29 July 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Stop AP gas transfer to Maharashtra: Vijayamma writes Open Letter to PM

Written By news on Saturday, August 4, 2012 | 8/04/2012

ప్రధానికి వైఎస్ విజయమ్మ లేఖ

ప్రధాని మన్మోహన్ సింగ్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ లేఖ రాశారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన గ్యాస్ వాటాని తమకు ఇవ్వాలని ఆ లేఖలో ఆమె కోరారు. తమ గ్యాస్ కేటాయింపులను వేరే రాష్ట్రానికి ఇవ్వడం సరైంది కాదన్నారు. తమ రాష్ట్ర వాటాను మహారాష్ట్రలోని రత్నగిరికి కేటాయించడం అన్యాయం అని పేర్కొన్నారు. దీనిపై జారీ అయిన ఉత్తర్వులను రద్దుచేయమని కోరారు. తమ సమస్యపై వెంటనే స్పందించాలన్నారు. లేకుంటే వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. న్యాయంగా తమకు రావాల్సిన గ్యాస్ వాటా ఇవ్వాలని, తాము చేస్తున్న డిమాండ్ న్యాయబద్ధమైనదేనని ఆ లేఖలో విజయమ్మ పేర్కొన్నారు.

YSRCP leader Somayajulu addressing Media 4th Aug

పాతిక లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తును నిలబెట్టగల శక్తి

మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అసంఖ్యాకమయిన సంక్షేమ పథకాల్లోకెల్లా విశిష్టమయినది ‘ఫీజు రీఇంబర్స్‌మెంట్ పథకం’. లక్ష రూపాయల కన్నా తక్కువ వార్షికాదాయం కలిగి ఉన్న పేదల పిల్లలకు ప్రొఫెషనల్ కోర్సుల నిమిత్తం చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వడమన్నది ఈ పథకం సారాంశం. వాస్తవానికి పేదల పిల్లలకు ప్రొఫెషనల్ చదువులను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకం వల్ల పాతిక లక్షల మంది పేద విద్యార్థులు లబ్ధిపొందగలరని అంచనా. పథకం ప్రారంభించిన సంవత్సరమే -2008లో- రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. 2009లో ఈ మొత్తం మరో అయిదు వందల కోట్ల రూపాయల మేరకు పెరిగింది. 2010 నాటికి ఈ పథకం కింద కేటాయించిన మొత్తం 3,500 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ వివరాలు చూస్తే చాలు- ఈ పథకం వల్ల లబ్ధి పొందుతున్న పేద విద్యార్థుల సంఖ్య ఎంత బహుళంగా ఉంటోందో అర్థమయిపోతుంది.

అలాంటి పథకాన్ని అయోమయావస్థలోకి నెట్టేశారు ప్రస్తుత పాలకులు! ఇటీవల రెండు సందర్భాల్లో రాష్ట్ర గవర్నర్ కూడా ఉచిత విద్యా పథకాలను తప్పెన్నుతూ మాట్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రతిభతో నిమిత్తంలేని ఉచిత విద్యా పథకాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని ‘టిస్’ కోర్సుల ప్రారంభోత్సవంలో పాల్గొంటూ వ్యాఖ్యానించారు గవర్నర్. అలాగే, ఉచిత విద్యా పథకాలను ‘నిరంతరం కొనసాగించరా’దని కూడా ఆయన హితవు చెప్పారు. దాంతో, వైఎస్‌ఆర్ రూపొందించిన ఈ పథకం ఇకపై కొనసాగుతుందో లేదో తెలియని గందరగోళ పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ వచ్చే వారం -ఈ నెల 12, 13 తేదీల్లో- విద్యార్థుల కోసం దీక్ష చెయ్యనున్నట్లు ప్రకటించారు. ఈ దీక్ష పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కేంద్రం ఏలూరులో జరుగుతుంది.

నిజానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం విశిష్టత ఏమిటి? దీన్ని మామూలు సంక్షేమ పథకాల్లో ఒకటిగా చూడకూడదు. మహానేత వైఎస్‌ఆర్ అన్నట్లుగా ఇది జాతి భవిష్యత్తుకోసం పెడుతున్న పెట్టుబడి మాత్రమే! ఆ రకంగా చూస్తే ఇది అక్షరాలా సమాజ సంక్షేమ పథకం. విద్యావేత్తలెందరో ఈ పథకాన్ని ‘విప్లవాత్మకమయినది’గా కీర్తించారు. అలాంటి పథకానికి మోకాలు అడ్డం పెట్టడమన్న కార్యక్రమం వైఎస్‌ఆర్ మరణించిన వెంటనే మొదలయిపోయింది. అతిధి నటుడిగా ముఖ్యమంత్రి పదవిని ఆక్రమించిన కె.రోశయ్య తన ఏడాది హయాంలోనే -సంస్కరణల పేరుతో- ఈ పథకానికి గొయ్యి తవ్వడం మొదలుపెట్టారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న విద్యార్థులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్తూ పగ్గం బిగించారు. దానికి తోడుగా మరికొన్ని షరతులు కూడా విధించారాయన. ఇక చుక్కతెగి రాలినట్లు హటాత్తుగా ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తొలి మీడియా సమావేశంలోనే ఈ పథకం ‘అర్హులకు మాత్రమే అందుతుం’దని అతి గడుసుగా మాట్లాడారు.

ఉల్లోపల ఏమేం చెప్తున్నారో ఏమో తెలియదు కానీ, బహిరంగంగా అధికార పక్షంతో సహా అన్ని పార్టీల పెద్దలూ ఈ పథకం గురించి సానుకూలంగానే మాట్లాడి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. పేద ప్రజల నట్టింటి దీపం లాంటి ఈ పథకం గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారికి రాజకీయ భవిష్యత్తు శూన్యమేననే స్పృహ లేనివారు తప్ప ఎవరూ ఇందుకు భిన్నంగా మాట్లాడలేరు. అయితే, వట్టిమాటలతో కాగల కార్యం ఏముంటుంది? ఈ అవగాహనతోనే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఏలూరులో దీక్షకు కూర్చోవాలని నిర్ణయించారు. పాతిక లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తును నిలబెట్టగల శక్తి ఈ ఒక్క పథకానికే ఉంది. అందుకే విజయమ్మ దీక్ష విజవంతం కావాలని -పేదల సంక్షేమం కోరుకునేవారంతా- కోరుకోవాలి!

YS Vijayamma deeksha on Fee reimbursement from Aug 12, 13 at Eluru

ప్రభుత్వం పునరాలోచించుకోవాలి: మేకపాటి

 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పధకాన్ని ఆపే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే తక్షణం పునరాలోచించుకోవాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతిభకు పేదరికం అడ్డుకాకూడదన్న గొప్ప ఆశయంతో మహనేత వైఎస్‌ ప్రవేశపెట్టిన పధకాన్ని ఆపేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తప్పవని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

సుప్రీం కోర్టు తీర్పును కుంటిసాకుగా చూపి ప్రభుత్వం అసాధారణ నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు తిరగబడాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి రోజా పిలుపునిచ్చారు. ప్రజల తిరుగుబాటుకు, విద్యార్థుల తరపున వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అండగా నిలుస్తుందని ఆమె హమీ ఇచ్చారు.

వైఎస్ఆర్ సీపీ కార్యాలయం ప్రారంభం

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దివంగత మహనేత వైఎస్‌ విగ్రహనికి నేతలు నివాళులు అర్పించారు. 

కమలాపురి కాలనీలో పార్టీ సేవాదళం రాష్ట్ర కన్వీనర్‌ కోటింరెడ్డి వినయ్‌రెడ్డి ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు నడుంబిగించాలని నేతలు విజ్ఙప్తి చేశారు.ఈ కార్యక్రమానికి పలువురు పార్టీ ముఖ్యనేతలు హజరయ్యారు.

విద్యార్థుల కోసం విజయమ్మ దీక్ష ప్రకటన

ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దీక్ష చేయనున్నారు. ఈ నెల 12,13 తేదీల్లో ఏలూరు వేదికగా ఆమె నిరహారదీక్ష చేస్తారు. సంతృప్తస్థాయిలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంని అమలుచేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు.

జగన్‌తో సయోధ్యకు ప్రయత్నించటం లేదు: ఏఐసీసీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోన్‌రెడ్డితో సయోధ్యకు కాంగ్రెస్ ఏవైనా ప్రయత్నాలు చేస్తోందా? అన్న ప్రశ్నలకు అలాంటిదేం లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి మనీష్‌తివారీ స్పష్టంచేశారు. ఏఐసీసీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన తివారీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అడిగిన ప్రశ్నకు ముక్తసరిగా జవాబిచ్చారు. ఏపీతో సహా ప్రధాన రాష్ట్రాల్లో ఎన్నికల విజయావకాశాలపై కాంగ్రెస్ పార్టీ సవివరమైన సమీక్ష నిర్వహిస్తోందని, జగన్‌తో సయోధ్యకు ప్రయత్నిస్తోందని, ఇందుకోసం జగన్ తల్లి వై.ఎస్.విజయలక్ష్మి, కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ మధ్య ఓ సమావేశం జరిగిందని వార్తలొచ్చాయి. ఇవి ఏమేరకు నిజమని ప్రశ్నిం చగా తివారీ స్పందిస్తూ.. ‘‘మీరు ఏ కథనాన్ని అయితే ప్రస్తావిస్తున్నారో అందులోనే దీనికి జవాబు ఉంది. 

కథనం రాసేముందు ధ్రువీకరణ కోసం పంపిన కొన్ని ఎస్‌ఎంఎస్‌లకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్‌తివారీ స్పందించలేదని కూడా ఆ కథనంలో రాశారు. అందువల్ల.. ఇప్పుడు మీ ప్రశ్నకు అదే నా సమాధానం’’ అని ముగించారు. ఇదిలావుంటే.. ఓ ఆంగ్ల పత్రికలో ప్రముఖంగా వచ్చిన సదరు కథనంలో ఎలాంటి పసా లేదని ఏఐసీసీ వర్గాలు స్పష్టంచేశాయి. ఏవో కొన్ని సర్వేలు పార్టీ పరంగా నిర్వహిస్తుండటం సహజమే కానీ ఎన్నికల విజయావకాశాలపై పార్టీ పరంగా ఇంతముందుగా సమీక్ష జరపటం ఉండదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ధ్రువీకరించని సమాచారం ఆధారంగా కథనం ఇచ్చినట్టు సదరు ఆంగ్లపత్రిక స్పష్టంగా పేర్కొన్నందున దానిపై ఎక్కువ చర్చించాల్సిన అవసరం లేదన్నాయి. 

రాష్ట్రానికి మరోసారి కేంద్రం మొండిచేయి

కొత్తగా 4,000 కి.మీ.కు జాతీయ హోదా
కానీ మన ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలే
ఎంపీల అనైక్యత, విభేదాలే కారణం
సీఎం సిఫార్సునూ పట్టించుకోని వైనం

హైదరాబాద్, న్యూస్‌లైన్: జాతీయ రహదారుల గుర్తింపులో మన రాష్ట్రానికి మరోసారి అన్యాయం జరిగింది. మిగతా రాష్ట్రాల ప్రతిపాదనలను ఆమోదించిన కేంద్రం, మన రాష్ట్రానికి మాత్రం మొండిచేయి చూపింది. కేంద్ర ఉపరితల రవాణా, రహదారి మంత్రి సీపీ జోషీ నేతృత్వంలో గురువారం జరిగిన భేటీలో దేశంలో కొత్తగా 4,000 కి.మీ. రోడ్లకు జాతీయ హోదా కల్పించారు. పంజాబ్, హర్యానా, కర్ణాటక, గుజరాత్, బీహార్ తదితర రాష్ట్రాల్లో ఇప్పటికే 4,500 కి.మీ. రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించగా, మిగతా రాష్ట్రాల ప్రతిపాదనలను కూడా క్లియర్ చేస్తూ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. కానీ ఈ జాబితాలో రాష్ట్ర ప్రతిపాదనలను మాత్రం పట్టించుకోలేదు. ప్రాంతీయ అసమానతలను సాకుగా చూపి మన జాబితాను అటకెక్కించింది. ఎంపీల్లో అనైక్యత, ప్రాంతాలవారీగా విభజన రేఖ ఏర్పడడంతో మన రోడ్డు ప్రాజెక్టులకు గ్రహణం పట్టుకుంది. ఇతర రాష్ట్రాలు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ఎగరేసుకుపోతుంటే మనకు మాత్రం రిక్తహస్తమే మిగులుతోంది.

ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సిఫార్సులను కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ఎన్‌హెచ్‌ల ప్రతిపాదనలపై ఎంపీలు ప్రాంతాలవారీగా విడిపోవడంతో పరిష్కార బాధ్యతను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌కు కేంద్రం అప్పగించింది. 

