22 April 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

News Maker with Vangaveeti Radha

Written By news on Saturday, April 28, 2012 | 4/28/2012

జగన్ తో కలయిక యాదృచ్ఛికమే: వంశీ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని తాను నిన్న రోడ్డుపై కలుసుకోవడం యాదృచ్ఛకమేనని తెలుగుదేశం పార్టీ నేత వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. ఆయన ఈరోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.ట్రాఫిక్ జామ్ అవడం వల్ల తాను జగన్ ని కలిశానని చెప్పారు. జగన్ పలకరిస్తే తాను నమస్కారం చేశానన్నారు. ఆయనని మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని చెప్పారు. తనకి ఎటువంటి రహస్య ఎజండాలేదన్నారు. ఇతరులతో రాత్రి పూట ఫోన్లలో మాట్లాడే నేతను తాను కాదన్నారు. తన మనసులో ఎటువంటి దురుద్దేశంలేదని స్పష్టం చేశారు. 

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తనకు మంచి మిత్రుడని చెప్పారు. తమ పార్టీలు వేరైనా తాము మిత్రులమన్నారు. పిఆర్ పి నుంచి బయటకు వచ్చిన తరువాత రాధని టిడిపిలోకి తీసుకురావడానికి ప్రయత్నించానని చెప్పారు. అయితే అది సాధ్యంకాలేదన్నారు. నిన్నటి సంఘటన యాదృచ్చికంగానే జరిగిందని వంగవీటి రాధా కూడా ఒక ఛానెల్ లో చెప్పడం తాను చూశానన్నారు. 

తెలుగుదేశం పార్టీ జారీ చేసి నోటీసు తనకి అందలేని చెప్పారు. రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నానని, రెండు రోజుల్లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కలిసి వివరణ ఇస్తానన్నారు. లిఖితపూర్వకంగా వివరణ ఇస్తానని, ఆ వివరాలన్నీ మీడియాకు కూడా తెలుపుతానని చెప్పారు. ఆ తరువాత తమ నేత చంద్రబాబు నాయుడే విషయాన్ని వివరిస్తారని కూడా చెప్పారు. టిడిపిలో తనకు ఎవరితోనూ విభేదాలు లేవన్నారు. టిడిపి నుంచి బయటకు వెళ్లే ఆలోచన లేదని తెలిపారు. తాను ఎప్పటికీ టిడిపిలోనే ఉంటానన్నారు. ఆ పార్టీని వదలవసినంత అవసరం కూడా తనకు లేదన్నారు. 

తాను పరిటాల రవి శిష్యుడినని చెప్పారు. ఆయపై అభిమానంతో తన కుమారునికి ఆయన పేరు పెట్టుకున్నానని, ఆ పేరుని కూడా పరిటాల సునీత పెట్టారని చెప్పారు. ఎవరైనా పిల్లల పేర్లతో రాజకీయాలు చేయరని అన్నారు. మంగలి కృష్ణ తనకు తెలియదని, అతనిని తాను ఎప్పుడూ కలవలేదని చెప్పారు.

IT analysts joined YSR CP

Jagan tour vijayawada

అ‘పూర్వ’ కలయిక

- నగరం జనప్రవాహం
- వేల వాహనాలతో భారీ ర్యాలీ
- రాధాతో పాటు పదిమంది మాజీ కార్పొరేటర్లు, పలువురు నాయకుల చేరిక
- రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్ వెంటే ఉంటా : రాధా
- అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పోర్టు ప్రారంభం
- పేదల ఇళ్ల స్థలాలు గజం రూ. 50కే రిజిస్ట్రేషన్ : జగన్


బెజవాడ జనవాడై మురిసింది.. వైఎస్సార్ సీపీ కేతనమై ఎగసింది.. జగన్నినాదమై ప్రతిధ్వనించింది.. వైఎస్ రాజశేఖరరెడ్డి- వంగవీటి మోహనరంగాలకు జోహారైంది.. దుర్గమ్మ ఆశీస్సులు, కృష్ణమ్మ చల్లని చూపుల నడుమ ఓ అ‘పూర్వ’ కలయికకు వేదికైంది. శుక్రవారం జననేత జగన్‌మోహన్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణకు పార్టీ కండువా కప్పి వైఎస్సార్ సీపీ కుటుంబంలో చేర్చుకున్నారు. తమ తండ్రుల ఆనాటి స్నేహ బంధమే ఈనాటి తమ సోదర సంబంధమైందని వేలమంది అభిమానుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. రాముడికి లక్ష్మణుడిలా తన మాట, బాటే ఎ‘జెండా’గా రాధా ముందుకు సాగుతాడని ఆయన చెప్పారు.

విజయవాడ, న్యూస్‌లైన్ : దివంగత నేతలు వైఎస్ రాజశేఖరరెడ్డి, వంగవీటి మోహన్‌రంగా తనయులు జగన్, రాధాలను శుక్రవారం ఒకే వేదికపై చూసిన జనం పులకించిపోయారు. శుక్రవారం బందరు రోడ్డులోని రంగా విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన సభలో జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వంగవీటి రాధాను పార్టీలోకి చేర్చుకున్నారు.

వీరి కలయికతో నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి, వంగవీటి మోహనరంగాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన రోజులను జనం గుర్తుచేసుకున్నారు. ఇదో అపూర్వ కలయికగా భావించిన అభిమానులు ఆనందోత్సాహభరితులయ్యారు. తొలుత రంగా విగ్రహానికి, స్టేజీ వద్ద ఏర్పాటుచేసిన రాజశేఖరరెడ్డి చిత్రపటానికి జగన్, రాధా పూలమాలలు వేసి పక్కపక్కనే నిలబడగానే అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. జయహో జగన్, జోహార్ వైఎస్సార్, జోహార్ వీఎం రంగా అంటూ నినదించారు. జగన్ నేతృత్వంలో పార్టీలోకి రాధా చేరడం ద్వారా కోస్తా జిల్లాల్లో సరికొత్త రాజకీయ సమీకరణకు నాంది పలికినట్లయింది. ఈ కార్యక్రమానికి కోస్తా జిల్లాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. సభాస్థలి వద్ద రాజన్న.. రంగన్నల అనుబంధాన్ని గుర్తుచేస్తూ ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు కూడా అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. 

రంగా అభిమానుల్ని ఆకట్టుకున్న జననేత ప్రసంగం
’రాధాను నా తమ్ముడులాగా చూసుకుంటా... పార్టీలోకే కాదు నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నా.. రాముడుకు లక్ష్మణుడులాగా... నాకు తమ్ముడులా తోడు నిలబడటానికి వచ్చిన రాధాను చూస్తే, ఆ వేళ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వంగవీటి మోహన్ రంగాల మధ్య ఉన్న అన్నదమ్ముల స్నేహమే గుర్తుకు వస్తోంది’ అని జననేత జగన్‌మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం రంగా అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. 

కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపిన రాధా ప్రసంగం 
త్వరలో జరగనున్న ఉప ఎన్నికలపై రాధా చేసిన ప్రసంగం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించిన కాంగ్రెస్, టీడీపీలతో మాకు పోటీ ఏమిటని ఆయన చేసిన వ్యాఖ్యలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆయనకున్న నమ్మకాన్ని స్పష్టం చేశాయి. ఇది రాబోయే నగరపాలక ఎన్నికలకు టానిక్‌లా పనిచేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. 

గజం రూ. 50కే పేదల స్థలాల రిజిస్ట్రేషన్
పేదల కష్టాలు తీర్చడంలో ఎప్పుడూ ముందుండే మహానేత వైఎస్సార్‌ను గుర్తుచేస్తూ ఆయన తనయుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నగరంపై వరాల జల్లు కురిపించారు. వైఎస్సార్ హయాంలో గజం రూ. 100కే పేదల స్థలాల రిజిస్ట్రేషన్‌కు అనుమతిచ్చారని, ఇప్పుడు అక్కడ గజం రూ. 40 వేల ధర పలుకుతోందని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఆయన దృష్టికి తీసుకురాగా, మరో రెండేళ్లలో స్వర్ణయుగం వస్తుందని, అప్పుడు తాను ఇక్కడి పేదలకు గజం రూ. 50కే రిజిస్ట్రేషన్ చేయిస్తానని ప్రజల హర్షధ్వానాల మధ్య జగన్ ప్రకటించారు. గతంలో మహానేత వైఎస్సార్ కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాల్లో సుమారు 3,500 కుటుంబాలకు ఇదేవిధంగా గజం రూ. 100కే రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించారు. జగన్ ప్రస్తుత హామీతో కొండ ప్రాంతాలు, కరకట్ట, పాయకాపురం వాసులు సుమారు 10 వేల మంది పేద కుటుంబాల వారికి లబ్ధి కలుగుతుందని భావిస్తున్నారు.

జగన్‌ను కలిసిన వంశీ

 జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటన జిల్లాలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. సీమాంధ్ర ప్రాంతంలో ఓ బలమైన సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగలిగిన దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు రాధాకృష్ణ తన అనుచరులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడమేగాక, జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ముఖ్య నాయకులు జగన్ వైపు వచ్చేందుకు మార్గం సుగమం చేసింది.

