03 June 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రామోజీ, బాబులకు విజయసాయి లీగల్ నోటీసులు

Written By news on Saturday, June 9, 2012 | 6/09/2012

 ఈనాడు గ్రూపుల అధినేత రామోజీ రావు, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావులకు ఆడిటర్ విజయసాయి రెడ్డి లీగల్ నోటీసులు ఇచ్చారు. తమ పరువుకు భంగం కలిగించే విధంగా ఈనాడులో తప్పుడు కథనాలు వచ్చాయని ఆయన తెలిపారు. చంద్రబాబు, దాడి వీరభద్ర రావులు చేసిన నిరాధారమైన ఆరోపణలు ఆ పత్రికలో వచ్చాయని ఆ లీగల్ నోటీసులలో పేర్కొన్నారు.

Purshottam Reddy predicts YSRC’s victory in by-polls

Hyderabad, June 9 : Congress party senior leader Uppunutala Purushottam Reddy on Saturday predicted that the YSR Congress party would win all the 18 Assembly constituencies with a huge majority.
Talking to media persons here, Purshottam Reddy also predicted that the Jagan Mohan Reddy would win 200 Assembly constituencies in 2014 general elections. He condemned those leaders, who praised former chief minister Y S Rajasekhara Reddy while he was in power and now targeting him. He also condemned dilution of YSR's welfare schemes and programmes attributing financial constraints.
Purushottam Reddy said that the ruling Congress party and opposition Telugu Desam party have lost people’s confidence and failed miserably to address people’s problems. He said that the Congress lost its importance due to Chief Minister N Kiran Kumar Reddy’s style of functioning while Telugu Desam leader N Chandrababu Naidu lost confidence of the people for his failure to act as a responsible opposition leader in the Assembly.
The Congress leader said that the prospects of YSR Congress party would not be affected even if the Congress and TDP secretly join hands with each other. 

Ambati Response on Kola Krishna Mohan allegation on Babu

Kola Krishna Mohan Expose Other Side of Chandrababu

Kola Krishna Mohan Expose Other Side of Chandrababu

చంద్రబాబు గుట్టు రట్టు చేసిన కోలా. సింగపూర్ లోని ఒక బ్యాంకులో బాబుకు 15వేల కోట్ల రూపాయల డాలర్లు -కోలా

 తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు చెందిన విదేశీ బ్యాంకులలోని ఖాతాల గుట్టుని కోలా కృష్ణ మోహన్ రట్టు చేశారు. తనకు కోట్లలో లాటరీ వచ్చినట్లు గతంలో పలువురిని మోసం చేసినట్లు కోలాపై కేసులు ఉన్నాయి. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుకు, అతని కుటుంబ సభ్యులకు విదేశాలలోని బ్యాంకు ఖాతాలలో వేల కోట్ల రూపాయలు ఉన్నట్లు వివరించారు. సింగపూర్ లోని ఒక బ్యాంకులో బాబుకు 15వేల కోట్ల రూపాయల డాలర్లు ఉన్నట్లు తెలిపారు. బాబు విదేశీ ఖాతాల వివరాలను రెండు రోజులలో హైకోర్టుకు తెలుపుతానని చెప్పారు. 

గతంలో తనపై రెండుసార్లు హత్యాయత్నం చేయించినట్లు చెప్పారు. ఇప్పుడు తనకు ఏమైనా జరిగితే దానికే చంద్రబాబే బాధ్యుడవుతారని ఆయన తెలిపారు. తనకు లాటరీ వచ్చినట్లు తెలిసి చంద్రబాబు తనని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు. 1999లో చంద్రబాబుకు 5 కోట్ల పది లక్షల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. పది లక్షల రూపాయలు చెక్ రూపంలో ఇచ్చానని చెప్పారు. ఆ చెక్ ని నగదు చేసుకున్నట్లు తెలిపారు. కోటి రూపాయలు నగదు రూపంలో ఆయనకు ఇంట్లోనే ఇచ్చినట్లు చెప్పారు. మిగిలి నాలుగు కోట్ల రూపాయలను లండన్ లోని మిడ్ లాండ్స్ బ్యాంక్ ఖాతా నుంచి సింగపూర్ బ్యాంకులోని చంద్రబాబు నాయుడు ఖాతాలోకి మార్చినట్లు తెలిపారు. లండన్ లోని తన ఖాతా నెంబరు 433846 958001గా తెలిపారు. 

సింగపూర్ లోని డ్యూషే బ్యాంకులో సి.నాయుడు. నారా అనే పేరుతో 0204049121100 నెంబరుతో ఖాతా ఉన్నట్లు వివరించాడు. సింగపూర్ బార్ లేస్ బ్యాంకులో చంద్రబాబుకు మరో ఖాతా ఉన్నట్లు తెలిపారు. లండన్ లోని నార్త్ వెస్ట్ బ్యాంకులో కూడా ఖాతా ఉన్నట్లు చెప్పారు. స్విట్జర్లాండ్ లోని క్రెడిట్ నూయిస్ బ్యాంక్ లో కూడా చంద్రబాబుకు ఖాతా ఉన్నట్లు తెలిపారు. 2003 మార్చిలో కొన్ని ఖాతాలను మూసివేశారని, ఇంకా అనేక ఖాతాలలో వేల కోట్ల రూపాయలు ఉన్నట్లు చెప్పారు. 

1999లో లాటరీ వచ్చిందని తెలియడంతో చంద్రబాబు తనని పార్టీలోకి ఆహ్వానించినట్లు చెప్పారు. అతని వల్లే తాను అనేక కేసులలో ఇరుక్కున్నట్లు ఆయన తెలిపారు. 2003లో తనపై చంద్రబాబు మూడుసార్లు హత్యాయత్నం చేయించారని తెలిపారు. 

చంద్రబాబు కుమారుడు లోకేష్ తన వద్ద 25 లక్షల రూపాయలు తీసుకున్నట్లు తెలిపాడు. ఆ డబ్బుతో ఇంట్లో కూడా మరో 35 లక్షల రూపాయలు తీసుకొని లోకేష్ ఒక అమ్మాయిని తీసుకొని ఎటో వెళ్లిపోయినట్లు చెప్పాడు.

YS Vijayamma Speech in By Election campaign at Kavali, Nellore

Sharmila Speech in By Election campaign at Kavali, Nellore

YSRCP leader Somayajulu Press Meet 9th June 2012

Mekapati Rajamohan Reddy Speech in By Election campaign at Kavali, Nellore

YS Jagan's CBI custody

ఈరోజుకు ముగిసిన సిబిఐ విచారణ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని సిబిఐ అధికారులు విచారించడం ఈరోజుకు పూర్తి అయింది. సిబిఐ కోఠి కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ అధికారులు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో జగన్ ని విచారించారు. జగతి పబ్లికేషన్ లో పెట్టుబడులకు సంబంధించి ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. అనంతరం జగన్ ని చంచల్ గూడ జైలుకు తరలించారు. రేపు కూడా సిబిఐ అధికారులు జగన్ ని విచారిస్తారు. 

సిబిఐ కోరిన మీదట హైకోర్టు జగన్ ని రెండు రోజులు కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో మొదటి రోజు విచారణ ఈరోజు ముగిసింది. రేపటితో రెండవ రోజు విచారణ ముగుస్తుంది.

కావలిలో జనసునామీ

కావలి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, కుమార్తె షర్మిలా వస్తున్న సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి జనసునామీ వచ్చినట్లుంది. మెయిన్ బజారుతోపాటు వీధులన్నీ జనంతో నిండిపోయాయి. వారిద్దరినీ చూసేందుకు, వారి ప్రసంగాలు వినేందుకు జనం మేడలపైన, మిద్దెలపైన, గోడలు, రేకుల షెడ్లపైన ఎక్కారు. కావలి ప్రధాన కూడలి నుంచి ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు. 

ప్రచార వాహనంపైన విజయమ్మ, షర్మిలతోపాటు పార్టీ లోక్ సభ అభ్యర్థి మేకపాటి రాజమోహన రెడ్డి, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర రెడ్డి, వాసిరెడ్డి పద్మ ఉన్నారు.

'పీఆర్పీ కలిసినా కాంగ్రెస్ కు తగ్గిన బలం'

ప్రజారాజ్యం పార్టీ కలిసినా కాంగ్రెస్ పార్టీలో బలం తగ్గిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సోమయాజులు చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎవరిపైన రానివిధంగా పార్టీ టిక్కెట్లు అమ్ముకున్నట్లు చిరంజీవిపై ఆరోపణలు వచ్చాయన్నారు. కాంగ్రెస్‌ను తిట్టిన చిరంజీవి చివరకు కాంగ్రెస్‌లోనే చేరారు. కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా ఓటేస్తే శోభానాగిరెడ్డిని వివరణ కోరారు.