ఈ క్రమంలో రాష్ట్ర సర్కారు ప్రతిపాదించిన 1,981.77 కి.మీ. నిడివితో కూడిన 11 రోడ్లలో మూడు ప్రాంతాలకు సమ ప్రాధాన్యమిస్తూ 1,100 కి.మీ.ను ఎన్‌హెచ్‌లుగా ప్రకటిస్తామని ఉపరితల రవాణా, ర హదారి శాఖ గతంలోనే హామీ ఇచ్చింది. దాంతో రెండు రోజుల క్రితం జరిగిన కేంద్ర భేటీలో మన ప్రతిపాదనలను ఆమోదిస్తారని ఆశిస్తే నిరాశే ఎదురైంది. దాంతో కిరణ్, రోడ్లు, భవనాల మంత్రి ధర్మాన ప్రసాదరావు నేరుగా మంత్రి జోషీతో ఫోన్‌లో మాట్లాడినా.. ఆజాద్ చెబితే తప్ప రాష్ట్ర ప్రాజెక్టులను క్లియర్ చేయలేమని ఆయన తేల్చిచెప్పినట్టు సమాచారం. అజాద్ విదేశీ పర్యటనలో ఉన్నారు గనుక ఆయన అనుమతిచ్చిన వాటికైనా ఆమోదముద్ర వేయాలని విజ్ఞప్తి చేసినా కుదరదన్నారాయన. అసలు మనకు కేటాయించిన ప్రాజెక్టులను కూడా ఇతరులు తన్నుకుపోయారని అధికారులు మాత్రం అనుమానిస్తున్నారు. నిజానికి దేశవ్యాప్తంగా 10,000 కి.మీ.లను మాత్రమే ఎన్‌హెచ్‌లుగా గుర్తిస్తామని, రాష్ట్ర ప్రతిపాదనలను 2,000 కి.మీ.కి కుదించాలని కేంద్రం ఆదేశించింది. ఆ మేరకు జాబితాను సవరించి పంపినా, రోడ్ల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆ ప్రాంత ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. చివరికి రాష్ట్ర ప్రతిపాదనలను పక్కన పెట్టారు. రోడ్ల కేటాయింపులో ప్రాంతాలవారీ సమతుల్యత పాటిస్తూ 1,100 కి.మీ.లను ఓకే చేస్తూ ఆజాద్ నెరిపిన మధ్యవర్తిత్వాన్నీ జోషీ పట్టించుకోలేదు.

నాలుగేళ్లుగా నాన్చుడే: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో జాతీయ రహదారుల సాంద్రత చాలా తక్కువ. దేశవ్యాప్తంగా ఉన్న 70 వేల కి.మీ. రోడ్లలో రాష్ట్రంలో 4,730 కి.మీ. మాత్రమే ఉన్నాయి. అందుకే 6,571 కి.మీ. మేరకు 23 రోడ్లకు జాతీయ హోదా కోసం నాలుగేళ్ల క్రితం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదనలు పంపారు. కానీ ఆయన మరణంతో అవి కాస్తా పక్కదారి పట్టాయి.

హెల్త్‌కార్డుల ప్రక్రియ ఘరూ!

*తొలి రెండేళ్లు సర్వీస్ ప్రొవైడర్‌గా ఆరోగ్యశ్రీ ట్రస్టు
*పథకం అమలుకు ఏటా రూ. 350 కోట్లు
*ప్రభుత్వ వాటా రూ.210 కోట్లు.. ఉద్యోగుల వాటా రూ.140 కోట్లు
*ఒక్కో కుటుంబానికి చికిత్స గరిష్ట పరిమితి రూ.3 లక్షలు
*రెండు రకాల ప్రీమియం.. రూ.120, రూ.150 
*నవంబర్ 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం
*పథకం అమలు పర్యవేక్షణకు సీఎస్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యంపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. నవంబర్ 1 నుంచి హెల్త్‌కార్డుల పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన వివరాల (డేటా) సేకరణ విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం జీవో జారీ చేయనుంది. శుక్రవారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రత్నకిషోర్, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో శ్రీకాంత్, ట్రెజరీ శాఖ డెరైక్టర్ నాగార్జునరెడ్డి, జీఏడీ (సర్వీసెస్) కార్యదర్శి వెంకటేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీఎన్జీవో, టీఎన్జీవో, టీజీవో, సచివాలయ ఉద్యోగుల సంఘం, ఎస్టీయూ, పీఆర్టీయూ, తెలంగాణ, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, యూటీఎఫ్, ఏపీజీవో, గ్రూప్-4 ఉద్యోగుల సంఘాలు, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్యాంశాలు ఇవీ..
డేటా సేకరణ ఇలా..

ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థిక శాఖ నిర్వహించే హెచ్‌ఆర్‌ఎంఎస్ (హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టం)లో ట్రెజరీ శాఖ వెబ్‌సైట్ ద్వారా హెల్త్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ట్రెజరీ శాఖ వెబ్‌సైట్లో ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన ప్రొఫార్మా ఉంది.

ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులందరి ఆధార్ నంబర్లు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో జత చేయాలి. ఐసీఏవో (ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్) సూచించిన ప్రమాణాల మేరకు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోనే వినియోగించాలి. ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్‌లోని తొలి రెండు పేజీలను స్కాన్ చేసి అటాచ్ చేయాలి. పూర్తి చేసిన ఫారాన్ని అప్‌లోడ్ చేస్తే.. ఈ-ఫామ్, దరఖాస్తు నంబర్ లభిస్తాయి. ‘ఈ-ఫామ్’ను ఉద్యోగులు సంబంధిత డీడీవో (డ్రాయింగ్ అండ్ డిస్‌బర్సింగ్ ఆఫీసర్)కు, పెన్షనర్లు అయితే ఎస్టీవో (సబ్ ట్రెజరీ ఆఫీసర్) లేదా ఏపీపీవో (అసిస్టెంట్ పెన్షన్ పేమెంట్ ఆఫీసర్)కు సమర్పించాలి.

దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ఏవైనా లోపాలుంటే సవరించి ‘వ్యాలిడేట్’ చేయాలి. ఎక్కువ లోపాలుంటే వాటిని సవరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉద్యోగికి తిప్పి పంపించాలి.
కంప్యూటర్ పరిజ్ఞానంలేని ఉద్యోగులు, పెన్షనర్లు.. డీడీవో, ఎస్టీవోల సహకారంతో దరఖాస్తును అప్‌లోడ్ చేయాలి.

వివరాల సమర్పణకు అక్టోబర్ 20 వరకు గడువు ఇచ్చారు.
ఆధార్ నంబర్లు లేని వారి కోసం జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో ప్రత్యేకంగా ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఆధార్ వద్ద ఉన్న ఉద్యోగుల డేటాను హెల్త్‌కార్డుల వినియోగానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డేటా సెంటర్‌కు బదిలీ చేయనున్నారు.

పథకంలో ముఖ్యాంశాలివీ..

8 లక్షల మంది ఉద్యోగులు, 6 లక్షల మంది పెన్షనర్ల కుటుంబాలను ఈ పథకం కిందికి తీసుకురానున్నారు. అంటే దాదాపు 48 లక్షల మందికి ఆరోగ్య బీమా సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఉద్యోగుల వేతన శ్రేణిని బట్టి మూడు గ్రేడ్లుగా విభజించి ప్రీమియం నిర్ణయించాలని ప్రభుత్వం భావించింది. అయితే రెండు గ్రేడ్లుగా విభజించాలన్న ఉద్యోగుల డిమాండును ప్రభుత్వం అంగీకరించింది. గ్రేడును బట్టి రూ.120, రూ.150గా రెండు రకాల ప్రీమియం నిర్ణయించారు. నవంబర్ 1 నుంచి పథకం అమల్లోకి వస్తుంది. ప్రీమియం వసూలు నవంబర్ నెల జీతం నుంచి ప్రారంభమవుతుంది. ఏటా ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షలు, ఒక్కో వ్యక్తికి రూ.2 లక్షలు విలువైన చికిత్స చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. గరిష్ట పరిమితి మించితే.. ప్రత్యేకంగా రూ.175 కోట్లతో ఏర్పాటు చేయనున్న బఫర్ ఫండ్ నుంచి మంజూరు చేస్తారు.

పథకం అమలుకు ఏటా రూ.350 కోట్లు అవసరమని అంచనా. అందులో 60 శాతం (రూ.210 కోట్లు) ప్రభుత్వం, మిగతా 40 శాతం(రూ.140 కోట్లు) ఉద్యోగులు భరించనున్నారు. మొత్తం నిర్వహణ వ్యయం 5.7 శాతానికి మించకుండా పరిమితి విధించారు.

సర్వీసు ప్రొవైడర్‌గా తొలి రెండేళ్లు ఆరోగ్యశ్రీ ట్రస్టు వ్యవహరిస్తుంది. ట్రస్టు సేవల పట్ల ఉద్యోగులు సంతృప్తిగా ఉంటే రెండేళ్ల తర్వాత కూడా కొనసాగిస్తారు. లేదంటే మరో ట్రస్టుకు అప్పగిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉండే స్టీరింగ్ కమిటీ.. పథకం అమలు తీరును పర్యవేక్షిస్తుంది. కమిటీలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు, జీఏడీ (సర్వీసెస్) కార్యదర్శి, కుటుంబ సంక్షేమ కమిషనర్, వైద్య విద్య డెరైక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్, ట్రెజరీ శాఖ డెరైక్టర్, సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని సభ్య సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.

ఎయిడెడ్ సిబ్బందికి నో..

ఎయిడెడ్ ఉపాధ్యాయులు, యూనివర్సిటీ అధ్యాపకులకు హెల్త్‌కార్డుల పథకాన్ని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు చేసిన డిమాండ్‌కు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లు చేసినప్పుడు అవి పీఆర్సీ సిఫార్సుల్లో లేవని తప్పించుకొనే ప్రభుత్వం.. తొమ్మిదో పీఆర్సీ సిఫార్సుల మేరకు ‘ఎయిడెడ్’ ఉద్యోగులకు హెల్త్‌కార్డుల పథకాన్ని అమలు చేయడానికి వెనకాడుతోంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ పొందుతున్న సంస్థ (పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలు)ల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉచిత వైద్య సేవలు అందించాలని తొమ్మిదో పీఆర్సీ సిఫార్సు (259వ పేజీ 13వ పాయింట్) చేసింది. ఈ సిఫార్సును అమలు చేస్తామని 2008 నవంబర్ 3న జాక్టోతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ప్రస్తుతం మాత్రం హెల్త్‌కార్డుల పథకంలో వారికి అవకాశం కల్పించడం లేదు. ఎయిడెడ్ ఉపాధ్యాయులను ఈ పథకంలోకి తీసుకొచ్చే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద వచ్చే వారం జరగనున్న స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులనూ ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.

రీయింబర్స్‌మెంట్ రద్దుకు సర్కారు యోచన?


సుప్రీం తీర్పు సాకుగా నిపుణుల కమిటీ నియామకం
కామన్ ఫీజుతో పథకంపై పడే ప్రభావం విశ్లేషణకంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన
కమిటీ సిఫారసుల పేరిట పేద విద్యార్థుల నోట్లో మట్టికొట్టేందుకేనంటూ వెల్లువెత్తుతున్న విమర్శలు
ప్రభుత్వ కళాశాలలోనే ఇంటర్ చదవాలనే ఆంక్ష పెట్టాలని యోచన.. 
విద్యార్థుల మార్కులతోనూ పథకానికి లింకు? 
ఇన్సెంటివ్‌లు లేదా మెరిట్ స్కాలర్‌షిప్పుల పేరిట 
కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చే యత్నం

విశ్వసనీయ సమాచారం మేరకు ప్రభుత్వం
దృష్టిసారించిన మూడు కీలకాంశాలు...
ఎలాగైనా ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యయాన్ని తగ్గించుకోవడం
సమూలంగా ఈ పథకం రూపురేఖలు మార్చడం
మేం కూడా విద్యార్థులకు మేలు చేస్తున్నామని చెప్పుకునేందుకు మార్పులతో కొత్త పథకం

హైదరాబాద్, న్యూస్‌లైన్: లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు సంతృప్తస్థాయిలో వారు కోరుకున్న కోర్సును ఉచితంగా చదివేందుకు అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ప్రభుత్వం మంగళం పాడనుందా? ఇందుకు సుప్రీంకోర్టు తీర్పును సాకుగా తీసుకుంటుందా? కామన్ ఫీజు వ్యయాన్ని తప్పించుకునేందుకే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనుందా? నిపుణుల కమిటీ సిఫారసుల పేరిట తన చేతికి మట్టి అంటకుండా చూసుకోవాలని భావిస్తోందా? రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ప్రకటన వీటన్నిటికీ పరోక్షంగా అవుననే చెబుతోంది. ‘వృత్తివిద్యా కళాశాలలకు కామన్ ఫీజు ఉండాలన్న హైకోర్టు తీర్పును సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చినందున దీని ప్రభావం ఎలా ఉండబోతుందన్న అంశంపై ‘నిపుణుల కమిటీ’ ఏర్పాటు అవసరమైంది. కామన్ ఫీజు వల్ల ప్రస్తుత రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌పై ఉండే ప్రభావాన్ని విశ్లేషించడంతోపాటు, ఆర్థికంగా భరించగలిగిన విద్యను అందించడానికి ప్రభుత్వం వద్ద ఉన్న విభిన్న అవకాశాలను సిఫారసు చేసేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ కమిటీని నియమించారు...’ ఇదీ ఆ ప్రకటన సారాంశం. 