పార్టీలు, కులాలతో నిమిత్తం లేకుండా కొందరు నాయకులతో రాధాకు సత్సంబంధాలు ఉండటంతో వారంతా ఆయన బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. విజయవాడకు ర్యాలీగా వస్తున్న జగన్‌మోహన్ రెడ్డి, వంగవీటి రాధాను మధ్యలో తెలుగుదేశం పార్టీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్ కలిసి అభినందించడం ఇందుకు సంకేతంగా పరిగణిస్తున్నారు. 

ఇది కాకతాళీయంగా జరిగిందని వంశీ చెబుతున్నప్పటికీ, పరిశీలకులు దీన్ని కొట్టివేస్తున్నారు. వంశీ కూడా వైఎస్సార్ సీపీలో చేరే అవకాశాలున్నాయని కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి శుక్రవారం జరిగిన సంఘటన బలం చేకూర్చుతోంది. ఎంత కష్టపడి పనిచేస్తున్నా.. పార్టీలో వంశీకి తగిన గుర్తింపు లేదని ఆ పార్టీ వర్గీయులే పేర్కొంటున్నారు. 

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నుంచి జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు వరకు వంశీని పార్టీనుంచి సాగనంపే ఉద్దేశంతో పొమ్మనకుండా పొగపెడుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయమై సన్నిహితుల వద్ద పలు సందర్భాలలో వంశీ కూడా తన ఆవేదనను వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది.

వంశీ, గుడివాడ శాసన సభ్యుడు కొడాలి వెంకటేశ్వరరావు (నాని), వంగవీటి రాధా ముగ్గురూ మిత్రులు కావడంతో వారంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. ఇందులో భాగంగానే రాధా శుక్రవారం జగన్‌మోహన్ సమక్షంలో వైఎస్సార్ పార్టీలో చేరారు. మిగిలిన ఇద్దరు కూడా త్వరలో ఆయన బాటను అనుసరించే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. 

రాధా వైఎస్సార్ సీపీలో చేరడం ద్వారా కోస్తాజిల్లాల్లోని తన సామాజికవర్గంలో పెద్ద కదలికను తీసుకువచ్చారు. రాధా ప్రకటనకు ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల తో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో కూడా ఆ సామాజికవర్గం నుంచి సానుకూల స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు రెండువేలకుపైగా చిన్నకార్లు, ద్విచక్రవాహనాల్లో విజయవాడ చేరుకున్న ఆ సామాజిక వర్గీయులు జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, రాధాకు బ్రహ్మరథం పట్టారు.

బాబుపై కేసు నమోదు చేయండి


ప్రచారంలో కులం, మతం ప్రస్తావన తీసుకురాకూడదనే ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించిన టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మీద కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయా లని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు, తిరుపతి రిటర్నింగ్ అధికారి ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. గురువా రం తిరుపతికి వచ్చిన చంద్రబాబు ముత్యాలరెడ్డిపల్లె సర్కిల్‌లో బహిరంగ సభలో మా ట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ నాస్తికుడు, ఆయ ున తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని కూ డా దర్శించుకోలేద’న్నారని, ఈ ప్రసంగం ఒక మతం వారిని రెచ్చగొట్టే విధంగా ఉందని నారాయణస్వామి పేర్కొన్నారు. కోడ్‌ను ఉల్లంఘించిన బాబు మీద కేసు నమోదు చేయాలని కోరారు. 

అధికారుల అవగాహనా లోపంతోనే విగ్రహానికి ముసుగులు: ఎన్నికల నిబంధనల మీద అవగాహన లేక పోవడంతో అధికారులు గురువారం తిరుపతిలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు ముసుగులు వేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలింగ్‌కు 24 గంటల ముందు, పోలింగ్‌స్టేషన్లకు 100 మీటర్ల దూరంలో ఉన్న రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు వేయించాలని ఇటీవల జరిగి ఉప ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్, తిరుపతి రిటర్నింగ్ అధికారి అత్యుత్సాహం చూపుతూ వైఎస్‌ఆర్ విగ్రహానికి మాత్రమే ముసుగులు వేయించి మిగిలిన విగ్రహాలను వదిలేశారని ఆయన ఫిర్యాదు చేశారు.

సీబీఐ అసమర్ధతకు సాయిరెడ్డిని బలిచేస్తారా?

ప్రత్యేక కోర్టులో సుశీల్‌కుమార్ వాదన
ఆయన సాక్షులను బెదిరిస్తారనుకుంటే 
వారులేని ప్రాంతాల్లో ఉండటానికీ సిద్ధం
దర్యాప్తు సాకుతో బెయిల్ ఇవ్వరాదంటే ఎలా?
బెయిల్ ఉత్తర్వుల పునఃపరిశీలనకు సంబంధించి వాదనలు పూర్తి
నిర్ణయం 30వ తేదీకి వాయిదా వేసిన జడ్జి

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు ఎనిమిది నెలలుగా కొనసాగుతోందని, దర్యాప్తును పూర్తిచేయలేని సీబీఐ.... తన అసమర్ధతకు ఈ కేసులో నిందితునిగా ఉన్న విజయసాయిరెడ్డిని బలిచేస్తోందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది కాబట్టి సాయిరెడ్డికి బెయిల్ ఇవ్వరాదని సీబీఐ వాదిస్తోందని, తన చేతగానితనానికి ఆయన్ను శిక్షిస్తే ఎలా అని ప్రశ్నించారు. సాయిరెడ్డికి మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులను పునఃపరిశీలించాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో...ఈ ఉత్తర్వులను సీబీఐ రెండవ అదనపు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బి.నాగమారుతిశర్మ శుక్రవారం విచారించారు. 

సాయిరెడ్డికి గతంలో ఇదే కోర్టు ఇచ్చిన బెయిల్‌ను హైకోర్టు రద్దు చేయలేదని, నిలిపివేస్తూ పునఃపరిశీలన చేయాలని మాత్రమే కింది కోర్టును ఆదేశించిన విషయం సుశీల్‌కుమార్ గుర్తుచేశారు. దర్యాప్తును అడ్డుకుంటారనో, సాక్ష్యాలను మాయం చేస్తారనో, సాక్షులను ప్రభావితం చేస్తారనో సీబీఐ ఆధారాలతో సహా నిరూపించగలిగితే హైకోర్టు సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేసి ఉండేదని చెప్పారు. జగతి పబ్లికేషన్స్‌కు అసెస్‌మెంట్ నిర్వహించిన డెలాయిట్ సంస్థ డెరైక్టర్ సుదర్శన్.. సీఆర్‌పీసీ 164 సెక్షన్ మేరకు ఇచ్చిన వాంగ్మూలాన్ని సీబీఐ హైకోర్టులో ప్రస్తావించిందని, అయితే ఆ డాక్యుమెంట్‌ను చార్జిషీట్‌లో ప్రస్తావించలేదని తెలిపారు. 

చార్జిషీట్‌లో ఆ డాక్యుమెంట్ ఎక్కడుందో చూపాలని సీబీఐ తరఫు న్యాయవాది కేశవరావును ప్రశ్నించగా... ఆయన చూపించేందుకు కొద్దిసేపు ప్రయత్నించి తడబడ్డారు. చార్జిషీట్‌లో ఆ డాక్యుమెంట్ వివరాలు లేకపోవడంతో ఆ విషయాన్ని పక్కనబెట్టి తన వాదనలు కొనసాగిస్తానని చెప్పారు. కాగా ఆ డాక్యుమెంట్‌ను సీబీఐ అధికారులు ఈ రోజు (శుక్రవారం) మెమో రూపంలో సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించారని సుశీల్‌కుమార్ స్పష్టం చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి నిర్ణయాన్ని ఈనెల 30కి వాయిదా వేశారు.

సాయిరెడ్డి తరఫు న్యాయవాది సుశీల్‌కుమార్ వాదనల్లోని ముఖ్యాంశాలు...

జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టిన కోల్‌కతా కంపెనీలు బినామీవని, అవి ఆయా చిరునామాల్లో లేవని అక్కడి ఆదాయపన్ను శాఖ అధికారి 2008-09, 2009-10 సంవత్సరాలకు సంబంధించిన నివేదికలో పేర్కొన్నట్టుగా సీబీఐ చెబుతోంది. అవి కేవలం పెట్టుబడులు పెట్టడానికి మాత్రమే సృష్టించిన సూట్‌కేస్ కంపెనీలని పేర్కొంటున్నారు. ఆదాయపన్ను శాఖ నివేదికను ఎలా పరిగణనలోకి తీసుకుంటారు? ఈ కంపెనీల విషయంలో సీబీఐ ఏం దర్యాప్తు చేసింది ? సీబీఐ అధికారులు అక్కడికి ఎందుకు వెళ్లలేదు ? ఎవరో ఏదో చెబితే అది విని అందుకు సాయిరెడ్డి బాధ్యుడంటే ఎలా? అయినా ఆదాయపన్ను శాఖ నివేదికను ఐటీ ట్రిబ్యునల్‌లో సవాల్ చేశాం. ఆ విషయాన్ని సీబీఐ ప్రస్తావించడం లేదు. ఐటీ ట్రిబ్యునల్ ఆ అంశాన్ని తేల్చేవరకు ఇక్కడ ఆ విషయాన్ని ప్రస్తావించరాదు. 

