15 April 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

YSR Congress Leaders Press Meet 21st April

Written By news on Saturday, April 21, 2012 | 4/21/2012

YS Jagan By-election Campaign in Tellavaram at Polavaram

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన తెల్లవరంలో వైఎస్‌ జగన్‌ పర్యటించారు. ఈ ప్రాంతంలో పర్యటించేందుకు ఏ నాయకుడు ఇంత వరకు సాహసం చేయలేదు. కానీ వైఎస్‌ జగన్‌ మాత్రం తెల్లవరం వెళ్లి పోలవరం నిర్వాసితులను పరామర్శించారు. తర్వలో సువర్ణయుగం వస్తుందని.. ఆ యుగంలో పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రాజెక్టు పూర్తై నిర్వాసితుల ముఖంతో చిరునవ్వు చూసిన తర్వాతే ఆ ప్రాజెక్టును ప్రారంభిస్తానని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

Indrakaran, Vangaveeti to quit Congress

Indrakaran ReddyAdding to the woes of the Congress party in the State, two key leaders, a former MP from Telangana and a former MLA from Andhra, are quitting the party.

While former Adilabad MP A. Indrakaran Reddy is to quit the party on May 2 along with a number of his supporters, former Vijayawada East MLA Vangaveeti Radhakrishna, son of former MLA V. Ratnakumari and assassinated Congress leader V. Mohana Ranga Rao, has declared that he will be joining the YSR Congress Party on April 27.

Indrakaran Reddy resents the growing stature of Nirmal MLA A. Maheshwar Reddy following the merger of Chiranjeevi's Praja Rajyam Party.

He has not announced which party he will join after he, along with former Sirpur MLA Koneru Konappa and 3,000 supporters from Nirmal, quits the Congress.

The former Congress MLA from Vijayawada East announced at a press conference on Thursday that he had already talked to Y.S. Jaganmohan Reddy, and the YSR Congress Party president had offered to visit Vijayawada to participate in a public meeting organised for the purpose.

Mr. Radhakrishna said that the Congress leaders were trying to demean former Chief Minister Y.S. Rajasekhara Reddy exactly like they had demeaned his father Mohana Ranga Rao.

“My father sacrificed his life for the Congress party and his death put a break to the Telugu Desam wave in the State.

Many senior leaders owed their return to power to the sacrifice of my father, but they began denigrating his image,” he lamented.

Mr. Radhakrishna claimed that his father's influence was not limited to just Vijayawada or Krishna district and said that he would be going to Vizianagaram, Srikakulam, East and West Godavari districts to garner support of his father's well-wishers from all communities.

http://www.thehindu.com/news/states/andhra-pradesh/article3335186.ece

Rajanna Rajyam Ravali 20th April 2012

I Will Take A Fisherman To Assembly As An MLA

బాబుకు రివర్స్ స్ట్రోక్!(andhrabhoomi)

కాకినాడ, ఏప్రిల్ 20: ‘కెఎస్‌ఇజడ్ ఏర్పాటుకు ముందుగా ప్రతిపాదనలు తీసుకొచ్చింది మీరే కదా’ అంటూ టిడిపి అధినేత చంద్రబాబును సెజ్ ప్రాంతానికి చెందిన కొందరు నిలదీశారు. కెఎస్‌ఇజడ్ ప్రాంతంలో శుక్రవారం రైతులకు మద్దతుగా పర్యటించిన టిడిపి అధినేత చంద్రబాబు స్థానికుల నుంచి వచ్చిన ఈ ప్రశ్నకు ఆగ్రహం వ్యక్తం చేశారు. యు కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామంలో శుక్రవారం సాయంత్రం సెజ్ బాధిత రైతులు నిర్వహించిన ఏరువాక కార్యక్రమానికి బాబు హాజరయ్యారు. ఈ సమయంలో కొందరు స్థానికులు మాట్లాడుతూ ‘2002లో మీరే కదా ఎస్‌ఇజడ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తీసుకొచ్చారు?’ అంటూ నిలదీశారు. ఈ మాటలు వినగానే చంద్రబాబు వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు తెలుసు. వేళాకోళంగా ఉందా?’ అంటూ గద్దించారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దని వారించారు. అంతకుముందు కాకినాడలో జరిగిన సదస్సులో తనపై ఒక పత్రిక, ఒక ఛానల్ పనిగట్టుకుని తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. సెజ్‌కు తానే నాంది పలికానంటూ అర్ధంపర్ధంలేని అసత్య కథనాలను ఆ మీడియా సంస్థ ప్రచారం చేస్తోందని, దొంగే దొంగ దొంగ అన్న చందాన సదరు
నాయకుడు ప్రవర్తిస్తున్నాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
నావెంట ఉంటే మీ భూములు మీకే సొంతం
‘నావెంట మీరుంటే మీ వెనుక నేనుండి పోరాటం సాగించి మీ భూములు తిరిగి మీకు సొంతమయ్యేలా కృషి చేస్తాను’ అని చంద్రబాబు కాకినాడ ఎస్‌ఇజడ్ బాధిత రైతులకు, నిర్వాసితులకు భరోసా ఇచ్చారు.

Jagan Payakaraopeta tour

ఇదేనా ‘ప్రణాళిక’!మొత్తానికి మన రాష్ట్రం కోరుకున్నట్టే రూ.48,935 కోట్ల రాష్ట్ర వార్షిక ప్రణాళికకు ప్రణాళికా సంఘం ఆమోదముద్ర వేసింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 13.8 శాతం ఎక్కువే కాక, అన్ని రాష్ట్రాలకంటే మనదే అత్యధిక కేటాయింపు అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పరమ సంతోషంతో చెప్పారు. కానీ, తరచి చూస్తే ఇందులో సగటు మనిషికి సంతోషం కలిగించేదైతే ఏమీ లేదు. వాస్తవిక అవసరాలు, వనరుల లభ్యత వగైరా వివరాల్లోకి వెళ్లి.. ఆ తర్వాత మనకు వచ్చిందెంతో, అందులో ఏఏ రంగాలకు ఎంత పెరిగిందో చూస్తే నీరసం కలగక మానదు.

ఉదాహరణకు నీటి పారుదలకు గత వార్షిక ప్రణాళికలో రూ.14,970 కోట్లు కేటాయించగా, ఈసారికి అది మరో నాలుగు కోట్లు మాత్రమే పెరిగింది. వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాదితో పోలిస్తే రూ.700 కోట్లు పెంచారన్న మాటేగానీ రాష్ట్రంలోని పరిస్థితుల్ని చూస్తే ఈ పెంపుదల ఏమాత్రం సరిపోదు. గత మూడేళ్లుగా మన రాష్ట్రంలో వ్యవసాయం తిరోగమనంలో పడింది. కనీస మద్దతు ధర లభించక, యేటా క్రమంతప్పకుండా పలకరిస్తున్న ప్రకృతి వైపరీత్యాలతో కుదేలవుతూ రాష్ట్రంలో రైతన్న అష్టకష్టాలు పడుతున్నాడు. దుర్భర కరువుతోనూ, అకాల వర్షాలతోనూ అల్లాడుతున్నాడు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతు నష్టపోతున్న దానికీ, వాస్తవంగా ప్రకటిస్తున్న పరిహారానికీ పొంతనే ఉండటం లేదు. ఆ పరిహారం కూడా అదునుకు రావడం లేదు.

ఇన్ని సమస్యలతో రైతు సాగు సమ్మెకు దిగితే... దాన్ని సానుభూతితో అర్థం చేసుకోవడం లేదు సరిగదా... అందుకు కూలీలు దొరక్కపోవడమే అసలు కారణమన్నట్టు చిత్రించి చేతులు దులుపుకోవడం మన ముఖ్యమంత్రికే చెల్లింది. సాగు సమ్మెపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అసంతృప్తి వ్యక్తం చేసి, దాన్ని పునరావృతం కానీయొద్దని సూచించారట. దేశ ఆహార భద్రతపైనే అది ప్రభావం చూపుతుందన్నారట! ఇలా పైపైన వ్యాఖ్యానించి ఊరుకోవడం కాక సమస్య మూలాల్లోకి వెళ్లి పరిశీలించి ఉంటే పరిష్కార మార్గాలు లభ్యమయ్యేవి. అప్పుడు వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయించిన రూ.2,803 కోట్లు సరిపోవని అర్థమయ్యేది. అలాగే, నీటిపారుదలకు కూడా మరింతగా కేటాయించే అవసరాన్ని గుర్తెరిగేవారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సాగు రంగానికి అగ్ర ప్రాధాన్యమిచ్చి ప్రారంభించిన జలయజ్ఞాన్ని గత మూడేళ్లలో ఓ పథకం ప్రకారం నీరుగారుస్తున్నారు. జలయజ్ఞాన్ని సజావుగా కొనసాగించాలంటే ఈ ఏడాది రూ.31,000 కోట్లు అవసరమని ఆ శాఖ నుంచి ప్రతిపాదనలు రాగా, అందులో సగం కంటే తక్కువ కేటాయించడం క్షమించరాని నేరం. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులు ఏ కొంచెమైనా ముందుకు కదులుతాయో, లేదో ఎవరూ చెప్పలేని స్థితి నెలకొంది. ఇలా చేస్తూ కూడా వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యమిచ్చామని మాట్లాడటం వింతల్లో వింత. ఆపన్న హస్తం కరువై, వడ్డీ వ్యాపారులపై ఆధారపడిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి దిక్కుతోచక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దేశంలో అప్పులపాలైన రైతుల సంఖ్య మన రాష్ట్రంలోనే ఎక్కువ. వాస్తవాలు ఇలావుండగా.. వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు బిగించాలని ప్రణాళికా సంఘం సూచించిందని స్వయంగా కిరణే చెప్పారు. ముందు మీటర్లు బిగించి, ఆనక పరిమితులు విధించి క్రమేపీ ఉచిత విద్యుత్తుకు మంగళం పాడబోతున్నారని చాలాకాలంనుంచి వింటున్నదే. ‘వారు చెప్పినా మేం మీటర్లు పెట్టడం లేద ’ని ఆయన ముక్తాయింపు ఇచ్చినా రైతు దయనీయ స్థితిపై సానుభూతి లేని సర్కారు మాటల్ని ఎవరూ విశ్వసించరు. సాగు సంక్షోభం ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ 12వ పంచవర్ష ప్రణాళికలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు దీటుగా గోడౌన్లు రెడీ చేయమని మాంటెక్‌సింగ్‌కు ముఖ్యమంత్రి చెప్పడం... అరకొర కేటాయింపులు చేస్తూ కూడా సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తన మాటగా మాంటెక్‌సింగ్ చెప్పడం ఎంత దుస్సాహసం!

