12 August 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

విద్యుత్ కోతపై వైఎస్సార్‌సీపీ నేత‌ల ధ‌ర్నా

Written By news on Saturday, August 18, 2012 | 8/18/2012

ఖమ్మం: అశ్వారావుపేటలో విద్యుత్ కోతను నిర‌సిస్తూ వైఎస్ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజేయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేత‌లు సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ధ‌ర్నాకు దిగారు. సబ్‌స్టేషన్ ఎదుట బ‌య‌టాయించి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

నక్కపల్లి పోర్టును తరలించొద్దు: బాబూరావు

విశాఖపట్టణం: నక్కపల్లి పోర్టు తరలింపు ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేత, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు డిమాండ్ చేశారు. పోర్టు తరలిస్తే సీఎం కిరణ్, మంత్రి గంటా తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి 24 గంటల అంతర్జాతీయ విమాన సర్వీసులను తక్షణమే ప్రారంభించాలని కోరారు. తమ డిమాండ్లపై స్పందించకుంటే అన్ని శ్రేణులు కలుపుకుని పెద్దఎత్తున ఉద్యమిస్తామని గొల్ల బాబురావు తెలిపారు.

YSRCP Activists Warning to V.Hanumantha Rao

'రంగరాజన్‌ కమిటీ సిఫార్సులు ఒప్పుకోం'

సబ్సిడీలు ఎత్తివేయాలని ప్రధానికి రంగరాజన్‌ కమిటీ ప్రతిపాదించిన సిఫార్సులను ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ సలహాదారు సోమయాజులు డిమాండ్ చేశారు. ఎకనమిక్ అవుట్‌లుక్‌ సిఫార్సులను తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. సబ్సిడీలు ఎత్తేస్తే వ్యవసాయరంగం పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదముందని అన్నారు. వ్యవసాయరంగం గురించి ఏమీ తెలియనివాళ్లే ఇలాంటి నివేదికలు ఇస్తారని విమర్శించారు. వ్యవసాయరంగంలో సగటు వార్షిక వృద్ధిరేటు 20ఏళ్లల్లో దారుణంగా పడిపోయిందని తెలిపారు. బొగ్గు గనుల కేటాయింపులో కాగ్ రిపోర్టును ఇంకా అధ్యయనం చేయలేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

వైఎస్సార్ సీపీ వినూత్న నిరసన

జగన్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం బషీర్‌బాగ్‌లో వినూత్న నిరసన చేపట్టింది. చెత్తకుండీకి వీహెచ్‌ ఫొటోపెట్టి పినాయిల్‌తో నోరుకడిగి వైఎఆర్‌సీపీ నేతలు నిరసన తెలిపారు. వీహెచ్ నోటి దురుసు తగ్గించుకోకుంటే బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు హెచ్చరించారు. రాజకీయాల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని సూచించారు.

కుప్పంలో చంద్రబాబుకు చుక్కెదురు


సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబుకు చుక్కెదురైంది. అన్నదమ్ముల్లా ఉన్న మాల- మాదిగలను వర్గీకరిస్తామని చంద్రబాబు ప్రకటించడాన్ని మాలలు తప్పుపట్టారు. చిత్తూరు పర్యటనలో ఉన్న బాబు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. ఎస్సీల ఓట్లు టీడీపీకి పడటం లేదన్న అక్కసుతోనే మాల- మాదిగలను విడదీసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఎబిసిడి వర్గీకరణకు మద్దతు పలికితే చంద్రబాబు రాజకీయంగా అంతమవుతారని మాలలు హెచ్చరించారు.

Shock to Chandrababu in kuppam constituency

YSRCP leader Somayajulu Press Meet 18th Aug 2012

రోజుకో రికార్డు బద్దలు కొట్టేస్తున్న రంగం ?

యూపీయే-2 హయాంను ఒక్కసారి పరకాయించి చూస్తే ఓ విషయం అర్థమవుతుంది. మనకి ఆటపాటల్లో రికార్డులు బద్దలుగొట్టే అలవాటు లేదు. మొన్న ముగిసిన ఒలింపిక్స్ ఈ విషయాన్నే రుజువు చేసింది. కళలకు పుట్టినిల్లు మన పవిత్రభూమి అంటారు గదా, ఆ రంగంలో ఏడాదికో రికార్డయినా బద్దలుకొట్టగలమా? ప్చ్.. సారీ! పోనీ ఏ వైజ్ఞానిక రంగంలోనో సరదాగా నెలకో రికార్డు బద్దలగొట్టగలమా? అదీ లేదు. ఏ ఆర్థికాభివృద్ధి రంగంలోనో వారానికో కొత్త రికార్డు స్థాపించగలమా? అబ్బే అదికూడా లేదు!

అంటే, మనమింతేనా ఇంక?
హలో...లో అంతగా నిరుత్సాహపడి నీరసపడిపోకండి! మనం రోజుకో రికార్డు బద్దలు కొట్టేస్తున్న రంగం ఒకటుంది! అదే కుంభకోణాల రంగం. 2012లోనే, మనం అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కుంభకోణాలుగా పరిగణించే ఘనకార్యాలను -42కు మించి- సాధించాం తెలుసా? ఇవి పెద్ద వ్యవహారాలు. ఇక చిన్నా చితకా రికార్డులను కూడా లెక్కలోకి తీసుకుంటే, రోజుకో రికార్డు అలవోకగా బద్దలు కొట్టేస్తున్నామని అర్థమయిపోతుంది.

ఉదాహరణకు, తాజాగా రచ్చకెక్కిన బొగ్గు కుంభకోణమే తీసుకోండి. 2జీ కుంభకోణంలో లక్షా డెబ్బయ్యారు వేల కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందని కాగ్ నివేదిక పేర్కొనగా, ఆ రికార్డును మన తాజా కుంభకోణం బద్దలు కొట్టేసింది. బొగ్గు బ్లాకుల కుంభకోణంలో జరిగిన అవినీతి విలువ లక్షా ఎనబయ్యారు వేల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని కాగ్ అంచనా! 2004-09 సంవత్సరాల మధ్య కాలంలో బొగ్గు బ్లాకుల కేటాయింపు క్రమాన్ని పారదర్శకంగా కొనసాగించక పోవడం వల్లనే ఈ నష్టం ఇంత భారీ ప్రమాణానికి చేరిందని కాగ్ అక్షింతలేసింది.

ఇంతకీ, కాగ్ వేసిన ఈ అక్షింతలు ఎవరి నెత్తిన పడ్డాయో తెలుసా? ఆర్థిక శాస్త్ర పరిజ్ఞానంలో అంతర్జాతీయ ఖ్యాతి సొంతంచేసుకున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ మీదే ఈ అక్షింతలు పడ్డాయి! కాగ్ పరిశీలించిన కాలంలో బొగ్గు మంత్రిత్వ శాఖ మన్మోహన్ సింగ్ పర్యవేక్షణలోనే ఉండేది. ఇంతవరకూ, ఎన్ని కుంభకోణాలు బయటపడినా ఎవ్వరూ మన్మోహన్ సింగ్ వైపు వేలెత్తి చూపించలేకపోయారు. ఇప్పుడు ఆ లోటూ తీరిపోయింది. ప్రతిపక్షమూ, పత్రికలూ, పరిశీలకులూ తమ కత్తులకు పదును పెట్టుకునే సౌలభ్యం సాక్షాత్తూ మన్మోహన్ సింగే కల్పించారు.

2004 సంవత్సరంలోనే బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రధానమంత్రి కార్యాలయానికి ఓ లేఖ రాస్తూ, బొగ్గు తవ్వుకుంటున్న ప్రైవేట్ కంపెనీలు కుప్పలుతెప్పలుగా లాభాలు పోగేసుకుంటున్నాయని పేర్కొన్నారు. అంచేత, బొగ్గు బ్లాకుల కేటాయింపు క్రమాన్ని పునఃపరిశీలించాలని ఆయన సూచించారు. ఆనాటి మార్కెట్ పరిస్థితులకు తగిన రీతిలో టెండర్ల ప్రక్రియ తిరిగి నిర్వహించాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. అయితే, ప్రధాన మంత్రి కార్యాలయం ఈ సూచన విషయంలో నిర్ణయం తీసుకోవడంలో విపరీతమయిన జాప్యం చేసింది. దాంతో, అంతవరకూ అమల్లో ఉన్న నిబంధనల మేరకే బొగ్గు బ్లాకుల కేటాయింపులు కొనసాగాయి.

అంటే, ప్రైవేటు బొగ్గు కంపెనీల భారీ లాభాలు యథాపూర్వం కొనసాగాయి. ఈ వ్యవధిలో సగటు బొగ్గు ఉత్పత్తి వ్యయాన్నీ, సగటు అమ్మకం ధరనూ లెక్కగట్టి వాటి మధ్య తేడాను లాభంగా పరిగణించింది ‘కాగ్’. ఆ మొత్తం ఎంతో లెక్కగట్టి దాన్ని ఆయా ప్రైవేటు బొగ్గు కంపెనీలకు అప్పనంగా ముట్టిన సొమ్ముగా పరిగణించింది కాగ్. అలా బొగ్గు లాభాలను దోచేసిన కంపెనీల్లో టాటా, రిలయెన్స్, జిందాల్, అభిజిత్, భూషణ్, ఎలెక్ట్రో స్టీల్, ఆధునిక్, రుంగ్టా, సజ్జన్ జిందాల్, గోదావరి ఇస్పాత్, గెయెంకా తదితర గ్రూపులు ఉన్నాయని కాగ్ తేల్చింది. ఈ కంపెనీలకు దక్కిన లాభాల మొత్తం 1,86,000 కోట్ల రూపాయల మేరకు ఉంటుందన్నది కాగ్ అంచనా.

దీన్ని బట్టి తప్పంతా ప్రధాన మంత్రి కార్యాలయంలోనే జరిగినట్లు స్పష్టమయింది. ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రపంచ ప్రసిద్ధ ఆర్థిక వేత్త. ఆయన కార్యాలయానికి ఈ లెక్కలన్నీ తెలియవని అనుకోడానికి ఆస్కారం లేదు. అంటే, అర్థమేమిటి? ఇది తెలిసితెలిసి జరిగిన తప్పు! దీనికి బాధ్యత వహించకుండా ఎవ్వరూ తప్పించుకోలేరు. అది మన్మోహన్ సింగ్ అయినా, మరొకరయినా. ఈ పరిణామానికి తర్కబద్ధమయిన ముగింపు అంటూ ఏదన్నా ఉంటే, అది ఇదే!

విద్యుత్ కోతలపై రోడ్డెక్కిన రైతన్న

విద్యుత్ కోతలకు నిరసనగా పలు జిల్లాల్లో రైతన్నలు రోడ్డెక్కారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడేకల్ల్ సబ్ స్టేషన్ ను శనివారం రైతులు ముట్టడించారు. నల్గొండ జిల్లా మోత్కూర్ మండలం దత్తప్పగూడెం సబ్ స్టేషన్ ను రైతులు ముట్టడించి ఆందోళకు దిగారు. వరంగల్ జిల్లా ఎల్లంపేట సబ్ స్టేషన్ కు రైతులు తాళం వేసి తమ నిరసన తెలిపారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో విద్యుత్ సబ్ స్టేషన్ ను రైతులు ముట్టడించారు. 

కాగా ప్రకాశం జిల్లా పెదారవీడులో విద్యుత్ కోలతకు నిరసనగా రైతులు ధర్నా చేపట్టారు. శ్రీశైలం-మార్కాపురం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపటంతో ఆమార్గంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతారామపురంలో రైతులు ధర్నాకు దిగారు.

ఈఎన్‌టీ స్థలం కబ్జాలో సీఎంకు పాత్ర!


రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో కోఠిలోని ఈఎన్‌టీ స్థలం కబ్జా వ్యవహారంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఇతర అధికారులు తమ నిజాయతీ ఏమిటో నిరూపించుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఆ స్థలాన్ని కాపాడాలని ఆందోళన చేసినందుకు కబ్జాకోరులు తమపై నిందలు వేశారని, ఆ ఆరోపణల నిగ్గు తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు పార్టీ నాయకుడు ఎం.శ్రీనివాసరావుతో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈఎన్‌టీ స్థలం వ్యవహారంలో డాక్టర్లు, సిబ్బంది, వివిధ రాజకీయ పక్షాలు కూడా ఆందోళన చేశాయి. 

మేం ఇంకా ఆందోళన కొనసాగిస్తుండటంతో కబ్జాదారులైన ఎ.రమేష్, టీకే శ్రీనివాసులు మాపై నింద మోపారు. ఈ మేరకు గత నెల 2న వైద్య శాఖ మంత్రికి రహస్యంగా లేఖ కూడా పంపారు. ప్రభుత్వానికి ధైర్యం లేకపోవడంతో ఆ లేఖను బయటపెట్టలేకపోయింది. అందువల్లే ఆ లేఖ ప్రతిని మేం విడుదల చేస్తున్నాం. ఇందులో నాతో పాటు మాజీ ఎంపీ పి.మధు, మరో రెండు పత్రికల అధిపతుల పేర్లను ఉదహరించారు. డబ్బులు ఇవ్వకపోతే కబ్జాకోరులను చంపుతామని బెదిరించినట్టు అందులో పేర్కొన్నారు’’ అని వివరించారు. 

