22 July 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్ఆర్ సీపీ లేదా జగన్ పెరెత్తినా టీఆర్ఎస్,టీడీపీ- కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు

Written By news on Saturday, July 28, 2012 | 7/28/2012

చంచల్‌గూడ జైలులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే తెలుగుదేశం, కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి పునాదులు గల్లంతు కావడం ఖాయమేనా? అనే అంశంపై ఇపుడు రాష్ట్రంలో సర్వత్రా చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ఎపుడు ఎన్నికలు జరిగినా ఇటీవల వెల్లడైన ఉప ఎన్నికల నాటి ఫలితాలే పునరావృత్తం కావడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. 

దివంగత మహానేత వైఎస్ఆర్‌కు వారసుడుగానే కాకుండా నిజమైన రాజకీయ వారసుడిగా జగన్‌నే రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. అందుకే.. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్ని విధాలుగా ప్రజలను మభ్యపెట్టేందుకు కృషి చేస్తున్నప్పటికీ.. ప్రజలు మాత్రం పాలకులను నమ్మడం లేదు. దీంతో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు కష్టాలు తప్పవన్న సంకేతాలు వెలువడుతున్నాయి. 

మరోవైపు... తెలంగాణ అంశంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరించడంతో పాటు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను విస్మరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వం చేస్తున్న తప్పులకు కొమ్ముకాస్తున్నారన్న అపవాదు లేకపోలేదు. దీంతో చంద్రబాబుపై ప్రజలకు విశ్వాసం పూర్తిగా సన్నగిల్లి పోయింది. దీనికి నిదర్శనమే.. గత ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు డిపాజిట్లను కోల్పోయారు. పైపెచ్చు.. వచ్చే 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచే ప్రసక్తే లేదని సాక్షాత్ టీడీపీ సీనియర్ నేతలే అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తల్లో అభద్రతాభావం నెలకొంది. ఫలితంగా జగన్‌ వైపు పరుగు లంఘించేందుకు సిద్ధంగా ఉన్నారు. 

ఇకపోతే.. తెలంగాణ రాష్ట్ర సమితి. వైఎస్ఆర్ సీపీ లేదా జగన్ పెరెత్తినా టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దీనికి నిదర్శనం ఇటీవల జరిగిన పరకాల ఉప ఎన్నికే. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి కొండా సురేఖ గెలిచి ఓడారు. టీఆర్ఎస్ నేతల్లో ముచ్చెమటలు పోయించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరిగా చేసుకున్న ప్రయాణం సాగిస్తున్న టీఆర్ఎస్.. పరకాల ఉప ఎన్నికల్లో సెంటిమెంట్‌కు పట్టం కట్టినంత పని చేశారు. ఇది తెరాస నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. 

మున్ముందు వైఎస్ఆర్ సీపీ బలం తెలంగాణలో బలం పుంజుకుంటే తమ పీఠాలు కూలిపోతాయన్న భయం వారిని వెంటాడుతోంది. అందుకే జగన్ లేదా విజమయ్య పర్యటనలంటే వారికి కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ పర్యటనలు అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి. అవసరమైతే శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు సైతం ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. గతంలో మానుకోట నిన్న సిరిసిల్ల ఘటనలతో ఇది రుజువైంది. 

ఈ పరిణామాలన్నీ బేరీజు వేస్తే జగన్ బయటకొచ్చి మరోమారు రాష్ట్రంలో వైఎస్ఆర్ తరహాలో పాదయాత్ర లేదా మరో పేరుతోనే శ్రీకారం చుడితే ఈ రెండు పర్యటనలు చేపట్టిన పక్షంలో ఈ మూడు పార్టీల పునాదులు కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కార్మికుల కోసం కృషి: వైఎస్సార్‌టీయూసీ

ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కార్మిక హక్కుల పరిరక్షణ కోసం కృషిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ నిర్ణయించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.జనక్‌ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో యూనియన్ కార్యవర్గ సభ్యులు, పార్టీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పార్టీ అనుబంధంగా పనిచేస్తున్న అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.

వైఎస్సార్ అంబులెన్స్ ప్రారంభం

వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘వైఎస్సార్ అంబులెన్స్’ ప్రారంభించారు. విజయనగరం జిల్లాలోని రోగులకు ఉపయోగపడే విధంగా ఈ అంబులెన్స్‌ను నిర్వహించనున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన హితకారిణి వలంటీర్స్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న పి.శ్రీనివాసరావు, జిల్లా వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ కన్వీనర్ కోటగిరి కృష్ణమూర్తి సంయుక్తంగా దీన్ని నిర్వహించనున్నారు.

YSRCP TUC Logo Launch

కాంగ్రెస్ పథకాలన్నీ వైఎస్‌ పెట్టినవే : కోమటిరెడ్డి

నల్గొండ: దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది చాలా దురదృష్టకరమని రాష్ట్ర మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పథకాలన్నీ వైఎస్‌ పెట్టినవేనని అన్నారు. వైఎస్‌ను ఎవ్వరూ మరిచిపోలేరని అన్నారు. వైఎస్‌ ఎప్పుడూ ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

శెట్టూరులో వైఎస్సార్ సీపీ ఆందోళన

 ప్రజాసమస్యలు పరిష్కరించాలంటూ అనంతపురం జిల్లా శెట్టూరు ఎమ్మార్వో కార్యాలయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎల్‌.ఎమ్‌.మోహన్‌రెడ్డిసహా పలువురు ఆందోళనకారులను ఈ సందర్భంగా పోలీసులు అరెస్ట్ చేశారు.

వీహెచ్‌ది నిజంగానే ఓ వింతకథ. కబుర్లకు తప్ప కార్యానికి పనికిరాని వీహెచ్‌..‘నోరెట్టుకు బతకవే ఊరగంగానమ్మా!’ అన్న చందంగా అరుపులూ కేకలూ అల్లరీ హడావుడీ బతుకుతెరువుగా బండి లాగిస్తున్న రాజకీయుల్లో ముందుగా చెప్పుకోవలసిన పేరు వుత్పల హనుమంతరావు అనే వీహెచ్‌ది. అలాంటి నేత ఇప్పుడు గాంధీ భవన్‌లో ‘మౌనవ్రతం’చేపట్టడం చూసి జనం నోళ్లు నొక్కుకుంటున్నారు. అంతకు మించి, కే.కేశరావు, డీ.ఎల్. రవీంద్రారెడ్డిలాంటి గగ్గోలురాయుళ్లు వీహెచ్ మౌన దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆయనకు సానుభూతి ప్రకటించడం మరింత విడ్డూరంగా ఉంది. ఈ నేతల సెన్సాఫ్ హ్యూమర్‌ను అభినందించాలి!

వీహెచ్‌ది నిజంగానే ఓ వింతకథ. సొంతబలం కొంతయినా లేకపోయినా, తన పేరు చెప్పి ఒక్క కార్పొరేటర్‌నయినా గెలిపించుకోలేకపోయినా, హనుమంతరావు లీడర్‌గిరీకి మాత్రం ఏ ఢోకా రాలేదు! అతగాడు ‘సొంత నియోజక వర్గం’గా చెప్పుకునే అంబర్ పేట (ఒకప్పుడు హిమాయత్ నగర్)లో కాంగ్రెస్ పార్టీ పొరబాటున ఒకే ఒక్కసారి -చావు తప్పి కన్నులొట్టబోయినట్లుగా- గెలిచింది. ఎనిమిదిసార్లు ఘోరంగా ఓడిపోయింది. ఆ నియోజక వర్గ పరిధిలోనే, వీహెచ్ నివాసం ఉన్న డివిజన్‌లోనే కాంగ్రెస్ పార్టీ ఎడ్రస్ లేకుండా పోయింది. ఇలాంటి వ్యక్తి జాతీయ స్థాయికి ఎగబాకగలగడం ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమేమో!

అసలు హనుమన్న రాజకీయ రంగప్రవేశమే గొప్పగా జరిగింది. 1974లో, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పుత్రరత్నం సంజయ్ గాంధీ యూత్ కాంగ్రెస్ జాతీయ నాయకత్వం చేపట్టి సొంత సైన్యం సమకూర్చుకుంటున్న నేపథ్యంలో, హనుమంతరావు రంగంలోకి దిగారు. అప్పట్నుంచి ఇప్పటి దాకా పైవాళ్ల దయతోనే ఆయన అభ్యున్నతి అప్రతిహతంగా సాగిపోయింది. ఎమెర్జెన్సీ నీలినీడలో, మన రాష్ట్ర అసెంబ్లీకి 1978లో జరిగిన ఎన్నికల్లో వీహెచ్ హిమాయత్ నగర్‌లో వీరంగమాడి, గెలుపు తమదేనని ఢంకా బజాయించి చెప్పారు. కానీ, ఆ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ రాష్ట్రం మొత్తం మీద 175 సీట్లు గెలిచినా వీహెచ్ సొంత నియోజకవర్గం హిమాయత్ నగర్‌లో మాత్రం తేళ్ల లక్ష్మీ కాంతమ్మ ఘన విజయం సాధించారు. ‘కాపరం చేసే గుణం కాలిగోటి దగ్గిరే తెలిసిపోతుం’దన్నట్లుగా వీహెచ్ ప్రతిభా పాటవాలు తొలి ఎన్నికల్లోనే తేలిపోయాయి.

ఈ నేపథ్యంలో ఎవరయినా ఏం జరుగుతుందనుకుంటారు? సోది కబుర్లకు తప్ప మరెందుకూ పనికిరాని ఇలాంటి నేతలను తప్పించి కాంగ్రెస్ పార్టీలోని ఇతరులకు అవకాశమిస్తారని భావిస్తారు. కానీ కాంగీయులు అలా చెయ్యలేదు. మరుసటి సంవత్సరమే, 1979లో, వీహెచ్‌ను రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షపీఠం మీద కూర్చోపెట్టింది కాంగ్రెస్ నాయకత్వం. ఆ పీఠానికి బల్లిలా అతుక్కుపోయిన వీహెచ్ 1983 దాకా వదల్లేదు. అప్పుడయినా, ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ కాంగ్రెస్ పార్టీని తుక్కుతుక్కు కింద ఓడించి అధికారం చేజిక్కించుకున్నందువల్లనే కబుర్లకు తప్ప కార్యానికి పనికిరాని వీహెచ్‌లాంటి నేతలను పక్కకు తప్పించారు.

‘నా పేరే హనుమంతు!’ అని గర్వంగా ప్రకటించుకునే వీహెచ్ వెంటనే చిరతలు పట్టుకుని అధిష్టానం ముందు ప్రత్యక్షమయిపోయారు. రెండేళ్లు నానా రకాలుగా పాట్లుపడి ఏపీసీసీ సంయుక్త కార్యదర్శి పదవిలో నియుక్తుడయాడు వీహెచ్. వీహెచ్ రాజకీయ జీవితం మరీ అంత కటిక చీకటి మయమేం కాదు. 1989లో వీహెచ్ ఎమ్మెల్యేగా గెలిచారు- పొదుపుగా రెండువేల ఓట్ల మెజారిటీతో! 1999లో ఇదే వీహెచ్ అదే అంబర్ పేట నియోజక వర్గం నుంచి ఘోరంగా ఓడిపోయారు- 39 వేల ఓట్ల తేడాతో! అదీ మన హనుమన్న ఘన చరిత్ర.

అధిష్టానం ఏమీ మాటాడకముందే అది ఎలా కరెక్టో రుజువుచేసేందుకు రెడీ అయిపోయే అతివిధేయుల జాబితాలో మొదటి పేరే మన వీహెచ్‌ది. మేడమ్ సోనియా గాంధీ పక్కింట్లోనే -11 జన్‌పథ్‌లో- నివాసం ఉండే హనుమన్న అధిష్టానవర్గాన్ని సమర్ధించేందుకు దొరికే ఏ చిన్న అవకాశాన్నీ జరవిడుచుకోరు. అలాంటి వ్యక్తి సాక్షాత్తూ గాంధీ భవన్లో మౌన దీఓ చేపట్టడం కన్నా విడ్డూరమేముంది? ఈ హనుమాయణంలో ఓ పిడకలవేట కూడా ఉన్నట్లుంది. నామినేటెడ్ పదవులకు నియామకాలు తక్షణమే జరిపించాల్సిందిగా ధర్మాన కమిటీ సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. త్వరలో సదరు నియామకాలు జరగనున్నట్లు మన హనుమన్న కనిపెట్టేసి, ఈ దీక్ష డ్రామా మొదలెట్టాడంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. ఇదే నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తోంది.
లేకుంటే వీహెచ్చేంది? మౌనవ్రతమేంది?? 