రాష్ట్రంలో గనులకు సంబంధించి కొన్ని పత్రికలు చాలా పిచ్చిపిచ్చి రాతలు రాస్తున్నాయన్నారు. అలా రాయడం వల్ల ఆ పత్రికల విలవలే పతనం అవుతాయన్నారు. ఇక్కడి గనులు తమక వద్దని అప్పట్లో ఎన్ ఎండిసి చెప్పినట్లు తెలిపారు. ఎన్ ఎండిసి టర్నోవర్ పది వేల కోట్ల రూపాయలు అని ఆయన తెలిపారు. ఇది కేవలం టర్నోవర్ మాత్రమేనని, లాభం కాదని ఆయన స్పష్టం చేశారు. ఆ పత్రికలు అర్ధపర్ధంలేకుండా ఇష్టం వచ్చినట్లు అసత్యాలు రాస్తున్నారని తెలిపారు. అలా రాయడం వల్ల ఆ పత్రికల క్రెడిబిలిటీ పోతుందన్న ఆలోచన కూడా వారికి లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఉప ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోబోతున్నాయన్నారు. పార్టీలకు మద్దతు తెలిపే పత్రికలపై చీటింగ్ కేసులు పెట్టడం కాదని, వారిని మెంటల్ ఆస్పత్రిలో చేర్చడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు. 

dharmavarapu comments on congress

చిరంజీవికి ఈసి నోటీసులు

 కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి ఎన్నికల సంఘం(ఇసి) నోటీసులు జారీ చేసింది. గతనెల తిరుపతిలో చేసిన మత పరమైన వ్యాఖ్యలపై ఇసి ఈ నోటీసులు పంపింది. రేపటిలోగా సమాధానం ఇవ్వాలని చిరంజీవిని ఇసి ఆదేశించింది.

ఉపఎన్నికల తర్వాత భవిష్యత్ కార్యాచరణ

ఉప ఎన్నికల తరువాత తమ భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్‌ రెడ్డి చెప్పారు. సిఎల్ పిలో ఐదుగురు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి కోమిటిరెడ్డి అధ్యక్షతన సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన తరువాత ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఉపఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమవుతారని చెప్పారు. మద్యం సిండికేట్ విషయంలో ఎమ్మెల్యే కవితకు నోటీసులు ఇవ్వడం సరికాదని ఆయన అన్నారు. సిండికేట్‌తో తనకు సంబంధంలేదని కవిత గతంలోనే స్పష్టం చేశారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు.

uppanuthala purushottham reddy comments

Rajanna Rajyam Ravali 9th June 2012

Special Edition on "DharmaYuddam"9th June 2012

Peoples Are Ignored Chandrababu Speech

Heavy Crowd in YS Vijayamma Election Campaign At Ongole

Sharmila Speech In By Election Campaign At Ongole

YSRCP Leader Jupudi Prabhakarao Speech At Ongole

YS Vijayamma Speech In By Election Campaign At Ongole

పరకాలలో ప్రజలకు టీఆర్ఎస్ నోట్ల గాలం

 పరకాలలో టీఆర్ఎస్ పార్టీ నోట్లతో ప్రజలను ప్రలోభపెడుతోంది. కేసీఆర్ సభకు జన సమీకరణ కోసం ఆపార్టీ కార్యకర్తలు శనివారం డబ్బులు పంచుతూ సాక్షి కెమెరాకు చిక్కారు. అనంతరం ఈ విషయాన్ని గమనించిన వారు అక్కడ నుంచి జారుకున్నారు. పరకాలలో ఈరోజు సాయంత్రం టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది.


శవ రాజకీయాలు చేసింది కేసీఆరే: గోనె


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ శవ రాజకీయాలు చేస్తుంది కేసీఆరేనని, అమాయకులైన 800మంది మృతికి కేసీఆరే కారణమన్నారు. 

పరకాలలో కొండా సురేఖ గెలుపు అవకాశాలను దెబ్బ తీసేందుకు కాంగ్రెస్‌ పార్టీ లోపాయకారిగా టీఆర్‌ ఎస్‌కు మద్దుతు ఇస్తోందని గోనె ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డే స్వయంగా కాంగ్రెస్‌ నేతలకు ఈ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారముందని ఆయన వెల్లడించారు. ఒక్కో ఎన్నికల్లో ఒక్కొక్క పార్టీతో పొత్తు పెట్టుకుంటూ తెలంగాణ ప్రజల మనోభావాలను తాకట్టు పెడుతున్న కేసీఆర్‌, దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్దం కావాలని సవాల్‌ విసిరారు.

దుర్మార్గపు రాజకీయాలను తిప్పికొట్టండి: షర్మిల

 ఉప ఎన్నికల్లో 18 సీట్లలో డిపాజిట్లు రావనే భయంతోనే జగన్ ను జైల్లో పెట్టారని షర్మిల అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె శనివారం ఒంగోలులో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జగన్ త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తారన్నారు. రాజన్నరాజ్యం కావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. 

హెలికాప్టర్లు కూల్చి, మంచివాళ్లను జైల్లో పెట్టే దుర్మార్గపు రాజకీయాలను తిప్పికొట్టాలని షర్మిల పిలుపునిచ్చారు. దేశమంతా హెరిటేజ్ లు పెట్టి చిదంబరంతో చీకటి ఒప్పందాలు చేసుకున్న చంద్రబాబుకు వైఎస్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కోట్ల రూపాయలతో ఐటీ దాడుల్లో దొరికిన చిరంజీవి ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కష్టకాలంలో వైఎస్ కుటుంబానికి అండగా ఉండి, రైతుల పక్షాన నిలబడి పదవికి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని షర్మిల కోరారు.

ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంతపార్టీపైన ఆయన విమర్శలు గుప్పించారు. అధికార, ప్రతిపక్షాలు ప్రజాదరణ, విశ్వసనీయత కోల్పోయాయని ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. 

2014 సాధారణ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ 200 సీట్లు సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఆనాడు వైఎస్‌ను పొగిడిన నేతలు ఇప్పుడు విమర్శించడం బాధాకరమని ఉప్పునూతల అన్నారు. కాంగ్రెస్‌, టీడీపీలు కుమ్మక్కయినా ఆ పార్టీలకు ఒరిగేదేం లేదని ఉప్పునూతల పేర్కొన్నారు.

సీబీఐ కార్యాలయానికి చేరుకున్న జగన్

జగన్‌ను విచారించేందుకు మరో రెండు రోజులు అనుమతి ఇవ్వాలన్న సీబీఐ అభ్యర్థనకు హైకోర్టు ఆమోదం తెలిపింది. దాంతో నేడు, రేపు ఆయన్ని సీబీఐ అధికారులు విచారించనుంది. గతంలో విధించిన షరతులు ఇప్పుడూ వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా జగన్‌ను శనివారం ఉదయం సీబీఐ అధికారులు చంచల్ గూడ జైలు నుంచి కోఠీలోని సీబీఐ కార్యాలయానికి తీసుకెళ్లారు.

vijayamma

ఓరుగల్లు గడ్డపై తొలిఅడుగు

- రాజన్న కుటుంబానికి ఆదరణ
- కొండా దంపతులకు అండ
- హోరెత్తిన ఎన్నికల ప్రచారం
- వైఎస్సార్‌సీపీలో నూతనోత్తేజం 

వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : ఓరుగల్లు గడ్డపై తొలి అడుగుపెట్టిన ‘రాజన్న’ కుటుంబానికి అపూర్వ అదరణ లభించింది. మహానేత వైఎస్సార్ సతీమణి, వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, కుమార్తె షర్మిలకు అడుగడుగున జనం నిరాజనాలు పలికారు. ప్రతిపక్షనేతగా వైఎస్సార్ పాదయాత్రతో అడుగులువేసిన పరకాల పోరుగడ్డపై ఉప ఎన్నిక శంఖరావాన్ని పూరించారు. తొలినుంచి వైఎస్ కుటుంబానికి అండగా నిలుస్తున్న కొం డా కుటుంబానికి బాసటగా నిలిచేందుకు తరలి వచ్చారు.

ఉదయం పది గంటలకు రైల్వేకోడూరు నుంచి హన్మకొండకు చేరుకున్న విజయమ్మ, షర్మిలకు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానాలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికా రు. కొండా దంపతుల కుమార్తె ఇంటి వద్ద కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం గీసుకొండ మండలం కోనాయమాకుల వద్ద జరిగిన బహిరంగ సభకు తరలివెళ్లారు. వెంకట్రామ థియేటర్ సెంటర్‌లో వందలాదిమంది కార్యకర్తలు ఎదురేగి బైక్‌ర్యాలీలో ఆమె కాన్వాయ్‌కు ముందుసాగారు. క్రిష్టియన్ కాలనీలోని చర్చివద్ద వందలాది కుటుం బాల వారు విజమ్మను కలిసి పలకరించారు. 

కొండంత అండగా కోనాయమాకుల
వరంగల్, నర్సంపేట ప్రధాన రహదారిపై నిర్వహించిన సభకు జనం వెల్లువలా తరలివచ్చా రు. ఉదయం 12 గంటల సమయంలో సభ ప్రారంభమైంది. ముందుగా షర్మిల ‘నేను...రాజన్న కుమార్తెను...జగనన్న చెల్లెలను... నా పేరు షర్మిల’ అంటూ ప్రసంగాన్ని కొనసాగిం చారు. ఆమె హావభావాలు దివంగత నేత వైఎ స్సార్‌ను తలపించడంతో జనం ఆమెలో మహా నేతను చూసుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ కుట్రలపై ఆమె ధ్వజమెత్తారు. అనంతరం విజయ మ్మ మాట్లాడుతూ తానే పరిస్థితుల్లో ప్రచార బాధ్యతలు చేపట్టాల్సి వచ్చిందో వివరించారు. వీరు మాట్లాడుతున్నంత సేపు జనం నుంచి విశే ష స్పందన లభించింది.