ఇక మూడేళ్ల క్రితం జాతీయ సగటును మించి వృద్ధి రేటును నమోదు చేసుకున్న రాష్ట్రం ఇటీవలి సంవత్సరాల్లో పల్టీలు కొడుతోంది. ఇటు వ్యవసాయంలోనూ, అటు పారిశ్రామిక రంగంలోనూ వృద్ధి రేటు బక్కచిక్కుతోంది. వ్యవసాయ రంగమైతే మరీ దారుణం... అందులో నెగెటివ్ వృద్ధి రేటు నమోదైంది. 2010-11లో 9.96 శాతంగా ఉన్న వృద్ధి రేటు ఈ ఏడాది 6.81 శాతానికి పడిపోనున్నదని రెండు నెలలక్రితం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక సర్వే తెలియజేయగా..ఇప్పటికది ఇంకా క్షీణించి 5.81కి చేరుకుందని ప్రణాళికా సంఘం లెక్కేసిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. 2007-08లో జాతీయ సగటు 9.32 శాతం ఉన్నప్పుడు మన రాష్ట్ర వృద్ధి రేటు 12.02 శాతం ఉన్న సంగతి ఇక్కడ గమనార్హం.

ఆ తర్వాత 2008-09లో అంతర్జాతీయంగా నెలకొన్న మాంద్యం ప్రభావంతో అది 6.88 శాతానికి చేరుకున్నా జాతీయ సగటు 6.72 కంటే ఎక్కువే. ఒకపక్క వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ, మరోపక్క పారిశ్రామిక అశాంతిని నివారించడంలో విఫలమవుతూ, సేవారంగమూ సరిగా లేక ఇక వృద్ధి రేటు ఎలా పెరుగుతుంది? వాస్తవాలు ఇలావుండగా, అంతా బాగుందంటూ మాంటెక్‌సింగ్ ప్రశంసల వర్షం కురిపించడం ఆశ్చర్యకరం. మూడేళ్ల నాటి ఆదాయంతో పోలిస్తే అన్ని రంగాల్లోనూ ప్రభుత్వ ఆదాయం రెట్టింపయింది. కానీ, సంక్షేమ పథకాలు మాత్రం కొడిగడుతున్నాయి. ఇది చాలదన్నట్టు రాయితీల ఖర్చును క్రమేపీ తగ్గించుకోమని ప్రణాళికా సంఘం సలహా ఇస్తోంది. ఒకేసారి 22 శాతంమేర విద్యుత్తు చార్జీలు పెంచడాన్ని సమర్ధించింది. అంతేకాదు.. ప్రతియేటా ఇలాగే పెంచాలని సూచిస్తోంది. ప్రణాళికా సంఘమే ఇలా నేల విడిచి సాము చేస్తూ చిత్తం వచ్చిన సూచనలు చేస్తుంటే ఇక ప్రజలకు దిక్కెవరు?!

ప్రచారానికి వైఎస్సార్ సీపీ సాంస్కృతిక దళాలు

త్వరలో 18 శాసనసభ, 1 లోక్‌సభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విసృ్తతంగా ప్రచారం చేయడానికి 20 సాంస్కృతిక దళాలను సిద్ధం చేసినట్లు ఆ విభాగం కన్వీనర్ వంగపండు ఉష తెలిపారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయా జిల్లాల కన్వీనర్లు, కళాకారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఆమె వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ విధానాలను ప్రజల్లో ప్రచారం చేసేందుకు వీలుగా రూపొందించిన కొత్త పాటల క్యాసెట్లు, ఇతర సరంజామాను సిద్ధం చేసుకున్నామని వివరించారు. ఈ సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు, పార్టీ ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్ పాల్గొన్నారు.

ఇప్పుడు వయలార్ ‘పంచకర్మ వైద్యం’

18 స్థానాల్లో ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు ‘పెద్దకర్మ’ తథ్యం 
వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు

గుంటూరు, న్యూస్‌లైన్: ‘కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో పార్టీని బతికించడానికి పరి శీలకునిగా కేంద్రమంత్రి వయలార్ రవిని పంపిందంట! అసలు ప్రస్తుతం ఆ పార్టీ ఇంకా బతికేఉందా? దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హఠాన్మరణం తోనే కాంగ్రెస్ జీవం కోల్పోయింది.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు చెప్పారు. ఆయన గుంటూరులో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. నేడు రాష్ట్రంలో అవసానదశలో ఉన్న కాంగ్రెస్ సమర్థ నాయకత్వాన్ని కోల్పోయిందని.. ఈనేపథ్యంలోనే అధిష్టానం వయలార్ రవిని పంపినట్లు చెప్పారు.ఆయన వ్యాఖ్యలు చాలా విడ్డూరంగా ఉన్నాయన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగుతోందంటే.. ఆనాడు వైఎస్ పాదయాత్ర, బస్సుయాత్రల ద్వారా కష్టపడి తెచ్చిపెట్టిన భిక్షేనని గుర్తుచేశారు. ఆయన హఠాన్మరణం తర్వాత కాంగ్రెస్ అధిష్టానం వైఖరికి క్షోభపడి.. ఎన్నెన్నో అవమానాలు ఎదుర్కొన్న తర్వాతనే జగన్ ప్రత్యేకంగా ఒక పార్టీ పెట్టాలనే నిర్ణయానికి వచ్చారని అంబటి వివరించారు. వాయలార్ రవి లాంటి సీనియర్లు ఎంతమంది వచ్చినా.. కాయకల్ప, పంచకర్మ వైద్యాలు చేసినా ప్రయోజనం లేదని విమర్శించారు. రానున్న 18 స్థానాల్లో ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి పెద్దకర్మ పెట్టడం తథ్యమని జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ పెద్దలకు బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధం..

ఉప ఎన్నికల్లో పోటీచేసే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు ఎందుకు రాజీనామాలు చేయాల్సివచ్చిందో అడగాలని ఇటీవల రాష్ట్ర పర్యటనలో వయలార్ రవి పిలుపు నివ్వడం దారుణమన్నారు. భవిష్యత్‌లో అవే నియోజకవర్గాల్లోకి వెళ్లిన కాంగ్రెస్ పెద్దల్ని మీరెందుకు వైఎస్‌ను విమర్శిస్తారంటూ? ప్రజలు నిలదీసి బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ‘సాక్షి’ ఛానెల్‌తో వయలార్ మాట్లాడేటప్పుడు పక్కనే ఉన్న మంత్రి ఒకరు అడ్డుకోవడం సిగ్గుమాలినచర్యగా పేర్కొన్నారు. ఒకప్పుడు అదే ‘సాక్షి’పత్రిక, చానెల్ కాంగ్రెస్‌ని అధికారంలోకి తేవడంలో కీలకపాత్ర పోషించాయన్న సంగతి మరిచారని దుయ్యబట్టారు. 

బాబు చీకటి బతుకులు అందరికీ తెలుసు..

ఓ హోటల్‌లో వాయలార్ రవిని జగతి పబ్లికేషన్ ఆడిటర్ విజయసాయిరెడ్డి కలిశారని టీడీపీ నేతలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణ ఆరోపించడంలో అర్థం లేదని అంబటి కొట్టిపారేశారు. చీకట్లో ఢిల్లీ వెళ్లి అహ్మద్‌పటేల్, ప్రణబ్‌ముఖర్జిని కలిసి వాపోయిన ఘనత తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. బాబు చీకటి రాజకీయ బతుకులు అందరికీ తెలిసినవేనని.. గాలి, బొజ్జలకు పచ్చకామెర్లు వ్యాధిసోకినట్లు అంబటి అనుమానం వ్యక్తంచేశారు.

ఎస్సీ,ఎస్టీలకు తగ్గినా ఫర్వాలేదు!

2001 జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికలకు సీఎం ఆదేశం! 
హైకోర్టులో అఫిడవిట్‌కూ యత్నాలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: స్థానిక సంస్థల్లో ఎస్సీ/ఎస్టీలకు ఎక్కువ రిజర్వేషన్లు కల్పించేందుకు 2011 జనాభా లెక్కలతో ఎన్నికలకు వెళ్తామన్న సర్కారు ఇప్పుడు మాటమారుస్తోంది. తన రాజకీయ అవసరాల కోసం.. ఎస్సీ/ఎస్టీలకు రిజర్వేషన్లు పెరగకపోయినా ఫర్వాలేదన్నట్టుగా, 2001 జనాభా లెక్కల ప్రకారం తక్షణమే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. 2001లో 27 శాతం ఉన్న పట్టణ జనాభా 2011 నాటికి 33 శాతానికి పెరిగింది. ఆ మేరకు ఎస్సీ/ఎస్టీల జనాభా పెరగడం కూడా ఖాయం. ఆ మేరకు ఆ వర్గాలకు రిజర్వేషన్ సీట్లు పెరగడం తప్పనిసరి. 2011 జనాభా లెక్కల సేకరణ పూర్తై లక్ష జనాభా దాటిన పట్టణాల జాబితాను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా జనాభా లెక్కలతోనే ఎన్నికలకు వెళ్తామని హైకోర్టుకు ప్రభుత్వం ఆఫిడవిట్ కూడా సమర్పించింది. అయితే ముఖ్యమంత్రి ఇవేమీ పట్టించుకోలేదని, ఉప ఎన్నికలకు ముందే మునిసిపల్ ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, న్యాయపరమైన ఇబ్బందులు ఉంటే వెంటనే సర్దుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలిసింది.

పాత లెక్కలతో ఎన్నికలకు వెళ్తే ఎస్సీ/ఎస్టీ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ల పరంగా అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని కొందరు మంత్రులు ప్రస్తావించినా.. ముఖ్యమంత్రి ఉప ఎన్నికలకు ముందే స్థానిక ఎన్నికల నిర్వహణ ముఖ్యమనే విధంగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. తాజా జనాభా లెక్కలు ఎప్పుడు ప్రచురిస్తారో తెలియజేయాలని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డెరైక్టర్, పురపాలక శాఖ కార్యదర్శిలు జనాభా లెక్కల డెరైక్టర్ జనరల్‌కు 25 రోజుల కిందటే లేఖ రాశారు. దానిపై ఎలాంటి స్పందన వెలువడలేదు. దీనితో ఢిల్లీలో ఉన్న పురపాలక శాఖ కార్యదర్శి విజయకుమార్ జనాభా లెక్కల డెరైక్టర్ జనరల్‌ను ఫోన్‌లో సంప్రదించగా..జాబితా చాలా ఆలస్యం అవుతుందని ఆయన సమాధానం ఇచ్చారు. ఇదే విషయాన్ని లేఖ రూపంలో తెలపాలని కోరినట్లు విజయకుమార్ న్యూస్‌లైన్‌కు చెప్పారు. డెరైక్టర్ జనరల్ నుంచి వచ్చే లేఖ ఆధారంగా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. జనాభా లెక్కలు రావడానికి కనీసం మరో ఆరునెలలు పడుతుందని, ఆ తరువాత నాలుగు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలంటే చాలా ఆలస్యం అవుతుందన్న వాదనను ముందుకు తీసుకెళ్లాలని సీఎం సూచించినట్లు తెలిసింది. ఎన్నికల ఆలస్యం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన 13వ ఆర్థిక సంఘం నిధులు కోల్పోతున్నామని, అందువల్ల 2001 జనాభా లెక్కలతోనే ఎన్నికల నిర్వహణకు అనుమతినివ్వాలని హైకోర్టును అభ్యర్థించనున్నారు, 