వైఎస్ఆర్ సీపీ టీయూసీ సమావేశాలు

వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ టీయూసీ రాష్ట్రస్థాయి సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలుకు అన్ని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. 

వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ టీయూసీ సమావేశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చ జరపనున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ టీయూసీ లోగోను ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఎం.వి.మైసూరా రెడ్డిలు ఆవిష్కరించారు.

వైఎస్ఆర్ సీపీ పశ్చిమగోదావరి జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ మృతి

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ కన్వీనర్ మహ్మద్ జాఫర్ గుండెపోటుతో మృతి చెందారు. కొయ్యలగూడెం మండలం చెన్నాపురంలో ఆయన తన స్వగృహంలో మరణించారు. మహ్మద్ జాఫర్ మృతి పట్ల పార్టీ నేతలు,పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సంతాపం తెలియచేశారు.

ఆ 26జీవోలతో జగన్‌కు సంబంధం లేదు

ఆ 26జీవోలతో వైఎస్ జనగ్‌కు సంబంధం లేదని వైఎస్సార్సీ పార్టీ కేంద్ర గవర్నింగ్ కమిటీ సభ్యుడు భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి అన్నారు. సదరు జీవోల జారీకి కారణమైన మంత్రులు, ఐఏఏస్ అధికారులకు ప్రభుత్వం న్యాయపరమైన సహాయం అందించేందుకు ముందుకు రావడం సరైంది కాదని వైఏస్సాఆర్ పార్టీ నేతలు భూమా దంపతులు అన్నారు. శుక్రవారం శ్రీశైలం వచ్చిన భూమా దంపతులు భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానంతరం దేవస్థానం అతిథిగృహంలో విలేఖరులతో మాట్లాడారు. ఆ జీవోలతో సంబంధం లేని జగన్‌ను ఉద్దేశపూర్వకంగానే జైల్‌లో పెట్టి విచారణ పేరుతో బెయిల్ రాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. చిన్నచిన్న విషయాలకే జగన్‌పై బురదచల్లేందుకు సిద్దమయ్యే ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర మంత్రుల పనితీరు, ప్రభుత్వ పాలనను ఎందుకు ఎండగట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నాయకత్వ లోపం కారణంగా పాలన గాడి తప్పుతోందన్నారు. గతంలో ప్రజాపథం, రచ్చబండ కార్యక్రమాల్లో ప్రజలకు ప్రయోజనం చేకూరలేదన్నారు. తాను సీఏంనని చెప్పుకోవడం కోసమే కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మబాట పట్టారని విమర్శించారు.రాష్ట్రంలో తుగ్లక్ పాలన


ఉదయగిరి(శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు), న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వ పనితీరు తుగ్లక్ పాలనను తలపిస్తోందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎంపీ ఆయన సోదరుడు, ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డితో కలసి వింజ మూరు మండలంలోని పలుగ్రామాల్లో పర్యటిం చారు. ప్రజల ఇబ్బందులను తెలుసుకుని, వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. చింతలపాళెంలో రాజమోహన్‌రెడ్డి ప్రజలతో మాట్లాడుతూ, తుగ్లక్ పాలనలో విధించినట్లే ప్రస్తుత ప్రభుత్వం కూడా రకరకాల పన్నులతో ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష బాధ్యతలు విస్మరించి కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని విమర్శిం చారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే తమ సమస్యలు తీరుతాయన్న గ్రామమహిళల అభిప్రాయంతో ఎంపీ ఏకీభవిస్తూ.. ఆ రోజులు ఎంతో దూ రంలో లేవన్నారు. వైఎస్సార్ ఆశయ సాధనలో భాగంగా తాము ఎంపీ నిధులు, సొంత నిధులతో ఫ్లోరైడ్ ప్రాంతాల్లో శుద్ధి జలాలను అందిస్తామన్నారు. 

మత్స్యకార సమస్యలపై దృష్టి

మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీ గురువారం తీరప్రాంత గ్రామాల్లో పర్యటిం చారు. ముత్తుకూరు మండలం పునరావాస కాలనీ మధురానగర్‌లో రాజమోహన్ రెడ్డి మాట్లాడు తూ గంగవరం, ఇతర ఓడరేవుల్లో మత్స్యకారులకు అందించిన తరహాలో ఫిషింగ్‌హార్బర్, ఉద్యోగాలు, ప్యాకేజీలు, విద్య, వైద్య సదుపాయాలను కల్పిం చేందుకు ప్రభుత్వం, పోర్టు యాజమాన్యంతో చర్చిం చనున్నట్లు తెలిపారు. అనంతరం రాజమోహన్‌రెడ్డి నెల్లూరు నగరంలోని కొత్తూరులో ముత్తుకూరు రోడ్డు నిర్వాసితుల ప్రాంతంలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకున్నా

వైఎస్సార్ సీపీ వైద్య విభాగం కన్వీనర్‌గా శివభరత్‌రెడ్డి

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ల విభాగం కన్వీనర్‌గా డా.గోసుల శివభరత్‌రెడ్డి ఎంపికయ్యారు. ఆర్థోపెడిక్ నిపుణులైన శివభరత్‌రెడ్డిని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా శివభరత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డికి అత్యంత ప్రీతిపాత్రమైన డాక్టర్ల విభాగానికి ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆరోగ్యం పట్ల వైఎస్సార్ చూపిన బాటలో ముందుకు సాగుతామన్నారు. రాష్ట్రంలో వైఎస్ అభిమాన డాక్టర్లందరినీ సంఘటితం చేసి మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు తమ విభాగం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందులో భాగంగా ఆగస్టు 5వతేదీన పోలవరంలో మెగాహెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లు వివరించారు. 

‘చంద్రదండు’ దాడిపై స్పందించరా?

టీడీపీ అధినేత చంద్రబాబు గత జనవరిలో వరంగల్‌లో పర్యటించినప్పుడు.. ‘చంద్రదండు’ పేరిట తెలంగాణవాదుల మీద జరిపిన దాడులకు సంబంధించి నివేదికను సమర్పించడంలో రాష్ట్రప్రభుత్వం జాప్యం చేయడం పట్ల జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆగ్రహం వెలిబుచ్చింది. అనేక గడువులిచ్చినా ఇంతవరకు నివేదిక ఇవ్వకపోవడంపట్ల అసహనం వ్యక్తంచేసింది. చంద్రబాబు వరంగల్ పర్యటన సందర్భంగా.. తెలంగాణవాదులపై దాడులతో సంబంధమున్నవారిమీద చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ తెలంగాణ ప్రాంత న్యాయవాది అరుణ్‌కుమార్ ఎన్‌హెచ్‌ఆర్‌సీలో జనవరిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తాజా స్థితిని తెలుసుకునేందుకు శుక్రవారం ఎన్‌హెచ్‌ఆర్‌సీకి వెళ్లిన అరుణ్‌కుమార్‌కు అక్కడి అధికారులు రాష్ట్రప్రభుత్వానికి చివరిసారిగా పంపిన లేఖను అందజేశారు. అందులో ప్రభుత్వాన్ని ఎన్నిమార్లు నివేదికలు కోరిందీ... ప్రభుత్వం నుంచి స్పందన ఎలా కరువైందీ స్పష్టంగా ఉంది. వరంగల్ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక అందించాలని జనవరి 18న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించినా జూన్ వరకు జవాబు రాలేదు. హెచ్చరిక పంపినా పట్టించుకోలేదు

మూడు నెలలకోసారి కరెంట్ షాక్!

మీ ఇంట్లో కరెంట్‌ బల్బులు, టీవీ, ఫ్యాన్‌, మిక్సీ, ఫ్రిజ్‌, కూలర్‌ ఉన్నాయా....? ఏంటీ..ఇవన్నీ నిత్యజీవితంతో పెనవేసుకుపోయాంటారా..! అయితే ఈ ఉపకరణాలన్నింటికీ దూరంగా ఉండటం నేర్చుకోండి. ఇవన్నీ లేని సమాజాన్ని ఊహించుకోండి..కాదు కాదు అలవాటు చేసుకోండి. ఎందుకంటారా..మరోసారి కరెంట్‌ చార్జీలను పెంచేందుకు సర్కారు సిద్ధమవతోంది. ప్రజల నడ్డివిరిచే నిర్ణయం తర్వలోనే తీసుకోనుంది.
మరోసారి విద్యుత్‌ చార్జీలు పెంపుకు కిరణ్‌సర్కారు సిద్ధవుతోంది. అంతేకాదు ఇక నుంచి ప్రతి మూడునెలలకోసారి విద్యుత్ చార్జీలను పెంచాలని సర్కారు డిసైడైంది. ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో మరోసారి ప్రజల నడ్డివిరగ్గొట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే సెప్టెంబర్‌ నుంచి ఈ బాదుడు షురూ కానుంది.
మొదటి విడతలో2012-13 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు గానూ రూ. 1400కోట్ల భారం ప్రజలపై పడనుంది. ప్రతిపాదనలను డిస్కంలు ఇప్పటికే ERCకి సమర్పించాయి. దీనిపై ERC ఆగస్టులో బహిరంగ విచారణ చేపట్టనున్నట్టు సమాచారం. ERC పచ్చజెండా ఊపితే ఈ సెప్టెంబర్‌ నుంచే ప్రజలకు షాక్‌ తగలనుంది. యూనిట్‌కు సగటున ఒక రూపాయి ఆరుపైసల చొప్పున మూడునెలలపాటు చార్జీలు వసూలు చేస్తారు. ఆ తర్వాత 2012-13 రెండో త్రైమాసిక సర్దుబాటు చార్జీల బారం డిసెంబర్‌ నుంచి వినియోగదారులపై పడనుంది. ఇలా క్రమంతప్పకుండా ఎవ్రీ త్రీ మంథ్స్‌కు ఓ సారి ప్రజలకు షాక్‌ ఇచ్చేందుకు సర్కారు సిద్దమవుతోంది.
ఇంతటితో ఆగకుండా పాతకాలం నాటి భారాన్ని ప్రజలపై మోపేందుకు రంగం సిద్ధమవుతోంది. 2010-11,2011-12 ఆర్థిక సంవత్సరాలకు చెందిన సర్దుబాటు చార్జీలకు సంబంధించి డిస్కంలు సమర్పించిన ప్రతిపాదనలపై ERC విచారణ చేపడుతోంది. దీనికి ERC పచ్చజెండా ఊపితే ప్రజలపై మరో ఎనిమిదివేల కోట్ల రూపాయలపైగా భారం పడనుంది.

సీఎం కిరణ్ కు సిక్కోలులో నిరసనల సెగ

"ఇందిరమ్మబాట" అంటూ బయల్దేరిన ముఖ్యమంత్రికి... నిరసనల సెగ తగిలింది. ప్రజల మధ్య ఉండటానికి తెగ ప్రయత్నిస్తోన్న సీఎం కిరణ్‌కి మాత్రం... అదే ప్రజల నుంచి కనీసం విన్నపాలు తీసుకోవడానికి ఇష్టం లేదు. కన్నెధార కొండ మైనింగ్‌ లీజును రద్దుచేయాలంటూ సిక్కోలు జనం కదం తొక్కితే- పోలీసులు లాఠీలతో కొట్టి ఈడ్చేశారు. సీఎం పర్యటనలో పోలీసుల వైఖరికి నిరసనగా- స్థానిక గిరిజనులు-నేడు సీతంపేట బంద్‌కు పిలుపునిచ్చారు.
ప్రజల మధ్యకు వెళ్ళాలంటే- వారి సమస్యలు వినే ఓపిక ఉండాలి. వారి నిరసనలు తట్టుకునే ధైర్యం ఉండాలి. కానీ- ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ ఇవేవీ లేవని తేటతెల్లమైంది. శ్రీకాకుళం జిల్లాలో సీఎం పర్యటన వివాదాస్పదంగా మారింది. కన్నెధార కొండ మైనింగ్‌ లీజు అక్రమమని- స్థానికుల డిమాండ్‌. దాన్ని తక్షణం రద్దుచేయాలన్నది వారి డిమాండ్‌. ఈ విషయాన్ని సీఎంకు చెబుతామన్నది వీరి అభిమతం. పెద్దమేడుకు వెళుతున్న ముఖ్యమంత్రి... సీతంపేట మీదుగా వెళ్ళాల్సి ఉంది. సీఎం కాన్వాయ్‌ వాహనాలను అడ్డుకున్నారు.
రోడ్డుకడ్డంగా బురదలో కూర్చొని మహిళలు నిరసన తెలిపారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. నిరసన తెలుపుతున్న వారిని బలవంతంగా ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో గిరిజన నేత ముక్క లింగానికి స్వల్పంగా గాయాలయ్యాయి.
పెద్దమేడ నుంచి తిరిగివస్తోన్న ముఖ్యమంత్రిని మళ్ళీ కలవాలని సీతంపేటలో గిరిజనులు ఉండిపోయారు. అయితే పోలీసులు ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. పైగా- లాఠీచార్జ్‌ చేశారు. గిరిజనుల్ని చెదరగొట్టారు. దీనిపై గిరిజనులు మండిపడ్డారు.
పోలీసుల తీరుకు నిరసనగా... గిరిజనులు శనివారం సీతమ్మధార బంద్‌కు పిలుపునిచ్చారు. ఇంతా జరుగుతున్నా- ముఖ్యమంత్రి కనీసం ప్రజల నుంచి వినతిపత్రం స్వీకరించలేదు. ప్రజావాణిని వినిపించుకోలేదు. ప్రజలంటే ఇంత అలుసా..? ప్రజల సమస్యలంటే ఇంత లెక్కలేని తనమా..? ఈమాత్రం దానికి "ఇందిరమ్మబాట" పేరుతో ప్రజల్లోకి రావడం ఎందుకు..? ఇదీ ఈ గిరిజనులు అడుగుతున్న ఈటెల్లాంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సీఎం గారి సమాధానం ఉందా..?


