17 June 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Anam Viveka Halchal with Nithya Menon in Jewellery shop opening

Written By news on Saturday, June 23, 2012 | 6/23/2012

జగన్ మెమోను తిరస్కరించిన కోర్టు

తాను కోర్టుకు హాజరవుతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి దాఖలు చేసిన మెమోని నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఈ నెల 25న వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణకు హాజరవ్వాలని కోర్టు తెలిపింది.

ఆదర్శరైతులను అచ్చోసిన ఆబోతులన్న ధర్మాన


నరసన్నపేటలో ఆదర్శరైతులపై మంత్రి ధర్మాన మండిపడ్డారు. ఆదర్శరైతులను అచ్చోసిన ఆబోతులుంటూ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వ్యవసాయం, ఇరిగేషన్ అధికారులతో సమావేశమైన మంత్రి సాగునీరు, ఎరువులు, విత్తనాలపై రివ్యూ జరిపారు. అధికారులకు, రైతులకు మధ్యవర్తిగా పనిచేసే ఆదర్శరైతుల గురించి అడిగి తెలుసుకున్నారు . నరసన్నపేట ఉప ఎన్నికల్లో తమకు సహకరించలేదన్న నెపంతో వారిని తోలగించాలని ధర్మాన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

Gattu Ramachandra Rao Press Meet 23rd June

కుట్ర బయటకు రాకుండా కొత్తకథనం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిపై జరుగుతున్న కుట్ర బయటకు రాకుండా కొత్త కథనం మొదలు పెట్టారని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. సిబిఐ అధికారులు వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని దర్యాప్తు చేస్తున్నారన్నారు. జగన్ పేరు చెప్పమని పారిశ్రామికవేత్తలను వేధిస్తున్నారన్నారు. ఒక వ్యాపారి ఈ విషయాన్ని స్వయంగా జడ్జికే చెప్పిన అంశాన్ని గుర్తు చేశారు. జగన్ కు భౌతికంగా హానికలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తాజా పరిస్థితులు ఈ రకమైన ఆలోచనలకు బలం చేకూరుస్తున్నాయన్నారు. 

సిబిఐ జెడి లక్ష్మీనారాయణ వ్యవహార శైలిని ఆయన తప్పుపట్టారు. లక్ష్మీనారాయణ నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. జెడ్ కేటగిరీలో ఉన్న ఒక ప్రజానేతని, ఎంపిని ఒక సాధారణ వ్యాన్ లో కోర్టుకు తీసుకు వచ్చిన తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ కుట్రని బయటపెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతున్నారన్నారు. అసలు విషయం బయటకు రాకుండా ఒక వర్గం మీడియా తప్పుడు కథనాలు రాస్తున్నాయన్నారు. ఆ కుట్ర బయటకు రాకుండా కొత్త కథనం మొదలు పెట్టారని చెప్పారు. మీడియాని రెచ్చగొడుతున్నరన్నారు. విలేకరులపైన, మీడియాపైన తమకు నమ్మకం ఉందన్నారు. విలేకరుల స్వేచ్ఛని తామ ప్రశ్నించడంలేదని చెప్పారు. వారు సమాచార సేకరణ కోసం ఒక వ్యక్తితో వందసార్లైనా మాట్లాడవచ్చని అన్నారు. ఇక్కడ జరుగుతున్న కుట్రవేరన్నారు. ఒక సిబిఐ అధికారి వందల సార్లు ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో స్వయంగా మాట్లాడటం చట్టవిరుద్ధం అన్నారు. ఒకరి తరువాత ఒకరికి ఫోన్ చేసి మాట్లాడటం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. జగన్మోహన రెడ్డిని మొదటి రోజు విచారణ జరిపిన రోజున అంత బిజీగా ఉండి, మరో పక్క లక్ష్మీనారాయణ చేసిన ఫోన్ కాల్స్ ని పరిశీలిస్తే కుట్ర బయటపడుతుందన్నారు. 

జగన్ ని లక్ష్యంగా చేసుకొని ఒక పత్రిక నీచాతి నీచంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పత్రిక ఉందికదా అని రాధాకృష్ణ అడ్డగోలుగా రాస్తే ప్రజలు నమ్మరన్నారు. జెడి లక్ష్మీనారాయణకు, రాధాకృష్ణకు ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలన్నారు. జెడిని కాపాడటానికి రాధాకృష్ణ ఎందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 

ఉప ఎన్నికలలో తమ పార్టీ అపూర్వమైన ప్రజాధరణతో విజయం సాధించిందని చెప్పారు.

నాంపల్లి కోర్టులో జగన్ మెమో దాఖలు

తాను కోర్టుకు హాజరవుతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ నెల 25న రిమాండ్ పొడిగింపు రోజున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా తనని ప్రత్యక్షంగా కోర్టు ముందు హాజరుపరచాలని జైలు అధికారులను ఆదేశించాలని ఆయన కోరారు.

లాస్ ఏంజెల్స్ లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఆందోళన

లాస్ ఏంజెల్స్ : వైఎస్ జగన్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్టీ అభిమానులు సోనియాగాంధీ దిష్టి బొమ్మని కర్రలతో కొట్టి నిరసన తెలిపారు. అమెరికా చరిత్రలో ఇలాంటి నిరసన తెలపడం ఇదే తొలిసారి. ఇలాంటి నిరసనలకు అక్కడ అనుమతి ఉండదు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం జగన్‌పై కుట్రపన్ని కేసుల రూపంలో వేధిస్తుందని అభిమానులు ఆరోపించారు. జగన్‌ను విడుదల చేయాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో అరాచకాలు ఉండేవని, ఇప్పుడు రాష్ట్రంలో ఇటలీ పాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ నిరసన కార్యక్రమంలో నంద్యాల వీరారెడ్డి, గుమ్మడి ధర్మారెడ్డి, నాగేశ్వరావు, శ్రీకాంత్, కోమటిరెడ్డి, వేణు, రాజారెడ్డి, సందీప్, రాజశేఖర్, లక్ష్మ రెడ్డి పాల్గొన్నారు.

తిరుపతిలో మద్యం నిషేధించాలి: భూమన

 తిరుపతి పవిత్రతను కాపాడేందుకు మద్యపానాన్ని నిషేధించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇందు కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన శనివారమిక్కడ కోరారు. లేకుంటే రేపటినుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని భూమన హెచ్చరించారు. తిరుపతిలో మద్య నిషేధం అమలు చేసేవరకూ దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలిపారు. తిరుపతి అభివృద్ధి నిధులను పదిహేను రోజుల్లో విడుదల చేయాలన్నారు.

Lead India 2020 link takes a curious turn(deccanchronicle)

In this file photo, CBI joint director V.V. Lakshminarayana, centre, and Vasireddy Chandrabala, right, attend a function organised by Lead India 2020.Manmohan Singh and noted industrialist Dr B. Parthasarathy Reddy of Hetero Drugs are out of the CBI dragnet in the illegal investments case of Kadapa MP Y.S. Jagan Mohan Reddy.
Both men occupy top positions in Lead India 2020, a non-government organisation and there is speculation if this had anything to do with their being let off the hook.
Dr Singh, according to Lead India’s website, is its secretary-general and Dr Reddy, chairman and ma-naging director of Hetero Drugs, is vice-president. Pertinent questions are being raised as to why the CBI spared the two though their role in the quid pro quo case against Mr Jagan Mohan Reddy is crucial.
Lead India 2020 figured prominently in the news on Friday following the YSR Congress’ exposure of the phone call list of CBI joint director V.V. Laksh-minarayana in which it was found that he made hundreds of calls to one Vasireddy Chandrabala who in turn made calls to the MD of the vernacular daily Andhra Jyothi.
source:
http://www.deccanchronicle.com/channels/cities/hyderabad/lead-india-2020-link-takes-curious-turn-185

లక్ష్మీపేట బాధితులకు వైఎస్సార్ సీపీ చేయూత


వంగర(శ్రీకాకుళం), న్యూస్‌లైన్: వంగర మండలం లక్ష్మీపేటలో ఇటీవల జరిగిన దళితులపై జరిగిన ఊచకోతలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సాయం అందజేసింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తరఫున పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు పీఎంజే బాబు శుక్రవారం మృతుల కుటుంబ సభ్యులను కలిసి రూ.లక్ష వంతున చెక్కులు అందజేశారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన బూరాడ సుందరరావు, చిత్తిరి అప్పడు, నివర్తి వెంకటి, నివర్తి సంగమేశుల కుటుంబీకులకు ఈ సాయమందించారు. రెండు రోజుల క్రితం విశాఖ కేజీహెచ్‌లో మరణించిన బి.పాపయ్య కుటుంబానికి కూడా ఈ సాయం అందిస్తామని పీఎంజే బాబు తెలిపారు.

కోలాపై వారెంట్ అస్త్రాలు! హైదరాబాద్‌కు ప్రత్యేక పోలీసు బృందాలు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విదేశీ ఖాతాల గుట్టు విప్పిన కోలా కృష్ణమోహన్‌పై పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లను విజయవాడ పోలీసులు వెలికి తీస్తున్నారు. తనకు యూరో లాటరీ తగిలిందని పలువురి వద్ద డబ్బులు తీసుకున్న కోలా వాటిని తిరిగి చెల్లించకపోవడంతో విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చీటింగ్ కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఆయనపై 2010 నుంచి రెండు నాన్ బెయిల్‌బుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే కోలా ఇటీవల చంద్రబాబు తనవద్ద డబ్బు తీసుకుని మోసం చేశారని, ఆయనకు పలు దేశాల్లో బ్యాంకు ఖాతాలున్నాయనే ఆరోపణలతో సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీసులు పెండింగ్ వారెంట్లను బయటకు తీసినట్లు సమాచారం. అంతేకాకుండా ఆయన్ను అరెస్టు చేయడం ద్వారా నోరు నొక్కేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్ బయలుదేరినట్లు తెలిసింది.

కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి: కొండా సురేఖ

పరకాలలో కాంగ్రెస్, టీడీపీ కలిసి టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయించాయని విమర్శ
త్వరలో తెలంగాణలో ఓదార్పుయాత్ర

హైదరాబాద్, న్యూస్‌లైన్: మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మాటను నిలబెట్టుకోకపోతే ముక్కు నేలకు రాయాలని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యనిర్వాహక సభ్యురాలు కొండా సురేఖ డిమాండ్ చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం కొండాసురేఖను ఆమె ఇంట్లో కలిశారు. ఈ సందర్భంగా సురేఖ విలేకరులతో మాట్లాడుతూ, పరకాలలో అన్ని పార్టీలు నిజాయితీగా పోటీ చేసుంటే విజయం తనకే వరించేదని చెప్పారు. టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలు తనపై దండయాత్ర చేశారన్నారు. నియోజకవర్గంలో కొండా మురళి చేసిన వన్‌మెన్ ఆర్మీ పోరాట ఫలితమే ప్రజలు ఓట్ల రూపంలో తమ వెంట నిలిచారన్నారు. 

