట్ల కేటాయింపు
వ్యవసాయానికి 18 శాతం పెరిగిన కేటాయింపులు
కిరోసిన్ సబ్సిడీ నేరుగా వినియోగదారులకే రాజస్తాన్ లోని ఆల్వార్ నుంచి ప్రారంభం

హరిత విప్లవ పథకానికి వెయ్యికోట్లు
మైక్రో ఫైనాన్స్ సంస్థలకు కళ్లెం, త్వరలో బిల్లు
మార్కెట్ ధరకే ఎల్ పీజీ అమ్మకం, తొలిదశలో మైసూర్ లో అమలు
రాజీవ్ గాంధీ పొదుపు పథకం ప్రారంభం
ఆహార సబ్సిడీ విధానం ఆరునెలల్లో 50 జిల్లాల్లో అమలు
8వేల కోట్లతో ఇన్ ఫ్రా ఫండ్ ఏర్పాటు
చేనేత కార్మికులకు రూ. 3,884కోట్ల రుణమాఫీ
సర్వ శిక్షణా అభియాన్ కు రూ.25,555 కోట్లు
మధ్య, చిన్నతరహా పరిశ్రమలకు రూ.5 వేలకోట్లతో ఫండ్ వెంచర్
జీడీపీలో 2 శాతం వరకూ సబ్సిడీలు
కంప్యూటరైజ్ డ్ విధానంలో ఎరువుల సబ్సిడీ, రైతులకు-రిటైర్స్ కు నేరుగా సబ్సిడీ

వితంతు, వికలాంగులకు పింఛన్ రూ.200 నుంచి రూ.300లకు పెంపు
తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణానికి అనుమతి
హైదరాబాద్ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు కేటాయింపు
సకాలంలో రుణాలు చెల్లించే మహిళ స్వయం సహయక సంస్థలకు 3 శాతం వడ్డీ రాయితీ
మహిళలకు రూ.3 లక్షల వరకూ 7%రుణం, సకాలంలో చెల్లిస్తే మరో 3శాతం వడ్డీ రాయితీ
దేశంలో కొత్తగా 7 మెడికల్ కాలేజీలు
రేషన్ పంపిణీకి కొత్త విధానం
గిడ్డంగుల కోసం రూ.5,000 కోట్ల కేటాయింపు
రక్షణ రంగానికి రూ.1,93407 కోట్లు
గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూ.20వేల కోట్లు 

Popular Posts

Topics :