19 August 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

పరమ రహస్యం! దాని పేరు ‘సుడిగాడు!’.

Written By news on Saturday, August 25, 2012 | 8/25/2012


‘కిరణ్ కుమార్ రెడ్డిలో ఏం చూసి ఆయన్ను ముఖ్యమంత్రిని చేసిందో కాంగ్రెస్ అధిష్టానం?!’- ఈ అనుమానం మీకో నాకో వస్తే అందులో విశేషం లేదు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నెగ్గుకొస్తున్న ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డికే ఇలాంటి అనుమానం తలెత్తడం కన్నా విడ్డూరమేముంది? కిరణ్ కుమార్ రెడ్డి గొప్ప రాజనీతిజ్ఞుడా? కాదు! పరిపాలనా దక్షుడా? కానేకాదు! రాష్ట్ర రాజకీయాలను ఔపోసన పట్టేసిన అభినవ అగస్త్యుడా? ఎబ్బే, ఎంతమాత్రం కాదు. కనీసం ఒక్క భాషలోనయినా, శ్రోతలను ఆకట్టుకునేలా మాట్లాడగల వక్తా? అంటే అదీ కాదు. పోనీ, కన్నుమూసి తెరిచేలోగా తలకాయలు మార్చిపారేయగల జాదూగరా? ఆయన శత్రువులు కూడా అనలేని మాట అది! మరేం చూసి కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం కట్టబెట్టారో? కాంగ్రెస్ కురువృద్ధుడు పురుషోత్తమరెడ్డికి ఎదురయిన ధర్మ సంకటమే మనకూ తప్పలేదు!

అయినా, పురుషోత్తమరెడ్డి గారు పెద్దవారు. ఆయనకో చిన్న సామెత తెలిసే ఉంటుంది- ‘అందమన్నది చూసేవారి కళ్లలో ఉంటుంది!’ మీకూ, నాకూ, పురుషోత్తమరెడ్డిగారికీ కిరణ్ కుమార్ రెడ్డిలో ఏ ప్రత్యేకతా కనిపించి ఉండకపోవచ్చు. అసలు నిజంగానే మన ముఖ్యమంత్రిలో ఏ ప్రత్యేకతా లేకపోనూ వచ్చు. కానీ, ఆయన్ను ఆ పదవిలో కూర్చోపెట్టిన అధిష్టానమ్మ ఉందే, ఆమెకు కిరణ్ కుమార్ రెడ్డిలో ఏ విశిష్టత కనిపించిందో? మన దృష్టి కన్నా, ఆమె దృష్టికి ఎక్కువ ప్రాముఖ్యం ఉందన్న వాస్తవాన్ని సవినయంగా అంగీకరించాల్సిందే!

ఇంతకీ, సదరు అధిష్టానమ్మ ఎంపిక చేసి, కిరణ్ కుమార్ రెడ్డికి పదవి కట్టబెట్టిన అనంతరం, మన రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో పురుషోత్తమరెడ్డి శుక్రవారం నాడు -అగస్ట్ 24న- విలేకరుల సమావేశంలో సవివరంగా పేర్కొన్నారు. ‘రాష్ర్టంలో ఏ ప్రాంతంలోనూ కరెంటు ఉండడం లేదు- గుక్కెడు మంచినీళ్లక్కూడా దిక్కులేదు- ఇక సాగు నీరు విషయం మాట్లాడ్డమే అనవసరం- పేదలు కడుపుకింత కూడుదినే పరిస్థితులు కూడా లేవు- కూరగాయల ధరలు నింగినంటాయి- ఇవీ నేటి పరిస్థితులు!’ అన్నారు పురుషోత్తమరెడ్డి. ఆయనతో విభేదించడం కష్టం. ఎందుకంటే ఆయన చెప్పిందంతా పచ్చి నిజం!

ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడి ఉన్న నేపథ్యంలో మన సీఎంగారూ, ఆయనకు సరిజోడునని అనుకుంటున్న పీసీసీ అధ్యక్షుడూ, వారికి సహచరులయిన మంత్రులూ, ఆశించిన పదవులు దొరక్క పరాయి ప్రాంతాలకు పారిపోయిన పెద్దలూ ఏం చేస్తున్నారు? అధిష్టానమ్మకు అడుగడుగు దండాలు అర్పించుకుంటూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒకరిమీద మరొకరు చాడీలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో పరిస్థితి మరింత దిగజారింది. ప్రభుత్వమనే పదార్థం ప్రబంధాంగనల నడుములాగా -అస్తినాస్తి విచికిత్సా హేతువుగా- పరిణమించింది! కాంగ్రెస్ కురువృద్ధుడు పురుషోత్తమరెడ్డి ఈ పరిణామాలపట్ల తీవ్ర ంగా మండిపడడంలో వింతే ముంది?

అటు ఢిల్లీలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఏర్పడి ఉన్న పరిస్థితుల మధ్య ఓ సామ్యం చూపించారు పురుషోత్తమరెడ్డి . ఢిల్లీలో అధిష్టానమ్మ సోనియా గాంధీ, తోలుబొమ్మ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇద్దరూ చేస్తున్న పనే ఇక్కడ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డీ, బొత్స సత్యనారాయణా కూడా చేస్తున్నారు. ఇంతకీ అక్కడా ఇక్కడా ఈ కాంగ్రెస్ మహాశయులు చేస్తున్న ఘనకార్యమేమిటి? ‘అవినీతిపరులయిన మంత్రులను వెంటబెట్టుకుని కాంగ్రెస్ పరువు బజారుకీడ్చడమే’నని పురుషోత్తమరెడ్డి తేల్చేశారు. ‘రాష్ట్రంలో కరువు కాటకాలు ఇంతకు ముందెప్పుడూ రాలేదా? అప్పటి నాయకులు ఇలాగే చేశారా? మన పాలకులకు బొత్తిగా సంకల్ప శుద్ధి లేదు. పదవి ఉంటుందా ఊడుతుందా అనే యావతప్పితే ప్రజలను గురించి వారికి పట్టదు!’ అని జాడించేశారు పురుషోత్తమరెడ్డి.

కిరణ్ కుమార్ రెడ్డి లక్షణమేమిటో తానెన్నడో కనిపెట్టి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి చెప్పానని పురుషోత్తమరెడ్డి వెల్లడించారు. ‘అతివినయం ధూర్త లక్షణమ్’ అన్న పెద్దల మాట కిరణ్ విషయంలో నూరుశాతం నిజమయిందన్నారు పురుషోత్తమరెడ్డి. ‘నాడు వైఎస్ అడుగులకు మడుగులొత్తిన కిరణ్ నేడు ఆయన ఫొటోనే మాయం చెయ్యాలనుకుంటున్నాడు. అయితే, మహానేత బొమ్మ జనహృదయాల్లో స్థిరపడిపోయింది. వందమంది కిరణ్ కుమార్‌లూ, వెయ్యిమంది సోనియమ్మలూ కూడబలుక్కున్నా ఆ బొమ్మను ఏం చెయ్యలేరు’ అన్నారు పురుషోత్తమరెడ్డి.

ఇవన్నీ విన్న తర్వాత పురుషోత్తమరెడ్డిగారికి వచ్చిన సందేహం తొలగకపోగా మరింత బలపడుతోంది. అవునూ, కాంగ్రెస్ అధిష్టానమ్మ కిరణ్ కుమార్ రెడ్డిలో ఏంచూసి ఆయనకా పదవి ప్రసాదించింది? అసలు ఆయనకు అంత అదృష్టంపట్టడానికి దారితీసిన కారణాలేమిటి? ఆలోచించగా, చించగా ఈ మధ్య తయారయిన ఓ సినిమా టైటిల్ గుర్తుకొచ్చింది. దాని పేరు ‘సుడిగాడు!’.
ఇంతకుమించిన తర్కమేదీ తోచడం లేదు మరి! 

బీసీల కోసం వైఎస్ఆర్ సిపి కసరత్తు

శాసనసభకు వంద మంది బీసీలను పంపిద్దాం అంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేసిన ప్రతిపాదనను కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ లక్డీకపూల్‌ సెంట్రల్‌ కోర్ట్‌ హోటల్‌లో పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో ఓ రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 40 బీసీ సంఘాలు,50కి పైగా కుల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో మాట్లాడిన ఆ పార్టీ బీసీ నేతలు బడుగు, బలహీనవర్గాల ప్రజల కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిబద్దతతో పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. విద్యా, ఉద్యోగం, సామాజికంగా, రాజకీయంగా వారు ఎదగడానికి పార్టీ తోడ్పడుతుందన్నారు. అంతేకాక అందరి సూచనలు, సలహాలను దృష్టిలో ఉంచుకుని అన్ని బీసీ కులాలు హర్షించేలా పార్టీ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటిస్తుందని బీసీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ గట్టు రామచంద్రరావు చెప్పారు.