నిలోఫర్‌లో మరణమృదంగం

హైదరాబాద్, తిరుపతి, వరంగల్, న్యూస్‌లైన్: దేశంలోనే రెండో అతిపెద్ద రెఫరల్ సెంటర్‌గా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రి నిలోఫర్‌లో మరణమృదంగం మోగుతోంది. రోజుకు సగటున 7 నుంచి 10 మంది చిన్నారులు మృత్యువాత పడుతుండగా వైద్యులు, నర్సులు, ఇతర సేవల కొరత వల్ల తాజాగా ఈ సంఖ్య మరింత పెరిగింది. శుక్రవారం ఒక్క రోజే 16 మంది శిశువులు మృతి చెందారు. కేవలం 500 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రి అవుట్‌పేషంట్ విభాగానికి ప్రతిరోజూ 1,200 నుంచి 1,500 మంది వస్తుండగా, ఆస్పత్రిలో నిత్యం 1,000 నుంచి 1,200 మంది నవజాత శిశువులు ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందుతుంటారు. 


రుయాలో మరో నలుగురు చిన్నారుల మృతి

తిరుపతి రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలో శుక్రవారం వివిధ కారణాలతో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం వివిధ రకాల జబ్బులతో 69 మంది చిన్నారులను ఆస్పత్రిలో చేర్చుకున్నట్లు సూపరింటెండెంట్ వీరాస్వామి చెప్పారు. ఇందులో పీడియాట్రిక్ ఇంటెన్సివ్‌కేర్ యూనిట్‌లో 29 మందిని చేర్చుకోగా 9 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. నియో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో 40 మంది చిన్నారులను చేర్చుకున్నామని 16 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. 

ఎంజీఎంలో ముగ్గురు చిన్నారుల మృతి

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం ఒకేరోజు ముగ్గురు పిల్లలు మృతి చెందారు. వేర్వేరు కారణాలతో ఆస్పత్రిలో అడ్మిట్ అయి చికిత్స పొందుతూ ప్రాణాలొదిరారు.

జగన్ లక్ష్యంగా ఢిల్లీ స్థాయిలో సాగుతున్న కుట్రకు మరికొందరు మంత్రులూ బలి?

తదుపరి టార్గెట్‌పై మంత్రుల్లో చర్చోపచర్చలు
జగన్ లక్ష్యంగా ఢిల్లీ స్థాయిలో సాగుతున్న కుట్రకు 
మరికొందరు మంత్రులూ బలికాక తప్పదనే అభిప్రాయం
సీనియర్లలో అసంతృప్తి జ్వాలలు.. 
ధర్మాన రాజీనామా ఆమోదంతో పాటు ప్రాసిక్యూషన్‌కూ గ్రీన్‌సిగ్నల్!.. 
ముఖ్యమంత్రి వైఖరితో కుంగిన ధర్మాన
లీకులిచ్చి పత్రికల్లో కథనాలు రాయిస్తున్నారనే అనుమానాలు
బొత్సతో ప్రసాదరావు భేటీ... ధర్మానను కలిసిన చిరంజీవి, పొన్నాల, కొండ్రు

హైదరాబాద్, న్యూస్‌లైన్: రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చుట్టూ సీబీఐ ఉచ్చు మరింతగా బిగుసుకుంటోంది. ఆయన రాజీనామాను ఆమోదించడంతో పాటు ప్రాసిక్యూషన్‌కూ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడానికి రంగం సిద్ధం అవుతోంది. ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోరుతూ గవర్నర్‌కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీబీఐ రాసిన లేఖలపై త్వరలోనే నిర్ణయం వెలువడనున్నట్లు సమాచారం. ఇదంతా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా ఢిల్లీ స్థాయిలో సాగుతున్న కుట్ర కనుక.. ధర్మానతో పాటు మరికొంతమంది మంత్రులూ బలికాక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధిష్టానం ఆదేశాల మేరకు సాగుతున్న ఈ వ్యవహారం సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రుల్లో పెద్దయెత్తున గుబులు రేపుతుండగా మరికొందరు సీనియర్ మంత్రులు సహా అనేకమంది నేతల్లో అసంతృప్తి జ్వాలలు రగిలిస్తోంది. వాన్‌పిక్ భూ కేటాయింపుల విషయంలో ధర్మానపై సీబీఐ చార్జిషీట్, ఆయన రాజీనామా, ప్రాసిక్యూషన్‌కు సీబీఐ లేఖలు... ఇలా ఒకదాని వెంబడి మరొకటిగా చోటు చేసుకున్న పరిణామాలతో వేడెక్కిన వాతావరణం శుక్రవారానికి మరింతగా రాజుకుంది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కేంద్రంగా మంత్రులు, సీనియర్ నేతలు సుదీర్ఘ చర్చలు సాగించారు. 

ధర్మాన ప్రసాదరావు బొత్స నివాసానికి పలుమార్లు వచ్చి సీబీఐ ఛార్జిషీట్ తదనంతర పరిణామాలు, భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు. ఉదయం బొత్స నివాసానికి మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డితో కలిసి వచ్చిన ధర్మాన చాలాసేపు చర్చలు సాగించారు. మధ్యలో కొద్దిసేపు డిప్యుటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రి కొండ్రు మురళి ఆ చర్చల్లో వేర్వేరుగా పాల్గొన్నారు. తిరిగి సాయంత్రం మరోసారి ధర్మాన బొత్స నివాసానికి వచ్చారు. అంతకుముందు పలువురు మంత్రులు ధర్మానను కలసి సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ సమన్వయ సంఘం సభ్యులు చిరంజీవి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, కొండ్రుమురళి, బస్వరాజ్ సారయ్య బీసీ సంఘం నేత ఆర్.కష్ణయ్య తదితరులు ధర్మానను ఆయన నివాసంలో కలిశారు. సీబీఐ ఛార్జిషీట్లలో పేర్కొన్న అంశాలపై బొత్స, ధర్మానలు... సంబంధిత శాఖల ఉన్నతాధికారులు అనిల్‌చంద్ర పునీత, సుతీర్థ భట్టాచార్యలను పిలిచి మాట్లాడినట్లు సమాచారం. ధర్మానతో చిరంజీవి దాదాపు ఇరవై నిమిషాలకు పైగా భేటీ అయ్యారు. మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట్రమణారెడ్డిలు కూడా శుక్రవారం ధర్మానను కలిశారు. 

గత రెండురోజుల పరిణామాలతో శుక్రవారం ధర్మాన చాలా డీలా పడినట్లు కనిపించారని ఆయన్ను కలసిన నే తలు చెప్పారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, తన శాఖ పరంగా పొరపాట్లు జరిగినట్లు తేలితే దానికి సంబంధిత శాఖల అధికారులదే తప్ప తనకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. కొన్ని జీఓలు కేబినెట్‌కు తెలియకుండా జారీ అయ్యాయని, సీబీఐ ఛార్జిషీట్లో 1110, 1115, 233, 346, 270, 871 జీఓలను పేర్కొనగా వాటిపై కేబినెట్లో చర్చించాకనే నిర్ణయం తీసుకున్నామని ధర్మాన తెలిపారు. మంత్రిమండలి నిర్ణయాల తరువాత జీఓలు విడుదల చేసే బాధ్యత ప్రభుత్వ కార్యదర్శిదే తప్ప తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. 

సీఎం తీరుతో కుంగిపోయిన ధర్మాన!: ఈ నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై పార్టీలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ధర్మాన వర్గం తీవ్రస్థాయిలో మండిపడుతోంది. సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన క్షణంనుంచి సంబంధిత మంత్రులు సీఎంను కలసి తమకు ఇబ్బందులు రాకుండా చూడాలని వేడుకున్నారు. న్యాయసహాయం కోసం కూడా అర్థించారు. న్యాయసహాయానికి కూడా సీఎం చాలా కాలం తటపటాయించి ఇటీవలే ఓకే చేశారు. ఛార్జిషీట్‌లో ధర్మాన పేరుండదని ముందునుంచి సీఎం భరోసా కల్పించినా చివరకు సీబీఐ తన పేరును చేర్చడంతో ధర్మాన ఒక్కసారిగా షాక్ తిన్నారని ఆయనకు అత్యంత సన్నిహితుడొకరు చెప్పారు. సీబీఐ ఛార్జిషీట్ విషయం ఆరోజు ఉదయాన్నే సీనియర్ మంత్రి ఒకరికి తెలియగా ఆయన ధర్మానకు ఫోన్‌చేసి చెప్పారు. సీఎంను నమ్ముకుంటే ఇంతే అవుతుందనీ ఆ మంత్రి ధర్మానతో పేర్కొన్నారు. 

అయితే ఛార్జిషీట్ దాఖలైన మరునాడు, ధర్మాన రాజీనామా సమర్పించిన సందర్భంలో కూడా సీఎం ఆయనకు హామీ ఇచ్చారు. కానీ ఆ మరునాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేతలు సీఎంను కలసి రాజీనామా ఆమోదించవద్దని కోరిన సమయంలో మాత్రం తన చేతుల్లో ఏమీలేదని, అంతా అధిష్టానం చూస్తోందని, న్యాయసలహాల ప్రకారమే నడుస్తామని చెప్పడంతో ఆనేతలు అవాక్కయ్యారు. ఇది తెలిసిన ధర్మాన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అంతవరకు కొంత ధీమాతో ఉన్న ఆయన ఒక్కసారిగా కుంగిపోయారు. గురువారం అర్థరాత్రి వరకు ఆయన పలువురు సీనియర్ న్యాయవాదులతో చర్చించారు. తీవ్ర ఆందోళనకు గురైన ఆయన బొత్స నివాసానికి పలుమార్లు వెళ్లి చర్చలు సాగించారు. సీఎంను కలిసిన కొందరు నేతలు ఒక సీనియర్ మంత్రితో ఫోన్లో మాట్లాడుతూ... ‘‘సీఎం ఇంతలా వంచిస్తారని మేము అనుకోలేదు. నిన్న హామీ ఇచ్చినట్లే ఇచ్చి ఇపుడు చేతులెత్తేసినట్లుగా మాట్లాడుతున్నారు’’ అని అసంతృప్తి వ్యక్తంచేశారు. ధర్మాన విషయంలో సీఎం మాటమారుస్తుండటంతో ఆయన వర్గానికి చెందిన జిల్లా నేతలు.. మంత్రి కొండ్రు మురళితో కలిసి మంగళవారం ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలవాలని నిర్ణయించారు. కాగా తనపై ఛార్జిషీట్లో సీబీఐ పేర్కొన్నట్లు పత్రికల్లో వస్తున్న అభియోగాలు పెద్ద సీరియస్‌వి కావని, తనను ఇరికించేందుకు వీలుగా అందులో పెద్ద ఆరోపణలే ఉండి ఉండవచ్చని ధర్మాన భావిస్తున్నారు. ఒకవేళ ఇవి బలమైన అభియోగాలు కావని సీబీఐ భావిస్తే.. అది రెండో ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశాలు లేకపోలేదని పార్టీ ముఖ్యనేత ఒకరు శుక్రవారం న్యూస్‌లైన్‌తో వ్యాఖ్యానించారు. అధిష్టానం ఆదేశానుసారం నడుస్తున్న కేసు కనుకనే ఇది తప్పదన్నారు.

తదుపరి లక్ష్యం బీసీయేతర మంత్రి? 

తాజా పరిణామాల నేపథ్యంలో అసంతృప్త నేతలందరూ ధర్మానకు అనుకూలంగా ఏకతాటిపైకి చేరుకుంటున్నారు. ఇప్పటికే డిప్యుటీ సీఎం దామోదర రాజనర్సింహ సహా పలువురు మంత్రులు ధర్మానతో, బొత్సతో కలసి చర్చలు సాగించారు. మంత్రులు సబితారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డీఎల్ రవీంద్రారెడ్డి, విశ్వరూప్, బస్వరాజ్ సారయ్య తదితరులు శుక్రవారం ధర్మానను కలసి మాట్లాడారు. జగన్ లక్ష్యంగా పార్టీ అధిష్టానం ఆడుతున్న ఈ గేమ్‌లో తదుపరి బలయ్యే మంత్రులెవరనే దానిపైనా చర్చ సాగుతోంది. జగన్‌ను వేధించే క్రమంలో మంత్రులు, నాయకులు ఎవరు బలైనా సరే అధిష్టానం పట్టించుకొనే పరిస్థితి కనిపించడం లేదని పార్టీ సమన్వయ కమిటీ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. సాధ్యమైనంత ఎక్కువ కాలం జగన్ బయటకు రాకుండా చూడడం ద్వారా పార్టీని రక్షించుకోవచ్చన్న అభిప్రాయం అధిష్టానంలో ఉందని, అందుకే ఇలా చేస్తోందని చెప్పారు. సీబీఐ అరెస్టు చేసిన మోపిదేవి వెంకటరమణ, ఛార్జిషీట్ దాఖలైన ధర్మాన ప్రసాదరావులు బీసీలు కావడం, ఆ వర్గాల్లో అసంతృప్తి రేగుతుండడంతో తదుపరి గురి హోం మంత్రి సబితారెడ్డిపై, ఆపై పొన్నాల లక్ష్మయ్యపై ఉండవచ్చని ఆ నేత విశ్లేషించారు. 