పరకాలలో కాంగ్రెస్ పూర్తిగా.. టీడీపీ కొన్ని చోట్ల టీఆర్‌ఎస్‌కు సహకరించాయని ఆమె ఆరోపించారు. పరకాలలో తాను గెలిచి ఓడానని, టీఆర్‌ఎస్ మాత్రం ఓడి, గెలిచిందన్నారు. తనపై ఎన్ని రకాలుగా దుష్ర్పచారం చేసినప్పటికీ టీఆర్‌ఎస్ మాటలు ప్రజలు విశ్వసించలేదని చెప్పారు. మూడు నెలల్లో తెలంగాణ తెస్తామని చెప్పి టీఆర్‌ఎస్ ప్రజలను మభ్యపెట్టి గెలుపొందిందని విమర్శించారు. సెప్టెంబర్ 15లోపు తెలంగాణ తేలేకపోతే కే సీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని సురేఖ డిమాండ్ చేశారు. ఒకవేళ మాటకు కట్టుబడి ఉండకపోతే తమ నుంచి ఎదురుదాడి తప్పదని ఆమె హెచ్చరించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై ప్రజల్లో ఉన్న అభిమానం ఉప ఎన్నికలతో మరోసారి రుజువైందన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై తమ నాయకుడు జగన్‌ను జైల్లో పెట్టించినప్పటికీ వారి కుట్రలు ఫలించలేదన్నారు. విజయమ్మ, షర్మిల నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో ఊహకందని మెజారిటీతో గెలుపొందారని వివరించారు. 

మాకు అండగా ఉంటామన్నారు

‘‘మొదటి నుంచి మీరు త్యాగం చేసి మా వెన్నంటి ఉన్నారు. కష్టం వచ్చినా, నష్టమొచ్చినా కూడా మాలో ఒక్కరు. కాబట్టి ధైర్యంగా ఉండమని జగన్ చెప్పమన్నారని విజయమ్మ తనతో చెప్పారు. అదే విధంగా విజయమ్మ తన మనసులోని ఆలోచనలు తనతో పంచుకున్నారు’’ అని సురేఖ వివరిం చారు. తెలంగాణలో త్వరలో ఓదార్పుయాత్ర జరుగు తుందని స్పష్టంచేశారు. ఒకవేళ జగన్ జైలు నుంచి బయటకు రావడం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటే ఆ కార్యక్రమాన్ని విజయమ్మ చేపడుతారని ఆమె తెలిపారు.

25న రైతు సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ ధర్నా

ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటికీ ఇప్పటిదాకా రైతులకు విత్తనాలు, ఎరువులు అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఈనెల 25 తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ నిర్ణయించింది. పాలకుల కళ్లు తెరిపించేందుకు చేపడుతున్న ధర్నాలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పార్టీ కోరింది. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర పాలక మండలి సభ్యులు (సీజీసీ) సమావేశమై రైతాంగ సమస్యలు, ఉప ఎన్నికల ఫలితాలు, పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై జరుగుతున్న కుట్రలను చర్చించారు. 

అనంతరం ఆ వివరాలను సీజీసీ సభ్యులు తోపుదుర్తి కవిత, జంగా కృష్ణమూర్తి, అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మీడియాకు వివరించారు. జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యంలేక కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై సీబీఐతో కుతంత్రాలు నడిపిస్తూ.. ఆయనపై ఆరోపణలు నిరూపితం కాకముందే జైల్లో పెట్టించడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించినట్లు కవిత తెలిపారు. జగన్‌ను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ రోజుకొక చోట విచారించడం, భద్రతలేని వాహనాల్లో తీసుకెళ్లడం, జైల్లో రాత్రి వేళ కరెంట్ తీయడం లాంటివి తమను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. జగన్‌పై జరుగుతున్న కుట్రలకు సంబంధించిన ఆధారాలతో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టులతో పాటు ఇతర పార్టీలకు నివేదికలు అందజేసి న్యాయం కోరనున్నట్లు తెలిపారు. ఉప ఎన్నికల ఫలితాలను పార్టీ క్షుణ్ణంగా సమీక్షించినట్లు చెప్పారు. పార్టీ గెలుపొందిన స్థానాలతో పాటు ఓడిన వాటిల్లో ఏం జరిగిందనే దానిపై చర్చించామన్నారు. రాబోయే ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధం కావాలనే అంశంపైనా చర్చించడం జరిగిందన్నారు. పార్టీ నిర్మాణంలో భాగంగా గ్రామ కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడంతోపాటు సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌కు సంబంధించి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేల ప్రమాణం సందర్భంగా పోలీసుల అతి

వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో పోలీసులు అతిగా వ్యవహరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రమాణం చేసేటపుడు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను మాత్రం ఆవరణలోనూ, లాబీల్లోనూ విచ్చలవిడిగా తిరగనిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వంతు వచ్చేటప్పటికి పోలీసులు ఒక్కసారిగా ఆంక్షలు విధించారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు ముందుగా పాసులు తీసుకున్న వారిని సైతం అడుగడుగునా నిరోధిస్తూ వేధించారు. విలేకరులు, మీడియా ప్రతినిధులను కూడా వారు వదల్లేదు. అనంతపురానికి చెందిన నారాయణరెడ్డి అనే పార్టీ సీనియర్ నాయకుడు పాసు చూపించినా అసెంబ్లీ లోపలికి వదలకు పోవడంతో ఆయన నిరసన వ్యక్తం చేయడంతో ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఆయనను పోలీసు రక్షక్ వాహనంలో ఎక్కించి ఆ తరువాత అందరూ అభ్యంతరం తెలపడంతో కిందకు దించేశారు. పాసుల జారీలో కూడా వివక్ష కనిపించింది. 

ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఐదు నుంచి ఆరు సందర్శకుల పాసులు జారీ చేయాలని తొలుత నిర్ణయించారు. ఆ ప్రకారమే వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జారీ చేశారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే విషయానికి వచ్చేటప్పటికి ఆ నిబంధన గాలికెగిరిపోయింది. ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయి నుంచి ఒత్తిడులు రావడంతో పొలోమని మంత్రులు తోట నరసింహం, పినిపె విశ్వరూప్ వెంట కార్యకర్తలను పెద్ద సంఖ్యలో అసెంబ్లీ లాబీల్లోకి అనుమతించారు. పోలీసులు విలేకరులపై అడుగడుగునా దురుసుగా వ్యవహరించారు. సీఎల్పీ కార్యాలయం ఎదుట సైఫాబాద్ డీసీపీ తరుణ్ జోషి సీనియర్ జర్నలిస్టు సీహెచ్‌వీఎం కృష్ణారావు పట్ల అనుచితంగా ప్రవర్తించారు. అంతే కాదు. హడావుడి అంతా సద్దుమణిగాక ప్రమాణ స్వీకారం వివరాలు తెలుసుకునేందుకు ఎప్పటి లాగే స్పీకర్ వద్దకు వెళుతున్న విలేకరులను కూడా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. పోలీసుల చేతిలో తమకు ఎదురైన అనుభవాన్ని స్పీకర్ మనోహర్‌కు విలేకరులు ఫిర్యాదు చేశారు. 

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల ప్రమాణం

ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటాం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల్లో విజయఢంకా మోగించిన 15 మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం మధ్యాహ్నం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. పార్టీ శాసనసభా పక్షం నాయకురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలో ఎమ్మెల్యేలందరూ ఒక ప్రత్యేక బస్సులో 12.10 గంటలకు అసెంబ్లీ ఆవరణలోకి చేరుకున్నారు. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తన చాంబర్‌లో 12.25 గంటలకు ఒక్కొక్కరితో ప్రమాణం చేయించారు. తొలుత గడికోట శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి) ప్రమాణం చేయగా చివర్లో మేకతోటి సుచరిత (ప్రత్తిపాడు) పదవీ స్వీకారం చేశారు. 

ఆకేపాటి అమరనాథరెడ్డి (రాజంపేట), గొల్ల బాబూరావు (పాయకరావుపేట), చెన్నకేశవరెడ్డి (ఎమ్మిగనూరు), టి.బాలరాజు (పోలవరం), బి.గురునాథరెడ్డి (అనంతపురం), భూమన కరుణాకర్‌రెడ్డి (తిరుపతి), ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట), కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), భూమా శోభానాగిరెడ్డి (ఆళ్లగడ్డ), బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు), కె.శ్రీనివాసులు (కోడూరు) విడివిడిగా ప్రమాణం చేశారు. అనంతరం స్పీకర్ వారికి శాసనసభ నిబంధనల పుస్తకాలను అందజేశారు. అసెంబ్లీ కార్యదర్శి రాజ సదారాం దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని సజావుగా నడిపించారు. సుమారు అరగంటసేపు జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, నాయకులు హాజరయ్యారు. 


కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ చదిపిరాళ్ల నారాయణరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, విజయనగరం జిల్లా పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు, మాజీ ఎమ్మెల్యే మహ్మద్ జలీల్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ హెచ్.ఏ.రెహ్మాన్‌తో సహా పలువురు ముఖ్యులు పాల్గొన్నారు.

అసలైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం

రైతుల పక్షాన నిలబడ్డ ఎమ్మెల్యేలను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు వైఎస్ విజయమ్మ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ఇకపై తాము అసలైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటామని ప్రకటించారు. జగన్ నిర్దోషి అని ప్రజాకోర్టులో తీర్పునిచ్చారనీ, త్వరలో ఆయన బయటకు వస్తారనీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందు 11 గంటలకు ఎమ్మెల్యేలు విజయమ్మ నేతృత్వంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. అక్కడినుంచి 11.30 గంటలకు అసెంబ్లీకి బస్సులో బయలుదేరారు. ప్రమాణ స్వీకారం అనంతరం వారంతా పరకాలనుంచి పోటీ చేసి ఓటమి పాలైన పార్టీ నాయకురాలు కొండా సురేఖ నివాసానికి వెళ్లారు. అక్కడ సుమారు గంటసేపు గడిపిన ఎమ్మెల్యేలు సురేఖకు నైతిక మద్దతు ప్రకటించారు. 

పరిశ్రమలు పరార్!