జగన్ అరెస్ట్ అక్రమమని లక్ష సంతకాలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ అక్రమమని అంబర్ పేట వాసి విజేతా రెడ్డి లక్ష సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆమె గవర్నర్ ను కలిసేందుకు నెలరోజులుగా ప్రయత్నిస్తున్నారు. అయితే రాజ్ భవన్ వర్గాలు ఆమెకు అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. దాంతో విజేతారెడ్డి శనివారం రాజ్ భవన్ ముందు దీక్షకు ప్రయత్నించారు. ఆమె ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు.

చంద్రబాబుకు రెహ్మాన్ హెచ్చరిక

ముస్లింల గురించి మాట్లాడే అర్హత సుజనాచౌదరికి లేదని వైఎస్‌ఆర్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రెహ్మాన్ అన్నారు. వారంలోగా తమకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సుజనాచౌదరితోపాటు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే వాళ్లిద్దరి ఇళ్లనూ ముట్టడిస్తామని రెహ్మాన్ హెచ్చరించారు. సుజనాచౌదరిని పార్టీ నుంచి చంద్రబాబు సస్పెండ్ చేయాలన్నారు.

తీవ్ర సంక్షోభంలో వ్యవసాయరంగం

రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, రైతులకు భరోసా ఇచ్చే నాయకులే కరువైయ్యారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై టీడీపీ పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేస్తే భవిష్యత్ ప్రమాదకరంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.

YSRCP Activists Vijetha Reddy has Taken one lac Signatures for YS Jagan

ఏరు దాటాక తెప్ప తగలేసే రకం!


రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే రకమని నెల్లూరు ఎంపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్ల అత్యంత లబ్ధి పొందిన వ్యక్తి ఆనం అని, అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు రాజకీయ లబ్ధి కోసం వైఎస్‌ను దుర్భాషలాడితే ప్రజలు సహించరని హెచ్చరించారు. శుక్రవారం ఆయన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేక ఆయన్ని బదనాం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పడరానిపాట్లు పడుతోందని ఆరోపించారు. అందులో భాగంగా మంత్రి ఆనం లాంటి వ్యక్తులు పదవుల కోసం వైఎస్‌ను దూషిస్తున్నారని, కానీ దాన్ని ప్రజలు హర్షించరని మేకపాటి స్పష్టంచేశారు. 

వైఎస్ హయాంలోనే వికలాంగులకు లబ్ధి

లక్ష వికలాంగుల పెన్షన్లు రద్దుచేశారని ఆవేదన 
పెన్షన్‌ను రూ. 1000కి పెంచుతామని వైఎస్సార్ సీపీ ప్లీనరీలో జగన్ ప్రకటించారని వెల్లడి 
వారికి కష్టసుఖాల్లో అండగా ఉంటామని హామీ 
‘వికలాంగుల రాజ్యాధికార సభ’కు విజయమ్మను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన మంద కృష్ణమాదిగ

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో వికలాంగులకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే లబ్ధి చేకూరిందని.. దాదాపు 8.55 లక్షల మందికి నెల నెలా రూ. 500 పెన్షన్ వచ్చేటట్లు చేసిన ఘనత కూడా ఆయనకే చెల్లుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో వికలాంగులకు పెన్షన్‌గా కేవలం రూ. 75 మాత్రమే ఇచ్చేవారని.. అది కూడా మూడు నెలలకొకసారి వచ్చేవని తెలిపారు. 

2004కు ముందు లక్ష మందికి మాత్రమే పెన్షన్లు ఉంటే.. వాటిని వైఎస్ తన హయాంలో 8.55 లక్షలకు పెంచారని గుర్తుచేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో వికలాంగుల హక్కుల పోరాటసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో వికలాంగులు విజయమ్మను కలిశారు. వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28 న హైదరాబాద్‌లో నిర్వహించే ‘వికలాంగుల రాజ్యాధికార సభ’కు ముఖ్య అతిథిగా రావాలని కోరారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ ప్రతి విషయాన్నీ మానవతా వాదిగా చూసేవారని.. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూసేందుకే ఆఖరు నిమిషం దాకా పరితపించారని పేర్కొన్నారు. ముఖ్యంగా వికలాంగుల విషయంలో రాజశేఖరరెడ్డి హయాంలోనే అత్యంత లబ్ధిచేకూరిందన్నారు. చంద్రబాబు హయాంలో వికలాంగుల సంక్షేమం కోసం కేవలం రూ. 9 కోట్లు మాత్రమే కేటాయిస్తే.. వైఎస్ రూ. 496 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. అదేవిధంగా వికలాంగుల వివాహాల కోసం అంతకు ముందున్న ప్రభుత్వాలు కేవలం రూ. 3,000 అందజేస్తే దాన్ని వైఎస్ రూ. 10,000 కు పెంచారని తెలిపారు. చెవిటి, మూగ వారు ఆరోగ్యశ్రీ కింద దాదాపు రూ. 7 లక్షల దాకా వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించారన్నారు. అయితే వైఎస్ మరణించాక ప్రస్తుతం మనసులేని ప్రభుత్వం దాదాపు లక్ష మందికి పైగా వికలాంగుల పెన్షన్లను రద్దు చేసిందని విమర్శించారు. రాజశేఖరరెడ్డి కుమారుడిగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఆయన బాటలో నడుస్తారని వికలాంగులకు విజయమ్మ హామీ ఇచ్చారు. ఇప్పటికే పార్టీ మొదటి ప్లీనరీలో వికలాంగులకు నెల నెలా రూ. 1000 పెన్షన్ అందజేయనున్నట్లు జగన్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. జగన్ అధికారంలోకి వస్తే వెయ్యి రూపాయల పెన్షన్ మాత్రమే కాకుండా అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరింత పెంచే అవకాశం ఉంటుందని చెప్పారు. వికలాంగుల కష్టసుఖాలలో వైఎస్సార్ కాంగ్రెస్ అండగా ఉంటుందని విజయమ్మ హామీ ఇచ్చారు. 

కిరణ్‌తో అమీతుమీ తేల్చుకుంటాం: కృష్ణ మాదిగ 

అంతకుముందు మంద కృష్ణ మాట్లాడుతూ స్వాతంత్య్రం లభించిన తర్వాత చట్టసభల్లో వికలాంగుల తరఫున ఏనాడూ బలమైన చర్చలు జరగలేదన్నారు. వైఎస్ సీఎంగా వికలాంగులకు ఇచ్చిన హామీలను ఆయన మరణానంతరం వచ్చిన రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయన్నారు. అందుకే సీఎం కిరణ్‌తో అమీతుమీ తేల్చుకోవటానికి ఈ నెల 28న సిద్ధమవుతున్నట్లు కృష్ణమాదిగ చెప్పారు. అదేవిధంగా వైఎస్ ఆశయంతో ఏర్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు అండగా ఉండాలని విజయమ్మను కోరారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అందె రాంబాబు వారి సమస్యలపై విజయమ్మకు విజ్ఞాపన పత్రం అందజేశారు.

అతివినయం ధూర్తలక్షణమని అప్పుడే చెప్పిన..