పెట్టుబడులు పెట్టిన కంపెనీలు లేవంటూ సాయిరెడ్డిని బాధ్యుణ్ణి చేస్తే ఎలా ? పెట్టుబడులు పెట్టింది జగతి పబ్లికేషన్స్‌లో. అయినా లెక్కలు చెప్పని నగదు ఉందంటే దాన్ని ఆదాయంగా భావించి ఆదాయపన్ను శాఖ జరిమానా విధించవచ్చు. అదేం పెద్ద నేరం కాదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని కూడా తెస్తోంది. 

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ల్లో ఉంటే సాక్షులను బెదిరిస్తారని భావిస్తే సాక్షులెవరూ లేని ప్రాంతంలో ఉండేలా ఆదేశాలు జారీ చేయవచ్చు. అభ్యంతరం లేకపోతే ఢిల్లీలో ఉంటారు. దర్యాప్తునకు విఘాతం కల్గించరు. 

2004లో అప్పటి ముఖ్యమంత్రి కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చారంటున్నారు. ఏడేళ్ల తర్వాత 2011లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో హైకోర్టుకు ఫిర్యాదు చేయడం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు వేసిన పిటిషన్లు అవి. అందులో ప్రజా ప్రయోజనం లేదు. రాజకీయంగా లబ్ధి పొందాలనేదే వారి లక్ష్యం. 

సీబీఐని రాజకీయ ప్రత్యర్థులు వాళ్లకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ప్రభుత్వాలు ఏమైనా చేయాలని భావిస్తే అందుకు సీబీఐని ఆయుధంగా వాడుకుంటున్నాయి. ప్రభుత్వాలకు అనుగుణంగా సీబీఐ వ్యవహరిస్తోంది.

హైకోర్టు ఉత్తర్వుల మేరకు సాయిరెడ్డి ఈనెల 23న కోర్టులో లొంగిపోయారు. ఉదయం నుంచి కోర్టులోనే ఉన్నారు. బెయిల్ సందర్భంగా కోర్టు విధించిన ఎటువంటి షరతులను ఉల్లంఘించలేదు. అయినా సీబీఐ డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని కోర్టును కోరారు. బెయిల్‌కు తగు కారణాలు చెప్పలేదని పేర్కొంటూ, వీలైనంత త్వరగా పునఃపరిశీలించి బెయిల్‌పై పునర్విచారణను ముగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. 

ఎప్పుడో వేసే చార్జిషీట్‌ను కూడా ఇప్పుడు ప్రస్తావించి, అన్నిటినీ ఆపాదించి బెయిల్‌ను అడ్డుకోవడం తగదు. 

ఈ కేసులో నిందితులుగా ఉన్న 74 మంది కుట్రపన్నారని చెబుతున్నారు. జగతిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో ఒకరికొకరు తెలియదు. అరబిందోకు హెటిరో వాళ్లు తెలి యదు. హెటిరోకు అరబిందో వాళ్లు తెలియదు. అలాంట ప్పుడు అందరూ కుట్ర చేశారనడానికి ఆధారాలేంటి ? 

సాయిరెడ్డిదే కీలకపాత్ర : సీబీఐ

జగతి పబ్లికేషన్స్‌లో సాయిరెడ్డి 2006 నవంబర్ 14 నుంచి 2007 జూన్ 21 వరకు డెరైక్టర్‌గా కొనసాగారని, తర్వాత డెరైక్టర్‌గా తప్పుకున్నా జగతి పబ్లికేషన్స్ కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించారని సీబీఐ న్యాయవాది కేశవరావు వాదిం చారు. పత్రికారంగంలో లాభాలు రావాలంటే కనీసం ఐదేళ్లు పడుతుందని, సాయిరెడ్డి జగతి పబ్లికేషన్స్ విలువను ఎక్కువగా చేసి చూపి షేర్‌ను రూ.350 చొప్పున విక్రయించి పెట్టుబడులు పెట్టించారని ఆరోపించారు. జగతి పబ్లికేషన్స్‌కు అసెస్‌మెంట్ (2008) చేసిన డెలాయిట్ కంపెనీ ప్రతినిధి ప్రవీణ్‌హెగ్డే విజయసాయిరెడ్డి పేరుతో లేఖ పంపారని, దీన్నిబట్టి చూస్తే డెరైక్టర్‌గా లేకపోయినా సాయిరెడ్డి కీలక బాధ్యతలు నిర్వహించారని తెలుస్తోందన్నారు. బినామీ కంపెనీలను సృష్టించడం వెనుక సాయిరెడ్డి ప్రమేయం ఉందన్నారు.

ధ్యాసంతా జగన్‌పైనేనా!

ప్రభుత్వం పడకే సిందని గవర్నర్ 
నివేదిక ఇచ్చినా పట్టించుకోరేం?
ప్రతిపక్ష నేతగా సర్కారుకు నిలదీయరేం?
ఈ అరాచకపు పాలనలో మీకూ భాగస్వామ్యం ఉందా?
అందుకే ప్రభుత్వంపై విమర్శలు చేయడంలేదా?


హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా పడకేసిందని సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్ కేంద్రానికి నివేదిక ఇచ్చినా ప్రతిపక్ష నాయకుడు ఎన్.చంద్రబాబు నాయుడు మాత్రం అదేమీ పట్టనట్లు జగ న్‌మోహన్‌రెడ్డిపైన నిందలేస్తూ తిరుగుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఆమె శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికొదిలేశారని తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి ఇంతకాలంగా చెబుతూ వచ్చిన విషయాన్నే గవర్నర్ కేంద్రానికీ, కాంగ్రెస్ అధిష్టాన వర్గంలోని పెద్దలకూ ఇచ్చిన నివేదికలో కూడా పేర్కొన్నారని చెప్పారు. 

పరిపాలన పడకేయడంతో రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు... ఇలా ఒక్కరేమిటి అందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. రైతులు పండించిన మిరప, ప్రత్తి పంటలకు గిట్టుబాటు ధరలు లేక, నిల్వ చేసుకునే సౌకర్యం లేక అలమటిస్తున్నారనీ... మార్కెట్లో దళారులు మిర్చి ధర ఉదయం 3,000 రూపాయలుంటే మధ్యాహ్నానికి 1,800 రూపాయలకు తగ్గించేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవీ విరమణ సమయం సమీపిస్తున్న ఉద్యోగులు తమ ప్రమోషన్ తాలూకు ఫైళ్లపై సంతకాలు కాలేదని ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఇంటర్‌బోర్డు గందరగోళ విధానాల వల్ల ఫిజిక్స్ పరీక్షలో లక్ష మంది ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఫెయిల్ అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 6,000 ఫైళ్లు సంతకాలకు నోచుకోకుండా ఉన్నాయంటే రాష్ట్రంలో పరిస్థితి పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణసంకటం అన్న విధంగా ఉందని వాసిరెడ్డి వ్యాఖ్యానించారు. 

బాబూ... నిద్రపోతున్నారా? 

రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉంటే ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నిద్రపోతున్నారా? అని వాసిరెడ్డి పద్మ నిలదీశారు. రాష్ట్రానికి ఆరు లక్షల కోట్ల రూపాయలతో పరిశ్రమలు, లక్షలాది ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొంతకాలం కిందట చెప్పారనీ ఇప్పటివరకూ వాటి ఆనవాళ్లు కూడా లేవనీ చెప్పారు. ఆ పరిశ్రమలెక్కడ? ఆ ఉద్యోగాలెక్కడ? అని ప్రభుత్వాన్ని చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదు? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని పట్టుకుని అడగాల్సిన ప్రతిపక్ష నేత... మరో ప్రతిపక్ష పార్టీ నాయకుడైన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంటే ఈ అరాచకపు పాలనలో చంద్రబాబుకు కూడా భాగస్వామ్యం ఉందనుకోవాలా? అందుకే ప్రభుత్వాన్ని విమర్శించడం లేదనుకోవాలా? అని వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. 

నిజం చెబితే తల వెయ్యి ముక్కలు..

వైఎస్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించే యత్నం 
వైఎస్ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిపై బాబు, ఎల్లో మీడియా విషం 
జగన్‌పై చేసిన వ్యాఖ్యల్ని మంగలి కృష్ణ కోసం చేసినట్లుగా వక్రభాష్యం 
తప్పుచేసి ఉంటే తన కుమారుడిని ఉరి తీయాలని పేర్కొన్న వైఎస్ 
సీబీఐ విచారణకు ఆదేశించనందుకు అసెంబ్లీ నుంచి వాకౌట్ కూడా 
అవన్నీ దాచేసిన బాబు.. కృష్ణను వైఎస్ వెనకేసుకొచ్చారంటూ వక్రభాష్యం 
నిజాలు వదిలి బాబు ఎల్లో మీడియా మిత్రుల తందాన
అసెంబ్లీ రికార్డుల సాక్షిగా బయటపడ్డ బాబు అబద్ధాలు