తమకు తొలినుంచి కొండా దంపతులు ఏవిధంగా అండగా నిలిచిం దీ తమ ప్రసంగంలో వివరించారు. మధ్యాహ్నం 2.15గంటల సమయంలో సభ ముగిసిన అనంతరం హన్మకొండలోని కొండా దంపతుల కుమార్తె ఇంటికి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడే మధ్యాహ్నం భోజనం ముగించారు. ఈ సందర్భంగా కొండా దంపతులు, పలువురు పార్టీ నేతలు వారిని కలుసుకున్నారు. కొండా దంపతుల కుమార్తె సుస్మితాపటేల్ దంతులు వారికి సాదర సత్కారం చేశారు. 

హోరెత్తిన పరకాల 
సాయంత్రం 6.30గంటల సమయంలో విజ యమ్మ, షర్మిల హన్మకొండ నుంచి బయలుదేరి పరకాలకు చేరుకున్నారు. స్థానిక అంబేద్కర్ సెంటర్ నుంచి ఏటీఎం సెంటర్ వరకు రోడ్‌షో నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆత్మకూ రు, పరకాల మండలంతో పాటు, పల్లెల నుంచి తరలివచ్చిన వేలాది మందితో పట్టణం జనసంద్రమైంది. ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, సు రేఖ, షర్మిళ, విజయమ్మల ప్రసంగాలతో సభ హోరెత్తింది. కాంగ్రెస్, టీడీపీ కుట్రలను, తెలంగాణ పేరుతో టీఆర్‌ఎస్ చేస్తున్న మోసాలను వివరించినప్పుడు జనం కేరింతలు కొట్టారు. విజయమ్మ తెలంగాణపై మరోసారి వైఎస్సార్‌సీపీ వైఖరిని వెల్లడించారు.

సభ ప్రాంగణం జై జగన్ నినాదాలతో దద్దరల్లింది. అనంతరం కా మారెడ్డిపల్లెలోని హనుమాన్‌గుడిని సందర్శిం చుకున్నారు. ఈ దేవాలయం కొండా దంపతుల కు సెంటిమెంట్‌గా మారింది. ప్రతీసారి ఎన్నిక ల ప్రచారాన్ని ఈ దేవాలయంలో పూజలు చేసిన అనంతరం చేపట్టడం వారికి ఆచారంగా వస్తున్నది. అనంతరం విజయమ్మ, షర్మిళల హ న్మకొండకు చేరుకుని అర్ధరాత్రి రైలుమార్గంలో ఒంగోలు బయలుదేరారు. చివరి అంకానికి చేరుకున్న పరకాల ప్రచారం విజయమ్మ రాకతో ఒక్కసారిగా పతాకస్థాయికి చేరుకున్నది. 

జన ఉప్పెనై.. పోటెత్తిన పరకాల

- పోటెత్తిన పరకాల నియోజకవర్గం
- విజయమ్మ, షర్మిలకు అడుగడుగునా నీరాజనం
- మహానేత కుటుంబ సభ్యులకు జేజేలు
- కొండా దంపతులకు అండగా తరలిన ప్రజలు
- ఆకట్టుకున్న హావభావాలు.. 
- హత్తుకున్న విజయమ్మ, షర్మిల ప్రసంగాలు
- తెలంగాణ అమరులకు వైఎస్సార్ సీపీ నివాళి.. 
- వైఎస్ అభివృద్ధిని గుర్తుచేసిన రాజన్న సతీమణి
- నినాదాలతో హోరెత్తిన ఉప ఎన్నిక ప్రచారం

మండుటెండలోనూ.. జనప్రవాహం ఉప్పెనై కదిలొచ్చింది... కోనాయమాకుల కొండాకే అండ అంది.... ప్రజాప్రస్థానంతో రాజన్న నడయూడిన నేల విజయమ్మ అడుగులతో ఉద్వేగభరితమైంది.. రాజన్న బిడ్డను చూసేందుకు దారులన్నీ జనసంద్రమయాయి... అడుగుతీసి... అడుగేయలేనంత మందితో పరకాల ఉరకలెత్తింది... జనం గుండె చప్పుడు...జగనే అంటూ... జైకొట్టి నినదించింది... 

వరంగల్, న్యూస్‌లైన్ : పరకాల నియోజకవర్గం జనసందోహంతో పోటెత్తింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి దక్కినంత ఆదరణ.. ఆ మహానేత కుటుంబ సభ్యులకు లభించింది. రాజన్న సతీమణి, వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, కుమార్తె షర్మిల నియోజకవర్గ ప్రజల నుంచి అపూర్వ స్వాగతం అందుకున్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం పరకాల నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొండా సురేఖ తరఫున ప్రచార కార్యక్రమానికి శనివారం ఇక్కడకు విచ్చేసిన వారికి అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. 

ఉదయం గీసుకొండ మండలంలో, సాయంత్రం పరకాల పట్టణంలో జరిగిన సభలకు అశేష జనం తరలివచ్చారు. సంక్షేమ ప్రదాతగా పేదల గుండెల్లో కొలువై ఉన్న రాజన్న హావభావాలను పుణికి పుచ్చుకున్న షర్మిల.. ఆ మహానేతను అనునయించేలా ప్రసంగించడం అందరినీ ఆకట్టుకుంది. ఒక్కసారిగా వైఎస్ స్మృతులు అందరి హృదయంలో కదలాడాయి. తెలంగాణ అమరులకు నివాళులర్పిద్దామంటూ ప్రసంగం ప్రారంభించిన విజయమ్మకు జనం జేజేలు పలికారు.

చెట్టు.. పుట్ట.. కొండంత అభిమానం
ఉదయం గీసుకొండ మండలం కోనాయమాకులలో జరిగిన రోడ్‌షో, సభకు కొండా దంపతులకు అండగా... జనం, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తండోపతండాలుగా తరలివచ్చారు. 

ఇసుకేస్తే రాలనంతగా గీసుగొండ, సంగెం మండలాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో రావడంతో చెట్టు.. పుట్ట.. భవనాల పై భాగాలు కిక్కిరిసిపోయాయి. తమ ప్రియతమ నేత, దివంగత ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే కాకుండా... తమకు ఎల్లవేళలా అండగా నిలిచే కొండా దంపతులకు మద్దతుగా వచ్చిన జనంలో అభిమానం వెల్లువెత్తింది. విజయమ్మ, షర్మిల గ్రామానికి చేరుకోగానే... నినాదాలు మిన్నంటాయి.‘జోహార్.. వైఎస్‌ఆర్.. జైజగన్.. కొండా దంపతుల నాయకత్వం వర్ధిల్లాలి..’’ అంటూ హోరెత్తించారు.

ఆ క్షణం.. ఉద్విగ్నం..
విజయమ్మ తన ప్రసంగంలో ‘భర్తను పోగొట్టుకున్నా.. బిడ్డ జైలు కెళ్లాడంటూ...’ చెప్పడంతో సభలో ఒక్కసారిగా ఉద్విగ్న క్షణాలు చోటుచేసుకున్నాయి. సభికులందరి కళ్లు చెమర్చాయి. తడి ఆరిన గొంతుకను సరిచేసుకుని... వైఎస్సార్ అమర్హ్రే... అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జైజగన్.. జైజై జగన్ అంటూ హోరెత్తించారు. 

అలాగే... ప్రసంగం మొదలుపెడుతూనే... ‘నేను మీ రాజన్న బిడ్డను.. జగనన్న చెల్లెను...’’ అని షర్మిల అనగానే... పరకాల నియోజకవర్గ ప్రజలు జైజగన్... జైజై జగన్ అంటూ నినాదాలు చేశారు. మాటమాటకూ జేజేలు పలికారు. వైఎస్‌ఆర్ పేరు తలిచినప్పుడల్లా మహానేతకు జోహార్లు ఆర్పించారు. సభ ప్రారంభమైనప్పటి నుంచి రోడ్డుపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. షర్మిల, విజయమ్మ ప్రసంగాలు వేలాది మందిని కట్టిపడేశాయి. 

పరకాల.. జన జాతరలా...
సాయంత్రం పరకాలలో జరిగిన సభ జన జాతరను తల పించింది. విజయమ్మ, షర్మిలను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినవారు... వారితో కరచాలనం చేసేందుకు ఆసక్తి కనబరిచారు. 

మహిళలు, వృద్ధులు గంటల తరబడి వారి కోసం ఎదురుచూశారు. చిన్న పిల్లలు కూడా ‘వైఎస్‌ఆర్... జోహార్ అంటూ పుర వీధుల్లో కలియతిరిగారు. విజయమ్మ పర్యటన... భారీ జన సందోహం... మొత్తం పరకాల నినాదాలతో దద్దరిల్లింది. 

శివారు నుంచే...
పరకాల పట్టణంలో ప్రవేశిస్తున్న క్రమంలోనే వైఎస్ విజయమ్మ, షర్మిలకు ప్రజలు నీరాజనం పలికారు. పట్టణ శివారులోని ఎల్‌ఐసీ కార్యాలయం నుంచి.. మరోవైపు హుజూరాబాద్ వైపు వెళ్లే దారిలో ఆర్టీసీ డిపో వరకు జనం బారులు తీరారు. పరకాలలో రాత్రి వరకు ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయింది.