‘‘కిరణ్‌కుమార్‌రెడ్డిలో ఏం చూసి సీఎంను చేశారో! రాష్ట్రంలో ప్రజల అభీష్టం, పరిస్థితులు అధిష్టానానికి అక్కర్లేదా? అధిష్టానానికి ఎందుకు, ఎవరిమీద దయ కలుగుతుందో తెలియదు. ఓ మదరాసీ చెప్పిండట.. కిరణ్‌ను సీఎం చేసేశారు. రాష్ట్రంలో కరెంటు లేదు. మంచినీళ్లు లేవు. పేదవాడు కడుపునిండా తినేస్థాయిలో ధరల్లేవు. ఇవేవీ పట్టించుకోకుండా సీఎం, మంత్రులంతా కుర్చీలు ఎప్పుడు పోతాయోననే భయంతో వాటినే పట్టుకుని వేలాడుతున్నరు. సీఎంపై పీసీసీ చీఫ్, పీసీసీ చీఫ్‌పై సీఎం చాడీలు చెప్పుకోవడానికి ఢిల్లీ పర్యటనలుంటున్నయి. రాష్ట్రంలో ప్రభుత్వముందా?’’ అని కాంగ్రెస్ సీనియర్‌నేత, తెలంగాణ అభివృద్ధి మండలి మాజీ చైర్మన్ ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు. శుక్రవారమిక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. అక్కడ సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్, ఇక్కడ కిరణ్, అవినీతి మంత్రులంతా కలిసి కాంగ్రెస్ ప్రతిష్టను పూర్తిగా దిగజార్చారని ఆయన విమర్శించారు. వీళ్ల నిర్వాకంతో కాంగ్రెస్ క్లిష్టపరిస్థితుల్లో పడిపోయిందన్నారు. కాంగ్రెస్‌పార్టీకి తలాతోకా, పద్ధతి, విధానం, సిద్ధాంతం ఏమీలేకుండా పోయిందన్నారు. ‘‘రాష్ట్రంలో కరువు ఇంతకుముందు రాలేదా? వర్షాభావ పరిస్థితులిప్పుడే కొత్తగా వచ్చాయా? పాలకులకు సంకల్పం లేనందునే ప్రజలిబ్బందులు పడుతున్నారు’’ అని ధ్వజమెత్తారు. 

అతివినయం ధూర్తలక్షణమని అప్పుడే చెప్పిన..

వైఎస్ బతికి ఉన్నప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి విప్‌గా అసెంబ్లీలో ఎంతో వినయం ప్రదర్శించేవాడని ఉప్పునూతల అన్నారు. ‘‘కిరణ్‌ను స్పీకర్‌గా చేస్తానని వైఎస్ అంటే వద్దని చెప్పిన. అతివినయం ధూర్తలక్షణం అని చెప్పిన. ముందున్నప్పుడు వంగివంగి సలాములు చేసి వినయంగా ఉండేవారు చాటుగా చెడు చేస్తారని చెప్పిన. అయినా వైఎస్ వినకుండా కిరణ్‌ను గుడ్డిగా నమ్మిండు. ఇప్పుడేమో అదే వైఎస్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నడు. చివరకు వైఎస్ ఫోటోలు వద్దనే స్థాయికీ సీఎం పోయిండు. ఫోటోలు తీసేయిస్తే ప్రజల గుండెల్లో ఉన్న వైఎస్‌ను తీసేయించగలడా?’’ అని ప్రశ్నించారు. ‘‘ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయానికైనా కేబినెట్‌దే సమష్టి బాధ్యత. మంత్రులేమన్నా చిన్నపిల్లలా భయపడటానికి? మంత్రులే అడ్డగోలుగా అవినీతికి పాల్పడి.. ఇప్పుడు ప్రాణాలతో లేని వైఎస్‌పై నిందవేయాలని చూస్తున్నరు’’. అని ఉప్పునూతల ధ్వజమెత్తారు. 

'జగన్ కు బెయిల్ రాకుండా కుట్ర'

Written By news on Friday, August 24, 2012 | 8/24/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి బెయిల్ రాకుండా జాప్యం చేసేందుకు ప్రభుత్వ కుట్రపన్నిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. కుట్రలో భాగంగానే మంత్రులను బలిపశువులను చేస్తున్నారన్నారు. సొంత పార్టీ నాయకులను కూడా బలిచేయాలన్న లక్ష్యం హైకమాండ్ పెద్దలదని విమర్శించారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్ తరహాలో ఏపీకి చిట్టచివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని ఆయన అన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదర రావు రాజీనామాకు ఇంత కసరత్తు అవసరమా? అని ఆయన ప్రశ్నారు. ఇప్పటికైనా ఢిల్లీలో పైరవీలు మాని రాష్ట్రంలో ప్రజాసమస్యలపై సీఎం దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్థంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కిరణ్ వ్యవహారశైలి నీరోచక్రవర్తిని తలపిస్తుందన్నారు.

MP Mekapati Rajmohan Reddy Fire on Anam brothers

Manda Krishna Madiga Meet YSVijayamma

YSRCP Leader Ambati Rambabu press meet at YSRCP

ఆనం పై మేకపాటి ఫైర్

నెల్లూరు : మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డిపై నెల్లూరు ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దివంగతనేత వైఎస్‌ఆర్‌ను, జగన్‌ను ఉద్దేశించి ఆనం దారుణంగా మాట్లాడుతున్నారని వారికి ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. ఆనం బ్రదర్స్‌ ప్రవర్తన ఏరుదాటాక తెప్ప తగలేసే విధంగా ఉందని మేకపాటి ధ్వజమెత్తారు.

మంత్రి వ్యాఖ్యలు రాజకీయ లబ్ధి కోసమే తప్ప మరొకటి కాదని రాజమోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మార్పులు జరుగబోతున్నాయన్న వార్తల దృష్ట్యా తమ స్వలాభం కోసమే ఆనం ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎవరు నాయకత్వం చేపట్టినా కాంగ్రెస్‌ నావను గట్టుకు చేర్చలేరని రాజమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

'కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన నావ'

సొంత పార్టీనే నడుపుకోలేక కలిపేసిన చిరంజీవి, రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేని పల్లంరాజులు.. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టే రేసులో ఉండడం ఆ పార్టీ పరిస్థితిని తెలియజేస్తోందని వివిధ పక్షాల నేతలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. తప్పనిసరిగా సీఎం, పీసీసీ చీఫ్‌ మార్పు ఉంటుందని.. అయితే ఇప్పుడు ఎవరు పార్టీ, ప్రభుత్వ పగ్గాలు చేపట్టినా, ఎటువంటి సామాజిక సమతుల్యత పాటించినా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మునిగిన నావ అని శుక్రవారం ఉదయం సాక్షి ఛానల్ హెడ్‌లైన్‌షోలో నేతలు వ్యాఖ్యానించారు. మొత్తానికి రాష్ట్రంలో ప్రధాన సమస్యల కంటే కాంగ్రెస్‌ పార్టీకి సొంత సమస్యలే ప్రధాన ఎజెండాగా మారాయని పార్టీలు విమర్శించాయి.

దేశాల మధ్య సీబీఐ చిచ్చు

కేబినెట్ నిర్ణయాలను సీబీఐ సమీక్షించలేదు
నిందితుల అరెస్టులో తేడాలు చూపుతోంది

హైదరాబాద్, న్యూస్‌లైన్: వాన్‌పిక్ ఒప్పందాన్ని అనవసరంగా వివాదాస్పదం చేసి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రెండు సార్వభౌమత్వ దేశాల మధ్య సీబీఐ చిచ్చుపెడుతోందని వాన్‌పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. బెయిల్ మంజూరు చేయాలంటూ నిమ్మగడ్డ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు గురువారం విచారించారు. వాన్‌పిక్ ప్రాజెక్టు అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి, రస్ అల్ ఖైమా (రాక్)కు, ఇతరులకు ఎటువంటి విభేదాలు లేవని... ఈ వ్యవహారంలో సీబీఐ తన పరిధి దాటి జోక్యం చేసుకుంటోందని ఉమామహేశ్వర్‌రావు వాదనలు వినిపించారు. మంత్రి మండలి నిర్ణయాల మేరకే రాక్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వాన్‌పిక్ ఒప్పందం జరిగిందని, మంత్రి మండలి నిర్ణయాలను సమీక్షించే అధికారం సీబీఐకి ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు. రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన వాణిజ్యపరమైన ఒప్పందాన్ని కూడా సీబీఐ క్విడ్‌ప్రోకోగా చిత్రీకరిస్తూ కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందని వివరించారు. 