6.78 లక్షల మందికి ఉపాధి అంటూ ఊదర
ఉపాధి లభించింది 1,720 వుందికి వూత్రమే
ఓడలు బళ్లయిన చందంగా రాష్ట్ర ఐటీ రంగం 
రావాల్సినవి కూడా పక్క రాష్ట్రాలకు.. 
అనిశ్చిత వాతావరణం, అకారణ వేధింపులే కారణమంటున్న పారిశ్రామిక వర్గాలు

హైదరాబాద్, న్యూస్‌లైన్:రాష్ట్రం నుంచి పరిశ్రవులు పరారవుతున్నారుు. ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకే జంకుతున్నారుు. ప్రభుత్వంతో అట్టహాసంగా కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలన్నీ కాగితాలకే పరిమితవువుతున్నారుు. గత ఏడాది కాలంలో కొత్తగా ఒక్కటంటే ఒక్క పరిశ్రవు కూడా రాష్ట్రంలో ఏర్పాటవకలేదు! రూ.6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించామంటూ ఎంతో ఆర్భాటంగా ప్రభుత్వం ప్రకటించిన భాగస్వావ్యు ఒప్పందం కాస్తా ఆచరణలో బావురువుంది. గత జనవరి 11-13 తేదీల మధ్య హైదరాబాద్‌లో జరిగిన భాగస్వావ్యు ఒప్పందంలో రాష్ట్రంలో మొత్తం 265 యుూనిట్ల ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరాయుని, వీటితో ఏకంగా 6.78 లక్షల వుందికి ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రి ఘనంగా ప్రకటించడం తెలిసిందే. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.6.49 లక్షల కోట్ల పెట్టుబడులు తరలి వస్తాయుంటూ ఆయన గొప్పలకు పోయారు. ప్రాజెక్టుల అవులుకు ఎస్కార్ట్ అధికారిని నియుమిస్తావుని ప్రకటనలు కూడా చేశారు. కానీ ఆ భారీ భాగస్వావ్యు తంతు వుుగిసి ఐదు నెలలు గడిచాయి. కానీ సదరు ఎంవోయూలపై పురోగతి పెద్దగా లేదు. కేవలం నాలుగంటే నాలుగే పరిశ్రవులు ఉత్పత్తిని ప్రారంభించారుు. ఈ విషయూన్ని స్వయుంగా పరిశ్రవుల శాఖే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కొది ్దరోజుల క్రితం సవుర్పించిన నివేదికలో పేర్కొనడం విశేషం! ఈ నాలుగూ గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయుంలో వుుందుకొచ్చిన పరిశ్రవులే కావడం గమనార్హం! ఈ నాలుగు కంపెనీల ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడి కేవలం రూ.510 కోట్లు. ఉపాధి లభించింది 1720 వుందికి వూత్రమే. మరికొన్ని యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నా.. అవి కూడా వైఎస్, రోశయ్యల హయాంలో వచ్చినవే. కిరణ్ పగ్గాలు చేపట్టాక ముందుకొచ్చి రాష్ట్రంలో పనులు ప్రారంభించిన పరిశ్రమ ఒక్కటి కూడా లేదు. రాష్ట్రం విషయంలో పరిశ్రమలు ఇలా ముఖం చాటేయడానికి ఇక్కడ నెలకొన్న రాజకీయు అనిశ్చితి, సీబీఐ విచారణల పేరుతో పారిశ్రామికవేత్తలపై వేధింపులతో పాటు విద్యుత్ కోతల వంటివి కారణవుని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. పరిస్థితులిలాగే ఉంటే సమీప భవిష్యత్తులోనూ రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే అవకాశం లేదని పేర్కొంటున్నారుు.

వచ్చినవీ పాతవే..!: భాగస్వావ్యు సదస్సులో ఒప్పందాలు కుదిరిన ప్రాజెక్టుల అవులుకు నియుమించిన ఎస్కార్ట్ అధికారులు ఒక్కసారి కూడా సవూవేశం కాలేదు. రాష్ట్రంలో యుూనిట్ల ఏర్పాటుకు పరిశ్రవులు వుుందుకు రాకపోవడమే ఇందుకు కారణవుంటున్నారు. వచ్చిన నాలుగూ పాత పరిశ్రవులేనని పరిశ్రవుల శాఖ వర్గాలు తెలిపారుు. ఆర్భాటంగా భారీ ఒప్పందాలు కుదుర్చుకుని, తర్వాత ఒక్క పరిశ్రమా రాని వైనం బాబు హయాంను గుర్తుకు తెస్తోందని పరిశ్రవుల శాఖ ఉన్నతాధికారి ఒకరన్నారు. అప్పట్లో పేరుకు వందలాది పరిశ్రవులతో ఒప్పందాలు కుదుర్చుకున్నా ఏర్పాటైనవి మాత్రం కొన్నేనని ఆయన గుర్తు చేశారు. ఇక విద్యుత్, వలిక సదుపాయూలు, ఉన్నత విద్య, పర్యాటక రంగాల్లో ఒప్పందం కుదుర్చుకున్న ఒక్క పరిశ్రవు కూడా రాష్ట్రంలో యుూనిట్ ఏర్పాటు చేయులేదు. ‘‘ఐటీ హబ్‌గా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన హైదరాబాద్‌లో కూడా ఆ రంగానికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్న ఒక్క కంపెనీ కూడా ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం రాష్ట్ర అధోగతికి సూచికే. అనిశ్చిత పరిస్థితులు, పారిశ్రామికవేత్తలపై సీబీఐ విచారణ తదితరాలతో రాష్ర్టంలో పెట్టుబడి పెట్టేందుకు జంకే పరిస్థితి ఏర్పడింది’’ అని ఆయనన్నారు. ఎంతోకాలంగా వుంచి ఇన్వెస్టరుగా పేరు పొందిన పారిశ్రామిక దిగ్గజం నిమ్మగడ్డ ప్రసాద్‌ను సీబీఐ అరెస్టు చేయుడం, పలువురు పారిశ్రామికవేత్తలను విచారణ పేరిట గంటల కొద్దీ వేధించడం కూడా ఇన్వెస్టర్లలో ప్రభుత్వంపై నవ్ముకాన్ని సడలింపజేసిందని అంటున్నారు.

వర్షాకాలంలోనూ విద్యుత్ కోతలు

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి విద్యుత్ సరఫరా విషయంలో హామీ లేకపోవడం కూడా ప్రధాన అవరోధంగా మారుతోందని పరిశ్రమల శాఖ అధికారులే చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాకాలంలో కూడా పరిశ్రవులకు విద్యుత్ కోతలు అవులవుతుండటం బాగా ప్రతికూలంగా పరిణమించిందని పారిశ్రామిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వేసవిలో వారానికి 3 రోజుల పాటు పరిశ్రమలకు పవర్ హాలిడేలు మామూలే అయినా, రెండేళ్లుగా దాన్ని ఏడాది పొడవునా అమలు చేస్తున్నారు! ‘‘ఈ కారణంగానే గత ఆరు నెలల్లో ఏకంగా 50కి పైగా మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ పరిస్థితి చూసి కొత్తగా వచ్చేవారు భయపడుతున్నారు’’ అని సీనియర్ అధికారి ఒకరు వివరించారు. ప్రైవేట్ విద్యుత్ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు గ్యాస్ తరలించకుండా ప్రభుత్వం అడ్డుకోకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమని సీనియర్ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఎక్కువ ధరకు కక్కుర్తి పడి అవి పొరుగు రాష్ట్రాలకు అమ్ముకుంటున్నా సర్కారు సీరియస్‌గా పట్టించుకోవడం లేదంటున్నారు.

రావాల్సినవీ హుళక్కే..!
కొత్తగా పరిశ్రవులు రావడం దేవుడెరుగు.. రాష్ట్రంలో యుూనిట్లు ఏర్పాటు చేస్తావుని గతంలో ప్రకటించిన కంపెనీలు కూడా ఇప్పుడు పొలోమంటూ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారుు. రాష్ట్రంలో అణు విద్యుత్ పరికరాల తయూరీ యుూనిట్ ఏర్పాటుకు వైఎస్ హయాంలో వుుందుకొచ్చిన భారత్ ఫోర్జ్ కంపెనీ ఆయున వురణానంతరం వుహారాష్ట్రకు వెళ్లిపోరుుంది. పాలీ సిలికాన్ తయూరీ యుూనిట్ ఏర్పాటుకు వుుందుకొచ్చిన యుశ్ బిర్లా గ్రూపు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోరుుంది. రాష్ట్రంలోనే కచ్చితంగా కార్ల తయూరీ యుూని ట్‌ను ఏర్పాటు చేస్తావుని వైఎస్ హయాంలో ప్రకటించిన ఫ్రాన్స్ కార్ల దిగ్గజం ఫ్యూజీ గుజరాత్ బాట పట్టింది. మరెన్నో కంపెనీలు ఇదే బాటలో నడుస్తున్నాయి.

'జగన్ రెండేళ్ల పోరాట ఫలితమిది'

వైఎస్ పథకాలకు నేటి పాలకులు తూట్లు పొడుస్తున్నారు
జగన్‌ను సీఎంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు
సమస్యలపై పోరాడకనే టీడీపీ ప్రజల నమ్మకం పోగొట్టుకుంది
ప్రధాన ప్రతిపక్షం ఎలా ఉండాలో వైఎస్సార్‌సీపీ చూపిస్తుంది
జగన్‌పై సాగుతున్న కుట్రలపై ఢిల్లీ స్థాయిలో పోరాడతాం


హైదరాబాద్, న్యూస్‌లైన్:‘‘రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా ప్రజా సమస్యలపై జగన్ చేస్తున్న పోరాట ఫలితంగానే ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటి నీ ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. వారి పాలనలో ఏ వర్గానికీ మేలు జరగడం లేదు. మళ్లీ వైఎస్ నాటి సువర్ణయుగం రావాలని ప్రజలు కోరుతున్నారు. వైఎస్ పథకాలను జగన్ బాబే ముందుకు తీసుకెళ్లగలరనే నమ్మకం వారికి కలిగింది. అందుకే ఒకసారి జగన్ బాబును సీఎం చేయాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. వారి ముఖాల్లో కనిపిస్తున్న సంతోషాన్ని చూస్తే, 2014లో జగన్ సీఎం అవుతారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తెలిపారు. శుక్రవారం ఇక్కడ ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన 18 అసెంబ్లీ స్థానాలనూ వైఎస్సార్ కాంగ్రెసే దక్కించుకునేది. కానీ కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కవడం వల్లే మూడు స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. అవెంతగా కలిసి పోయాయంటే.. కొన్నిచోట్ల ఒకరికొకరు ఓట్లు మళ్లించుకొని డిపాజిట్లు కూడా కోల్పోయారు’’అని విజయమ్మ గుర్తు చేశారు.

వైఎస్ వంటి నేతలేరీ..?: వైఎస్ సంక్షేమ పథకాలకు పాలకులు తూట్లు పొడుస్తున్నారని విజయమ్మ దుయ్యబట్టారు. వైఎస్ సీఎంగా మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైలు మీదే చేశారని గుర్తు చేశారు. ‘‘అంతేకాదు, అంతకుముందు రైతుల బకాయిలను వైఎస్ రద్దు చేశారు. ఆయన హయాంలో ఎన్నడూ ఎరువుల ధరలు పెరగలేదు. సుప్రీంకోర్టు దాకా వెళ్లి మరీ బీటీ పత్తి విత్తనాల ధరను రూ.1,800 నుంచి రూ.750కి తగ్గించగలిగారు. పైగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతుల రుణాలను కూడా రద్దు చేయించారు. వాయిదాలు సక్రమంగా చెల్లించిన వారు నిరుత్సాహ పడకుండా ఉండేందుకు ఆయనే ధైర్యం చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 వేలు ఇప్పించారు. ఇప్పుడు రైతులకు అలాంటి భరోసా ఇచ్చే నేతలే కరువయ్యారు. కరెంటే సరిగా రాదు. విత్తనాలు, ఎరువులు సక్రమంగా సరఫరా చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఎరువుల ధరలు రెట్టింపైనా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పాలకుల మద్దతు లేకనే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులు పంట విరామం ప్రకటించారు. వారెంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో దీన్ని బట్టే అర్థమవుతోంది. 2004కు ముందు భారీగా చోటుచేసుకున్న రైతుల ఆత్మహత్యలు మళ్లీ ప్రస్తుతం పునరావృతం అవుతున్నాయి’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఇప్పటిదాకా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేకపోయారని విమర్శించారు. 

ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రధాన ప్రతిపక్షం తన బాధ్యతను విస్మరించి ఎంతసేపూ వైఎస్‌ను తిట్టడం, జగన్‌ను దూషించడానికే సమయం వెచ్చిస్తోందని మండిపడ్డారు. ‘‘సమస్యలపై పోరాటాలు చేయకపోవడం వల్లే టీడీపీపై ప్రజలకు నమ్మకం పూర్తిగా సన్నగిల్లింది. 30 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకునే ఆ పార్టీకి ఉప ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటూ దక్కలేదు’’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యల విషయమై ప్రభుత్వంపై ఎలా పోరాడాలో జగన్ నాయకత్వంలో చేసి తమ పార్టీ ఆచరణలో చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఢిల్లీ స్థాయిలో పోరాడుతాం

జగన్‌పై కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరికీ తెలియజేస్తామని విజయమ్మ ప్రకటించారు. ‘‘నల్లకాల్వ దగ్గర ప్రజలకిచ్చిన మాటకు జగన్ కట్టుబడినప్పటి నుంచీ ఆయనపై కుట్రలు, కుతంత్రాలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌ను వీడాక అవి రెట్టింపయ్యాయి. సాక్షి మీద దాడులు, ఎన్నికల సందర్భంగా జగన్‌ను అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడం వంటివన్నీ అందులో భాగమే. వీటిపై ప్రధానికి రెండుసార్లు లేఖలు రాసినప్పటికీ కుట్రలు ఆగడం లేదు. అందుకే త్వరలో మా పార్టీ ఎమ్మెల్యేలందరితో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రతిపక్ష నేతలందరినీ కలిసి వివరిస్తాం. మరోసారి ప్రధానిని కలిసి వివరించాలనుకుంటున్నాం’’ అని వివరించారు.

CBI Play Partiality on Other Cases

పాక్ ప్రధానిగా రాజా పర్వేజ్ అష్రాఫ్

Written By news on Friday, June 22, 2012 | 6/22/2012

పాకిస్థాన్ 25వ ప్రధానిగా అధికార పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ రాజా పర్వేజ్ అష్రాఫ్ ఎంపికయ్యారు. గిలానీ ప్రభుత్వంలో అష్రాఫ్ ఫెడరల్ మంత్రిగా పనిచేశారు. పార్లమెంట్ దిగువ సభ జాతీయ అసెంబ్లీలో ఏర్పాటైన ప్రత్యేక సమావేశంలో 211 ఓట్లతో ప్రధాన మంత్రిగా అష్రాఫ్ ఎంపికయ్యారు. ప్రతిపక్ష ముస్లీ లీగ్ నవాజ్ (పీఎమ్ఎల్-ఎన్) అభ్యర్థి సర్దార్ మెహ్తబ్ అబ్సాసీకి 89 ఓట్లు వచ్చాయి. ఏప్రిల్ 26 తేదిన సుప్రీం కోర్టు ప్రధాని గిలానిపై అనర్హుడిగా ప్రకటించడంతో ప్రధాని పదవికి ఖాళీ ఏర్పడింది. 

గిలానీ స్థానంలో తొలుత మగ్గూం షాబుద్దీన్ పీపీపీ ఎంపిక చేయగా.. అక్రమ డ్రగ్స్ కోటా కేసులో నార్కోటిక్స్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో షాబుద్దీన్ స్థానంలో అష్రాఫ్ ను పార్టీ అభ్యర్థిగా ఎన్నుకున్నారు. శుక్రవారం సాయంత్రం అష్రాఫ్ ను అభినందించిన అనంతరం డాన్ న్యూస్ తో అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంపై జాతీకి ఉన్న విశ్వాసమే ప్రధాని ఎంపిక అని అన్నారు. 

Face to Face With YS Vijayamma

TDP Supports to JD Lakshmi Narayana Behavior

YSRCP TUC Discussions with Singareni management

Special Edition "Kalisi Kutra"

వైఎస్ ని ప్రజలు ఎవరూ మర్చిపోలేదు:విజయమ్మ

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని ప్రజలు ఎవరూ మర్చిపోలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత వైఎస్ విజయమ్మ అన్నారు. అందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలకు అత్యధిక మెజార్టీ వచ్చిందని చెప్పారు. జగన్ పై కుట్రలను ప్రధాని, ఇతర పార్టీల నేతల దృష్టికి తీసుకెళ్తామన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు అందరం త్వరలో ఢిల్లీ వెళ్తామని చెప్పారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని పోగొట్టుకోమని అన్నారు. అసెంబ్లీ లోపల, బయట ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తామని చెప్పారు. నిజమైన ప్రతిపక్షమంటే ఏంటో చూపిస్తామన్నారు. 

జగన్ సీఎం కావాలని ప్రజల్లో బలంగా ఉందని చెప్పారు. అన్నీ దేవుడు చూస్తున్నాడని, న్యాయం, ధర్మం గెలుస్తుందని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. జగన్ వీలైనంత త్వరగా బయటకు వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ ఏ ప్రజాసమస్యను పట్టించుకోవడం లేదన్నారు. కేవలం వైఎస్ ని దూషించడమే చంద్రబాబు పనిగా ఉందన్నారు. కాంగ్రెస్ తో కుమ్మక్కై ప్రజల పక్షంగా టిడిపి పోరాటాలు చేయడం మానేసిందన్నారు. ప్రతి సమస్యను తన సొంత సమస్యగా వైఎస్ భావించేవారని తెలిపారు. అందుకే ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచి ఉన్నారని చెప్పారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 25న నియోజకవర్గాల వారీగా రైతు ధర్నా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 25న నియోజకవర్గాల వారీగా రైతు ధర్నాలు నిర్వహించాలని పార్టీ కేంద్ర పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ నాయకురాలు, అనంతపురం జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్స్ న్ తోపుదుర్తి కవిత చెప్పారు. సమావేశం అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ధర్నాలో రైతులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. పార్టీ నిర్మాణంపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం, గ్రామ కమిటీల ఏర్పాటు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. 

ఉపఎన్నికల్లో గెలుపోటములపై సమీక్ష జరిపినట్లు తెలిపారు. కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కు రాజకీయాలపై చర్చించామన్నారు. తమ పార్టీకి ఎమ్మెల్యేలు, ఎంపిలు ఉన్నందున రాష్ట్రపతి ఎన్నికల విషయం కూడా చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికలో పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. 

తమ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డిపై కుట్రలను సుప్రీం కోర్టు, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ఇతర పార్టీల నేతల దృష్టికి తీసుకు వెళతామని వివరించారు. వైఎస్ సంక్షేమ పథకాల సాధనకై పోరాటాలు చేయాలని కూడా సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. 
విలేకరుల సమావేశంలో కవితతోపాటు పార్టీ నేత జంగా కృష్ణమూర్తి కూడా మాట్లాడారు.

వచ్చేఎన్నికల్లో కాంగ్రెస్ కు అధికారం కలే!:చిరంజీవి

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధికారం లభించడం కలేనని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన ఇక్కడ రామచంద్రాపురం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఆర్పీ కార్యకర్తలను కాంగ్రెస్ పట్టించుకోకపోవడం వల్లే ఉపఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ నేతలకు సరైన గుర్తింపు లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పీఆర్పీ మాజీ నేతలంతా కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేశారని చెప్పారు. 
పార్టీలో సీనియర్లు కొందరు సహకరించడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు అభద్రతా భావంలో ఉన్నారన్నారు. నామినేటెడ్ పదవులను పీఆర్పీ నేతలకు ఇవ్వాలని కోరారు.

YSRCP MLAs Sworn

YSRCP Leader Kavitha Press meet

YSRCP MLAs Visit Konda Surekha House

No Storage in KG Basin

గుమ్మడికాయల దొంగ సామెతను నిజం చేస్తున్నట్లే కాదా?!

1. తమ విధి నిర్వహణలో భాగంగా ఎవరికైనా ఎన్నిసార్లైనా ఫోన్లు చేస్తాం. అలాగే ఝేడీ కీ చేసాం తప్పేంటి?
అయ్యా! మీరు ఆయనకు చేసింది తప్పని మేమనడం లేదు. కానీ, మీరడిగేవాటికి జవాబు చెప్పడం వరకు చెయ్యడమే కష్టంగా ఉండాల్సిన అధికారి (వాస్థవానికి అలా రెస్పాండ్ అవ్వడం కూడా తప్పనేది వేరే విషయం) పనిగట్టుకుని మరీ తనే మీకు ఫోన్ చేసి వివరాలందించడం ఏమిటనేది అంతుచిక్కని ప్రశ్న!!
2. మా ఫోన్ నంబర్లను మీరు బహిరంగంగపర్చడంవల్ల మాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయ్!
అయ్యా! మీరు చెప్పేది నిజ్జంగా 
నిజం అనుకున్నా - అలా బెదిరింపు కాల్స్ చేసేవాళ్ళ సత్తా ఎంత. అవి వుట్టుట్టి బెదిరింపులే అండానికి నా వివరణ. మీరు చెబుతున్నట్టుగా జగన్ సానుభూతిపరుల/పార్టీవారినుండి మీకు ప్రాణహాని జరిగేదుంటే ఇపాటికి మీలో ఒక్కడూ మిగిలుండేవాడు కాదు. అలా చెయ్యాలనుకునేవాళ్ళకు ఇప్పుడెవరో మీ నంబర్లిస్తే తప్ప చెయ్యలేనంత చేతగాకుండా ఉండరు. ఏ ఏ చానళ్ళు, ఏ ఏ రిపొర్టర్లు జగన్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు (మీ భాషలో నిజాలు తవ్వుతున్నారు), వాళ్ళ కదలికలు/ వివరాలు తెలుసుకోలేనంత వెనకబడి వాళ్ళుండరు. అదే నిజమైతే అలాంటివాళ్ళ వల్ల మీకే నష్టమూ లేదు. సో, మీరు గుమ్మడికాయల దొంగ సామెతను నిజం చేస్తున్నట్లే కాదా?!




క్లాస్‌మేట్ అయినంతమాత్రాన, ఏవో కొన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తున్నంతమాత్రాన, వాటికి జేడి కూడా ప్రోత్సాహమిస్తున్నట్లయినాగానీ అన్నేసి సార్లు అర్ధరాత్రీ అపరాత్రీ మట్లాడేంత (అదీ ఇంతటి ముఖ్యమైన కేసును విచారిస్తున్న సమయంలో!) తీరిక ఆయనకెలా ఉంటుంది అనేది విమర్శకుల ప్రశ్న. పైగా ఆమె ఆంధ్ర జ్యోతి వేమూరి తో కూడా అదే సామాజిక కార్యక్రమాల గురించి మాట్లాడాననండం, ఆయన చానెల్లోనే వచ్చిన ఆమె వివరణ సందర్భంగా కూడా రాధాకృష్ణ కవర్ చేసిన తీరు (ప్రశ్నా తనే వేసి జవాబూ ఆయనే చెప్పిన విధం!)

‘లీకు’ వీరుడు!!