ఈ ప్రకటనను నిశితంగా పరిశీలిస్తే.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అవుతున్న వ్యయాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని స్పష్టమవుతోంది. వాస్తవానికి ఈ వ్యయంపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే. కానీ ప్రభుత్వంపై వచ్చే విమర్శలను కొంతవరకైనా ఎదుర్కోవచ్చనే భావనతో... నిపుణుల కమిటీ వేసి ఆ కమిటీ సిఫారసుల పేరిట పథకం రద్దు చేసేందుకు సర్కారు యత్నిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కామన్ ఫీజు అమలు చేస్తే రీయింబర్స్‌మెంట్ కింద ఒక్క ఏడాదికే రూ.482 కోట్ల అదనపు వ్యయం అవుతుందని సాంఘిక సంక్షేమ శాఖ ఇప్పటికే ప్రాథమిక అంచనాలను ప్రభుత్వం ముందు పెట్టింది. దీనిపై నిర్ణయం తీసుకోకుండా కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన సమయంలో కమిటీ వేసిందంటే... ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునేందుకేనని స్పష్టమవుతోంది. 

ఈ కమిటీకి కనీసం నిర్దిష్ట కాలవ్యవధిని కూడా నిర్ణయించకపోవడం అనుమానాలకు మరింత ఊతం ఇస్తోంది. సాధ్యమైనంత త్వరలో నివేదిక ఇవ్వాలని చెప్పినా.. ఈనెల 6వ తేదీన ఫీజు రీయింబర్స్‌మెంట్ సబ్ కమిటీ సమావేశంలోపు సమర్పించాలని మౌఖికంగా మాత్రమే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. అయితే రెండే రెండు రోజుల్లో కమిటీ ఏం అధ్యయనం చేసి.. ఏ నివేదిక సమర్పిస్తుందని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఏం కోరుకుంటే అదే సమర్పించడం తప్ప కమిటీ ప్రత్యేకంగా విశ్లేషించేదేమీ ఉండదని చెబుతున్నారు. ఏదిఏమైనా ప్రస్తుతం ఉన్న విధానంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించరాదనేదే ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆలోచనగా అధికారవర్గాలు చెబుతున్నాయి.

ఇదీ వ్యూహం 
ప్రస్తుత ఫీజును ఇస్తాం.. కానీ పెరిగే ఫీజును ఇంటర్ విద్యార్థులు భరించుకోవాలన్న ఆంక్షలు విధించడం..
ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వారికే పథకాన్ని వర్తింపజేయడం

ఇంజనీరింగ్ కోర్సులో వచ్చే మార్కులను బట్టి ప్రోత్సాహకాల రూపంలో విద్యార్థికి నగదు ఇవ్వడం. లేనిపక్షంలో విద్యార్థి చదివిన కోర్సులో సాధించిన ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు ఇవ్వడం.. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలుచేస్తున్న ‘ఇన్‌స్పైర్’ వంటి పథకాన్ని ప్రకటించడం. ఉదాహరణకు ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో చేరే విద్యార్థికి.. ఇంటర్‌మీడియెట్‌లో వచ్చిన అత్యుత్తమ మార్కులను పరిగణనలోకి తీసుకుని ఏటా రూ.50 వేల వరకు ఉపకార వేతనం ఇవ్వడం. తద్వారా ఆ విద్యార్థి ఎక్కడైనా చదువుకునేందుకు వీలు కల్పించడం.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కొనసాగించి (ఇది కేంద్రం భరిస్తుంది) బీసీ, ఈబీసీ వర్గాలకు మాత్రం ఈ ప్రోత్సాహక పథకం గానీ, ప్రతిభ ఆధారిత ఉపకారవేతనాల పథకం కానీ ప్రవేశపెట్టడం. తద్వారా రాజకీయ విమర్శలకు అడ్డుకట్ట వేయడం.

సవరణలకు, కొత్త పథకాలకు సమయం సరిపోదనుకుంటే.. భారాన్ని విద్యార్థుల పైనే మోపడం.

ఉద్దేశపూర్వకంగానే ఇంటర్‌తో లింకు! 

లక్ష రూపాయలలోపు ఆదాయం ఉన్న నిరుపేద విద్యార్థుల్లో ఎక్కువమంది ఇంటర్మీడియెట్ ప్రభుత్వ కళాశాలల్లోనే చదువుతున్న విషయాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తోంది. జూనియర్ కళాశాల ల్లో లెక్చరర్ పోస్టులు 7 వేలకు పైగా ఖాళీగా ఉన్నాయి. వసతులే లేవు. ఈ పరిస్థితుల్లో ఎంతమంది ఇంటర్‌లో అత్యుత్తమ మార్కులు సాధిస్తారు? ఇది కీలకమైన అంశం. కేవలం ప్రతిభనే ఆధారంగా మిగతావారంతా ఏం కావాలి? ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి మూల సూత్రం ఇదే. విద్యార్థులు తగ్గితే ఆ మేరకు ప్రభుత్వానికి వ్యయమూ తగ్గుతుంది.

ఇంటర్‌లో అరకొర చదువుతో ఉత్తీర్ణులై, ఎంసెట్‌లో ఏదో ఒక ర్యాంకు సాధించి ఇంజనీరింగ్‌లో చేరాక.. కోర్సులో ప్రతిభకు లింకు పెడితే ఉన్నఫళంగా ఆ విద్యార్థి ప్రతిభ సాధిస్తాడా? బీటెక్ అర్హత గల ప్యాకల్టీతో ఇంజనీరింగ్ కళాశాలలు నడుస్తున్న రాష్ట్రంలో.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన ఒక సాధారణ నిరుపేద విద్యార్థి ఇంజనీరింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరచగలడా? కార్పొరేట్ కళాశాలల్లో చదివిన వారికే ప్రతిభ ఆధారిత స్కాలర్‌షిప్పుల ద్వారా ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. 

అర్హత కోర్సులో ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వారికే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పరిమితం చేస్తే.. పోటీ ప్రపంచంలో కష్టనష్టాలకోర్చి గ్రామీణ ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్ ముగించినవారి పరిస్థితి ఏంటి? 

ఇప్పటివరకు చెల్లిస్తున్న రూ. 31 వేలు మాత్రమే చెల్లిస్తామని, మిగిలినది విద్యార్థులే మోయాలని చెబితే.. లక్షా 25 వేలు ఫీజుగా ఉండే ఇంజినీరింగ్ కళాశాలలో రూ. లక్షలోపు ఆదాయం ఉన్న విద్యార్థి చేరగలడా? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం గానీ, నివేదిక ఇవ్వబోయే కమిటీ గానీ జవాబు ఇవ్వాల్సి ఉంటుంది.

కమిటీ కూర్పు భలే..! 
నిపుణుల కమిటీలో 9 మంది సభ్యులు ఉన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు దీనికి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాజీవ్ యువకిరణాల బాధ్యతలు చూస్తున్న రీక్యాప్ చైర్మన్ కె.సి.రెడ్డి దీనికి ప్రత్యేక ఆహ్వానితులు కాగా సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఉన్నత, సాంకేతిక విద్య ముఖ్య కార్యదర్శి ఎం.జి.గోపాల్, ఆర్థిక శాఖ కార్యదర్శి డి.సాంబశివరావు, ఉస్మానియా మాజీ వీసీలు ప్రొఫెసర్ వి.రామకిష్టయ్య, ప్రొఫెసర్ ఎం.డి.సులేమాన్ సిద్దిఖీ, ఐఐటీ-హైదరాబాద్ డెరైక్టర్ యూబీ దేశాయ్, జేఎన్టీయూ-కాకినాడ వీసీ ప్రొఫెసర్ తులసీదాస్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ శనివారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. కమిటీ కూర్పును నిశితంగా పరిశీలిస్తే... పాలనలో భాగంగా పనిచేస్తున్న వారే ఎక్కువమంది ఉన్నారు. ప్రభుత్వ ఆలోచనను కమిటీ ముందు పెట్టే బాధ్యతను కె.సి.రెడ్డి తీసుకుంటారని, ఆర్థిక భారానికి ప్రత్యామ్నాయ మార్గాలను ముగ్గురు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు అన్వేషిస్తారని, ఇక కళాశాలలను కట్టడి చేసేందుకు వర్సిటీల్లో ఉప కులపతులుగా పనిచేసిన వారు తగిన సూచనలు చేస్తార ని కళాశాలల యాజమాన్య సంఘాల ప్రతినిధి ఒకరు ‘న్యూస్‌లైన్’తో విశ్లేషించారు.

ఇజాలను మించిన వైఎస్ హ్యూమనిజం


ఖమ్మం, న్యూస్‌లైన్: కమ్యూనిజం, సోషలిజం, క్యాపిటలిజం కంటే దివంగత నేత వైఎస్‌ఆర్ చెప్పిన హ్యూమనిజం గొప్పదని నమ్మి పలు పార్టీల నుంచి నేతలు వైఎస్‌ఆర్ సీపీలోకి వస్తున్నారని ఆ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ బాడీ సభ్యులు కెకె మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఖమ్మంలో జరిగిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విసృ్తతస్థాయి సమావేశంలో జిల్లా కన్వీనర్‌గా పువ్వాడ అజయ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. సమావేశానికి ముఖ్య అతిధిగా వచ్చిన మహేందర్‌రెడ్డి ప్రసంగిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణను తట్టుకోలేని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు సైకిల్ కాంగ్రెస్‌గా మారి ఆయనపై కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. 

పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎస్‌ఏ రెహమాన్ మాట్లాడుతూ మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని, అందుకే రాష్ట్రంలోని 99 శాతం మైనార్టీలు వైఎస్ జగన్‌కు అండగా ఉన్నారని తెలిపారు.కాగా, రంజాన్ ఉపవాస దీక్షలు పురస్కరించుకొని శుక్రవారం రాత్రి భక్తరామదాసు కళాక్షేత్రంలో పువ్వాడ అజయ్‌కుమార్ ముస్లిం సోదరులు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ సెంట్రల్ గవర్నింగ్ బాడీ సభ్యులు డి.రవీంద్రనాయక్, చందాలింగయ్యదొర కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యులు బాణోత్ మదన్‌లాల్, వి.లక్ష్మీనారాయణ రెడ్డి, రాష్ట్ర ఎస్సీవిభాగం క న్వీనర్ నల్లా సూర్యప్రకాశ్‌రావు, కార్మిక విభాగం కన్వీనర్ జనక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

భూపందేరం ఇక ఇష్టారాజ్యం!


... ఇప్పుడు ప్రధానమంత్రి సడలింపుల మధ్య, అదే కేంద్ర నాయకత్వం కక్షకొద్దీ ‘వాయిదా’ల పద్ధతిపై చార్జిషీట్ల ప్రహసనాన్ని సీబీఐ కొండవీటి చాంతాడులా కొనసాగిస్తూనే ఉండటం హాస్యాస్పదంగా మారింది. ప్రధాన మంత్రి ప్రకటన ప్రకారం, వైఎస్ కేబినెట్ ఆమోదించిన 26 జీఓలు కూడా సబబైనవే కావాలి. మన్మోహన్ ప్రస్తా వించిన పీపీపీలు సక్రమమైనవే అయినప్పుడు అదే కాంగ్రెస్‌కు చెందిన వైఎస్ జీఓలు కూడా దోషరహితాలే కావాలి. న్యాయ సూత్రం హస్తినకూ, హైదరాబాద్‌కూ ఒకటే కావాలి!

‘పెద్దవాళ్ల బొంకులు తెలియ రావు’ అని తెలుగు వాళ్లలో ఒక నానుడి. గత రెండు రోజుల్లో కేంద్రంలోని కాంగ్రెస్-యూపీఏ సర్కారు ‘విధానాల’కు ఏదో ఆకస్మికమైన కుదుపు వచ్చినట్టు కనిపిస్తోంది! చడీచప్పుడు లేకుండా ఇంతవరకూ సర్కారు అనుసరిస్తున్న ప్రపంచ బ్యాంకు ప్రజావ్యతిరేక ‘సంస్కరణల’లో ఆకస్మిక ‘సవరణల’కు లేదా ‘సర్దుబాట్లకు కారణం ఏమై ఉంటుంది? నిజానికి అసలవి సవరణలా? కావు. ఒకే రోజున ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ చెప్పినట్లు సాధికారికంగా వెలువడిన రెండు ప్రకటనలు సరికొత్త అనుమానాలకు చోటు కల్పిస్తున్నాయి.

బ్యాంకు సంస్కరణల అనంతరం బహుళజాతి కంపెనీల గుత్తపెట్టుబడులను యథేచ్ఛగా దేశంలోకి అనుమతించేందుకు వీలుగా, పరిశ్రమాభివృద్ధి పేరిట దేశీయ, విదేశీసంస్థలకు వందల వేల ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వాలు సిద్ధమ య్యాయి. సదరు కేటాయింపులూ జరిగిపోయాయి. అందుకు అనుగుణంగా చివరికి పంటపొలాలకు అనువైన సుక్షేత్రాలను కూడా బడా పారిశ్రామికులకు కట్టబెట్టడానికి వీలుగా ‘పీ.పీ.పీ.లు’ బిళ్లబీటుగా దూసుకువచ్చాయి.

అయితే ‘2-జి స్పెక్ట్రమ్’ పథకం అమలులో భారీ ఎత్తున అవినీతి కుంభకోణం బట్టబయలైన తరువాత సుప్రీంకోర్టు ఒక విశిష్టమైన తీర్పు చెప్పింది. ‘సహజ వన రులు దేశం సంపద కనుక’ కొలదిమంది దానిని కొల్ల గొట్టుకుని పోవడానికి అనుమతించేది లేదని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించినప్పటి నుంచీ కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ‘కుడితిలో పడిన ఎలుక’ చందంగా మారింది. అయితే తాజాగా మన్మోహన్‌సింగ్ ‘రూటు’ మార్చినట్టు కనిపిస్తూ తిరిగి భూబదలాయింపులను మరింత సులభ తరం చేయడానికే నిర్ణయించుకున్నారు. ఇందుకు తగినట్టు గానే గుంభనంగా ఆయన ప్రభుత్వం సుప్రీంలో వాదించ డానికి ముందు చేసిన పని - ఎగ్జిక్యూటివ్ చేసే నిర్ణయా లలో న్యాయస్థానాల జోక్యాన్ని మెత్తగానే అయినా మంద లించడానికి పూనుకుంది. విదేశాలతో కుదుర్చుకునే ఏ ఒప్పందాలైనా లెజిస్లేచర్ అనుమతిలేకుండా పాలకులు ఆమోదించడానికి వీల్లేదని రాజ్యాంగం నిర్దేశిస్తోంది.

ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములను ఒక ప్రభుత్వ శాఖ నుంచి మరొక ప్రభుత్వశాఖకు బదలాయించుకో వచ్చే తప్ప ఏ ఇతర సంస్థకూ బదలాయించడంపై ప్రభు త్వం నిషేధం విధించింది. కానీ కథ ఇప్పుడు మళ్లీ మొద టికి వచ్చింది! మౌలిక సౌకర్యాల కల్పనకు తోడ్పడే ప్రైవే ట్ రంగానికి ప్రభుత్వ భూములను బదలాయించడంపై ఉన్న ఆంక్షలన్నింటినీ ఎత్తివేయాలని ప్రధాని (ఆగస్టు 2వ తేదీన) తాజాగా ప్రకటించేశారు! మౌలిక సౌకర్యాల కల్ప నకు ముందుకు దూసుకువస్తున్న పథకాలకు సంబంధించి ముఖ్యంగా ‘ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యం’తో (పీపీపీ-పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్) నిర్వహించే పథకాల విషయంలో రాయితీలు కల్పించడంలో ఇంతవరకూ అం తూపొంతూ లేకుండా జరుగుతున్న జాప్యాన్ని తొలగించ డానికే ప్రభుత్వ భూముల బదలాయింపుపై ఉన్న ఆంక్షలను తొలగించాలని నిర్ణయించారు! దీని ప్రకారం, అన్ని పీపీపీ ప్రాజెక్టులకూ ఈ సడలింపు వర్తిస్తుంది.

‘పీపీపీ అప్రూవల్ కమిటీ ద్వారా సంబంధిత మంత్రుల సమ్మతిలోగాని లేదా సంబంధిత మంత్రి మండలి అనుమ తితో సదరు ప్రభుత్వ భూముల్ని కౌలుకిగాని లేదా అద్దెకు గాని లేదా లెసైన్సుపైనగానీ రాయితీలపైన బదలాయిం చడం లేదా కేటాయించడం జరుగుతుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రాజెక్టులను వేగాతివేగంగా పూర్తిచేసేందుకు వీలుగా సర్కారు భూములను ప్రైవేట్ సంస్థలకు కేటా యించేందుకు సంబంధించిన నియమ నిబంధనలను సడ లించేయడానికి మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం నిర్ణయిం చింది. నిజానికి ప్రధాని ప్రకటనలో కొత్త ఏమీలేదు, ఒక వేళ ఉన్న అవకాశవాదపు ‘కొత్తదనం’ ఏదైనా ఉందంటే అది- భూకేటాయింపులకూ, బదలాయింపులకూ ఇక మీదట మంత్రిమండలి (కేబినెట్) ఆమోదం కూడా అక్క ర్లేదట! అంటే, ప్రధాన మంత్రి అనుమతి ‘తాతాచార్యుల ముద్ర’ కింద సమానమన్న మాట!

ఆంధ్రప్రదేశ్ వ్యవహారంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మంత్రిమండలి ఆమోదంతో సమష్టి బాధ్యత తోనే అనుమతులు, 26 జీఓలు జారీచేసింది. ప్రధాని ప్రక టన ప్రకారం ఇక ఈ కేసులేవీ ఉనికిలో ఉండే అవకాశం లేదు. అయినా అవన్నీ ఎవరికో ‘లాభ లబ్ధి’ కలిగించడం కోసమని వైఎస్ ఆ జీవోలు తీసి, వాటి చాటున ఎవరెవరో ‘సాక్షి’లోనో, లేదా జగన్ కంపెనీల్లోనో పెట్టుబడులు పెట్టా రన్న ఆరోపణలు ఇంకా నిరూపణ కాలేదు. మరీ విశేషమేమంటే పెట్టుబడులు పెట్టినవారిలో ఎవరూ ఫలానా వాళ్లవల్ల తామింత నష్టపోయాం, నష్ట పరిహారం కోసం కేసులు పెడతామని ఇప్పటిదాకా ముందుకు రాలేదు. అయినా అరెస్టులు, వేధింపుల నాటకా నికింకా తెరపడలేదు!

ఇప్పుడు ప్రధానమంత్రి సడలింపుల మధ్య, అదే కేంద్ర నాయకత్వం కక్షకొద్దీ ‘వాయిదా’ల పద్ధతిపై చార్జి షీట్ల ప్రహసనాన్ని సీబీఐ కొండవీటి చాంతాడులా కొనసా గిస్తూనే ఉండటం హాస్యాస్పదంగా మారింది. ప్రధాన మంత్రి ప్రకటన ప్రకారం, వైఎస్ కేబినెట్ ఆమోదించిన 26 జీఓలు కూడా సబబైనవే కావాలి. మన్మోహన్ ప్రస్తా వించిన పీపీపీలు సక్రమమైనవే అయినప్పుడు అదే కాం గ్రెస్‌కు చెందిన వైఎస్ జీఓలు కూడా దోషరహితాలే కావాలి. న్యాయ సూత్రం హస్తినకూ, హైదరాబాద్‌కూ ఒకటే కావాలి! ప్రపంచ బ్యాంకు ‘సంస్కరణ’లను బేషరతుగా తలకెత్తుకున్న పాలకవర్గాలు (కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు) 1948 నాటి, 1956 నాటి నెహ్రూ పారిశ్రా మిక విధాన ప్రకటనలకూ, కనీస మిశ్రమార్థిక వ్యవస్థకూ కాలదోషం పట్టించాయి. ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్య వాద కూటమి తమ ఆర్థిక సంక్షోభానికి పరిష్కారంగా ఇండియా లాంటి వర్ధమాన దేశాల్ని ‘ప్రపంచీకరణ’ మం త్రంతో లోబరచుకున్నది. అందులో భాగంగానే మల్టీ నేష నల్ కంపెనీలు, విదేశీ గుత్తసంస్థల మదింపుదార్లు, విదేశీ ప్రత్యక్ష గుత్త పెట్టుబెడులూ భారత ఆర్థికరంగంలోని సర్వ శాఖలకూ విస్తరించాయి. ఆ విస్తరణలో భాగమే ‘పారిశ్రా మికీకరణ’, ‘ఆధునిక వ్యవసాయీకరణ’ పేరిట విదేశీ గుత్త పెట్టుబడులు భారీ ఎత్తున దిగుమతి అయ్యాయి. వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు లేదా కాంట్రా క్టులకూ దారాదత్తం చేయాలన్న ప్రతిపాదన ఇంకా చావ లేదు. వ్యవసాయ భూముల్ని క్రమంగా సేద్యం నుంచి దూరం చేస్తూ విదేశీ, స్వదేశీ రేట్‌లకు వేల ఎకరాలు కట్ట బెట్టి క్రమంగా ఆహార సంక్షోభానికి దారితీశాయి.

ఆ మాటకొస్తే... విదేశీ గుత్తపెట్టుబడుల చాటున విదేశీ పెట్టుబడుల అండదండలు లేకుండా బతకలేని పరా ధీన స్వదేశీ గుత్తవర్గాలు కూడా పాలకపక్షాల భూపందా రాలు లేదా భూముల బదలాయింపులను అనుభవిస్తున్న వారే! బలవంతంగా సేదపు భూముల్ని పరిశ్రమాభివృద్ధి పేరిట రైతుల నుంచి నష్టపరిహారం ఎరచూపి ప్రభు త్వాలు గుంజుకున్నందుకే ఇటీవల మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో పలు రాష్ట్రాల్లో రైతులు, వ్యవసాయ కార్మి కులు అనేకచోట్ల పోరాటాలు చేయవలసివచ్చింది.

వీటిలో ప్రధానంగా పేర్కొనదగినవి - కళింగనగర్, పోస్కో, కాశీపూర్, నియాంగిరి, నందిగ్రామ్, సింగూర్, జైతాపూర్, యమునా ఎక్స్‌ప్రెస్‌వే, శ్రీకాకుళం, హైదరా బాద్, విశాఖ పోరాటాలు. ఆ సందర్భంగా రైతాంగ ప్రజ లు పోలీసు దాష్టీకాలకూ, నిర్బంధాలకూ గురయ్యారు. ఈ దౌర్జన్యకాండ వెనక ఎవరి కోసం భూముల్ని బలవం తంగా బదలాయిస్తున్నారో ఆ కార్పొరేషన్లు - టాటా స్టీల్, పోస్కో, హిండాల్కో, సలీమ్ గ్రూపు, టాటా మోటార్స్, భారత అణుశక్తి నిర్వహణ సంస్థ, జేపీ ఇన్ ఫ్రాటెక్ వగైరా కంపెనీలున్నాయి. పెట్టుబడి ప్రపంచీకరణ చాటున క్రమంగా దారిద్య్ర ప్రపంచీకరణ సాగుతూ వచ్చింది. ‘కార్పొరేషన్’ అంటే దాని ‘ప్రమోటర్ల’ రూపంలో ఉండే టాటాలు, బిర్లాలు, అంబానీలు వగైరా మాత్రమే కాదు, నాటక కళలో ‘దశరూప’ ఎలాగో విదేశీ గుత్తద్రవ్య సంస్థల దోపిడీ కూడా దశ రూపాల్లోనే ఉంటుంది. ఒరిస్సాలో భూకబ్జాదారైన కొరియన్ కార్పొరేషన్ ‘పోస్కో’లో బడా వాటాదారు ఎవరు? బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్. అదీగాక అనేక మంది అమెరికన్ గుత్త పెట్టుబడిదారులూ అందులో భాగస్వాములు! ‘సంస్కరణల’ ప్రవేశంతో యావత్తు భారతదేశమూ దోచుకునేవారి ‘చేతిఎత్తుబిడ్డ’గా మారి పోయింది!

ఇటీవల అమెరికన్ ‘టైమ్’ పత్రిక మన్మోహన్‌సింగ్‌పై ప్రకటించిన వ్యంగ్య పూర్వకమైన ఆగ్రహానికి కారణం- ఇండియాలో ఇప్పుడున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విస్తరణ చాలదనీ, బ్యాంకింగ్, బీమా లాంటి ద్రవ్య సేవలందించే సంస్థల్లో కూడా బహుళజాతి కంపెనీలకు గణనీయమైన స్థానం వెంటనే కల్పించలేదని మాత్రమే! అయితే ఈ సేవా సంస్థలలో కూడా ఐటీ రంగంలో మాదిరే విదేశీ గుత్తేదార్లు బలంగా దూరారు, లేదా దూరం నుంచే మన సంస్థల్ని తమ అదుపాజ్ఞల్లో ఉంచుకుంటున్నారు. ఈ విదేశీ సంస్థల ఆధిపత్యంలో లేదా స్వదేశీ సంస్థలతో ఉన్న మిలాఖత్ ఒప్పందాల ద్వారా జరుగుతున్న పెద్ద నాటకం - మన స్వదేశీ కార్మికుల జీవితాలను, జీతనాతాలను శాసించబోవడం, కార్మికులు ఎదురుతిరిగిన చోట, పని భారం పెరిగిన చోట నిరసన తెలిపిన సందర్భాలలో దారు ణమైన నిర్బంధ విధానానికి గురిచేయడం! యూపీఏ సర్కార్ బాహాటంగా అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధా నాలు యథేచ్ఛగా కొనసాగినంత కాలం ఈ పరాయీకరణ తప్పదని చెప్పవచ్చు! 

సామాన్య జనం కట్టే పన్ను సొమ్ము తెగతినే ఆధునిక కులీనవర్గం దర్జాగా ....

Written By news on Friday, August 3, 2012 | 8/03/2012

చేసిన పాపం చెప్తే పోతుందని కొందరు కరుణార్ద్ర హృదయులు అంటారు. అయితే, ‘చేసిన పాపం కట్టి కుడుపుతుం’దని లోకరీతి తెలిసిన అనుభవజ్ఞులు అంటారు. ఐఏఎస్ అధికారిణి చందనా ఖాన్ విషయంలో అనుభవజ్ఞుల మాటే నిజమయినట్లుంది. ప్రభుత్వ పాఠశాలల్లో టాయ్‌లెట్ల పారిశుద్ధ్య బాధ్యత(?) ఆయా పాఠశాలల విద్యార్థులే చేపట్టాలని చందన దయచేయించిన అనుచిత సూచనను విద్యార్థులూ, ఉపాధ్యాయులూ, మేధావులూ ఏకకంఠంతో తిరస్కరించారు. మన రాష్ట్రంలో అస్తినాస్తి విచికిత్సా హేతువుగా పరిణమించి, అసలు ఉందాలేదా అనిపిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూడా తెలివిలోకి వచ్చే స్థాయిలో ఈ విమర్శ చెలరేగింది. ఫలితంగా, చందనను ప్రాథమిక విద్యాశాఖ నుంచి తీసేసి, పర్యాటక శాఖకు బదిలీ చెయ్యకతప్పలేదు మన పాలకులకు. 

