25 March 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

జగన్ అరెస్ట్ అయ్యే అవకాశాల్లేవు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

Written By news on Saturday, March 31, 2012 | 3/31/2012

ఆస్తుల కేసులో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాల్లేవని వైఎస్సార్‌సీపీ స్పష్టంచేసింది. జగన్‌ను అరెస్ట్ చేయాలన్న నిబంధన ఆస్తుల కేసులో ఎక్కడాలేదని తేల్చిచెప్పింది. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పెద్ద ఫ్రాడ్‌గా అభివర్ణించింది. జగన్‌ను ఏ-1గా పేర్కొంటూ చార్జిషీట్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. జగన్ అక్రమాస్తుల కేసులో కోర్టులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, పార్టీ నేత సోమయాజులు శనివారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో విడివిడిగా మాట్లాడారు. 

ఆస్తుల కేసులో జగన్‌ను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో విప్లవాలు పుడతాయని, ప్రజలు తిరగపడుతారని జూపూడి హెచ్చరించారు. అయినా జగన్ ఏ నేరం చేశారని అరెస్ట్ చేసి, శిక్షిస్తారని ఆయన ప్రశ్నించారు. "జగన్ ఎంత శక్తివంతుడో ప్రజాబలం చూస్తేనే తెలుస్తోంది. జగన్‌పై చేయేసి చూస్తే ఆ తర్వాత పరిస్థితి వారికే తెలుస్తుంది.

చార్జీల పెంపుపై 3న వైఎస్సాఆర్ సీపీ ధర్నా

కరెంట్ చార్జీల పెంపునకు నిరసనగా ఏప్రిల్ 3న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోని విద్యుత్ సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నాలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ ధర్నా ద్వారా పాలకుల కళ్లు తెరిపించాలని ఆయన సూచించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఐదేళ్ల పాటు కరెంట్ చార్జీలు ఎట్టి పరిస్థితిలో పెంచబోమని దివంగత వైఎస్ ఇచ్చిన హామీకి ఆయన రెక్కల కష్టంమీద ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వం తిలోదకాలిస్తోందని జగన్ మండిపడ్డారు.

YS Jagan Consoles Miriyala Saraswathi`s Family

YS Jagan Odarpu yatra special Guntur Gundelo 31st March

YS Jagan odarpu yatra @ Koritapadu, Guntur

Bangi fire on Chandrababu

‘చార్జిషీటు వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం’

జగన్ ఆస్తుల వ్యవహారంలో సీబీఐ హడావుడిగా చార్జిషీటు దాఖలు చేయడం వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సోమయాజులు ఆరోపించారు. చార్జిషీటు మోపడం ఓ రకంగా కోర్టు ధిక్కారం కిందకి వస్తుందని వివరించారు. ఎఫ్‌ఐఆర్ సంగతి తేలకుండా దర్యాప్తు జరపడం తనకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సీబీఐ దర్యాప్తు తీరు సవ్యంగా లేదని ఆయన విమర్శించారు.

జగన్ ఆస్తుల వ్యవహారంలో సీబీఐ శనివారం కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. రెండు ట్రంకు పెట్టెల్లో తరలించిన చార్జిషీటు పత్రాలను నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానం ముందుంచింది. 68 పేజీల చార్జిషీటులో 13 మందిని నిందితులుగా, 66 మందిని సాక్షులుగా పేర్కొంటూ 263 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. మొదటి నిందితుడిగా జగన్, రెండో నిందితుడిగా విజయసాయిరెడ్డి పేర్లను పేర్కొంది. అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్, ట్రెడెంట్ టెక్నాలజీ, శ్రీనివాసరెడ్డి, నిత్యానందరెడ్డి, చంద్రశేఖర్, బీపీ ఆచార్య, విజయలక్ష్మి ప్రసాద్, చంద్రమౌళి, జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రా పేర్లను కూడా చార్జిషీటులో చేర్చింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి 'అల్లు'

పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. జగన్ ఈ సందర్భంగా అల్లు వెంకట సత్యనారాయణకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

YSR CP Leader Somayajulu talks on CBI Chargesheet

చంద్రబాబుపై మండిపడ్డ జూపూడి

సీబీఐ సమర్థవంతంగా పనిచేస్తుందన్న చంద్రబాబు ఇప్పుడు మాటెందుకు మార్చారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌ మండిపడ్డారు. చంద్రబాబును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నారు. 

1994 నుంచి 2012 వరకు జరిగిన భూ కేటాయింపులపై సభాసంఘం కోరే దమ్ము చంద్రబాబు కుందా అని జూపూడి సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో భూకేటాయింపులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరే సత్తా బాబుకుందా అన్న ఆయన..జగన్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో విప్లవాలు పుడతాయని ఘాటుగా హెచ్చరించారు.

మహానేత వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం నీరుగారుస్తోందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఒంగోలు కొత్తపట్నంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెడ్డిపాలెం, మడనూరు గ్రామాలకు చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 

వైఎస్‌ఆర్‌ హయాంలో కరెంట్‌ ఛార్జీలు పెంచకపోగా రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చారని బాలినేని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆయన విమర్శించారు.

సరస్వతి కుటుంబానికి జగన్ పరామర్శ

ఓదార్పుయాత్ర భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ శనివారం సాయంత్రం సాకేత్‌పురంలో మిరియాల సరస్వతి కుటుంబాన్ని పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. ఏ సహాయం కావాలన్నా అందిస్తానని ధైర్యనిచ్చారు. రాజన్న తనయుడి రాకతో సరస్వతి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు జగన్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆయన ఆటోగ్రాఫ్ కోసం అభిమానులు పోటీపడ్డారు.