హైదరాబాద్, జూన్ 21: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, కడప లోక్‌సభ సభ్యుడు జగన్మోహన్‌రెడ్డి ‘అక్రమ’ ఆస్తుల కేసు విచారణలో కీలక పాత్ర వహిస్తున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ చిక్కుల్లో పడనున్నారా? జగన్‌పై కేసు విచారణలో ఉన్న సమయంలో సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ‘వాసిరెడ్డి చంద్రబాల’ అనే మహిళతో, కొంతమంది మీడియా ప్రతినిధులతో మాట్లాడిన టెలిఫోన్ల జాబితాను వైఎస్సార్ కాంగ్రెస్ గురువారం బయటపెట్టింది. లక్ష్మీనారాయణ ఎవరెవరితో ఎన్నిసార్లు మాట్లాడారన్న వివరాల గుట్టును పార్టీ నేతలు బయటపెట్టారు. ముఖ్యంగా వాసిరెడ్డి చంద్రబాల అనే మహిళ గత మార్చి నుంచి జూన్ పదిహేడో తేదీ వరకు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణతో 432సార్లు మాట్లాడారని వైఎస్సార్‌సీపీ వివరించింది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి పత్రికాధిపతి రాధాకృష్ణతో పదిసార్లు మాట్లాడినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితాలో పేర్కొన్నారు. ‘ఎవరీ చంద్రబాల? ఆమెతో సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నిసార్లు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జి శ్రీకాంత్‌రెడ్డి, శోభానాగిరెడ్డి తదితరులు ప్రశ్నించారు. వాసిరెడ్డి చంద్రబాల మొబైల్ ఫోన్‌నుంచి లక్ష్మీనారాయణకు వచ్చిన ఫోన్ కాల్స్ వ్యవహారంపై సుప్రీం కోర్టు సిటింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. చంద్రబాల నుంచి ఒక పత్రికాధిపతికి ఫోన్ కాల్స్ వెళ్లడం చూస్తుంటే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి జగన్మోహన్ రెడ్డికి హాని చేసే కుట్రలు జరుగుతున్నట్టు అనుమానాలు ధృవపడుతున్నాయని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, శోభానాగిరెడ్డి తదితరులు ఆరోపించారు. సిబిఐ జెడి లక్ష్మీనారాయణ ఫోన్ నుంచి చంద్రబాలకు, వివిధ మీడియా సంస్థల ప్రతినిధులకు చేసిన ఫోన్స్, అలాగే చంద్రబాల నుంచి సిబిఐ జెడికి వచ్చిన ఫోన్ కాల్స్ వివరాలను వారు విడుదల చేశారు. అందులో పేర్కొన్న దాని ప్రకారం గత మార్చి నుంచి జూన్ 17వరకు ఫోన్ కాల్స్ వివరాలు ఈవిధంగా ఉన్నాయి.
సిబిఐ జెడి లక్ష్మీనారాయణ ఫోన్ నంబర్ 9441433444 నుంచి వివిధ మీడియా ప్రతినిధులకు, వాసిరెడ్డి చంద్రబాలకు వెళ్లిన ఫోన్ కాల్స్ వివరాలు
ఫోన్ నంబర్ పేరు కాల్స్ సంఖ్య
9618490234 వాసిరెడ్డి చంద్రబాల 328
9951955055 నాగమారుతి శర్మ 5
9985494998 ఆంధ్రజ్యోతి పవన్ 5
9948299868 టీవీ 9 మురళీధర్ 5
9010234298 ఎన్టీవీ అరవింద్‌శర్మ 18
9490618089 ఆంధ్రజ్యోతి ఎబిఎన్ వెంకట్ 54
8008002223 ఈనాడు విశ్వప్రసాద్ 11
8008771053 ఈనాడు వీరభద్రం 56
9703618700 ఎబిఎన్ ఆంధ్రజ్యోతి సత్యనారాయణ 94
9849041904 ఇండియన్ ఎక్స్‌ప్రెస్ విక్రమశర్మ 107
9866305825 టైమ్ ఆఫ్ ఇండియా బి కృష్ణప్రసాద్ 123
9490618068 రమేష్ వైట్ల 142
9966608777 టీవీ-9 మహాత్మా 381
వాసిరెడ్డి చంద్రబాల అనే మహిళ మొబైల్ ఫోన్ 9618490234 నుంచి సిబిఐ జెడి లక్ష్మీనారాయణ, ఇతర ప్రముఖులకు వెళ్లిన ఫోన్ కాల్స్ వివరాలు.
9441433444 వివి లక్ష్మీనారాయణ 411
9441113444 వివి లక్ష్మీనారాయణ 21
9985411111 రాధాకృష్ణ (ఆంధ్రజ్యోతి) 10
8886200013 డెల్లాయిట్, హైదరాబాద్ 10
9849016366 జెవి రాముడు, ఐపిఎస్ 15
దర్యాప్తు లీకు చేస్తున్న సిబిఐ జెడి
మీడియాలో ఉన్న పోటీని, వైరాన్ని అడ్డుపెట్టుకుని, అందులో కొందరిని తన పథకంలో భాగస్వాములుగా మార్చుకోవడమో, లేక వారి పథకంలో తాను భాగం కావడం వరకు సిబిఐ జెడి లక్ష్మీనారాయణ వెళ్లిపోయారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. సిబిఐ మాన్యువల్ ప్రకారం సిబిఐ తప్పుడు ప్రచారం చేయకూడదన్నారు. కేసుకు సంబంధించి మీడియాలో వచ్చే కథనాల మీద ఎప్పటికప్పుడు వివరణ ఇవ్వాలన్నారు. సాక్షి మీడియాను ప్రత్యర్ధిగా చేస్తున్న చానళ్లకు జగన్ ఆస్తుల కేసులో అసత్యాలను సరఫరా చేసే సంస్థగా సిబిఐ తయారైందన్నారు. ఈ నేపథ్యంలో సిబిఐ జెడి లక్ష్మీనారాయణ ఫోన్ నుంచి వెళ్లిన దానికి, వచ్చిన కాల్స్ వివరాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. వీటిని పరిశీలించిన తర్వాత జగన్మోహన్‌రెడ్డి విచారణ పేరిట జరుగుతున్న తంతులో చాలా లోతైన కుట్ర దాగి ఉందని ఎవరికైనా అర్థమవుతుందన్నారు. ఈ ఫోన్లలో ఒక వర్గం వారికి వెళ్లిన ఫోన్లు ఉన్నాయన్నారు. దర్యాప్తుతో సంబంధంలేని అధికారులకు వెళ్లిన ఫోన్లు ఉన్నాయి. అన్నింటికంటే దిగ్భ్రాంతికరమైన విషయమేమిటంటే, వాసిరెడ్డి చంద్రబాల అనే మహిళ ఫోన్‌కు జెడి నుంచి, ఆమె ఫోన్ నుంచి జెడికి ఒక ప్రవాహంలా ఫోన్‌కాల్స్ రావడం, వెళ్లడం కనిపించిందన్నారు. వాసిరెడ్డి చంద్రబాల ఫోన్ నుంచి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు, మీడియాలో ఒకవర్గం వారికి విపరీతంగా ఫోన్‌కాల్స్ వెళ్లాయి. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాల పాత్ర మీద విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కోరారు.

http://www.andhrabhoomi.net/node/31845

రాష్ట్రవ్యాప్తంగా లక్ష్మీనారాయణ దిష్టిబొమ్మల దహనం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ వైఖరికి నిరసన తెలుపుతూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. లక్ష్మీనారాయణ దిష్టి బొమ్మకు శవయాత్ర చేసి దహనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో కార్యకర్తలు లక్ష్మీనారాయణ దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి దహనం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నేత జమీర్ అహ్మద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు జేడీ లక్ష్మీనారాయణ దిష్టిబొమ్మ దహనం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో పార్టీ నేత వినోద్‌ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా చేశారు. అనంతపురం జిల్లా సోమందేపల్లిలో రవీంద్రనాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు లక్ష్మీనారాయణ దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి, దహనం చేశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పార్టీ నేత పీకే కృష్ణ ఆధ్వర్యంలో కార్యకర్తలు జేడీ లక్ష్మీనారాయణ దిష్టిబొమ్మ దహనం చేశారు.

Keeping Jagan inside the jail is more risky for the opposition


An age old Telugu saying goes 'Adavi Lo Unna, Bonu Lo Unna..Simham Simhame'. And the same logic applies to few men as well. Right now, one man in Andhra Pradesh is also being tagged in this category .
He is none other than Y S Jagan. The talk is "Keeping Jagan inside the jail is more risky for the opposition. When he is outside, he is busy with Odarpu Yatra, meetings and other activities. He is always focused on doing something. But now he is inside."
An observer said, "Now that he is inside, he has nothing to do so he is busy sketching some master plans which will prove very costly to the TDP and Congress government. It is actually a dicey price they are paying by putting him inside."

We Develop YSR Motives : YS Vijayamma

YSRCP MLAS Grand Tribute to YSR at YSRCP Office

ప్రజాపక్షాన నిలుస్తాం: విజయమ్మ

ప్రజా సమస్యల పరిష్కారంలో అసలైన ప్రతిపక్షం పాత్ర పోషిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత వైఎస్‌ విజయమ్మ ప్రకటించారు. పార్టీ కార్యాలయానికి తొలిసారి వచ్చిన ఆమె శుక్రవారం ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణ, ర్టీపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన చర్చించారు. అక్కడి నుంచి బస్సులో ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్లారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విజయమ్మ పాల్గొన్నారు.

Revanth Reddy did land settlements with Bhanu

Major Conspiracy on YS Jagan

Investigation Leader As a Leak Leader

VasiReddy ChandraBala Phone Calls History

What Saying CBI Manual?

YSRCP Not Against on Journalists:Ambati

జగన్ బెయిల్ పిటిషన్ పై విచారణ 27కి వాయిదా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. అలాగే కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. 

వైఎస్ఆర్ కు నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు

ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నేడు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఉదయం ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. మహానేత వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి ఘటించారు. 

ఈ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రానున్నారు. స్పీకర్‌ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అంతకంటే ముందు ఎమ్మెల్యేలంతా మాజీ మంత్రి, పరకాల నియోజకవర్గం నుంచి తృటిలో ఓటమి పాలైన కొండా సురేఖ ఇంటికి వెళ్తారు.

భాను, దంతులూరి కృష్ణతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి భారీ స్థాయిలో సెటిల్‌మెంట్లు

- పాలమూరు జిల్లాలో 25 ఎకరాలు హాంఫట్
- భూ యజమానురాలిని బెదిరించి రిజిస్ట్రేషన్
- టీడీపీ ఎమ్మెల్యే పాత్రపై సీఐడీ ఆరా
- తాజాగా కేసు నమోదుచేసిన సీఐడీ అధికారులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌తో తెలుగుదేశం పార్టీ సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయి. భాను, దంతులూరి కృష్ణతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి భారీ స్థాయిలో సెటిల్‌మెంట్లు చేసిన వ్యవహారం వెలుగుచూసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన రేవంత్‌రెడ్డికి భాను ముఠాతో సంబంధాలు ఉన్నాయని గడచిన కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అదే విషయాన్ని ఇప్పుడు సీఐడీ నిర్ధారించింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ భూ దందాలో భాను, కృష్ణలకు రేవంత్‌రెడ్డి సహకరించినట్లు తేల్చింది.

మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలం చెల్లంపల్లి గ్రామం, తకరాజుగూడ శివారులో 25 ఎకరాల వ్యవసాయ భూమిని.. విదేశాలలో ఉంటున్న యాజమానురాలికి తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో సొంతం చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పాత్రకూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో సీఐడీ అధికారులు కేసు (క్రైం నంబర్. 45/2012) నమోదుచేశారు. రేవంత్‌తో పాటు భానుకిరణ్, దంతులూరి కృష్ణ, పోరెడ్డి ప్రభాకరరెడ్డి, న్యాయవాది ఈడిగ శ్రీకాంత్ గౌడ్, మరికొంతమంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. 

కేసు వివరాలివీ..
పాలమూరు జిల్లా తలకొండపల్లి మండలం చెల్లంపల్లి గ్రామానికి చెందిన టి.సునీత వర్జీనియాలో నివాసముంటున్నారు. చెల్లంపల్లిలోని 29/ఏ, 30/ఏ, 36/ఏ సర్వే నంబర్‌లలో ఆమెకు 25 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి యజమానురాలు విదేశాల్లో ఉంటున్న విషయాన్ని పసిగట్టి ఆ భూమిని స్వాహా చేసేందుకు పథక రచన చేశారు. ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పాస్ పుస్తకాలను సృష్టించారు. వేరొక మహిళను సునీతగా చూపించి.. 2006 డిసెంబర్‌లో దంతులూరి కృష్ణ, ప్రభాకర్‌రెడ్డి పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించారు. తన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు భూ యజమానురాలు సునీతకు సమాచారం అందడంతో ఆమె హుటాహుటిన వర్జీనియా నుంచి చెల్లంపల్లికి వచ్చారు. 

ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరించారు. దీంతో తెలుగుదేశం యువ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రంగప్రవేశం చేశారు. భానుకిరణ్, మంగలి కృష్ణకు వత్తాసు పలికారు. ఆమెను నయానా భయానా బెదిరించి.. కొంత డబ్బు ఇప్పించి పరిష్కారం చేయడంతో 2007 ఏప్రిల్‌లో భానుకిరణ్, దంతులూరి కృష్ణ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 

మంచిరేవుల భూ దందా గతంలోనే వెలుగులోకి
భానుకిరణ్ గ్యాంగ్‌తో కలసి రేవంత్‌రెడ్డి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలలో భూ దందాలకు పాల్పడిన వ్యవహారం గతంలోనే వెలుగులోకి వచ్చింది. తెలుగుదేశం యువ ఎమ్మెల్యేతోపాటు ప్రభుత్వంలో అత్యంత సీనియర్ మంత్రిగా పేరున్న ఒక నేత కుమారుడు కూడా భానుకిరణ్ భూ దందాలకు స్నేహ హస్తం అందించినట్లు సీఐడీ విచారణలో వెలుగుచూసింది. అధికార, ప్రతిపక్ష నేతలతో కలసి చేసిన భూ దందాల వివరాలను సీఐడీ కస్టడీ సమయంలో భానుకిరణ్ పూసగుచ్చినట్లు వెల్లడించాడు.

రంగారెడ్డి జిల్లా గండిపేట సబ్‌రిజిస్ట్రార్ పరిధిలోని మంచిరేవుల గ్రామంలో రూ.50 కోట్ల విలువచేసే 26.36 ఎకరాల భూమి సెటిల్‌మెంట్‌లో రేవంత్‌రెడ్డితో పాటు సీనియర్ మంత్రి కుమారుడు కీలకపాత్ర పోషించినట్లు సీఐడీ విచారణలో వివరించాడు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భానుచేసిన భూ దందాలలోనూ వారిద్దరి పాత్ర ఉన్నట్లు తేలింది. రాజధాని శివార్లలో భూ దందాలు, సెటిల్‌మెంట్‌లకు భానుకిరణ్‌ను వారు ఉపయోగించుకున్నట్లు కూడా బయటపడింది. దీంతో భానుకిరణ్‌తో రాజకీయ నేతల సంబంధాలపై సీఐడీ పూర్తిస్థాయిలో ఆరా తీస్తోంది.

జేడీ తీరుపై కోర్టుకు: వైఎస్సార్ సీపీ లీగల్ సెల్

రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న సీబీఐ జాయింట్ డెరైక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ తీరుపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ లీగల్‌సెల్ తెలిపింది. లక్ష్మీనారాయణ తీరు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేసేదిలా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. నార్కో అనాలసిస్ పరీక్షలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ధిక్కరించి జగన్‌కు అవే పరీక్షలు చేయాలని లక్ష్మీనారాయణ పట్టుపట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం లీగల్‌సెల్ సమావేశమైంది. ఆ వివరాలను న్యాయవాది వై.నాగిరెడ్డితో కలిసి లీగల్‌సెల్ కన్వీనర్ చిత్తర్వు నాగేశ్వరరావు విలేకరులకు తెలిపారు. సీబీఐ బుక్‌రూల్‌కు విరుద్ధంగా వ్యవహరించిన జేడీ లక్ష్మీనారాయణపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘నార్కో పరీక్షలపై కృషి బ్యాంకు వెంకటేశ్వరరావు విషయంలో సుప్రీం కోర్టు ఫుల్‌బెంచ్ స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆర్టికల్ 21కు ఇది పూర్తి విరుద్ధమని పేర్కొంది. నార్కో పరీక్షల ద్వారా స్పృహలో లేని వ్యక్తి ఇచ్చే ఆధారాలు పరిగణనలోకి తీసుకోలేమని చెప్పింది. ఆ టెస్టుల ద్వారా మనిషి బ్రెయిన్ దెబ్బతినడమే కాకుండా మూత్రపిండాలు పాడయ్యే ప్రమాదం ఉంది’ అని పేర్కొన్నారు.

వైఎస్సార్ సీపీలో చేరిన బీవీ రామారావు


హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య (ఎఫ్‌ఏపీఐ) అధ్యక్షుడు బీవీ రామారావు గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను వారి నివాసం వద్ద కలిసి మద్దతు ప్రకటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీలో చేరినట్లు తెలిపారు.

జగన్ కేసుల నుంచి జేడీని తప్పించాలి



లక్ష్మీనారాయణ దర్యాప్తునకు అనర్హుడు
జేడీకి విలేకరులు ఫోన్ చేయడంలో తప్పులేదు
విలేకరులకు జేడీ ఫోన్లు చేయడాన్నే మేం ప్రశ్నిస్తున్నాం
ఆ ఫోన్ కాల్ జాబితా వెల్లడి వల్ల విలేకరులకు బెదిరింపు కాల్స్ వచ్చినట్టయితే ఖండిస్తున్నాం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసుల దర్యాప్తులో ఆద్యంతమూ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్న సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణను తక్షణం ఈ కేసు విచారణ నుంచి తప్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, జనక్ ప్రసాద్, శివకుమార్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లక్ష్మీ నారాయణ ఒక ఉన్నత స్థానంలో ఉం టూ కీలకమైన కేసులను దర్యాప్తు చేస్తూ విచారణకు సంబంధించిన విషయాలను లీకుల రూపంలో వెల్లడిస్తున్నారని ధ్వజమెత్తారు.

అసలు విచారణ వివరాలను లీకుల పేరుతో వెల్లడించడం సీబీఐ మాన్యువల్(నియమావళి)కు విరుద్ధమని, ఇందుకు సంబంధించి హైకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. గత రెండు మాసాలుగా జేడీ పదేపదే పత్రికా విలేకరులతోనూ, పత్రికాధిపతులతోనూ మాట్లాడినట్లు.. కాల్స్ వివరాలను బట్టి తెలుస్తోందని అన్నారు. తమ పార్టీకి బద్ధ వ్యతిరేకి అయిన ఆంధ్రజ్యోతి అధిపతి రాధాకృష్ణతో కూడా జేడీ మాట్లాడారని ఆయన వెల్లడించారు.

కొన్ని పత్రికలతోనే ఎందుకు?

‘పత్రికల, చానెళ్ల విలేకరులు విచారణ వివరాలు తెలుసుకునేందుకు సీబీఐ జేడీకి ఫోన్ చేయడాన్ని మేం ప్రశ్నించడం లేదు. కానీ జేడీ స్వయంగా కొన్ని ఎంపిక చేసుకున్న పత్రికలు, చానెళ్ల విలేకరులతో మాట్లాడటాన్ని మేం ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు వాసిరెడ్డి చంద్రబాల అనే మహిళతో జేడీ ఫోన్‌లో మాట్లాడారు. ఆ తరువాత ఆమె మాకు వ్యతిరేకి అయిన రాధాకృష్ణతో మాట్లాడారు. ఇలా ఎందుకు జరిగిందో రామాయణంలో పిడకల వేటలాగా ఆ చంద్రబాల ఎవరో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో లక్ష్మీ నారాయణ సమాధానం ఇవ్వాలి’ అని అంబటి డిమాండ్ చేశారు. ఈ చంద్రబాల పోలీసు ఉన్నతాధికారి, గ్రేహౌండ్స్ అధిపతితో ఎందుకు మాట్లాడారో కూడా తేలాలన్నారు. విలేకరులు ఎన్ని లక్షల సార్లు లక్ష్మీనారాయణకు ఫోన్ చేసినా ఎవరికీ అభ్యంతరం లేదని, అయితే ఆయనే స్వయంగా విలేకరులకు ఫోన్లు చేసి మాట్లాడటం తప్పు అని అంటున్నామని, ఈ విషయంలో విలేకరులు అపార్థం చేసుకోరాదని కోరారు.

ఆది నుంచీ లీకులే..