మూడు రోజుల కిందట - జులై 31తేదీన- చందనా ఖాన్ ఒక ఉన్నత స్థాయి సమావేశంలో -ప్రాథమిక విద్య, సర్వశిక్షా అభియాన్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి హోదాలో - గంభీరోపన్యాసం చేస్తూ పైన చెప్పిన అనుచిత సలహా దానం చేశారు. తాగు నీటి భద్రత- పారిశుధ్యాల గురించి ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ, యూనిసెఫ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాన వక్తగా ప్రసంగిస్తూ ఆమె ఈ సలహా ఇచ్చారు. అంతేకాదు- తన సలహాకు ఊతంగా -సాబర్మతీ ఆశ్రమంలో గాంధీజీ అనుసరించిన- ఓ మహోన్నత ఆదర్శాన్ని ఊతంగా తెచ్చుకున్నారామె. ఈ ఐఏఎస్ అధికారిణికి సందర్భశుద్ధి అనే పదార్థంతో బొత్తిగా పరిచయంలేదని ఆమె మాటలను బట్టి తేలిపోయింది. ఎప్పుడో ఏడెనిమిది దశాబ్దాల కిందట- ఆనాడు రాజ్యమేలుతున్న బ్రిటిష్ మహాసామ్రాజ్యానికి సవాలుచేస్తూ గాంధీజీ నిర్వహించిన స్వచ్ఛంద సంస్థ సాబర్మతీ ఆశ్రమం.పభుత్వ సహకారం, నిధుల కేటాయింపులు, సంక్షేమ రాజ్యంగా అందించాల్సిన సహాయంలాంటి బాదరబందీలేవీ ఆనాటి విదేశీ ప్రభుత్వానికి లేవు. కానీ, స్వతంత్ర భారత దేశంలో, భావి పౌరుల కోసం ఉద్దేశించిన పాఠశాలల విషయంలో ప్రభుత్వానికి స్పష్టమయిన కర్తవ్యాలు కొన్ని ఉన్నాయని ఐఏఎస్ అధికారిణి చందనా ఖాన్‌కు తెలియవా? ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ సౌకర్యవంతమయిన తరగతి గదులతో పాటు, టాయ్‌లెట్లలాంటి కనీస సౌకర్యాలు కొన్ని కల్పించి తీరాలి. అది రాజ్యం విధి. అలా చెయ్యకపోవడం బాధ్యత నుంచి పారిపోవడమే అవుతుంది. అలాంటి పని ఎవరైనా చేస్తే జనం సహించరు! చైతన్యవంతమయిన మీడియా అలాంటి ఉదంతాలను వెలుగులోకి తీసుకు వస్తుంది. తద్వారా తన ధర్మం నెరవేరుస్తుంది. చందనా ఖాన్ బాధ్యతా రాహిత్యాన్ని అందుకే ఎండగట్టవలసి వచ్చింది.

జులై 31 నాటి ప్రసంగంలో చందనా ఖాన్ ఓ విడ్డూరమయిన వాదన చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులచేత వారివారి టాయ్‌లెట్లు శుభ్రం చేయించి, వారికి శ్రమ పట్ల గౌరవాన్ని -డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ను- నేర్పించాలన్నారామె. ‘కన్యాశుల్కం’ నాటకంలో గిరీశం చెప్పిన డిగ్నిటీ ఆఫ్ లేబర్ ప్రవచనంలాగే ఉంది ఇది కూడా. విద్యార్థులకు శ్రమ పట్లా, శ్రమజీవుల పట్లా గౌరవాదరాలు కలిగించవలసిన బాధ్యత ఉపాధ్యాయులకు ఉన్న మాట తిరుగులేని వాస్తవం. కానీ ఇదా అందుకు మార్గం? ఎవరో ఉపాధ్యాయిని అడిగినట్లుగా ఈ ఐఏఎస్ అధికారిణి తన పిల్లలకు ఇదే పద్ధతిలో శ్రమ పట్ల గౌరవాన్ని బోధిస్తారా? లేక, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే ఇలాంటి బోధన ప్రణాళిక ప్రత్యేకమా?

అసలు ప్రభుత్వ పాఠశాలలను మూసేయకుండా నడిపించడమే మహాభాగ్యమనీ, వాటిల్లో టాయ్‌లెట్లవంటి కనీస సౌకర్యాల గురించిన డిమాండ్లు అర్థరహితమనీ మన ఉన్నతాధికారులు భావిస్తున్నారనిపిస్తుంది. సామాన్య జనం కట్టే పన్ను సొమ్ము తెగతినే ఈ ఆధునిక కులీనవర్గం దర్జాగా జీవిస్తున్నదీ, ‘పాష్ లైఫ్ స్టైల్’ గడపగలుగుతున్నదీ కూడా! తెగబలిసిన పందికొక్కులకు ఇంటియజమాని కష్టమూ తెలియదు- అతగాడికి రవ్వంతయినా సౌకర్యం కల్పిద్దామన్న స్పృహా ఉండదు. మన ఉన్నతాధికారులు ఈ పందికొక్కులకు భిన్నమయిన వారు కాదు! అలాంటివారిని, ప్రాథమిక విద్యాశాఖ లాంటి కీలకమయిన శాఖల్లో కొనసాగనియ్యడం ఏమాత్రం క్షేమం కాదు. అంచేత, చందనా ఖాన్‌ను ఆ శాఖ నుంచి బదిలీ చేసి, ప్రభుత్వం కనీస స్పృహ ప్రదర్శించినందుకు సంతోషిద్దాం. 

అయితే, అసలు సమస్య అదికాదు. చందనా ఖాన్ చేసింది పెద్ద నేరమేం కాదని మన ప్రభువులు భావించినట్లుంది. అందుకే బదిలీతో సరిపెట్టారు. ఆమె ప్రసంగం మన ఉన్నతాధికార కులీనవర్గం స్వభావాన్ని పట్టిస్తోందన్న వాస్తవం ఇప్పటికయినా గ్రహించడం అవసరం. సంక్షేమ రాజ్య భావనకు ఈ స్వభావం ఎంతమాత్రం సరిపోదని గుర్తించడం అత్యవసరం. పాలనా వ్యవస్థ మూలుగుల్లో చేరిపోయిన కులీన వర్గ స్వభావం ప్రక్షాళనకు వెనువెంటనే పూనుకోవలసి ఉందని అర్థం చేసుకోవడం తక్షణావసరం!

నవంబర్ 1నుంచి హెల్త్ కార్డులు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నవంబరు 1 నుంచి హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఉద్యోగికి 3 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈ అంశంపై సచివాలయంలో నిన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు జరిగిన సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే.

అన్నా దీక్ష విరమణ - పార్టీ ప్రకటన

న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త, జనలోక్ పాల్ బిల్లు ఉద్యమ నేత అన్నా హజారే జంతర్ మంతర్ వద్ద ఈ సాయంత్రం 6 గంటలకు తన దీక్ష విరమించారు. రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. లోక్ పాల్ బిల్లు ప్రవేశపెడితే తాను రాజకీయాలకు స్వస్తి చెబుతానన్నారు. తాము పెట్టే రాజకీయ పార్టీ ప్రజల పార్టీ అన్నారు. పార్టీకి అధిష్టానం అంటూ ఏమీ ఉండదని చెప్పారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటుందన్నారు. తాను ఎన్నికలలో పాల్గొనని చెప్పారు. అవినీతిలో పోరుపై తాను యువత వెంటే ఉంటానని అన్నా ప్రకటించారు.


అన్నా హజారే బృందం దారితప్పుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు విమర్శించారు. లోక్ పాల్ బిల్లుకు పరిష్కారం చూపకుండా రాజకీయ పార్టీ ఆలోచన సరికాదన్నారు. ఉద్యమాన్ని ఢిల్లీకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తం చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కార్ల కు బ్లాక్ ఫిల్మ్ వాడవద్దు: సుప్రీంకోర్టు

కార్ల విండ్ స్క్రీన్స్ కు బ్లాక్ ఫిల్మ్ వాడరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. బ్లాక్ ఫిల్మ్ వాడటమే ప్రమాదాలకు కారణమని కోర్టు తెలిపింది. బ్లాక్ ఫిల్మ్ వాడకాన్ని నిషేధించాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్నా ఆదేశించింది.

వైఎస్సార్సీపీలో వెయ్యి కుటుంబాల చేరిక


తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రాంబార్కి శరత్ గురువారం వెయ్యి కుటుంబాలవారితో కలసి వైఎస్సార్సీపీలో చేరారు. బొబ్బిలి కోటలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు, మున్సిపల్ మాజీ చైర్మన్ బేబీనాయన సమక్షంలో శరత్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో శరత్ తన అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించారు. చేరిక సందర్భంగా బొబ్బిలి పట్టణమంతా వైఎస్సార్సీపీ జెండాలతో కళకళలాడింది.
-న్యూస్‌లైన్, బొబ్బిలి (విజయనగరం)

మంటల మిస్టరీ వీడేనా?


తమిళనాడు ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనపై అనుమానాలెన్నో! 
షార్ట్‌సర్క్యూట్‌కు అవకాశాలే లేవంటున్న నిపుణులు 
మంటలు రేగిన ఆ ఐదు నిమిషాల్లో ఏం జరిగింది? 
బ్యాటరీలు, సర్క్యూట్ బ్రేకర్లు పనిచేస్తున్నట్లు వెల్లడి 
బోగీలో మంటలు కింది నుంచి పైకి వ్యాపించిన వైనం 
బోగీ నేలపై షార్ట్ సర్క్యూట్‌కు అవకాశం లేనే లేదు 
భారీ పేలుడు జరిగిన ఆనవాళ్లు కూడా లేవు 
బోగీలోని 5, 6, 7 ‘బే’ల్లో 20 మంది ప్రయాణికుల మృతి 
మంటలు రేగటానికి పచ్చభాస్వరం ఉపయోగించారా? 
ఈ దిశగా కూడా దర్యాప్తు జరగాలంటున్న నిపుణులు 
ఓ ప్రయాణికురాలికి నెల రోజులుగా బెదిరింపు కాల్స్! 
6వ బేలో ప్రయాణిస్తున్న ఆమె కుటుంబమంతా మృతి 
ఆ ఫోన్ కాల్స్‌కు.. ఈ దుర్ఘటనకు సంబంధం ఉందా? 
మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షల మీదా సందేహాలు 
తమ వారి మృతదేహాల కోసం బంధువుల ఆవేదన

ఎస్.గోపీనాథ్‌రెడ్డి
నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో శవాల మూటల మధ్య కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ గౌరీశంకర్ నిర్వేదంగా నిలబడి తన కుమారుడు అవినాష్ శవాన్ని గుర్తుపట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. గుర్తు పట్టలేని నిస్సహాయ స్థితిలో కన్నీళ్లతో డీఎన్‌ఏ పరీక్షకు అంగీకార పత్రం మీద సంతకం చేశారు. చనిపోయిన వారిలో తన కుమారుడున్నాడో లేదో తెలియదు. ‘మీ అబ్బాయి చనిపోయి ఉండవచ్చు’ అన్న పోలీసుల సమాధానం నిజం కాకపోతే బాగుండు అన్న ఒక్క చిన్న ఆశతో వరంగల్ తిరుగు ప్రయాణమయ్యాడు. ఒకవేళ తన కొడుకు చనిపోతే.. ప్రమాదంలో చనిపోయాడా? లేక విద్రోహచర్యకు బలయ్యాడా? అనే సందేహం గౌరీశంకర్‌ను తొలిచివేస్తోంది. ఇది ఒక గౌరీశంకర్ ప్రశ్న మాత్రమే కాదు. ఆ ప్రమాదంలో చనిపోయిన 32 మంది కుటుంబాలది! యావత్ దేశానిది కూడా! సంఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత కూడా ఎటూ తేల్చని రైల్వే శాఖ, పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు.. ఎప్పటికి ఒక నిర్ణయానికి వస్తారో కూడా తెలియని సందిగ్ధ పరిస్థితి!

షార్ట్ సర్క్యూట్ కానే కాదు!

ఆ వేకువజామున అసలేం జరిగింది? తమిళనాడు ఎక్స్‌ప్రెస్ సరిగ్గా 4:18 నిమిషాలకు నెల్లూరు రైల్వేస్టేషన్ దాటి చెన్నైకి బయలుదేరింది. వేగం దాదాపు గంటకు 30 కిలోమీటర్లు. ఒక కిలోమీటర్ ప్రయాణించగానే సరిగ్గా 4:20 నిమిషాలకు ఎస్-11 బోగీలో కలకలం. మరో నిమిషంలోనే ఎవరో చెయిన్‌లాగారు. ట్రైయిన్ ఆగింది. కొద్దిసేపట్లోనే ఎస్-11 బోగీలో శవాల కుప్పలు. ఈ ఐదు నిమిషాల వ్యవధిలో ఏ జరిగిందనే దానిపై భిన్న వాదనలు. కరెంట్ షార్ట్‌సర్క్యూట్! కాదు.. పెట్రోల్ లేదా కిరోసిన్‌తో నిప్పు! అదీ కాదు.. పేలుడు! వీటిలో ఏది వాస్తవం? ప్రత్యక్ష సాక్షులు, ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు భిన్నమైన అభిప్రాయాలు వెలిబుచ్చారు. కానీ ఒక విషయంలో మాత్రం అందరూ ఏకీభవించారు. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూట్ మాత్రం కారణం కాదని. గతంలో సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లలో రైల్వే బోగీలు దగ్ధమైనపుడు మంటలనార్పిన బృందంలో ఉన్న ఒక సీనియర్ అధికారి విశ్లేషణ ప్రకారం.. తమిళనాడు ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన చాలా ఆశ్చర్యకరంగా ఉంది. బోగీలో మండే స్వభావమున్న పదార్థాలు పెద్దగా ఉండవు.. షార్ట్ సర్క్యూట్ వల్ల రెండు నిమిషాల వ్యవధిలో మంటలు అంత తీవ్రంగా విస్తరించే అవకాశం ఏమాత్రం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ‘ముందుగా మంటలు వచ్చి ఉంటాయి. అది కూడా ఒక చోట కాకుండా రెండు మూడు చోట్ల ప్రారంభమై ఉంటాయి. ఆ తర్వాత సీట్ల కుషన్, రెక్సిన్ కాలి దట్టమైన పొగలు వచ్చి ఉంటాయి. అందుకే రెండు నిమిషాల వ్యవధిలోనే అంత భారీ నష్టం సంభవించి ఉంటుంది’ అని ఆ అధికారి అభిప్రాయపడ్డారు.