హైదరాబాద్, సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఇదిగో ఆనాడు మంగలి కృష్ణను వెనకేసుకొస్తూ అసెంబ్లీలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేసిన వ్యాఖ్యలు. కావాలంటే మీరే చూడండి. అమాయకుడని, ముక్కుపచ్చలారని పిల్లాడని ఎలా వెనకేసుకొచ్చారో...?’’ - అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిస్పృహతో రగిలిపోతూ బుధవారం విలేకరుల సమావేశంలో రెండు పేజీల పత్రాలను విలేకరులకు అందజేశారు. ఇక మర్నాడు షరా మామూలే! బాబు మాటల్ని బాక్సులు కట్టి పతాక శీర్షికల్లో పెట్టి మరీ ఎల్లో పత్రికలు పండుగ చేసుకున్నాయి. బాబు తరఫున, తమ తరఫున కావాల్సినంత విషం కక్కేసి సంబరపడిపోయాయి. వై.ఎస్.జగన్ గురించి ఆయన తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చెప్పిన మాటల్ని.. మంగలి కృష్ణ కోసం చెప్పినట్లుగా వక్రీకరించేంత దిగజారుడుతనం చంద్రబాబుది. అసలు అసెంబ్లీలో ఆనాడు వై.ఎస్.రాజశేఖరరెడ్డి చెప్పిందేంటి? ఆయన మరణించారు కాబట్టి.. ఎలాగూ సమాధానం చెప్పుకునే పరిస్థితిలో లేరు కాబట్టి ఇష్టం వచ్చినట్లు బరితెగించేయవచ్చా? జనాన్ని తప్పుదోవ పట్టించొచ్చా? ఈ స్థాయి బరితెగింపు చంద్రబాబుకు తప్ప వేరెవ్వరికైనా సాధ్యమా? ఈ వంచనకిక హద్దూ పద్దూ ఉండదా? ఈ అబద్ధాలకిక అంతూ పొంతూ ఉండదా? అబద్ధాలు పోగేస్తూ.. అధికారంలో ఉండగా తాము నియమించుకున్న వాళ్ల ద్వారా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఎన్నాళ్లిలా? దీన్నేమనుకోవాలి? ఎవరైనా దీన్నెందుకు సహించాలి? వరుస ఓటముల్ని తట్టుకోలేక, మున్ముందు ఎదురుకాబోయే పరాజయాల్ని తలచుకోలేక అంతులేని నైరాశ్యంలో కూరుకుపోయిన చంద్రబాబునాయుడు.. దిగజారలేనంత నైచ్యానికి దిగజారిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అనుకోవచ్చు. మరి దాన్ని పనిగట్టుకుని, సొంత కథనాల్లోనూ చొప్పించేస్తున్న ఈ ఎల్లో మీడియాకేమైంది? పాఠకులంటే ఎందుకంత చులకన? తాము చెప్పింది జనం నమ్మటం లేదని రోజు రోజుకూ రుజువవుతున్నా వాస్తవాన్ని గ్రహించటం లేదెందుకు?

చంద్రబాబు మాటలు.. దానికి వంతగా ఎల్లో మీడియా ప్రచురించిన కథనంలోని నిజానిజాలేంటో మీరే చూడండి... 

అనంతపురంలో 2001లో నాటి అధికార టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవిని హతమార్చటానికి సూట్ కేసు బాంబు అమర్చారనే కేసుపై అదే ఏడాది మార్చిలో అసెంబ్లీలో చర్చ జరిగింది. నాటి హోంమంత్రి దేవేందర్‌గౌడ్ మార్చి 19న ఒక ప్రకటన చేయగా.. దానిపై పలువురు నేతలు మాట్లాడారు. మంగలి కృష్ణ పాత్ర లేదని తనకు కింది స్థాయి పోలీసు అధికారులు చెప్పినట్లుగా పేర్కొన్న వైఎస్.. తన కుమారుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గురించి చెప్తూ.. ‘‘ఒక తండ్రిగా ఈ ప్రభుత్వాన్ని నేను అభ్యర్థిస్తున్నదొక్కటే. నా కుమారుడు తప్పు చేసినట్లయితే శిక్ష వేయండి. మామూలు శిక్ష కాదు. ఉరి తీయండి. నాకేమీ అభ్యంతరం లేదు. కానీ తప్పుడు అభియోగాలు మాత్రం చెప్పొద్దు. ముక్కుపచ్చలారని పిల్లవాడు. 26, 27 సంవత్సరాల వయసున్న పిల్లవాడు. ఇంకా ప్రపంచం అంటే ఏమిటో తెలియని వాడు. వ్యాపారంలో ఎంతో కొంత పైకి వద్దామని ప్రయత్నాలు చేస్తున్నాడు. మీరు ఒక ముద్దాయిగా, ఫ్యాక్షనిస్ట్‌గా చిన్న వయసున్న అతన్ని చిత్రీకరించే ప్రయత్నం చేయటం చాలా తప్పని మనవి చేస్తున్నాను.’’ ఇదీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో యథాతథంగా కొంత భాగం. పలు అంతరాయాల మధ్య ఈ వ్యవహారంపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఇంకా విశేషమేంటంటే దీనిపై చర్చ అనంతరం ఆయన వాకౌట్ కూడా చేశారు. అది కూడా ఎందుకంటే.. ‘‘చంద్రబాబునాయుడు గారూ! కేంద్రంలో మీరు చక్రం తిప్పుతున్న ప్రభుత్వమే ఉంది. రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు. నిజంగా నా తనయుడు తప్పు చేసి ఉంటే శిక్షించండి. నిజానిజాలు తేల్చటానికి దీనిపై సీబీఐ చేత విచారణ జరిపించమని డిమాండ్ చేస్తున్నాం. సీబీఐ విచారణ జరిగితే మీ బండారం బయటపడుతుందన్న కారణంతో దానికి అంగీకరించనందుకు.. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించనందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నాం’’ అంటూ సభ వెలుపలికి వెళ్లిపోయారాయన. అదీ జరిగిన విషయం.

మరి దీనిపై చంద్రబాబు, ఆయన మీడియా చెప్పిన వక్రభాష్యం ఏమిటో తెలుసా?
‘సూట్‌కేసు బాంబుపై అసెంబ్లీలో చర్చ’ శీర్షికతో 2001 మార్చి 19న జరిగిన వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ రెండు పేజీల డాక్యుమెంట్‌ను బుధవారం చంద్రబాబు విలేకరుల సమావేశం సందర్భంగా విడుదల చేశారు. దీన్లో దెందులూరు కృష్ణతో జగన్‌మోహన్‌రెడ్డికి ఎందుకు ముడి పెడుతున్నారో తనకు తెలుసునంటూ వైఎస్ చేసిన వ్యాఖ్యల్ని తొలగించేసి.. ఆ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి గురించి ఆయన చేసిన వ్యాఖ్యల్ని, దెందులూరు కృష్ణ గురించే చేశారని వక్రభాష్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఇక అన్నిటికన్నా ఘోరమేమిటంటే.. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడుతూ... ‘‘ఆయన తప్పు చేసి ఉంటే ఉరితీయండి’’ అన్న వ్యాఖ్యల్ని కావాలని, ఉద్దేశపూర్వకంగా తొలగించి.. తన కుమారుడికి ఏమీ తెలియదని, వ్యాపారంలో ఇపుడిపుడే పైకి వస్తున్నాడని చేసిన వ్యాఖ్యల్ని మాత్రం ఉంచటం. వీటన్నిటితో పాటు చర్చలో భాగంగా నోముల నర్సింహయ్య చేసిన సుదీర్ఘ ప్రసంగాన్ని తొలగించి.. 

‘‘హోంమంత్రి చెప్పిన దాని ప్రకారం జగన్‌మోహన్‌రెడ్డి కూడా అనుమానాస్పద నిందితుడు’’ అని అన్నట్లుగా మాత్రమే పేర్కొన్నారు. దీన్నేమనాలి? బాబు కుట్రకు, దిగజారుడు తనానికి ఇది పరాకాష్ట కాదా? అసలు అసెంబ్లీలో మాట్లాడిన మాటల్ని.. అలా తమకు నచ్చినట్లుగా మార్చుకుని బయటపెట్టే హక్కు చంద్రబాబుకు ఉందా? ఇది అసెంబ్లీని అవమానపరచటం, సభా హక్కుల్ని ఉల్లంఘించటం కాదా? వీటన్నిటికీ జవాబు చెప్పాల్సింది బాబు, ఆయన ఎల్లో మిత్రులే.

వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి గ్రంథి శ్రీనివాస్


భీమవరం నుంచి న్యూస్‌లైన్ ప్రతినిధి: భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన మెడలో కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. దివంగత నేత రాజశేఖర రెడ్డి సువర్ణయుగంలో గ్రంథి శ్రీనన్న ఎంతో ఆత్మవిశ్వాసంతో పనిచేశాడని అన్నారు. ఈ రోజు నుంచి ఆయన భీమవరం నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జిగా ఉంటాడని ప్రకటించారు. నర్సాపురం ఉప ఎన్నికల్లో గ్రంథి శ్రీను, తోట గోపి(తాడేపల్లిగూడెం ఇన్‌చార్జి) క్రియాశీలంగా పనిచేస్తారని చెప్పారు. శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు ఇది మూడో జన్మని, తాను ఉన్నంతకాలం జగన్‌మోహన్‌రెడ్డి వెంట ఉంటానని ప్రమాణం చేశారు. 

ఆయనతోపాటు మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. సభ తర్వాత కృష్ణా జిల్లాకు బయలుదేరిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రకాశం చౌక్ వద్ద నిరాహార దీక్షలు చేస్తున్న అఖిలపక్ష రైతు సంఘాల నాయకులను పరామర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆకివీడులో ఆందోళన చేస్తున్న ఐకేపీ యానిమేటర్లతో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. తమకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని యానిమేటర్లు వాపోయారు. యానిమేటర్లకు రూ.3 వేల వేతనం అందించేలా మన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.