రోహిత్‌ శేఖర్‌ S/o తివారీ: ఢిల్లీ కోర్టు

Written By news on Friday, July 27, 2012 | 7/27/2012

రోహిత్‌ శేఖర్ తండ్రి ఎన్ డీ తివారీయేనని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎన్ డీ తివారీ డీఎన్ఏ పరీక్షల నివేదికను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేవా ఖేత్రపాల్ శుక్రవారం విడుదల చేశారు. తీవారీ డీఎన్ఏ పరీక్షలను హైదరాబాద్ లోని ఓ లాబరేటరీలో నిర్వహించారు. ఇద్దరి డీఎన్‌ఏలూ ఒక్కటే అని కోర్టు నిర్దారించింది. ఉజ్వల శర్మ, ఎన్ డీ తివారీలకు కలిగిన సంతానమే రోహిత్ శేఖర్ అని కోర్టు తీర్పులో పేర్కొంది. గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఎన్ డీ తివారీ ఉన్న కాలంలో ఆయనపై సెక్స్ కుంభకోణ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆతర్వాతనే ఆరోగ్య కారణాలను చూపి గవర్నర్ పదవి నుంచి తప్పుకున్నారు.

సీతంపేటలో సీఎంను అడ్డుకున్న గిరిజనులు

సీతంపేట: శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో సీఎం ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌ను స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. కన్నెధారకొండ అక్రమ లీజు వ్యవహారంపై సీఎం స్పందించాలని గిరిజనులు డిమాండ్‌ చేశారు. సీఎం ను అడ్డుకున్న గిరిజనులపై పోలీసుల లాఠీచార్జ్‌ చేశారు. ఈ సంఘటనలో పలువుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

ఇన్ని విపత్తులకీ కారణం ప్రభుత్వ నిర్లక్ష్యధోరణేరాష్ట్ర పారిశ్రామికరంగం తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతోంది. ఇన్ని విపత్తులకీ కారణం ప్రభుత్వ నిర్లక్ష్యధోరణే అన్నది నిర్వివాదాంశం. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు, అంతర్గత కుమ్ములాటలకి స్వస్తి చెప్పి, నీరో చక్రవర్తి పాత్ర పోషించడం మాని, సమస్య పరిష్కారం దిశగా ఆశావహక చర్యలు చేపట్టాలి. సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించే బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. 2014 నాటికి రాష్ట్రాన్ని ‘ఎనర్జీ హబ్’గా మారుస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా, ప్రస్తుతం నెలకొని ఉన్న తీవ్ర పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్రం ఆ నాటికి ‘చీకటి రాష్ట్రం’గా మారకుంటే అదే పదివేలు.

మున్నెన్నడూ కనీవినీ ఎరు గని విద్యుత్ సంక్షోభాన్ని మన రాష్ట్రం ఎదుర్కొంటున్నది. నిపు ణుల అభిప్రాయం ప్రకారం 12 గంటల విద్యుత్ కోతను రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ చవిచూడ లేదు. భారీ పరిశ్రమలు, చిన్న / లఘు పరిశ్రమలు, వ్యవసా యం... ఇలా అన్ని రంగాలు ఈ సంక్షోభం బారినపడి విలవిల లాడుతున్నాయి. పవర్ హాలిడే, అనియమిత విద్యుత్ కోతలు, చిన్నాచితకా పరిశ్రమల మూసివేత, ఎప్పుడు కరెంట్ వస్తుందో, ఎప్పుడు పోతుం దో తెలియని అయోమయం... ఇదీ నేటి రాష్ట్ర దుస్థితి.

భీతి గొలుపుతున్న సంక్షోభం
ఈ నేపథ్యంలో ‘‘వచ్చే ఐదేళ్లలో రూ.1.45 లక్షల కోట్ల పెట్టుబడులతో 660 భారీ పరిశ్రమలు, మరో 60,400 చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటై, మొత్తం 10.62 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయి’’ అని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర ప్రణాళికా సంఘానికి సమర్పించిన నివేది కలో పేర్కొన్నది. 12వ పంచవర్ష ప్రణాళిక ప్రగతి లక్ష్యా లలో ఒకటిగా ప్రకటించింది. ప్రభుత్వ భావదారిద్య్రానికి, నిర్లక్ష్యానికి ఇదొక నిదర్శనం.

‘కరెంట్ కోతలు’, పారిశ్రామిక రంగానికి మరణ శాసనంగా మారడంతో గత నెలరోజుల్లోనే 20 వేలకు పైగా పరిశ్రమలు మూతపడ్డాయి. ఇదే పరిస్థితి కొనసాగితే, రాష్ట్ర పారిశ్రామికరంగం పునాదులు కదిలి, 80 శాతం పరిశ్రమలు మూతపడటం ఖాయం. ప్రభుత్వ ‘ధృతరాష్ట్ర దృష్టి’ వల్ల, ఉత్పత్తి సగానికి తగ్గిపోయి, రాష్ట్రంలోని పరిశ్రమలు రోజుకు రూ.257 కోట్ల మేర నష్టపోతున్నాయి. రాష్ట్రంలోని 1.6 లక్షల యూనిట్ల చిన్న తరహా పరిశ్రమలు చితికిపోయి, వాటిపై ఆధారపడ్డ 30 లక్షల మందికి ఉపాధి కరువవుతుంది. కరెంటు కోతల వల్ల, ప్రతి రంగంలోనూ 20-25 శాతం మేర ఉన్న కాంట్రాక్టు కార్మికులపై తొలి వేటు పడనుంది.

హద్దూ, అదుపూ లేని విద్యుత్ కోతలు
పుండు మీద కారం చల్లినట్లు, మన రాష్ట్ర విద్యుత్ సంస్థ విద్యుత్ డిమాండ్, ఉత్పత్తి, సరఫరా తదితర అంశాలను సరిగ్గా అంచనా వేయలేకపోవడం ప్రస్తుత పరిస్థితిని మరింత దిగజార్చింది. ఈ సంస్థ 218.57 మెగావాట్ల విద్యుత్తు సరఫరా చేయవచ్చని, మరో 21.62 మెగావాట్ల విద్యుత్తును బయటి నుంచి కొనుగోలు చేయవచ్చని, కేవలం 6.59 మెగావాట్ల మేర మాత్రమే కొరత ఉంటుం దని అంచనా వేసింది. తద్వారా జూలై నెలలో అసలు కోతలే ఉండవనే తప్పుడు అంచనాలతో తక్కువ విద్యుత్తు కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకుంది.

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 264 మెగావాట్లకి చేరుకున్న తరుణంలో కేవలం 215 మెగావాట్లు మాత్రమే సరఫరా అవుతున్నది. విద్యుదుత్పత్తి 203 మెగావాట్లను దాటడంలేదు. అయినా కొనుగోలు మాత్రం 12 మెగా వాట్లే చేస్తున్నారు. రాష్ట్రంలో జూలై 6వ తేదీకి, విద్యుత్ డిమాండ్, ఉత్పత్తుల మధ్య వ్యత్యాసం 52.50 మెగా వాట్లకి చేరుకుంది. ఫలితంగా పరిశ్రమలకి మూడురోజుల పాటు పవర్ హాలిడే విధించారు. మిగిలిన మూడురోజుల్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు 10 శాతం విద్యుత్తును మాత్రమే సరఫరా చేస్తున్నారు.

రాత్రివేళ త్రీ-ఫేజ్ విద్యుత్తును సరఫరా చేస్తున్నా, 75 శాతం కరెంట్ మాత్రమే విడుదలవుతోంది. వ్యవసాయ విద్యుత్ పరిస్థితి మరీ దారుణం. కేవలం రెండు గంటలు, అదీ నాలుగు విడతల్లో సరఫరా జరుగుతోంది. విద్యుత్ సంక్షోభం వల్ల చితికి పోతున్న అన్నదాత వెతలు వర్ణనాతీతం. ప్రస్తుతం సరఫరా అవుతున్న విద్యుత్తులో 33 శాతానికి పైగా, అంటే 83 మెగావాట్లను వ్యవసాయానికే వినియో గించాల్సి వస్తున్నది. కోతల ఫలితంగా, పారిశ్రామిక ఉత్పత్తి నాలు గోవంతుకి పడిపోయింది. రోజూ రెండు లక్షల మంది దినసరి వేతన ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నారు.

ఇంధన చార్జీలు, సర్‌చార్జి పెనుభారం
ప్రభుత్వ అసమంజస నిర్ణయాలతో యావత్ రాష్ట్రం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ సమయంలో, మరో మారు ప్రభుత్వం చార్జీలు, ఇంధన సర్‌చార్జి సర్దుబాటు (ఎఫ్‌ఎస్‌ఏ)ల పేరిట జనంనెత్తిన మరో పెనుభారాన్ని మోపడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఏప్రిల్ 1 నుంచి రూ.4,500 కోట్ల చార్జీల భారాన్ని మోపిన ప్రభుత్వం, జూలై నుంచి సర్దుబాటు పేరిట రూ.1,481 కోట్ల భారాన్ని మోపింది. మరో రూ.8,023 కోట్ల భారాన్ని మోపేందుకు సిద్ధంగా ఉంది. వాస్తవానికి వైఎస్ హయాంలో ఐదేళ్ల పాటు ఒక్కపైసా కూడా చార్జీలను పెంచలేదు. మరొక పదేళ్లు పెంచమని కూడా హామీ ఇచ్చారు.

కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, సర్‌చార్జి రూపేణా వినియోగదా రుల నుంచి సుమారు రూ.8,023 కోట్లు (2010-11కి రూ.3,062.11 కోట్లు, 2011-12కి రూ.4,960.88 కోట్లు) వసూలు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. అసలు, ఈ ఇంధన సర్‌చార్జి బూచి అన్నది స్వయంకృతాపరాధమే. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ విద్యుత్ సంస్థ ‘ఏపీ జెన్‌కో’కి 5 వేల కోట్ల రూపాయల బకాయి చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని చెల్లిస్తే, కోతల్లేని కరెంటు సరఫరా, అదనపు భారాన్ని నివారించడం సులభతరం. కేజీ బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తి అవుతున్నా, రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ సంస్థలకి అది అందడంలేదు. సౌర విద్యుదుత్పత్తికి రాష్ట్రంలో మంచి అవకాశాలున్నా ఉత్పాదకత లేదు. పవన విద్యుత్తుపై సరైన ప్రణాళిక లేదు. పథకాలన్నీ, కాగితాలకే పరిమితమవుతున్నాయి.