పెట్రోల్, కిరోసిన్ లేదు..!

సంఘటనకు ప్రత్యక్ష సాక్షి, విశాఖపట్నానికి చెందిన రామసుధాకర్ సీట్ నంబర్ 7లో ప్రయాణించారు. మరొక సాక్షి మదన్‌లాల్ సీట్ నంబర్ 69లో ప్రయాణించారు. ఇద్దరు చెప్పిన మాట ఒక్కటే. రెండు, మూడు సార్లు శబ్దం వచ్చిందని.. తర్వాత పొగలు, మంటలు వ్యాపించాయని. ఈ ఇద్దరూ కూడా తప్పించుకునే ప్రయత్నంలో స్వల్పంగా గాయపడ్డారు. ఇక్కడ వీరు ప్రయాణించిన సీటు నంబర్లు ప్రధానం. ఇద్దరూ ఎస్-11 కోచ్‌లో మొదటి, చివరి ‘బే’ల్లో ప్రయాణించారు. అందరికందరూ చనిపోయారంటే ప్రమాద తీవ్రత 5, 6, 7 ‘బే’లలో ఎక్కువగా ఉండి ఉండాలి. చనిపోయిన ప్రయాణికుల్లో కనీసం 20 మంది బే 5, 6, 7ల్లో ప్రయాణిస్తున్నవారే. అంటే ఈ మూడు ‘బే’ల్లో ప్రయాణించిన 24 మందిలో 20 మంది చనిపోవటం అక్కడి మంటల తీవ్రతకు అద్దం పడుతోంది. ఫోరెన్సిక్ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ఇక్కడే ఏదో జరిగి ఉండాలి. నిజంగానే షార్ట్ సర్క్యూట్ అయి ఉంటే మంటలు పై నుంచి కిందకు వ్యాపించాలి. కానీ.. ఎస్-11 బోగీలో మంటలు కింది నుంచి పైకి వ్యాపించాయి. బోగీ ఫ్లోర్ (నేల) పైన షార్ట్ సర్క్యూట్‌కు అసలు అవకాశమే లేదు. ఎలాంటి ఎలక్ట్రిక్ వైర్లు నేల పైన ఉండవు కాబట్టి! ఎస్-11 బోగీని పరీక్షించినప్పుడు బ్యాటరీలు పనిచేసే కండిషన్‌లోనే ఉన్నాయని, ఒకవేళ ఏదేని పరిస్థితుల్లో సాధారణంగా 110 వోల్టులు ఉండే విద్యుత్తు ప్రసరిస్తే ‘సర్క్యూట్ బ్రేకర్లు’ విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తాయని రైల్వే విద్యుత్ ఇంజనీర్లు చెప్తున్నారు. సర్క్యూట్ బ్రేకర్లు కూడా సరిగానే ఉన్నాయంటే షార్ట్ సర్క్యూట్ కారణంకాదనే నిర్ధారణకు ఫోరెన్సిక్, రైల్వే అధికారులు వచ్చారు. కిరోసిన్, పెట్రోల్ ఆనవాళ్లు లేవని కూడా నిర్ధారించారు. 
భారీ పేలుడూ కాదు..!

ఇక మిగిలింది పేలుడు..! ప్రమాద వశాత్తు కావచ్చు లేదా విద్రోహచర్యా కావచ్చు. విద్రోహ చర్యపైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అయితే తీవ్రవాద సంస్థలు ఎక్కువగా వాడే ‘ప్లాస్టిక్ ఎక్స్‌ప్లోజివ్స్’ (ఆర్‌డీఎక్స్ లాంటివి) లేదా కెమికల్ ఎక్స్‌ప్లోజివ్స్ (అమ్మోనియం నైట్రేట్ లాంటివి) ఆనవాళ్లు మాత్రం కనిపించలేదని ఫోరెన్సిక్ వర్గాల సమాచారం. ఈ రెంటిలో ఏది వాడినా రెండింటిని కలిపి వాడినా పేలుడు తీవ్రత ఎలా ఉంటుందో మక్కామసీదు, గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ పేలుళ్లలో చూశాం. బోగీతో పాటు ప్రయాణికుల మృతదేహాలు ఛిన్నాభిన్నం అయి ఉండేవి. పేలుడు శబ్దం భారీగా ఉండేది. అలాగే బోగీ ఫ్లోర్‌లో పెద్ద రంధ్రం ఏర్పడేది. ఇవేవీ ఎస్-11 బోగీలో కనిపించలేదు. ‘బే’ 6 లోయర్‌బెర్త్ కింద స్వల్ప పేలుడు జరిగిన ఆనవాళ్లు రెండు చిన్న రంధ్రాలు కనపడ్డాయని ఫోరెన్సిక్ నిపుణులు చెప్తున్నారు. ఈ సంఘటనలో ‘బే’ 6 మరొక రకంగా కీలకం. సంఘటనలో కుటుంబ సభ్యులతో సహా మాడిమసైన డేవిడ్‌రాజు భార్యకు నెల రోజులుగా ఒక ఆగంతకుడి నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయని తమిళ పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ సంఘటనలో డేవిడ్‌రాజు కూర్చున్న చోట పేలుడు ఆనవాళ్లకి, అతడి భార్యకు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్స్‌కి ఏమైనా సంబంధముందా? ఈ దిశలో ఇప్పటివరకు విచారణ జరిగిన దాఖలాలు మాత్రం లేవు. 

పచ్చభాస్వరం వాడారా? 

స్వల్పంగా సంభవించిందని భావిస్తున్న పేలుడుపై బాంబు నిపుణుల్లో ఉత్సుకతతో కూడిన చర్చ మాత్రం జరుగుతోంది. ఎలాంటి టైమర్, బ్యాటరీ లేదా ఇతర ట్రిగ్గర్ మెకానిజం కాని లేని ‘ఇంప్రూవైజ్‌డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్’ని వాడి ఉంటారని బాంబు నిపుణులు భావిస్తున్నారు. బహుశా సహజంగానే మండే స్వభావం ఉన్న ‘పచ్చభాస్వరం’ వాడి ఉండవచ్చని పేరు రాయటానికి ఇష్టపడని బాంబ్ డిస్పోజల్ నిపుణుడు ఒకరు అభిప్రాయపడ్డారు. భాస్వరం గాలిలో మండుతుంది. అందుకే నీటిలో నిలువచేస్తారు. నిలువ చేసిన ‘కంటెయినర్’ నుండి బొట్లుబొట్లుగా నీటిని బయటికి పంపే ఏర్పాటు చేస్తే నిర్దిష్ట సమయానికి అటూఇటుగా భాస్వరం సహజంగానే మండే ఏర్పాటు చేయవచ్చు. 

ఇక భాస్వరం మంటలు విస్తరించేందుకు తొందరగా మండే స్వభావమున్న పదార్థాలను అక్కడే ఉంచినప్పుడు మంటలు వేగంగా విస్తరించే అవకాశాలు చాలా ఉంటాయి. బెర్త్ కింద ఒక చోట కొంత ఎక్కువగా కాలిన గుర్తులు ఉన్నాయి. అలాగే సగం కాలిన బ్యాగ్ కూడా దొరికింది. ఇది కచ్చితంగా ఎవరో ఒకరు తెచ్చి ఉండాలి. ఎవరు అక్కడ పెట్టి ఉంటారనేది కనుక్కోవటం అంత కష్టం కాదని బాంబు నిర్వీర్య నిపుణుడు అభిప్రాయపడ్డారు. ఢిల్లీ నుంచి విజయవాడ వరకు ఆ బోగీలో ఎక్కిన దిగిన ప్రయాణికుల జాబితాను పరిశీలించి.. దిగి వెళ్లిపోయిన ప్రయాణికులు ఎవరనేది గుర్తిస్తే చిక్కుముడి వీడే అవకాశాలున్నాయని ఐజీ స్థాయి పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కానీ ఈ దిశలో పోలీసులు ఇప్పటివరకు విచారణ చేపట్టిన సూచనలేవీ లేవు. రైల్వే విచారణకు సమాంతరంగా ఒక ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని.. ఈ దిశలో తక్షణం చర్యలు మొదలుపెట్టాలని ఆ అధికారి అభిప్రాయపడ్డారు. 

మసిగా మారిన మృతదేహాలను ‘గుర్తించారా?’ 

ఇక చనిపోయిన వారి మృతదేహాలను గుర్తించటం ఒక ప్రహసనంగా మారింది. గుర్తుపట్టలేకుండా మాడిమసైన శవాల మూటల్లోంచి బంధువులు తమవారి ‘మృతదేహాలను’ గుర్తించి తీసుకెళ్లటం పోలీసు, రైల్వే అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ‘ఈ శవం మాదే’ అని బంధువులు తీసుకెళ్లిన సంఘటనలు గత మూడు రోజుల్లో కనీసం మూడు ఉన్నాయి. ఇది భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇప్పుడు నాలుగు గుర్తుపట్టని మృతదేహాలున్నాయి. అందులో ఒకటి కచ్చితంగా అవినాష్‌ది అయిఉండాలి. ఈ నాలుగింటిలో అవినాష్ తండ్రి డీఎన్‌ఏ మ్యాచ్ కాకపోతే పరిస్థితి ఏమిటి? అవినాష్ తండ్రి రైల్వేశాఖ ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాకు ఆశపడటం లేదు. తన కొడుకు మృతదేహం తనకు దక్కితే చాలని వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. 

డీఎన్‌ఏ పరీక్షల్లో గుర్తింపు సాధ్యమేనా? 

ఇక్కడ మరొక చిక్కు ఉంది. డీఎన్‌ఏ పరీక్షలు జరిపే సామర్థ్యం హైదరాబాద్‌లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి, అలాగే సెంటర్‌ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నొస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)కు మాత్రమే ఉంది. ఇందులో సీడీఎఫ్‌డీకి మరింత నైపుణ్యం ఉంది. కానీ ఈ స్థాయిలో మాడిమసైన, సంక్లిష్టమైన మృతదేహాల నమూనాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించటం ఈ రెండింటికీ కష్టమేనని డీఎన్‌ఏ నిపుణుల అభిప్రాయం. విజయవాడ చిన్నారి వైష్ణవి కేసులో కచ్చితమైన ఫలితాలు రాలేదు. రాజస్థాన్‌లో సంచలనం సృష్టించిన భన్వరీదేవి కేసులో కూడా సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్, సీడీఎఫ్‌డీలు చేతులెత్తేసిన తర్వాతే సీబీఐ అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సహా యం కోరింది. అప్పుడు కానీ ఒక నిర్ధారణకు రాలేకపోయిందని హైదరాబాద్‌కు చెం దిన ప్రముఖ డీఎన్‌ఏ నిపుణుడొకరు చెప్పారు. బంధువు నుండి ఒత్తిడి నేపథ్యంలో హడావుడిగా మృతదేహాలు అప్పగించి ఉంటే రైల్వేశాఖ ఇబ్బందుల్లో పడక తప్పదు. 

గౌరీశంకర్ ఇంకా తన బ్లడ్ శాంపిల్ ఇవ్వలేదు. ‘ఒకటి రెండు రోజుల్లో ఫోన్ చేస్తామని చెప్పారు. హైదరాబాద్ వెళ్లి ఇవ్వాలి. తర్వాత ఫలితానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. అప్పటివరకు ఎదురుచూడాల్సిందే..’ గొంతు పూడుకుపోతుండగా చెప్పారు గౌరీశంకర్. ‘రాఖీకి సెలవులు లేవు. అందుకే ముందుగానే వచ్చాడు. అక్క స్వాతి కట్టిన రాఖీ, స్వీట్స్ తీసుకెళ్లాడు. మళ్లీ 11న వస్తానన్నాడు. రిజర్వేషన్ కూడా చేయించుకున్నాడు. కనీసం అప్పటికయినా అవినాష్ అంత్యక్రియలు పూర్తిచేయగలనా..?’ అన్నది గౌరీశంకర్ ప్రశ్న. ప్రమాదమా, విద్రోహమా? మరొక ప్రశ్న.. జవాబులు దొరుకుతాయా.. రైల్వేశాఖ నివేదికల్లో మగ్గిపోతాయా!

చనిపోయింది ఎంత మంది? 