12 జిల్లాలంతటా కోడ్

తాగునీరు, కరువు, ఉపాధి పనులు, ఇన్‌పుట్ సబ్సిడీకి
మినహాయింపు.. అది కూడా ఎన్నికలు లేని నియోజకవర్గాలకే
సీఎం, మంత్రులు అధికార పర్యటనలు చేయరాదు
{పభుత్వ వాహనాలు, హెలికాప్టర్ వినియోగించరాదు
ఎన్నికల జరిగే జిల్లాల్లో ఎటువంటి నియామకాలు చేపట్టరాదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికలు జరగనున్న 12 జిల్లాల అంతటా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) వర్తిస్తుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్పష్టంచేశారు. అయితే తాగునీరు, కరువు, ఉపాధి పనులు, ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీలకు మాత్రం జిల్లా అంతటా కాకుండా ఎన్నికలు జరిగే నియోజకవర్గాలకు మాత్రమే కోడ్‌ను వర్తింపచేసినట్లు వివరించారు. మిగతా అన్ని కార్యకలాపాలకు జిల్లాల అంతటా కోడ్ వర్తిస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం, మంత్రులు, కేంద్ర మంత్రు లు 12 జిల్లాల్లో అధికారిక పర్యటనలు చేయరాదన్నారు. ప్రభుత్వ వాహనాలు, హెలికాప్టర్ వినియోగించరాదని స్పష్టంచేశారు. ఎన్నికల ప్రచారం కోసం మైదానాలను అధికార పార్టీయే కాకుండా అన్ని పార్టీలు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. ఎన్నికలు జరగనున్న 12 జిల్లాల్లో ఎలాంటి ప్రభుత్వ నియామకాలు చేయరాదని తేల్చిచెప్పారు. 

‘అభివృద్ధి పనులకు ఆయా జిల్లాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయరాదు. ఒకవేళ ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడి ఏర్పడి పనులు చేపట్టాల్సి వస్తే.. ఎన్నికల కమిషన్ అనుమతితోనే ఆ పనులు చేయాలి. అధికార పార్టీ ఓటర్లను ప్రభావితం చేయడానికి కూడా పనులు చేపట్టే అవకాశం ఉన్నందున ఈసీ అనుమతి తీసుకోవాలనే నిబంధన విధించాం. ప్రజాపథానికి కమిషన్ నుంచి అనుమతి రాలేదు. అందువల్ల 12 జిల్లాల్లో ఎన్నికలు లేని నియోజకవర్గాల్లో సైతం ప్రజాపథంలో మంత్రులు అధికారికంగా పాల్గొనరాదు. ఎటువంటి పంపిణీలు చేయరాదు’ అని పేర్కొన్నారు.

300 మంది బదిలీ: ఎన్నికలు జరిగే జిల్లాల్లో మూడేళ్ల పాటు అక్కడే పనిచేసిన, అలాగే సొంత జిల్లాకు చెందిన 300 మంది అధికారులు, ఉద్యోగులను బదిలీ చేసినట్లు భన్వర్‌లాల్ తెలిపారు. వీరిలో 12 మంది ఆర్డీవోలు, 120 మంది తహసీల్దార్లు, వంద మంది పోలీసులు ఉన్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లాలో ఇద్దరు ఉద్యోగులు ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఫిర్యాదులపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. వైఎస్సార్ విగ్రహాలకు ముసుగులు వేయాల్సిందిగా ఎటువంటి ఆదేశాలూ జారీ చేయలేదని, విగ్రహాలపై ఇప్పటి వరకు ఎవరి నుంచి ఫిర్యాదులు రాలేదన్నారు. 

పాత తేదీలతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరు-విజయవాడల మధ్య రూ.9 లక్షలు పట్టుకున్నట్లు చెప్పారు. ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులైనవారు మే 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకుంటే వారికి ఓటు హక్కు కల్పిస్తామన్నారు. ఉప ఎన్నికల స్థానాల్లో ఇంటింటివెళ్లి ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నాయా లేదా అని బూత్ స్థాయి అధికారులు విచారిస్తున్నారని, కార్డులు లేని వారికి ఉచితంగా ఇస్తారని భన్వర్‌లాల్ వెల్లడించారు. ఈవీఎంల తొలి స్థాయి తనీఖీలను ఈసీఐఎల్ చేస్తోందని తెలిపారు.

వచ్చే సువర్ణయుగంలో నిర్మించి ఇస్తా.. నేనే ప్రారంభోత్సవం చేస్తా: వైఎస్ జగన్

విజయవాడలో పేదల స్వాధీనంలో ఉన్న స్థలాలను 
వైఎస్ గజం రూ.100కే రిజిస్ట్రేషన్ చేశారు
ఇప్పుడు ఆ స్థలం గజం రూ.40 వేలు పలుకుతోంది
వచ్చే సువర్ణయుగంలో గజం రూ.50కే పేదలకు అందిస్తా
జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
వైఎస్‌కు, వంగవీటి రంగాకు మధ్య ఉన్న అన్నదమ్ముల
స్నేహమే ఇప్పుడు పునరావృతమైందన్న జగన్
తన తండ్రి అభిమానులంతా జగన్ వెంట ఉంటారని 
వంగవీటి రాధా ఉద్ఘాటన
రాధా చేరిక సభకు భారీ ఎత్తున తరలివచ్చిన జనం

విజయవాడ, న్యూస్‌లైన్: త్వరలోనే సువర్ణయుగం వస్తుందని, వచ్చిన రెండేళ్లలోనే బందర్ పోర్టును పూర్తి చేస్తామని, దాన్ని తానే స్వయంగా వచ్చి ప్రారంభిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం విజయవాడ మాజీ శాసన సభ్యుడు వంగవీటి రాధాకృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విజయవాడ రాఘవయ్యపార్కు వద్ద ఏర్పాటు చేసిన సభకు భారీ ఎత్తున హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. బందర్ పోర్టు సాధన కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన జిల్లా బంద్‌లో తమ పార్టీ అగ్రభాగాన ఉండి పోరాడిందన్నారు. ఈ ప్రభుత్వం నిర్మించినా నిర్మించకున్నా.. వచ్చే సువర్ణయుగంలో బందరు పోర్టు కల సాకారమవుతుం దన్నారు. 

విజయవాడ నగరంలో పేదల స్వాధీనంలో ఉన్న ఇళ్ల స్థలాలను దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గజం వంద రూపాయలకే రిజిస్ట్రేషన్ చేశారని, ఇప్పుడు ఆ స్థలం గ జం రూ.40 వేలు పలుకుతోందని, పేదలంతా వైఎస్‌ను గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారని వంగవీటి రాధా చెప్పిన విషయాన్ని జగన్ గుర్తుచేస్తూ.. వచ్చే సువర్ణయుగంలో పేదలకు గజం రూ.50కే అందిస్తానని హామీ ఇచ్చారు.

రాధాను లక్ష్మణుడిలా గుండెల్లో పెట్టుకుంటా: ‘రాధాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకే కాదు, నా తమ్ముడిలా నా గుండెల్లోకి చేర్చుకుంటున్నాను. రాముడికి లక్ష్మణుడి మాదిరిగా రాధాను నా గుండెల్లో పెట్టుకుంటాను. దివంగత నేత వైఎస్‌కు, వంగవీటి రంగాకు మధ్య ఉన్న అన్నదమ్ముల స్నేహమే ఇన్ని సంవత్సరాల తర్వాత పునరావృతమవుతోంది’ అని జగన్ జనం హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకూ జగన్ వెంటే నడుస్తానని రాధా చెప్పారు.

18 సీట్లలో గెలుస్తామని చెప్పే దమ్ము, ధైర్యం ఉందా: రాధా

వచ్చే ఉప ఎన్నికల్లో 18 సీట్లలో గెలిచే దమ్ము, ధైర్యం మీకుందా అని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను వంగవీటి రాధాకృష్ణ నిలదీశారు. చంద్రబాబు, బొత్స రెండో, మూడో సీట్లు వస్తాయంటూ, బరిలోకి దిగకుండానే ఓటమి ఒప్పుకున్నారని, వారితో తమకు పోటీ ఏంటని ప్రశ్నించారు. 1985లో వైఎస్ రాజశేఖరరెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన అండదండలతోనే తన తండ్రి వంగవీటి మోహనరంగాకు సీటు వచ్చిందని, 2004లో అదే వైఎస్ నాయకత్వం కింద పనిచేసే అదృష్టం తనకు వచ్చిందని రాధా చెప్పారు. మళ్లీ 2012లో జగన్‌తో కలిసి పనిచేయడం తనకు ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ పథకాలను నీరుగారుస్తోందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందడం లేదని, ఆరోగ్యశ్రీలో పలు రోగాలను తొలగించారని ఆరోపించారు. ప్రభుత్వంలోని పెద్దలు రాజకీయంగా దిక్కు దివాణం లేకపోవడంతో ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని, వారు ఎయిర్‌లైన్స్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా పనికి వస్తారన్నారు. 