సంక్షోభ నివారణ సాధ్యమే!
రాష్ట్రంలో 2010-11తో పోలిస్తే, 2011-12లో విద్యుత్ డిమాండ్ 10.89 శాతం ఎక్కువ. అంటే సగటున 10 శాతం డిమాండ్ పెరిగింది. దీని దృష్ట్యా, ప్రభుత్వం సత్వరమే కొత్త ప్రాజెక్టులు చేపట్టాలి. రాష్ట్ర విద్యుత్ స్థాపన సామర్థ్యం ప్రస్తుతం 16,021 మెగావాట్లు. గరిష్టంగా డిమాండ్ 12,000 మెగావాట్లు. 3,830 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నా ఏడాదిలో 3 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. 2,770 మెగావాట్ల సామ ర్థ్యంతో గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులు ఉన్నా, కొత్తగా మరో 1000 మెగావాట్లు తోడయినా, గ్యాస్ కొరత వల్ల కేవలం 1100 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. పవన, సౌర, బయోమాస్, ఇతర చిన్నాచితకా ప్రాజెక్టుల సామ ర్థ్యం 1100 మెగావాట్లు ఉంటుంది. 2014 నాటికి రాష్ట్రాన్ని ‘ఎనర్జీ హబ్’గా మారు స్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా, ప్రస్తుతం నెలకొని ఉన్న తీవ్ర పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్రం 2014 నాటికి ‘చీకటి రాష్ట్రంగా’ మారకుంటే అదే పదివేలు. విద్యుత్ సంక్షోభ నివారణలో కీలక భూమిక పోషిస్తాయ నుకున్న ప్రైవేట్ విద్యుత్ కంపెనీలు, అనుమతులు, రాయి తీలు పొంది ప్రాజెక్టుల నిర్మాణానికి పునాదిరాయి కూడా వేయ కుండా రాష్ట్రానికి మొండిచేయి చూపించాయి.

కింకర్తవ్యం...
నానాటికీ పరిస్థితి తీవ్రరూపం దాలుస్తున్న దృష్ట్యా ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లపై వెంటనే దృష్టి సారించాలి. కేంద్రం నుంచి అదనపు విద్యుత్తు పొందాలి. గ్యాస్ ఆధా రిత కేంద్రాలకు గ్యాస్ సరఫరా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. భారీ పరిశ్రమలు సొంతంగా విద్యుదుత్పాదనకు ప్రోత్సాహకాలు కల్పించాలి. గుజరాత్, తమిళనాడు తరహాలో శాశ్వత, స్థిర విద్యుత్తును అందించేందుకు, ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించి అమలు పరచాలి. గుజరాత్‌లో నిరంతర విద్యుత్ పంపిణీ వల్ల పరిశ్రమలు నిరాటంకంగా ఉత్పత్తి కొనసాగిస్తున్నాయి. కోటి మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. తమిళనాడులో గత వేసవిలో విద్యుత్ కోతలు అమల్లో ఉన్నా, పరిశ్రమలకి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఆ రాష్ట్రంలో విద్యుత్ పొదుపు చర్యలు పారిశ్రామిక రంగానికి ఊతమిస్తు న్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పరిశ్రమలకి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఫీడర్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారు.

విద్యుత్ సంక్షోభం వల్ల రాష్ట్ర పారిశ్రామికరంగం తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతోంది. ఇన్ని విపత్తులకీ కారణం ప్రభుత్వ నిర్లక్ష్యధోరణే అన్నది నిర్వివాదాంశం. సంక్షో భాన్ని నివారించాలనే చిత్తశుద్ధి, పట్టుదల ప్రభుత్వానికి ఉంటే, రాష్ట్రాన్ని ఈ సంక్షోభం నుంచి బయటపడే యడానికి తాము సిద్ధంగా ఉన్నామని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. నాఫ్తా, డీజిల్‌తో విద్యుదుత్పాదన చేసే అవకాశం ఉన్నప్పటికీ, ట్రాన్స్‌కో అనుమతివ్వడం లేదు. రోజుకు 10.2 ఎంసీఎంల గ్యాస్‌ని ఇవ్వాల్సి ఉన్నా, కేవలం 5 ఎంసీఎంల గ్యాస్ కూడా ఇవ్వడం లేదు. దీంతో 1,670 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం నిరర్థకమవుతోంది.

విద్యుత్ కొనుగోలుకి ఓపెన్ యాక్సెస్ విధానం అమలు చేయాలి. డీజిల్‌పై వ్యాట్‌ని కుదించాలి. ఎలక్ట్రిసిటీ డ్యూటీ 25 పైసలను మినహాయించాలి. థర్మల్, పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహించాలి. బొగ్గు ఉత్పత్తి, సరఫరాలో గల లోపాలను అధిగమించే ప్రయ త్నాలు చేయాలి. ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్నట్లు, ఏ సమస్యకైనా తగిన పరిష్కారం ఉంటుంది. కావాల్సిం దల్లా, తపన, తగిన కార్యదీక్ష, చిత్తశుద్ధి. ఇప్పటికైనా ప్రభు త్వం రాజకీయ ప్రయోజనాలు, అంతర్గత కుమ్ములాటలకి స్వస్తి చెప్పి, నీరో చక్రవర్తి పాత్ర పోషించడం మాని, సమస్య పరిష్కారం దిశగా ఆశావహక చర్యలు చేపట్టాలి. సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించే బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.

సిరిసిల్ల గల్లంతవుతుందనే రాద్ధాంతం: గోనె

 సిరిసిల్లలో ఉనికి గల్లంతవుతుందన్న ఆందోళనతోనే ఎమ్మెల్యే తారకరామారావు వైఎస్సార్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈనెల 23న చేసిన దీక్షపై రాద్ధాంతం చేస్తున్నారని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు అన్నారు. వైఎస్సార్ పార్టీ గతంలో ఫీజుపోరుతో హైదరాబాద్‌లో, ఆర్మూరులో రైతు దీక్ష చేసినప్పుడు ఎలాంటి అభ్యం తరం చెప్పని టీఆర్‌ఎస్.. ఇప్పుడు తన కుమారుడి సీటుకు ఎసరు వచ్చిందన్న దుగ్ధతోనే ఆ పార్టీ అధినేత చంద్రశేఖరరావు ఈ విమర్శలు చేయిస్తున్నారని ఆరోపించారు. 

గురువారం గోనె సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. గతం లో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావు నిరవధిక దీక్ష అంటూ జంతర్‌మంతర్‌లో ఒకరోజు దీక్ష చేయడం, 2009లో హైదరాబాద్, ఖమ్మం జిల్లాలో చేసిన దీక్ష గురించి త్వరలో బహిరంగలేఖ రాస్తానన్నారు.

రేపు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ సమావేశం

వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఈ నెల 28న పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కానుంది. కార్మికులెదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు ఈ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బి.జనక్‌ప్రసాద్ గురువారం తెలిపారు. పరిశ్రమల ప్రైవేటీకరణ, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, అసంఘటిత కార్మిక సమస్యలపైనా చర్చిస్తామన్నారు. 

అదేవిధంగా వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సంఘాల నిర్మాణం, సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ పదాధికారులు, జిల్లాల అధ్యక్షులతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పార్టీ ట్రేడ్ యూనియన్‌కు అనుబంధంగా పనిచేస్తున్న అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారని జనక్ ప్రసాద్ తెలిపారు.

‘ఇందిర జలప్రభ’ నత్తనడక

 రెండేళ్లలో లక్ష బోర్లు తవ్వించి, 10 లక్షల ఎకరాలకు నీరందించడం పథకం లక్ష్యం
* ఇప్పటిదాకా తవ్విన బోర్లు 4 వేలు.. అందులో మోటార్లు బిగించి, కరెంటు కనెక్షన్లు ఇచ్చిన బోర్లు కేవలం 720 ఒకటి ఫెయిలైతే... రెండో బోరు భారం 
* లబ్ధిదారులే భరించాలని తాజా ఉత్తర్వులు

నల్లగొండ జిల్లాలో ఇందిర జలప్రభ పథకం కింద 230 చోట్ల బోర్లు వేశారు. 150 బోరు బావుల్లో జలధార ఉప్పొంగింది. అందులో ఇప్పటిదాకా ఎన్ని బోర్లకు కరెంటు మోటార్లు బిగించారో తెలుసా..? కేవలం 10! 
మిగతా బోర్లలో ఒక్కదానికి కూడా విద్యుత్ కనెక్షన్లు కూడా ఇవ్వలేదు. కరెంటు స్తంభాలు పాతడానికి ఒక్క గుంత కూడా తీయలేదు. 150 బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తే 1,500 ఎకరాలకు నీరందుతుంది.

విజయనగరం జిల్లాలో ఇందిర జలప్రభ ద్వారా కొత్తగా 40 వేల ఎకరాలు సాగు యోగ్యంలోకి తేవాలనేది లక్ష్యం. అందుకు 1,200 బోర్లు అవసరమని గుర్తించారు. ఇప్పటిదాకా 930 బోర్లు వేయాల్సి ఉన్నా.. ఏడు నెలల్లో 76 బోర్లు మాత్రమే వేశారు. అందులో కేవలం నాలుగు బోర్లకు మాత్రమే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు!!

ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూముల్లో వచ్చే రెండేళ్లలో రూ.1,800 కోట్లతో లక్ష బోర్లు తవ్వించి పది లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో పూర్తిగా చతికిలపడింది. బీడువారిన భూముల్లో సిరులు కురిపిస్తామంటూ కిందటేడాది అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన ‘ఇందిర జలప్రభ’ పథకం ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్న చందాన సాగుతోంది. మొదటి ఏడాదిలో 60 వేల బోర్లు వేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 4 వేల బోర్లు మాత్రమే వేశారు. వీటిలో విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి, మోటార్లు బిగించిన బోరు బావులు కేవలం 720! పథకం ఓవైపు నత్తనడకన సాగుతుంటే.. మరోవైపు ప్రభుత్వమే రోజుకో మెలికపెడుతూ లబ్ధిదారులకు చుక్కలు చూపెడుతోంది. 

తాజాగా పథకం లబ్ధిదారులకు మరో ఝలక్ ఇచ్చింది. పథకం కింద ఒకసారి వేసిన బోరులో నీరురాకపోతే.. రెండో బోరు వేయాలంటే అందుకయ్యే వ్యయాన్ని లబ్ధిదారులే భరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రహస్యంగా మెమో రూపంలో ఉత్తర్వులు జారీ చేసింది. రెండోసారి వేసిన బోరులో నీరు సమద్ధిగా వస్తే మాత్రం ఆ భారాన్ని భరించే విషయాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని పేర్కొంది. పది ఎకరాలను ఒక బ్లాక్‌గా చేసి.. ఆ భూమి యజమానులందరినీ కలిపి బోరు యూజర్ గ్రూపు (బీయూజీ)గా పరిగణిస్తారు. ఒక బీయూజీకి ఒక బోరు వేసి ఆరుతడి పంటల సాగుకు దోహదపడడం పథకం ముఖ్య ఉద్దేశం. అయితే ఐదారుగురు రైతులను కలిపి ఒక గ్రూపుగా చేయడం వల్ల నీటి పంపిణీ సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అదీగాకుండా భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించిన ప్రాంతాల్లోనే బోర్లు వేస్తున్నప్పటికీ నీరు పడడం లేదు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు వేసిన 4 వేల బోర్లలో దాదాపు 20 నుంచి 25 శాతం మేరకు బోర్లు ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండోసారి వేసే బోరుబావిలో నీరు రాకుంటే ఆ వ్యయాన్ని లబ్ధిదారులపైనే రుద్దేందుకు ప్రభుత్వం సిద్ధమవడం గమనార్హం. అలాగే ఒక బ్లాక్‌లో నీరు సమృద్ధిగా ఉంటే రెండో బోరు వేసుకోవచ్చని, అయితే అందుకు జియాలజిస్టు నుంచి ధ్రువపత్రం తెచ్చుకోవాల్సి ఉంటుందని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ జయలక్ష్మి మరో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐదెకరాలలోపు బ్లాక్‌లో మాత్రం రెండో బోరు వేయడానికి వీల్లేదని, అలాగే భూగర్భ జలాలు అధికంగా వినియోగించే ప్రాంతంలోనూ రెండోబోరు తవ్వకంపై నిషేధం ఉన్నట్లు తెలిపారు.