Vangaveeti Radha to join YSR CONGRESS


30-3-2012 ఓదార్పుయాత్ర

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిర్వాకం

మినహాయింపుల ముసుగులో వేల కోట్ల అక్రమాలు
మొత్తం రూ.3,719 కోట్ల అక్రమ మినహాయింపులు
రూ.1,113 కోట్ల మేర తక్కువగా పన్ను మదింపు
2002-03 నివేదికలో ఎండగట్టిన కాగ్


కాకులను కొట్టడం.. గద్దలకు వేయడం. సీఎంగా ఉన్నంత కాలమూ ఇదే బాబు సింగిల్ పాయింట్ ఎజెండా! ప్రతి చిన్న వస్తువుపైనా పేదోడి గోళ్లూడగొట్టి మరీ పన్నులు గుంజిన బాబు, పరిశ్రమలకు మాత్రం ‘ప్రోత్సాహం’ ముసుగులో అస్మదీయ బడా బాబులకు వేలాది కోట్ల రూపాయల పన్ను మినహాయింపులిచ్చారు. 1997-98 నుంచి 2002-03 మధ్యకాలంలో పలు సంస్థలకు ప్రోత్సాహకాల మంజూరులో భాగంగా రూ.6,026 కోట్ల మేరకు అమ్మకం పన్ను వాయిదాలను అనుమతించారు.

మరో రూ.3,954 కోట్ల దాకా అమ్మకపు పన్ను మినహాయింపులిచ్చారు. ఈ వ్యవహారాల్లో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ కాగ్ ఎండగట్టింది. ‘టార్గెట్-2000’ పథకం కింద రూ.100 కోట్లకు మించి పెట్టుబడి ఉన్న అతి పెద్ద ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలిచ్చే విచక్షణాధికారాన్ని బాబు సర్కారు పూర్తిగా దుర్వినియోగం చేసింది. మచ్చుకు ఏడు సర్కిల్ ఆఫీసుల్లో కాగ్ చేసిన తనిఖీల్లోనే.. 8 అతిపెద్ద ప్రాజెక్టులకు అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా రూ.3,719 కోట్ల దాకా అమ్మకపు పన్ను ప్రోత్సాహకాలు మంజూరు చేసినట్టు తేలింది. కేవలం తాము తనిఖీలు చేసిన 8 కంపెనీల్లోనే ఇవన్నీ బట్టబయలైనట్టు కాగ్ పేర్కొంది.

2002-03లో భారీ అవకతవకలు: 2002-03లో తాము తనిఖీ చేసిన నమూనాల్లో, దాదాపు 1,671 కేసుల్లో ఏకంగా రూ.1,113.88 కోట్ల మేర అమ్మకపు పన్ను తక్కువ నిర్ధారణ జరిగినట్టు వెల్లడైందని కాగ్ ఎండగట్టింది. ఆ మేరకు ఆదాయాన్ని రాష్ట్రం కోల్పోయిందంటూ తప్పుబట్టింది. 2000-01లో రూ.68.06 కోట్ల మేర అమ్మకపు పన్నును తక్కువగా నిర్ధారించినట్టు కూడా తేల్చింది.

31-3-2012 శనివారం ఓదార్పుయాత్ర షెడ్యూల్

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర శనివారం గుంటూరు నవభారత్‌నగర్ నుంచి ప్రారంభ మవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు తెలిపారు. 

వివరాలు..

31-3-2012 శనివారం

గుంటూరు నగరం
* నవభారత్‌నగర్‌లోని తాజా మాజీ ఎమ్మెల్యే సుచరిత ఇంటి నుంచి యాత్ర ప్రారంభం
* గుజ్జనగుండ్ల సెంటర్‌లో పర్యటన
* కోబాల్ట్‌పేటలో పర్యటన
* బేకర్‌‌సఫన్ సెంటర్‌లో పర్యటన
* టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ సెంటర్‌లో పర్యటన
* కొరిటెపాడులో మూడు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
* రాములవారిగుడి సెంటర్‌లో పర్యటన
* అమరావతి రోడ్డులో పర్యటన
* గోరంట్లలో నల్లగొర్ల పాములు కుటుంబానికి ఓదార్పు, రెండు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
* సాకేత్‌పురంలో మిరియాల సరస్వతి కుటుంబానికి ఓదార్పు
* శ్రీనగర్ 7వ లైన్‌లో ఘోరకవి గోవిందరావు కుటుంబానికి ఓదార్పు

శ్రీ రామనవమి కానుకగా రాష్ట్ర ప్రజలకు కిరణ్ సర్కారు

కుటీర, చేతి వృత్తుల వారిపైనా దయలేదు.. 
పంచాయతీలు, మునిసిపాలిటీల్లో చీకట్లే 
చిన్న, భారీ పరిశ్రమలకూ బాదుడే...
ప్రార్థనా మందిరాలనూ వదల్లేదు..
ఉచిత కరెంటుకు కూడా చార్జీలు
నర్సరీలు, ఉప్పు కయ్యలకూ షాక్..
బిల్లు లేటుగా కడితే డబుల్ షాక్
ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమలు
ఎవర్నీ వదల్లేదు.. అందరికీ షాకులే
రూ. 4,442 కోట్ల బాదుడు.. సర్కారు శ్రీరామనవమి స్పెషల్

శ్రీ రామనవమి కానుకగా రాష్ట్ర ప్రజలకు కిరణ్ సర్కారు మర్చిపోలేని షాకిచ్చింది. కనీవినీ ఎరగని రీతిలో కరెంటు చార్జీలను వడ్డించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఏకంగా ప్రజలపై రూ.4,442 కోట్ల భారం మోపింది. చివరికి ఉచిత కరెంటును కూడా వదల్లేదు. వారూ వీరని తేడా లేకుండా అన్ని వర్గాలకూ భారీగా వడ్డించింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసీ ముగియగానే జనాల వీపును విమానం మోత మోగించింది! ఈఆర్‌సీ నుంచి ప్రతిపాదనలు వచ్చాక సబ్సిడీ భారాన్ని భరించడాన్ని పరిశీలిస్తామంటూ ఇంతకాలంగా మభ్యపెడుతూ వచ్చి, చివరికి శుక్రవారం ఒక్కసారిగా బాంబు పేల్చింది. ఆదివారం నుంచి కొత్త చార్జీలను అమలు చేస్తామని ప్రకటించి జనాన్ని ఏప్రిల్ ఫూల్స్ చేసింది.