పథకం ప్రకారమే ఆ పత్రికలో కథనాలు

ధర్మానపై ఛార్జిషీట్ దాఖలుతో వివిధ పత్రికల్లో రెండు రోజులుగా వచ్చిన కథనాలు వాస్తవానికి ఆయనకు ఒకింత సానుభూతి కలిగించేవిగా వచ్చాయి. అయితే శుక్రవారం ఒక పత్రికలో ధర్మానకు వ్యతిరేకంగా కొన్ని కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో పనిగట్టుకుని లీకులిచ్చి ఈ కథనాలు రాయించారన్న అనుమానాలు ధర్మానతో పాటు పలువురు మంత్రుల్లోనూ నెలకొన్నాయి. సానుభూతి లభిస్తున్న సమయంలో రాజీనామాను ఆమోదించడమో, లేదా ప్రాసిక్యూషన్‌కు అనుమతించడమో జరిగితే అది ప్రజల్లో ప్రభుత్వంపై ఒకింత వ్యతిరేకతకు దారితీస్తుందన్న ఉద్దేశంతోనే ఇలా లీకులిచ్చి కథనాలు రాయించి ఉంటారని ధర్మాన అనుచరులు, మంత్రులు అనుమానిస్తున్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో తనకు స్థలమున్నట్లు వచ్చిన కథనం తప్పని, తాము దానికి అడ్వాన్సు చెల్లించినా అదింకా తమ పేరిట రిజిస్ట్రేషన్ కాలేదని ధర్మాన చెబుతున్నారు. ఆ విషయం ఇదివరకెప్పుడో సీబీఐకి వివరించామని, కానీ అప్పుడెప్పుడూ దానిపై రాని కథనం ఛార్జిషీట్ అనంతరం ఆ ప్రముఖ పత్రికలో వచ్చిందంటే దీని వెనుక కుట్రే ఉన్నట్లు అర్థమవుతోందని వారనుమానిస్తున్నారు. ధర్మాన తప్పు చేశాడు కనుకనే సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిందని, ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతించిందన్న అభిప్రాయం ప్రజల్లో కలిగించడానికి ఇలా పథకం ప్రకారమే కథనాలు రాయించినట్లు వారు గట్టిగా చెబుతున్నారు.

అధిష్టానానికి నివేదికలు

ఇలా ఉండగా ధర్మానపై సీబీఐ ఛార్జిషీట్, రాజీనామా తదితర సంఘటనలతో రాష్ట్రంలోని పరిణామాలపై నివేదికలు ఇవ్వాలని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సమన్వయ కమిటీ సభ్యుడు షబ్బీర్ అలీలను ఆదేశించారు. ఆమేరకు ఇద్దరు నేతలు శుక్రవారం వేర్వేరుగా నివేదికలు పంపారు. ధర్మాన సంబంధిత పరిణామాలు, రాజకీయంగా మారనున్న సమీకరణాలు తదితర అంశాలపై వారు అధిష్టానానికి నివేదించారు. ఈ వ్యవహారాలపై చర్చించేందుకు వారిని ఢిల్లీ రావాలని అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. శనివారం లేదా సోమవారం బొత్స ఢిల్లీ వె ళ్లే అవకాశముంది. మరో సీనియర్ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి శనివారం ఢిల్లీ బయలుదేరుతున్నారు. ఇదిలావుండగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రతి ధర్మానకు ఇంకా అందలేదు. అది అందితేనే అందులోని విషయాలు పూర్తిగా పరిశీలించేందుకు అవకాశముంది.

‘కోల్’గొట్టారు!

‘‘బొగ్గు గనుల కేటాయింపుకు పోటీయుత బిడ్డింగ్ విధానాన్ని సకాలంలో అమలు చేయకపోవడం వల్ల.. వాటిని దక్కించుకున్న ప్రైవేటు సంస్థలకు లక్షా 86 వేల కోట్ల రూపాయల మేరకు లబ్ధి చేకూరింది. ఈ కేటాయింపులను పోటీయుత, పారదర్శక, నిష్పాక్షిక బిడ్డింగ్ ద్వారా జరిపి ఉంటే పైన పేర్కొన్న లబ్ధిలో అధిక భాగం ఖజానాకే చేరి ఉండేది’’
- కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)

లక్షా 86 వేల కోట్ల రూపాయల బొగ్గు స్కాంలో యూపీఏ
మన్మోహన్ సర్కారును కడిగేసిన కాగ్
బొగ్గు గనులను ఇష్టారాజ్యంగా ప్రైవేటుకు కట్టబెట్టారు
ప్రైవేటు సంస్థలకు లక్షా 86 వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారు
పోటీ, పారదర్శకత, నిష్పాక్షికత లేని బిడ్డింగే కారణం
లేదంటే ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం సమకూరేది
జీఎంఆర్‌తో ఢిల్లీ విమానాశ్రయ ఒప్పందమూ నష్టదాయకమే
దాంతో రూ. 1.63 లక్షల కోట్ల ఆదాయానికి గండిపడింది
రూ. 3,400 కోట్ల డెవలప్‌మెంట్ ఫీజు వసూలుకు అక్రమ అనుమతి
రిలయన్స్ పవర్‌కు బొగ్గు నిల్వల మళ్లింపు అనుమతులూ అక్రమమే
వాటివల్ల రూ. 29,033 కోట్ల మేర ఆ సంస్థకు అనుచిత లబ్ధి
మూడు ఉదంతాలతో ఖజానాకు రూ.3.06 లక్షల కోట్ల నష్టం
పార్లమెంటుకు కాగ్ నివేదికలు.. సర్కారుపై మండిపడ్డ విపక్షాలు.. 
బొగ్గు శాఖ ప్రధాని చేతిలో ఉండగానే కేటాయింపులు..
ఆయన తక్షణం రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ 


న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: అంతులేని అవినీతికి, కనీవినీ ఎరుగని స్థాయి కుంభకోణాలకు మారుపేరుగా మారిన యూపీఏ ప్రభుత్వం తాజాగా భారీ స్థాయి బొగ్గు కుంభకోణంలో మెడ లోతున కూరుకుపోయింది. బిడ్డింగులు ఆహ్వానించకుండా పలు ప్రైవేటు సంస్థలకు కేంద్రం ఇష్టారాజ్యంగా 57 బొగ్గు గనులను కేటాయించిందని సాక్షాత్తూ ప్రభుత్వ ఆడిటింగ్ సంస్థ అయిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పేర్కొంది. తద్వారా వాటికి రూ.1.85 లక్షల కోట్ల మేరకు కేంద్రం అనుచిత లబ్ధినీ, ఖజానాకు భారీ నష్టాన్నీ కలిగించిందంటూ నిగ్గుదేల్చింది. పరిమాణపరంగా ఇది 2జీ కుంభకోణం కంటే కూడా పెద్దది కావడం విశేషం! బొగ్గు గనుల బిడ్డింగ్‌లో సంస్థల మధ్య పోటీకి అసలు అవకాశమే కల్పించలేదని, ఏమాత్రం పారదర్శకతను పాటించలేదని, నిష్పాక్షికతకు కూడా పూర్తిగా నీళ్లొదిలిందని కాగ్ తీవ్రస్థాయిలో అభిశంసించింది. అంతేకాదు.. ఢిల్లీ విమానాశ్రయం అభివృద్ధి పేరుతో అత్యంత విలువైన భూములను కేంద్రం రాయితీల పేరుతో కారుచౌకగా జీఎంఆర్ సంస్థ నేతృత్వంలోని ప్రైవేటు కన్సార్షియానికి కట్టబెట్టడంవల్ల ప్రభుత్వానికి మరో రూ.1.63 లక్షల కోట్ల మేరకు నష్టం కలిగిందని పేర్కొంది. పైగా ఒప్పందానికి విరుద్ధంగా విమానాశ్రయంలో డెవలప్‌మెంట్ ఫీజు వసూలుకు అనుమతించి కన్సార్షియానికి మరో రూ.3,400 కోట్ల దాకా అనుచిత లబ్ధి కలిగించిందని తెలిపింది. వీటికి తోడు నిబంధనలకు విరుద్ధంగా బొగ్గు నిల్వల మళ్లింపుకు అనుమతించడం ద్వారా అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ పవర్ లిమిటెడ్‌కు మరో రూ.29,033 కోట్ల మేరకు లబ్ధి చేకూర్చిందని ప్రభుత్వ ఆడిటింగ్ సంస్థ ఆరోపించింది. 

ఇలా ఈ మూడు ఉదంతాల్లో ఖజానాకు కనీవినీ ఎరగని రీతిలో రూ.3 లక్షల కోట్లకు పైగా భారీ నష్టం వాటిల్లిందని తేల్చింది. బొగ్గు గనుల కేటాయింపులు, ఢిల్లీ విమానాశ్రయ అభివృద్ధి ఒప్పందం అమలు, అల్ట్రా మెగా విద్యుత్ ప్రాజెక్టులపై శుక్రవారం పార్లమెంటుకు విడిగా మూడు నివేదికలను కాగ్ సమర్పించింది. ఒక్కో ఉదంతంలోనూ ఒప్పందాలకు ఎలా తూట్లు పొడిచిందీ, నిబంధనలను ఎలా ఉల్లంఘించిందీ కాగ్ పూసగుచ్చినట్టు వివరించింది. బొగ్గు గనుల కేటాయింపుకు పోటీయుత బిడ్డింగ్ పద్ధతిని తక్షణం అమల్లోకి తేవడంతో పాటు ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. కాగ్ నివేదికలు తీవ్ర రాజకీయ దుమారానికి తెర తీశాయి. యూపీఏ అవినీతికి, కుంభకోణాలకు బొగ్గు గనుల కేటాయింపు ఉదంతం పరాకాష్ట అంటూ బీజేపీ దుయ్యబట్టింది. ‘‘ఇది కేవలం కుంభకోణం మాత్రమే కాదు. దారుణ హత్య, కనీవినీ ఎరగని లూటీ’’ అంటూ దుమ్మెత్తిపోసింది. దీనికి ప్రధాని మన్మోహన్‌సింగ్ వివరణ ఇవ్వడంతో పాటు నైతికంగా, రాజకీయంగా, వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తూ ఆయన తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఇతర విపక్షాలూ కేంద్రంపై దుమ్మెత్తిపోశాయి. ప్రభుత్వం మాత్రం నివేదికలు తప్పులతడక అంటూ తేలిగ్గా కొట్టిపారేసింది. కాగ్ నివేదికలు ఇప్పుడు బీజేపీ నేత మురళీ మనోహర్ జోషీ నేతృత్వంలోని పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పరిశీలనకు వెళ్తాయి. గనుల కేటాయింపులు బొగ్గు శాఖ ప్రధాని చేతిలో ఉండగానే జరిగినందున ఆయనపై విమర్శల జడివాన మరింత తీవ్రతరమయ్యే అవకాశముంది.

నివేదిక తప్పుల తడక: శ్రీప్రకాశ్ జైశ్వాల్, బొగ్గు మంత్రి

‘‘యూపీఏ ప్రభుత్వ నిర్వాకం వల్ల రూ.1.86 లక్షల కోట్ల మేర ప్రైవేటు కంపెనీలు లాభపడ్డాయన్న వాదనలో వాస్తవం లేదు. ఆ లెక్కలు తప్పుల తడక . బొగ్గు బ్లాకులను పూర్తి పారదర్శక పద్ధతిలో కేటాయించాం. 2006లో న్యాయ శాఖ నుంచి పరస్పర విరుద్ధాభిప్రాయలు వచ్చిన నేపథ్యంలో బ్లాకులను వేలం వేయలేదు. దీంతోపాటు నాడు బీజేపీ, వామపక్ష పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లు పోటీ బిడ్డింగ్‌ను తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రస్తుత విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చవద్దని ఆ మూడు రాష్ట్రాలూ చెప్పాయి. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కేంద్రం గౌరవించాలి కదా! విధాన నిర్ణయంలో ఎలాంటి తప్పూ లేదు. ఒక వేళ ఉంది అని అంటే.. దానిపై సీబీఐ దర్యాప్తు చేస్తుంది.’’