తమిళనాడు ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో ఎంతమంది చనిపోయారనేదానిపై స్పష్టత లేదు. కొన్ని మృతదేహాల భాగాలు మాత్రమే దొరికాయి. వీటన్నింటికీ డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తేకాని ఎంత మంది మరణించారనే దానిపై ఒక స్పష్టత రాదు. మృతుల సంఖ్యను మొదట 32గా ప్రకటించిన రైల్వే అధికారులు ఇప్పుడు 28గా మాత్రమే చూపుతున్నారు. మిగతా నాలుగు శరీర విడిభాగాల మూటలు మాత్రమే. మరి లెక్క తేలుతుందా...?

రైలు బోగీలో ‘బే’ అంటే... 

ఒక సెకండ్ క్లాస్ రైలు బోగీలో 72 సీట్లు/బెర్త్‌లు ఉంటాయి. ప్రతి వరుసలో ఒకవైపు ఆరు సీట్లు, మరొకవైపు రెండు సీట్లు ఉంటాయి. ఈ ఎనిమిది సీట్లను కలిపి ఒక ‘బే’ అంటారు. అంటే ఒక సెకండ్ క్లాస్ బోగీలో తొమ్మిది ‘బే’లు ఉంటాయి. అలాగే మొదటి ‘బే’ వైపు బోగీకి రెండువైపులా రెండు డోర్లు, చివరి బేవైపు మరొక రెండు డోర్లు ఉంటాయి. అలాగే బోగీ రెండు చివర్లలో ముందు, వెనుక బోగీలను కలుపుతూ ‘వెస్టిబ్యూల్’లు ఉంటాయి. ప్రమాదం జరిగిన ఎస్-11 బోగీలో బాగా నష్టం జరిగింది 5, 6, 7 బేలలో.

వైఎస్ ఫోటోపై కాంగ్రెస్ డ్రామాలు.

తక్షణమే ఎంసెట్ అడ్మిషన్లు చేపట్టాలి
మా ఆందోళన ఫలితమే నేతన్నలకు సర్కారు సాయం
వైఎస్ ఫోటోపై కాంగ్రెస్ డ్రామాలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. వృత్తివిద్యా కళాశాల విద్యార్థుల ఫీజుల భారం నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ సర్కారు కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు. ఏకీకృత ఫీజుల విధానమే ఉండాలని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలనుకోవడం అందులో భాగమేనన్నారు. అలా చేస్తే అడ్మిషన్లు మరింత ఆలస్యమై విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో గట్టు మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వ విధానంవల్ల రూ.482 కోట్ల అదనపు భారాన్ని భరించాల్సి వస్తోందనీ... దీన్నుంచి తప్పించుకునేందుకు ఇంకా జాప్యం చేయడం తగదని చెప్పారు. మీన మేషాలు లెక్కించకుండా ప్రభుత్వం తక్షణమే ఎంసెట్ అడ్మిషన్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. డబ్బులేనందువల్ల విద్య, వైద్యం అందని వారుండకూడదని వైఎస్ ప్రవేశపెట్టిన రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నీరుగార్చవద్దని విజ్ఞప్తి చేశారు. కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, ప్రమాణాల ప్రాతిపదికన ఫీజులు నిర్ణయించే కార్యక్రమం తొలుత కోర్టు తీర్పు ఇచ్చినపుడే చేసి ఉంటే బాగుండేదన్నారు.

ఇది నేతన్నల విజయం: సంక్షోభంలో ఉన్న నేతన్నలను ఆదుకోవాలని ఇటీవల సిరిసిల్లలో తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ, గతంలో ధర్మవరంలో అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఆందోళన ఫలితంగానే ప్రభుత్వం దిగి వచ్చి రూ.76 కోట్ల సహాయాన్ని ప్రకటించిందని గట్టు చెప్పారు. ఇందుకోసం పోరాటం చేసింది తమ పార్టీయే అయినా ఈ విజయం మాత్రం నేతన్నలదేనని ప్రకటించారు. సర్కారు అందిస్తోంది స్వల్ప సాయమే అయినా స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ మొత్తం నుంచి రుణాల మాఫీకి రూ.21 కోట్లు మాత్రమే కేటాయించడం మాత్రం సరికాదన్నారు. వైఎస్ జీవించి ఉన్నపుడు నేత కార్మికుల రూ.300 కోట్ల రుణాలను రద్దు చేయాలని నిర్ణయించారనీ, అయితే ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. 

వైఎస్ ఫొటో పేరుతో డ్రామాలు: వైఎస్ ఫొటో ఉండాలనీ, వద్దనీ కాంగ్రెస్ డ్రామాలాడుతోందని గట్టు విమర్శించారు. వైఎస్‌ను బద్నాం చేసేందుకే ఆయన పేరును తెరమీదకు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ను ఒకరు పొగిడితే చాలామంది విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్ పేరును చేర్చి దుష్ర్పచారం ప్రారంభించినరోజే వైఎస్ పేరు ఎత్తే అర్హతను కాంగ్రెస్ నేతలు కోల్పోయారన్నారు. వైఎస్ జీవించి ఉన్నపుడు వానపాములుగా ఉండిన కొందరు నేతలు ఇపుడు తాచుపాముల్లా పోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ అవసరం జగన్‌కు లేదు


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి అవసరం ఉండబోదని కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి అన్నారు. చంచల్‌గూడ జైల్లో వున్న జగన్‌ను ఆయన గురువారం ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్‌ను చాలా కాలం తరువాత కలిశానన్నారు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయినందున ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా? అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ... ‘‘ప్రతిభాపాటిల్ స్థానంలో ప్రణబ్ రావటమే మార్పు... అంతకన్నా మార్పేముంది’’ అని చమత్కరించారు. జగన్‌మోహన్‌రెడ్డితో కాంగ్రెస్ పార్టీ సత్సంబంధాలు మెరుగుపడతాయా? అన్న ప్రశ్నకు... ‘‘కాంగ్రెస్ పార్టీకే జగన్ అవసరం ఉంది తప్ప, జగన్‌కు కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి అవసరం లేదు’’ అని ఆయన సమాధానమిచ్చారు.

జగన్‌కు షర్మిల రాఖీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు గురువారం ప్రత్యేక ములాఖత్ ద్వారా చంచల్‌గూడ జైలులో కలిశారు. రాఖీ పండుగ సందర్భంగా ఆయన సోదరి షర్మిల రాఖీ కట్టి శుభాకాంక్షలు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సతీమణి భారతి, బావ అనిల్‌కుమార్ ములాఖత్‌లో భాగంగా జగన్‌ను కలుసుకున్నారు.

విద్యుత్ కార్మికులకు అండ


విజయవాడ, న్యూస్‌లైన్ : విద్యుత్ శాఖలోని కాంట్రాక్టు కార్మికులకు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఎప్పుడూ అండగా ఉంటుందని కౌన్సిల్ రాష్ట్ర కన్వీనర్ జనక్‌ప్రసాద్ పేర్కొన్నారు. జనక్‌ప్రసాద్ సమక్షంలో విజయవాడలోని ఓ హోటల్‌లో గురువారం జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ (జీ 3045) వైఎస్సార్ ట్రేడ్ యూనియన్‌కు అనుబంధంగా కొనసాగనున్నట్లు ప్రకటించింది. ఈ సంఘానికి రాష్ట్రవ్యాప్తంగా 16వేల మంది సభ్యత్వం ఉంది. ఈ సందర్భంగా జనక్‌ప్రసాద్ మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని, వారి ఇతర సమస్యల పరిష్కారానికి సంఘం నాయకులను ట్రాన్స్‌కో ఎండీ వద్దకు తీసుకెళ్లామని, బుధవారం సీఎంను కలిశామని చెప్పారు. ప్రిన్సిపల్ కార్యదర్శి, లేబర్ కమిషనర్లతో సమష్టి సమావేశం ఏర్పాటుచేసేందుకు ఆయన అంగీకరించారని తెలిపారు. మునిసిపల్ కార్పొరేషన్లలో 8 వేల మంది కాంట్రాక్టు కార్మికులు, ఆర్టీసీ, సింగరేణి, స్టీల్‌ప్లాంట్ కార్మికులను పర్మినెంట్ చేసేంతవరకు పోరాడతామన్నారు. కేవీపీ భావోద్వేగంలో చేసిన వ్యాఖ్యలను పట్టుకుని ఆయనను జగన్‌కు కోవర్టు అనడం సరికాదన్నారు. 

వైఎస్ మరణించినపుడు పరామర్శించడానికి వచ్చిన ప్రధానమంత్రి మన్మోహన్, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వైఎస్ మహానేతని, అత్యంత సమర్థుడైన నాయకుడని, రాష్ట్ర సంక్షేమానికి కృషిచేసిన వ్యక్తిగా అభివర్ణిస్తూ సంతకాలు చేశారని గుర్తు చేశారు. జగన్‌ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ (జీ 3045) ప్రధాన కార్యదర్శి పి.కాశీ మధుబాబు, అధ్యక్షుడు కేఎన్వీ సీతారామ్ మాట్లాడుతూ జగన్ తమకు అండగా నిలుస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు బీపీకే చంద్రం, బి.రమేష్, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి, మెదక్ జిల్లా కన్వీనర్ నర్రా భిక్షపతి, రంగారెడ్డి జిల్లా కన్వీనర్ అవిర్నేని శ్రీనివాసరావు, కృష్ణాజిల్లా కన్వీనర్ వేజెండ్ల శివశంకర్, విజయవాడ సిటీ కన్వీనర్ విశ్వనాథ రవి తదితరులు పాల్గొన్నారు.

జగన్‌ కాంగ్రెస్‌తో కలుస్తారన్న పుకార్లను ప్రజలు నమ్మవద్దు

Written By news on Thursday, August 2, 2012 | 8/02/2012

వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను ఎంపీ సబ్బంహరి చంచల్‌గూడ జైల్లో కలుసుకున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీకి జగన్‌తో అవసరం వుంటుంది కానీ.. జగన్ కు కాంగ్రెస్‌తో పని వుండదని చెప్పారు. జగన్‌ కాంగ్రెస్‌తో కలుస్తారన్న పుకార్లను ప్రజలు నమ్మొద్దని సబ్బంహరి విజ్ఞప్తి చేశారు. 

ప్రజల గుండెల్లో వైఎస్ఆర్: జనక్ ప్రసాద్

విజయవాడ: రాష్ట్రంలో ఉన్న ఎనిమిది కోట్ల మంది ప్రజల గుండెల్లో వైఎస్‌ఆర్ ఉన్నారని వైఎస్‌ఆర్ సీపీ నేత జనక్ ప్రసాద్‌ అన్నారు. ఇక గాంధీభవన్‌లో వైఎస్ విగ్రహం ఉన్నా లేకపోయనా ఒకటేనని వ్యాఖ్యానించారు. గురువారం జనక్ ప్రసాద్‌ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌లో ఏపీ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ అసోసియేషన్ చేరారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీలో రఘుపతి

వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్య నిర్వాహక మండలి(సీఈసీ)లో గుంటూరు జిల్లాకు చెందిన కోన రఘుపతి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు సంస్థాగత వ్యవహారాల రాష్ట్ర కోఆర్డినేటర్ పి.ఎన్.వి.ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

కోతల రాయుడు!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనిమిదిన్నరేళ్లకు పైగా ముఖ్యమంత్రిత్వం వెలగబెట్టిన చంద్రబాబు నాయుడు తన ఘనత గురించి పదే పదే తానే చెప్పుకుంటూ ఉంటారు. తెలుగువాళ్లకు తానే కంప్యూటర్లనిచ్చానని ఒకసారి, సెల్‌ఫోన్లు తన పుణ్యమేనని మరోసారి, అబ్దుల్ కలామ్‌ను రాష్ట్రపతి చేసింది తానేనని ఇంకోసారి, అసలు తను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కేంద్రంలో చక్రం తిప్పిందే తానని అనేక సందర్భాల్లోనూ చెప్పుకున్నారు చంద్రబాబు. ఈ రాష్ట్రానికి తనను తానే సీయీవోగా నియమించుకున్న చంద్రబాబు తన హయాంలో ఏదో పొడిచేశానని లేత సొరకాయలు తెగ కోసేస్తూ ఉంటారు. వాదనకోసం ఆయన చెప్పుకున్నవన్నీ నిజాలేనని ఒప్పుకుందాం- అయితే, అన్ని ఘనకార్యాలు సాధించిన బాబు తెలుగు గడ్డకు ఒరగదోసిందేమిటో? అసలు విషయం ఇదీ!

తాను చక్రం తిప్పినట్లు చంద్రబాబు చెప్పేరోజుల్లో ప్రధానిగా ఉన్న దేవెగౌడ తరచు కునుకు తీస్తూ కెమెరా కంటికి చిక్కినమాట నిజమే. దాన్ని ప్రస్తావిస్తూ, దేవెగౌడ తరఫున తానే ఢిల్లీలో రాజ్యం చేస్తున్నట్లు చంద్రబాబు పోజేసేవారు. కానీ, ఒక వంక పార్లమెంటులో కునుకు లాగుతూనే మరోవంక తన సొంత రాష్ట్రం కర్ణాటకలో సాగునీటి ప్రాజెక్టులను కట్టుకుంటూ పోయారు దేవెగౌడ. అందుకే, ఆయనను ఉత్తరాది రాష్ట్రాల నేతలు ‘కర్ణాటక ప్రధాని’గా అభివర్ణించారు. ఎవరు ములిగినా, ఎవరు తేలినా తను ఏంచెయ్యదల్చుకున్నాడో అది చేసిపారేశాడు దేవెగౌడ- అదీ గుట్టు చప్పుడు కాకుండా!