ఓడ రేవుల అభివృద్ధి కోసం నిమ్మగడ్డ పెట్టుబడిగా పెట్టారని, ఇందులో ప్రభుత్వానికి పైసా నష్టం లేదని తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో సింగూరు ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మమతాబెనర్జీ ఉద్యమించి రాజకీయంగా లబ్ధిపొంది ముఖ్యమంత్రి అయ్యారని, రాష్ట్రంలో కూడా రాజకీయ పార్టీలు వాన్‌పిక్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నాయని ఆరోపించారు. నిమ్మగడ్డ ప్రసాద్ కొనుగోలు చేసిన భూముల్లోకి తెలుగుదేశం పార్టీతోపాటు ఇతర పార్టీల నేతలు ప్రవేశించి దున్నుతున్నా రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మకుండిపోయిందని తెలిపారు. వాన్‌పిక్ ప్రాజెక్టులో ఇప్పటికే దాదాపు రూ.వేయి కోట్లు నిమ్మగడ్డ పెట్టుబడిగా పెట్టారని... ఇప్పుడు ఒప్పందం నుంచి వైదొలగాలంటే ఆర్బిట్రేషన్ చట్టాల ప్రకారం ఆయనకు రూ. ఐదువేల కోట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అయితే ప్రభుత్వం దగ్గర డబ్బులేదని, అలాంటప్పుడు ఆ డబ్బు ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. 

అరెస్టులకు ప్రాతిపదిక ఏమిటి?

జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా ఉందని ఉమామహేశ్వర్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ మంత్రిని అరెస్టు చేసిందని, మరో మంత్రిని నిందితునిగా మాత్రమే పేర్కొని అరెస్టు చేయలేదని... అలాగే మరో ఉన్నతాధికారిని అరెస్టు చేసిన సీబీఐ... ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను నిందితులుగా పేర్కొని అరెస్టు చేయలేదని వివరించారు. అరెస్టుల విషయంలో సీబీఐ ప్రాతిపదిక ఏంటో అర్థం కావడం లేదన్నారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో మిగిలిన వారంతా బయటే ఉన్నారని, నిమ్మగడ్డను మాత్రం అరెస్టు చేశారన్నారు. గత నెల 20న నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయని... 30న బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. అయితే గత నెల 20 నుంచి సీబీఐ ఒక్కసాక్షినైనా విచారించిందా అని ప్రశ్నించారు. నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్‌ను అడ్డుకునేందుకే దర్యాప్తు కీలక దశలో ఉందని, సాక్షుల విచారణ కొనసాగుతోందని సీబీఐ చెబుతోందన్నారు. కేసులో నిందితులుగా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్‌లు మన్మోహన్‌సింగ్, శామ్యూల్‌ల ప్రాసిక్యూషన్‌కు ఇప్పటికీ అనుమతి లేదని.. వందలాది మంది సాక్షులుగా ఉన్న నేపథ్యంలో తుది విచారణ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశం లేదని తెలిపారు. దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని నివేదించారు. సీబీఐ వాదనలు వినేందుకు వీలుగా విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. 

వైఎస్ మరణంతో సంక్షేమం కనుమరుగు: బాజిరెడ్డి


మహానేత వైఎస్సార్ మరణం తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కనుమరుగయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్ పేర్కొన్నారు. బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలనే డిమాండ్‌తో వికలాంగులు గురువారమిక్కడ వికలాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. 

ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంలా మారిపోయిందని విమర్శించారు. వికలాంగుల సంక్షేమానికి రూ.200 కోట్లు బడ్జెట్ అవసరముందన్నారు. అయితే నామమాత్రంగా రూ.63 కోట్లు కేటాయించినా అందులో రూ.36 కోట్లే ఖర్చు చేయడం బాధాకరమన్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి కూడా వికలాంగులకు రూ.75కు మించి పెన్షన్ పెంచలేకపోయిన చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే రూ.2 వేలు చేస్తామని ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదమన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్సార్ బాటలోనే నడుస్తామని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్‌చార్జి రాజ్‌ఠాకూర్ మాట్లాడుతూ వికలాంగుల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వం వైకల్యాన్ని శాపంగా చూస్తోందని విమర్శించారు. వారికి ఇతరులతోపాటు సమానంగా అవకాశాలు కల్పించాలని కోరారు. వికలాంగులకు రూ.రెండు వేలు పెన్షన్ న్యాయమైనదేనని న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ అన్నారు. టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు జి.దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి కె.రవీందర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు డాక్టర్ సుధాకర్, వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు తదితరులు మాట్లాడారు.

నిజాయతీకి బదిలీ బహుమతి

* ఆయన స్థానచలనానికిముఖ్య నేత సోదరుడు, మంత్రి పట్టు?
* 13 మంది ఐఏఎస్‌ల బదిలీ
* విశాఖ కమిషనర్, కలెక్టర్‌ల ఆధిపత్యపోరుతో ఇద్దరికీ స్థాన చలనం
* పోస్టింగ్‌లు ఇవ్వని వైనం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ముక్కుసూటి అధికారిగా, నిజాయతీపరుడిగా పేరున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి రాజకీయాలకు బలయ్యారు. ఆయన్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇద్దరు జిల్లా కలెక్టర్లతోపాటు మరో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ ఉత్తర్వులు జారీ చేశారు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ సుబ్బారావును సరెండర్ చేయడంపై ఆగ్రహించిన ముఖ్యనేత సోదరుడు, ఆ శాఖ మంత్రి.. కలెక్టర్ శేషాద్రి బదిలీకి పట్టుబట్టినట్లు ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన శేషాద్రిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పదవి నుంచి తప్పించడానికి ప్రయత్నాలు జరిగాయి. 

సుబ్బారావు సరెండర్ వ్యవహారంతోపాటు శంషాబాద్‌లో వంద కోట్ల సర్కారీ భూమికి నగరానికి చెందిన మంత్రి ఎసరు పెట్టిన నేపథ్యంలో ఆయనను ప్రభుత్వం బదిలీ చేసిందన్న వాదన వినిపిస్తోంది. పైగా.. మూడ్రోజుల క్రితం సదరు మంత్రి ఆ భూమిలో సాగు చేసుకుంటున్న రైతులను పిలిచి.. తమ పనికి ‘లైన్ క్లియర్’ అయిందని.. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని, విలేకరులతో అస్సలు మాట్లాడవద్దని చెప్పడం గమనార్హం. అదే విధంగా విశాఖ కలెక్టర్ లవ్ అగర్వాల్, విశాఖ కార్పొరేషన్ కమిషనర్ రామాంజనేయులు మధ్య కొద్ది కాలంగా ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో వారిని ప్రభుత్వం బదిలీ చేసింది. వారిద్దరికీ ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. 

కరెంట్ ‘కోతల’పై ఆగ్రహం

వైఎస్సార్సీపీ, ఏఐటీయూసీల ఆధ్వర్యంలో ఆందోళనలు 
సబ్ స్టేషన్ల ముట్టడి, ధర్నాలు, రాస్తారోకోలు

న్యూస్‌లైన్ నెట్‌వర్క్: విద్యుత్ కోతలపై ఆగ్రహం వెల్లువెత్తుతోంది. వేళాపాళాలేని కోతలతో ప్రజలను ఇక్కట్ల పాల్జేస్తున్న ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గురువారం పలు జిల్లాల్లో ధర్నాలు జరిగాయి.అనంతపురంలోని ఎలక్ట్రిసిటీ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీ పీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ప్రధాన ద్వారం గేట్లు మూసివేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోతలువెంటనే ఎత్తివేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏడీఈ లక్ష్మీనారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు.రాజమండ్రి వై జంక్షన్ వద్ద ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం రాత్రి కాగడాల ప్రదర్శన జరిగింది.ముమ్మిడివరంలో వివిధయువజన సంఘా ల ఆధ్వర్యంలో ప్రదర్శన, సబ్ స్టేషన్ ఎదుట 216 జాతీయ రహదారిపై రాస్తారోకోచేశారు.అంబాజీపేట కొబ్బరి ఆయిల్ మిల్లర్స్ యూనియన్ విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిం ది.ఏలేశ్వరం ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద వ్యవసాయ కూలీ సంఘం ప్రదర్శన, ధర్నా నిర్వహించింది. పెద్దాపురంలో టీడీపీ కార్యకర్తలు రాస్తారోకో చేసి, సబ్‌స్టేషన్‌ను ముట్టడిం చారు. 