ప్రజలను కాగ్ తప్పుదారి పట్టిస్తోంది: పౌర విమానయాన శాఖ

‘‘ఢిల్లీ విమానాశ్రయంపై కాగ్ అంచనాలు పూర్తిగా తప్పు. ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. ప్రసుత విలువను లెక్కలోకి తీసుకోకుండా కాగ్ అంచనాలు వేసింది. అలాగే మా శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అభిప్రాయాలకు నివేదికలో చోటు ఇవ్వలేదు. ఈ అంశాలపై మాతో చర్చించలేదు.’’

అది మా పని కాదు: అజిత్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి

‘‘ఆ నివేదికను మేం ఆమోదించామా లేదా అని చెప్పడంగాని.. దానిపై కామెంట్ చేయడంగాని మా పనికాదు. నివేదిక ప్రజా పద్దుల సంఘానికి పోతుంది.. ఏ నిర్ణయం తీసుకోవాలో వాళ్లు చూసుకుంటారు.’’

మేం ప్రభుత్వ విధానాలను ప్రశ్నించలేదు: ఏకే పట్నాయక్, డిప్యూటీ కాగ్

‘‘ఆడిట్ రిపోర్టులో ఎక్కడా మేం ప్రభుత్వ విధానాలను ప్రశ్నించలేదు. వాటి అమలులో జరుగుతున్న లోపాలు, జాప్యాలను మాత్రమే ప్రశ్నించాం. విధానాలు ఎలా అమలవుతున్నాయో చూడడమే ఆడిట్ ఉద్దేశం. ఏ కారణం చేతయినా విధాన నిర్ణయాల్లో జాప్యం జరిగిందా అన్నది చూడడమే మా పని.’’

జీఎంఆర్‌కు అనుచిత లబ్ధి

ఢిల్లీ విమానాశ్రయ అభివృద్ధి ఉదంతంపై కాగ్
తద్వారా రూ.3,415 కోట్లు లాభపడ్డ జీఎంఆర్
కన్సార్షియానికి కారుచౌక భూ కేటాయింపులు
తద్వారా మరో రూ.1,63 లక్షల కోట్ల
ఆదాయార్జనకు అవకాశమిచ్చారు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునికీకరణ పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య ఒప్పందం అమలు తీరును కాగ్ తన నివేదికలో నిశితంగా విమర్శించింది. విమానాశ్రయంతో పాటు, రూ.1,63,557 కోట్ల ఆదాయం ఆర్జించే సామర్థ్యమున్న దాని తాలూకు భూమిని కూడా జీఎంఆర్ సంస్థ నేతృత్వంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) కన్సార్షియానికి ఈ ఒప్పందం కింద 60 ఏళ్ల పాటు కారుచౌకగా కట్టబెట్టారని ఆరోపించింది. ఈ మేరకు శుక్రవారం ఒక నివేదికను పార్లమెంటుకు కాగ్ సమర్పించింది. ఢిల్లీ విమానాశ్రయానికి కేటాయించిన 4,800 ఎకరాల్లో 240 ఎకరాలను షాపులు, మాల్స్ వంటి పూర్తి వాణిజ్య అవసరాలకు వాడుకోవచ్చంటూ కన్సార్షియానికి అనుమతిచ్చారు. సదరు భూమి వాణిజ్య విలువే రూ.24 వేల కోట్లుంటుంది. లీజు కాలంలో దాని ఆదాయార్జన సామర్థ్యం రూ.1,63,557 కోట్లని జీఎంఆర్ సంస్థే అంచనాలు కట్టింది’’ అని వివరించింది. పైగా విమానాశ్రయంలో ప్రయాణికులపై రూ.220 నుంచి రూ.1,200 దాకా అభివృద్ధి రుసుం (డీఎఫ్) విధింపును కూడా కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది. 

పౌర విమానయాన శాఖ, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) రెండూ బిడ్ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ కన్సార్షియానికి ఇందుకు అనుమతులిచ్చాయని ఆరోపించింది. తద్వారా డీఎఫ్ రూపంలో జీఎంఆర్ ఏకంగా రూ.3,415.35 కోట్లు వసూలు చేసుకుని అనుచిత లబ్ధి పొందిందని వివరించింది. పైగా ఈ మొత్తాన్ని విమానాశ్రయ నిర్వహణ వ్యయంగా సంస్థ వాడుకుని మరింతగా లాభపడిందని పేర్కొంది. ‘‘దీన్ని అనుమతించే పక్షంలో బిడ్డింగ్ దశలోనే దరఖాస్తుదారులందరికీ ఈ విషయాన్ని తెలిపి ఉండాల్సింది. కానీ ఒప్పందంలో ఎక్కడా దీన్ని పేర్కొనలేదు’’ అంటూ ఆక్షేపించింది. పైగా, ‘‘4,70,179 చదరపు మీటర్లలో నిర్మాణాలు చేపడతామని ప్లాన్‌లో పేర్కొని, అందుకు విరుద్ధంగా ఏకంగా 5,53,887 చదరపు మీటర్లలో సంస్థ నిర్మాణాలు చేపట్టింది. తద్వారా ప్రాజెక్టు వ్యయం 43.25 శాతం పెరిగిపోయింది’’ అని వివరించింది.

మేం ప్రయోజనాలేమీ పొందలేదు: జీఎంఆర్

‘‘విమానాశ్రయ ప్రాజెక్టు పనుల బిడ్డింగ్ పారదర్శకంగానే జరిగింది. కాగ్ ఆరోపించినట్లుగా ప్రభుత్వం నుంచి మా కన్సార్షియం సంస్థ ‘డీఐఏఎల్’కు ఎలాంటి ప్రయోజనాలూ లభించలేదు. రూ.1,63,557 కోట్ల విలువ చేసే స్థలాన్ని రూ.100 వార్షిక లీజుకే దక్కించుకున్నామన్న ఆరోపణలూ సరికావు. ఆ స్థలంపై మాకు అద్దె ఆదాయమూ రాదు. అమ్ముకోవడానికి అనుమతులూ ఉండవు. ఒక్క ఎకరం విలువను ఉజ్జాయింపుగా లెక్కగట్టి.. దాన్నే మొత్తానికి అన్వయించడం సరికాదు. ఇక ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ ఫీజు నిబంధననూ తర్వాతెప్పుడో చేర్చారన్న ఆరోపణలు సైతం అవాస్తవం.’’

రిలయన్స్‌కు రాసిచ్చారు

నిబంధనలను తోసిరాజని బొగ్గు మళ్లింపునకు అనుమతి: కాగ్
న్యూఢిల్లీ: ‘‘ససాన్ విద్యుత్కేంద్రం కోసం రిలయన్స్ పవర్ లిమిటెడ్‌కు కేటాయించిన క్యాప్టివ్ బొగ్గు గనుల్లోని మిగులు ఉత్పత్తిని ఆ సంస్థకు చెందిన ఇతర విద్యుత్కేంద్రాలకు మళ్లించుకునేందుకు కేంద్రం నిబంధనలకు విరుద్ధంగా అనుమతించింది. దాంతో రిలయన్స్ రూ.29,033 కోట్ల మేరకు లబ్ధి పొందింది’’ అని కాగ్ పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా బిడ్డింగ్ అనంతరం అనుచితంగా రిలయన్స్‌కు రాయితీలివ్వడమే ఇందుకు కారణమంటూ తప్పుబట్టింది. అల్ట్రా మెగా విద్యుత్ ప్రాజెక్టులపై శుక్రవారం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ‘‘ససాన్‌లో ఉత్పత్తయ్యే విద్యుత్ టారిఫ్ యూనిట్‌కు రూ.1.196 మాత్రమే. కానీ ఇప్పుడు దాని తాలూకు అదనపు బొగ్గును తన యాజమాన్యంలోని చిత్రాంగి విద్యుత్కేంద్రానికి రిలయన్స్ తరలిస్తోంది. చిత్రాంగి విద్యుత్‌ను యూనిట్‌కు రూ.2.45-3.702 దాకా అమ్ముకుంటోంది. తద్వారా భారీగా లాభపడుతోంది’’ అంటూ వివరించింది. పైగా, ‘‘ససాన్ కోసం రిలయన్స్‌కు రెండు బొగ్గు బ్లాక్‌లు కేటాయించారు. ఇప్పుడు దాని విజ్ఞప్తి మేరకు ఎన్‌టీపీసీ అధీనంలోని ఒక బొగ్గు గనిని వెనక్కు తీసుకుని మరీ కట్టబెడుతున్నారు’’ అంటూ ఆక్షేపించింది. ఈ కేటాయింపును పునఃసమీక్షించాలని సూచించింది.

అవన్నీ తప్పులే: రిలయన్స్ పవర్

‘‘కాగ్ వేసిన అంచనాలన్నీ తప్పులు. మాకు ఎలాంటి అనుచిత లబ్ధీ చేకూరలేదు. ససాన్, చిత్రాంగి ప్రాజెక్టుల మధ్య భిన్నమైన టారిఫ్‌లను చూసి కాగ్.. రిలయన్స్ పవర్‌కు అనుచిత లబ్ధి చేకూరిందని చెబుతోంది. ఇది సమంజసం కాదు. బొగ్గు వనరు ఒకటే అయినప్పటికీ కూడా ఏ రెండు ప్రాజెక్టులూ ఒకే రకమైన టారిఫ్‌ను అమలు చేయలేవు.’’

కేటాయింపులు పారదర్శకమే: మొయిలీ

‘‘రిలయన్స్ పవర్‌కు చేసిన బొగ్గు గనుల కేటాయింపంతా పారదర్శకంగానే జరింది. ఎక్కడా అక్రమాలు లేవు. ఇదంతా తెరిచిన పుస్తకం’’.

వైఎస్సార్‌సీపీకి ఆదరణపై అఖిలేష్ ఆరా!


ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు, ఆ పార్టీకి దక్కుతున్న విసృ్తత ప్రజాదరణపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రత్యేకంగా ఆరా తీశారు. మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ శుక్రవారం లక్నోలో అఖిలేష్‌ని కలిశారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తోందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని తనకు సమాచారం అందిందంటూ అఖిలేష్ ఈ సందర్భంగా చెప్పినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, ఫలితాల గురించి ఎప్పటికప్పుడు తాను తెలుసుకున్నానని చెబుతూ ఇతర పార్టీల స్థితిగతులేమిటని అడిగినట్టు తెలుస్తోంది. యూజీసీ హిందీ భాషా అమలు కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న యార్లగడ్డ లక్నోలోని బాబాసాహెబ్ అంబేద్కర్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో హిందీ అమలును పర్యవేక్షించడానికి వెళ్లారు. 

స్కాముల పుట్ట యూపీఏ!

ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే యూపీఏ చిత్తుగా ఓడిపోవచ్చన్న సర్వే మీడియాలో గుప్పుమన్న రోజే... ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చడంద్వారా యూపీఏ ప్రభుత్వం ఖజానాకు 3 లక్షల 80 వేల కోట్ల రూపాయల నష్టం కలిగించిందన్న దిగ్భ్రాంతికర వాస్తవాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) దేశ ప్రజల ముందుంచింది. ఆ సంస్థ పార్లమెంటుకు శుక్రవారం సమర్పించిన మూడు నివేదికలనూ చూస్తే యూపీఏ పుట్టలో ఇంకెన్ని స్కాములున్నాయోనన్న సందేహం కలుగుతుంది. ఇప్పటికే లక్షా 76 వేల కోట్ల రూపాయల 2జీ స్పెక్ట్రమ్ స్కాం, రూ.70,000 కోట్ల కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం, ఆదర్శ్ హౌసింగ్, టట్రా ట్రక్కుల స్కాంలు యూపీఏ సర్కారును ఊపిరాడనివ్వకుండా చేస్తుంటే ఇప్పుడు కాగ్ బయటపెట్టిన కొత్త కుంభకోణాలు వాటన్నిటినీ తలదన్నాయి. 

ఇందులో బొగ్గు స్కాం విలువే లక్షా 85 వేల కోట్ల రూపాయలు. గత ఏడాది మార్చి వరకూ వివిధ ప్రైవేటు సంస్థలకు ఎలాంటి బిడ్డింగ్ ప్రక్రియనూ పాటించకుండా బొగ్గు క్షేత్రాలు కేటాయించడంవల్ల ఈ నష్టం సంభవించిందని కాగ్ నివేదిక చెబుతోంది. ఈ స్కాంలో టాటా, నవీన్ జిందాల్, ఎస్సార్, ఆర్సెలర్, వేదాంత తదితర సంస్థలు లబ్ధి పొందాయన్నది నివేదిక సారాంశం. 

అలాగే, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి కోసం జీఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (డయల్)కు రూ.24,000 కోట్ల విలువైన భూముల్ని కట్టబెట్టి అనుచితమైన లబ్ధిచేకూరేలా పౌర విమానయాన శాఖ వ్యవహరించిందని, దీనివల్ల రాగల 58 ఏళ్లలో దాన్నుంచి లక్షా 63వేల 557 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, అందులో డయల్ వాటా రూ. 88,337 కోట్లని కాగ్ లెక్కేసింది. డయల్‌లో జీఎంఆర్‌తోపాటు భాగస్వామిగా ఉన్న ఎయిర్‌పోర్ట్ అథారిటీకి 26 శాతం వాటా మాత్రమే ఉంది. ఇక మూడో నివేదిక రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉన్న ఒక పవర్ ప్రాజెక్టుకు సంబంధించింది. దానికి కేటాయించిన బొగ్గు క్షేత్రాలనుంచి అదే సంస్థ ఆధ్వర్యంలోని మరో పవర్ ప్రాజెక్టుకు బొగ్గు మళ్లించడానికి అనుమతించినందువల్ల రిలయన్స్ రూ. 29,033 కోట్ల రూపాయల లబ్ధిపొందిందని చెబుతోంది. 