అసలు జగన్ కేసులపై విచారణ మొదలైనప్పటి నుంచీ ఆ దర్యాప్తు అంతర్గత వివరాలన్నీ ‘ఈనాడు’ సహా కొన్ని పత్రికల్లో పూసగుచ్చినట్లు వస్తున్నాయని తాము చెబుతూనే ఉన్నామని, ఇపుడు ఫోన్‌కాల్స్ ద్వారా అది అక్షరాలా నిజమైందని అంబటి అన్నారు. తాను స్వయంగా ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో సాక్షిగా సీబీఐ ముందు హాజరైతే అక్కడ జరిగిన విషయాలన్నీ మరుసటి రోజు ‘ఈనాడు’ పత్రికలో వచ్చాయన్నారు. అంతే కాదు, సీబీఐ కోర్టు న్యాయమూర్తి నాగమారుతీ శర్మ బదిలీ అవుతున్న విషయం కూడా ముందుగా ఒక తోక పత్రికలో వచ్చిందని, సీబీఐ అధికారులు ఉద్దేశపూర్వకంగా లీక్ చేయకపోతే ఇవన్నీ ఎలా వచ్చాయో లక్ష్మీనారాయణ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

జగన్ కేసుల విషయంలో నిష్పాక్షికంగా విచారణ జరగడంలేదని, ఎంత సేపూ ఆయన్ను ఏదో విధంగా ఇరికించాలనే విధంగా జరుగుతోందని ఆయన అన్నారు. విచారణ వివరాలు చెప్పదల్చుకుంటే పత్రికా విలేకరుల సమావేశం పెట్టి చెబితే తప్పు లేదని కూడా ఆయన అన్నారు. తమ పార్టీ విడుదల చేసిన ఫోన్ కాల్స్ జాబితా ఆధారంగా ఎవరి నుంచైనా ఎక్కడి నుంచైనా విలేకరులకు బెదిరింపు కాల్స్ వచ్చినట్టయితే తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

బెయిల్ ఇవ్వండి

హైకోర్టును ఆశ్రయించిన జగన్‌మోహన్‌రెడ్డి
సంబంధం లేని కారణంతో సీబీఐ కోర్టు బెయిల్ తిరస్కరించింది
ఎంపీని గనుక జైల్లోనే ఉంచాలనడం సుప్రీం తీర్పులకూ విరుద్ధమే
నా హోదాతో సాక్షుల్ని ప్రభావితం చేస్తానన్నది సీబీఐ అపోహే
కేసులో నాపై సీబీఐ చేసిన ఆరోపణల్లో వాస్తవం అసలే లేదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: పెట్టుబడుల కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును అభ్యర్థించారు. గురువారం ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ ఆరోపించినట్టుగా తాను ఎలాంటి నేరమూ చేయలేదని అందులో వివరించారు. ‘‘నా బెయిల్ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంబంధం లేని కారణాలను చూపుతూ కొట్టేసింది. అదెంత మాత్రమూ సరికాదు. నా కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి గతేడాది ఆగస్టులో హైకోర్టు ఆదేశాల ప్రకారం దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఇప్పటి వరకు మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది. 156 మందిని సాక్షులుగా పేర్కొంది. ఆ చార్జిషీట్‌లలో సీబీఐ అధికారులు నాపై చేసిన ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదు. నేను పార్లమెంట్ సభ్యుడిని కాబట్టి, సాక్షులను బెదిరించడం, సాక్ష్యాలను తారుమారు చేయడం చేయవచ్చనే కారణంతో కింది కోర్టు నాకు బెయిల్ నిరాకరించింది. ఇదెంత మాత్రమూ సరైన కారణం కాదు’’ అని ఆయన వివరించారు. దర్యాప్తుకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటానని, బెయిల్ మంజూరు సమయంలో ఎలాంటి షరతులు విధించినా పాటిస్తానని హైకోర్టుకు తెలిపారు.

నా హోదాను నాకు వ్యతిరేకంగా వాడటం చట్టవిరుద్ధమే

కడప లోక్‌సభ స్థానం నుంచి తాను 5.43 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందానని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నానని పిటిషన్‌లో జగన్ పేర్కొన్నారు. ‘‘ఇటీవలి 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్న సమయంలో, సీబీఐ అధికారులు తమ ముందు హాజరవాలంటూ హఠాత్తుగా సీఆర్పీసీ సెక్షన్ 41 ఎ(1) కింద నోటీసిచ్చారు. దాన్ని గౌరవిస్తూ 25, 26, 27 తేదీల్లో సీబీఐ ఎదుట హాజరయ్యాను. దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరించాను. అయినా మే 27న సీబీఐ అధికారులు నన్ను అరెస్టు చేశారు. నేను పార్లమెంట్ సభ్యుడిని కాబట్టి, ఆ హోదా వల్ల దర్యాప్తులో జోక్యం చేసుకునే, సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని ఆ సందర్భంగా జారీ చేసిన మెమోలో పేర్కొన్నారు. 

గతేడాది సీబీఐ దర్యాప్తు ప్రారంభమైన నాటి నుంచి మే 26 దాకా నేను బయటే ఉన్నాను. దర్యాప్తులో భాగంగా మూడు చార్జిషీట్లు కూడా దాఖలు చేశారు. బయట ఉన్నంత కాలం నేను దర్యాప్తులో జోక్యం చేసుకున్నట్టు సీబీఐ ఎన్నడూ ఆరోపించలేదు. సాక్షులను ప్రభావితం చేసినట్టు నిరూపించనూ లేదు. నా కస్టడీ కోరుతూ సీబీఐ అధికారులు వేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు అనుమతించకుండా నన్ను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. దాన్ని సవాలు చేస్తూ నేను, నన్ను కస్టడీకివ్వాలంటూ సీబీఐ హైకోర్టులో పిటిషన్ వేశాం. హైకోర్టు నన్ను ఐదు రోజుల కస్టడీకిచ్చింది. తరవాత మరో రెండు రోజులు పొడిగించింది. మే 29న నేను పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే తోసిపుచ్చింది. 

దాంతో నేను జ్యుడీషియల్ రిమాండ్‌లోనే కొనసాగాల్సి వస్తోంది. నా హోదా వల్ల సాక్షులను ప్రభావితం చేయవచ్చనేది సీబీఐ అపోహ, ఆందోళన మాత్రమే. ఇందుకు వారిప్పటిదాకా ఎలాంటి ఆధారాలూ చూపలేదు. నా హోదాను నాకు వ్యతిరేకంగా ఉపయోగించడం చట్టవిరుద్ధం. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే నాటి నుంచీ నేను ఎంపీగానే ఉన్నాను. భవిష్యత్తులోనూ కొనసాగుతాను. హోదా వల్ల బెయిల్ తిరస్కరించడం, జైల్లోనే ఉండాలనటం ఏమాత్రమూ చట్టబద్ధం కాదు. ఇది సుప్రీంకోర్టు తీర్పులకూ విరుద్ధమే. నిందితుడు దర్యాప్తులో జోక్యం చేసుకోనప్పుడు, సాక్షులను ప్రభావితం చేయనప్పుడు, దర్యాప్తు పరిధి నుంచి పారిపోనప్పుడు బెయిలివ్వచ్చని, స్వేచ్ఛగా తిరగనివ్వచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ నా విషయంలో కింది కోర్టు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అరెస్టు చేయొచ్చని సుప్రీం చెప్పింది. ఈ కేసులో అలాంటివేమీ లేవు. ఒక వ్యక్తి స్వేచ్ఛను నిరోధించడమంటే అతన్ని శిక్షించడమే అవుతుంది. సీబీఐ దర్యాప్తు కూడా దాదాపు పూర్తి కావచ్చినందున నాకు బెయిలిస్తే వారికి, దర్యాప్తుకు ఇబ్బందేమీ లేదు. నేను గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చాను. సిట్టింగ్ ఎంపీని. రాజకీయ పార్టీ అధ్యక్షుడిని. సాక్షులను ప్రభావితం చేయడం జరగనే జరగదు’’ అని జగన్ వివరించారు.

సీబీఐ మాన్యువల్‌లో ఏముంది?

మీడియా విషయంలో సీబీఐ ఎలా వ్యవహరించాలన్న అంశాన్ని దర్యాప్తు సంస్థ మాన్యువల్ (నియమావళి)లో స్పష్టంగా పేర్కొన్నారు. అందులోని ఐదు పేజీల్లో ఈ వివరాలు ప్రత్యేకంగా పేర్కొన్నారు. ‘సీబీఐ అనేది ఒక బహిరంగ సంస్థ కాదు, అదే సమయంలో అదేమీ గోప్యతతో కూడుకున్న సంస్థ కూడా కాదు. అది ప్రభుత్వానికీ, కోర్టులకూ, పార్లమెంటుకూ, చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌కూ, ప్రజలకూ, పత్రికలకూ జవాబుదారీగా ఉండాల్సిన సంస్థ. కేసుల దర్యాప్తుతో రాజీ పడకుండా, విచారణ దెబ్బ తినకుండా సీబీఐ.. మీడియా, పత్రికలతో సంబంధాలు నెరపవచ్చు. కాబట్టి, పత్రికలకు సీబీఐ విడుదల చేయదలచుకున్న సమాచారం జాగ్రత్తగా సరిచూసుకున్న తరువాత గానీ విడుదల చేయకూడదు. 

ప్రజాస్వామ్యంలో మీడియా పాత్రను ఈ సందర్భంగా గుర్తించాలి. ప్రజా ప్రాధాన్యం గల కేసుల పురోగతి గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. అదే సమయంలో.. దర్యాప్తు లోతుగా జరుగుతున్న తరుణంలో అది పూర్తి కాక ముందే ప్రాచుర్యం కావాలనుకోవడం ఏ మాత్రం వాంఛనీయం కాదు. దీన్ని కచ్చితంగా నిరోధించాలి’ అని మాన్యువల్‌లోని 24.9 నిబంధన స్పష్టం చేస్తోంది. 

ఇక 24.11 నిబంధనలోని అంశాల ప్రకారం.. తాము ఏదైనా వల పన్ని విజయవంతంగా పట్టుకున్నపుడు, కేసుల రిజిస్ట్రేషన్ చేసినపుడు, ప్రజల దృష్టిలో బాగా కావాల్సిన (మోస్ట్ వాంటెడ్) నేరస్తులను పట్టుకున్నపుడు సీబీఐ మీడియాకు పత్రికా ప్రకటనల ద్వారా తెలియజేయవచ్చు. ఒక కేసులో చార్జిషీటు వేసేటపుడు కూడా తెలియ జేయ వచ్చు. ఏదైనా కేసులో నిందితులకు శిక్ష పడినపుడు ఆ విషయాన్ని కూడా ప్రకటించవచ్చు.

ఏ స్థాయి అధికారి ప్రకటన జారీ చేయవచ్చు?
ఢిల్లీ బయట ఉన్న సీబీఐ కార్యాలయాల నుంచి ఎస్‌పీ హోదా గల అధికారి మాత్రమే పత్రికా ప్రకటనలు జారీ చేయాలి. అవి కూడా స్థానిక ప్రయోజనాలున్న కేసుల కు సంబంధించినవిగా మాత్రమే ఉండాలి. అది కూడా నేరుగా ఎస్‌పీ హోదా గల అధికారి విలేకరుల సమావేశంలో మాట్లాడరాదు. పి.ఐ.బి అధికారుల ద్వారా మాత్రమే పత్రికా ఆహ్వానాలు పంపి అపుడే తాము చెప్పదల్చుకున్న సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. 35.15 ప్రకారం సీబీఐ ప్రధాన కార్యాలయంలోనైతే డిప్యూటీ ప్రిన్సిపల్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ మాత్రమే సీబీఐ వ్యవహారాలు పత్రికలకు చెప్పడానికి అర్హుడు. 

పత్రికలకు, మీడియాకు సీబీఐలోని డీసీబీఐ, ఎస్‌డీబీఐ, ఏడీసీబీఐ అధికారులు మాత్రమే బ్రీఫింగ్ ఇవ్వాలి. ఒక వేళ సీబీఐ జాయింట్ డెరైక్టర్ పత్రికలతో మాట్లాడాలనుకుంటే ముందుగా ఆయన అదనపు డెరైక్టర్ లేదా సీబీఐ డెరైక్టర్ నుంచి అనుమతి తీసుకుని తీరాలి. డీఐజీ, ఎస్‌పీ లేదా ఆ హోదాకు తక్కువైన అధికారి ఎవరూ కూడా పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదా పత్రికలతో మాట్లాడ్డం గానీ చేయకూడదు. ఏదైనా ఒక కేసులో ముఖ్యమైన మలుపు ఉంటే దానిని తక్షణం డిప్యూటీ ప్రిన్సిపల్ ఇన్ఫర్మేషన్ అధికారి ద్వారా మాత్రమే తెలియజేయాల్సి ఉంటుంది.