కష్టంలో ఉండేవాడికి కులం, మతం ఉండదని, అదే స్ఫూర్తితో పేదలను వైఎస్ ఆదుకున్నారన్నారు. తన తండ్రి అభిమానులంతా జగన్ వెంట నడుస్తారన్నారు. తన తండ్రి రంగా మరణించి ఇన్నేళ్లు గడచినా వంగవీటి కుటుంబాన్ని ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారని, వారు తమ పట్ల చూపించే ఆదరాభిమానాలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఉంటాయని ప్రకటించారు. మాజీ మంత్రి జక్కంపూడి రామమోహనరావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ విజయవాడలో జనసునామి వచ్చినట్లుందన్నారు. సూర్యచంద్రులతో సహజీవనం చేస్తూ ప్రతిక్షణం ప్రజల మధ్య గడుపుతున్న జగన్ త్వరలో సీఎం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ నాయకులు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.

క్కిరిసిన బెజవాడ


విజయవాడ, న్యూస్‌లైన్: దిక్కులన్నీ దద్దరిల్లేలా జగన్నినాదాలు.. జంక్షన్లన్నీ జామైపోయేలా జనప్రవాహాలు.. కనుచూపు మేర కిక్కిరిసిన రహదారులు.. డప్పుల మోతలు.. యువత కేరింతలు... వెరసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో శుక్రవారం విజయవాడలో పండుగ వాతావరణం నెలకొంది. ఆయన కాన్వాయ్ వెంబడి వరుసగా కార్లు, బైక్‌ల ర్యాలీలతో యువత హోరెత్తించారు. పూలవర్షాలతో మహిళలు అభిమానం చాటుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటన ముగించుకుని జగన్ కృష్ణా జిల్లాలోని కైకలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్, గన్నవరం మీదుగా రాత్రి 6.40 గంటలకు విజయవాడ చేరుకున్నారు. అక్కడ రామవరప్పాడు నుంచి రాఘవయ్య పార్కు వరకు ఆయన ఏడు కిలోమీటర్లు ప్రయాణించేందుకు గంటన్నరసేపు పట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

వంశీని ఆలింగనం చేసుకున్న జగన్: రామవరప్పాడులో జగన్ అడుగుపెట్టగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా అనుచరులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అక్కడ్నుంచి ద్విచక్ర వాహనాలు, కార్లతో భారీ ర్యాలీ ముందుకు సాగింది. ‘జై జగన్.. జోహార్ రంగా’ అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ట్రాఫిక్‌లో యలమంచిలి కాంప్లెక్స్ వద్ద ఆగి ఉన్న టీడీపీ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీని వంగవీటి రాధా జగన్ వద్దకు తీసుకొచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డి.. వంశీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. కుశల ప్రశ్నలు అడిగారు. ఇది విజయవాడ టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎక్కడి వాహనాలు అక్కడే..

జగన్ పర్యటన సందర్భంగా గన్నవరం మీదుగాా విజయవాడ వరకు జాతీయ రహదారి కిక్కిరిసింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. అందరి దృష్టీ జననేతపైనే. అన్ని బాటలూ ఆ వంకే. అందరి తాపత్రయం ఆయనతో కరచాలనం చేయాలనే. వారందరికీ అభివాదం చేస్తూ అడుగడుగునా అడ్డుపడుతున్న అభిమాన జల్లుల్లో తడుస్తూ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సాగింది. ఆయన కాన్వాయ్ వెళ్లేంతవరకు నగరంలో పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిపేశారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు మధ్యాహ్నం మూడు గంటలకే విజయవాడకు తరలివచ్చి జగన్నినాదాలతో హోరెత్తించారు.

Vangaveeti Radha Krishna Joined in YSR Congress:Jakkampudi Vijayalakshmi

Written By news on Friday, April 27, 2012 | 4/27/2012

Vangaveeti Radha Speech

జగన్ తో వల్లభనేని వంశీ భేటీ

విజయవాడ టీడీపీలో మార్పులు చోటు చేసుకుంటాయా? పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తున్నాయి. విజయవాడ నగర టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వంశీ.... YSR కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను కలిశారు. అశేషంగా తరలివచ్చిన  అభిమానులు, కార్యకర్తలతో రామవరప్పాడు నుంచి విజయవాడ వస్తున్న జగన్‌కు  ... బెంజ్‌ సర్కిల్‌ దగ్గర వల్లభనేని వంశీ ఎదురయ్యారు.  జగన్‌ను చూడగానే... కారు దిగి వచ్చి జగన్‌ను పలకరించారు. వంగవీటి రాధా స్వయంగా వంశీని జగన్‌ దగ్గరకు తీసుకువచ్చారు.  జగన్‌ను  అప్యాయంగా ఆలింగనం చేసుకున్న వంశీ.... దాదాపు రెండు నిమిషాలు సేపు మాట్లాడారు. ఒక్కసారిగా చోటుచేసుకున్న  ఈ పరిణామం విజయవాడ వాసుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది.  ఇద్దరి భేటీని  భారీ ర్యాలీ ఉన్న ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా గమనించారు.  ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని....  అందరూ చర్చించుకున్నారు. వంశీ కూడా త్వరలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరడం ఖాయమనే ఊహాగానాలు  వినిపించాయి.  మరో వైపు   టీడీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై గత కొంత కాలంగా వల్లభనేని వంశీ అలకతో ఉన్నారు.  దేవినేని ఉమామహేశ్వరరావుతో  వంశీకి సరిపడటం లేదు. నగర అధ్యక్ష పదవికీ రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. 

Vangaveeti Radha Krishna Joined in YSR Congress

YS Jagan Rally at Vijayawada

Vallabhaneni Vamsi met YS Jagan at Vijayawada

బెజవాడలో జనసునామీ

ఇద్దరు యువనేతల కలయికతో బెజవాడలో జనసునామీ వచ్చిందని జక్కంపూడి విజయలక్ష్మీ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సమక్షంలో ఈరోజు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ లాగే ఈరోజు జగన్ ప్రజల కష్టాలు తెలుసుకున్నారని చెప్పారు. జగన్ ని బయటకు పంపినందుకు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు లెంపలేసుకుంటున్నారన్నారు.


ఏలూరు: నరసాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తొలివిడత ఉపఎన్నికల ప్రచారం ముగిసింది. ఆకివీడులో సమ్మె చేస్తున్న ఐకేపీ యానిమేటర్లతో జగన్ మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే 3 వేల రూపాయల జీతం ఇస్తామని ఐకేపీ యానిమేటర్లకు జగన్ హామీ ఇచ్చారు.

విజయవాడలో జగన్ కు అపూర్వస్వాగతం

నగరానికి చేరుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి ఏలూరు రోడ్డులో ఘనస్వాగతం లభించింది. జగన్ రాక సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో జగన్ కు అపూర్వ స్వాగతం పలికారు. భారీగా బాణాసంచా కాల్చారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఈరోజు జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందున జనం భారీ సంఖ్యలో కదలివచ్చారు. భారీ ఎత్తున బైకు ర్యాలీ నిర్వహించారు. విజయవాడ రహదారులు జనంతో కిక్కిరిసిపోయాయి. జై జగన్ అన్న నినాదాలతో హొరెత్తింది. నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. 

బిసెంట్ రోడ్డులోని దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహానికి జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. రాధా మెడలో జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

జగన్ తోనే రంగా అభిమానులు: వంగవీటి రాధ

తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం దివంగత వంగవీటి రంగా అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డితోనే ఉంటారని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ చెప్పారు. జగన్ సమక్షంలో రాధ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ కుటుంబాన్ని జనం మరచిపోరన్నారు. వైఎస్ఆర్ ఈ రాష్ట్రంలో ఎంతోమందిని ఆదుకున్నారని గుర్తు చేశారు.

ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ పథకాలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు వైఎస్ఆర్ గజం 100 రూపాయలకు ఇంటి స్థలం ఇచ్చారని తెలిపారు. ఇప్పడు ఆ స్థలం గజం 45 వేల రూపాయలు అయిందన్నారు. 'మీ పాలనలోనే బందరు పోర్టు నిర్మాణం జరగాలి' అని రాధ జగన్ ని కోరారు. 

ఆనాడు తన తండ్రి వంగవీటి మోహన రంగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా ఉండగా 1985లో ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు. 2004లో తనకు ఆయన ఆధ్వర్యంలో పనిచేసే భాగ్యం లభించిందన్నారు. తమ కుటుంబాన్ని నాయకులు మోసం చేశారు గానీ, జనం ఎప్పుడూ తమని అంటిపెట్టుకొని ఉన్నారని తెలిపారు. 

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా సభకు హాజరయ్యారు.

రాధని తమ్ముడిలా గుండెల్లో చేర్చుకుంటా:జగన్


మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున తన అభిమానులతో తరలివచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తమ్ముడిగా రాధని పార్టీలో చేర్చుకుంటున్నట్లు ప్రకటించారు. రాముడు లక్ష్మణుడిని ఏ విధంగా చూశారో అదేవిధంగా రాధని తను గుండెల్లో పెట్టుకుంటానని చెప్పారు. వంగవీటి మోహన రంగా, వైఎస్ఆర్ మధ్య ఉన్న స్నేహమే ఈరోజు తమని కలిపిందన్నారు. వారి స్నేహం తమతో పునరావృతం అయిందన్నారు.