ఈ నివేదిక చెప్పిన నిజాలే ఇంత దిగ్భ్రాంతిగొలుపుతుంటే అది చెప్పకుండా వదిలేసిన నిజాలు, ఇంకా పరిగణనలోకి తీసుకోవాల్సిన మరికొన్ని వ్యవహారాలు కలుపుకుంటే స్కాంల విలువ ఇంకెన్ని లక్షల కోట్లుంటుందో చెప్పడం సామాన్యులకు సాధ్యంకాదు. వాస్తవానికి కాగ్ ముసాయిదా నివేదిక ఒక్క బొగ్గు స్కాం విలువే రూ. 10 లక్షల కోట్లని గత ఏడాది మార్చిలో వెల్లడించింది. అయితే, పబ్లిక్‌రంగ సంస్థల ఆడిటింగ్ వ్యవహారాలన్నీ వేరుగా నిర్వహిస్తారు గనుక ఆ సంస్థల లెక్కల్ని ఇందులో చూపించడం సరికాదని బొగ్గు మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తంచేయడంతో కాగ్ ప్రైవేటు సంస్థల లావాదేవీల శోధనకే పరిమితమైంది. అంతేకాదు... చాలా సంస్థలు తమ ‘ప్రాజెక్టు ప్లాన్’లను అధిక ధరకు అమ్ముకోవడం ద్వారా కేటాయించిన బొగ్గు క్షేత్రాలను వేరొకరికి బదిలీచేశాయని మీడియాలో ఆమధ్య కథనాలు వెలువడ్డాయి. ఈ తరహా చీకటి లావాదేవీలు బయటికొస్తే కాగ్ ఇప్పుడు చెబుతున్న రూ. 1.85 లక్షల కోట్లు అనేది చాలా చిన్న మొత్తంగా మిగిలిపోయే ప్రమాదముంది.

మౌలిక సదుపాయాల రంగం బలహీనంగా ఉందన్న ఉద్దేశంతో సిమెంట్, విద్యుత్తు, ఉక్కు రంగాలను ప్రోత్సహించడం కోసం ఆయా పరిశ్రమల సొంత అవసరాలు తీర్చుకోవడానికి బొగ్గు క్షేత్రాలను కేటాయించామని ప్రభుత్వం అంటోంది. ఆ బొగ్గును వాణిజ్య అవసరాలకోసం ఉపయోగించరాదనే షరతు ఉన్నందువల్ల మార్కెట్ రేటు ప్రకారం లెక్కేసి భారీగా నష్టం వచ్చిందని చెప్పరాదని కూడా వాదిస్తోంది. ప్రభుత్వ వాదన నిజమే అనుకున్నా...దాన్ని వేలం ద్వారా కేటాయించడానికి ప్రభుత్వానికున్న అభ్యంతరమేమిటి? పైగా వేలం ద్వారానే బొగ్గు గనుల కేటాయింపు జరగాలని 2004లో స్వయంగా మన్మోహనే అభిప్రాయపడ్డారు. 

అందుకు అనుగుణమైన చట్టం చేయడానికి ఆనాటినుంచి ఈనాటి వరకూ పీఎంఓ ఏదో సాకు చూపి అడ్డుకుంటూనే ఉన్నది. ఇప్పుడు కాగ్ నివేదిక ఈ విషయంలో ప్రధానిని నేరుగా తప్పుపట్టకపోవచ్చుగానీ అది చేసిన విమర్శలన్నీ ఆయనకే వర్తిస్తాయి. ఎందుకంటే, బొగ్గు మంత్రిత్వ శాఖ వ్యవహారాలను 2006-09మధ్య నేరుగా ఆయనే పర్యవేక్షించారు. ఇప్పుడున్న విధానం ఎంత లోపభూయిష్టమైనదో రిలయన్స్ సంస్థకు లబ్ధి చేకూర్చిన వ్యవహారం చూస్తేనే అర్ధమవుతుంది. ఆ సంస్థ ఆధ్వర్యంలోని ససాన్ పవర్ ప్రాజెక్టు ఉత్పత్తిచేసే 3,960 మెగావాట్ల విద్యుచ్ఛక్తికి రెండు బొగ్గు క్షేత్రాలను తొలుత కేటాయించారు. ఆ ప్రాజెక్టుకు అది సరిపోతుందని నిపుణులు అంచనావేశారు. అయినా, ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీకి చెందిన బొగ్గు క్షేత్రాన్ని లాక్కొని, దాన్ని ససాన్ పవర్ ప్రాజెక్టుకు కట్టబెట్టారు. 

ఆ తర్వాత అక్కడ మిగులు బొగ్గు ఉందంటూ రిలయన్స్ తన ఆధ్వర్యంలోనే ఉన్న చిత్రాంగి పవర్ ప్రాజెక్టుకు దాన్ని తరలించడం ప్రారంభించింది. సరైన చట్టాలు, తగిన నిబంధనలూ ఉంటే ఇలా గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టం చేకూర్చడం సాధ్యమయ్యేది కాదు. బొగ్గు అపురూపమైన ప్రకృతి వనరు. వచ్చే అయిదేళ్లలో దేశంలో అదనంగా ఉత్పత్తి చేయాలనుకుంటున్న 76,000 మెగావాట్ల విద్యుత్తుకు అది ప్రధాన ఆధారం. దేశ భవిష్యత్తుతో ఇంతగా ముడిపడి ఉన్న ఈ వనరును బాధ్యతారహితంగా, ఇష్టానుసారంగా ఎవరెవరికో కట్టబెట్టడమంటే అది ఘోరమైన నేరం. ఈమధ్య అన్నా బృందం తనపై అవినీతి ఆరోపణలు చేసినప్పుడు ప్రధాని ఎంతగానో నొచ్చుకున్నారు. మరి కాగ్ నివేదికకు ఆయన జవాబేమిటి? యూపీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐలాంటి జేబు సంస్థ ద్వారా కాక, ఒక స్వతంత్ర సంస్థ దర్యాప్తునకు అంగీకరించాలి. నిజానిజాలేమిటో ఈ దేశ ప్రజలను తెలుసుకోనివ్వాలి. 

Govt slams CAG coal block loss report; BJP asks PM to quit

Written By news on Friday, August 17, 2012 | 8/17/2012

జగన్ ఓ శక్తిగా అవతరించనున్నారు: అక్బర్

ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాల్లో జగన్‌ ఒక శక్తిగా అవతరించనున్నారని ప్రముఖ పాత్రికేయులు ఎంజె అక్బర్‌ అన్నారు. నీల్సన్‌ సర్వేను ఉదహరించిన అక్బర్‌.. ఇప్పుటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే అధికారంలోకి వస్తుందన్నారు.. రాష్ట్రంలో కాంగ్రెస్కు నాలుగైదు సీట్లకు మించి రావన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయన్న అక్బర్‌.. చంద్రబాబునాయుడు ప్రతిపక్షనేతగా ఉండే అర్హత కోల్పోయారన్నారు. రెండు కళ్ల ధోరణి ఉన్న నేతలకు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

వైఎస్ ఆశయాన్ని నెరవేర్చండి: బాలరాజు

పోలవరం: పోలవరం నిర్వాసితులకు మెరుగైన అర్ అండ్‌ అర్‌ ప్యాకేజీ అమలు చేసి న్యాయం చేయడం ద్వారా వైఎస్ ఆశయాన్ని నెరవేర్చాలని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ముఖ్యమంత్రిని కోరారు. ప్రాజెక్టు నిర్వాసితులందరిలోనూ చిరునవ్వు చూడాలన్నదే వైఎస్ కోరిక అని.. గిరిజనేతరులకు కూడా కనీసం ఒక ఎకరం భూమినైనా ఇవ్వాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సిఎం కిరణ్‌ పరిశీలించిన తర్వాత కొత్త దేవరగొందిలో జరిగిన నిర్వాసితుల సభలో ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడారు. పోలవరం నియోజకవర్గంలోని సమస్యలను ప్రస్తావిస్తూ సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డికి బాలరాజు మొమోరాండం ఇచ్చారు. 

'విద్యార్ధుల సమస్యల పరిష్కారంలో విఫలం'

రాష్ర్టంలోని 4 లక్షల మంది హస్టల్ విద్యార్ధుల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారంటూ గత నెల రోజులుగా ఏఐఎస్ఎఫ్ అధ్వర్యంలో విద్యార్థులు ఉద్యమం చేస్తున్నా సర్కార్ స్పందించలేదు. దీనిపై మండిపడ్డ విద్యార్ధులు నగరం లోని ఇందిరా పార్క్ వద్ద ఆందోళనలకు దిగారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలమంది విద్యార్థులు ఉదయమే ఇందిరా పార్కుకు చేరుకున్నారు. హాస్టల్‌ నిద్ర పేరుతో ముఖ్యమంత్రి ప్రచారం చేసుకుంటున్నారు తప్ప... సమస్యల్ని గుర్తించడంలేదని విద్యార్థులు భగ్గుమన్నారు. మెస్‌ ఛార్జీలను 1500 రూపాయలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సెక్రటేరియట్‌ ముట్టడికి బయల్దేరిన హాస్టల్‌ విద్యార్థుల్ని మధ్యలోనే పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. వామపక్ష నేతలు కూడా ఈ ధర్నా లో పాల్గొన్నారు. 

మహానేత పథకాల్ని నీరుగారుస్తోంది: గడికోట

కాంగ్రెస్ ప్రభుత్వం... మహానేత సంక్షేమ పథకాల్ని నీరుగారుస్తూ, ప్రజలమీద పన్నుల భారం మోపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ప్రజల మీద పైసా పన్నుభారం మోపకుండా సంక్షేమ కార్యక్రమాలను దివంగతనేత వైఎస్సార్‌ అమలు చేశారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం- మూడునెలలకోసారి విద్యుత్ సర్‌చార్జీల పేరుతో ఎడాపెడా పన్నులు వసూలు చేస్తోందని శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం విద్యుత్‌ సర్‌చార్జీలు వేస్తూ, నాణ్యమైన కరెంట్‌ను సరఫరా చేయలేకపోతోందని శ్రీకాంత్‌రెడ్డి తప్పుబట్టారు.

Srikanth Reddy Press Meet 17th Aug 2012

స్వాతంత్ర్యం వచ్చాక ఇలాంటి చేతగాని ప్రభుత్వాన్ని ఇంత వరకూ ......

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలను కిరణ్ ప్రభుత్వం అమలు చేస్తుందో లేదో అన్న ఆందోళన ప్రజల్లో ఉందని టీఆర్ఎస్ నేత నాయిని నర్సింహరెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ఇలాంటి చేతగాని ప్రభుత్వాన్ని ఇంత వరకూ చూడలేదని ఆయన అన్నారు. కనీసం అసెంబ్లీ సమావేశాలు పేట్టే ధైర్యం కూడా ఈ ప్రభుత్వానికి లేదని నాయిని మండిపడ్డారు. రాష్ట్రం కాలిపోతుంటే ఇందిరమ్మ బాట అని సీఎం కిరణ్ తిరుగుతున్నారని ఆయన అన్నారు. ఇంకో 13, 14 నెలల్లో కాంగ్రెస్ కథ ముగుస్తుందని నాయిని జోస్యం చెప్పారు.

Balaraju demand on Polavaram R&R package

Konda Murali approach to High Court

Konda Murali approach to High Court

అనర్హతను సవాల్ చేసిన కొండా మురళి

ఎమ్మెల్సీగా తనను అనర్హుడిగా ప్రకటించడాన్ని కొండా మురళి హైకోర్టులో సవాల్‌ చేశారు. మండలి ఛైర్మన్‌ ఆదేశాల్ని ఆయన తన సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనర్హత విషయంలో ఛైర్మన్‌ కాంగ్రెస్‌ అధిష్టానం చెప్పినట్టు వ్యవహరించారని కొండా మురళి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి కొండా మురళి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.... ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ శాసన మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ పిటిషన్‌ పరిశీలించిన మండలి ఛైర్మన్‌ చక్రపాణి .ఎమ్మెల్సీ కొండా మురళిని అనర్హుడిగా ప్రకటించారు.