ఈ ధరలు గిట్టుబాటు కాదు..
బోరు బావులు తవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర ఏమాత్రం గిట్టుబాటు కాదని పలు జిల్లాల్లోని రిగ్ యజమానులు చెబుతున్నారు. వారు ముందుకు రాకపోవడంతో బోర్ల తవ్వకం ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దీంతో ఆయా జిల్లాల్లోని భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ధర నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు కట్టబెట్టింది. అనంతపురం, విజయనగరం, తూర్పుగోదావరి, చిత్తూరు, మెదక్, కడప జిల్లాల్లో డ్రిల్లింగ్ ధరను పెంచారు. అందువల్లే 4 వేల బోర్ల తవ్వకాలు అయినా జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

అడుగడుగునా నిర్లక్ష్యమే..
వివిధ శాఖల మధ్య సమన్వయ లేమితో పథకం నీరుగారుతోంది. బోర్లు వేయడానికి అనువైన ప్రాంతాలను గుర్తించడానికి సర్వే మొదలుకుని.. తవ్విన బోర్లకు విద్యుత్ కనెక్షన్లు, మోటార్లు అమర్చడం వరకు అన్నింటా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. జియాలజిస్టుల కొరత కారణంగా బోరు పాయింట్ల గుర్తింపు ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోంది. తవ్విన బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటిదాకా 4 వేల బోర్లు తవ్వితే.. సుమారు 900 బోర్లకు మాత్రమే కరెంటు కనెక్షన్ ఇచ్చారు. అలాగే మోటార్ల ధరపై కూడా స్పష్టత లేదు. దీనిపై అధికారులు ఇప్పటివరకు మార్గదర్శకాలు ఇవ్వలేదు. 

రాష్ట్రస్థాయిలో ఒక ధర నిర్ణయించే వరకు జిల్లా కమిటీలు నిర్ధారించిన ధరలు అమల్లో ఉంటాయని మాత్రమే చెబుతున్నారు. మోటార్ల ధర నిర్ణయించడానికి టెండర్లు పిలవగా.. దానిపై రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల యజమానులు కోర్టుకెళ్లారు. దీంతో టెండర్లు రద్దయ్యాయి. ఆ తర్వాత మోటారు ధర నిర్ణయంపై ఇప్పటికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ బోర్ల కింద బిందు, తుంపర సేద్యమే చేయాల్సి ఉన్నందున... మైక్రో ఇరిగేషన్ పరికరాల సరఫరా బాధ్యతలను ఉద్యానవన విభాగానికి అప్పగించారు. ఇలా పలు శాఖలతో ముడిపడి ఉండడం.. వాటి మధ్య సమన్వయం లోపించడంతో పథకం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారింది.
-న్యూస్‌లైన్, హైదరాబాద్/న్యూస్‌లైన్ నెట్‌వర్క్

జిల్లాల్లో ఇదీ పరిస్థితి...

* వరంగల్ జిల్లాలో 33 వేల ఎకరాలను ఇందిర జలప్రభ కింద సాగులోకి తెచ్చేందుకు ప్రణాళిక తయారు చేశారు. ఇప్పటివరకు 141 బోర్లు వేయగా.. 128 బోర్లలో నీళ్లు వచ్చాయి. ఇందులో 19 బోర్లకు మాత్రమే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు.

* చిత్తూరు జిల్లాలో ఆరు నెలలుగా పథకం ముందుకు సాగడం లేదు. రేటు గిట్టుబాటు కాకపోవడంతో ఒప్పందం కుదుర్చుకున్న డ్రిల్లింగ్ యజమానులు బోర్లు తవ్వడం లేదు. జిల్లావ్యాప్తంగా 1,090 బోర్లు వేయూల్సి ఉండగా.. 280 మాత్రమే వేశారు. 123 బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు.

* కృష్ణా జిల్లాలో పథకం కింద ఒక్క బోరు కూడా వేయలేదు. పైసా ఖర్చు పెట్టలేదు. జిల్లావ్యాప్తంగా 67 బోర్‌వెల్స్ వేయాలని నిర్ణయించగా.. 56 బోర్లకు అనుమతి లభించింది. అందులో 6 బోర్లకు సంబంధించిన పనులు మాత్రమే జరుగుతున్నాయి. మిగతా 50 బోర్ల పనులు మొదలుపెట్టలేదు.

* గుంటూరులో పథకానికి మొత్తం రూ.7.48 కోట్లు మంజూరు కాగా.. రూ.98.22 లక్షలు ఖర్చు చేశారు. 102 బోర్లు మంజూరయ్యాయి. ఇప్పటిదాకా 49 బోర్లు వేశారు.

* ఆదిలాబాద్ జిల్లాలో 765 బోర్లను గుర్తించినా.. ఇప్పటి వరకు 185 బోరు బావులే తవ్వారు. అందులో 12 బావులకు మాత్రమే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు.

* నిజామాబాద్ జిల్లాలో రెండేళ్లలో 1,500 బోర్లు వేయాల్సి ఉంది. కానీ ఐదు నెలల్లో కేవలం 62 బోర్లు తవ్వి, వాటిలో 39 బోరు బావులకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు.

అన్నదాత వ్యతిరేక విధానాలపై వైఎస్‌ఆర్‌సీపీ పోరు

‘అనంత’ కలెక్టరేట్ ముట్టడి 
నాయకుల అరెస్ట్, విడుదల

అనంతపురం, న్యూస్‌లైన్: అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రైతన్నలతో కలసి గురువారం అనంతపురం కలెక్టరేట్‌ను ముట్టడించారు. పెద్దసంఖ్యలో రైతులు, పార్టీ శ్రేణులు ఈ ముట్టడిలో పాల్గొనడంతో కలెక్టరేట్ ప్రాంతం దద్దరిల్లింది. వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ శంకరనారాయణ, పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, అనంతపురం, రాయదుర్గం ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, సీఈసీ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి, పైలా నర్సింహయ్య, సీజీసీ సభ్యులు తోపుదుర్తి కవిత, గిర్రాజు నాగేష్‌తో పాటు జిల్లాలోని ముఖ్య నాయకులు తరలివచ్చారు. 

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. రైతుల గురించి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతి క్షణం ఆలోచించేవారని, ఈ ప్రభుత్వం అన్నదాతల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. వాతావరణ బీమా నిలిపివేసి పంటల బీమా అమలు చేయాలని, పీఏబీఆర్ నుంచి పది టీఎంసీల నీటిని జిల్లాకు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరువును దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతుకూ ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. హంద్రీనీవా పనులకు బడ్జెట్ కేటాయించి పొలాలకు నీరందించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలన్నారు. ప్రతి మండలంలో పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి సమస్య తీర్చాలన్నారు. సకాలంలో తుంగభద్ర నీరు వచ్చేలా చర్యలు తీసుకుని బోర్లు మరమ్మతు చేయాలన్నారు. పండ్ల తోటలకు సబ్సిడీ, ప్రోత్సాహకాలు కొనసాగించాలన్నారు. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్‌అందించడంతో పాటు కూలీలకు పనులు కల్పించాలన్నారు. చేనేత కార్మికుల అప్పులు రద్దు చేసి కొత్త రుణా లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేతలు మాట్లాడుతుండగానే పోలీసులు బలవంతంగా వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు యత్నించారు. దీంతో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ముఖ్య నాయకులను అరెస్ట్ చేయగా.. తదుపరి సొంతపూచీకత్తుపై వారు విడుదలయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్ దుర్గాదాస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్


రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో సర్కారు చర్యలపై మండిపడ్డారు. ప్రజలపై భారాలు మోపడమే లక్ష్యంగా కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ పాలకులు ప్రజలపై భారం మోపుతున్నారే తప్ప వారి బాధ్యతను విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా సంక్షేమాన్ని, జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి బదులుగా ప్రజలపై ఎన్ని రకాలుగా భారాలు మోపాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రస్తుతం అన్నిరకాల ధరలు రెట్టింపు కావడంతో పేద, మధ్య తరగతి ప్రజలు జీవించడమే కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఐదుసంవత్సరాల మూడునెలల కాలంలో ఎలాంటి భారాలు మోపకపోగా ప్రజల బాధ్యతను స్వీకరించారని వివరించారు. ప్రతీ సంక్షేమాన్ని జయప్రదం చేసి, ప్రతి ఇంటికీ ఏదో ఒక పథకం అమలయ్యే విధంగా చర్యలు తీసుకున్నారని చెప్పారు. వైఎస్ హయాంలో ప్రజలపై ఒక్క రూపాయి భారం మోపకుండా సువర్ణయుగం అందించారన్నారు. అయితే మహానేత మరణానంతరం పాలనాపగ్గాలు చేపట్టిన వారు అన్ని పథకాలను అవకాశం ఉంటే ‘డిలే’ చేయడం, సాధ్యమైతే ‘డిలిట్’ చేస్తున్నారని మండిపడ్డారు. 

అఖిలపక్షం ఏర్పాటు చేయాలి 

పేదవాడు తన భూములు అమ్ముకోవాలన్నా, లేదా కాస్త ధైర్యం చేసి కొనాలన్నా జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని గట్టు ఆవేదన వ్యక్తంచేశారు. ఆస్తి విలువలో 0.5 శాతం పెంచితే దాన్ని భరించడం ఎలా? అని ప్రశ్నించారు. ఆఖరికి పెళ్లి రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా 40 రెట్లు పెంచడాన్ని తప్పుబట్టారు. భూములు, భవనాల విలువను పెంచాలని ప్రభుత్వం భావిస్తే అందుకు వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. అదే విధంగా విద్యుత్ సర్‌చార్జీల విషయంలో రూ.1,500కోట్ల రూపాయలను ప్రభుత్వమే భరించాలని గట్టు డిమాండ్ చేశారు. మంత్రి పార్థసారథికి నైతికత ఉంటే తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

రిలయన్స్-ఈటీవీ ఒప్పందాల్లో అవకతవకలపై దర్యాప్తు షురూ

రిలయన్స్-ఈటీవీ ఒప్పందాల్లో అవకతవకలపై దర్యాప్తు షురూ
మనీ లాండరింగ్‌తో సహా పలు అక్రమాలు జరిగినట్టు అనుమానం
దర్యాప్తును ధ్రువీకరించిన ఈడీ, కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు
ప్రాథమిక దర్యాప్తుకు ఆదేశించామని ఎంపీ ఉండవల్లికి ఆర్థిక శాఖ లేఖ
ఆద్యంతం అనుమానాస్పదంగా ఈటీవీ-రిలయన్స్ ఒప్పందం
రామోజీకి గుట్టుగా రూ.2,600 కోట్లను రిలయన్స్ మళ్ళించడంపైలోతుగా ఈడీ ఆరా

న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: పాపాల గుట్ట కదులుతోంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను మోసం చేసి... నియంత్రణ సంస్థ సెబీ కళ్లుగప్పి... ఆదాయపు పన్ను శాఖను పక్కదోవ పట్టించిన రామోజీ రావు ‘‘2,600 కోట్ల రూపాయల డీల్’’పై ఆలస్యం గానైనా దర్యాప్తు సంస్థలు దృష్టి సారించటం మొదలెట్టాయి. రోజుల వ్యవధిలో ఏర్పాటు చేసిన గొట్టం కంపెనీల ద్వారా ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.2,600 కోట్లను ప్రవహింపజేసిన ఉదంతంలో రామోజీరావు పన్ను ఎగవేశారని వచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికే ఐటీ శాఖ ఆయనకు నోటీసులిచ్చింది. 2007-08 ఆర్థిక సంవత్సరపు అసెస్‌మెంట్ ఆర్డర్‌ను తిరగరాస్తామని వాటిలో స్పష్టంగా పేర్కొంది. ఇపుడు ఈ నిధుల ప్రవాహంలోని మనీ ల్యాండరింగ్ కోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ కూడా దృష్టిపెట్టింది. 

రామోజీ వ్యవహారంపై తాము దర్యాప్తు మొదలుపెట్టామని, ప్రస్తుతానికి ఇది ప్రాథమిక దశలో ఉన్నందున ఎక్కువ వివరాలు వెల్లడించలేమని ఈడీ వర్గాలు స్పష్టంచేశాయి. అసలు రామోజీ వ్యవహారం పై 2006లోనే పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ అటు ఆర్‌బీఐకి, మిగిలిన దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారు. డిపాజిట్ల సేకరణను నిలిపి వేయటంతో పాటు అప్పటికే ఉన్న డిపాజిట్లను వెనక్కివ్వాలని ఆర్‌బీఐ ఆదేశాలివ్వటం... రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీ వేయటం సంభవించాయి. అయితే ఆస్తుల్ని అటాచ్ చేయటం వంటి తదుపరి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం దిగకుండా నిలువరించాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించి రామోజీరావు స్టే తెచ్చుకున్నారు. ఇందుకోసం ఆయన తన టీవీ చానళ్లను, మార్గదర్శి ఆస్తుల్ని కోర్టుకు హామీగా చూపించారు. 