జగ్గంపేటలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఇతర సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన చేసి, ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాకినాడలోని కుళాయిచెరువు వద్ద ఉన్న సబ్ స్టేషన్‌వద్ద భవననిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహిం చారు. సామర్లకోటలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రదర్శన,ధర్నా నిర్వహించారు. విద్యుత్ కోతను నిరసిస్తూ శంఖవరం విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆర్‌అండ్‌బీ రోడ్డుపై దళితులు బైఠాయించారు. కరీంనగర్‌జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు సబ్‌స్టేషన్ అద్దాలు, కుర్చీలను రైతులు ధ్వంసం చేశారు. రికార్డులను చిందరవందర చేసి కొత్తగట్టు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. తాడికల్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి కరీంనగర్-వరంగల్ రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మల్లాపూర్ మండలం కొత్తదాం రాజ్‌పల్లి, పెద్దపల్లి మండలం రాఘవపూర్‌లో సబ్‌స్టేషన్లను ప్రజలు ముట్టడించారు. రామడుగులో రాస్తారోకో నిర్వహిం చగా, మల్యాల మండలం ఓబులాపూర్‌లో విద్యుత్ వసూలుకు వచ్చిన సిబ్బందిని గ్రామస్తులు నిర్బంధించారు. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, పినపాక, ఇల్లెందు, సత్తుపల్లి, అశ్వారావుపేట, మధిర నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విద్యుత్‌చ కోతలకు నిరసనగా సబ్‌స్టేషన్లముట్టడి, రాస్తారోకో,ధర్నాలు నిర్వహించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లోని 26 కేం ద్రాల్లో కార్మికులు విద్యుత్ కార్యాలయాలను ముట్టడిం చారు. మరికొన్నిచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. వందలాదిమంది అరెస్టయ్యారు. హైదరాబాద్ విద్యుత్ సౌధ ముట్టడి సందర్భంగా ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖరరావు, మాజీ ఎమ్మెల్యే కె. రామకృష్ణ, మెదక్ జిల్లా సంగారెడ్డిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి ఓబులేసు తదితరులు అరెస్టయ్యారు. అనంతపురం, గుంటూరు, విజయవాడలలో వందలాదిమందిని అరెస్ట్ చేసి సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. 

విద్యుత్‌పై అసెంబ్లీని సమావేశపర్చాలి

ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఈ డిమాండ్ చేసి ఉండాల్సింది
ప్రజాపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది
గ్యాస్ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే
గ్యాస్ కొరత వల్లే విద్యుత్ ఉత్పాదన జరగడంలేదని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనమే
హెచ్‌టీ విద్యుత్ వినియోగంపై శ్వేత పత్రం విడుదల చేయాలి
ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే మద్దతిస్తాం

హైదరాబాద్, న్యూస్‌లైన్: విద్యుత్ సంక్షోభం పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనంపై చర్చించడానికి తక్షణం శాసన సభ సమావేశాలు నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. అత్యంత ప్రధానమైన విద్యుత్ సమస్యపై వెంటనే అసెంబ్లీని సమావేశపర్చాలని బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ కోరి ఉండాల్సిందని, అయితే వారు ఆ పని చేయలేదని అన్నారు. 

అధికారపక్షం అసమర్థంగా తయారైందని, ప్రతిపక్షం నిద్రపోతోందని, అందుకే అసెంబ్లీని సమావేశపర్చాలని ప్రజాపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుతోందని చెప్పారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన ఈ దుస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కారణమని అన్నారు. ‘‘రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు సహజ వాయువు సరఫరా సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిది. గ్యాస్ సరఫరాలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనప్పుడు ఒత్తిడి తెచ్చి సాధించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. ఆ పని చేయకుండా, గ్యాస్ కొరత వల్లే విద్యుత్ ఉత్పత్తి జరగడంలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం చేతకానితనానికి నిదర్శనం. ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకోవడమే. 

కేజీ బేసిన్‌లో రిలయన్స్ కావాలనే గ్యాస్ ఉత్పాదన తగ్గించింది. భవిష్యత్తులో ధర పెంచి అమ్ముకోవడానికే ఇలా చేస్తున్నా, కేంద్రం ఏమీ చేయలేకపోతోంది’’ అని చెప్పారు. ‘‘విద్యుత్ కోతల ప్రభావం అన్ని వర్గాలపైనా పడింది. రైతులు, విద్యార్థులు, సామాన్యులు, పారిశ్రామికవేత్తలు అందరూ తీవ్రంగా నష్టపోతున్నారు. అధికారులకు ఆప్తులైన వారి పరిశ్రమలకు మాత్రం నిరాఘాటంగా సరఫరా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కర్నూలు జిల్లాలో మంత్రి టి.జి.వెంకటేశ్ రసాయనాల ఫ్యాక్టరీకి 24 గంటలూ విద్యుత్ సరఫరా జరుగుతున్నట్లు పత్రికల్లో చదివాను. 

పభుత్వ వైఖరి చూస్తుంటే ‘అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో’ అన్న చందంగా ఉంది. ఇది ఎంతవరకు సమంజసం? అసలు హెచ్‌టీ (హైటెన్షన్) విద్యుత్ వాడే పరిశ్రమలకు గత ఆరు నెలల్లో ఎంత విద్యుత్ సరఫరా అయిందో డిస్కంలవారీగా ఎం.ఆర్.ఐ. డేటాను ప్రచురించాలి. విద్యుత్ వినియోగంపై ఆంక్షలు ఉన్నప్పటికీ, అధికంగా వాడిన పరిమాణం ఎంత? ఆంక్షలను అతిక్రమించి అధికంగా విద్యుత్ వాడిన వారిపై తీసుకున్న చర్యలేమిటి? అధికంగా వాడిన విద్యుత్‌కు అప్పట్లో ఉన్న మార్కెట్ ధర ఎంత? వంటి అంశాలన్నింటిపైనా తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని డిమాండ్ చేశారు. విద్యుత్ వంటి కీలక శాఖకు మంత్రిని నియమించకపోవడాన్ని తప్పుపట్టారు. ‘‘సీఎం ఈ శాఖను ఆయన వద్దే ఉంచుకున్నా ఒక్కసారి కూడా పూర్తిస్థాయిలో సమీక్ష చేయలేదు. అంతా అధికారుల ఇష్టారాజ్యానికి వదిలేశారు. డిస్కం, జెన్‌కోలు అవినీతిమయమైపోయాయి. విద్యుత్ సంక్షోభానికి ఇదీ ఒక కారణం. విద్యుత్ కొరతపై అధికారులు ముందుగానే అంచనా వేసి చర్యలు తీసుకుని ఉంటే సంక్షోభాన్ని నివారించగలిగి ఉండేవారు’’ అని చెప్పారు. రాష్ట్రంలో వానలు కురవకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘చిత్తూరు జిల్లావాసులు చాలా మంచి వారు. నాకూ ఆ జిల్లాలో మంచి మిత్రులు ఉన్నారు. కలియుగదైవం వేంకటేశ్వరస్వామి కూడా ఆ జిల్లాలోనే ఉన్నారు. అదేమిటోగానీ.. చిత్తూరు జిల్లా వాసి సీఎం పదవిలో ఉన్నపుడల్లా వర్షాలే కురవవు. వర్షాలు కురిపించాలని వారు ఆ స్వామివారిని మొక్కుకుంటే మంచిది’’ అని నవ్వుతూ వ్యాఖ్యానించారు.

టీడీపీ తీరు బాగోలేదు: విద్యుత్ సమస్యపై ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత టీడీపీకి ఉన్నప్పటికీ, వారు వ్యవహరిస్తున్న తీరు బాగోలేదని మైసూరారెడ్డి విమర్శించారు. వీధులకెక్కి పోలీసు స్టేషన్లలో శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తే విద్యుత్ రాదని వ్యాఖ్యానించారు. ఇంతటి ప్రధాన సమస్యలపై ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీని సమావేశపర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉండాల్సిందని చెప్పారు. ప్రభుత్వంపై ప్రతిపక్షం అవిశ్వాసం పెడితే తమ పార్టీ మద్దతునిస్తుందని తెలిపారు. బీసీలకు వంద సీట్లు ఇద్దామని విజయమ్మ చేసిన ప్రతిపాదనలో చిత్తశుద్ధి ఉందని చెప్పారు. 