2012-13కు నూతన కరెంటు టారిఫ్‌ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) శుక్రవారం విడుదల చేసింది. ఈఆర్‌సీ నుంచి నాలుగు రోజుల క్రితమే వచ్చిన ఈ ప్రతిపాదనలకు ఎలాంటి మార్పులూ చేయకుండానే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పచ్చజెండా ఊపారు. పైగా పంచాయతీలకు, కుటీర పరిశ్రమలకు, వ్యవసాయానికి లేని కరెంటు చార్జీల పెంపు ప్రతిపాదనలు కూడా చివరి ఆదేశాల్లో వచ్చి చేరాయి. కరెంటు చార్జీలను మరో ఐదేళ్లు పెంచేది లేదన్న దివంగత సీఎం వైఎస్ హామీని కిరణ్ సర్కారు నిలువునా తుంగలో తొక్కింది. అన్ని వర్గాల ప్రజలకూ చార్జీలను పెంచింది. టెలిస్కోపిక్ విధానాన్ని ఎత్తేసి గృహ వినియోగదారులకు భారీ షాకిచ్చింది. సాగుకు ఏడు గంటలకు మించి కరెంటు వాడితే యూనిట్‌కు ఏకంగా రూ.3.25 వసూలు చేసే ఉచిత విద్యుత్‌కూ క్రమంగా మంగళం పాడేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తద్వారా వైఎస్ ఇచ్చిన 9 గంటల ఉచిత విద్యుత్ హామీని తుంగలో తొక్కింది. 2012-13కు రూ.36,090 కోట్ల స్థూల వార్షికాదాయ వ్యయాన్ని డిస్కంలు ప్రతిపాదించగా, రూ.34,343.89 కోట్లకు ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. వ్యవసాయం, గృహ, ఎత్తిపోతల పథకాలకు రూ.5,358.67 కోట్ల సబ్సిడీని భరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మొత్తానికి మే నెలలో ఎండలతో పాటు కరెంటు బిల్లులు కూడా జనాలకు ముచ్చెమటలు పట్టించనున్నాయి. - న్యూస్‌లైన్, హైదరాబాద్

ఇంటికి షాక్....

మీ ఇంట్లో రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌లైట్లు, ఫ్రిజ్, టీవీ ఉన్నాయా? ఉంటే ఇక మీ ఇల్లు గుల్లే! కరెంటు బిల్లుతో మీ గుండె గు‘బిల్లు’మనడం ఖాయం. 0-50 యూనిట్ల లోపు వినియోగించే వారికి తప్ప మిగతా వారందరికీ, అంటే కోటికి పైగా వినియోగదారులకు షాక్ కొట్టనుంది. యూనిట్ విద్యుత్ చార్జీలు ఏకంగా 55 పైసల నుంచి రూపాయి దాకా పెరిగాయి! కనెక్టెడ్ లోడ్ (ఇంట్లోని కరెంటు ఉపకరణాల సామర్థ్యం) 500 వాట్స్‌లోపు ఉన్న వారిని ఒక కేటగిరీగా పేర్కొనగా, దాటిన వారిని ప్రత్యేక కేటగిరీగా పేర్కొన్నారు. వినియోగదారుల్లో మెజారిటీ ఇలా 500 వాట్లు దాటినవారే. వారికి 100 యూనిట్ల దాకా అమలవుతున్న టెలిస్కోపిక్ విధానాన్ని ఎత్తేశారు. ఫలితంగా 100 యూనిట్ల వరకు యూనిట్‌కు ఏకంగా రూ.2.6 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా వారిపై ఏకంగా 60 శాతం దాకా భారం పడనుంది.

చేతి వృత్తులు ఖలాస్...

గ్రామాల్లో కరెంటు కోతలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే చిన్నాభిన్నమవుతుంటే.. గోరుచుట్టుపై రోకటిపోటులా చేతి, కుల వృత్తులకూ సర్కారు షాకిచ్చింది. మరమగ్గాలు, దోబీ ఘాట్లతో పాటు పౌల్ట్రీ ఫారాలు, విస్తర్ల తయారీ వంటి చేతి, కుల వృత్తులవారు వాడే కరెంటుకు చార్జీలను యూనిట్‌కు ప్రస్తుతమున్న రూ.1.80 నుంచి ఏకంగా రూ.2.67కు పెంచింది. విద్యుత్ సంస్థలు ఈ ప్రతిపాదనే చేయకపోవడం గమనార్హం. వ్యవసాయాధారిత చిన్న పరిశ్రమలకు కూడా చార్జీలను రూ.1.80 నుంచి రూ. 2.67కు పెంచారు. ఆత్మహత్యలతో కుదేలవుతున్న మరమగ్గ కార్మికులను పట్టించుకోకపోగా, వారిపైనా మరింతగా చార్జీల భారం మోపారు! 

ఉచిత కరెంటుకు మంగళం....

వైఎస్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకానికి క్రమంగా మంగళం పాడాలని ప్రభుత్వం భావిస్తోంది. 2009 ఎన్నికల హామీ అయిన 9 గంటల ఉచిత విద్యుత్‌ను కూడా అమలు చేయబోమని తాజా టారిఫ్ ద్వారా చెప్పకనే చెప్పింది. ఉచిత విద్యుత్ పరిమితి 7 గంటలు దాటితే ప్రతి అదనపు యూనిట్‌కూ రూ.3.25 వసూలు చేయాలని ఈఆర్‌సీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ చార్జీలను మున్ముందు క్రమంగా 7 గంటల కరెంటుకు కూడా వర్తింపజేస్తారని భావిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించే ఎత్తిపోతల పథకాల కరెంటు భారాన్నీ జనం నెత్తినే రుద్దేందుకు రంగం సిద్ధమైంది. ఎత్తిపోతల కింది రైతులు 7 గంటలకు మించి వాడే ప్రతి యూనిట్‌కూ రూ.3.50 వసూలు చేయాలని నిర్ణయించారు. కార్పొరేట్, ఐటీ రైతులకు చార్జీలను రూ.1.50 నుంచి రూ.2.50కు పెంచారు. 2.5 ఎకరాలకు మించిన మాగాణి ఉన్న రైతులతో పాటు మూడుకు మించి కరెంటు కనెక్షన్లున్న మెట్ట రైతుల కరెంటు చార్జీలనూ పెంచేశారు.