అన్నిటికీ ఒకేసారి ఎన్నికలు సాధ్యం కాదు

రాష్ట్రంలో మొత్తం 168 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ఉంటే..159 స్థానిక సంస్థలకు పాలక మండళ్లు లేవు. తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినా, ఇందుకు హైకోర్టు అంగీకరించినా.. గతంలో ఎన్నికలు నిర్వహించిన (2001 జనాభా లెక్కల ప్రకారం) 91 మునిసిపాలిటీలు 15 కార్పొరేషన్లకు మాత్రమే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మిగతావి కొత్త మునిసిపాలిటీలు. కాగా పాతవాటికి నిర్వహించాలనుకున్నా.. జనాభా లెక్కల విభాగం నుంచి సమాధానం తెచ్చుకోవడం, కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి కోర్టు అనుమతి తీసుకోవడం, తదనుగుణంగా వార్డుల రిజర్వేషన్లు, మేయర్/చైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇవ్వడానికి, ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి మూడు నెలలైనా గడువు కావాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంత లేదన్నా మునిసిపల్ ఎన్నికలు జూలై కంటే ముందు జరగడానికి అవకాశం లేదని అంటున్నారు. ఇక మిగతా మునిసిపాలిటీలకు రెండో దశలోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

ఏజీతో సీఎం సమీక్ష: మునిసిపల్ ఎన్నికలు నిర్వహించేందుకున్న న్యాయపరమైన చిక్కులపై ముఖ్యమంత్రి శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో హైకోర్టు అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డితో సమీక్ష జరిపారు.

మిగతా మునిసిపాలిటీల్లో తక్షణమే బీసీల గణన

పురపాలక శాఖ ఆదేశాలు మే 30 కల్లా తుది జాబితాలు

బీసీ ఓటర్ల గణన జరగని మునిసిపాలిటీల్లో తక్షణమే బీసీ ఓటర్ల లెక్కింపు చేపట్టాలని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డెరైక్టర్ బి.జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కావాలని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 30వ తేదీ నాటికి బీసీ ఓటర్ల తుది జాబితాలు ప్రకటించాలని, తద్వారా మేయర్/చైర్‌పర్సన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయడానికి వీలవుతుందని తెలిపారు. మల్టీపర్పస్ హౌస్‌హోల్డ్ కార్డు సర్వే (ఎంపీహెచ్‌ఎస్)ను వార్డుల వారీగా విభజించాలని, అందులో బీసీ ఓటర్లను గుర్తించాలని, ఈనెల 28 నుంచి వచ్చేనెల 12 వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను గుర్తించాలని, మే 15న ముసాయిదా జాబితాలు సిద్ధం చేయాలని సూచించారు. మే 28న మునిసిపాలిటీ స్థాయిలో తుది జాబితా ప్రకటించాలని తెలిపారు. 30లోగా తుది జాబితాలను మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డెరైక్టర్‌కు పంపించాలని కమిషనర్లను, రీజినల్ జాయింట్ డెరైక్టర్లను ఆదేశించారు.

మళ్లీ తేల్చండి, విజయసాయిరెడ్డి బెయిల్‌పై సీబీఐ కోర్టుకు హైకోర్టు ఆదేశంబెయిల్ మంజూరుకు ప్రత్యేక కోర్టు చెప్పిన కారణాలు హేతుబద్ధంగా లేవని వెల్లడి.. బెయిల్ ఉత్తర్వులు రద్దు
సోమవారం లొంగిపోతానని, అదే రోజు కేసును విచారించాలని హైకోర్టును కోరిన సాయిరెడ్డి
సానుకూలంగా స్పందించిన హైకోర్టు

హైదరాబాద్, న్యూస్‌లైన్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో ఆడిటర్ విజయసాయిరెడ్డికి బెయిల్ మంజూరు విషయాన్ని మళ్లీ తేల్చాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. బెయిల్‌పై నిర్ణయం తీసుకొనే సమయంలో అందుకు తగిన కారణాలను వివరించాలని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభాను శుక్రవారం తీర్పునిచ్చారు. ఇదే సమయంలో సాయిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ స్పందిస్తూ.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సోమవారం సాయిరెడ్డి సీబీఐ కోర్టు ముందు లొంగిపోతారని, ఈ కేసును అదే రోజు విచారించేలా సీబీఐ కోర్టును ఆదేశించాలని అభ్యర్థించారు. ఇందుకు జస్టిస్ భాను సానుకూలంగా స్పందించారు. హైకోర్టు ఉత్తర్వులు సోమవారం ఉదయం ప్రత్యేక న్యాయస్థానానికి చేరతాయని, తరువాత మీరు తదనుగుణంగా స్పందించవచ్చునని న్యాయమూర్తి తెలిపారు.

ఈ కేసును వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రత్యేక కోర్టును ఆదేశించారు. సాయిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై వాదనలను విన్న న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు. బహిరంగ కోర్టులో దాదాపు 40 నిమిషాలపాటు న్యాయమూర్తి తీర్పు పాఠాన్ని చదివారు. ఇరుపక్షాల వాదనలు, చార్జిషీట్‌లోని పలు అంశాలను తీర్పులో ప్రస్తావించారు. ఏ సమయాల్లో నిందితులకు బెయిల్ మంజూరు చేయవచ్చన్న విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన పలు తీర్పులను, అవి ఏ విధంగా ఈ కేసులో వర్తిస్తాయనే విషయాన్ని వివరించారు. సాయిరెడ్డికి బెయిల్ మంజూరు చేసే సమయంలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం చెప్పిన కారణాలు హేతుబద్ధంగా లేవని అభిప్రాయపడ్డారు. బెయిల్ మంజూరు చేస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.

మత్స్యకారుణ్ని ఎమ్మెల్యే చేస్తా


విశాఖపట్నం, న్యూస్‌లైన్:నేనిక్కడ మత్స్యకార గ్రామాల మీదుగా వస్తున్నప్పుడు.. ఓ మత్స్యకారుడు నాతో అన్నాడు.. అన్నా! మాకు ఏ పార్టీ రాజకీయ ప్రాధాన్యం కల్పించడం లేదన్నా.. రాజకీయంగా ఏ పార్టీ మమ్మల్ని పట్టించుకోవట్లేదన్నా అని అన్నాడు. నేను ఇప్పుడు చెప్తున్నా.. మీ జిల్లా(విశాఖపట్నం) నుంచి ఒక మత్స్యకారుడిని ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తా’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మత్స్యకారుల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. మత్స్యకారుల బాగోగుల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, వేటకెళ్లి అనుకోకుండా ప్రమాదంలో మరణిస్తే ఇచ్చే రూ.లక్ష పరిహారం కూడా ఆలస్యంగా ఇస్తోందని మండిపడ్డారు. ‘మనసున్న మంచి అన్నయ్యలా హామీ ఇస్తున్నా.. మా ప్రభుత్వం వచ్చాక పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచుతాం. ఈ ప్రభుత్వంలా కాకుండా.. మనిషి గల్లంతయిన ఆరు మాసాల్లోపే దాన్ని అందించి ఆ అక్కాచెల్లెళ్లను ఆదుకుంటాం’ అని భరోసా ఇచ్చారు. విశాఖజిల్లా పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచార యాత్ర రెండో రోజు శుక్రవారం ఆయన పాయకరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఉదయం పాల్తేరులో ప్రారంభమైన రోడ్‌షో.. ఎస్.నర్సాపురం వరకూ సాగింది. ఊళ్లన్నీ రోడ్లెక్కి జగన్ కోసం బారులు తీరిన నేపథ్యంలో అడుగడుగునా జగన్నినాదాల హోరు ప్రతిధ్వనించింది. జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

సర్కారువి కల్లబొల్లి మాటలు: ఉపాధి కూలీలు రోజంతా పనిచేస్తున్నా.. రూ. 60-70 మాత్రమే వస్తోంది. కనీస వేతనం రూ.130కుపైగా ఇస్తున్నట్టు చెప్తున్న ఈ ప్రభుత్వం మాటలు కల్లబొల్లివే. వచ్చే సువర్ణయుగంలో ఈ పరిస్థితి ఉండదు. అందరి కష్టాలూ తీరిపోతాయి. అవ్వలు, తాతలు కూలి పనులకెళ్లే అగత్యం లేకుండా మూడు పూటలా వారి కడుపు నిండేలా నెలకు రూ.700 పింఛను చెల్లిస్తాం. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు నింపేలా పాలన అందిస్తాం. ప్రతి ఇంటిలో కనీసం ఒకరు.. ఇంజినీరింగ్ లేదా డాక్టర్ లేదా ఐఏఎస్‌లాంటి ఉన్నత చదువులు చదివినపుడే పేదరికం పోతుంది. అందుకే మా ప్రభుత్వం వచ్చాక.. పిల్లల్ని బడికి పంపే తల్లిదండ్రుల ఖాతాలో నెలకు రూ.500 చొప్పున వేస్తాం. అలా ఒక్కో కుటుంబానికి ఇద్దరు పిల్లలకు చొప్పున అందిస్తాం. వైఎస్ కలగన్న ఫీజు రీయింబర్స్‌మెంటు పథకానికి ఈ సర్కారు తూట్లు పొడుస్తోంది. ప్రభుత్వం ఫీజులు కడుతుందో? లేదో? తెలియని ఆందోళనలో విద్యార్థుల చదువులు సాగుతున్నాయి.

కరెంట్ బిల్లు చూస్తే షాక్!: రాష్ట్రంలో ఉన్న పాలకులు సోనియా గాంధీకోసం పనిచేస్తున్నారా? రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నా. వైఎస్సార్ మరణించాక రైతు వ్యవసాయం చేయడం కంటే ఉరేసుకోవడమే మేలనుకునే స్థాయికి పరిస్థితిని దిగజార్చారు ఈ పాలకులు. రైతన్న పరిస్థితి ఇలా ఉంటే.. కూలి చేసుకునే అక్కాచెల్లెళ్లు ఉన్న చోటు వీడి పొరుగు ప్రాంతాలకు వలసపోవాల్సిన దుస్థితి దాపురించింది. తడి చేతులతో స్విచ్ వే స్తే ఎక్కడ షాక్ కొడుతుందోనన్న భయం లేదుగాని.. కరెంట్ బిల్లు తాకకుండానే షాక్ కొడుతోందని ప్రజలు వాపోతున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితులకు కారణమైన ఈ ప్రభుత్వం కొనసాగేందుకు ఎలాంటి నైతిక హక్కూ లేదు. పేదలు, రైతులకు అండగా గొల్ల బాబూరావు సహా 17 మంది ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానానికి ఓటేసి తమ పదవులను సైతం త్యజించారు. వచ్చే ఉప ఎన్నికల్లో వారిని చల్లని దీవెనలతో ఆశీర్వదించి.. రాజకీయాల్లో విలువలకు పట్టంకట్టాలని కోరుతున్నా.