అభిమానాన్ని ఆపగలరా?
విజయమ్మ, షర్మిల, కొండా దంపతుల రాకను పురస్కరించుకుని పట్టణంలో పోలీసులను భారీగానే మోహరించారు. వీరు పట్టణానికి చేరుకోవడానికి ముందే.. జన తాకిడి మొదలైంది. పోలీసులు వారిని కట్టడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కొంతమందిని అదుపు చేసినా... చివరకు జనంలో వెల్లువెత్తిన అభిమానానికి చేతులెత్తేశారు. ఆర్టీసీ బస్సులను పట్టణంలోకి రానీయకుండా... శివారు ప్రాంతాల నుంచే తరలించారు. వాహనాలను దారుల వెంట అనుమతించలేదు. 

రాత్రి 8 గంటలకు ప్రారంభమైన రోడ్‌షో చివరివరకూ జనం వెంట నడిచారు. విజయమ్మ, షర్మిల ప్రసంగాల్లో మహానేత వైఎస్, యువనేత జగన్, కొండా దంపతుల గురించి చెప్పినప్పుడల్లా జనం జేజేలు పలికారు. కొండా... మా అండ అంటూ నినదించారు. విశ్వాసానికి మారుపేరుగా కొండా దంపతులను విజయమ్మ వర్ణించడంతో సభకు వచ్చిన ప్రజలంతా గొంతు కలిపారు. కొండా మురళీధర్‌రావు, సురేఖ మాట్లాడినంత సేపు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రతి చోటా ఫ్యాన్ గుర్తులను వేలాడదీస్తూ ప్రచారం చేశారు.

ఈ పాపం ప్రభుత్వానిదే


రంగారెడ్డి జిల్లా, న్యూస్‌లైన్ ప్రతినిధి: ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు బత్తిన సోదరులు అందజేసే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఈసారి విషాదాన్ని మిగిల్చింది. గతంలో ప్రసాదం కోసం లక్షలాది మంది రోగులు నగరానికి పోటెత్తేవారు. కానీ ఈసారి వారి సంఖ్య 30-40 వేలకు మించలేదు. అయినా గందరగోళం, తొక్కిసలాట. ఫలితంగా గుండెపోటుతో ఓ వృద్ధుడి దుర్మరణం. పలువురికి గాయాలు. చేప ప్రసాదానికి రావాలంటేనే ప్రజలు భయపడిపోయే పరిస్థితి! ఇంత గందరగోళానికి కారణమెవరు? ఈ పాపమెవరిది? ఇంకెవరిది.. సర్కారుదే! తన బాధ్యతలను గాలికొదిలి.. మంత్రులను, మంత్రాంగాన్ని, బలాన్ని, బలగాన్ని, దృష్టిని ‘రాజకీయాల’పైనే కేంద్రీకరించి.. ప్రజలను, పాలనను పూర్తిగా విస్మరించిన కిరణ్ ప్రభుత్వ నిర్లక్ష్యానిదే!!
సర్కారు మొద్దునిద్ర: యథా సీఎం.. తథా మంత్రులు. ప్రజా సంక్షేమాన్ని సీఎం కిరణ్ పూర్తిగా గాలికొదిలి రాజకీయాలపైనే దృష్టి సారించడంతో మంత్రులు కూడా ‘సొంత’ వ్యవహారాల్లోనే బిజీ అయిపోయారు. 

చేప ప్రసాదం కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచీ వేలాదిగా జనం వస్తారని తెలిసి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. సాధారణంగా 20 రోజుల ముందే అన్ని ప్రధాన విభాగాల ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించటం ఆనవాయితీ. ఈసారి మాత్రం అలాంటి భేటీ ఊసే లేకుండా పోయింది. ప్రత్యేకంగా ఎలాంటి సమావేశమూ ఏర్పాటు చేయలేదు. సరికదా.. అసలు ఈ కార్యక్రమం విషయంలో ప్రభుత్వం నుంచి అధికారులకు ఎలాంటి సూచనలూ అందలేదంటే.. ఎంత దారుణంగా వ్యవహరించారో అవగతమవుతుంది. 

కాళ్లరిగేలా తిరిగినా: బత్తిన సోదరులకు ప్రభుత్వం గతంలోనే రాజేంద్రనగర్‌లో స్థలం కేటాయించింది. కానీ ఐదేళ్లపాటు వినియోగించలేదన్న కారణంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. కేటాయించినప్పటి మాదిరిగానే ఆ భూమి స్వాధీనానికికూడా ప్రభుత్వ ఉత్తర్వులు తప్పనిసరి. ఇదే విషయాన్ని కలెక్టర్ విన్నవించినా ప్రభుత్వం పట్టించుకున్నది లేదు. చివరికి ఆ స్థలంలో చేప ప్రసాదం పంపిణీకి అనుమతిచ్చే అవకాశం లేదని రంగారెడ్డి జిల్లా అధికారులు ముందుగానే బత్తిన సోదరులకు స్పష్టం చేశారు. మరోవైపు ఏటా ఎగ్జిబిషన్ మైదానంలో కార్యక్రమం కొనసాగుతున్నా ఈసారి మాత్రం అక్కడ నిర్వహించేందుకు హైదరాబాద్ కలెక్టర్ అనుమతివ్వలేదు. రంగారెడ్డి జిల్లాలో స్థలం కేటాయించినందున అక్కడే జరపాలని బత్తిన సోదరులకు గతేడాదే ఆయన స్పష్టం చేశారు. స్థలం విషయంలో ఇంతటి గందరగోళం నెలకొన్నా సర్కారు మాత్రం చివరి నిమిషం దాకా చోద్యం చూస్తూ ఉండిపోయిందే తప్ప ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. 


దాదాపు నెల క్రితమే బత్తిన సోదరులు రంగారెడ్డి కలెక్టర్ శేషాద్రిని కలిశారు. వారికి గతంలో కేటాయించిన స్థలంలో పంపిణీకి అనుమతివ్వటం లేదని అప్పుడే ఆయన లిఖితపూర్వకంగా వారికి తెలిపారు. దీన్ని వారు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. కనీసం పక్షం రోజులుగా సచివాలయంలోని సీఎం కార్యాలయం, సీఎం క్యాంపు ఆఫీస్ చుట్టూ వారు కాళ్లరిగేలా తిరిగారు. అయినా స్పందన శూన్యం! 

చివరి క్షణాల్లో: కాటేదాన్ ఇండోర్ స్టేడియంలో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేయాల్సిందిగా బుధవారం సాయంత్రం రంగారెడ్డి కలెక్టర్‌కు సమాచారం అందింది. అంటే కార్యక్రమం మొదలవడానికి కేవలం ఒకటిన్నర రోజుల ముందు! దాంతో పూర్తిస్థాయి ఏర్పాట్లు చే యడానికి అధికారులకు సమయమే లేకుండా పోయింది. 

గతేడాదే చెప్పా: హైదరాబాద్ కలెక్టర్

‘‘చేప ప్రసాదం పంపిణీకి ఎగ్జిబిషన్ మైదానం కేటాయింపు ఇదే ఆఖరని బత్తిన సోదరులకు గతేడాదే స్పష్టం చేశాం. ఇకపై వారికి కేటాయించిన స్థలంలోనే జరుపుకోవాలనీ చెప్పాం’’

అక్కడ అసాధ్యమని నెల క్రితమే చెప్పా: రంగారెడ్డి కలెక్టర్

‘‘చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం రాజేంద్రనగర్‌లో కేటాయించిన భూమిలో ఈసారి కార్యక్రమానికి అనుమతి లేదని బత్తిన సోదరులకు దాదాపు నెల క్రితమే లిఖితపూర్వకంగా స్పష్టం చేశా. అవసరమైతే కాటేదాన్ మైదానాన్ని కేటాయిస్తామన్నా వారు బదులివ్వలేదు. బుధవారం సాయంత్రం జీఏడీ నుంచి ఆదేశాలు రావడంతో అప్పటికప్పుడు ఏర్పాట్లు చేశాం’’

విచారకరం: చంద్రబాబు

చేపమందు పంపిణీలో జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందడం విచారకరం. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో సరైన ఏర్పాట్లు చేయకపోవడమే దీనికి కారణం. 

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: కిషన్‌రెడ్డి

తొక్కిసలాటకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణం. గాయపడినవారికి, మరణించిన వ్యక్తి కుటుంబానికి పరిహారం చెల్లించాలి. 

రద్దుచేయాలని చూసింది: కేటీఆర్

ప్రభుత్వం కొందరి ఒత్తిడితో బత్తిన సోదరుల చేపమందు పంపిణీ కార్యక్రమాన్నే రద్దు చేయాలని చూసింది. 

డబ్బులు తిని అడ్డుకుంటున్నారు: మధుయాష్కీ

ఫార్మా కంపెనీల నుంచి డబ్బులు తీసుకుని ప్రభుత్వ అధికారులు, జనవిజ్ఞాన వేదిక సభ్యులు చేపమందు పంపిణీని అడ్డుకుంటున్నారు. 

సీబీఐ, 2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలోకి దిగితే మంచిది కామోసు



ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే చర్చ దాదాపుగా జరగడం లేదు. ఫలితాల గురించి ఎవరికీ అనుమానం లేదు. కాకపోతే... ద్వితీయ స్థానాన్ని ఎక్కువగా దక్కించుకునేది కాంగ్రెసా లేక టీడీపీయా? 2014 వరకు రాష్ట్ర ప్రభుత్వం నెట్టుకురాగలదా? అనే అంశాలపైనే ఊహాగానాలు సాగుతున్నాయి.