ఈనాడు కార్యాలయం స్థలం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ .తనదికాని స్థలానికి ప్రభుత్వ ప్రతిఫలం పొందిన రామోజీ

* విశాఖలో ఈనాడు కార్యాలయం స్థలం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ
* తనదికాని స్థలానికి ప్రభుత్వ ప్రతిఫలం పొందిన రామోజీ
* రామోజీపై కుట్ర, మోసం, ఫోర్జరీ వంటి పలు సెక్షన్ల కింద కేసులు
* రెండో నిందితుడిగా ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ఎండీ కిరణ్

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘ఈనాడు’ అధినేత రామోజీరావు తనదికాని స్థలాన్ని రోడ్డు విస్తరణకు ఇచ్చి, అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి అక్రమంగా మరో స్థలాన్ని పొందిన వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే తొలగిపోవడంతో రామోజీరావుపై కుట్ర, మోసం, ఫోర్జరీ, అధికార దుర్వినియోగంవంటి ఆరు సెక్షన్ల కింద ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తోంది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేసు దర్యాప్తు జరుగుతోందని ఏసీబీ డెరైక్టర్ జనరల్ బి. ప్రసాదరావు ‘న్యూస్‌లైన్‌కు తెలిపారు. 

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏసీబీలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) ఎఫ్‌ఐఆర్ (నంబర్ 5/2012)ను నమోదు చేసింది. సీఐయూ చీఫ్ కె.సంపత్‌కుమార్ నేతృత్వంలో దర్యాప్తు వేగవంతం చేశారు. రామోజీరావును మొదటి నిందితునిగా, ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ఎండీ సీహెచ్ కిరణ్ రెండో నిందితునిగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి స్థలాన్ని పొందడంలో రామోజీకి సహకరించిన ఐఏఎస్ అధికారులు ఎస్వీ ప్రసాద్, కేవీ రావులను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలో ‘ఈనాడు’ కార్యాలయమున్న స్థలాన్ని రామోజీరావు 1974లో మంతెన ఆదిత్య ఈశ్వర కుమార కృష్ణవర్మ నుంచి లీజుకు తీసుకున్నారు. 1984-85లో ఈ స్థలంలో 289 చదరపు మీటర్లు రోడ్డు విస్తరణలో పోయింది. 

భూ యజమానికి ఈ సమాచారం ఇవ్వకుండా, రోడ్డు విస్తరణకు ఇచ్చిన స్థలానికి ప్రతిఫలంగా రేసపువానిపాలెం సర్వే నంబర్ 52లో 872 చదరపు మీటర్ల స్థలాన్ని రామోజీరావు తన కుమారుడు కిరణ్ పేరిట తీసుకున్నారు. ఈ స్థలాన్ని ఇచ్చే అధికారం లేదని తహసీల్దార్ ఇచ్చిన నివేదికను కూడా కాదని, ఉన్నతాధికారులు రామోజీ కోరిన స్థలాన్ని 1985 ఏప్రిల్ 17న ఆయనకు కట్టబెట్టారు. దీనిపై భూ యజమాని వర్మ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో దర్యాప్తునకు కోర్టు ఆదేశించింది. దీనిపై రామోజీ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఇటీవల హైకోర్టు స్టేను తొలగించడంతో ఏసీబీ దర్యాప్తును తిరిగి ప్రారంభించింది.

విజయమ్మ ప్రతిపాదన హర్షణీయం: వడ్డెర సంఘం

బీసీలకు అసెంబ్లీలో 100 సీట్లు కేటాయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేసిన ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు రాష్ట్ర వడ్డెర సంఘం ప్రకటించింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర కార్యవర్గం సమావేశమై నిర్ణయించినట్లు అధ్యక్షుడు టి.ధర్మరాజు తెలిపారు. వడ్డెర కులాన్ని గుర్తించి, ప్రోత్సహించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌కే దక్కుతుందన్నారు. వడ్డెర కులాన్ని షెడ్యూల్ జాబితాలో చేర్చాలని కేబినెట్‌లో తీర్మానించి కేంద్రానికి పంపించారని గుర్తు చేశారు. తమ కార్యవర్గ సమావేశానికి నేతలు ఓర్సు కృష్ణయ్య, జె.రెడ్డప్ప, వి.రాముడు, వై.మాధవి, జి.రమణమ్మ తదితరులు హాజరైనట్లు తెలిపారు.

వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు


ఇటిక్యాల(మహబూబ్‌నగర్), న్యూస్‌లైన్: మహబూబ్‌నగర్ జిల్లాలో వైఎస్సార్సీపీలోకి గురువారం టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, సీఈసీ సభ్యులు రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామరెడ్డి తదితరులు వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటిక్యాల తాజా మాజీ ఎంపీపీ జి.ఖగున్నాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు లలితమ్మ, సింగిల్‌విండో చైర్మన్ మాణిక్యరెడ్డితో పాటు ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు, మరో 16మంది సర్పంచ్‌లతో సహా మూడువేల మంది కార్యకర్తలు పార్టీలో చేరిన వారిలో వున్నారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమపథకాల అమలు కేవలం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని, అందుకే ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు పార్టీలో చేరామన్నారు. అంతముందు వారు ఎర్రవల్లి చౌరస్తా నుంచి బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

'మంత్రుల వ్యాఖ్యలు హాస్యాస్పదం'

Written By news on Thursday, August 23, 2012 | 8/23/2012

మంత్రివర్గ నిర్ణయాలను ప్రశ్నించే అధికారం దర్యాప్తు సంస్థలకు లేదంటున్న మంత్రులు.. మొత్తం నిర్ణయాలకు క్యాబినెట్‌దే బాధ్యత అని ఒప్పుకోవడంలో ఎందుకు తత్తరబాటుకు గురవుతున్నారని వైఎస్సాఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. 

గురువారం ఉదయం సాక్షి ఛానల్ హెడ్‌లైన్‌షో చర్చలో ఈ ప్రశ్నకు కాంగ్రెస్‌ నుంచి సమాధానం లేకపోయింది. మంత్రులు గంటకోలాగా మాట్లాడుతూ తీవ్ర అయోమయానికి గురిచేస్తున్నారని అంటూ అంబటి వ్యాఖ్యలను సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు సమర్థించారు. క్విడ్‌ప్రోకో నే లేదనప్పుడు అసలు జగన్‌ కేసే ఉండదని టీఆర్‌ఎస్‌ అభిప్రాయపడింది.

వైఎస్ఆర్ ని బాధ్యుడిని చేయడం తగదు: డీకే

: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలకు మొత్తం కేబినెట్‌దే బాధ్యత అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి అన్నారు. మంత్రులకు తెలియకుండా ఉన్నతాధికారులు జీవోలు జారీ చేయడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆనాటి నిర్ణయాలకు వైఎస్ఆర్ ను ఒక్కడినే బాధ్యుడిని చేయడం తగదని ఆయన అన్నారు. మంత్రి ధర్మాన రాజీనామాను సీఎం కిరణ్ ఆమోదించడమే కరెక్ట్‌ అని డీకే వ్యాఖ్యానించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తప్పించాలని, కేబినెట్‌ను ప్రక్షాళన చేస్తే సీఎం ఇమేజ్ పెరుగుతుందన్నారు. క్విడ్ ప్రో కో అనేది కేవలం ఆరోపణ మాత్రమేనని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి అన్నారు

వైఎస్ఆర్ ఆదర్శనీయుడు: వైఎస్ అవినాష్

ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలా ఉండాలో నిరూపించిన వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్ఆర్ సీపీ నేత వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. వైఎస్ బాటలో నడుస్తూ నాయకుడు అంటే ఎలా ఉండాలో వైఎస్ జగన్ చాటి చెబుతున్నారని ఆయన అన్నారు. కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసినందునే వైఎస్ఆర్ సీపీ ఘనవిజయం సాధించిదని వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు.