ఇక బ్యాంకు మేనేజర్ల మాటలు పడక్కర్లేదు..
జగన్ పాల్గొన్న పాల్తేరు సభలో లక్ష్మమ్మ అనే మహిళ మాట్లాడుతూ.. పొదుపు రుణాల దోపిడీపై గోడు వెళ్లబోసుకుంది. మూడేళ్ల కింద రూ.20 వేల రుణం తీసుకున్నానని, నెలకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తున్నా.. అది వడ్డీకే సరిపోతోందని, అసలు ఎప్పుడు చెల్లిస్తారంటూ బ్యాంకు మేనేజర్ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై జగన్ మాట్లాడుతూ.. ‘వచ్చే సువర్ణయుగంలో దివంగత నేత వైఎస్ గర్వపడేలా.. అక్కా చెల్లెళ్లకు వడ్డీలేని రుణాలను అందిస్తా. ఇక ఎవరూ వడ్డీల పేరిట బ్యాంక్ మేనేజర్ల బెదిరింపులను భరించాల్సిన పనిలేదు. ఆ వడ్డీలను ముందుగానే ప్రభుత్వం చెల్లించేలా చేస్తా’ అని భరోసా ఇచ్చారు.

'పాయకరావుపేట'లో ముగిసిన జగన్ పర్యటన

పాయకరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పర్యటన నిన్నటితో ముగిసింది. ఈ రోజు నుంచి జగన్ పోలవరం నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. పోలవరం నియోజకవర్గంలో ఆయన 4 రోజులపాటు పర్యటిస్తారు.

ఆ వృద్ధులు.. అలుపెరుగని యోధులు

సహకరించని శరీరం.. అడుగడుగునా అడ్డు తగులుతున్న వయోభారం.. మొరాయిస్తున్న పాదాలు.. వణుకుతున్న కరాలు.. అయినా ఆ వృద్ధుల ఉత్సాహాన్ని ఇవేవీ నిలువరించలేక పోయా యి. జననేత జగన్‌మోహన్‌రెడ్డిని చూడాలని, కలిసి మాటాడాలని, ఆశీర్వదించాలన్న వృద్ధుల ఆరాటాన్ని నిరోధించలేకపోయాయి. ‘మా రాజన్న బిడ్డడేడీ’.. అని కదలలేక.. కదలలేక ముందుకొస్తున్న వా రి పట్టుదల అందరినీ విస్మయపరిచింది. చివరికి జగన్‌నూ ఆపేసింది. ఓవంక జనం కిక్కిరిసిపోయి జగన్‌ను చూడాలని ఆతృతపడుతూ ఉంటే, వృద్ధులు వారితో పోటీ పడ్డారు. మరోవైపున ఆయనకు మహిళలు హారతులు పట్టారు. పాల్తేరుతో ప్రారంభమైన రెండో రోజు పర్యటనలో అడుగడుగునా ఇటువంటి దృశ్యా లు కనిపించాయి.

అందుకు తగ్గట్టుగా నే... జగన్ తన ప్రసంగాల్లో ముందు గా అవ్వలు ఎక్కడున్నారంటూ ఆరా తీస్తు నే.. ‘ఎర్రచీర కట్టుకున్న అవ్వా.. కళ్లద్దా లు పెట్టుకున్న అవ్వా ఇటు చూడాలి’ అం టూ సంబోధిస్తూ ఉండడం వారిని ఆనందంలో ముంచెత్తింది. పాల్తేరులో జగన్ ను చూడడానికి పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు రోడ్లపైకి చేరుకున్నారు. జగన్ కాన్వాయ్ ముందు అభిమానుల సందడిలో ఇద్దరు వృద్ధులు అదుపుతప్పి కిందపడిపోయినా వెంటనే లేచి అందనితో కలిసి నృత్యం చేశారు. జగన్ కోసం మ హిళలు, వృద్ధులు గంటల తరబడి నిరీ క్షించారు. అల్పాహారం చేసిన ఇంటి నుం చి జగన్ ఎందరో వృద్ధులు ఆయనకు ఎదురెళ్లి పలకరించారు. ప్రజానాయకుడై వర్థిల్లాలని దీవించారు. జననేత అంకంపేట వెళ్తుండగా సుబ్బయ్యమ్మ అనే వృద్ధురాలు జగన్ చూడడానికి పరుగులు పెట్టింది. రాజానగరం గ్రామంలో మహిళలు జగన్‌కు హారతులివ్వడానికి పోటీ లు పడ్డారు. మహిళలు, వృద్దులు ఉన్నచోట జగన్ కాన్వాయ్ ఆపి ఆప్యాయం గా పలకరించడంతో సంబరపడుతున్నా రు. తమ ఇంటి సమస్యలు, ఊళ్లో సమస్యలు ఏకరువు పెడుతున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే తమ సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నారు.

యువజనం నోట జై జగనన్న అన్న మాటే

 జగనన్నను కలిశామన్న ఆనందం కొందరిది. తమ్ముడి ఆత్మీయ పిలుపు విన్నామన్న సంతోషం మరి కొందరిది. మా రాజు కొడుకు కష్టపడుతున్నాడన్న ఆవేదన ఓ కన్నతల్లిది. ఇల్లు.. సంసారం వదులుకుని వచ్చాడు మా నాయన అంటూ ఓ అవ్వ ఓదార్పు. తండ్రిలాగే ఆయన మాట తప్పడు.. మడమ తిప్పడు అంటూ ఓ పండు ముసలి నిండు దీవెన. యువజనం నోట జై జగనన్న అన్న మాటే తప్ప మరో ధ్యాస లేదు. నేల ఈనిందా.. అన్న రీతిలో రోడ్లపై జనాలు బారులుతీరి ‘ఉప’ బరిలో నిలిచే ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించారు. ఇదీ పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి రెండో రోజైన శుక్రవారం పాయకరావుపేట మండలంలో లభించిన అపూర్వ ఆదరణ. 

పల్లె గుండె తట్టారు : పాల్తేరులో మొదలైన ఉప ఎన్నికల ప్రచారం అంకంపేట, కందిపూడి, రాజగోపాలపురం, కుమారపురం, రాజానగరం, వెంకటనగరం, రాజవరం, కేశవరం, శ్రీరాంపురం మీదుగా ఎస్.నరసాపురం వరకు కొనసాగింది. అడుగడుగునా జనం జగన్‌కు నీరాజనాలందించారు. నక్కపల్లిలో బయలుదేరిన జగన్ తుని మీదుగా పాల్తేరు చేరుకున్నారు. తుని నుంచి కవలపాడు వరకు రోడ్లు సమీప గ్రామాల మహిళలతో నిండిపోయింది. చాలా చోట్ల మహిళలు మగాళ్లను నెట్టుకుంటూ.. జన నేతను చూసేందుకు ఎగబడ్డారు. బాణాసంచా, డప్పుల మేళాలు, తప్పెటగుళ్లు, పగటి వేషాలతో ప్రజలు ఆయన్ని ఆదరంగా స్వాగతించారు. నింగికెగిసే తారాజువ్వలు.. అంతే స్థాయిలో కురిపించిన పల్లె ప్రజల అభిమానం జగనన్న మనసు దోచుకునేందుకు పోటీ పడ్డాయి. 

బాబూరావన్నకే మా ఓటు : గొల్ల బాబూరావును జగన్ పిలిచేది బాబూరావన్నా అని. అదే మాదిరిగా జనం సైతం బాబూరావన్నకే మా ఓటంటూ ఎలుగెత్తి చాటారు. పేదల కోసం పదవుల్ని తృణప్రాయంగా వదిలిన వారిని మళ్లీ అసెంబ్లీకి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు. మత్స్యకార పల్లె అయిన రాజానగరం వీధుల్ని దాటేంత వరకు ఊరుఊరంతా ఆయన్ని అనుసరించింది. మహిళలు, వికలాంగులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

పీసీపీఐఆర్‌తో తరలింపు ప్రమాదంలో ఉన్నామంటూ వాపోయారు. ఇప్పటికే తుపానుకు నష్టపోతున్న తాము, అధికారుల బెదిరింపులకు దినదినగండంలా బతుకు వెళ్లదీస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లకు పట్టాల్లేక, ఏళ్ల తరబడి ఉంటున్న ఇళ్లపై కనీస హక్కులేక నిత్యం ఆందోళనలోనే ఉన్నామన్నారు. దీనిపై జన నేత సువర్ణ పాలనతో శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్న హామీతో జేజేలు కొట్టారు. పొరుగునే ఉన్న వెంకటనగరం వరకు జగన్ వెంట పరుగు తీశారు. రాజన్నే మళ్లీ వచ్చాడా? : దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డే తమ కళ్ల ముందుకొచ్చినట్టు మహిళలు ఆనందపరవశులయ్యారు. ఎక్కడ మహిళలు ఉన్నా.. అక్కా.. చెల్లెమ్మా.. అమ్మా.. అవ్వా.. అంటూ ఆయన ఆత్మీయ పిలుపులకు పులకరించిపోయారు. 

మళ్లీ రాజన్న పాలన జగనన్నతోనే సాధ్యమవుతుందన్న నమ్మకాన్ని గుండెనిండా నింపేసుకున్నారు. ఆనాడు రాజన్న మాట మేరకే బాబూరావును గెలిపించుకున్నామని, ఇపుడు ఆ రాజన్న కొడుకు జగనన్న పిలుపుతో భారీ మెజార్టీ కట్టబెడతామని హామీ ఇచ్చారు. తాను ప్రసంగించిన ప్రతి చోటా నిజాయితీకి నిలబడి పదవిని త్యాగం చేసిన బాబూరావన్నకు చల్లని మనసుతో, సంపూర్ణ మద్దతు తెలపాలన్న జగన్ విన్నపానికి జనాలు జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో జగన్ వెంట పార్టీ రాష్ట్ర వ్యవహారాల కో-ఆర్డినేటర్ కొణతాల రామకష్ణ, కేంద్ర పాలకమండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ, పార్టీ అభ్యర్థి గొల్ల బాబూరావు, పార్టీ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జిలు తిప్పల నాగిరెడ్డి, బొడ్డేడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్తజన బాంధవుడు

వరదతో ఉప్పొంగే నది సాగర ఘోషతో గొంతు కలుపుతుంది. దారిపొడవునా ఎదురవుతున్న అవరోధాలు తొలగే తెరువేదని పరితపిస్తూ ప్రశ్నిస్తుంది. వేదనతో వెల్లువయ్యే ప్రతి ఒక్కరి మదీ ఆపద్బాంధవుడితో మమేకమవుతోంది. బతుకు అడుగడుగునా అడ్డు తగులుతున్న బాధల గాథలను ఆర్తితో వినిపిస్తోంది. తల్లడిల్లుతున్న ప్రతి పల్లే జననేత చెంతకు తరలివచ్చి ఆవేదనతో ఆక్రోశిస్తోంది. కష్టకాలం కడతేరేదెప్పుడని అడుగుతోంది. పావలా వడ్డీల పీడనతో విసిగి వేసారి పోతున్న పేద మహిళ...