India Today-Nielsen mood of the Nation Poll gives NDA edge over

రాజీనామాపై నోరుమెదపని కాంగ్రెస్

మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాపై ముఖ్యమంత్రి నిర్ణయంలో జాప్యంపై కాంగ్రెస్‌ పార్టీ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు. ధర్మానను సమర్థిస్తే పరోక్షంగా జగన్‌పై ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించినట్లు అవుతుందని, లేకుంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు తప్పుచేసినట్లే ఒప్పుకున్నట్లు అవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

శుక్రవారం ఉదయం 'సాక్షి' హెడ్‌లైన్‌షోలో ఇదే తరహా చర్చ జరిగింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ భానుప్రసాద్‌ మాట్లాడుతూ ధర్మానలాగే మోపిదేవికి మంత్రులు బాసటగా నిలిచారని చెప్పుకొచ్చారు. అయితే న్యాయసహాయం విషయంలో మోపిదేవిని ఎందుకు మినహాయించారనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు.

ఇదే విషయంలో జగన్‌పై కేసులు నమోదు చేసినప్పుడు, అరెస్ట్ చేసినప్పుడు నోరు మెదపని మంత్రులు.. ఇప్పుడు మాట్లాడుతుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారని వైఎస్సాఆర్‌సిపీ వ్యాఖ్యానించింది. ధర్మాన అంశం కాంగ్రెస్‌కు ధర్మ సంకటమని బిజెపి నేత లక్ష్మణ్‌, సీనియర్‌ జర్నలిస్టు సీతారామరాజు అభిప్రాయపడ్డారు.

చంద్రబాబునాయుడుకు గుణపాఠం చెబుతాo

కరీంనగర్ : వర్గీకరణ పేరుతో ఎస్సీలను విడదీస్తే చంద్రబాబునాయుడుకు గుణపాఠం చెబుతామని కరీంనగర్ జిల్లా మాల మహానాడు కార్యకర్తలు హెచ్చరించారు. పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టేందుకు సహకరిస్తామన్న టీడీపీ అధినేత ప్రకటనను వారు తప్పుపట్టారు. బాబు ప్రకటనకు నిరసనగా మాలమహానాడు కార్యకర్తలు శుక్రవారం టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేసి చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఫర్నీచర్ ను ధ్వంసంచేశారు. ఫ్లెక్సీలు, పార్టీ జెండాలను తొలగించి తగులబెట్టారు.

వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీదే విజయం

అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీని ప్రజలు విశ్వసించటం లేదని చెప్పటానికి ఇండియా టుడే ఎసీ నీల్సన్ సర్వే నిదర్శనమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ఘనవిజయం కట్టబెట్టాలని ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారని ఆమె చెప్పారు. అందుకే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ 23 నుంచి 27 వరకూ లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందని సర్వేలో వెల్లడైందని పద్మ తెలిపారు.

nilson survey

సీఎం కిరణాలతో 26 గ్రామాల్లో చీకట్లు

ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండల పరిధిలో 26 గిరిజన గ్రామాల్లో చీకట్లు అలుముకున్నాయి. ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ దిగేందుకు కరెంట్ తీగలు అడ్డు వస్తున్నాయనే కారణంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నిన్న ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

అప్పటినుంచి ఈ గ్రామాలన్నీ అంధకారంలోనే మగ్గుతున్నాయి. విద్యుత్ పునరుద్దరణపై స్థానిక ఏఈని అడిగితే తాను ఏమీ చేయలేనని పై అధికారుల ఆదేశాల మేరకే సరఫరా నిలిపివేశామని చెబుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచినీరు కూడా లేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో ఈ విషయాన్ని వారు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు దృష్టికి తీసుకువెళ్లారు.

ప్రభుత్వ నిర్ణయాలకు, జగన్‌కు ఎలాంటి సంబంధమూ లేదు


హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ తన పరిధి దాటి అత్యుత్సాహం చూపుతూ కాంగ్రెస్ ప్రతిష్టను మంటగలుపుతోందని మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యక్తిగతంగా ఏ తప్పూ చేయలేదన్నారు. గతంలో ఆయన మంత్రిగా ఉన్న రెవెన్యూశాఖ నుంచి వచ్చిన జీఓలకు కేబినెట్ సమష్టి బాధ్యతేతప్ప ధర్మానకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. జీవన్‌రెడ్డి గురువారం సీఎల్పీ కార్యాలయం ముందు మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వంలో ధర్మానేగాక.. ఏ మంత్రీ, చివరకు ముఖ్యమంత్రీ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలుండదని, కేబినెట్‌దే తుది నిర్ణయమని బిజినెస్ నిబంధనలు స్పష్టంచేస్తున్నా సీబీఐ దాన్ని పట్టించుకోకుండా ముందుకెళ్లడం విచిత్రమన్నారు. పారిశ్రామికాభివృద్ధికోసం ఆయా సంస్థలకు రాయితీలు కల్పించడం ప్రజాస్వామిక ప్రభుత్వాల్లో కేబినెట్ విధివిధానాల్లో భాగమని, దానిని ఒక మంత్రో, సీఎమ్మో వ్యక్తిగత నిర్ణయాలుగా పరిగణించేందుకు వీల్లేదన్నారు.

వాన్‌పిక్‌కుగానీ, మరే సంస్థకైనాగానీ భూముల కేటాయింపు అంశంలో మంత్రులో, వైఎస్ రాజశేఖరరెడ్డో వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోలేదన్నారు. ‘ధర్మాన కేబినెట్ మంత్రిగా ఉన్నందున చార్జిషీట్ దాఖలుకు ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. కానీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసి ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతిని సీబీఐ కోరుతోందంటే.. సర్కారు అనుమతివ్వకున్నా కోర్టు ద్వారా పొందేందుకే ముందుగా చార్జిషీట్ వేసినట్లు కనిపిస్తోంది’ అని చెప్పారు. ‘ఈ కేసులో సీబీఐ పక్షపాతధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలకు, జగన్‌కు ఎలాంటి సంబంధమూ లేదు.

అయినా సీబీఐ వేరే లక్ష్యంతో వెళుతున్నట్లు స్పష్టమవుతోంది. మంత్రులకు న్యాయసహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతోనే జీఓల్లో ఎలాంటి తప్పు లేదని అంగీకరించినట్లయింది. కానీ కేబినెట్ నిర్ణయాలకు వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని దర్యాప్తు సాగడం విచారకరం’’ అని అన్నారు. హైకోర్టులో ప్రైవేటుకేసు దాఖలై న్యాయస్థానం పలుమార్లు కౌంటర్ వేయాలని అడిగినప్పుడే ప్రభుత్వం మేలుకుని వాదన వినిపించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదన్నారు. జీఓలను ఏ పరిస్థితుల్లో విడుదల చేశారో న్యాయస్థానానికి తెలియచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.

వైఎస్సార్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గొమాంగో


శ్రీకాకుళం జిల్లా కొత్తూరు(ప్రస్తుతం పాలకొండ నియోజకవర్గం) మాజీ ఎమ్మెల్యే జె.మినాథి గొమాంగో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర పాలక మండలి సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి సమక్షంలో గొమాంగోతోపాటు అనుచరులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా గొమాంగో మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరె డ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రస్తుత పాలకుల వల్ల నీరుగారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నవీన్ రాజీనామాకు ఆమోదం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ నేమూరి నవీన్‌గౌడ్ రాజీనామాను ఆమోదించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. వ్యక్తిగత కారణాలతో నవీన్ చేసిన రాజీనామాను పార్టీ అధ్యక్షుడు ఆమోదించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.

ఏపీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు 23-27 లోక్‌సభ సీట్లు.ఎన్నికలొస్తే యూపీఏ ఇంటికే! ఇండియా టుడే-నీల్సన్ సర్వేలో వెల్లడి

- మన్మోహన్ సర్కారుపై ప్రజాగ్రహం
- ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే యూపీఏ ఓటమి తథ్యం
- యూపీఏకు 171-181 సీట్లు మించకపోవచ్చు
- క్రమంగా బలం పుంజుకుంటున్న ఎన్డీఏ
- ఎన్డీఏకు 195-205 సీట్లు రావొచ్చు
- ఏపీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు 23-27 లోక్‌సభ సీట్లు రావొచ్చు


న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతి, శాంతిభద్రతల క్షీణత, ఆర్థిక వృద్ధి మందగమనంతో దేశాన్ని తిరోగమనంలోకి నెట్టేసిన మన్మోహన్ సర్కారును గద్దె దింపేందుకు దేశమంతా సిద్ధమవుతోంది. సుపరిపాలన అందిస్తుందన్న ఉద్దేశంతో 2009లో వరుసగా రెండోసారి అధికారం కట్టబెడితే అధ్వాన్న పనితీరుతో సామాన్యులను ఇక్కట్లకు గురిచేస్తున్న యూపీఏ ప్రభుత్వాన్ని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సాగనంపి ఎన్డీఏకు మద్దతు పలుకుతామనే సంకేతాలిస్తోంది. ముఖ్యంగా గత మూడేళ్లలో కాంగ్రెస్‌పై ప్రజా విశ్వాసం వేగంగా సన్నగిల్లుతోందని ఇండియా టుడే-నీల్సన్ దేశవ్యాప్తంగా చేపట్టిన తాజా సర్వేలో వెల్లడైంది. 2009తో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య భారీగా తగ్గనుందని సర్వే అంచనా వేసింది. అదే సమయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బలం పుంజుకుంటుందని అధ్యయనం పేర్కొంది.
ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే యూపీఏ ఓటమిపాలవుతుందని ఇండియా టుడే అంచనా వేసింది. 2009లో యూపీఏకు 259 సీట్లు ఉండగా ఆ సంఖ్య 171-181కి పడిపోవచ్చని పేర్కొంది. మరోవైపు ఎన్డీఏ మాత్రం 2009లో ఉన్న 159 సీట్ల నుంచి 195-205 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని వివరించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 23 నుంచి 27 లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది.

ఎవరిని ఉత్తమ ప్రధానిగా భావిస్తారు?, మన్మోహన్ ప్రజల అంచనాలను అందుకున్నారా? మంత్రుల పనితీరు ఎలా ఉంది?, కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎవరిని ప్రధాని అభ్యర్థులుగా భావిస్తారు? వంటి ప్రశ్నల ఆధారంగా ఈ ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. మొత్తం 19 రాష్ట్రాల్లోని 125 పార్లమెంటు నియోజకవర్గాల్లో జూలై 6 నుంచి 20వ తేదీ మధ్య అర్హులైన ఓటర్లలోని 15,827 మంది నుంచి ఈ వివరాలను రాబట్టారు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున సర్వే సాగింది.

బీజేపీతోనే ఆర్థిక సంస్కరణలు సాధ్యం.
ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్థిక సంస్కరణలు చేపడుతుందని 66 శాతం మంది అభిప్రాయపడగా 47 శాతం మంది మాత్రం ఆర్థిక సంస్కరణల కోసం కాంగ్రెస్ సగటు ప్రయత్నాలే చేస్తోందని అభిప్రాయపడ్డారు. అలాగే ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరు అన్న ప్రశ్నకు ఎక్కువ మంది గుజరాత్ సీఎం నరేంద్రమోడీకే పట్టం కట్టారు. ఒకవేళ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే నరేంద్ర మోడీ బీజేపీ ప్రధాని అభ్యర్థి అవుతారా? అని అడగ్గా 55 శాతం మంది అవునని, 25 శాతం మంది కాదని సమాధానం ఇచ్చారు.అలాగే ఉత్తమ ప్రధాని ఎవరు కాగలరన్న ప్రశ్నకు 21 శాతం మంది నరేంద్ర మోడీవైపు మొగ్గు చూపగా 10 శాతం మంది రాహుల్ గాంధీకి ఓటేశారు. అద్వానీకి 8 శాతం, మన్మోహన్, సోనియాలకు 6 శాతం చొప్పున, ములాయం, మాయావతిలకు 4 శాతం చొప్పున, జయలలిత, మమతా బెనర్జీలకు 2 శాతం ఓటేశారు. అలాగే ఒకవేళ ఎన్డీఏ అధికారంలోకి వస్తే నితీశ్ కుమార్ బీజేపీయేతర ప్రధాని అభ్యర్థిగా నిలుస్తారని 26 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో 2009 లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏకు 33 సీట్లురాగా ఎన్డీఏకు ఒక్క సీటు కూడా రాలేదు. ఇతరులకు 9 సీట్లు వచ్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో యూపీఏకు కేవలం 3 నుంచి 8 సీట్లు రావొచ్చని, ఎన్డీఏకు ఒక్క సీటు కూడా రాదని సర్వేలో తేలింది. ఇతరుల జాబితాలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి 23 నుంచి 27 సీట్లు, మిగిలిన పార్టీలకు 12 సీట్ల వరకూ రావొచ్చని అధ్యయనంలో వెల్లడైంది.