సీబీఐ, 2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలోకి దిగితే మంచిది కామోసు. కొద్దికాలంగా అది రాష్ట్రంలోకెల్లా అత్యంత చురుకైన రాజకీయ శక్తిగా పనిచేస్తోం ది. ఓటర్లు దానికి కూడా కొన్ని ఓట్లు వేస్తారో ఏమో ఎవరికి తెలుసు. ఎన్నికల నిధుల కోసం సీబీఐ ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రచారం సందర్భంగా ఇతర పార్టీల నుంచి తాను స్వాధీనం చేసుకునే కోట్లా ది రూపాయలనే వాడుకోవచ్చు.

1990లలో జోరుగా సాగుతున్న నయా ఉదారవాద ప్రైవేటీకరణను అపహాస్యం చేస్తూ ఆస్ట్రేలియాలో ఓ అభ్యర్థి ఎన్నికల బరిలోకిదిగాడు. మురుగు, పారిశుధ్యాలను ప్రైవేటీకరించాలని డిమాండు చేశాడు. ‘ప్రతివ్యక్తీ తను విసర్జించే వ్యర్థాల బాధ్యతను తానే మోయాలి’ అని నినదించాడు. చివరికి, సరదాగానే పోటీకి దిగానంటూ అతడు తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నా అతనికి కొన్ని ఓట్లు పడ్డాయి. అతగాడిలాగా ఆషామాషీగా పోటీకి దిగిందన్న ముద్రపడకుండా జాగ్రత్తవహిస్తే ఫలితాలపై సీబీఐ ఆశలు పెట్టుకోవచ్చు.

ఏపీలో ఇప్పుడు జరుగుతున్న పద్దెనిమిది శాసనసభ, ఒక లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే చర్చ దాదాపుగా జరగడం లేదు. ఫలితాల గురించి ఎవరికీ అనుమానం లేదు. కాకపోతే... ద్వితీయ స్థానాన్ని ఎక్కువగా దక్కించుకునేది కాంగ్రెసా లేక టీడీపీయా? పోలింగ్ రోజైన జూన్ 12లోగా ఎంత మంది, ఫలితాల తర్వాత ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీలోకి ఫిరాయిస్తారు? రాష్ట్ర ప్రభుత్వంపై ఫలితాల ప్రభావం ఎలా ఉండబోతోంది? 2014 వరకు అది నెట్టుకురాగలదా? ఆధిక్యతలు ఎలా ఉం టాయి? అనే అంశాలపైనే ఊహాగానాలు సాగుతున్నాయి. తక్కువలో తక్కువగా వైఎస్సార్‌సీపీ 14 స్థానాలను గెలుచుకుంటుందని అన్ని పక్షాలు అం చనా వేస్తున్నాయి. పోటీ జరిగేది మిగతా నాలుగు స్థానాలలోనే అని అంతా అంగీకరిస్తున్నారు.

ఉప ఎన్నికల ఫలితాలపైనగాక, ఎన్నికల తదుపరి పర్యవసానాలపైనే ప్రధానంగా చర్చసాగుతోంది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుకు వ్యతిరేకంగా చర్చనడుస్తోంది. వైఎస్సార్ కుమారుడు జగన్‌తో కలిసి ఎందరెందరో ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం చర్చనీయమవుతోంది. విడవక వెన్నాడుతున్న వైఎస్సార్ ప్రభావం కాంగ్రెస్‌ను ఇంచుమిం చుగా విదూషక స్థాయికి చేర్చింది. వైఎస్సార్ అవినీతిని దుయ్యబడుతూ కాంగ్రెస్, తమ కార్యాలయాల్లోని ఆయన కటౌట్లనన్నింటినీ తొలగించింది. గత ఏడాది జరిగిన కడప ఉపఎన్నికల్లో జగన్‌కు వ్యతిరేకంగా పోటీ చేస్తూ అది వైఎస్సార్ వారసత్వం తమదేనని వాదించింది!

2009లో వైఎస్సార్ మరణం తదుపరి ఆయన కుమారుడు జగన్ సీఎం కావడాన్ని నివారించాలని కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నేత కె.రోశయ్యను రాష్ట్రంపై ముఖ్యమంత్రిగా రుద్దింది. ప్రజావ్యతిరేకత సద్దుమణగకపోగా, రాష్ట్రంలో పార్టీ పుట్టి మునుగుతుండటంతో ‘అరోగ్యపరమైన కారణాలతో’ ఆయన సీఎం పదవిని త్యజించారు.

సొంత నియోజకవర్గంగానీ, రాష్ట్రంలో పెద్దగా గుర్తింపుగానీ లేని కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నారు. వైఎస్సార్‌సీపీలోకి వలసల ప్రవాహం పెరుగుతుండటంతో ఆయన ప్రభుత్వం భీతావహమైంది. టీడీపీ సైతం నెత్తురోడుతోంది. అత్యంత నిర్భయంగా పోరాడే నేతగా గుర్తింపున్న ఆ పార్టీ నేత ఎంవీ మైసూరారెడ్డి ఇప్పుడు వైఎస్సార్‌సీపీలో ఉన్నారు. 12 నెలల క్రితమే ఆయన కడపలో జగన్‌తో ఎన్నికల పోరు సాగించారు.

మీడియాకు అత్యంత ప్రీతిపాత్రుడైన చంద్రబాబునాయుడు హయాం లో దాదాపు దశాబ్దిపాటు రాష్ట్రం దక్షిణాదిలోకెల్లా అత్యంత అధ్వానమైన రాష్ట్రంగా నిలిచింది. గ్రామీణప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కొడిగట్టాయి. అనేక వేలమంది రైతులు దివాలా తీసి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆకలితో అలమటించే వారికోసం 1983లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వేతరులు వేలాది గంజి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏవిధంగా చూసినా చంద్రబాబు విఫలమైనా కార్పొరేటు ప్రపంచం, మీడియా ఆయనను కీర్తించాయి. ప్రజలు మాత్రం నేటికీ ఆయనను క్షమించలేదు. అందుకే కాంగ్రెస్ పతనోన్ముఖంగా సాగుతున్నా, టీడీపీ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించలేకపోయింది.

చాలా కాలం తర్వాత కాంగ్రెస్‌లో వైఎస్సార్ ఒక ప్రజానాయకునిగా అవతరించారు. వ్యవసాయ రంగపు దయనీయస్థితిపై దృష్టిని కేంద్రీకరించి ఆయన రైతాంగపు గుండె తలుపులను తట్టారు. 2004 ఎన్నికల్లో ఘనవిజ యం సాధించారు. వ్యవసాయ సంక్షోభంపై ఒక కమిషన్‌ను నియమించిన మొట్టమొదటి సీఎం ఆయనే. చక్కటి ఉపాధి హామీ పథకాలను అమలు పరిచారు. చౌక బియ్యంతో ఎన్టీఆర్ వారసత్వాన్ని కొంత సొంతం చేసుకున్నారు. ఇవన్నీ ఆయనకు బ్రహ్మాండమైన ప్రజామద్దతును సంపాదించిపెట్టాయి. అదే ఇప్పుడు ఆయన కుమారుని పట్ల సానుభూతిగా మారింది.

- పి. సాయినాథ్
(‘హిందూ’ వ్యాసం నుంచి కొన్ని భాగాలు...)

స్పందన అంతంతమాత్రమే ఉండటంతో చిరంజీవి ఒకింత అసహనానికి


కాంగ్రెస్ పార్టీ తమ స్టార్ క్యాంపెయినర్‌గా చెప్పుకున్న సినీనటుడు చిరంజీవి రోడ్‌షోలకు కనీస స్పందన కూడా రావడం లేదు. ఏ గ్రామంలో చూసినా పదులు, అక్కడక్కడా వందలకు మించి జనం హాజరు కావడం లేదు. చిరంజీవి శుక్రవారం పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్తేరు నుంచి రోడ్డుషో ప్రారంభించారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగుగంటల వరకూ పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్టు ముందుగా ప్రకటించారు. అయితే ఉదయంపూట జరిగిన సభల్లోనే జనం లేకపోవడంతో ఆయన కేవలం ఒక్క పాయకరావుపేట మండలానికే ప్రచారాన్ని పరిమితం చేసి అనంతరం హైదరాబాద్ వెళ్లిపోయారు. 

మండలంలోని పలు గ్రామాల్లో ఎక్కడ పది మంది కనిపించినా ఆగి వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. వైఎస్‌ను కుట్రతో హత్య చేశారని, తన కుమారుడిని జైలు పాల్జేశారని విజయమ్మ ప్రజల్లో సానుభూతి కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. షర్మిల భర్త అనిల్‌కుమార్‌కు వైఎస్ బయ్యారంలో లక్షన్నర ఎకరాల భూమిని గనుల తవ్వకాలకు కేటాయించారని, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దుచేసి నాలుగు మండలాల వారికి ప్రయోజనం చేకూర్చిందని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో మూడేళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని చిరంజీవి అంగీకరించారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పుకొచ్చారు. వైఎస్ కుటుంబంపై విమర్శలు చేసినప్పుడు జనం నుంచి కనీసస్పందన కూడా రాలేదు. దీంతో జనంలో ఉత్సాహాన్ని నింపేందుకు అక్కడక్కడ తన సోదరుడు పవన్‌కల్యాణ్ నటించిన గబ్బర్‌సింగ్ సినిమాలోని ‘కెవ్వు కేక’ పదాన్ని వల్లెవేశారు. అయినా స్పందన అంతంతమాత్రమే ఉండటంతో చిరంజీవి ఒకింత అసహనానికి గురైనట్టు కనిపించారు.