YSR is not Responsible for Government decision: DK Samarasimha Reddy

Mysura Reddy addressing Media at YSRCP office on 23rd Aug 2012

మంత్రులకు క్విడ్ ప్రో కో అన్నది వర్తించని పక్షంలో, జగన్ మీద అసలు కేసే ఉండదు

వాన్‌పిక్ కేసుకు సంబంధించి సిబిఐ చార్జిషీటులో ఐదవ నిందితునిగా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావును రక్షించేందుకు కొందరు మంత్రులు ముఖ్యమంత్రి మీద తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి పరిశీలనకు వారు న్యాయ నిపుణుల నివేదిక ఒకటి అందించారు. అయితే నివేదికను పరిశీలిస్తే మంత్రి ధర్మాన మీద ఉన్న కేసు సంగతి అలా పెడితే, అసలు జగన్‌మీద పెట్టిన ఆస్తుల కేసే నిలబడేందుకు అవకాశం లేదన్న అభిప్రాయం కలుగుతుంది. నివేదిక మొత్తం జగన్ తరఫున వాదించినట్టుగానే కనిపిస్తుంది. ‘మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించే అధికారం, హక్కు ఎవరికీ లేదు. క్విడ్ ప్రో కో అన్నది మంత్రులకు అసలు వర్తించదు. ఇది కేవలం ఉద్యోగులకు మాత్రమే సంబంధించింది’ అన్నది సిఎంకు మంత్రులు అందించిన నిపుణుల నివేదికలోని ప్రధానాంశాలు. కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదన్న వాదనతో మంత్రులకు క్విడ్ ప్రో కో అన్నది వర్తించని పక్షంలో, జగన్ మీద అసలు కేసే ఉండదు. జగన్ మీద కేసు పెట్టింది ఈ రెండు ముఖ్యమైన అంశాల ప్రాతిపదికనే. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 గురించి కూడా నివేదికలో ప్రస్తావించారు. ‘మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలకు, మంత్రి మండలి సిఫార్సులకు అనుగుణంగానే గవర్నర్ నడుచుకోవాలి. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా గవవర్నర్ వ్యవహరించడానికి లేదు. మంత్రిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వకూడదని మంత్రిమండలి నిర్ణయిస్తే దానికి విరుద్ధంగా మంత్రి ప్రాసిక్యూట్‌కు అనుమతి ఇచ్చే అధికారం గవర్నర్‌కు లేదు’ అని అర్టికల్ 163 గురించి నివేదికలో ప్రస్తావించారు. నిబంధనల ప్రకారం ఒక మంత్రిని ప్రాసిక్యూట్ చేయాలని దర్యాప్తు సంస్థ భావించిన పక్షంలో, ఆ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియచేస్తుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాన్ని ముఖ్యమంత్రికి పంపిస్తారు. దీనిపై మంత్రిమండలి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని గవర్నర్‌కు పంపిస్తారు. మంత్రిమండలి సిఫార్సు మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిచ్చే అధికారం ప్రభుత్వానికి ఉండగా, మంత్రులు, ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతిచ్చే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. అయితే ప్రస్తుతం మంత్రి ధర్మాన వ్యవహారానికి వస్తే, ధర్మానను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వకూడదని మంత్రిమండలి తీర్మానించిన తర్వాత దీనికి విరుద్ధంగా గవర్నర్ అనుమతి ఇచ్చినట్లయితే ఈ నివేదికలో పేర్కొన్న అర్టికల్ 163 వివరణకు అర్థం ఉంటుంది. మంత్రి ధర్మాన రాజీనామా వ్యవహారం, ఆయన్ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చే విషయం ఇప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల్లోనే ఉంది. గవర్నర్ వరకు వెళ్ళనే లేదు. అటువంటపుడు గవర్నర్ అధికారాల గురించి ఈ సందర్భంలో ప్రస్తావించడం అన్నది అసమంజసమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మంత్రిమండలి అధికారాలకు సంబంధించి గతంలోని పలు కేసులను ఈ నివేదికలో పొందుపరచారు. ఉదాహరణకు మధ్యప్రదేశ్‌లో 2004లో ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులపై దాఖలైన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇక్కడ ప్రస్తావించారు.
ఇండోర్ డెవలెప్‌మెంట్ అథారిటీ ఏడున్నర ఎకరాలను సేకరించింది. అయితే భూమిని సొంతదారులకే అప్పగించేలా నిర్ణయం తీసుకోవడంలో ఇద్దరు మంత్రులకు ప్రమేయం ఉందని లోకాయుక్తకు ఫిర్యాదు అందింది. ఈ కేసును దర్యాప్తు జరిపిన అనంతరం ఈ వ్యవహారంలో ఆ ఇద్దరు మంత్రులు నేర పూరిత కుట్రకు పాల్పడ్డారన్న దానికి తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని, వారిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని మధ్యప్రదేశ్ మంత్రి మండలిని లోకాయుక్త కోరింది. మంత్రిమండలిలో ఈ వ్యవహారంపై చర్చించి మంత్రులు ఇద్దరూ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనడానికి ఏ చిన్న ఆధారం లేదని, వారి మీద ఎటువంటి ప్రాధమిక సాక్ష్యాధారాలు లేవంటూ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వరాదని మంత్రిమండలి తీర్మానించింది. అయితే మంత్రులిద్దరూ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనడానికి తగిన సాక్ష్యాధారాలు, పత్రాలు ఉన్నాయంటూ వారిని ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. చివరకు ఈ కేసు న్యాయస్థానానికి ఎక్కి సింగిల్ జడ్జి నుంచి డివిజన్ బెంచ్‌కి తర్వాత ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం వరకూ వెళ్ళింది. మంత్రిమండలి నిర్ణయం, సిఫార్సులకు అనుగుణంగానే గవర్నర్ వ్యవహరించాలి, గవర్నర్‌కు కొన్ని ఆంశాల్లో మాత్రమే విచక్షణాధికారాలను రాజ్యాంగం కల్పించింది. అందులో మంత్రులను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతించే అశం లేదు. మంత్రిమండలి నిర్ణయానికి వ్యతిరేకంగా మంత్రులను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతి ఇవ్వడం చెల్లదన్న అంశాలు ఈ కేసు సందర్భంగా వెల్లడైనట్టు ముఖ్యమంత్రికి అందజేసిన నివేదికలో పేర్కొన్నారు.
ఇక క్విడ్ ప్రోకో అంశం గురించి ప్రస్తావిస్తూ, క్విడ్ ప్రోకో కేవలం ఉద్యోగులకు సంబంధించిన వ్యవహారం మాత్రమేనని, ప్రమోషన్లు, వేతనాల పెంపు, షిఫ్టుల ప్రకారం పనులు అప్పగించడం, పనితీరు ప్రమాణాలు, అదేవిధంగా విద్యాపరమైన అంశాల్లో మాత్రమే క్విడ్ ప్రోకో వేధింపులు అన్నవి తలెత్తుతాయని వివరించారు. అసలు క్విడ్ ప్రోకో అన్నది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్‌లోని సెక్షన్ 20 ప్రకారం న్యాయస్ధానాల్లో కూడా చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. అయితే క్విడ్ ప్రోకో వల్ల లాభ పడిన వ్యక్తి ఎవరన్నది దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉందని తెలిపారు.
అసలు ఆరోపణల ప్రస్తావన ఎక్కడ?
ఇలాఉండగా, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పైనగాని, తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు పైనగాని సిబిఐ చేసిన ఆరోపణ మంత్రివర్గ నిర్ణయాలకు విరుద్ధంగా జీవోలు జారీ చేశారన్నది. అలాగే మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా గవర్నర్ నిర్ణయాలు తీసుకోవడానికి లేదని మొదట్లో వాదించి చివరకు వచ్చేసరికి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం పక్షపాత వైఖరితో ఉందని భావించిన పక్షంలో గవర్నర్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకోవచ్చని పేర్కొనడం గమనార్హం.
source:
http://www.andhrabhoomi.net/node/43335

నేటి నుంచి ఆటోచార్జీల మోత!

రాష్ట్రవ్యాప్తంగా ఆటోచార్జీలు మోత మోగించనున్నాయి. ఆటోచార్జీలను పెంచుతూ ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. పెరిగిన చార్జీలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా రాష్ట్రవ్యాప్తంగా గురువారంనుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటిదాకా వసూలు చేస్తున్న కనీస చార్జీ రూ.14 (తొలి 1.6 కి.మీ.వరకు) ఇకపై రూ.16 కానుంది. ఆపై ప్రతి కి.మీ.కు అదనంగా రూ.9 వసూలు చేయనున్నారు. నిరీక్షణ చార్జీల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం నిమిషం వెయిటింగ్‌కు వర్తింపజేస్తున్న 25 పైసలే ఇకపై కూడా అమలులో ఉంటుంది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 5 వరకు మీటరు చార్జీపై 50 శాతం అదనంగా వసూలు చేస్తారు. ఈ మేరకు ఆటో రిక్షాల్లోని డిజిటల్ మీటర్లలో మార్పులు చేయాలని అధికారులను రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి లక్ష్మీపార్థసారథి ఆదేశించారు.