ఖండనలు, వివరణలు
సీబీఐ దర్యాప్తు సమాచారాన్ని ఏదైనా పత్రిక వక్రీక రించి ప్రచురిస్తే లేదా సీబీఐ దర్యాప్తులో వెల్లడైన విషయాలను తప్పుగా ప్రచురిస్తే స్థానిక సీబీఐ ఎస్‌పీ వాటిని సత్వరం డీఐజీ, లేదా జాయింట్ డెరైక్టర్ దృష్టికి తెచ్చి వారి అనుమతితో రిజాయిండర్లు, సవరణలు జారీ చేయవచ్చు. (ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ దర్యాప్తు జరుపుతున్న కేసుల విషయంలో సీబీఐ అధికారులు ఏ మాత్రం ఈ నిబంధనలు పాటించడం లేదనేది సుస్పష్టం)

సీబీఐ జేడీ తీరుతో జగన్ భద్రతకే ముప్పు!

* లీకుల పేరిట విలేకరులను పావులుగా వాడుకుంటున్నారు
* ప్రెస్‌కు లీకులు చేయొద్దని సీబీఐ మాన్యువల్‌లో స్పష్టంగా ఉంది
* సీఆర్‌పీసీ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులూ ఉన్నాయి
* ఇది తెలిసీ విలేకరులకు ఫోన్లుచేసి లీకులివ్వడం వెనుక పెద్ద కుట్ర దాగివుంది
* రాష్ట్రపతి, ప్రధాని, సీవీసీలకు ఫిర్యాదు చేస్తాం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘ప్రజా ప్రాధాన్యం కలిగిన కేసుల విచారణలో పురోగతి వివరాలను ప్రజలు తెలుసుకోవచ్చు. అయితే విచారణకు ముందే దానికి ప్రాచుర్యం కల్పించడం, లోతైన దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు ఆ వివరాలు బయటకు రావడం అవాంఛనీయం. అటువంటివి నివారించాలి... అని సీబీఐ మాన్యువల్(నిబంధనావళి)లో స్పష్టంగా ఉంది. అయినప్పటికీ సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ కొన్ని ఎంపిక చేసుకున్న చానెళ్లకు ఫోన్లు చేసి మరీ లీకులివ్వడం దారుణం. ఆయన తీరు వల్ల మా అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతకే ముప్పు ఏర్పడింద’’ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ ఎంవీ మైసూరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 

జగన్ కేసు విషయంలో కక్ష గట్టిన ఫ్యాక్షనిస్టులా ఆయన విచారణ జరుపుతున్నట్లు కనిపిస్తోందన్నారు. మీడియాకు లీకుల పేరిట విలేకరులనూ ఆయన పావులుగా వాడుకుంటున్నారని పేర్కొన్నారు. దీనివెనుక పెద్ద కుట్ర ఉందనే అనుమానం కలుగుతోందని చెప్పారు. దీనిపై తాము రాష్ట్రపతి, ప్రధానమంత్రితోపాటు కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఫోన్‌కాల్స్ సంభాషణలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే వాస్తవాలేమిటో నిగ్గు తేలుతాయని చెప్పారు. గురువారం ఆయన ‘సాక్షి’ టీవీలో జరిగిన చర్చలో పాల్గొన్నారు. వీక్షకులడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

సీఆర్‌పీసీ కూడా అదే చెబుతోంది..
ఏదైనా ఒక కేసు విచారణలో ఉండగా మీడియాకు వివరాలు లీక్ చేయడం సీబీఐ మాన్యువల్ (నిబంధనావళి)కే విరుద్ధమని మైసూరారెడ్డి అన్నారు. సీఆర్పీసీలోని 11వ అధ్యాయంలోనూ ఈ విషయం స్పష్టంగా ఉందని, ఆయన దానినీ చదివి వినిపించారు. 1969-70 లో ‘నర్సింహులు వర్సెస్ ఏపీ స్టేట్’ కేసులో సుప్రీంకోర్టు ఈ విషయంపై స్పష్టమైన తీర్పును కూడా వెలువరించిందని చెప్పారు. సీబీఐ జాయింట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న లక్ష్మీనారాయణకు ఇవన్నీ తెలిసినా.. కావాలనే చేస్తున్నట్లు కనిపిస్తోందని, దీనివెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు అనుమానించాల్సి వస్తోందన్నారు. 

పత్రికా పోటీ ప్రపంచంలో సమాచార సేకరణ కోసం విలేకరులు సీబీఐ అధికారులకు ఫోన్ చేయడంలో తప్పు లేదని చెప్పిన మైసూరా.. సీబీఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణ మాత్రం విలేకరులకు ఫోన్లు చేసి లీకులివ్వడం, ఎస్సెమ్మెస్‌లు పంపడం మాత్రం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఆయన తీరు చూస్తుంటే ఇది ఎంతదూరం పోతుందోననే అనుమానం వస్తోందన్నారు. సీబీఐ జేడీ ఫోన్‌కాల్స్ జాబితాపై సుప్రీంకోర్టు జడ్జి ద్వారా విచారణ జరిపితే వాస్తవాలేమిటో బయటకొస్తాయని అన్నారు.

జైల్లో రాత్రంతా కరెంటు లేదు..
‘‘జగన్‌ను భద్రత లేని వాహనాల్లో తీసుకెళ్లడం, సీబీఐ అధికారులు జగన్‌ను కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఒక్కోరోజు ఒక్కోచోట విచారణ జరపడం, ఏ వాహనంలో ఆయనను తీసుకెళుతున్నారనే విషయం ముందుగానే మీడియాకు లీక్ కావడం, జగన్ ఉన్న జైల్లో నిన్న రాత్రంతా కరెంట్ లేకపోవడం, ముక్కలు ముక్కలుగా చార్జిషీట్లు వే యడం, అలా చేసిన ప్రతిసారీ జగన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉండటం... ఇలాంటి అంశాలను చూస్తుంటే జగన్‌కు భౌతికంగా హాని కలిగే ప్రమాదముందనే ఆందోళన కలుగుతోంది. పైగా చంద్రబాల అనే మహిళ నుంచి వందల కాల్స్ సీబీఐ జేడీకి వెళ్లడం, ఆయన నుంచి మళ్లీ ఆమెకు వందల సంఖ్యలో ఫోన్లు వెళ్లడం... ఆమే జగన్ ప్రత్యర్థులకు ఫోన్ చేసి మాట్లాడటం చూస్తుంటే జగన్‌పై ఏదో కుట్ర చేస్తుందనే అనేక అనుమానాలు కలుగుతున్నాయి’’ అని మైసూరారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. సున్నితమైన జగన్ కేసు విషయంలో ఎంతో నిబద్ధతతో వ్యవహరించాల్సిన సీబీఐ జేడీ ఇంతమంది వ్యక్తులకు ఫోన్లు చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు.

సుప్రీంకోర్టు వద్దన్నా నార్కో పరీక్షలా?
నార్కో అనాలసిస్ పరీక్ష అశాస్త్రీయమని సుప్రీంకోర్టే చెప్పిందని, డోస్ ఎక్కువైతే కిడ్నీలు, మెదడు దెబ్బతిని ప్రాణాపాయం జరిగే ప్రమాదముందని మైసూరారెడ్డి తెలిపారు. ఈ విషయాలు తెలిసి కూడా సీబీఐ హైకోర్టులో పిటిషన్ వేసిందంటే ఏమనుకోవాలో అర్థం కావడం లేదన్నారు. జగన్‌కు ప్రాణహాని కలిగించాలనే కుట్రతోనే నార్కో పరీక్ష చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. సీబీఐ వాళ్లు ఎవరిని విచారించినా జగన్ పేరు చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. జగన్ తప్పు చేయనప్పుడు మేమెట్లా ఆయన పేరు చెబుతామని విచారణ ఎదుర్కొన్న వాళ్లు అడుగుతున్నారని, ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యను కూడా ఇలాగే ఒత్తిడి చేసిన విషయాన్ని ఆయనే స్వయంగా కోర్టుకు విన్నవించినట్లు తాను విన్నానన్నారు. మొత్తంగా చూస్తే లక్ష్మీనారాయణ పరిధి దాటి, కోర్టు తీర్పును అతిక్రమించి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని, దీనివల్ల సీబీఐకే చెడ్డ పేరొస్తుందని అభిప్రాయపడ్డారు.

లీకులు చేయట్లేదని కోర్టుకు చెప్పారు
సాక్ష్యాలన్నీ సేకరించాక చార్జిషీట్ వేయాల్సిన సీబీఐ వ్యక్తిగత కక్షలతో ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ కక్షగట్టిన ఫ్యాక్షనిస్టులా దర్యాప్తు చేస్తున్నట్లుగా కనిపిస్తోందని, ఆయనిలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని మైసూరా అన్నారు. పైగా కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తానెవరికీ లీకులు చేయలేదని, విలేకరులతో మాట్లాడలేదని చెప్పిన లక్ష్మీనారాయణ ..తాజా ఫోన్‌కాల్స్ జాబితాను చూస్తుంటే ఎంతమందితో మాట్లాడారో తేలిపోయిందన్నారు. హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించేలా సంభాషణలున్నట్లు తెలుస్తోందన్నారు. 

‘ఆయన తీరు చూస్తుంటే నేను ఎవరినైనా తప్పుదోవ పట్టించగలను... నేనెవరిపైనా దర్యాప్తు చేయగలననే భావనతో ఉన్నట్లుగా ఉంది. నేను చెప్పినట్లు చేస్తే నిన్ను కేసులో నుంచి తప్పిస్తాననే స్థాయికి సీబీఐ దిగజారిపోయింది. ఈయన మామూలు వ్యక్తి కాదు. రాజ్యాంగబద్ధ సంస్థలను కూడా బెదిరించే స్థాయికి వెళ్లారు. ఈయనపై విచారణ చే యాల్సి వస్తే సీవీసీని కూడా బెదిరిస్తాడేమో! అందుకే మేం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరుతున్నాం. అట్లయితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని మేం నమ్ముతున్నాం’’ అని చెప్పారు. 

ఫోన్ కాల్ జాబితాను చూస్తే న్యాయమూర్తులకూ ఫోన్ చేస్తున్నట్లు, జడ్జి చాంబర్‌కు కూడా వెళ్లి మాట్లాడుతున్నట్లు తేలిందన్నారు. ఒక అధికారి దర్యాప్తు చేయాలే తప్ప జడ్జిల దగ్గరకు వెళ్లి మాట్లాడాల్సిన అవసరమేముందో తనకైతే అర్థం కావడం లేదని చెప్పారు. ‘2జీ స్కాం వంటి కేసులో కూడా డీఎస్పీ స్థాయి అధికారి కోర్టులకు హాజరవుతుంటే.. జగన్ కేసులో మాత్రం స్వయంగా ఆయనే హాజరవుతున్నారు ఎందుకో! కోర్టులో ఆయన బాడీ లాంగ్వేజ్‌ను కూడా కొందరు న్యాయవాదులు తప్పుపడుతున్నారు’ అని మైసూరా అన్నారు.

Popular Posts

Topics :