చిరు అసహనం..మంత్రి గంటా మనస్తాపం

ఆరంభం నుంచి రోడ్‌షోలకు జనం పల్చగా హాజరు కావడంతో చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు. పాల్తేరు ప్రచార సమయంలో ఆయన ఈ విషయమై జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావుపై కొంత అసహనం వెలిబుచ్చారు. దీంతో అక్కడ ప్రసంగం ముగిశాక మంత్రి గంటా, ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, వెంకట్రామయ్య, అవంతి శ్రీనివాస్ వెనుదిరిగి వెళ్లిపోయారు. చిరంజీవి మాటలతోనే మంత్రి మనస్తాపం చెందినట్లు ప్రచారం జరిగింది. దీంతో అక్కడ నేతల్లో కలకలం రేగింది. చిరు, పీసీసీ చీఫ్ బొత్సలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో మనస్తాపంతోనే వారు వెళ్లిపోయారని చెప్పుకున్నారు. అయితే ఈ ప్రచారాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. తాము నియోజకవర్గంలో మిగతా ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లామే తప్ప మరో కారణం లేదని చెప్పారు.

అమ్మణ్ణమ్మను హైదరాబాద్‌లోని మీ ఇంట్లో కనీసం పది రోజులైనా పెట్టుకొని ఆలనా పాలనా చూశారా?

మానవతా విలువల గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదు
సొంత తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు ద్రోహం చేసిన చరిత్ర ఆయనది
అనారోగ్యంతో ఉన్న తండ్రిని పట్టించుకోలేదు 
తల్లి ఆలనాపాలనా చూడలేదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని విజయమ్మ సరిగా పెంచలేదంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విష ప్రచారం చేస్తున్నారంటూ కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయమ్మ పెంపకం వల్లే జగన్‌ను నేడు రాష్ట్రవ్యాప్తంగా జనం ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. మానవత్వం, విలువల గురించే మాట్లాడే అర్హత, నైతికత చంద్రబాబుకు లేవని దుయ్యబట్టారు. సొంత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు చంద్రబాబు చేసిన ద్రోహాన్ని వివరిస్తూ... ప్రసన్నకుమార్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘చంద్రబాబు తండ్రి ఖర్జూరపు నాయుడుకు అనారోగ్యం కారణంగా హైదరాబాద్ కామినేని ఆసుపత్రిలో పెద్ద ఆపరేషన్ జరిగింది. అయితే అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తండ్రిని చంద్రబాబు పట్టించుకోలేదు. ఆసుపత్రికి వెళ్లి కేవలం పది నిమిషాల వ్యవధిలోనే వెనుతిరిగిన ప్రబుద్ధుడు ఈయన. ఇది వాస్తవం కాదా బాబు?’’ అని నల్లపురెడ్డి ప్రశ్నించారు. ‘‘ఎన్టీఆర్ కుమార్తెను వివాహం చేసుకున్న తర్వాత తల్లి అమ్మణ్ణమ్మను హైదరాబాద్‌లోని మీ ఇంట్లో కనీసం పది రోజులైనా పెట్టుకొని ఆలనా పాలనా చూశారా?’’ అని నిలదీశారు. ఇలాంటి వ్యక్తికి విజయమ్మను విమర్శించే నైతిక హక్కుందా? అని ఆయన ప్రశ్నించారు. ‘‘అంతేకాదు.. 1999లో తమ్ముడు రామ్మూర్తినాయుడు, మీ తల్లి ఇద్దరూ.. మీరు చేసిన నిర్వాకానికి దూరమయ్యారు. 

మీ తమ్ముడు చిత్తూరు జిల్లాలో మీ మీదే పోటీచేశారు. మీ తల్లి రామ్మూర్తినాయుడుకు అనుకూలంగా.. మీకు వ్యతిరేకంగా ‘ఈనాడు’ పత్రికలో ప్రకటన ఇచ్చేందుకు ఆ పత్రికకు డబ్బులు చెల్లించిన మాట వాస్తవం కాదా? ఆ తర్వాత పత్రిక యాజమాన్యంతో మాట్లాడి ఆ ప్రకటన రాకుండా నిలుపుదల చేసింది నిజం కాదా?’’ అని ఆయన నిలదీశారు. అమ్మమ్మ చనిపోతే భౌతికకాయాన్ని కూడా చూడని చంద్రబాబు మానవతా విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు తన తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకున్నారో నారావారి పల్లెలో ప్రతి గడపకూ తెలుసన్నారు. ‘‘బాబు లాంటి దరిద్రుడ్ని ఎందుకు కన్నానో అని అమ్మణ్ణమ్మ కన్నీరు పెట్టుకున్న మాట వాస్తవం కాదా?’’ అని ప్రసన్న సూటిగా ప్రశ్నించారు. మానవ విలువలను లెక్కగట్టే చంద్రబాబు మరోసారి విజయమ్మను విమర్శిస్తే సహించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.

ధర్మానకు ఈసీ హెచ్చరిక


ఉప ఎన్నికల ప్రచారంలో మతపరమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి ధర్మాన ప్రసాదరావును కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా హెచ్చరించింది. మరోసారి మతపరమైన వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సచివాలయంలో విలేకరులకు తెలిపారు. గత నెల 7వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్రాక్షారామంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ... సోనియా గాంధీ కన్నా అతి పెద్ద క్రిస్టియన్ ఎవరున్నారని వ్యాఖ్యానించారు. 

మంత్రి వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై భన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్ నుంచి సీడీతో సహా నివేదికను తెప్పించుకుని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించారు. దీనిపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా కమిషన్ వారం రోజుల క్రితమే మంత్రి ధర్మానకు నోటీసులు జారీ చేసింది. మంత్రి ఇచ్చిన సమాధానం పట్ల కమిషన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఒకపక్క మతపరమైన వ్యాఖ్యలు చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టమైన నిబంధనలుండగా స్వయంగా మంత్రి అటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణించింది. తప్పును అంగీకరించకుండా సమర్థించుకునేలాగా మంత్రి సంజాయిషీ ఇవ్వడం పట్ల కమిషన్ తీవ్రంగా స్పందిస్తూ హెచ్చరికలు జారీ చేసింది. 

బంగారం, వెండి, నగదు కలిపి రూ.47.18 కోట్లు స్వాధీనం

ఉప ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో ఇప్పటివరకు బంగారం, వెండి, ఇతర ఆభరణాలు, నగదుతో కలిసి మొత్తం రూ.47.18 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు భన్వర్‌లాల్ తెలిపారు. ఈ జిల్లాల్లో రూ.36.41 కోట్లు స్వాధీనం చేసుకోగా మరో రూ.10.77 కోట్ల విలువగల బంగారం, వెండి, ఇతర ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అలాగే 1.90 లక్షల లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇందుకు సంబంధించి 10,490 కేసుల నమోదుతో పాటు 4,826 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆభరణాలు తయారుచేసే పెద్ద పెద్ద సంస్థలపై నిఘా పెట్టినట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న నగదు ఎన్నికల్లో పంపిణీకేనని తేలిన పక్షంలో న్యాయస్థానంలో విచారణ జరుగుతుందన్నారు. ఎన్నికలతో సంబంధం లేని డబ్బు అని తేలితే ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారని ఆయన వివరించారు. 

తనిఖీలు గౌరవంగా చేయాలని ఆదేశించాం

వాహనాల తనిఖీలో ఎవ్వరికీ మినహాయింపులు లేవని, ముఖ్యమంత్రి, మంత్రుల వాహనాలను కూడా తనిఖీలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు భన్వర్‌లాల్ తెలిపారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ వాహనంలో సూట్‌కేసు తనిఖీ అగౌరవంగా చేశారనే నేపథ్యంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా తనిఖీలు చేయాలని, గౌరవపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. 

12వ తేదీ 5 గంటల వరకు పోలింగ్

నెల్లూరు పార్లమెంట్ స్థానంతో పాటు 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని భన్వర్‌లాల్ తెలి పారు. ఉప ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటరు గుర్తింపు కార్డులు లేదా ఫొటోతో కూడిన ఓటర్ స్లిప్ తప్పనిసరి అని చెప్పారు. ఫొటో ఓటర్ స్లిప్‌లు ముందుగా అందని వారు ఎవరైనా ఉంటే పోలింగ్ రోజు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ స్థాయి ఆఫీసర్ నుంచి పొందవచ్చునని తెలిపారు.

నగదు, మద్యం పంపిణీపై ఫిర్యాదు చేయండి

ఉప ఎన్నికల స్థానాల్లో ఎవరైనా సరే ఓటర్లకు నగదు, మద్యం పంపిణీలకు పాల్పడితే సామాన్య ప్రజానీకం ఫిర్యాదు చేయాల్సిందిగా భన్వర్‌లాల్ విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. పంపిణీకి నగదును ఎక్కడైనా నిల్వ ఉంచినా 08897000401, 402, 403, 404, 405నంబర్లకు ఎస్‌ఎంఎస్‌లు చేయాల్సిందిగాఆయన కోరారు. 