Sakshi Vedika With YSRCP Leader Rehman 15th Aug 2012

Written By news on Thursday, August 16, 2012 | 8/16/2012

ముంచాలనుకున్న కాంగ్రెస్ మునుగుతోంది

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదవి చేపట్టిన ముహూర్తబలం బాగోలేదో.. అసలు పదమూడో శాసనసభ ముహూర్తమో బాగోలేదో కాని..రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పటివరకు అరిష్టాలనే ఎదుర్కొంటోంది.క్యాబినెట్ లో మంత్రుల మధ్య గొడవలు అయితే అది ఒకరకంగా తేల్చుకోవచ్చు. కాని ఇదొక చిత్రమైన వ్యవహారం .ఎప్పుడు ఏ మంత్రి పై ఏ కేసు వచ్చి పడుతుందో తెలియని పరిస్థితిగా ఉంది. ఒక తప్పు చేసి, వంద తప్పులు కాయవచ్చనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఒక తప్పుకు వంద తప్పులు వచ్చి మీద పడుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు పై సిబిఐ ఛార్జీషీట్ లో అభియోగం నమోదవడం అంటే కచ్చితంగా అది కాంగ్రెస్ కు కళంకమే. అదేదో రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగింది అని చెప్పి
తప్పుకుందామని ఇంతకాలం చేసిన డ్రామాలకు తెరవేయక తప్పదు.సిబిఐ ని అడ్డం పెట్టుకుని కద నడుపుదామనుకుంటే అది ఎప్పుడో అప్పుడు అడ్డం తిరగక తప్పదని కూడా తేలింది.శాసనసభ ఉప ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ నేతలు ఎన్ని మాటలు చెప్పారు! మంత్రులెవరూ వై.ఎస్. హయాంలో జరిగిన వాటికి బాధ్యులు కారని, మంత్రివర్గ సమష్టి నిర్ణయాల మేరకే జిఓలు విడుదల అయ్యాయని, తెర వెనుక లాలూచీ
వ్యవహారాలతో తమకు సంబంధం ఏమిటని వాదించారు. స్వయంగా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ తో సహా పలువురు ఇదే వాదనను వినిపించి అదేదో వై.ఎస్., ఆయన కుమారుడు జగన్ కలిసి సచివాలయంలో కూర్చుని పంచుకున్నారు తప్ప తమకు ఎలాంటి పాత్ర లేదని జనాన్ని నమ్మించడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. ఆయా వ్యవస్థలు తమ చేతిలో ఉంటాయి కదా అని కధ ఆరంభించినప్పుడే మామూలు జనం
ఆశ్చర్యపోయారు. వారికి ఉన్న కామన్ సెన్స్ కాంగ్రెస్ అధిష్టానానికిగాని, రాష్ట్ర నాయకత్వానికి గాని లేకపోయింది. అడ్డగోలు వాదనతో జగన్ ను మాత్రం ఇరికించి తాము సురక్షితంగా బయటపడిపోయి కడిగిన ముత్యాల వలే కనిపించాలని తాపత్రయపడ్డారు.కాని అన్ని వేళలూ ఒకేరకంగా ఉండవు కదా.ముందు మోపిదేవి వెంకటరమణరావు జైలుకు వెళ్లవలసి వచ్చింది. ఆయన జైలులో ఉండగానే ధర్మాన మీద ఛార్జీషీట్ నమోదైంది.ఒక మంత్రిని జైలుకు పంపిన సిబిఐ ధర్మాన జోలికి ఎందుకు వెళ్లలేదో తెలియదు.అంతవరకు దర్మాన అదృష్టవంతుడే.ఛార్జీషీట్ లో పేరు వచ్చాక మంత్రి ధర్మాన రాజీనామా నిర్ణయం సరైనదే. రాజీనామా పత్రం సమర్పించడంతో ఇప్పుడు బంతి కిరణ్ కోర్టులో పడింది. ఈ తలనొప్పి ఎందుకని దర్మాన రాజీనామాను వారించినట్లు ఉన్నారు. కాని ధర్మాన చేసిందే సరైనది.ఇప్పుడు ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర ప్రభుత్వం అయితే ధర్మాన రాజీనామాను ఆమోదించాలి.లేదా సిబిఐ చేసింది తప్పు అని ప్రకటించగలగాలి.అంతే తప్ప విధానా నిర్ణరయాలను సిబిఐ ఎలా తప్పు పడుతుందని ఇప్పుడు విలవిల లాడితే
ఏమి ప్రయోజనం?కాని ముఖ్యమంత్రికి ఆ ధైర్యం ఉంటుందా అన్నది సందేహం. కనుక ఆయన అధిష్టానం సలహా కోసం ఎదురు చూడవచ్చు. ఏది ఏమైనా ఈ మొత్తం ప్రక్రియలో తీవ్రంగా నష్ట పోయింది కాంగ్రెస్ పార్టీ,కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం.వేరే ఏ పని జరగనివ్వకుండా ఈ వ్యవహారాలే కాంగ్రెస్ ను సలిపివేస్తున్నాయి. ఈ ప్రభుత్వంలోని
మంత్రులపై వరసగా వస్తున్న కేసులు పరువు తీస్తున్నాయి.నిజానికి వాన్ పిక్ కేసులో ప్రభుత్వానికి జరిగిన నష్టం లేదు. ఆ మాటకు వస్తే సేకరించిన భూమి ఇంకా పూర్తిగా స్వాధీనమే కాలేదు. పైగా పెద్దగా అక్కడ దీనిపై వ్యతిరేకత లేదనడానికి నిదర్శనం స్వయంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిజాం పట్నం వెళితే ఒక్క స్థానికుడు కూడా
ఆయనకు మద్దతు ఇవ్వకపోవడమే పరిస్థితిని తెలియచెబుతుంది.చంద్రబాబు ఆ ప్రాజెక్టు వద్దని ఆయన చెప్పదలిచారా? భూములను వెనక్కి ఇచ్చివేయమని ఆయన అంటున్నారు. రైతులను తిరిగి డబ్బు వెనక్కి చెల్లించమని చంద్రబాబు చెప్పదలిచారా?లేక ఆ డబ్బు కూడా ఎగవేసి భూములు తీసుకోండని తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రి అనుభవం కలిగి, సంస్కరణవాదిగా చెప్పుకున్న చంద్రబాబు సలహా ఇస్తారా? ఏమో తెలియదు.రాష్ట్రానికి పెద్ద
ప్రాజెక్టు తెస్తామని సొంతడబ్బు ఖర్చు పెడితే అరెస్టు చేసిన చరిత్ర మన రాష్ట్రంలోనే ఉంటుందేమో.ఈ ప్రాజెక్టు ఏమవుతుందో తెలియదు. రెవెన్యూ మంత్రి దర్మాన ప్రసాదరావు భూముల కేటాయింపు జిఓలు జారీ చేశారు.ఎకరా భూమి కేటాయించాలన్నా మంత్రివర్గమే నిర్ణయించాలి. అలాంటిది ఒక్క దర్మాన మాత్రమే ఎలా చేస్తారు?అయితే
చకచకా అనేక జిఓలు ఇచ్చారని చెబుతున్నారు. ఒక ప్రాజెక్టు రావల్సినప్పుడు కొన్నిసార్లు పరపతి ఉపయోగపడే మాట నిజమే. అయితే ఈ వ్యవహారాలలో ఎక్కడా అవినీతి జరగలేదని సర్టిఫికెట్ ఇవ్వజాలం.ఆ మాటకు వస్తే ఇప్పుడు ఇన్ని కబుర్లు చెబుతున్న తెలుగుదేశం కు చెందిన ప్రముఖులతో సహా కాంగ్రెస్ తదితర రాజకీయ పక్షాల 
ప్రముఖులు పలువురు వాన్ పిక్ భాగస్వామి నిమ్మగడ్డ ప్రసాద్ నుంచి ఆర్ధిక లబ్ది పొందినవారే .అయినా ఆ కద వేరు.అంతదాకా ఎందుకు హైటెక్ సిటీ ప్రాజెక్టులో తొలి భవనం నిర్మించినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపైఅప్పటి కాంగ్రెస్ విపక్ష నేత పి.జనార్దనరెడ్డి ఎన్ని ఆరోపణలు చేశారో తెలియదా?ఎల్.అండ్ టికి టిడిపికి మద్య ఆర్ధిక
లావాదేవీలు నడిచాయని , అందువల్ల ప్రభుత్వ భూమిలో నిర్మించిన భూమి చదరపు అడుగు 2650కి అమ్ముకునే అవకాశం కల్పించారంటూ అనేక ఆరోపణలు గుప్పించారు. కాని ఆరోజు చంద్రబాబు చేసినదానిని రాజకీయాలకు అతీతంగా చూసినవారు ఎవరూ తప్పు పట్లలేదు. ఒక పెద్ద పరిశ్రమ వస్తుందని సంతోషించారు.ఆ తర్వాత రకరకాల ప్రాజెక్టులకు సంబంధించి భూములు కేటాయించిన చంద్రబాబుపైన కాంగ్రెస్ , ఆ తర్వాత ముఖ్యమంత్రి గా వచ్చిన రాజశేఖరరెడ్డిపై టిడిపి అనేక ఆరోపణలు చేస్తూ వచ్చాయి. అయినా ఇద్దరి హయాంలో పారిశ్రామిక ప్రగతికి పెద్దగా ఆటంకం కలగలేదనే చెప్పాలి. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత మారిన రాజకీయాలలో కాంగ్రెస్ అధిష్టానం అతి తెలివి తేటలనండి,లేదా తెలివి తక్కువతనం అనండి.. మాజీ మంత్రి శంకరరావుతో పిల్ వేయించడం , దానిలో టిడిపి జత కలవడం, హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశం ఇచ్చిన తీరు , ఆ తర్వాత సిబిఐ విచారణ జరుపుతున్న వైనం.. ఇవన్ని వివాదాస్పద అంశాలుగానే ఉన్నాయి.వై.ఎస్.జగన్ ను అరెస్టు చేయాలంటే ఎవరో ఒకరిని బలి చేయాలన్నట్లుగా మంత్రి మోపిదేవి ని అరెస్టు చేశారని భావించారు.జగన్ ను అరెస్టు చేసినప్పుడు సంబరపడిన కాంగ్రెస్ వర్గాలు ఉప ఎన్నికల తర్వాత నాలుక కరుచుకున్నాయి. ప్రతిపక్ష టిడిపి కి కూడా తల బొప్పి కట్టింది. దాంతో ఆ పార్టీ ప్రముఖ నేతలు జగన్ ఊసెత్తడానికే వెనుకాడే పరిస్థితి ఏర్పడింది. తాము ఎంత విమర్శిస్తే జగన్ కు అంత సానుభూతి వస్తోందన్న విషయం గ్రహించడానికి వీరికి చాలా సమయం పట్టింది.ఈ తరుణంలో మంత్రి దర్మానపై పిడుగుపడిన చందంగా ఛార్జీషీట్ వచ్చి పడింది. గత ఉప ఎన్నికలలో తన సొంత సోదరుడుపైనే హోరాహోరా పోరాడి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ మెజార్టీని బాగా తగ్గించగలిగానని,దానికి ప్రతిఫలంగా తనకు కేసు చుట్టుకుందని ఆయన వాపోతుండవచ్చు.సుప్రింకోర్టు నోటీసు ఇచ్చినప్పుడు న్యాయసాయం ఖర్చుల జిఓ పొందగలిగాను కదా అని అన్న సంతోషం దక్కకముందే ధర్మానకు ఈ దెబ్బ తగిలింది.1989లో తొలిసారి ఎన్నికైన ఈయన నేదురుమల్లి,కోట్ల క్యాబినెట్లలో సహాయ మంత్రిగా ఉండేవారు. 1999లో రెండోసారి విపక్షంలో పనిచేసే అవకాశం రావడం ఈయనకు
కలిసి వచ్చింది. శాసనసభలో టిడిపి ప్రభుత్వాన్ని తన పదునైన ఉపన్యాసాలతో ఇరుకున పెడుతుండేవారు. ఆ క్రమంలో వై.ఎస్.కు దగ్గరవడంతో రెండువేల నాలుగులో అధికారంలోకి రావడంతో ఏకంగా రెవెన్యూ మంత్రిఅయి రికార్డు స్థాయిలో కొనసాగారు.ఇప్పుడు అదే ఆయన మెడకు చుట్టుకోవడం విచిత్రమైన పరిణామం.ఈయన తర్వాత వరసలో ఉన్న మిగిలిన నలుగురు మంత్రులకు కూడా సహజంగానే ఈ పరిణామం బితుకుబితుకుమంటుంది.కిరణ్ క్యాబినెట్ లోని మొత్తం పది మంది ఏదో ఒక కేసులో ఇరుక్కునే పరిస్థితి ఉండడం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేదనే చెప్పాలి.కొద్ది రోజుల క్రితమే దానం నాగేందర్ ఒక నాన్ బెయిలబుల్ కేసులో ఇరుక్కున్నారు. మంత్రిగా ఉన్నారు కాబట్టి మేనేజ్ చేసుకోగలిగారు. మామూలు వ్యక్తినైతే పోలీసులు ఎప్పుడో అరెస్టు చేసేవారు.కృష్ణా జిల్లా మంత్రి పార్దసారధి ఫెరా కేసులో కూరుకుని బయటపడడానికి తంటాలు పడుతున్నారు.గాలి బెయిల్ కేసులో ఏకంగా అరెస్టు అయిన జడ్జి
నరసింహారావు మంత్రి ఎరాసు ప్రతాపరెడ్డిని రక్షించడానికి తమను బలి చేస్తున్నారంటూ పిటిషన్ వేశారు. అందులో ఎంతవరకు నిజమున్నది చెప్పలేము.పిసిసి అధ్యక్షుడు , మంత్రి బొత్స సత్యనారాయణ మద్యం సిండికేట్ల గొడవల నుంచి విముక్తి పొందడానికి నానా హైరానా పడ్డారు.జగన్ ఆస్తుల కేసులో గీతారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ,పొన్నాల , సబితా ఇంద్రారెడ్డిల భవిష్యత్తు అగమ్య గోచరంగానే ఉంది.ఇదంతా జనం నమ్ముతున్నదాని ప్రకారం కాంగ్రెస్ హై కమాండ్ పన్నిన కుట్ర.ఆ కుట్రలో ఒక్క జగన్ మాత్రమే చిక్కుకుంటారని అనుకున్నారు. కాని అందుకోసం ఇలా తమ మంత్రులను , ప్రభుత్వంలోని ఐ ఎ ఎస్ లను బలి పెట్టవలసి వస్తుందని అనుకోలేదు. రాజకీయాలలో విద్వేషం కన్నా వివేచన బాగా పనిచేస్తుంది.కక్ష సాధింపు కన్నా , తెలివిగా తన లక్ష్యాన్ని సాధించుకోవడం చాలా ముఖ్యం కాంగ్రెస్ అధిష్టానంలో ఆ రెండూ కొరవడ్డాయి. అవే ఉండి ఉంటే,నిజాయితీగా కిరణ్ సర్కార్ ఈ అంశాలలో ఇదీ తమ వైఖరి అని హైకోర్టుకే చెప్పి ఉండేది.ఉదాహరణకు వాన్ పిక్ కు సంబంధించి నిజంగానే ఘోర తప్పిదాలు జరిగి ఉంటే దానికి సంబందించిన సమాచారం తెప్పించుకుని హైకోర్టులో
చెప్పి ఉండవచ్చు. లేదా తప్పు జరగకపోతే ఆ మాటే తెలిపి ఉండవచ్చు. ఆ ప్రాజెక్టు రాష్ట్రానికి ఉపయోగమో,కాదో తేల్చి ఉండవచ్చు.అలాగే భూమి కేటాయింపులు కాని, పరిశ్రమలకు నీటి కేటాయింపులు కాని..ఏదైనా కాని ప్రభుత్వం ఈ అభిప్రాయంతో ఉందని న్యాయస్థానానికి తెలిపిన తర్వాత ప్రభుత్వ బాధ్యత పూర్తి అవుతుంది. తదుపరి హైకోర్టు నిర్ణయం తీసుకుంటే అది వేరే విషయం. ఇక్కడే రాష్ట్ర ప్ఱభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి నిబద్దత
లోపించింది.దానికి ప్రతిఫలం కాంగ్రెస్ అనుభవించకతప్పదు.