ఇదంతా జరిగింది 2007లో కాగా... ఆ తరవాత రామోజీరావు రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకుని ఈటీవీ చానళ్ళు, ఈనాడుతో కూడిన ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌లో 39 శాతం వాటాను రెండు విడతలుగా రూ.2,600 కోట్లకు విక్రయించారు. నిమేష్ కంపానీకి చెందిన ఈక్వేటర్ ట్రేడింగ్ ఇండియా లిమిటెడ్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ వివిధ గొట్టం కంపెనీల ద్వారా ఈ డబ్బును సరఫరా చేయటంతో అది రూ.2,600 కోట్లు చెల్లించి ఈ వాటా కొనుక్కుంది. తరవాత దీన్లో కొంత వాటాను రిలయన్స్‌కే చెందిన మరో గొట్టం కంపెనీ అనూ ట్రేడింగ్‌కు బదలాయించింది. 

నిజానికి కోర్టులో హామీ పెట్టిన ఆస్తిని ఇలా విక్రయించటం నేరం. పెపైచ్చు ఈ అమ్మకం కూడా పూర్తి అవకతవకలతో... కేవలం డబ్బును ప్రవహింపజేయటానికి పుట్టుకువచ్చిన కంపెనీల ద్వారా పూర్తికావటమనేది ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ దర్యాప్తునకు కారణమవుతోంది. తాను అప్పట్లో చేసిన ఫిర్యాదుకు సంబంధించి తదుపరి చర్యలేమైనా తీసుకున్నారా? అంటూ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల(మే 10న) ఆర్థిక శాఖ సహాయ మంత్రి పళని మాణిక్యానికి, అప్పటి ఆర్థికమంత్రి ప్రణబ్‌కు, ప్రధానమంత్రికి లేఖలు రాయటంతో... పళనిమాణిక్యం నుంచి ఆయనకు ఈ నెల 18న లిఖిత పూర్వకంగా సమాధానం వచ్చింది. ‘‘ఈ ఉదంతంపై ప్రాథమిక విచారణకు ఆదేశించాం’’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ వర్గాలను ‘సాక్షి’ ప్రతినిధి సంప్రదించారు. ‘‘నిజమే! దర్యాప్తు చేస్తున్నాం. కానీ ప్రాథమిక దశలోనే ఉన్నాం కనక ఎలాంటి వివరాలూ వెల్లడించలేం’’ అని ఆ వర్గాలు స్పష్టంచేశాయి. 

హెచ్‌డీఎఫ్‌సీ, టీవీ-18 డీల్స్‌పైనా దృష్టి!

రామోజీరావు వ్యవహారంలో ఈక్వేటర్-ఉషోదయా మధ్య జరిగిన ఒప్పందమే కాక... ఆయన హెచ్‌డీఎఫ్‌సీలో డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో రూ.1,688 కోట్లు పెట్టారని, ఇది కూడా అనుమానాస్పదంగానే ఉందని పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఈడీ అధికారి ఒకరు తెలియజేశారు. ఈ వ్యవహారం మొత్తం 2007 నవంబర్ 2 నుంచి 2008 జనవరి 3 మధ్యలో జరిగిందని చెప్పారాయన. అయితే ఉషోదయా-ఈక్వేటర్ డీల్ మొత్తం 2008 జనవరిలోనే పూర్తి కావటం ఈ సందర్భంగా గమనార్హం. అంటే రామోజీరావు తన డబ్బుల్ని హెచ్‌డీఎఫ్‌సీలోకి మళ్లించి, రిలయన్స్ నుంచి డబ్బులు తెచ్చుకున్నారా? అవి నిజంగా రిలయన్స్ డబ్బులేనా? అయితే అది ఎందుకు అంత రహస్యంగా పెట్టింది? లేక అవి వివిధ ఆరోపణలు వస్తున్నట్లుగా కేజీ బేసిన్ గ్యాస్ కోసం చంద్రబాబునాయుడికి రిలయన్స్ చెల్లించిన ముడుపులా? అనే అన్ని కోణాలనూ దర్యాప్తు సంస్థ పరిశీలిస్తున్నట్లుగా తెలియవచ్చింది.

వీటన్నిటితో పాటు ఇప్పటికే పలువురు విశ్లేషకుల కన్నెర్రకు కారణమైన టీవీ-18- రిలయన్స్ డీల్ కూడా దర్యాప్తు పరిధిలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ డీల్‌లో నిజానికి టీవీ-18 సంస్థ తన చేతి నుంచి రూపాయి పెట్టింది లేదు. ఈటీవీలో వాటా కొనుగోలు చేయటానికి దానికి రిలయన్ ్స సంస్థ రూ.2,800 కోట్ల పై చిలుకు మొత్తాన్ని సమకూర్చింది. అందుకు ప్రతిగా అది టీవీ-18కు చెందిన రైట్స్‌ను కొనుగోలు చేసింది. ఈ డీల్ కూడా ఈడీ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. దీంతోపాటు భారీ నష్టాల్లో నడుస్తున్న ఈనాడు గ్రూపుకు చెందిన ఒక్కో షేరును ఏకంగా 5,28,630 రూపాయలకు రిలయన్స్ ఎందుకు కొనుగోలు చేసిందన్న అంశం మీదా దర్యాప్తు సంస్థ ప్రధానంగా దృష్టి పెట్టింది. మార్గదర్శి ఉదంతంలో ఆరోపణలన్నీ రుజువైతే, అక్రమంగా సేకరించిన డిపాజిట్లకు రెండున్నర రెట్లు జరిమానాను రామోజీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ సమస్యల నుంచి బయట పడేయాలంటూ ముకేశ్ అంబానీతో రామోజీ, టీడీపీ నేతలు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. రామోజీరావు, చంద్రబాబు తదితరులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇటీవల హైకోర్టుకు ఫిర్యాదు చేసేదాకా అసలు ఈటీవీ-రిలయన్స్ ఒప్పందం అనేది ఒకటి జరిగిందన్న విషయాన్నే ఇరువర్గాలూ అత్యంత గోప్యంగా ఉంచిన విషయం తెలిసిందే.

‘నగదు బదిలీ’ లోగుట్టు!

కంట్లో నెరసు పడిందని కనుగుడ్డు పెరుక్కున్నాడట వెనకటికొక మూర్ఖుడు. పేద జనానికి ఎంతోకొంత ఉపయోగకరంగా ఉంటున్న ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లోని లోపాలను సరిదిద్ది అవి మరింత సమర్ధవంతంగా పనిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు ఏకంగా ఆ వ్యవస్థకే మంగళం పాడే దిశగా పావులు కదుపుతున్నాయి. ఏడాదిన్నరక్రితం పీడీఎస్‌ను క్రమబద్ధీకరించాలని కోరుతూ పౌర హక్కుల ప్రజా సంఘం (పీయూసీఎల్) దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఆ వ్యవస్థ తీరుతెన్నులను న్యాయమూర్తులు ప్రశ్నించారు. ప్రభుత్వ అసమర్ధతను ఎండగట్టారు. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నా కూడా దేశంలో ఒకవైపు ఆకలి చావులు, మరోపక్క పోషకాహారలోపం ఎలా సంభవిస్తున్నాయని వారు ప్రశ్నించారు. జస్టిస్ వాధ్వా ఆధ్వర్యంలో తామే ఒక కమిటీని నియమించి పీడీఎస్ పనితీరుపై నివేదిక ఇవ్వాలని వారు కోరారు. 

ఆ కమిటీ పీడీఎస్‌లో సాగుతున్న అనేక లోపాలను ప్రస్తావించింది. దీన్ని సమూల ప్రక్షాళన చేయకపోతే పేదలకు తిండిగింజలు అందడం దుర్లభమని తేల్చింది. పూర్తిస్థాయి కంప్యూటరీకరణ చేస్తే అక్రమాలకు అడ్డుకట్టపడుతుందని సిఫార్సు చేసింది. పీడీఎస్ వ్యవస్థ బలహీనంగా ఉన్న సంగతి వాస్తవం. దాని ద్వారా పంపిణీ చేస్తున్న తిండి గింజల్లో 60 శాతం బహిరంగ మార్కెట్‌కు తరలుతున్నాయని ఒక అంచనా. ఆహార సబ్సిడీ కింద కేటాయింపులు ఆ యేటికాయేడు పెరుగుతున్నా అందులో వాస్తవంగా పేదలకు చేరేది తక్కువే. ఈ ఏడాది గోధుమ సేకరణ అనుకున్నదానికంటే ఎక్కువగా జరిగింది గనుక ఆహార సబ్సిడీ లక్ష కోట్లకు చేరవచ్చని ఈమధ్యే కేంద్ర ఆహార మంత్రి కె.వి. థామస్ చెప్పారు. 

అయితే, ఇంత ఘనంగా కేటాయింపులు ఉంటున్నా అన్నార్తులకు సరిగా అందడం లేదు. ఆహార భద్రత బిల్లు తీసుకురాబోతున్నామని, ఇక దేశంలో ఆకలి కేకలు వినబడే ప్రసక్తే ఉండదని ప్రభుత్వం చెబుతున్నా, పీడీఎస్ వ్యవస్థను తీర్చిదిద్దడంలో విఫలమవుతోంది. దేశంలో సంస్కరణలు జోరందుకున్నప్పటినుంచీ సంక్షేమ రాజ్య భావననుంచి మన పాలకులు కొంచెం కొంచెం పక్కకు జరుగుతున్నారు. పీడీఎస్ సంస్కరణలను అందులో భాగంగా చూస్తున్నారు తప్ప, దాన్ని సరిదిద్ది పేదల్ని ఉద్ధరిద్దామన్న యోచన మాత్రం కనబడటం లేదు. అప్పుడెప్పుడో కిరీట్ పారిఖ్ నేతృత్వంలో అధ్యయన బృందం అనేక సూచనలు చేసింది. ఫుడ్ స్టాంప్స్ ద్వారాగానీ, స్మార్ట్ కార్డులు ద్వారాగానీ పీడీఎస్‌ను సమర్ధవంతంగా అమలుచేయొచ్చని ఆ కమిటీ పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం ఇంకొంచెం ముందుకుపోయి పీడీఎస్‌కు మంగళంపాడి దారిద్య్రరేఖకు దిగువనున్నవారికి కిరోసిన్, గ్యాస్ సబ్సిడీలను నగదు బదిలీ పథకం ద్వారా అందజేయాలన్న ఆలోచనచేసింది. అలాగే, రైతులకిచ్చే ఎరువుల సబ్సిడీని కూడా ఇకపై సొమ్ము ముట్టజెప్పడం ద్వారా కానిద్దామని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు అవసరమైన సాంకేతిక వ్యూహాన్ని సిద్ధం చేయడానికి నందన్ నీలేకని ఆధ్వర్యంలో ఒక టాస్క్‌ఫోర్స్‌ను కూడా నియమించింది. సహజంగానే నీలేకని తాము రూపొందిస్తున్న ఆధార్ గుర్తింపు కార్డులతో ముడిపెట్టి నగదు బదిలీ పథకాన్ని అమల్లోకి తేవొచ్చని సూచించారు. 

ఆయన చెప్పిన ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఇది అమల్లోకి రావాల్సి ఉన్నా, ఇప్పుడు నిరుపేదలతో బ్యాంకు ఖాతాలను ప్రారంభించే కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికైతే కిరోసిన్‌కు బదులు నగదు బదిలీ పథకాన్ని అమలు చేయబోతున్నామని చెబుతున్నా, భవిష్యత్తులో బియ్యానికి, గోధుమలకు కూడా వర్తింపజేయబోరన్న గ్యారెంటీ ఏంలేదు. మన పీడీఎస్ వ్యవస్థ పరమ అధ్వానంగా ఉందని గత ఏడాది ప్రపంచబ్యాంకు ఒక నివేదికలో వాపోయింది. అందులో నగదు బదిలీ పథకాన్ని ప్రస్తావించింది. దానిద్వారా లబ్ధిదారులకు ఎక్కువ మేలు జరుగుతుందేమో ఆలోచించమని సూచించింది. ఈ పథకాన్ని వేర్వేరు పేర్లతో హోండురస్, నికరాగువా, పెరూ, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, ఈక్వెడార్, బ్రెజిల్, మెక్సికోలాంటి 30 దేశాలు అమలుచేస్తున్నాయి. అందులో 13 దేశాలకు ప్రపంచబ్యాంకు ఆర్ధిక సాయం కూడా అందిస్తోంది.