బందరు పోర్టు కోసం నిర్వహించే ఆందోళన కార్యక్రమాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగా ఉంటుందని తెలిపారు. ఒక వేళ ఈ ప్రభుత్వం బందరు పోర్టుకు అనుమతి ఇవ్వకపోతే తాము అధికారంలోకి రాగానే రెండేళ్లలో పోర్టు నిర్మాణం పూర్తి చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. నాన్న పేదవాడికి గజం స్థలం 100 రూపాయలకే ఇచ్చారు. ఆ స్థలం ఇప్పుడు 45 వేల రూపాయలు అయింది. రాబోయే సువర్ణయుగంలో గజం స్థలం 50 రూపాయలకే ప్రతి పేదవానికి ఇస్తామని చెప్పారు. ఈ ఆప్యాయతలకు ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేనన్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున జనం తరలి వచ్చారు.

జగన్ ని కలిసిన వల్లభనేని వంశీ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని తెలుగుదేశం పార్టీ నేత వల్లభనేని వంశీ కలిశారు. విజయవాడ చేరుకున్న జగన్ ని బెంజి సర్కిల్ వద్ద ఆయన ఆప్యాయంగా పలకరించారు.

Mind block to Somi Reddy and Chandrababu: Ambati

Mahaneta YSR

కొత్తమలుపు తిరగనున్న బెజవాడ రాజకీయం

విజయవాడ: బెజవాడ రాజకీయాలు కొత్త మలపు తిరగనున్నాయి. సంచనాలకు కొదవలేని బెజవాడ మరో రాజకీయ సంచలనానికి వేదిక కానుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి సమక్షంలో వంగవీటి రాధా చేరిక కృష్ణా జిల్లాతోపాటు కోస్తా జిల్లాలను ప్రభావితం చేయనుంది. జనహితమే పరమావధిగా పుట్టిన వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌లోకి మరో యువకిరణం చేరబోతుంది. కోస్తా
రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన రంగా వారసుడిగా రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి వస్తున్నారు. రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి రానుండటం టిడిపి, కాంగ్రెస్‌ పార్టీల్లో పెద్ద చర్చకే దారి తీసింది. పీఆర్‌పీ కాంగ్రెస్‌లో విలీనమైన తర్వాత, చిరంజీవితోపాటు కాంగ్రెస్‌లోకి వెళ్లని పీఆర్‌పీ శ్రేణులు రాధా వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి రానున్నాయి. ఏప్రిల్‌ 27న జగన్ విజయవాడ రానున్న నేపథ్యంలో ఆయన సమక్షంలో రాధా వైఎస్ఆర్ కండువా వేయించుకోనున్నారు. ఆయన చేరిక కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలుకుతామని రంగా అభిమానులు అంటున్నారు.


శుక్రవారం సాయంత్రం జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వస్తున్న జగన్‌ మధ్యాహ్నం 3 గంటల సమయంలో హనుమాన్ జంక్షన్‌ నుంచి బయల్దేరి విజయవాడ చేరుకుంటారు. ఆ తర్వాత రామవరప్పాడు నుంచి బైక్‌ ర్యాలీ ప్రారంభమవుతుంది. బెంజిసర్కిల్‌ మీదుగా బీజెంట్‌ రోడ్‌ వరకు ర్యాలీ జగన్‌ను అనుసరిస్తుంది. రంగా విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన వేదికపై రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి చేరుతారు.


బందర్‌ పోర్టు సాధన కోసం రేపు అఖిలపక్షం బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే ఐదవ నంబర్‌ జాతీయ రహదారిపైనే బైక్‌ ర్యాలీ జరగనుండటంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Vasireddy Padma Comments on Chandrababu

గవర్నర్ నివేదికపై బాబు నోరుమెదపరే: పద్మ


రాష్ట్రంలో పాలన లేదన్న గవర్నర్ నివేదికపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నోరుమెదపరేం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ప్రజాసమస్యలు పట్టవా? అని అడిగారు. ప్రభుత్వానికి రైతుల పట్ల కనీసం దయకూడా లేదన్నారు. రాష్ట్రంలో దాదాపు 600 ఫైళ్లు పెండింగ్లో ఉన్నట్లు గవర్నర్ కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసిందన్నారు. ఉపఎన్నికల తర్వాత రాష్ట్రపతి పాలనే గత్యంతరమని కూడా గవర్నర్ తన నివేదికలో తెలిపినట్లు ఆమె చెప్పారు. 

ప్రభుత్వాన్ని చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అరాచకపాలనలో చంద్రబాబుకు భాగస్వామ్యం ఉందా? అని కూడా ఆమె అడిగారు.


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి గ్రంధి శ్రీనివాస్

భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ కండువా కప్పి గ్రంథి శ్రీనివాస్ ను పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ఆర్ లోని లక్షణాలు జగన్ లో చూశానని....అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. పార్టీ అభివృద్థికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, బాలరాజు తదితరులు హాజరయ్యారు.

'కాబోయే సిఎం జగనేనని ఒప్పుకున్న సోమిరెడ్డి'

కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డేనన్న వాస్తవాన్ని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ఒప్పుకున్నారని, అందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. కోవూరులో ఓటర్ల దెబ్బకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, సోమిరెడ్డిలచిన్నమెదడు చితికిపోయిందన్నారు. 18 స్థానాల్లో జరిగే ఉపఎన్నికల ఫలితాల తర్వాత వాళ్లిద్దరూ మారువేషాల్లో తిరగాల్సిందేనని ఎద్దేవా చేశారు. లేకపోతే సొంతపార్టీ వారే వారిని చెప్పులతో తరిమి కొడతారని హెచ్చరించారు.

Special Edition "Dharmayuddam" 27th April 2012

jagan compaign

Jagan narasapuram tour

‘చెయ్యి ఊపి వెళ్లిపోయే నాయకుల్నే చూశాం’


మండావారిపేట (నరసాపురం టౌన్), న్యూస్‌లైన్: ‘అన్నా..! చెయ్యి ఊపి వెళ్లిపోయే నాయకులనే ఇప్పటివరకూ చూశాం. మనిషి కనిపించగానే దగ్గరకు వచ్చి ఆప్యాయంగా పలకరించి జనం కష్టాలను అడిగి తెలుసుకుంటున్న నాయకుణ్ణి నిన్నే చూస్తున్నామన్నా’ అంటూ పలువురు మహిళలు, యువతులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానాన్ని చూపించారు. ‘అన్నా.. నువ్వే ముఖ్యమంత్రి కావాలి. మా కష్టాలు తెలిసిన నువ్వు సీఎం అయితేనే మా రోజులు బాగుంటాయి’ అని పేర్కొన్నారు. నరసాపురం మండలంలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజైన గురువారం జగన్‌మోహన్‌రెడ్డి సర్దుకొడప నుంచి రోడ్ షో నిర్వహించారు. మండావారిపేటలో మహిళలు, యువతులు పెద్దసంఖ్యలో ఆయన కోసం వేచివున్నారు. ఇటీవల టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు ఈ ప్రాంతంలో పర్యటించారు. జనాన్ని చూసి చెయ్యి ఊపుతూ వెళ్లిపోయారు.

జగన్‌మోహన్‌రెడ్డి కూడా అలాగే వెళ్లిపోతారని అక్కడి వారంతా అనుకోగా, ఆయన మాత్రం ఎవరు కనిపించినా కారు దిగి దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. దీంతో వారి ఆనందం అవధులు దాటింది. అక్కడున్న ప్రతి ఒక్కరితో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. దేవిని వెంకటరత్నం అనే వృద్ధురాలు మాట్లాడుతూ తనకు ప్రభుత్వం ఇచ్చే అభయహస్తం పింఛను రూ.500 సరిపోవడం లేదని తెలిపింది. ఏమని ధనలక్ష్మి అనే మహిళ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదని నిట్టూర్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు తమకు ఎలాంటి ఆందోళన ఉండేది కాదని పాలా లక్ష్మి చెప్పింది. వారి కష్టాలను విన్న జగన్‌మోహన్‌రెడ్డి ‘అందరికీ మంచి రోజులు వస్తాయి. వైఎస్ నాటి స్వర్ణయుగం త్వరలోనే వస్తుంది’ అంటూ వారిలో ధైర్యం నింపారు. దీంతో మహిళలు ‘అన్నా.. నువ్వే ముఖ్యమంత్రి కావాలి’ అంటూ నినాదాలు చేశారు. దీనికి జగన్‌మోహన్‌రెడ్డి చిరునవ్వుతో స్పందిస్తూ... ‘వెళ్లొస్తా అవ్వ.. వెళ్తున్నా చెల్లెమ్మలు తమ్ముళ్లూ అంటూ ముందుకు కదిలారు. 