మన కోతల రాయుడు చంద్రబాబు సొల్లు కబుర్లు చెప్పడం తప్పించి చేసిందేమీ లేదు. చివరికి దేవెగౌడ కుతంత్రం వల్లా, చంద్రబాబు చేతగానితనం వల్లా వేలాది సంవత్సరాలుగా మట్టిని నమ్ముకుని బతుకుతున్న కృష్ణా డెల్టా రైతుల కూట్లో దుమ్ముపడింది! ఇంత జరిగినా సిగ్గులేని చంద్రబాబు రైతు బాంధవుడి గెటప్‌లో కొత్త నాటకానికి తెరతీసేందుకు తాపత్రయపడుతున్నారు.

రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత రెడ్డి బుధవారం -అగస్ట్ ఒకటో తేదీన- మీడియాతో మాట్లాడుతూ బాబు బండారమంతా బయటపెట్టారు. కృష్ణా డెల్టాకు నీరు లేకుండా చేసి నోరుకొట్టిన మహానుభావుడు చంద్రబాబు నాయుడేనని ఆయన -ఎల్లో మీడియానే సాక్ష్యంగా తెచ్చుకుని- వెల్లడించారు. ఇది జరిగి 24 గంటలవుతున్నా ఇంతవరకూ చంద్రబాబు గానీ, ఆయన చెమ్చాలుగానీ నోరువిప్పకపోవడం గమనార్హం!

తన హయాంలో చంద్రబాబుసాగునీటి ప్రాజెక్టుల మీద పెట్టిన ఖర్చెంతో బయటపెట్టాలని శ్రీకాంత రెడ్డి నిలదీశారు. ప్రాజెక్టుల వ్యయానికీ, రాబడికీ ముడిపెట్టి అప్పట్లో చంద్రబాబుచేసిన కుతర్కాన్ని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబునాయుడికి పాలనకూ, చిల్లరకొట్టు వ్యాపారానికీ తేడా తెలియదని శ్రీకాంత రెడ్డి విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి -దేశంలో ఎక్కడా లేని విధంగా- జలయజ్ఞం పథకాన్ని ప్రవేశపెట్టి ఒకమేరకు అమలుచేస్తూండగా ఇదే చంద్రబాబుఆ ప్రయత్నానికి వంకలుపెట్టి విమర్శించారని శ్రీకాంతరెడ్డి గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డిగండికోట ప్రాజెక్టును నిర్మించినందువల్ల కృష్ణా డెల్టాకు 30 టీఎంసీల నికర జలాలు దఖలుపడగా, ఆ విషయాన్ని కప్పెట్టి, పులివెందుల కాలువ ద్వారా నీటిని తరలించుకుపోయినందువల్లనే కృష్ణా డెల్టాకు కరువొచ్చిందని చంద్రబాబుమసిపూసి మారేడుకాయ చేస్తున్నారని శ్రీకాంతరెడ్డి బయటపెట్టారు.

అన్నింటికీ మించి, తను ముఖ్యమంత్రిగా ఏలుబడి సాగించే రోజుల్లో నీరు విడుదల చెయ్యవలసిందిగా చేతులమోడ్చి ప్రార్థించిన ఓ రైతును చంద్రబాబుబహిరంగంగా ఎలా విదిలించారో -ఎల్లో మీడియాలో అచ్చయిన కథనం ఆధారంగానే- గుర్తు చేశారు శ్రీకాంత రెడ్డి. ‘వద్దంటే పంట వేశావు- నీకు తగిన శాస్తే జరిగింది- ఇప్పుడు నీకు బుద్ధి వస్తుంది!’ అని వ్యాఖ్యానించిన శాడిస్టు చంద్రబాబు. అలాంటి కర్కోటకుడి పాలనలో వందలాదిమంది రైతులు ఉసురుతీసుకున్నారంటే వింతేముంది? వింతా విడ్డూరం ఎక్కడుందంటే, అదే చంద్రబాబుఇప్పుడు రైతన్నల రక్షకుడిగా అవతారమెత్తాలనుకోవడంలో ఉంది. రైతుకూలీల సంక్షేమానికే అంకితమయ్యామని చెప్పుకునే నేతలూ - సంస్థలూ చంద్రబాబుకు తాషామర్ఫాలు కొట్టడంలో ఉంది.

గందరగోళంలో విద్యార్థుల జీవితాలు: గట్టు

విద్యార్థుల జీవితాన్ని రాష్ట్ర ప్రభుత్వం గందరగోళంలో పడేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. ప్రభుత్వ తీరు వల్ల మెరిట్‌ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రివ్యూ పిటిషన్ పేరుతో కౌన్సిలింగ్ నిర్వహణకు మరోసారి ప్రభుత్వం జాప్యం చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ పేరును పలికే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్‌ ఫొటో పేరుతో కాంగ్రెస్ ఓ కొత్త డ్రామా మొదలుపెట్టిందని, వైఎస్‌ను మరోసారి విమర్శిస్తే రాష్ట్రంలో ఏ ఒక్కరూ చూస్తూ ఊరుకోరని గట్టు రామచంద్రరావు హెచ్చరించారు.

Gattu Ramachandra Rao Press Meet

వైఎస్సార్ సీపీలోకి టీడీపీ కార్యకర్తలు

విజయనగరం: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. విజయనగరం జిల్లా టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్‌.శరత్‌బాబు 1000 మంది కార్యకర్తలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు వీరిని పార్టీలోకి ఆహ్వానించారు.

జనం మెచ్చిన నేత వైఎస్సార్

గాంధీభవన్‌లో  వై.ఎస్‌.ఆర్‌. ఫొటో పెట్టకపోవడంపై కేవీపీ మాట్లాడడం కొంత బాధ, ఆశ్చర్యం కలిగించిందని వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ నేత కొండా సురేఖ అన్నారు. వై.ఎస్‌.ఆర్‌. కుటుంబాన్ని వేధిస్తున్నప్పుడు ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.



రైల్వే ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించాలి:మేకపాటి

నెల్లూరు రైలు ప్రమాద ఘటనలో విద్రోహ చర్చ ఉందనే కోణం విచారణ జరుగుతోందని, విద్రోహ చర్య అని తేలితే దోషులను కఠినంగా శిక్షించాలని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఈ ప్రమాదంపై పార్లమెంట్‌లో చర్చిస్తామన్నారు. రైల్వేల్లో భద్రతకు మరింత ప్రాధాన్యమివ్వాలన్నారు.

Konda Surekha ties Rakhi to YSR Ghat at Idupulapaya

వైఎస్సార్ సమాధికి రాఖీ కట్టిన సురేఖ

ఇడుపులపాయ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి కొండా సురేఖ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి రాఖీ కట్టారు. ఈ ఉదయం ఇడుపులపాయకు చేరుకున్న ఆమె వైఎస్సార్ ఘాట్ ను సందర్శించారు. రక్షాబంధన్ పర్వదినాన్ని ఇక్కడే జరుపుకున్నారు. మహానేత బతికుండగా ఆయనకు రాఖీ కట్టేవారమని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని ఆడపడుచుల కోసం వైఎస్సార్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని సురేఖ తెలిపారు. 

ఖరీఫ్‌కు కష్టమొచ్చింది

సగం ముగిసిన సీజన్ 
13.5 లక్షల ఎకరాల్లో తక్కువగా పంటల సాగు
విశాఖ, అనంత పురం, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో తక్కువ వర్షాలే
365 మండలాల్లో వర్షాభావం.. 38 మండలాల్లో తీవ్రం
480 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు
283 మండలాల్లోనే సాగుకు అనుకూల వర్షాలు
వ్యవసాయ శాఖ తాజా లెక్కలు
పవార్ లెక్క ప్రకారం రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ కరువు లేనట్లే

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్ సాగు కష్టాల్లో పడింది. జూన్ 1 నుంచి ఆగస్టు 1 వరకు.. అంటే సరిగ్గా సగం సీజన్ పూర్తయిపోయినా.. ఈ ఏడాది అంచనాలకు అనుగుణంగా పంటల సాగు జరగలేదని వ్యవసాయ శాఖ లెక్కలు స్పష్టంచేస్తున్నాయి. మరో రెండు వారాల వరకు ఒక్క వరి సాగుకు మాత్రమే అవకాశముంది. కాగా అన్ని పంటల్లో ఇప్పటివరకు సాగుకావాల్సిన విస్తీర్ణం కన్నా 13.5 లక్షల ఎకరాల్లో తక్కువ సాగు నమోదైంది. పత్తి, సోయాబీన్ లాంటి నాలుగైదు పంటలు మినహా మిగిలిన ప్రధాన పంటలు, పప్పుధాన్యాలు, చెరకు లాంటి పంటలు కూడా తక్కువగానే సాగయ్యాయి.

మొదటి నుంచే వరుణుడి శీతకన్ను..
వాస్తవానికి ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచే వర్షాలు తక్కువగా కురుస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనాలు తప్పుతూ జూన్‌లో వర్షాలు అసలే రాలేదు. జూలైలోనూ ఆలస్యంగా ఓ మోస్తరు వర్షాలే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ ఆరంభం నుంచి ఆగస్టు 1 వరకు రాష్ట్రంలో 301.3 మిల్లీ మీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 3 శాతం తక్కువగా 291.3 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఈ పరిస్థితి కాస్త నయమనిపించినా మండలాల వారీగా చూస్తే మాత్రం విభిన్నంగా ఉంది. మొత్తం 365 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.

అందులో 38 మండలాల్లో అయితే తీవ్ర వర్షాభావం నెలకొని కరువు కమ్మేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక సాధారణ వర్షపాతం 480 మండలాల్లో నమోదు కాగా, 283 మండలాల్లో మాత్రమే సాగుకు అనుకూల వర్షాలు పడ్డాయి. విశాఖ, అనంతపురం, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో అయితే ఈపాటికి నమోదు కావాల్సిన వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదయింది. రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు సరిపోయే వర్షాలు లేకపోవడంతో ఖరీఫ్ సాగు విస్తీర్ణం ఆశించిన మేర లేదు. ఖరీఫ్ సీజన్‌లో 2.2 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉంది. అయితే అందులో 1.21 కోట్ల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. ఇది సాధారణం కన్నా 13.57 లక్షల ఎకరాలు తక్కువ.

నూనె గింజలకు కష్టకాలమే..
ఈ ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటికే సాగుకావాల్సిన వేరుశనగ పంటలో 11 లక్షల ఎకరాలు తక్కువ సాగు కావడం రాయలసీమ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులను తేటతెల్లం చేస్తోంది. రాష్ట్రంలో వరి, పత్తి తర్వాత ఎక్కువగా సాగు చేసే ఈ పంట సాధారణ సాగు విస్తీర్ణం 32 లక్షల ఎకరాలు కాగా 17.22 లక్షలు ఎకరాల్లో మాత్రమే వేశారు. వేరుశనగతోపాటు నువ్వులు, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి అన్ని నూనె పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. ఖరీఫ్‌లో నూనెగింజల పంటల సాధారణ సాగు విస్తీర్ణం 44 లక్షల ఎకరాలు కాగా ఇప్పటికి కేవలం 25.77 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. వాస్తవానికి ఈ సమయానికల్లా 39.25 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగుకావాల్సి ఉంది. ఖరీఫ్‌లో త్వరగా పంట చేతికి వచ్చి రైతులకు ఆదాయం వచ్చేవి నూనెగింజల పంటలే. అయితే, పత్తి, సోయాబీన్‌లాంటి పంటలను మాత్రం ఈ ఖరీఫ్‌లో రైతులు ఎక్కువగానే సాగు చేపట్టారు. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 39.17 లక్షల ఎకరాలు కాగా, ఈ సీజన్‌లో ఇప్పటికే 45.35 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టారు. ఇక సోయాబీన్ విషయానికొస్తే ఈసరికల్లా 3.2లక్షల ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా, అది ఇప్పటికే 4.6లక్షలకు చేరింది.

కేంద్ర మంత్రి లెక్కలో కరువు లేనట్లే..
ఈ సీజన్‌లో మండలాల వారీగా చూస్తే 365 మండలాల్లో తక్కువ (20 నుంచి 99 శాతం తక్కువగా) వర్షపాతం నమోదయింది. అయితే, జిల్లాల సగటు పరంగా లెక్కిస్తే మాత్రం కేవలం నాలుగు జిల్లాల్లోనే తక్కువ వర్షపాతం నమోదయింది. జూలై 15 నాటికి 50 శాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైన జిల్లాలు, రాష్ట్రాలు ప్రకటించిన కరువు ప్రాంతాలకు మాత్రమే సబ్సిడీపై డీజిల్‌తో పాటు ఇతర ప్రభుత్వ సహకారం అందుతుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్ పేర్కొన్న విషయం విదితమే. ఈ లెక్క ప్రకారం చూస్తే రాష్ర్టంలోని ఒక్క జిల్లాలో కూడా (జిల్లా యూనిట్‌గా) జూలై 15 నాటికి 50 శాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కరువు ప్రాంతాలను ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో తక్కువ వర్షపాతం మండలాల్లోని రైతులకు ఎలాంటి సాయం ప్రభుత్వ పరంగా అందే పరిస్థితి లేనట్లే.

Popular Posts

Topics :