చిన్న పరిశ్రమలకు చేదే..

ఇప్పటికే విద్యుత్ కోతలతో లక్షలాది చిన్నపరిశ్రమలు మూసివేతకు గురి అవుతున్నాయి. వీటిపై ఆధారపడిన 20 లక్షల మంది కార్మికుల జీవితాలు గాలిలో దీపాల మాదిరిగా వేలాడుతున్నాయి. వాటిపై కనికరం చూపాల్సింది పోయి, చార్జీలను యూనిట్‌కు రూ.4.13 నుంచి రూ.5కు పెంచారు. పుట్టగొడుగులు, కుందేళ్ల పెంపకంతో పాటు పౌల్ట్రీ ఫారాల చార్జీలను రూ.4.13 నుంచి 5కు పెంచారు. చెరకు క్రషింగ్ చార్జీలను 75 పైసల నుంచి ఏకంగా రూ.1.62కు పెంచారు. చేపల, రొయ్యల పెంపకానికి కరెంటు చార్జీలను రూ.1.25 నుంచి 2.12కు పెంచారు. చిన్నతరహా పరిశ్రమలతో పాటు చిన్నతరహా వాణిజ్య సంస్థలకు రూ.50 పైసల దాకా పెంచారు. కనెక్టెడ్ లోడు 500 వాట్లు దాటిన చిన్నతరహా వాణిజ్య సంస్థలకు కూడా టెలిస్కోపిక్ విధానాన్ని ఎత్తేయడంతో వాటిపైనా భారం మరింతగా పడనుంది.

పంచాయతీల్లో ఇక చీకట్లే..

పంచాయతీలకు వచ్చే కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని వైఎస్ హామీనిచ్చారు. కానీ ఆయన మరణానంతరం ఈ ప్రభుత్వం ఆ భారాన్ని పంచాయతీలపైనే మోపింది. పంచాయతీలు ఇప్పటికే సుమారు రూ.600 కోట్ల దాకా బిల్లులు బకాయి పడ్డాయి. వాటిని తీర్చకపోవడంతో అనేక పంచాయతీల్లో చీకట్లు అలుముకున్నాయి. తాజాగా వాటికీ చార్జీలు పెంచారు. వీధి దీపాలు, మంచినీటి సరఫరా కరెంటు చార్జీలను 100 శాతానికిపైగా పెంచారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మంచినీటి, వీధి దీపాల చార్జీలను 50 పైసల నుంచి 82 పైసల దాకా పెంచారు.

భారీ పరిశ్రమలకు బాదుడు..

భారీ పరిశ్రమలనూ ప్రభుత్వం భారీగా బాదేసింది. హెచ్‌టీ కేటగిరీ పరిశ్రమలకు యూనిట్‌కు రూపాయి నుంచి రూ.1.28 దాకా పెంచింది. వాటి ఫ్యాన్లు, లైట్ల వాడకం చార్జీలనూ భారీగా పెంచింది. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు యూనిట్‌కు రూ.2.65 ఉన్న చార్జీలను కేవీని బట్టి 3.65 నుంచి 4.48 దాకా పెంచింది.

ఇతర అంశాలు....
వైమానిక రంగానికి ప్రస్తుతం వాణిజ్య కేటగిరీ కింద విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్నారు. తాజాగా దాన్ని ప్రత్యేక కేటగిరీగా గుర్తించి, కేవీని బట్టి యూనిట్‌కు రూ.4.54 నుంచి రూ.5.39 దాకా బాదాలని నిర్ణయించారు.
ప్రార్థనా మందిరాలకు 200 యూనిట్ల వరకు ప్రస్తుతమున్న రూ.2 చార్జీని 2.60కి, ఆపైన రూ.4 నుంచి 4.60కి పెంచారు.
తాత్కాలిక విద్యుత్ సరఫరా చార్జీలను కూడా యూనిట్‌కు 68 పైసల నుంచి 70 పైసల వరకూ పెంచారు.
రైల్వే ట్రాక్షన్ విద్యుత్ చార్జీలు 4.45 నుంచి 5.43కు పెరిగాయి.
గ్రామీణ విద్యుత్ సహకార సంస్థల్లో అనకాపల్లి రెస్కోకు 0.83 నుంచి 1.20కు, చీపురుపల్లి రెస్కోకు 0.62 నుంచి 0.67కు, సిరిసిల్ల రెస్కోకు 0.47 నుంచి 0.66, కుప్పం రెస్కోకు 0.28 నుంచి 0.32కు చార్జీలను పెంచారు.
అడ్వర్‌టైజింగ్ హోర్డింగ్స్‌కు రూ.8.50 నుంచి రూ.9కు పెరిగాయి.
ఉప్పు కయ్యలు, గ్రామీణ నర్సరీలకు రూపాయి నుంచి రూ. 2.12కు పెరిగాయి.