మన దగ్గర 2009 ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు దీన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకుని భంగపడ్డారు. బహుశా మిగిలిన రంగాల్లో ప్రపంచబ్యాంకు ఆదేశాలను శిరసావహించడానికి అలవాటుపడిన మన నేతలు ‘నగదు బదిలీ’ ఆలోచనను కూడా దాని ఆదేశాలమేరకే అమల్లోకి తెస్తున్నారా అనే అనుమానాలు కలగకమానవు. ఇలా డబ్బు చెల్లించి, బాధ్యతలనుంచి వైదొలగడం ప్రభుత్వాలకు బాగానే ఉంటుందిగానీ... అమల్లోకి తేవాలనుకుంటున్నవారు కొన్ని మౌలిక ప్రశ్నలకు జవాబు చెప్పాల్సివుంది. ప్రస్తుతం రైతులనుంచి కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) చెల్లించి కొంటున్న ఆహారధాన్యాలను పీడీఎస్ ద్వారా పంపిణీ చేస్తున్నారు.

నగదు బదిలీ పథకం తర్వాత రైతుల పరిస్థితి ఏమిటి? వారికిచ్చే ఎంఎస్‌పీ ఏమవుతుంది? అసలు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఏమవుతుంది? పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నగదు బదిలీ పథకంలో ఇచ్చే సొమ్మును కూడా పెంచుతారా? ఇవన్నీ కాకుండా అసలు ఆహార ధాన్యాలకు బదులు డబ్బిస్తే లబ్ధిదారులు ఆ సొమ్మును ఆహారానికే ఖర్చుపెడతారన్న నమ్మకమేమిటి? మహిళల పేరుమీద బ్యాంక్ ఖాతాలు తెరిపిస్తున్నా, అందులో పడే సొమ్ము ఇంట్లో పెత్తనం చెలాయించే మగవాళ్లకు చేర డానికి, వారినుంచి మద్యం దుకాణాలకు పోవడానికి ఎంతో సమయం పట్టదు. ఇప్పటికే మన సమాజంలో ఆడవాళ్లు, పిల్లలు పోషకాహారలోపంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నగదు బదిలీ పథకం ఆ పరిస్థితిని మరింత దిగజార్చడం తప్ప సాధించేదేమీ ఉండదు. ప్రభుత్వాలు తమ చేతకానితనాన్ని ఇలా కొత్త కొత్త పథకాలద్వారా కప్పిపుచ్చుకోవడానికి చూడటం క్షమార్హం కాదు.

తాకట్టుకు ప్రతిఫలం దక్కేనా?

Written By news on Thursday, July 26, 2012 | 7/26/2012తెలుగు చలన చిత్ర సీమలో మెగాస్టార్ స్థాయికి ఎదిగినా కాంగ్రెస్ రాజకీయాల్లో స్టార్ హోదాను కూడా దక్కించుకోలేకపోతున్న చిరంజీవి మనసంతా కేంద్ర ప్రభుత్వ మంత్రి వర్గ విస్తరణ మీదే ఉంది. సామాజిక న్యాయం నినాదంతో మార్పు లక్ష్యంగా.. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవికి ఆద్యంతము అనుకోని సంఘటనలే ఎదురవుతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజారాజ్యం పార్టీ గత ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ కావడంతో కొద్ది రోజులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితిలో రాజకీయ నడిసముద్రంలో ఓ చెక్క ముక్కపై మునగడమా, తేలడమా తెలియని స్థితిలో ఓ ఆసరా కోసం ఎదురు చూస్తున్న ఆయనకు కాంగ్రెస్ ఆఫర్ 'భాగ్యలక్ష్మి బంపర్ డ్రా' తగిలినంత పనైంది.

ఇంకేంటి.. తంతే గారెల బుట్టలో పడినట్టు ఎగిరి గంతేసి.. కాంగ్రెస్ ఒప్పందానికి తలవొగ్గి ప్రజారాజ్యాన్ని తాకట్టు పెట్టారు. ఒప్పందంలో భాగంగా తన భజన పరులకు మంత్రి పదవులు దక్కినా.. కేంద్రంలో మంత్రి హోదాను ఆశించిన ఆయనకు దక్కలేదు. ఆతర్వాత కొందరు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ సీపీ పక్షాన నిలువడం.. రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సంఘటనలు చోటు చేసుకోవడం జరిగిన సంగతి తెలిసిందే. రైతుల పక్షాన నిలిచి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటెయ్యడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు పడింది. తనను గెలిపించిన తిరుపతి నియోజకవర్గ ప్రజలకు చెప్పకుండానే ఎమ్మెల్యే గిరికి రాజీనామాలు పెట్టి, రాజ్యసభ సభ్యత్వంతో ఎంపీ హోదాకు మారారు. దాంతో రాష్ట్రంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఊహించని ఉప ఎన్నికలు ఆయనకు అగ్నిపరీక్ష గా నిలిచాయి.

ఉప ఎన్నికల్లో ఆరు.. ఏడు స్థానాలను గెలిపిస్తానని అధిష్టానం వద్ద ప్రగల్భాలు పలికిన మెగాస్టార్ కు ఆశించిన ఫలితాలు దక్కకపోవడం, స్వయంగా తాను గెలిచిన తిరుపతి నియోజకవర్గంలో కూడా ఊహించిన ఓటమి ఎదురవ్వడంతో ఆయనలో మంత్రి పదవి దక్కుతుందో లేదో అనే అనుమానం మొలకెత్తింది. అటు మంత్రి పదవి దక్కక.. 150 సినిమాపై మోజు తీరక ఊగిసలాడుతున్న చిరంజీవికి తాజా మంత్రి వర్గ విస్తరణ మరో ఆశను రేపింది.

ఆర్ధిక మంత్రి పదవికి ప్రణబ్ ముఖర్జీ రాజీనామా చేసి రాష్ట్రపతిగా ఎంపిక కావడం, వీరభద్ర సింగ్ రాజీనామా తదితర కారణాలతో కేంద్రంలో మంత్రి పదవులకు వేకెన్సీ బోర్డు ఉండటంతో మీడియాలో మంత్రి వర్గ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. దాంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న చిరంజీవికి కారుపై ఎర్ర బుగ్గ మోజు పెరిగింది. ఎంతో మంది నమ్ముకున్న ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలను, అభిమానులను నట్టేటా ముంచి.. మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టిన చిరంజీవికి ప్రతిఫలం దక్కుతుందా లేదా అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

MP Mekapati console Krishnapatnam port expats

పెంచిన ఛార్జీలను తగ్గించాలి: గట్టు

పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలు ప్రభుత్వం వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. భూముల విలువ పెంపుపై తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. ప్రజలపై భారం మోపడమే కర్తవ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన విమర్శించారు. ప్రజలపై పన్నుల మోత మోగించడమే లక్ష్యంగా పనిచేస్తుందని గట్టు ఆరోపించారు. బడా కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ పేద ప్రజలపై చూపడం లేదని గట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్థసారధి తన పదవికి రాజీ నామా చేయాలని గట్టు రామచంద్రరావు అన్నారు. 

పులిచింతలను పూర్తి చేయాలి: నాగిరెడ్డి

విజయవాడ: రైతు సమస్యలపై పోరాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని వైఎస్‌ఆర్‌ సీపీ రైతు విభాగం నాయకుడు నాగిరెడ్డి స్పష్టం చేశారు. రైతులకు మేలు చేసే పులిచింతల ప్రాజెక్ట్‌ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆగస్టు 10లోగా గుంటూరు, కృష్ణా రైతులతో కలిసి పాదయాత్ర నిర్వహిస్తామని వైఎస్‌ఆర్‌ సీపీ నేత సామినేని ఉదయభాను ఓ ప్రకటనలో తెలిపారు.

Sakshi Vedika With HighCourt Lawyer NagiReddy

YSRCP Dharna for Farmers Problems at Anantapur

రాజన్న ముద్రను చెరపటం అంత సులభమా?


రాష్ట్ర ప్రజల హృదయాల్లో నుంచి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముద్రను చెరిపేసేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఓ పక్క వైఎస్ మా నేత అంటూనే మరోవైపు ఆయన ఇమేజ్ ను దూరం చేసేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తోంది. పాదయాత్రతో ప్రజలకు మరింత దగ్గరైన వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే పలు ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారు.

అంతే కాకుండా వాటి అమలుకు ఎనలేని కృషి చేశారు. దాంతో వైఎస్ కాంగ్రెస్‌ పార్టీ కన్నా వ్యక్తిగతంగా ప్రజల్లో ఆదర అభిమానాలు సంపాదించారు. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలకు ప్రశంసలే కాకుండా, మిగతా రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయి. ఆయన మరణానంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాలను ఒక్కొక్కటిగా అటక ఎక్కిస్తోంది.

వైఎస్ ఇమేజ్ ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కలిసి వస్తోందని భావించిన కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఆపథకాలపై 'రాజ'ముద్రను తొలగించాలని కంకణం కట్టుకుంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలన్ని కాంగ్రెస్ పార్టీవే కానీ...వైఎస్ సొంత పథకాలు కాదని గొంతు చించుకుని చెబుతున్నా ప్రజలు నమ్మలేదు. అందుకు నిదర్శనంగా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఫలితాలనే చెప్పుకోవచ్చు. చాలాచోట్ల డిపాజిట్లు కోల్పోయి 'చేతు'లెత్తిసింది కూడా.

దాంతో ఆత్మశోధనకు దిగిన రాష్ట్ర కాంగ్రెస్ పదిమంది మంత్రుల సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. నెల రోజులు శోధన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ముద్ర’ను తొలగించి, అవన్నీ కాంగ్రెస్ పథకాలుగా ప్రచారం చేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని ఆ కమిటీ తేల్చింది.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై వైఎస్ ముద్ర ఉన్నందున, ఎన్ని చెప్పినా అవి వైఎస్ పథకాలుగానే ప్రజలు గుర్తిస్తున్నారని కమిటీ భావించింది. దీనిపై చాలాసేపు తర్జన భర్జన పడింది కూడా. ఉదాహరణకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు వైఎస్ హయాంలో 750 కోట్ల రూపాయలు కేటాయించగా, ఇప్పుడు నాలుగు వేల కోట్లు చెల్లించినా అది వైఎస్ పథకంగానే ముద్ర పడిందని పేర్కొంది.

అలాగే నాడు వైఎస్ పల్లెబాట చేపట్టడం ద్వారా ప్రజల ముందుకు ప్రభుత్వ యంత్రాంగం కదిలి వచ్చి సమస్యలు పరిష్కరించడం జరిగినందున, అది కూడా వైఎస్ పథకంగానే ముద్ర పడిందని కమిటీ అభిప్రాయపడింది. ఇప్పుడు ఆ పథకానికి ఇందిరమ్మ బాటగా పేరు మార్చడం వల్ల క్రమేణా వైఎస్ పేరును ప్రజలకు దూరం చేయగలమా? అనే అంశంపై కమిటీ మల్లాగుల్లలు పడింది.

కనీసం వెంటనే కాకపోయినా కొంత కాలానికైనా మార్చేందుకు వీలవుతుందని భావిస్తోంది. అవసరం అయితే పథకాల పేర్లూ కూడా మార్చాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మరింతగా దిగజారుతుందని అభిప్రాయపడింది. ఈమేరకు నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించింది. కమిటీ నివేదికను పరిశీలించి అమలు చేస్తామని ముఖ్యమంత్రిగారు అభయహస్తం ఇచ్చారు.

కులమతాలు, ప్రాంతాల కతీతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహనేత వైఎస్‌ఆర్‌ ముద్రను చెరిపేయాలనుకోవడం హనుమంతుని ముందు కుప్పిగంతులేయడం లాంటిదని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో ఒంటిచేత్తో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన వైఎస్‌ఆర్‌ను ప్రజల హృదయాల్లోంచి తుడిపేయాలనుకోవడం కాంగ్రెస్‌ తరం కాదని సవాల్ విసిరింది. మరి ప్రజల గుండెల్లో నిలిచిన రాజన్న ముద్రను చెరపటం అంత సులభమా? వైఎస్‌ ముద్ర మాత్రం కాంగ్రెస్‌ను భయపెడుతోంది!