Police Over Action At Parakala Constituency

Telangana People's Opinion On YSRCP

విజయమ్మ పర్యటనలో అడుగడుగునా తనిఖీలు

అనుమతులు లేవంటూ వాహనాల సీజ్
ఆందోళనకు దిగిన వైఎస్సార్‌సీపీ నేతలు

పరకాల(వరంగల్), న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పరకాల పర్యటనలో పోలీసులు ఓవర్‌యాక్షన్ చేశారు. శుక్రవారం రాత్రి పరకాలలో జరిగిన రోడ్‌షోకు హాజరైన వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానుల వాహనాలను అడుగడుగునా అడ్డుకున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ మొదటిసారిగా తెలంగాణ పర్యటనకు రావడంతో సహజంగానే పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ సతీమణిగా విజయమ్మ పర్యటనకు బ్రహ్మరథం పట్టారు. అయితే రోడ్‌షోకు ముందునుంచే పరకాలకు వచ్చే వాహనాలన్నింటినీ అడుగడుగునా తనిఖీల పేరుతో క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. కావాలని కాలయాపన చేశారు. తద్వారా పర్యటనకు వెళ్లకుండా ప్రజల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఎన్ని ఆటంకాలు సృష్టించినా రోడ్‌షో విజయవంతమవగా.. అనంతరం తిరిగి వెళ్లిపోతున్న వాహనాలను పోలీసులు మళ్లీ ఆపేశారు. 

సుమారు 300 వాహనాలను ఆపి అనుమతులు లేవంటూ వేధింపులకు గురిచేశారు. అన్ని రకాల లెసైన్సులున్నప్పటికీ కావాలని ఆపి ఇబ్బందులు పెట్టారు. ఒక దశలో మా వాహనాలను ఎందుకు ఆపుతున్నారని, ఎన్నికల కోడ్‌కు తాము ఎక్కడా ఆటంకపర్చలేదని చెపుతున్నప్పటికీ.. పోలీసులు పెడచెవిన పెట్టారు. ైవె ఎస్ విజయమ్మ పర్యటనకు సెక్యూరిటీగా వచ్చిన వాహనాన్ని సైతం ఆపేశారు. ఇక వాహనాల్లోని మహిళలను సైతం కిందకు దింపకుండా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వాహనాలను తహశీల్దార్ కార్యాలయూనికి తరలించి తాళాలేశారు. దీంతో మహిళలు, వైఎస్సార్‌సీపీ నేతలు రోడ్లపైనే ఉండాల్సివచ్చింది.

వైఎస్సార్‌సీపీ నాయకుల ధర్నా: పోలీసుల తీరుతో మనస్తాపం చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు శుక్రవారం రాత్రి ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వైఎస్సార్‌సీపీపై కక్షసాధింపులకు పాల్పడుతోందంటూ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. బాజిరెడ్డి గోవర్ధన్, ఎం.రాజ్‌ఠాకూర్, ఎ.విజయ్‌కుమార్, ఆధ్వర్యంలో వందలాది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. సీఎం డౌన్‌డౌన్, ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు నశించాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాత్రి పొద్దుపోయే వరకూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆందోళన కొనసాగించారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ హాజరు

 ఐదు రోజుల సీబీఐ కస్టడీ ముగిసిన నేపథ్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎ.పుల్లయ్య ఎదుట హాజరుపర్చారు. కస్టడీలో సీబీఐ అధికారులు ఏమైనా ఇబ్బందులకు గురిచేశారా అని ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించగా...అలాంటిదేమీ లేదని జగన్ సమాధానం ఇచ్చారు. ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా అని న్యాయమూర్తి ప్రశ్నించగా... ఏమీ లేదని జగన్ చెప్పారు. ఈనెల 11తో రిమాండ్ ముగియడంతోపాటు రెండవ, మూడవ చార్జిషీట్లలో జగన్‌ను హాజరుపర్చాలని ఇప్పటికే పీటీ వారంట్ జారీచేసిన నేపథ్యంలో 11న జగన్‌ను హాజరుపర్చాలని న్యాయమూర్తి జైలు అధికారులను ఆదేశించారు.

పార్టీ సభ్యత్వం స్వీకరించిన ఆర్‌వీఎస్‌కే రంగారావు


ఆయన సోదరుడు, అనుచరులు కూడా వైఎస్సార్ సీపీలో చేరిక
జగన్ ప్రచారంలో పాల్గొనకుండా కాంగ్రెస్, టీడీపీ అడ్డుకున్నాయి: రంగారావు
రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక కాంగ్రెస్ అధిష్టానం టీడీపీతో కుమ్మక్కైంది
జగన్‌పై చేపడుతున్న చర్యలు వేధింపులేనని ప్రజలు నమ్ముతున్నారు
ప్రజల నమ్మకానికి ఆజాద్ వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి
విజయమ్మ, షర్మిలపై కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య
ఉప ఎన్నికల తర్వాత వైఎస్ అభిమాన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బయటకు వస్తారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వి.సుజయ్‌కృష్ణ రంగారావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఎమ్మెల్యే సోదరుడు, బొబ్బిలి మున్సిపల్ మాజీ చైర్మన్ బేబి నాయన (ఆర్.వి.శ్వేతా చలపతి కుమార కృష్ణ రంగారావు), వారి అనుచరులు కూడా పార్టీలో చేరారు. పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, పెన్మత్స సాంబశివరాజు, పీఎన్వీ ప్రసాద్, అవనాపు విజయ్‌కుమార్‌లు వారికి కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రంగారావు మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు రాజకీయాలను ఎండగట్టారు. ‘‘కాంగ్రెస్, టీడీపీలు కలిసి అత్యంత ప్రజాదరణ కలిగిన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకున్నాయి. అవి పక్కా ప్రణాళిక ప్రకారం అన్ని శక్తులను ఏకం చేసి జగన్‌ను అడ్డుకున్నాయి. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక కాంగ్రెస్ అధిష్టానం టీడీపీతో కుమ్మక్కైంది. సీబీఐని పావులా వాడుకుంటోంది. జగన్‌పై చేపడుతున్నవి కక్ష సాధింపు చర్యలేనని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. 

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు ప్రజల నమ్మకానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. జగన్ కాంగ్రెస్‌లో ఉంటే కేంద్ర మంత్రి అయ్యేవారని, ఆ తర్వాత సీఎం అయ్యుండేవారని ఆజాద్ చేసిన వ్యాఖ్యల మర్మమేమిటి? కాంగ్రెస్ నుంచి బయటకెళ్లినందుకే జగన్‌ను వేధిస్తున్నారా? ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌ను నిలువరించేందుకే జగన్‌ను అరెస్టు చేశారని ప్రజలందరూ నమ్ముతున్నారు. విధిలేని పరిస్థితుల్లో విజయమ్మ, షర్మిల ప్రచారం చేస్తుంటే కొందరు కాంగ్రెస్ నేతలు అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం చాలా హేయమైన చర్య. వారు చేస్తున్న వ్యాఖ్యలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు’’ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ చేతిలో అధికారం ఉన్నందువల్లే జగన్‌ను వేధిస్తున్నారని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. జగన్‌పై వస్తున్న ఆరోపణలకు తొమ్మిది నెలలుగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటిదాకా ఒక్క ఆధారం సేకరించలేకపోయిందన్నారు. జగన్‌ను ఎన్ని వేధింపులకు గురిచేసినా ప్రజలు అండగా ఉన్నంత కాలం ఏమీ చేయలేరని, త్వరలోనే ఆయన నిర్దోషిగా బయటకొస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ఉప ఫలితాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది

రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికలు సెమీఫైనల్ అని, ఆ తర్వాత కొద్ది కాలంలోనే ఫైనల్స్ వస్తాయని రంగారావు జోస్యం చెప్పారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. జగన్‌పై కాంగ్రెస్ అధిష్టానం వేధింపులకు నిరసనగా ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానించే ఎమ్మెల్యేలందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష బాధ్యతను నెరవేర్చాల్సిన టీడీపీ దాని కర్తవ్యాన్ని విస్మరించి అధికార పార్టీకి బ్రాంచిగా తయారైందని విమర్శించారు. చంద్రబాబు దయాదాక్షిణ్యాల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఈనెల 15 తర్వాత ఈ విషయం మరింత స్పష్టంగా వెలుగు చూస్తుందని రంగారావు చెప్పారు.

మళ్లీ కస్టడీ అడుగుతున్నారు.. ఈ పది నెలలు ఏం చేశారు?న్యాయస్థానానికి కథలు చెప్పొద్దు