ప్రభుత కరుణించక, పింఛను కానరాక విలవిలలాడుతున్న వృద్ధుడు... కరెంటు కరువై, ఎరువు బరువై అలమటిస్తున్న అన్నదాత... కూలి గిట్టుబాటు కాక, ‘ఉపాధి’తో గట్టెక్కలేక శాపగ్రస్తుడైన శ్రామికుడు... ఉద్యోగం లేని యువకుడు... పైవారు కన్నెర్ర చేస్తే కష్టాలకు ఎదురీదుతున్న చిరుద్యోగీ... వారూ వీరన్న తేడా లేకుండా ప్రతి వ్యథార్థ హృదయం జననేత సాంత్వన కోరింది. ఆయన పలకరింపు కోసం, పిలుపు కోసం, ధైర్య వచనాల కోసం పల్లెల్లో ప్రతి ఒక్కరి అడుగూ వడివడిగా పడింది. తరలి వచ్చిన వారందరినీ జగన్ స్నేహపూర్వక హస్తం చెంతకు తీసుకుంది. ఆయన ఆప్త వాక్యం అనునయించింది. ఆయన దరహాసం భవితపై భరోసా ఇచ్చింది.

భవిష్యత్ నీదే.. రాబోయే రాజ్యం మనదే

నక్కపల్లి/పాయకరావుపేట, న్యూస్‌లైన్ : ‘ప్రజల పక్షాన నిలిచిన ఎమ్మెల్యేలను అనర్హత వేటు వేసి తొలగించారు. వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే. రాబోయే కాలమంతా మనదే. త్వరలో రాజన్న కాలం నాటి సువర్ణయుగం తీసుకొస్తా...’ అని వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పాయకరావుపేట ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన ముఖ్యంగా మత్స్యకార గ్రామాలైన వెంకటనగరం, రాజానగరం, రాజవరం, కేశవరం తదితర గ్రామాల్లో పర్యటించారు. అక్కడి ప్రజలు తాము ఎదుర్కొంటున్న కష్టాలు ఏకరువు పెట్టారు. మత్స్యకారులు ప్రభుత్వం తమపై చూపెడుతున్న వివక్షను జగన్‌కు వివరించారు. తీరప్రాంతంలో రసాయన పరిశ్రమల ఏర్పాటు వల్ల మత్స్యసంపద నాశనమౌతోందని గతంలో పది కిలోమీటర్లు సముద్రంలోకి వెళ్తే చేపలు లభించేవని, ఇప్పుడు 100 నుంచి 120కిలోమీటర్ల దూరం వెళ్లినా చేపలు లభించడంలేదని వాపోయారు.

వేట నిషేధ సమయంలో ప్రభుత్వం రెండేళ్ల నుంచి మత్స్యకారులకు ఇచ్చే ఉచిత బియ్యాన్ని ఇవ్వడంలేదనీ, వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాత పడితే ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి కూడా పరిహారం అందడం లేదని చెప్పారు. కంపెనీల నుంచి విడుదలయ్యే వ్యర్థరసాయనాల వల్ల ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తుపానులు, సునామీ వంటి విపత్కర పరిస్థితుల్లో ఇంజిన్లు, వలలు నష్టపోతున్న మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవడంలేదనీ విన్నవించారు.

ఉపాధి వేతనం గిట్టుబాటు కాకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో 108, 104 వాహనాలు రావడంలేదని జగన్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై యువనేత స్పందిస్తూ ఈ ప్రభుత్వం పాలించే అర్హత కోల్పోయిందనీ, కాబట్టే గద్దెదింపాలని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి సంక్షేమఫలాలు అందేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు మృతిచెందితే రూ.5లక్షల నష్టపరిహారం ఇస్తామన్నారు. ప్రతి అవ్వ, ప్రతి తాత మూడుపూటలా తిండి తినేలా పింఛన్లు రూ.700కు పెంచుతానని చెప్పారు. ఆయన ఇచ్చిన భరోసా మత్స్యకారులు, మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది. నాన్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు... అదే బాటలో నడువుబాబూ... భవిష్యత్ నీదే.. రాబోయే రాజ్యం మనదే అంలటూ మహిళలు, వృద్ధులు ఆయనను ఆశీర్వదించారు.

నాలుగు రోజుల పాటు పోలవరం నియోజకవర్గంలో రోడ్‌షో

 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి శనివారం నుంచి మలి విడత జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల మొదటివారంలో ఆయన నర్సాపురం నియోజకవర్గంలో మూడు రోజులు పర్యటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాలుగు రోజుల పాటు పోలవరం నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. పోలవరం మండలంలోని గూటాల నుంచి ఆయన రోడ్ షోను ప్రారంభించనున్నారు. 24వ తేదీ వరకూ పోలవరం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఆ తర్వాత 25, 26 తేదీల్లో నర్సాపురం నియోజకవర్గంలో మిగిలిపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తారు. జగన్‌మోహన్ రెడ్డి ఉప ఎన్నికలు జరగనున్న ఈ రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన కన్నా ముందుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రెండు రోజులు అక్కడ విస్తృతంగా పర్యటించారు. 

జగన్ పర్యటన నేపథ్యంలోనే పూర్తిగా నీరుగారిపోయిన కాంగ్రెస్ క్యాడర్‌కు కొంతైనా ఊపునిచ్చేందుకు గురువారం ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వాయలార్ రవి కొయ్యలగూడెంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఉప ఎన్నికలు జరిగే ఈ రెండు నియోజకవర్గాల్లో పరిస్థితి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు బెంబేలెత్తుతున్నాయి. పైకి గెలుస్తామని మేకపోతు గాంభీర్యంతో చెబుతున్నా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను ఎలా అడ్డుకోవాలో తెలియక ఆ పార్టీ నేతలు సతమతమవుతున్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదనే ఆందోళన చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోంది.

ఆయన రెండు రోజుల పర్యటనలో జగన్‌మోహన్‌రెడ్డ్డిపైనా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపైనా గతంలో ఎన్నడూ లేనివిధంగా తీవ్రస్థాయిలో విమర్శలు చేయడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఆయన తిట్ల దండకాన్ని చూసి తెలుగుదేశం పార్టీ నేతలే అవాక్కయ్యారు. ఆయన రోడ్ షోల్లో హడావుడి, ఆర్భాటం తప్ప జనం స్పందన పెద్దగా కనిపించలేదు. దీంతో బాబులో అసహనం మ రింత పెరిగిపోయింది. మరోవైపు కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర మంత్రి వచ్చినా పోలవరం నియోజకవర్గంలో ఆ పార్టీలో చలనం కనిపించలేదు. జనమంతా జగన్ వెంటే వెళతున్నారని ఆ పార్టీ సమావేశానికి వచ్చినవారే స్పష్టంగా చెబుతుండడంతో కాంగ్రెస్ నేతలు ఇబ్బందిపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఈ నేపథ్యంలో శనివారం నుంచి జగన్‌మోహన్‌రెడ్డి ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పర్యటించనుండడంతో ఆయా పార్టీల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. తొలి విడత పర్యటనలో రాజకీయ ఉద్ధండుడు చేగొండి హరిరామజోగయ్య, మాజీ ఎమ్మెల్యేలు అల్లు వెంకట సత్యనారాయణ, కూనపురెడ్డి రాఘవేంద్రరావు (చినబాబు), కీలక నేతలు తోట గోపి, శ్రీరామ్‌రెడ్డితోపాటు అనేక మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా జరగనున్న పర్యటనలో కూడా పలువురు కీలక నేతలు ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. కాగా శుక్రవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో జిల్లాలోకి ప్రవేశించిన జగన్‌మోహన్‌రెడ్డికి కొవ్వూరు వద్ద పార్టీ నాయకులు సాదర స్వాగతం పలికారు. 12 గంటల సమయానికి పోలవరం మండలం గూటాల చేరుకుని సింహాద్రి వీరభద్రరావు ఇంట్లో బస చేశారు.

జగన్ రోడ్ షో షెడ్యూల్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం(21-04-12) పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తారని పార్టీ జిల్లా కన్వీనర్ కొయ్యే మోషేన్‌రాజు, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి వెంట పోలవరం తాజా మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొంటారు. 

రోడ్ షో సాగేదిలా..
ఉదయం 9.30 గంటలకు గుటాలలో వై ఎస్ విగ్రహావిష్కరణ, రోడ్‌షో ప్రారంభం

=అనంతరం కొత్తపట్టిసీమ, పాత పట్టి సీమ, పోలవరం, తల్లవరం(కొత్తూరు) జంక్షన్-పోలవరం నిర్వాసితులతో ముఖాముఖి, ఇటుకలకోట (వయా పోలవరం), బోడిగూడెం రోడ్ షో సాగుతుంది.

=వింజరం, గార్లగొయ్యి, గుంజవరం, రేపల్లెవాడ జంక్షన్, ప్రగడపల్లి , ఎల్‌ఎన్‌డీపేట గ్రామాల్లో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. 

=రెడ్డిగూడెం, లక్ష్మీపురం, కొవ్వాడ, రాజానగరం, కేఆర్ పురం(ఐటీడీఏ), కన్నాపురంలో రోడ్ షో నిర్వహిస్తారు.

People's Join In YSR Congress Party

Written By news on Friday, April 20, 2012 | 4/20/2012

CM Kiran More Money Spend For By Election Area

Ambati Rambabu press meet

రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను దీవించండి: జగన్

విశాఖ: రైతుల కోసం 18 మంది ఎమ్మెల్యేలు పదవులను త్యాగం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వివరించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజగోపాలపురంలో పర్యటించారు. మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని జగన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా పదవులను మధ్యలో వదులుకోవడానికి ఇష్టపడరని.. రైతుల సంక్షేమం కోసం 18 మంది ఎమ్మెల్యేలు పదవులను తృణప్రాయంగా వదులుకున్నారని జగన్ అన్నారు. రైతుల కోసం పదవులను త్యాగం చేసినవారిని దీవించండని రాజగోపాలపురం సభలో వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. 

పేదరికానికి కులం, మతం లేదు: జగన్

వెంకటానగరం: పేదరికానికి కులం, మతం, ప్రాంతం, పార్టీ లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గం వెంకటానగరంలో జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుల,మత, ప్రాంతం, పార్టీలకతీతంగా పేదవారి సంక్షేమం కోసం మహానేత వైఎస్ఆర్ తపించారని జగన్ అన్నారు. రైతుల సంక్షేమం కోసం, రైతులు అనుభవిస్తున్న కష్టాల పరిష్కారం కోసం 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని ఆయన తెలిపారు. రాజీనామా చేసిన వారిని ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు. వెంకటానగరంలో ప్రజలు ఏర్పాటు చేసుకున్న దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్యరించారు.