మీరు వేసే ఓటుతో కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పండి ఆ ఓటుతో ఢిల్లీ పెద్దల దిమ్మ తిరగాలి


గుంటూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘‘త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.. రాష్ట్రాన్ని రిమోట్ కంట్రోల్‌తో ఆడిస్తున్న ఢిల్లీ పెద్దల కళ్లు ఈ ఎన్నికల ఫలితాలతో తెరుచుకోవాలి.. ప్రతి ఒక్కరూ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయం డి’’ అని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్నవి కావని, ఈ ఎన్నికల్లో రైతన్న, పేదవాడు వీళ్ళిద్దరూ ఒకవైపు ఉంటే కుళ్ళు, కుతంత్రాలతో కూడిన రాజకీయ వ్యవస్థ మరోవైపు ఉండి పోటీ చేస్తున్నాయని జగన్ అభివర్ణించారు. గుం టూరు జిల్లా ఓదార్పు యాత్ర 81వ రోజు శుక్రవారం ఆయన ప్రత్తిపాడు నియోజకవర్గంలోని గుంటూరు రూర ల్, వట్టిచెరుకూరు మండలాల్లో, గుంటూరు నగరంలో పర్యటించారు. మొత్తం ఐదు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించి, గుంటూరు రూరల్ మండలంలోని అంకిరెడ్డిపాలెంలో పోలూరి సుబ్బారెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు. అంకిరెడ్డిపాలెం, అనంతవరప్పాడులలోని విగ్రహావిష్కర ణ సభలకు భారీ ఎత్తున తరలివచ్చిన జనవాహినిని ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ప్రసంగాల సారాంశం జగన్ మాటల్లోనే..

విలువలను గెలిపించుకుందాం..

త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోటీల్లో విలువలు, విశ్వసనీయత ఓ వైపు ఉంటే, వంచనతో కూడిన రాజకీయాలు మరోవైపు ఉన్నాయి. ఈ పోరులో మనం విలువలను గెలిపించుకుందాం. విశ్వసనీయతకు తోడుగా, రైతన్నకు అండగా నిలుద్దాం. మీరు వేసే ప్రతి ఓటుతో రాష్ట్ర సర్కారు కళ్ళు తెరవాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్‌తో నడిపిస్తున్న ఢిల్లీ పెద్దల దిమ్మతిరగాలి. పల్లెల్లో రైతన్న పడుతున్న బాధ పాలకులకు అర్థం కావాలి. ఈ వ్యవస్థలో మార్పు రావాలి. డబ్బు, మద్యంతో వీళ్ళు రాజకీయాలు చేయలేరు.... ప్రజలకు మనోభావాలు ఉన్నాయి, వారికి ఆత్మగౌరవం ఉందన్న సంకేతాలు వీరిద్దరికీ తెలియాలి. సుచరితమ్మ(ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత) విశ్వసనీయత, విలువల పక్షాన నిలబడింది. రైతన్నకు, పేదవాడికి అండగా నిలిచింది. నా చెల్లి సుచరితమ్మను చూసి నేను గర్వపడుతున్నా. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు సుచరితమ్మకు ఉండాలి. ఉప ఎన్నికల్లో గెలుపు రైతులది, పేదవాడిదే కావాలి. దివంగత వైఎస్‌ఆర్ మరణం తర్వాత రాష్ట్రంలో పేదవాడికి ఒక్క ఇల్లు కూడా కట్టివ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. పేదవాడు గ్రామాల్లో ఎలా బతుకుతున్నాడా అనేది ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. పదవులపైనే ఈ అధికార పార్టీ ఆసక్తి చూపుతోంది. ఢిల్లీ రిమోట్‌తో రాష్ట్రం పని చేస్తోంది.

విలువలకు కట్టుబడి..

అవిశ్వాస సమయంలో ఎమ్మెల్యేలకు నేను ఒకటే చెప్పా.. పదవీ త్యాగం చేసిన సుచరితమ్మతోపాటు 16 మందికి కూడా ముందుగానే జరగబోయే పరిణామాలను చెప్పా. అధికార, ప్రతిపక్షాలు కలిసికట్టుగా కుమ్మక్కై కుట్రలు చేస్తా యి.. వాళ్ళు ఏ ఉద్దేశంతో కుట్రలు చేసినా నాయకుడనే వాడికి విలువలు, విశ్వసనీయత ఉండాలని చెప్పా. అనర్హత వేటు పడినా, ఎమ్మెల్యే పదవి పోయినా, ఉప ఎన్నికలు వస్తాయని తెలిసినా రైతులు, పేదవాడికి అండగా నిలిచి 17 మంది ఎమ్మెల్యేలు తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు.

సవరణ: ‘రిలయన్స్‌కు గ్యాసే అతిపెద్ద అవినీతి’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’ ప్రధాన పత్రిక రెండో పేజీలో ప్రచురితమైన వార్తలో ‘‘ఎమ్మార్‌కు ఎకరా భూమిని రూ.29 లక్షల చొప్పున కేటాయించింది నువ్వే కదయ్యా చంద్రబాబూ! అదే భూమి పక్కన నీ భార్య మూడేళ్ల కిందట ఎకరా కోటి రూపాయలకు కొనుగోలు చేసింది నిజం కాదా?’’ అని వచ్చింది. ‘‘ఎకరా కోటి రూపాయలకు అమ్మింది నిజం కాదా?’’ అని జగన్‌మోహన్‌రెడ్డి అనగా అది పొరపాటున ‘‘కొనుగోలు చేసింది నిజం కాదా?’’ అని ప్రచురితమైంది.

హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా నాగేశ్వరరావు

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కోఆర్డినేటర్ చిత్తరవు నాగేశ్వరరావు ఆల్‌టైం రికార్డు మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటి వరకు ఎవరూ సాధించని విధంగా 962 ఓట్ల మెజార్టీ సాధించారు. సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శులు తదితర పోస్టులకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 3,562 ఓట్లు పోలయ్యాయి. మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు నాగేశ్వరరావు తన ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యత కనబరిచారు. ఉపాధ్యక్షునిగా పోలిశెట్టి రాధాకృష్ణ, కార్యదర్శులుగా ఎస్. చలపతి, డీఎల్ నాగేశ్వరరావు, సంయుక్త కార్యదర్శిగా శిరికొండ ప్రసాద్‌బాబు, కోశాధికారిగా కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి గెలుపొందారు.