ప్రతిసారీ అవే కథలు వినిపిస్తున్నారు
మళ్లీ కస్టడీ అడుగుతున్నారు.. ఈ పది నెలలు ఏం చేశారు?
జగన్‌ను ఐదు రోజులు కస్టడీకిచ్చాం.. అదేమీ తక్కువ సమయం కాదు
ఐదు రోజుల్లో చేయలేనిది.. ఈ మూడు రోజుల్లో ఏం చేస్తారు?
అసలు దర్యాప్తును ఎంతకాలం కొనసాగిస్తూ పోతారు.. 
వీలైనంత త్వరగా పూర్తి చేయండి
దర్యాప్తు మొదలు పెట్టింది నిన్నో, మొన్నో కాదు.. పది నెలల నుంచీ చేస్తున్నారు
ఎఫ్‌ఐఆర్‌లో అన్నీ స్పష్టంగా ఉన్నాయిగా అంటూ సీబీఐని నిలదీసిన న్యాయమూర్తి
చివరకు జగన్ కస్టడీని రెండు రోజులు పొడిగించిన హైకోర్టు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెట్టుబడుల వ్యవహారంలో కోర్టు ముందు ఏ పిటిషన్ దాఖలు చేసినా, ‘కొత్త విషయాలు వెలుగు చూశాయి’ అని చెప్పడం అలవాటు చేసుకున్న సీబీఐ అధికారులను హైకోర్టు మందలించింది. ‘ప్రతిసారీ కోర్టు ముందు అవే కథలు వినిపిస్తున్నారు. కోర్టులకు కథలు చెప్పడం మానండి’ అంటూ చురకలు వేసింది. జగన్ కస్టడీని మరో మూడు రోజుల పాటు పొడిగించాలని కోరిన సీబీఐని హైకోర్టు గట్టిగా నిలదీసింది. ‘‘మరో మూడు రోజులు కస్టడీకి అడుగుతున్నారు.. ఈ 10 నెలలుగా ఏం చేశారు? అసలు ఎంతకాలం దర్యాప్తు కొనసాగిస్తూ పోతారు? మీరు దర్యాప్తు చేస్తున్నది నిన్నటి నుంచో, మొన్నటి నుంచో కాదు. దాదాపు 10 నెలల నుంచీ చేస్తున్నారు. అది జరిగింది, ఇది జరిగిందని చెబుతారు. ఎఫ్‌ఐఆర్‌లో అన్నీ వివరాలు స్పష్టంగా ఉన్నాయి కదా! ఏం జరిగిందో అందులో స్పష్టంగా ఉంది. మరి ఈ 10 నెలలూ మీరేం చేశారు? జగన్‌ను ఈ కోర్టు ఇప్పటికే ఐదు రోజుల కస్టడీకిచ్చింది. అదేమీ తక్కువ సమయం కాదు. ఐదు రోజుల్లో చేయలేనిది ఇప్పుడు మరో మూడు రోజుల్లో ఏం చేస్తారు?’’ అని సీబీఐని నిలదీసింది. దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పదేపదే గట్టిగా నొక్కిచెప్పింది. చివరకు జగన్ కస్టడీని మరో రెండు రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కస్టడీ విషయంలో ప్రస్తుతమున్న షరతులన్నీ యథాతథంగా అమలవుతాయని స్పష్టం చేశారు.

జగన్‌ను సీబీఐ కస్టడీకిచ్చేందుకు నిరాకరిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులివ్వడం, వాటిని సవాలు చేస్తూ సీబీఐ అధికారులు గత వారం హైకోర్టులో పిటిషన్ వేయడం, కోర్టు ఆయనను ఐదు రోజుల కస్టడీకివ్వడం, ఆ మేరకు రోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదింటి వరకు విచారించడం తెలిసిందే. జగన్ ఐదు రోజుల కస్టడీ గురువారంతో ముగియడంతో, దాన్ని పొడిగించాలంటూ సీబీఐ గురువారం హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది అశోక్‌భాన్, జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సి.పద్మనాభరెడ్డి వాదించారు.

కొత్త విషయాలు తెలిశాయి.. కస్టడీ పొడిగించండి
ఐదు రోజుల విచారణలో కొత్త, కీలక విషయాలు తెలిశాయని భాన్ చెప్పారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు కస్టడీ పొడిగింపు కోరుతున్నామన్నారు. దాంతో.. ప్రతిసారీ ఇవే కథలు విన్పిస్తున్నారంటూ న్యాయమూర్తి ఆగ్రహించారు. కోర్టుకు కథలు చెప్పడం మానాలన్నారు. పది నెలలుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దర్యాప్తు ప్రారంభించింది నిన్ననో, మొన్ననో కాదని గుర్తు చేశారు. దర్యాప్తు రాష్ట్రానికే పరిమితం కాలేదని భాన్ బదులిచ్చారు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలతో పాటు లగ్జెంబర్గ్ వంటి దేశాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. న్యాయమూర్తి తిరిగి స్పందిస్తూ.. ‘మీరు చెప్పేవన్నీ ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టంగా ఉన్నాయి కదా! మరి ఈ పది నెలలూ మీరేం చేశారు?’’ అంటూ సీబీఐని నిలదీశారు. జగన్‌పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని, రాష్ట్రం ఆవల కూడా దర్యాప్తు సాగుతోందని భాన్ మళ్లీ చెప్పడంతో, ఈ కేసులో ఎంతకాలం దర్యాప్తు చేస్తూ పోతారని న్యాయమూర్తి ప్రశ్నించారు. దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రెండు మూడుసార్లు గట్టిగా నొక్కిచెప్పారు. అదే ఉద్దేశంతో ఉన్నామని, అందుకు కొంత సమయం అవసరమని భాన్ బదులిచ్చారు. నిందితునిగా ఉన్న జగన్‌కు సైతం సీఆర్పీసీ సెక్షన్ 167 (2) వర్తిస్తుందని న్యాయమూర్తి చెప్పారు. కస్టడీకివ్వాలా, వద్దా అన్నది మేజిస్ట్రేట్ విచక్షణపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. 

‘‘జగన్‌ను ఇప్పటికే ఐదు రోజుల కస్టడీకిచ్చాను. అదేమి తక్కువ సమయం కాదు. ఐదు రోజుల్లో చేయలేనిది, మరో మూడు రోజుల్లో ఏం చేస్తారు?’’ అని సీబీఐని ప్రశ్నించారు. ఇప్పటికే కొందరు సాక్షులిచ్చిన వాంగ్మూలాల ఆధారంగా జగన్‌ను విచారించాలనుకుంటున్నట్టు భాన్ చెప్పారు. ‘‘ఐదు రోజలు విచారణలో జగన్ పెద్దగా చెప్పిందేమీ లేదు. అన్ని విషయాలను గుండెల్లోనే దాచుకున్నారు. అంతేకాక ఆయన్ను ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదింటి వరకే విచారించేందుకు కోర్టు అనుమతిచ్చింది. దాంతో సమయం చాలలేదు. కస్టడీకి తీసుకోవడం వల్ల జగన్‌కు వచ్చే ఇబ్బందేమీ లేదు. ఆయన పట్ల సీబీఐ అధికారులు ఎన్నడూ దురుసుగా వ్యవహరించలేదు. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలోనే విచారణ సాగుతోంది’’ అని తెలిపారు. పోలీస్‌స్టేషన్లలో మగ్గిపోతున్న వారి విషయంలో పోలీసుల వ్యవహార శైలిపై ఈ సమయంలో న్యాయమూర్తి కాసేపు చర్చించారు. పోలీసులు తమ పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని మార్చేలా పని చేయాలని సూచించారు. తర్వాత భాన్ కేసు లోతుల్లోకి వెళ్లే ప్రయత్నం చేయగా, ఆ అవసరం లేదంటూ సున్నితంగా అడ్డుచెప్పారు. వేటి ఆధారంగా కస్టడీ పొడిగింపు కోరుతున్నారో మాత్రమే చెప్పాలని స్పష్టం చేశారు.

పిటిషన్ విచారణార్హమే కాదు

అసలు కస్టడీ పొడిగింపు కోసం సీబీఐ వేసిన అనుబంధ పిటిషన్ విచారణార్హమే కాదని పద్మనాభరెడ్డి స్పష్టం చేశారు. ‘‘గత వారం సీబీఐ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను హైకోర్టే పరిష్కరించింది. ఒకసారి పరిష్కారమైన కేసులో అనుబంధ పిటిషన్ దాఖలు, దానిపై కోర్టు విచారణ చెల్లదు’’ అని తెలిపారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులను చదివి విన్పించారు. ‘‘సీఆర్పీసీ సెక్షన్ 182 కింద సీబీఐ ఈ అనుబంధ పిటిషన్ వేసింది. అసలిది చెల్లుబాటే కాదు. హైకోర్టుకు విచక్షణాధికారాలుండటం నిజమే అయినా ఒకసారి మూసేసిన కేసును తిరిగి విచారించరాదు. అలా చేయడం తొలి తీర్పును పునఃసమీక్షించడమే. హైకోర్టుకు సంక్రమించిన స్వతఃసిద్ధ అధికారాలు కస్టడీ పొడిగింపునకు ఆధారం కారాదు’’ అని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకించారు. ‘‘మే 25, 26, 27ల్లో జగన్‌ను 30 గంటలకు పైగా విచారించారు. మళ్లీ జూన్ 3 నుంచి 7వ తేదీ దాకా ఐదు రోజుల పాటు. ఇలా మొత్తం 8 రోజులు సుదీర్ఘంగా విచారించారు. ఈ కస్టడీ సరిపోతుంది. దాన్ని మళ్లీ పొడిగించాల్సిన అవసరం లేదు’’ అని వివరించారు.

మీరూ తెలివైనవారే! నవ్వులు పూయించిన న్యాయమూర్తి
ఐదు రోజుల విచారణలో కొత్త విషయాలు వెలుగు చూశాయని, కొత్త సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా జగన్‌ను ప్రశ్నించాల్సి ఉందని సీబీఐ తరఫు న్యాయవాది అశోక్ భాన్ చెప్పారు. విచారణ సమయంలో జగన్ చాలా తెలివిగా వ్యవహరించారన్నారు. దాంతో జస్టిస్ చంద్రకుమార్ స్పందిస్తూ.. ‘ఆయనొక్కడే తెలివైన వ్యక్తి కాదు. అసలు తెలివైన వ్యక్తి కానిదెవరో చెప్పండి. ఆ మాటకొస్తే మీరూ తెలివైన వారే’నని వ్యాఖ్యానించారు. దాంతో కోర్టు హాల్లో నవ్వులు విరిశాయి.

Popular Posts

Topics :