Jagan tour special

విజయ సాయిరెడ్డికి బెయిల్ రద్దు

 ఆడిటర్ విజయ సాయిరెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టు ఇచ్చిన కండిషనల్ బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది. ఈ కేసులో గత నాలుగు రోజులుగా వాదనలు విన్న హైకోర్టు ఈ మేరకు తీర్పును ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రకటించింది. బెయిల్ మంజూరు చేస్తూ... సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు తప్పబట్టింది. మరోసారి ఇరుపక్షాల వాదనలు వినాలని పేర్కొంది. 

ఈ విషయంలో పూర్తి వాదనలు మరోసారి వినాలని, తదుపరి విచారణ తర్వాతే బెయిల్ పై తీర్పును ప్రకటించాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పులో ఎక్కడా కూడా లొంగిపోవాలని న్యాయస్థానం సూచించలేదు. ఈ కేసు వచ్చే సోమ, మంగళవారాల్లో నాంపల్లి కోర్టులో విచారణకు రానుంది. కాగా సాయిరెడ్డిని తదుపరి విచారణకు అనుమతించాలని కోరుతూ సీబీఐ వేసిన పిటిషన్ ను కోర్టు మే 2వ తేదీకి వాయిదా వేసింది.

ఆంధ్రజ్యోతి ఎండీ రాధకృష్ణపై చీటింగ్ కేసు

ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, మరో ఇద్దరిపై 420 చీటింగ్, నమ్మకద్రోహం 406 ఇండియన్ పీనల్ కోడ్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ సైబరాబాద్ 11వ మెట్రోపాలిటన్ కోర్టు సరూర్‌నగర్ పోలీసులను ఆదేశించింది. గతంలో కొంతకాలం సేల్స్ ఆఫీసర్‌గా ఆ పత్రిక అడ్వర్టైజింగ్ విభాగంలో రామచందర్ అనే ఉద్యోగి పనిచేశాడు. ఉద్యోగ సమయంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని పద్దులను యాజమాన్యానికి అప్పగించాడు.

అయితే ఉద్యోగంలో చేరేముందు రామచందర్ నుంచి సెక్యూరిటీ చెక్కులను, ప్రభుత్వ ఉద్యోగి పూచీకత్తు తీసుకున్నారు. అన్నీ సవ్యంగా చెల్లించి ఉద్యోగం మానేసి వెళ్లినా తనను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ రామచందర్ ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై సైబరాబాద్ మేజిస్ట్రేట్‌లో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారించిన న్యాయమూర్తి ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, ప్రచురణల విభాగాధిపతి రామకృష్ణ, రవిలపై నమ్మకద్రోహం, చీటింగ్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీచేశారు.

ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీదే గెలుపు: రోజా

పాయకరావుపేట : ఎక్కడికి వెళ్లినా వైఎస్ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళ నేత నేత రోజా అన్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్. కాంగ్రెస్‌ పార్టీ అన్ని స్థానాల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని రోజా థీమా వ్యక్తం చేశారు.

పదవుల కోసమే చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆమె విమర్శించారు. పార్టీని నడపలేక నమ్ముకున్నవారిని నట్టేట ముంచారని రోజా ఎద్దేవా చేశారు. తిరుపతి ప్రచారంలో చిరంజీవిని ప్రజలు తరిమి తరిమి కొడతారని ఆమె అన్నారు.

స్వార్థం కోసమే వైఎస్ పై ఆరోపణలు: గోనె

మంత్రులు బస్వరాజు సారయ్య, కొండ్రు మురళీలు తమ స్వార్థం కోసమే వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు అన్నారు. శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ సారయ్యను వైఎస్ బెదిరించారనటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నారని గోనె ఆరోపించారు.

వైఎస్సార్ సీపీలోకి రాధా


విజయవాడ, న్యూస్‌లైన్ : మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. 27వ తేదీన రాఘవయ్యపార్కు వద్ద ఉన్న వంగవీటి రంగా విగ్రహం సాక్షిగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ఆప్తుల హర్షధ్వానాల మధ్య రాధా ప్రకటించారు. గత నెలలో గుంటూరులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలసివచ్చిన తరువాత త్వరలోనే పార్టీలో చేరతానని రాధా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

పెదనాన్న రాధా చనిపోయిన తర్వాత ఏర్పాటయిన రాధా మిత్రమండలి, తండ్రి రంగా మరణానంతరం ఏర్పాటయిన రాధా-రంగా మిత్రమండలి నాయకులతో రాధాకృష్ణ సమాలోచనలు జరిపారు. అందరూ ముక్తకంఠంతో రాధా నిర్ణయాన్ని సమర్థించారు. గతంలో రాధాకృష్ణ వర్గంలో ఉన్న పలువురు మాజీ కార్పొరేటర్లు కూడా రాధా బాటనే అనుసరించాలని నిర్ణయించారు. 

రాధా వైఎస్సార్ సీపీలో చేరాలని నిర్ణయించడంతో కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు కూడా ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించారు. 27వతేదీన విజయవాడ వచ్చేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించడంతో ఆ రోజు రాధా పార్టీలో చేరాలని నిర్ణయించారు. దీనికోసం సన్నాహాలు ప్రారంభమ య్యాయి. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఉన్న రంగా అభిమానులందరితో రాధా అనుచరులు సమాలోచనలు సాగిస్తున్నారు. వీరందరూ రాధాతోపాటే జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరనున్నారు. విజయవాడలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాధాతోపాటు పలువురు మాజీ కార్పొరేటర్లు, రాధా-రంగా మిత్రమండలి నాయకులు పాల్గొన్నారు. 

27వ తేదీ గన్నవరం విమానాశ్రయం నుంచి బందర్‌రోడ్డు రాఘవయ్య పార్కు వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తామని, సాయంత్రం విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో పార్టీలో చేరతామని రాధా చెప్పారు. రంగా, వైఎస్ అభిమానులు పలువురు పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నారని, తర్వాత కూడా చాలామంది చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. రంగా అభిమానులందరినీ ఒకే తాటిపైకి తీసుకువస్తానన్నారు. నగరంలో అందరినీ కలుపుకొని పనిచేస్తానని తెలిపారు. 

ఇప్పటికే నగరంలో విడిగా కార్యక్రమాలు చేస్తున్నా, కలిసికట్టుగా చేస్తున్నా.. అందరూ పార్టీ కోసమే చేస్తున్నారని, తాను పార్టీలో చేరిన తర్వాత అందరినీ కలుపుకొని పనిచేయడానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. వంగవీటి మోహనరంగా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేవారని, రాధా అందుబాటులో ఉండరని ఉన్న విమర్శలపై స్పందిస్తూ తాను ప్రజల్లోనే ఉండటానికి సమయం కేటాయిస్తానని పేర్కొన్నారు. 

రంగా స్థాయి అందుకోవడం సాధ్యం కాదని, కొడుకుగా దాన్లో పదోవంతు స్థాయికి చేరినాఆనందమేనని చెప్పారు. నగరంలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రశ్నించినపుడు ఆ విషయం జగన్ ప్రకటిస్తారన్నారు. రంగా, వైఎస్‌లను విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులు వారి ఫోటోలు లేకుండా ఎన్నికలకు వెళ్లాలని రాధా సవాలు విసిరారు.

Jagan payakaraopet tour


జన హృదయ స్పందన

ఎటు చూస్తే అటు వెల్లువలా జనం. ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చి జననేత ప్రసంగాన్ని మనసారా వింటున్న ప్రజానీకం. తమ బాధలను, అందుకు కారణాలను, పరిష్కార మార్గాలను ఆయన విశదీకరిస్తూ ఉంటే ఆసక్తిగా వింటూ, కరతాళ ధ్వనులతో అభినందిస్తున్న అభిమాన జన సందోహం.. మరి వారి అంతరంగంలో కదిలే ఆలోచనలు ఎలా ఉన్నాయి? అందుకు సమాధానం ఇదీ... - న్యూస్‌లైన్ , ఎస్.రాయవరం

బాగా సెబుతున్నాడు...
జగన్‌ను చూడ్డానికొచ్చినా. మా గురించి మాబాగా సెబుతున్నాడు. మా బతుకుల గురించి బాగా తెలిసినట్టు మాటాడతన్నాడు. జగన్ గురించి ఏదేదో సెబుతున్నారు కానీ నమ్మడం లేదు. మమ్మల్ని (మత్స్యకారులను) ఎవరూ పట్టించుకోవడంలేదు. పెభుత్వం నుంచి ఏమీ రావడం లేదు. జగన్ వస్తున్నాడంటే ఊల్లో పండగలా ఉంది. 
- ఎరిపిల్లి భూలోకమ్మ, రేవుపోలవరం 
రాజన్న బిడ్డను సూడాలని..
రాజన్న బిడ్డ వచ్చేడు. ఊల్లో సందడేత్తాంది. జగన్‌ను సూడ్డానికి ఇంట్లో పనులన్నీ పక్కన పెట్టేసినాను. మునుపు మా ఊల్లో ఎన్టీవోడి పార్టీ ఉండేది.. రాజన్న బాబు మంచి పనులతో అంతా జగనే అంటున్నారు. జగన్ వచ్చాడని అంతా సంబరపడతన్నారు. మంచి పనులు చేస్తాడని చెప్తన్నారు. ఎలచ్చన్లంటగదా అందరు జగన్‌కే ఓట్లేత్తారు. 
- బాపనమ్మ, రేవుపోలవరం
అన్నీ ఇత్తాడు...
అంతా జగనేనంటన్నారు. మా ఊల్లకు ఏం జరగలే. అదిగో ఇదిగో అంటన్నారు. మాకేం లేకండా మింగేత్తన్నరు. రాజన్న కొడుకు వచ్చాడుగా ఇక అంతా మంచే జరగతందంటన్నరు. ఊల్లో పించన్లు లేవు, కోటా కార్డుల్లేవు. ఇల్లు లేవు. రాజన్న పెబుత్వం వస్తే అన్నీ వస్తాయంటన్నరు. జగన్ చెప్పాడుగా అన్నీ ఇత్తడు.
- గంగ, కొత్తరేవుపోలవరం

సాయం సేత్తాడు..
ఊళ్లోకి జగన్ వస్తన్నాడని చేపలు అమ్ముకోడానికి ఎల్లలేదు. అంద ర్ని భలే పలకరిత్తన్న డు. మా బతుకులు గురించి బాగా తెలి సినట్టుంది. అన్నీ మాట్టాడతన్నాడు. చాలా మంది వత్తన్నారు కాని ఇలా సె ప్పడం లేదు. అదిసేత్తాం.. ఇది సేత్తాం అనేసి పోతన్నరు. జగన్ అన్నీ సేత్తాడని నమ్మకమేత్తంది.
- పోలమ్మ, కొత్తరేవుపోలవరం 
తండ్రికి తగ్గ తనయుడు
జగన్‌ను ప్రత్యక్షం గా చూడడం ఇదే మొదటిసారి. రాజ శేఖరరెడ్డిగారిని చూశాను.ఇప్పుడు ఆయన కొడుకును కూడా చూడడం ఆనందం కలిగించింది. తండ్రికి తగ్గవాడనిపిస్తోంది. జగన్‌ను చూడడానికి 20 కిలోమీటర్ల దూరం నుంచి మూడు గ్రామాల ప్రజలం వాహనాలు ఏర్పాటుచేసుకుని ఇక్కడకు వచ్చాం.
- బంగారులక్ష్మి, వెంకటాపురం 
జగన్‌తోనే సంక్షేమం
జగన్‌ను చూడడానికి మా ఊరు నుంచి ఆరు వాహనాల్లో స్వయంగా ఇక్కడికి వచ్చాం. రాజన్న చనిపోయాక మాకు సంక్షేమ పథకాలేమీ అందలేదు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ ఆ పథకాలన్నీ మాకు అందుతాయని నమ్ముతున్నాం. రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుంటాం.
- డి.కృష్ణవేణి, లింగరాజుపాలెం