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో ఎంతైనా నారా బాబు తర్వాతే ఎవరైనా...!! ఆ కళపై సర్వం సహా పేటెంటు హక్కులన్నీ ఆయనవే.

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో ఎంతైనా నారా బాబు తర్వాతే ఎవరైనా...!! ఆ కళపై సర్వం సహా పేటెంటు హక్కులన్నీ ఆయనవే. బాబు వేసే ప్రతి అడుగులోనూ అది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూనే ఉంటుంది. గురువారం నాటి కాగ్ నివేదికను పట్టుకుని, వైఎస్ హయాంపై ఒంటికాలిపై లేచి ఆయన వేస్తున్న అంకమ్మ శివాలు అందుకు మరో తాజా ఉదాహరణ మాత్రమే. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో బాబు ప్రదర్శించిన అంతులేని ఆశ్రీత పక్షపాతం, అస్మదీయులకు ఆయన చేసిన పందేరాలను ఏ ఏటికాయేడు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఉతికి ఆరేసినా.. అడ్డంగా తడుచుకుని పోయారాయన. పైగా అసలు కాగ్‌ను పట్టించుకోనవసరమే లేదని కూడా తీర్మానించేశారు. ఇప్పుడేమో అదే కాగ్ నివేదికను పట్టుకుని వైఎస్ హయాంపై ఒంటికాలిపై చెలరేగిపోతున్నారు! తనను తిట్టినప్పుడు చేదైన కాగే ఇప్పుడు బహు తీపిగా మారిందాయనకు. నిజానికి ఏ ప్రభుత్వమైనా భూ కేటాయింపుల్లో నిర్దిష్ట విధానాన్ని అనుసరిస్తుంది. ఓ కాలపరిమితి విధించి, ఆలోగా పరిశ్రమలను స్థాపించాల్సిందిగా కోరుతుంది. లేదంటే కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది. భూమి పొందాక గడువులోగా పరిశ్రమల స్థాపన జరిగిందా లేదా వంటి వాస్తవాలను తరచి చూడాల్సింది పోయి.. అసలు భూ కేటాయింపులే క్షమించరాని మహాపరాధమన్నట్టుగా బాబు, ఆయన్ను నిత్యం ఆడించే ఎల్లో మీడియా నెత్తీనోరూ బాదుకుంటున్న వైనం రోత పుట్టించక మానదు. గురివింద బాబు హయాంలో అడ్డూ అదుపూ లేకుండా జరిగిన భూ కేటాయింపులు తదితర అవకతవకలను ఎప్పటికప్పుడు కాగ్ కడిగి పారేసిన వైనానికి రుజువులివిగో...

పచ్చచొక్కాలకే పందేరం 
‘నీరు- మీరు’ ముసుగులో బాబు నిర్వాకం
రూ. 2,533 కోట్లను పూర్తిగా తగలేశారు
చంద్రబాబు నిర్వాకంపై దుమ్మెత్తిపోసిన కాగ్


బాబు సీఎం గిరీ వెలగబెట్టిన కాలంలో వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని టీడీపీ కార్యకర్తలకు అక్షరాలా పంచిపెట్టారు. ఏమాత్రం ఫలితమివ్వని ‘నీరు-మీరు’ పథకానికి 2000-04 మధ్య ఏకంగా రూ.2,533 కోట్లు తగలేశారు! భూగర్భ జలాలను పెంచుతామంటూ పైపై హడావుడి చేసి, లోలోపల ఆ ముసుగులో ఖజానాను కార్యకర్తలకు దోచిపెట్టారు. ఇంత భారీగా నిధులు ఖర్చుచేసినా ఈ పథకం పేరిట మచ్చుకు ఒక్కటంటే ఒక్క కట్టడం కూడా కన్పించకపోవడం దారుణమంటూ 2005 నివేదికలో కాగ్ నలుగుపెట్టింది! ‘నీరు-మీరు’ ఉద్దేశం ఏమాత్రమూ నెరవేరకపోగా పూర్తిగా దుర్వినియోగం అయ్యాయనడానికి రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 19 జిల్లాల్లో భూగర్భ జలాలు మరింత లోతుకు క్షీణించడమే తిరుగులేని తార్కాణం.

‘నీరు-మీరు’పై ఇంటాబయటా భారీ ప్రచారంతో ఊదరగొట్టిన బాబు, ఆ పథకంలో నిధులు పూర్తిగా పక్కదారి పట్టాయంటూ ‘కాగ్’ తలంటడాన్ని మాత్రం ‘విస్మరించారు’. ఈ కార్యక్రమానికి నిధులను ఖజానా నుంచి కేటాయించ కుండా నాబార్దు, ఎంపీ లాడ్స్, ఉపాధి హామీ (ఎంప్లాయ్‌మెంట్ అష్యూరెన్స్) పథకం, వ్యవసాయ మార్కెట్ నిధులను మళ్లించారాయన. ఇలా ఏకంగా రూ.2,533 కోట్ల నిధులను బూడిదలో పోసిన పన్నీరు చందం చేశారు. పైగా దీనివల్ల ఆయా శాఖల్లో పనులన్నీ ఆగిపోయి రెండిందాలా నష్టం జరిగింది.

కాంట్రాక్టర్లకు ఇవ్వకూడని ఈ పనులను లక్షలాది సంఖ్యలో వారితోనే చేయించడం కూడా అడ్డగోలు దోపిడీ కోసమేనన్నది సుస్పష్టం. 2000-04 మధ్య మచ్చుకు ఏడు జిల్లాల్లో తనిఖీ చేసిన కాగ్, ఖర్చయిన నిధులతో ఎలాంటి ప్రయోజనమూ చేకూరలేదని తేల్చి చెప్పింది. ఆదిలాబాద్, కడప, మహబూబ్‌నగర్, మెదక్, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో రూ.759 కోట్లు ఖర్చు పెట్టారు. వీటితో 1,32,549 పనులు చేపట్టడం లక్ష్యం కాగా, 57,933 పనులే పూర్తి చేశారు. ‘నీరు-మీరు’తో సంబంధమే లేని పనులను కూడా దాని ఖాతాలో లాగించేశారంటూ కాగ్ దుయ్యబట్టింది. చివరికి ట్యాంకర్లతో మంచినీటి సరఫరా, నర్సరీల్లో మొక్కల పెంపకాలను కూడా ‘నీరు-మీరు’గానే చూపడం బాబు సర్కారు బరితెగింపునకు పరాకాష్ట. చెరువుల పూడికతీత పనుల్లోనూ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం మేటవేశాయని కాగ్ విమర్శించింది.