‘‘రోడ్‌షో అంటే రెండు వేళ్లు చూపిస్తూ వడివడిగా ముందుకు వెళ్లిపోవడం కాదు.. ఎన్నికల ప్రచారమంటే చేయి ఊపుతూ సరిపెట్టడం కాదు’’

* * ప్రజాసమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగిన జననేత జగన్
* * ఉప్పు రైతుకు గొప్ప భరోసా
* * మత్స్యకారులు, గీత కార్మికులకు కొండంత అండ
* * అధికారం చేపట్టిన ఏడాదిలో వశిష్ట వారధి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ
* * పిల్లలను బడికి పంపితే తల్లిదండ్రులకు పారితోషికం

‘‘రోడ్‌షో అంటే రెండు వేళ్లు చూపిస్తూ వడివడిగా ముందుకు వెళ్లిపోవడం కాదు.. ఎన్నికల ప్రచారమంటే చేయి ఊపుతూ సరిపెట్టడం కాదు’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త ఒరవడికి నాంది పలికారు. నాయకుడంటే జనం మధ్యకు వెళ్లాలి.. జనం సమస్యలు తెలుసుకోవాలి.. జనం కోసం పనిచేస్తామన్న నమ్మకాన్ని కలిగించాలి..అనే రీతిలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలకు భిన్నంగా అచ్చమైన నాయకుడిలా ఆయన జనతరంగం వెన్నంటి రాగా ముందుకు సాగారు. నరసాపురం నియోజకవర్గంలో మలివిడత పర్యటనలో రెండో రోజు గురువారం తీరగ్రామాల్లో ఆయన విస్తృతంగా రోడ్ షోలు నిర్వహించారు. మత్స్యకారుల కష్టాలను తెలుసుకుంటూ.. గీత కార్మికులను పలుకరిస్తూ.. ఉప్పు కార్మికులకు భరోసా ఇస్తూ.. మహిళలు, విద్యార్థుల్లో ఆత్మస్థయిర్యం నింపుతూ ఆయన యాత్ర సాగించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ఊరూరా కలయతిరుగుతూ అన్ని వర్గాల ప్రజలను పలకరిస్తూ సాగిం చిన రోడ్‌షోలకు జనం వెల్లువలా తరలివచ్చారు. మారుమూల పల్లెల్లో సైతం రోడ్లు జనంతో కిటకిటలాడాయి. వాడవాడలా పండుగ వాతావరణం నెలకొంది.

నరసాపురం/ నరసాపురం రూరల్, న్యూస్‌లైన్ : నరసాపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సాగించిన పర్యటనలో ప్రజలను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన ప్రాధాన్యతను ఆయన వివరించారు. ఆయన పర్యటన ఆవశ్యకతను ఉత్సాహం నింపడంతో పాటు ఇటు ప్రజల్లో పార్టీపై నమ్మకాన్ని మరింత పెంచింది. నరసాపురం మండలం సర్దుకొడప గ్రామంలోని తిరుమాని వడ్డికాసులు నివాసం నుంచి జగన్‌మోహన్‌రెడ్డి రెండోరోజు ఎన్నికల పర్యటనను ప్రారంభించారు. తొలుత మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామజోగయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతూ రూపొందించిన కరపత్రాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కన్వీనర్ కొయ్యే మోషేన్‌రాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పాతపాటి సర్రాజు తదితరులు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మాట్లాడారు. 

అనంతరం అదే గ్రామంలో పక్షవాతంతో బాధపడుతున్న వృద్ధురాలిని జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ‘‘అవ్వా.. నీలాంటి వాళ్లందర్నీ ఆదుకునేందుకే నేను రాజకీయాల్లోకి వచ్చాను’’ అంటూ ఆయన భరోసా ఇచ్చారు. ‘‘బాబా నువ్వు సీఎం కావాలి.. నా లాంటి వాళ్ల కష్టాలు తీరాలి’’ అంటూ వృద్ధురాలు దీవించింది. గీత కార్మికులను కలిసి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అన్నా.. రోజంతా కష్టపడితే ఎంత సంపాదిస్తారన్నా.. కుటుంబ పోషణకు అది సరిపోతుందా.. అంటూ గీత కార్మికుల యోగక్షేమాలను జగన్‌మోహన్‌రెడ్డి తెలుసుకున్నారు. గీత వృత్తిపై ఆధారపడిన తమలాంటి వారెందరో జీవనోపాధి లేక రోడ్డున పడుతున్నారని గీత కార్మికులు ఆయనకు వివరించారు. గీత కార్మికులను ఆదుకునేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. కరింశెట్టివారిపాలెం, తూర్పుతాళ్లు గ్రామాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికారు. పింఛన్లు, రోడ్లు, మంచినీరు, కరెంటు సమస్యలను వారు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. బండారువారిపేటలో వైఎస్, అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించిన ఆయన చర్చిలో ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం కనకదుర్గ ఆలయంలో కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. పెదమైనవానిలంకలో ఉప్పు మడులను పరిశీలించారు. 

తూర్పుతాళ్లు సెంటర్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. చామకూరిపాలెంలో రోడ్‌షో నిర్వహించిన జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక నాయకుడు బొక్కా రాధాకృష్ణ నివాసానికి వెళ్లి అక్కడ పార్టీశ్రేణులతోను, ఆ ప్రాంత ప్రజలతోను మాట్లాడారు. చామకూరిపాలెం మెరకలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎల్బీచర్లలో జరిగిన సభలో ప్రజలనుద్దేశించి ఆయన చేసిన ప్రసంగానికి విశేష స్పందన లభించింది. జీవనోపాధి కోసం సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారులు ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్యాబిడ్డలు ఎంత తల్లడిల్లుతారో తనకు తెలుసునని, అటువంటి బాధాకరమైన సందర్భంలో ఆ కుటుంబాలకు రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. దానిలో రూ.50 వేలు వారం రోజుల్లో అందించి మిగిలిన రూ.4.50 లక్షలు ఆరు నెలల్లో అందిస్తానని ప్రకటించారు.

ఇది నాకు చాలెంజ్..
చిన్నారులు చదువుకు దూరంగా.. కుటుంబ పోషణకోసం కూలి పనులు చేస్తున్న సంఘటనలు తన హృదయాన్ని కదిలించివేస్తున్నాయని, అటువంటి వారికి ఏదో రకంగా మేలు చేయాలన్న ఆలోచన తనకు ఉందని ఆయన ప్రకటించడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. పిల్లలను బడికి పంపించే తల్లిదండ్రులకు తాను ఒక భరోసా ఇస్తానని ఆయన ప్రకటించారు. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే వారిని బడికి పంపితే చాలని, వారి తల్లిదండ్రులకు నెలకు రూ.వెయ్యి చొప్పున పారితోషికాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు చేయాల్సిందల్లా పిల్లలను బడికి పంపడమేనని, వారికి సర్కారు బడుల్లోనూ ఇంగ్లిషు చదువులు చదివించి డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లుగా తీర్చిదిద్దే బాధ్యతను తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇది నిజంగా తనకు పెద్ద చాలెంజ్ అని, ఇది అమలు చేయగలిగితే స్వర్గంలో ఉన్న తన తండ్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆనందిస్తారని జగన్‌మోహన్‌రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఇటువంటి మంచి కార్యక్రమాల ద్వారా తన తండ్రి మాదిరిగా ప్రజల గుండెల్లో గూడు కట్టుకుంటానని ఆయన ప్రకటించారు. తాను అధికారం చేపట్టిన ఏడాదిలోగా నరసాపురం - సఖినేటిపల్లి వశిష్ట వారధిని పూర్తి చేసి చూపిస్తానని ఆయన ప్రకటించడంతో ప్రజలు కరతాళధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. 

ముందు జిల్లా నేతలు.. జనంతో జగన్
నరసాపురం నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన రోడ్‌షో సందర్భంగా జనంతో జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు కదిలారు. ఆయన పర్యటించిన ప్రాంతాల్లో ట్రాక్టర్ ట్రక్కునే వేదికగా చేసుకుని జిల్లా నేతలు ప్రసంగాలు చేసి ప్రజలను ఉత్తేజితులను చేశారు. జిల్లా పార్టీ కన్వీనర్ కొయ్యే మోషేన్‌రాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు పాతపాటి సర్రాజు, మోచర్ల జోహార్‌వతి, పార్టీ నాయకులు అందే భుజంగరావు, మైల వీర్రాజు, వంగలపూడి ఏషయ్య, కావలి వెంకటరత్నంనాయుడు (నాని), డీఎస్‌ఎస్ సాయినాథ్ ప్రసాద్, పీడీ రాజు, దొంగ గోపాలకృష్ణ (గోపి), పాలంకి ప్రసాద్, పట్టా రజనీకుమారి తదితరులు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిణామాలను వివరించడంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటూ ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా అందే భుజంగరావు, మరికొందరు నేతలు చిరంజీవి, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, కొత్తపల్లి సుబ్బారాయుడులపై ఘాటైన విమర్శలు చేశారు. సామాజిక న్యాయం చేస్తానంటూ సొం త సామాజికవర్గాన్నే రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీసి సొంత లాభం చూసుకున్న చిరంజీవిని జనం నమ్మే పరిస్థితిలో లేరని వారు ఎద్దేవా చేశారు. 

చేరికలతో మరింత ఊతం..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ బలం రోజురోజుకు పెరుగుతోంది. పార్టీలో చేరుతున్న ఇతర పార్టీల నాయకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గురువారం పాలకొల్లుకు చెందిన పీఆర్పీ నాయకుడు ఆకెన వీరాస్వామి (అబ్బు), ఉల్లంపర్రు మాజీ సర్పంచ్, మండల టీడీపీ మాజీ అధ్యక్షురాలు పాశర్ల తులసి, ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బి.వెంకటేశ్వరరావు, పువ్వాడ అజయకుమార్ (ఖమ్మం), కర్నూలు జిల్లా నందికొ ట్కూరుకు చెందిన పీఆర్పీ నాయకు రాలు మాదారపు రేణుకమ్మ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Popular Posts

Topics :