సముద్రం సంభ్రమపడింది.. తీరంలో జన ఘోష విని కెరటాల కరాలతో కేరింతలు కొట్టింది

గంగపుత్రుల సంతోషం చూసి సంబరాలు చేసుకుంది. పల్లె పరుగు తీసింది. మనసున కొలువైన మారాజు మనింటికి వచ్చాడని ఉల్లాసంతో గంతులేసింది. మత్స్యకారుడి మనసు మురిసిపోయింది. ఆటుపోట్ల బతుకున ఆసరాగా నిలబడతానని సాగరం సాక్షిగా చెప్పిన సాహసిని చూసే అవకాశం దక్కుతోందని ఉద్వేగంతో ఉప్పొంగిపోయింది. నెత్తిన ఎండ మండిపోతున్నా, వడగాడ్పులు జోరున వీస్తున్నా.. బంగారమ్మపాలెం నుంచి రాజయ్యపేట వరకు వాడవాడా ఓపిగ్గా నిరీక్షించింది. కష్టాల కడలిలో సాగే జీవితాల్ని గట్టెక్కిస్తానన్న మాట ఇచ్చే మననేత అతడేనని వేల గళాలతో ఎలుగెత్తింది. 

ఓ అయ్య.. ఓ అవ్వ.. ఓ అక్క.. ఓ అన్న.. అక్కడ చెల్లి.. ఇక్కడ తల్లి.. ఆ మూల కదలలేని నిస్సహాయుడు.. ఆ పక్క నిలబడ్డ వృద్ధుడు.. వారేమిటి? వీరేమిటి? అందరి హృదయాల్లో ఉప్పొంగిన ఆదరణ వరదై, వెల్లువై పల్లెలను ముంచెత్తింది. విశ్వసనీయతకు పట్టం కట్టాలన్న జగన్నినాదం ఎదఎదనా ప్రతిధ్వనించింది. 

విశాఖపట్నం, న్యూస్‌లైన్: కడలి అలలు ఉప్పొంగాయి. జన నేతను కళ్లారా చూసేందుకు మత్స్యకార పల్లెలు పరుగులు తీశాయి. చేపల వేటకు సెలవిచ్చి స్వాగతించాయి. ఉదయం నుంచే రోడ్లపై బారులు తీరాయి. భానుడి భగభగలు.. అభిమాన జనం ముందు చిన్నబోయాయి. జనావాసాలైన ఇళ్లు.. జనాలను నెత్తినెక్కించుకుని సేద తీరాయి. అడుగడుగునా.. అభిమానం అక్కున చేర్చుకుంది. ఎంతగానంటే.. రేవుపోలవరంలో ప్రవేశించాక సభాస్థలికి చేరుకునేందుకు గంటకు పైగా సమయం పట్టేంత..! చిన్న కుర్రాడు.. చాలా కష్టపడుతున్నాడని.. ఓ తాత ఆవేదన.. సల్లగుండు నాయనా.. అంటూ అవ్వ ఆశీర్వాదం.. జగనన్నా నీదే విజయమంటూ.. చెల్లెళ్ల అభిమానం.. నీ వెంట మేమున్నామంటూ ఉరకలెత్తే యువత ఉత్సాహం.. పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఎస్.రాయవరం మండలంలోని మత్స్యకార పల్లెలు అభిమానంతో ముంచెత్తాయి.

పల్లెకు పండుగ : పాయకరావుపేటలోని మత్స్యకార గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన నేతను కళ్లారా చూసేందుకు బంధుమిత్ర సపరివార సమేతంగా ఎదురుచూసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయున్ని అక్కున చేర్చుకుంది. ప్రస్తుతం వేట నిషేధమైనప్పటికీ సంప్రదాయ పడవలకు అలాంటి నిబంధనలేమీ లేవు. 

అయినా.. సంప్రదాయ మత్స్యకార కుటుంబాలు చేపల వేటకు విరామమిచ్చాయి. జై జగన్.. జైజై.. జగన్ అన్న నినాదాలతో మారుమోగాయి. పదం కదిపి.. కదం తొక్కు తూ.. పరుగులెట్టాయి. డప్పుల మేళాలు.. ఆనంద నృత్యాలతో సంబరాల వాతావరణాన్ని ప్రతిబింభించాయి. ఓ దశలో ఉప ఎన్నికల్లో పాయకరావుపేట బరిలో నిలిచిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి గొల్ల బాబూరావు కూడా జనాలతోపాటే డ్యాన్స్ చేశారు. 

జన నీరాజనం : కశింకోట ఆర్‌ఈసీఎస్ అతిథి గృహం వద్ద పార్టీ గౌరవాధ్యక్షురాలు, దివంగత మహానేత సతీమణి, తన తల్లి అయిన వై.ఎస్.విజయమ్మ 56వ జన్మదిన వేడుకల్లో పాల్గొని బంగారమ్మపాలెం బయలుదేరారు. అక్కడి నుంచి చిన ఉప్పలాం మీదుగా రేవుపోలవరం చేరుకున్నారు. తర్వాత చిన్న పోలవరం, గుడివాడ కూడలి, గుర్రాజుపేట, చినతీనార్ల, పెద తీనార్ల, దొండవాక, రాజయ్యపేట వెళ్లారు. అడుగడుగునా.. జనాలు రోడ్లపై బారులు తీరారు. 

చాలా చోట్ల జనాలతో రోడ్లు కొలువుదీరాయి. జగన్‌తో కరచాలనం చేసేందుకు యువత పోటీపడింది. బైక్‌లు, ఆటోలు, వ్యాన్లు, కార్లలో ఆయనవెంట ఆప్యాయంగా పరుగు తీసింది. బంగారమ్మపాలెంలో మైకందుకుని మరీ వికలాంగుడైన కాశీరావు జగన్‌పై అభిమానం కురిపించాడు. తనలాంటి వికలాంగుల్ని కన్న తల్లిదండ్రులకు భరోసా నీవేనంటూ.. కొనియాడారు.

మిన్నంటిన కరతాళ ధ్వనులు
జగన్ ప్రసంగం అభిమానుల్లోను, పార్టీ శ్రేణుల్లోను ఆనందం వెల్లువెత్తించింది. అవ్వా...తాతా అంటూ ఆయన పలకరింపునకు జనం పులకించిపోయారు. ఉప ఎన్నికల వెనుకనున్న కుట్రలను ఆయన వివరిస్తుంటే.. అధికార, విపక్షనేతల్ని జనం తిట్టుకున్నారు. దివంగత నేత నింగి నుంచి చూసి గర్వపడేలా సువర్ణపాలన అందిస్తానంటే ఈలలు, కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఎంతమంది, ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా.. రానున్న కాలం మనదేనన్న భరోసాను అభిమానుల్లో క లిగించింది. పూల దండలు, పుష్పగుచ్చాలతో జనాలు ఆదరించారు. ఆయన చెప్పే ప్రతి మాటకూ పులకరించారు. తమ పిల్లల బంగరు భవితకు ఆయన అందించనున్న వరాలను తలచుకుని మరీ మురిసిపోయారు.

పాయకరావుపేట జగన్ రెండో రోజు పర్యటన

వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజైన శుక్రవారం నక్కపల్లినుంచి పర్యటన మొదలవుతుందని పార్టీ సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా పార్టీ కన్వీనర్ గొల్లబాబూరావు వెల్లడించారు. 
ఉదయం నక్కపల్లిలో పర్యటన ప్రారంభం
పాల్తేరులో స్థానిక నేత వెంకటేశ్వరరావు ఇంటిలో అల్పాహారం... అనంతరం ప్రచారం ప్రారంభం 
అంకంపేటలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
కందిపూడిలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
రాజగోపాలపురంలో మహానేత
విగ్రహావిష్కరణ
కుమారపురంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
వెంకటనగరంలో వైఎస్సార్‌విగ్రహావిష్కరణ
రాజవరంలో ఎన్నికల ప్రచారం
కేశవరంలో ప్రచారం
రాంపురంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
ఎస్.నర్సాపురంలో ప్రచారం 

జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐవి అన్నీ ఊహలే

వాస్తవాలతో నిమిత్తం లేకుండా చార్జిషీట్ దాఖలు చేసింది
కంపెనీలు పెట్టుబడులు పెడితే సాయిరెడ్డి పొందిన లబ్ధి ఏముంది..?
పెట్టుబడుల ద్వారా సాయిరెడ్డి లబ్ధి పొందారని ఎక్కడా చెప్పలేదు
ఆయనకు బెయిల్ రాకూడదనే 90 రోజుల్లోపు చార్జిషీట్ దాఖలు చేసింది
వేటిని ఆధారాలు చూపుతున్నారో... ఆ డాక్యుమెంట్లను మాకివ్వడం లేదు
వాటిలో లొసుగులు ఎక్కడ బయటపడతాయోనని సీబీఐ భయపడుతోంది
చార్జిషీట్ తర్వాత కూడా దర్యాప్తా..? మరి ఇప్పటివరకు చేసిందేమిటి..?
భూ కేటాయింపులపై మాత్రమే సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది
భూ కేటాయింపుల్లో సాయిరెడ్డి పాత్రే లేదు
మరి అలాంటప్పుడు ఆయన జైలులో ఎందుకుండాలి..?
హైకోర్టులో వాదించిన సాయిరెడ్డి తరఫు న్యాయవాది
నేడు తీర్పు వెలువరించనున్న న్యాయమూర్తి

హైదరాబాద్, న్యూస్‌లైన్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో విజయసాయిరెడ్డి కీలకవ్యక్తని చెబుతున్న సీబీఐ, అందుకు సంబంధించి నిర్దిష్టమైన ఆధారాలు చూపలేకపోయిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ హైకోర్టుకు నివేదించారు. ఊహల ఆధారంగా ఆరోపణలు చేస్తూ, వాస్తవాలతో నిమిత్తం లేకుండా చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ... అసలు దర్యాప్తు పూర్తయిందో.. లేదో చెప్పే పరిస్థితిలో కూడా లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. జగతి పబ్లికేషన్స్‌లో వివిధ కంపెనీలు వ్యాపార కోణంలో పెట్టుబడులు పెడితే, అందులో విజయసాయిరెడ్డి పొందిన లబ్ధి ఏముందని ఆయన ప్రశ్నించారు. ఆయన లబ్ధి పొందారని సీబీఐ ఎక్కడా చెప్పలేదని కూడా గుర్తు చేశారు. జగతిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు అందుకు ప్రతిఫలంగా భూములు కేటాయించారని ఆరోపిస్తున్న సీబీఐ... అరబిందో, హెటిరో తదితర కంపెనీలకు భూముల కేటాయింపునకు సంబంధించి మాత్రమే చార్జిషీట్‌లో ప్రస్తావించిందని ఆయన తెలిపారు. భూముల కేటాయింపులో సాయిరెడ్డి పాత్ర లేనప్పుడు ఆయన జైల్లో ఉండాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చట్ట ప్రకారం చార్జిషీట్ దాఖలు చేశారంటే దర్యాప్తు పూర్తయినట్లేనని, అయితే సీబీఐ మాత్రం ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదని చెబుతోందని, దీనిని బట్టి సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ అసంపూర్తిదని భావించాలని కోర్టును కోరారు. 