దినేష్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. దినేష్ రెడ్డి నియామకాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. డీజీపీగా దినేష్ రెడ్డి నియామకం చెల్లదని గతంలో క్యాట్ ఇచ్చిన నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. వారంలోగా డీజీపీ స్థాయి అధికారులు వివరాలను యూపీఎస్సీకి పంపాలని గురువారం హైకోర్టు ఆదేశించింది. యూపీఎస్సీ నివేదిక అందగానే వారంలోగా కొత్త డీజీపీని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది.

అంతే కాకుండా ప్రభుత్వానికి హైకోర్టు రూ.5వేలు జరిమానా విధించింది. డీజీపీ నియామకం చెల్లదంటూ కేంద్ర పరిపాలనా పరమైన వివాదాల పరిష్కార న్యాయస్థానం (క్యాట్) ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం, దినేష్‌డ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుంది : మైసూరా రెడ్డి

అదే ప్రజాదరణ

రైతులు, చేనేత కార్మికుల కోసమే కాకుండా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థుల కోసం కూడా పోరాడుతూ ప్రజలలో, యువతలో సుస్థిర స్థానం సంపాదించింది. పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అన్ని వర్గాల ప్రజా సమస్యలపైన పోరాడుతూ అద్వితీయమైన ప్రజాస్పందనని కూడగట్టుకుంది. రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులలో చైతన్యం తీసుకువచ్చింది. 

మొద్దు నిద్దరలో ఉన్న ప్రభుత్వంలో చలనం తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలు ఏకమై కుట్రపన్ని జగన్మోహన రెడ్డిని జైల్లో పెట్టించారు. అయినా పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మతోపాటు ఆ పార్టీ ప్రముఖ నేతలందరూ ఆ పోరాటాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంకా బలమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. 

నిజం చెప్పాలంటే దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తన 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో వివిధ పదవులను అలంకరించడం ద్వారా, పాదయాత్ర ద్వారా ఎంతటి ప్రజాభిమానాన్ని పొందారో జగన్ మూడేళ్లలో అంతకంటే ఎక్కువ ప్రజాదరణ పొందారు. ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వానికి తొత్తుగా మారటంతో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే నాధుడే లేడు. ఆ పరిస్థితులలో జగన్ పార్టీ పెట్టింది మొదలు ప్రజా సమస్యలపైనే పోరాడుతూ వారికి అత్యంత చేరువయ్యారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు సమస్యలపై విజయవాడ, గుంటూరు, నిజామాబాద్ జిల్లా ఆర్మూరుతోపాటు ఢిల్లీలోనూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా నిర్వహించింది. 2010 డిసెంబరులో విజయవాడలో రైతుల కోసం భారీ లక్ష్యదీక్ష చేపట్టారు. 2011 మేలో గుంటూరులో రైతు సమస్యలపై దీక్ష చేశారు. 2011 జనవరిలో రైతులతో ఢిల్లీలో భారీ ధర్నా నిర్వహించారు. 2012 జనవరిలో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో మూడు రోజుల పాటు రైతుల సమస్యలపై విజయవంతంగా దీక్ష నిర్వహించారు. రైతులకు విద్యుత్ ను సక్రమంగా అందించకపోవడంతో 2011 ఏప్రిల్ 3న విద్యుత్ సబ్ స్టేషన్ల ముట్టడించాలని పిలుపు ఇచ్చారు.

మన రాష్ట్రంలో వ్యవసాయ రంగం తరువాత అత్యధిక మంది ఆధారపడి జీవించేది చేనేత రంగం. వైఎస్ఆర్ సీపీ చేనేత కార్మికుల సమస్యలపై పోరాటం చేయటమే కాకుండా వారి ఆందోళనకు మద్దతు పలికింది. 2010 డిసెంబర్ లో ధర్మవరంలో చేనేత కార్మికులు చేపట్టిన దీక్షకు జగన్మోహన రెడ్డి మద్దతు పలికారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో 2011 జనవరి 22న జగన్ జనదీక్ష చేపట్టారు. 

కులమతాలతో సంబంధం లేకుండా పేద విద్యార్థులు అందరూ ఉన్నత చదువులు చదవాలన్న సదాశయంతో మహానేత వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కోసం పెట్టే ఖర్చుని వైఎస్ సామాజిక పెట్టుబడిగా భావిస్తే, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మాత్రం దీనిని అదనపు భారంగా భావించింది. ఈ పథకంని ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం చేయని ప్రయత్నంలేదు. 

విద్యార్థులకు వరమైన ఈ పథకాన్ని రక్షించుకునేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమర శంఖం పూరించింది. ఈ పథకం విషయంలో ప్రభుత్వ ఎత్తుగడలను జగన్ ఎప్పటికప్పుడు ఎండగట్టారు. ప్రభుత్వం నుంచి ఫీజు బకాయిలు రాకపోవటంతో కొన్ని కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టిక్కెట్లు ఇవ్వకుండా వేధించినప్పుడు జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ విధంగా జగన్ రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థుల మనసుకు దగ్గరయ్యారు. ఇక మహిళలు, వృద్ధులూ జగన్ పట్ల చూపించే ఆదరాభిమానాల విషయం అందరికీ తెలిసిందే. 

అన్ని ప్రాంతాలలో అన్ని వర్గాల ప్రజల నుంచి జగన్ కు అపూర్వ ఆదరణ లభించింది. జగన్ బహిరంగ సభలకు వచ్చే జనవాహిని చూసి తలలు పండిన రాజకీయ విశ్లేషకులు కూడా విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంతటి ప్రజాదరణ గల నేత యువకులలో గానీ, సీనియర్లలో గాని మరొకరు లేరని స్పష్టమైపోయింది. ఈ పరిస్థితులలో ఈ ప్రజాదరణని చూసి తట్టుకోలేక, ఈర్ష్య, కుళ్లుతో అధికార, ప్రధాన ప్రతిపక్షం కలిసి జగన్ ని జైలులో పెట్టించారు.

అయినా ఉప ఎన్నికలలో పార్టీ ఘన విజయం సాధించింది. అయితే పార్టీ తరపున ఉద్యమాలు ఆగలేదు. అదే ఊపు. అదే స్పందన. అదే ప్రజాదరణ. చేనేత సమస్యలపై సిరిసిల్లలో విజయమ్మ చేపట్టిన దీక్ష విజయవంతమైంది. సిరిసిల్ల ప్రజలు ఆమెకు నీరాజనాలు పలికారు. 

విద్యాసంవత్సరం ఆరంభమైయ్యే సమయంలో లక్షల మంది పేద విద్యార్థులకు లబ్ది చేకూర్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి తూట్టు పొడవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ పథకాన్ని ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అర్థమైపోయింది. ఈ పథకం విషయంతో గతంలో జగన్మోహన రెడ్డి గట్టిగా నిలబడి పోరాడారు. అదే ఉద్యమ స్పూర్తితో ఈ పథకం కొనసాగింపు కోసం విజయమ్మ ఏలూరు రెండు రోజులు దీక్ష చేశారు. విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా భారీ సంఖ్యలో దీక్షాశిబిరం వద్దకు తరలి వచ్చి ఆమెకు మద్దతు పలికారు.

రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఆత్మహత్యాసదృశం

ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఆత్మహత్యాసదృశంగా తయారైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల హృదయాల్లో ఉన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్ట దెబ్బ తీయాలని, జగన్‌మోహన్‌రెడ్డిని అణచి వేయాలనే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం తానే కూలిపోయే పరిస్థితులు తెచ్చుకుందని అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు జైల్లో ఉండటం, మంత్రి ధర్మాన ప్రసాదరావును సీబీఐ చార్జిషీటులో నిందితుడుగా పేర్కొనడం వంటి పరిణామాలపై మేకపాటి బుధవారం కేంద్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల పాలనతో వైఎస్ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటే.. దానిని తుడిచివేసేందుకు ఆయన హయాంలో చేసిన పనులన్నీ తప్పే అని నిరూపించే యత్నంలో రాష్ట్ర ప్రభుత్వం తానే ఇరుక్కుపోయేలా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వైఎస్ హయాంలో జారీ అయిన 26 జీవోలు సక్రమమో అక్రమమో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

జగన్‌పై కక్షతో జీవోలపై హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఆనాడు ప్రభుత్వం వ్యవహరించడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుందని చెప్పారు. వైఎస్ మరణించిన తరువాత ఆయన పరువు ప్రతిష్టలను దెబ్బతీయడానికి ప్రయత్నించడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 200 శాసనసభ, 40 వరకూ లోక్‌సభ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల అనంతరం జాతీయ రాజకీయాల్లో జగన్ కీలక పాత్రను పోషిస్తారని చెప్పారు. మూడో ఫ్రంటుతో జతకట్టే విషయంలో అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. లౌకిక శక్తులతో కలుస్తామని జగన్ గతంలోనే చెప్పారని గుర్తుచేశారు.


తాను ఉప ఎన్నికల్లో గెలిచి పార్లమెంటుకు వెళ్లిన తరువాత అన్ని పార్టీల వారూ తమకు స్నేహహస్తం అందించడం భవిష్యత్ పరిణామాలకు సూచికలని చెప్పారు. జగన్‌ను జైల్లో పెట్టి వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఇబ్బందులు పెట్టాలని చేసిన యత్నాలు ఫలించలేదనీ... విజయమ్మ తమ నాయకురాలిగా ఎదిగారని తెలిపారు. తెలంగాణలో వైఎస్‌ను అభిమానించే వారు, జగన్‌ను ఆదరించే ప్రజలు భారీగా ఉన్నారని పరకాల ఉప ఎన్నికల్లో స్పష్టమైందని చెప్పారు. సిరిసిల్లలో విజయమ్మ చేనేత ధర్నా విజయవంతం కావడంతో కూడా ఇది వెల్లడైందని తెలిపారు. 

Popular Posts

Topics :