పూడికతీతతో భూగర్భ జల మట్టం పెరగదని నిపుణులు చెప్పినా దానికి రూ.157 కోట్లు తగలేశారంటూ తప్పుబట్టింది. పైగా నాణ్యత నియంత్రణకు పూర్తిగా తిలోదకాలిచ్చారని దుయ్యబట్టింది. నీరు అసలు భూమిలోకే ఇంకని ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టారు. పైగా అవన్నీ చిన్నపాటి వర్షాలకే కనుమరుగయ్యాయి. ఇలాగే నీరింకని నల్లరేగడి నేలల్లో ఊట చెరువుల నిర్మాణంతో నిధులన్నీ వృథా చేశారు. ఇంతా చేసి, చివర్లో ‘నీరు-మీరు’ అమలైన జిల్లాల్లో నీటి మట్టాలు చిత్రంగా 0.13-3.04 మీటర్ల లోతుకు పడిపోయాయని కాగ్ విస్మయం వ్యక్తం చేసింది. ఈ నిధులన్నీ నేతలు, కార్యకర్తల జేబులు నింపాయని అభిప్రాయపడింది. 

ఆనంద్ సినీ ‘సర్వీసెస్’
గజం ధర విలువకే ఎకరం భూమిని రాసిచ్చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. నేరుగా మంతనాలు జరిపి మరీ ఐదెకరాలను ఇలా కారుచౌకకు ధారాదత్తం చేశారంటూ 2004 కాగ్ నివేదిక బాబుపై దుమ్మెత్తిపోసింది. చిత్ర పరిశ్రమకు సంబంధించి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఆసక్తి ఉన్నవారి నుంచి స్థల కేటాయింపుల కోసం దరఖాస్తులను రాష్ట్ర చలన చిత్ర, టెలివిజన్, థియేటర్ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (కంపెనీ) 1991లో దరఖాస్తులను ఆహ్వానించింది. 

అలా దరఖాస్తు చేసుకున్న 139 సంస్థల్లో ఆనంద్ సినీ సర్వీసెస్ ఒకటి. దానికి కేవలం చదరపు గజం రూ.700-800 లెక్కన స్థలం కట్టబెట్టేందుకు 1997 నవంబర్‌లో అభివృద్ధి సంస్థ ప్రతిపాదించింది. కానీ మౌలిక సదుపాయాల యూనిట్ల ఏర్పాటుకు గతంలో అంగీకరించిన ధరకే స్థలమివ్వాలని ఆనంద్ సినీ సర్వీసెస్ కోరింది. ఆనంద్ సినీ సర్వీసెస్ ఔట్‌డోర్ విభాగాన్ని నెలకొల్పేందుకు ఒక ఎకరం మించకుండా, అంటే 4,840 చదరపు గజాల కేటాయింపును 1999 జూన్‌లో కంపెనీ బోర్డు డెరైక్టర్లు ఆమోదించారు.

రెండేళ్ల తరువాత.. అంటే 2001 జూన్‌లో కంపెనీ ఎండీ నేరుగా నాటి సీఎం బాబుతో ఈ విషయమై చర్చించారు. ఫలితంగా చదరపు గజానికి రూ.700-800 వసూలు చేయాలన్న నిర్ణయం బుట్టదాఖలైంది. 1983లో పద్మాలయా, 1984లో రామానాయుడు స్టూడియోలకు కేటాయించిన నిబంధనల ప్రకారం ఎకరానికి కేవలం రూ.8,500 చొప్పున ఆనంద్ సినీ సర్వీసెస్‌కు ఐదెకరాలివ్వాలని నిర్ణయించారు. 2001 ఆగస్టులో ప్రభుత్వామోదం తర్వాత 2001 అక్టోబరు 18న కేవలం రూ.42,500కు ఐదెకరాలను కట్టబెట్టారు. కానీ ఇది సబబేనని పేర్కొనే ప్రతిపాదనలేవీ రికార్డుల్లో లభ్యం కాలేదంటూ కాగ్ ఎండగట్టింది. పైగా దీనికి బోర్డు డెరైక్టర్ల ఆమోదం కూడా లేదని పేర్కొంది.

చిల్డ్రన్ ఫిల్మ్‌సొసైటీకి మాత్రం గజానికి రూ.3 వేలు..
ఆనంద్‌కు భూ పందేరం చేయకముందే, అదే ఏడాది, అదే ప్రదేశంలో.. చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీకి ఐదెకరాలిచ్చేందుకు మాత్రం గజానికి ఏకంగా రూ.3,000 చొప్పున ధర నిర్ణయించింది బాబు సర్కారు! ఆ సమయంలో అక్కడ చదరపు గజానికి మార్కెట్ ధర రూ.3,500 అని కాగ్ తనిఖీలో తేలింది. కానీ ఆనంద్ సినీ సర్వీసెస్‌కు మాత్రం ఇటు మార్కెట్ ధరనూ, అటు చిల్డ్రన్ సొసైటీకి ఆఫర్ చేసిన ధరనూ పరిగణనలోకి తీసుకోకుండా అడ్డంగా ఐదెకరాలు కేటాయించినందుకు ఖజానాకు రూ.7.25 కోట్ల నష్టం వాటిల్లిందంటూ కాగ్ తూర్పారబట్టింది. 