చార్జిషీట్ దాఖలు చేశారు కాబట్టి బెయిల్ పొందేందుకు విజయసాయిరెడ్డి అర్హులని, ఆ మేర కేసు వాస్తవాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విజయసాయిరెడ్డికి బెయిల్ మంజూరు చేసిందని వివరించారు. పలు దేశాలకు లెటర్ ఆఫ్ రొగేటరీ పంపామని సీబీఐ చెబుతోందని... పాకిస్థాన్, దుబాయ్ వంటి దేశాలు అసలు ఈ లెటర్‌ను పట్టించుకోవని, కొన్నేళ్ల తరువాత కూడా కొన్ని దేశాలు ఈ లెటర్‌కు సమాధానం ఇవ్వవని ఆయన చెప్పారు. 2005లో జరిగిన వాటి ఆధారంగా ఏడేళ్ల తర్వాత చేస్తున్న దర్యాప్తులో ఎంత పస ఉంటుందని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభాను గురువారం విచారించారు. మొదట సీబీఐ తరఫున పి.కేశవరావు వాదనలను వినిపించగా, తరువాత విజయసాయిరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ వాదించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి, తీర్పును శుక్రవారానికి వాయిదా వేశారు.

అన్ని డాక్యుమెంట్లను మాకివ్వమనండి...

విజయసాయిరెడ్డిపై పలు ఆరోపణలు చేస్తున్న సీబీఐ, వేటి ఆధారంగా అవి చేస్తున్నారో, ఆ డాక్యుమెంట్లను తమకివ్వడం లేదని సుశీల్‌కుమార్ న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. నిబంధనల ప్రకారం కింది కోర్టును కూడా కోరామని, అయితే చార్జిషీట్‌ను ఇంకా విచారణార్హంగా పరిగణించలేదు కాబట్టి, ఆ డాక్యుమెంట్లు ఇవ్వడానికి వీల్లేదని సీబీఐ అభ్యంతరం చెప్పిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ‘‘ఇప్పుడు హైకోర్టులో కూడా విజయసాయిరెడ్డిపై ఏవేవో ఆరోపణలు చేస్తూ, ఫలానా డాక్యుమెంట్ ఆధారంగా ఈ వివరాలు చెబుతున్నామంటూ కోర్టుకు డాక్యుమెంట్లు ఇస్తున్నారే తప్ప, వాటిని మాకివ్వడం లేదు. మాకు డాక్యుమెంట్లు ఇస్తే అందులో లొసుగులను ఎక్కడ ఎత్తిచూపుతామోనని, తద్వారా వాస్తవాలు ఎక్కడా బయపడతాయోనని సీబీఐ భయపడుతోంది. అందుకే కుంటి సాకులు చెబుతోంది. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు పూర్తిగా వ్యాపార కోణంలో పెట్టాయి. ఇక ప్రీమియంపై సీబీఐ అభ్యంతరాలు చెబుతోంది. ఎంత ప్రీమియంకు వాటాలను కొనాలన్నది సీబీఐ నిర్ణయిస్తుందా? నేను ఓ కారును అమ్ముదామనుకున్నా... దాని ధర రూ.5 లక్షలని చెప్పా. ఆ కారును ఆ రేటుకు కొనలా..? వద్దా..? అన్నది కొనే వ్యక్తి ఇష్టం. ఐదు లక్షలకు కొన్నారు కాబట్టి, అది అన్యాయమంటే ఎలా..? దేనికైనా ఓ పద్ధతి ఉండాలి. ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తే సరిపోదు. సాయిరెడ్డి డెరైక్టర్‌గా ఉన్నప్పుడు జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు వచ్చాయని సీబీఐ చెబుతోంది. ఇదేనా సీబీఐ చేసిన దర్యాప్తు? రికార్డులను చూసి నేను చెబుతున్నా... సాయిరెడ్డి డెరైక్టర్ పదవి నుంచి తప్పుకున్న తరువాతే పెట్టుబడులు వచ్చాయి’’ అంటూ సీబీఐని సుశీల్‌కుమార్ కడిగిపారేశారు.

మీరు దర్యాప్తు పూర్తి చేయకుంటే.. శిక్ష మేం అనుభవించాలా..?

ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేశామా..? లేదా..? అన్న విషయంలో సీబీఐకే స్పష్టత లేదని సుశీల్‌కుమార్ తెలిపారు. కొన్ని సార్లు దర్యాప్తు పూర్తయిందని, మరికొన్నిసార్లు దర్యాప్తు కొనసాగుతోందని చెబుతోందని తప్పుబట్టారు.‘‘ఏ భూములకు సంబంధించి అయితే సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిందో, అందుకు సంబంధించిన జీవోలు జారీ చేసిన అధికారులు, మంత్రుల జోలికి మాత్రం వెళ్లలేదు. వారి గురించి చార్జిషీట్‌లో ఎటువంటి ప్రస్తావన లేదు. భూ కేటాయింపులతో సంబంధం లేని సాయిరెడ్డి గురించి పదే పదే ప్రస్తావించింది. ఈ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో 72 మంది నిందితులు ఉన్నారు. మరి ఇప్పుడు చార్జిషీట్‌లో కేవలం 13 మందిని మాత్రమే నిందితులుగా చూపారు. మిగిలిన వాళ్లు ఎక్కడికెళ్లారు..? అదేమంటే దర్యాప్తు పూర్తి కాలేదని చెబుతున్నారు. ఎంతకాలం దర్యాప్తు చేస్తారు..? వీళ్లు దర్యాప్తు చేస్తున్నంతకాలం నిందితులు జైలులోనే ఉండాలా..? మీరు దర్యాప్తు చేయకుంటే... మేం శిక్ష అనుభవించాలా..? ఇదెక్కడి న్యాయం? ఈ విషయాన్ని హైకోర్టు సీరియస్‌గా తీసుకోవాలి. సాయిరెడ్డికి బెయిలిచ్చిన కింది కోర్టు స్పష్టమైన షరతులు విధించింది. సాయిరెడ్డి తన పాస్‌పోర్ట్‌ను కూడా స్వాధీనం చేశారు. మరి ఆయన ఎక్కడికి పారిపోతారు? ఎవరిని ప్రభావితం చేస్తారు? సాక్ష్యాలను ఎలా తారుమారు చేస్తారు? అంత అవసరం సాయిరెడ్డికి ఏముంది..? సాయిరెడ్డి ఇప్పటికే 104 రోజులు జైలులో ఉన్నారు. మరింతకాలం ఆయన జైలులోనే ఉండాలని సీబీఐ భావిస్తున్నట్లుంది. అంటే వీరు చేసే తప్పులకు మేం జైలులో ఉండాలన్న మాట’’ అని సుశీల్‌కుమార్ కోర్టుకు నివేదించారు.

పెట్టుబడిపెట్టిన వారిని అరెస్ట్ చేయబోం: సీబీఐ

జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారిని అరెస్ట్ చేయబోమని సీబీఐ హైకోర్టుకు నివేదించింది. ఈ మొత్తం కేసులో వారి పాత్రను, ప్రమేయాన్ని విచారణ సమయంలో కింది కోర్టు తేలుస్తుందని వివరించింది. అదే విధంగా చార్జిషీట్‌లో నిందితులుగా ఉన్న ఏపీఐఐసీ రిటైర్డ్ అధికారి వైవీఎల్ ప్రసాద్, అరబిందో కంపెనీ సెక్రటరీ చంద్రమౌళిలను కూడా అరెస్ట్ చేయబోమని తెలిపింది. సాక్ష్యాలను తారుమారు చేసేంత శక్తి సామర్థ్యాలు వారికి లేవని, అందువల్లే వారిని అరెస్ట్ చేయబోమని స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితునిగా ఉన్న బీపీ ఆచార్య మరో కేసుకు సంబంధించి జైలులో ఉన్నందున ఆయనను అరెస్ట్ చేయలేదని వివరించింది. విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా కీలక ఆధారాలు ఉన్నాయని, ఆయనను బెయిల్‌పై తిరగనిస్తే, సాక్ష్యాలను తారుమారు చేస్తారని, సాక్షులను ప్రభావితం చేస్తారని, అందుకే ఆయనకు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని సీబీఐ న్యాయవాది కేశవరావు తెలిపారు. జగతి పబ్లికేషన్స్‌లో నిధుల ప్రవాహం ఇలా జరిగిందంటూ ఓ పెద్ద చార్ట్‌ను ఆయన కోర్టుకు సమర్పించారు. దీనిపై సుశీల్‌కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఆ డాక్యుమెంట్ తమకు ఇవ్వకుండా, దాని ఆధారంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ... వారు కోరిన డాక్యుమెంట్లు ఇవ్వడానికి మీకున్న అభ్యంతరమేమిటని ప్రశ్నించారు. దర్యాప్తు సాగుతున్నందున వాటిని ఇవ్వడం సాధ్యం కాదని, కింది కోర్టులో దరఖాస్తు చేసి తీసుకోవచ్చునని కేశవరావు తెలిపారు. దీనికి సుశీల్ స్పందిస్తూ... సుప్రీంకోర్టులో ఏ డాక్యుమెంట్‌నైనా ముందే అందచేస్తారని, కానీ ఇక్కడ సీబీఐ విచిత్రంగా ప్రవర్తిస్తోందని వివరించారు. డాక్యుమెంట్లు ఇవ్వకుంటే... ఎవరిపైనైతే ఆరోపణలు చేస్తున్నారో వారిని చార్జిషీట్‌నుంచి తొలగించాలని కోరారు. తరువాత కేశవరావు వాదనలు కొనసాగిస్తూ... తదుపరి దర్యాప్తు ఆధారంగా మరిన్ని చార్జిషీట్లు దాఖలు చేస్తామని, మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. ఈ సమయంలో ఆయన కేసు డైరీని కోర్టుకు సమర్పించారు. దీనిపై సుశీల్‌కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చార్జిషీట్ దాఖలు చేశాక కూడా సీబీఐ కేసు డైరీపై ఆధారపడుతోందంటే వారి వద్ద ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉన్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. 

Popular Posts

Topics :