రైతు సమస్యలపై వైఎస్ఆర్ సీపీ పోరు

రైతుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు గురువారం అనంతపురం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలను అరికట్టాలని, కొరత లేకుండా ఎరువుల పంపిణి చేయాలని పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ముట్టడిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గుర్నాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు విశ్వేశ్వర్‌రెడ్డి, కవిత, అనంత జిల్లా కన్వీనర్‌ శంకర్‌ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

'కేసీఆర్ కుటుంబం ఉనికి కోల్పోతోంది'

తెలంగాణ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుటుంబం ఉనికి కోల్పోందని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు వ్యాఖ్యానించారు. ఆ భయంతోనే వైఎస్ విజయమ్మ దీక్షపై కేటీఆర్ విమర్శలు చేశారని ఆయన గురువారమిక్కడ అన్నారు. వైఎస్ కుటుంబాన్ని అడ్డుకుంటామంటున్న టీఆర్ఎస్ నేతలు.... మిగతా సీమాంధ్ర నేతల పర్యటనలను ఎందుకు అడ్డుకోవడం లేదని గోనె సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ పేరుతో కేసీఆర్ కుటుంబం చేస్తున్న దిగజారుడు పనుల్ని త్వరలో బయటపెడతానని ఆయన హెచ్చరించారు.

YSRCP Fire on Dharmana Committee Report

తెలంగాణకు కేసీఆరే విలన్హైదరాబాద్, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తెలంగాణకు ప్రథమ శత్రువు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎంఏ రహమాన్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ చౌరస్తాలో బుధవారం మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రహమాన్ మాట్లాడుతూ, తెలంగాణ సెంటిమెంట్‌ను ఎలక్షన్-కలెక్షన్‌గా మార్చారని ధ్వజమెత్తారు. తమపార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సిరిసిల్లకు వెళితే కిరాయిమూకలతో అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. దాడులు, వాహనాలు ధ్వంసం చేసి తెలంగాణ సంస్కృతిని మంటగలిపారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.

తెలంగాణ కోసం చిత్తశుద్ధితో కృషి చేసే వారందరిని మోసం చేయటం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు. ఆలె నరేంద్ర మొదలుకుని రహమాన్ వరకు నమ్మక ద్రోహానికి బలైనవారేనని వివరించారు. కేసీఆర్ తన కొడుకు, అల్లుడు, కూతురు స్వార్ధం కోసం తెలంగాణవాదాన్ని బలిపెట్టేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. అందులో అమాయక బీసీ,ఎస్సీ, మైనారిటీ సోదరులు బలికావద్దని రహమాన్ విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల ఘటనపై కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేనట్లయితే వారిని హైదరాబాద్‌లో తిరగనివ్వమని రహమాన్ హెచ్చరించారు.

రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళితే.. జేబులు లూటీ

* రేపట్నుంచే అమల్లోకి..
* చుక్కలు చూపించనున్న సేల్ డీడ్ రుసుం
* ఇకపై ఆస్తి విలువలో 0.5% చెల్లించాలి
* ఈసీ కావాలంటే జేబు ఖాళీ చేయాల్సిందే
* చార్జీ రూ.120 నుంచి రూ.1,000 వరకు పెంపు
* మనింట్లో పెళ్లికి... సర్కారుకు రూ.200 కట్నం
* వివాహాల నమోదు ఫీజు 40 రెట్లు పెంపు
* లీజు, టైటిల్ డీడ్‌ల డిపాజిట్ రుసుం 0.1శాతం

హైదరాబాద్, న్యూస్‌లైన్: బాదుడే.. బాదుడు... భూములు, భవనాల రిజిస్ట్రేషన్ విలువలు పెంచడానికి ముందే ప్రజలపై మరో భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా మరో ప్రధాన ఆదాయ వనరు.. రిజిస్ట్రేషన్ చార్జీలపై దృష్టి సారించింది. కొన్నిరకాల రిజిస్ట్రేషన్ చార్జీలను ఏకంగా 50 రెట్లు పెంచేసింది. భాగస్వామ్య రిజిస్ట్రేషన్లు, తనఖా ఒప్పందాలు వంటివి వీటిలో ఉన్నాయి. సేల్‌డీడ్, గిఫ్ట్‌డీడ్, సెటిల్‌మెంట్, జీపీఏలతో పాటు మరికొన్నిటికి ఇప్పటివరకు రూ.1,000 రుసుముగా చెల్లిస్తే సరిపోయేది. కానీ ఇకపై ఆస్తి విలువలో అరశాతం కట్టాల్సిందే. 

అలాగే ఇళ్లు, స్థలాల క్రయవిక్రయాలప్పుడు ప్రతి ఒక్కరూ తీసుకునే ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) చార్జీలనూ ప్రభుత్వం భారీగా పెంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏటా 7 లక్షలకు పైగా ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేసుకోవాల్సిన వివాహ నమోదు చార్జీ ఒకేసారి 40 రెట్లు పెంచింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త చార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తిచేసిన సంగతి తెలిసిందే.

భారీ ఆదాయంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. 14 రకాల రిజిస్ట్రేషన్ల చార్జీలు ప్రస్తుతం రూ.1,000 చొప్పున ఉండగా.. ఇకపై వీటికి విలువ ఆధారంగా ఫీజులు వసూలు చేయనుంది. ఎవరైనా ఒక వ్యక్తి తన కుమార్తెకు ఏకంగా కోటి రూపాయల విలువైన ఆస్తికి గిఫ్ట్‌డీడ్ చేసినా.. ప్రస్తుతం రూ.1,000 రుసుం చెల్లిస్తే చాలు. ఇక నుంచి అలా వీలుకాదు. ఆస్తి విలువలో అర శాతం రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 14 రకాల రిజిస్ట్రేషన్లకు రూ. వెయ్యి ఫీజు స్థానే ఆస్తి విలువలో 0.5% రుసుం చెల్లించాల్సిందే. 

సేల్‌డీడ్ (ఆస్తిని విక్రయిస్తామంటూ చేసే అగ్రిమెంట్), గిఫ్ట్‌డీడ్, మార్పిడి, సెటిల్‌మెంట్, అమ్మకంతో కూడిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, అభివృద్ధి ఒప్పందంతో కూడిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, ఒప్పంద విడుదల, డిక్రీ తదితరాలకు ప్రస్తుతం రూ. వెయ్యి రుసుం మాత్రమే ఉంది. ఇక నుంచి ఆస్తుల విలువలో అరశాతం ఫీజు చెల్లించాలి. లీజు, తనఖా, టైటిల్ డీడ్ల డిపాజిట్ రుసుమును 0.1 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. సొసైటీల రిజిస్ట్రేషన్ రుసుమును రూ. 200 నుంచి రూ. 500కు పెంచింది. అప్పీళ్లు, డూప్లికేట్ కాపీల చార్జీ రూ. 100 నుంచి రూ. 300కు పెంచింది. ఇక ఇళ్లు, స్థలాల క్రయ,విక్రయాల్లో ప్రతి ఒక్కరికీ అవసరమైన ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ), దస్తావేజు నకళ్లు (సర్టిఫైడ్ కాపీ)ల ఫీజులు కూడా పెరిగాయి. 

ప్రస్తుతం ఈసీ (ఆస్తికి సంబంధించి గతంలో జరిగిన లావాదేవీల వివరాల కాపీ) కోసం ప్రస్తుతం రూ. 120 చెల్లిస్తే సరిపోతుంది. ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చేసింది. కాలాన్ని బట్టి ఈసీల కోసం మూడు రకాల ఫీజులు నిర్ణయించింది. 13 ఏళ్లలోపు లావాదేవీల వివరాలతో ఈసీ కావాలంటే రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. 13- 30 ఏళ్ల మధ్య లావాదేవీలకు రూ.500, 30 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలానికి వెయ్యి రూపాయల రుసుం చెల్లించాలి. వివాహ రిజిస్ట్రేషన్ రుసుం రూ.5 నుంచి ఏకంగా రూ.200కు పెరిగింది. ప్రతి వివాహాన్ని తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలనే సుప్రీంకోర్టు ఆదేశాలను ఆసరాగా తీసుకుని ప్రభుత్వం నమోదు రుసుం భారీగా పెంచింది. 

సవరణ ఫీజులు, వీలునామాల భద్రతా రుసుం 50 రెట్లు 
రిజిస్ట్రేషన్ సమయంలో దిక్కులు, ఇంటిపేర్లు, ఉప నంబర్లు లాంటి అంశాల్లో ఎక్కడైనా తప్పుగా నమోదైతే తర్వాత సవరించుకునే (రెక్టిఫికేషన్) అవకాశం ఉంది. ఆస్తివాటాదారుల్లో ఎవరైనా ఒకరు విధిలేని పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ సమయానికి రాలేకపోతే పలానా తేదీన వచ్చి సంతకాలు చేస్తామంటూ ఒప్పుదల (రాటిఫికేషన్) ఒప్పందం చేసుకునే వెసులుబాటూ ప్రస్తుతం ఉంది. ఆస్తికి సంబంధించి వివాదం ఉన్నా, సర్టిఫికెట్లలో లోపాలు ఉన్నా రిజిస్ట్రేషన్ తర్వాత దానిని రద్దు (క్యాన్సిలేషన్) చేసుకునే అవకాశం కూడా రిజిస్ట్రేషన్ శాఖలో ఉంది. అయితే ఈ మూడు రకాల ఫీజులను ప్రభుత్వం ఏకంగా 50 రెట్లు పెంచేసింది. వీటికి ప్రస్తుతం రూ.100 రుసుం ఉండగా రూ.5 వేలకు పెంచేసింది. చరాస్తుల తనఖా ఒప్పంద రుసుం కూడా రూ.100 నుంచి రూ.5 వేలకు పెరిగింది. 

అటెస్టేషన్ ఆఫ్ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ, విక్రయ హక్కులు లేని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, సెలవు దినాల్లో రిజిస్ట్రేషన్, భాగస్వామ్య ఒప్పందాలకు సంబంధించిన రుసుం ప్రస్తుతం రూ.100 నుంచి రూ.500 లోపు ఉండగా రూ.5 వేలకు పెరిగింది. సీల్డుకవర్లలో వీలునామాలను భద్రపరిచేందుకు ప్రస్తుతం రూ.100 రుసుం ఉండగా ఇది కూడా రూ.5 వేలకు పెరిగింది. హక్కుదారు కదలలేని పరిస్థితుల్లో ఉంటే రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకం పెట్టించుకునేందుకు సబ్‌రిజిస్ట్రారు కార్యాలయ సిబ్బంది ఇంటికి వచ్చే వెసులుబాటు ఉంది. దీనినే ప్రైవేటు అటెండెన్స్ అంటారు. దీనికి ప్రస్తుత రుసుం రూ. 500 కాగా ఇది రూ. 5 వేలకు పెరిగింది. 

భారీగా పెరిగిన చార్జీలపై సబ్ రిజిస్ట్రార్లతోపాటు స్టాంపులు , రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘చార్జీలు పెంచవచ్చుగానీ 40 శాతం, 50 శాతం పెంచడం దారుణం. సవరణ, రద్దు ఫీజులను కూడా 50 రెట్లు పెంచితే జనం రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రావాలంటేనే భయపడతారు. దీనివల్ల ఒప్పందాల రిజిస్ట్రేషన్లు తగ్గిపోతాయి. రిజిస్ట్రేషన్ చేసుకోని ఒప్పందాలు పెరిగిపోతాయి. ఇది ప్రభుత్వానికే నష్టం’ అని రాష్ట్ర సబ్ రిజిస్ట్రార్ల సంఘం ప్రతినిధి ‘న్యూస్‌లైన్’తో అన్నారు. 

రిజిష్ట్రేషన్ల శాఖ రెవెన్యూ టార్గెట్ 6700 కోట్లు: మంత్రి 
తిరుమల, న్యూస్‌లైన్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.6,700 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్ధారించుకున్నట్లు ఆ శాఖ మంత్రి తోట నరసింహం తెలిపారు. బుధవారం మంత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ వివాహ రిజిస్ట్రేషన్ చేసుకున్న నూతన వధూవరులకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బుధవారం నుంచి రాష్ట్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈసీ, సీసీలు నిలిపివేశామని, వీటిని మీసేవ కార్యాలయాల్లో పొందవచ్చని మంత్రి వెల్లడించారు.

Popular Posts

Topics :