రహేజాకు అప్పనంగా 110 ఎకరాలు
రాష్ట్ర రాజధానిలో ఐటీ పార్కు పేరిట ముంబైకి చెందిన రహేజా కార్పొరేషన్‌ను తెరపైకి తెచ్చి అక్రమాలకు రాచబాట వేసింది చంద్రబాబే. ఆయన ఆదేశానుసారమే రహేజాతో ఐటీ పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీ లోపభూయిష్టమైన ఒప్పందం కుదుర్చుకుందంటూ 2005 కాగ్ నివేదిక ఎండగట్టింది. 

మాదాపూర్‌లో ఏపీఐఐసీకి చెందిన అత్యంత విలువైన 110 ఎకరాల భూమిని జాయింట్ వెంచర్ పేరిట రహేజాకు అప్పట్లో బాబు సర్కారు అప్పనంగా అప్పగించింది. పైగా అప్పగించిన భూమికి ఆ సంస్థ నుంచి ఒక్క పైసా కూడా వసూలు చేయకపోవడాన్ని కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది. జాయింట్ వెంచర్ కంపెనీ భూమి ధర చెల్లించనక్కర్లేదని, ఉద్యోగాల కల్పనకు చెల్లించే రిబేటుతో దాన్ని సర్దుబాటు చేస్తారని ఒప్పందంలో పేర్కొన్నారు. దీనివల్ల ఏపీఐఐసీ రూ.30.98 కోట్ల మేరకు నష్టపోయింది.

రూ.3 కోట్లకే నిజాం సుగర్స్ భూములు!
నిజాం సుగర్స్ లిమిటెడ్ 1998, 31 మార్చి నాటికి రూ.22.75 కోట్ల నష్టాల్లో ఉంది. లక్షలాది రైతుల దృష్ట్యా కంపెనీని పునరుద్ధరించాల్సిన ప్రభుత్వం.. నష్టాల సాకుతో కంపెనీ తాలూకు 1,042.27 ఎకరాలను కేవలం రూ.3.35 కోట్లకు రాసిచ్చేసింది. స్వయానా నాటి సీఎం చంద్రబాబు ఆదేశానుసారం జరిగిన ఈ పందేరాన్ని కాగ్ తన 2004 నివేదికలో ఎండగట్టింది. నిధుల సమీకరణలో భాగంగా కంపెనీ భూములను వదిలించుకోవాలని నిజాం సుగర్స్ ఎండీకి బాబు సూచించారు. ఎలాంటి నివేదికా అందకుండానే 1998 జూలైలో కంపెనీ ఎండీ ఓ కమిటీ వేసి, 535 ఎకరాలను అమ్మకానికి పెట్టారు.

సరైన ధర రాలేదంటూ ఆ భూముల అమ్మకాన్ని ఆ కమిటీ నిరాకరించింది. 1998 సెప్టెంబర్‌లో కమిటీని పునరుద్ధరించి, ప్రభుత్వ అనుమతే లేకుండా 632.12 ఎకరాలను అమ్మేశారు! 1998 అక్టోబర్ 5-డిసెంబర్ 9 మధ్యలో ఈ తతంగం ముగిసింది. ఇంతా చేసి ఈ అమ్మకాలతో వచ్చిన సొమ్ము.. కేవలం రూ.2.04 కోట్లు. కనీసం బోర్డు డెరైక్టర్లకు కూడా తెలియదు. తర్వాత 1999 మే 24-జూన్ 9 మధ్య మరో 410.35 ఎకరాలను రూ.1.31 కోట్లకే వదిలేశారు. ఇలా మొత్తం 1042.27 ఎకరాల వ్యవసాయ భూమిని రూ.3.35 కోట్లకు తెగనమ్మిన ఘనుడు చంద్రబాబు. 

స్పెక్ట్రమ్‌కు తేరగా 22.39 కోట్లు
ప్రైవేట్ విద్యుత్ ప్రాజెక్టులంటే బాబుకు వల్లమాలిన అభిమానం! స్పెక్ట్రమ్ పవర్ జనరేషన్ కంపెనికీ అధిక స్థిర, ఇంధన చార్జీల ముసుగులో ఏకంగా రూ.22.39 కోట్లను ఆయన రాసిచ్చిన వైనం ఇందుకు చిన్న ఉదాహరణ. స్పెక్ట్రమ్ పవర్‌కు వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించే తేదీని ఆలస్యం చేయడం వల్ల అధిక చార్జీలు చెల్లించేలా బాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. కంబైన్డ్ సైకిల్ కమర్షియల్ ఆపరేషన్ తేదీ జాప్యంతో 5.34 కోట్ల స్థిర చార్జీలు, రూ.17.04 కోట్ల అధిక ఇంధన చార్జీల రూపంలో సంస్థకు లబ్ధి చేకూ ర్చింది! ఈ చెల్లింపులను కాగ్ నివేదిక తప్పుపట్టింది. వాణిజ్య ఉత్పత్తికి సకాలంలో అనుమతించి ఉంటే ఈ భారమంతా తప్పేదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

బాబు భూ కేటాయింపులివీ..
రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అవసరమున్నా, లేకున్నా అప్పనంగా భూములు కేటాయించిన ఘనుడు నారా బాబు. 1998 నుంచి మొదలుకుని పదవి నుంచి దిగిపోయేదాకా భూ పందేరాలు చేస్తూనే వచ్చారు. విపక్షాలు నెత్తీ నోరూ బాదుకుంటున్నా వినకుండా మణికొండలో గోల్ఫ్ కోర్సు, రియల్ ఎస్టేట్ కోసం 534 ఎకరాలు కేటాయించిన చరిత్ర బాబుది! ఎమ్మార్ రూపంలో బయట పడ్డ కుంభకోణానికి ఆద్యుడు ఆయనే. ఆయన హయాంలో జరిపిన విచ్చలవిడి భూ పంపిణీ వివరాలివిగో...

Popular Posts

Topics :