రాష్ట్రంలో కనీవినీ ఎరగని కరెంట్ సంక్షోభం

రాష్ట్రంలో కనీవినీ ఎరగని కరెంట్ సంక్షోభం

సాగుకు 2-3 గంటలే..
992 గ్రామాలలో 'న్యూస్ లైన్'సర్వే
అదికూడా విడతలవారీ సరఫరానే
దాంతో నిలువునా కాలిపోతున్న మోటార్లు
పలుచోట్ల ఒక్క గంట కరెంటుతోనే సరి
పూర్తిగా ఆశలు వదిలేసుకుంటున్న రైతన్న
బిందెలతో నీరు చల్లుకుంటున్న కొందరు
పశువుల మేతగా మారుతున్న వరి

జీవనాధారమైన సాగు సాగడం లేదు. ప్రగతికి ప్రాణాధారమైన పారిశ్రామిక రంగమూ పడకేసింది. వెరసి రాష్ట్రం పూర్తిగా కుదేలవుతోంది. సర్కారీ అలసత్వం పుణ్యమాని మున్నెన్నడూ కనీవినీ ఎరగని సంక్షోభంలో కూరుకుపోతోంది. వ్యవసాయానికి 7 గంటలూ టంచనుగా ఉచిత కరెంటు ఇచ్చేందుకంటూ పరిశ్రమలపై సీఎం కిరణ్ విధించిన భారీ కోతలు పూర్తిగా వాటి వెన్ను విరిచాయి. ఒకటి తర్వాత ఒకటిగా రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల పుట్టి మునుగుతోంది. చేతిలో ఉన్న ఆర్డర్లను పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపలేని అనివార్యత ఒకవైపు. అలాగని డీజిల్‌పై ఆధారపడి, ఆ భారాన్ని భరించలేక నిండా మునగలేని నిస్సహాయత మరోవైపు. ఫలితంగా చిన్న పరిశ్రమలన్నీ ‘టు-లెట్’ బోర్డులు తగిలించుకున్నాయి! అద్దెకు తీసుకునే వారికోసం నిస్సహాయంగా ఎదురు చూస్తున్నాయి. దాంతో వేలాది మంది కార్మికులు ఉన్నపళాన వీధిన పడుతున్నారు. జీవనోపాధి కోల్పోయి అల్లాడుతున్నారు. కనీసం తమ ఆకలిని కూడా తీర్చలేని సర్కారు డౌన్ డౌన్ అంటూ నిరసిస్తున్నారు. మరోవైపు సాగు సాకుతో కార్మికుల పొట్ట కొడుతూ, పరిశ్రమల ఊపిరి తీస్తున్న కిరణ్ సర్కారు.. కనీసం వ్యవసాయానికైనా సజావుగా కరెంటిస్తోందా అంటే అదీ లేదు! 

వ్యవసాయానికి రాష్ట్రంలో ఎక్కడా 3 గంటలకు మించి ఉచిత కరెంటు అందడమే లేదు! అది కూడా విడతలవారీగా వస్తూ, పోతూ అన్నదాతలతో చెలగాటమాడుతోంది. ‘సాగుకు 7 గంటల కరెంటిస్తా’మన్న కిరణ్ ప్రకటన నేపథ్యంలో మండలానికి ఒక గ్రామం చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 992 గ్రామాల్లో బుధవారం ‘న్యూస్‌లైన్’ చేసిన సర్వేలో ఈ దారుణ వాస్తవాలు వెల్లడయ్యాయి. సర్కారీ కరెంటును నమ్ముకోలేక ఏకంగా సాగుకే తిలోదకాలు వదులుతున్న రైతులు కొందరైతే.. జనరేటర్లు, డీజిల్ ఇంజన్లతో పడరాని పాట్లు పడుతున్నవారు మరికొందరు! కరెంటు కొరతను అధిగమించేందుకు కనీసపాటి ప్రయత్నం కూడా చేయకుండా.. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల ఉసురు తీస్తున్న ప్రభుత్వం.. పరిస్థితి పూర్తిగా విషమిస్తున్న ఈ తరుణంలో కూడా తనదైన నీరో మార్కు నిరక్ష్యాన్నే ప్రదర్శిస్తోంది!

సాగు కుదేలు

న్యూస్‌లైన్ నెట్‌వర్క్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా వరి నాట్లు దాదాపుగా పూర్తయ్యే దశకు చేరాయి. పంటకు నీరు అధికంగా పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో కూడా కరెంటు సరఫరాపై ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా సాగుకు రోజుకు మూడు గంటలు కూడా నిరంతరాయంగా కరెంటు ఇవ్వలేకపోతోంది. విడతలవారీగా ఇస్తూ పుట్టి ముంచుతోంది. రైతుల జీవితాలతో ప్రభుత్వం అక్షరాలా చెలగాటమాడుతోంది. పలుచోట్ల కేవలం అరగంట, ముప్పావు గంట కరెంటుతో సరిపెడుతోంది! ఇలా వస్తున్న కోతల కరెంటు కూడా పదేపదే ట్రిప్ అవుతుండటంతో వేలాదిగా మోటార్లు కాలిపోతున్నాయి. వాటిని బాగుచేయించుకోలేక రైతులు మరింతగా రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు. పలుచోట్ల వారు జనరేటర్లను, ఆయిల్ ఇంజన్లను నమ్ముకుంటున్నారు. ఇంకొన్ని చోట్ల కూలీలను పెట్టి బిందెలతో నీళ్లు చల్లుకుంటూ పడరాని పాట్లు పడుతున్నారు. తద్వారా రైతులు బావుకుంటున్నదేమీ లేకపోగా, సాగు వ్యయం మాత్రం తడిసి మోపెడవుతోంది. 

ముఖ్యంగా బోర్ల కింద సాగు చేస్తున్న వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఇన్ని పాట్లు పడలేక చాలాచోట్ల రైతులు సాగుపై పూర్తిగా ఆశలు వదిలేసుకుంటున్నారు. మరో దారి లేక తమ పొలాలను బీడుపెట్టుకుంటున్నారు. ఇప్పటికే పొట్ట దశకు చేరిన వరి పంటను పశువుల మేతకు వదిలేస్తున్నారు. ఇలా ప్రతి జిల్లాలోనూ కరెంటు కోతల దెబ్బకు వేలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. ఉచిత కరెంటు సరఫరా తీరుతెన్నులపై బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ‘న్యూస్‌లైన్’ జరిపిన పరిశీలనలో వెలుగులోకి వచ్చిన దారుణ వాస్తవాలివి! ఆ జిల్లా, ఈ జిల్లా అని తేడా లేకుండా రాష్ట్రమంతటా ఇదే దుస్థితి నెలకొంది. విచ్చలవిడి కోతలకు తాళలేక సాగు తమవల్ల కాదంటూ కొందరు నిస్సహాయంగా చేతులెత్తేస్తుంటే.. మరికొందరు కన్నెర్రజేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల అన్నదాతలు రోడ్డెక్కి ఉద్యమించారు. సబ్‌స్టే షన్లను ముట్టడించారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి సబ్‌స్టేషన్‌లోఫర్నిచర్‌ను బయట పడేశారు. లింగంపేట మండలం పర్మళ్ల సబ్‌స్టేషన్‌లో ఫర్నిచర్‌కు నిప్పు పెట్టారు.

అనంతలో 1.35 లక్షల ఎకరాలు బీడు!

అనంతపురం జిల్లాలో కోతల దెబ్బకు ఇప్పటికే 75 వేల ఎకరాల్లో వేరుశనగ, వరి పంటలు ఎండిపోయాయి. మరో 40 వేల ఎకరాల్లో పండ్ల తోటలకూ అదే గతి పట్టింది! కోతలను నిరసిస్తూ డీ హీరేహాళ్ మండలం ఓబుళాపురం, గుమ్మఘట్ట, చిలమత్తూరు, కంబదూరు, కళ్యాణదుర్గం సబ్‌స్టేషన్లను బుధవారం రైతులు ముట్టడించారు. వరంగల్ జిల్లాలో పలు గ్రామాల్లో రోజుల తరబడి కరెంట్ సరఫరాయే ఉండటం లేదు! హసన్‌పర్తి మండలం మడిపల్లిలో మూడు రోజులుగా వ్యవసాయ మోటర్లకు సరఫరా పూర్తిగా ఆగిపోయింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోనైతే బుధవారమంతా కలిపి సాగుకు కేవలం ఒక గంటే ఇచ్చారు. అది కూడా ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో! దాంతో ఏ రైతూ మోటారును ఆన్ కూడా చేయలేదు! విజయనగరం జిల్లాలో సాగుకు సగటున కేవలం రెండు గంటలు మాత్రమే కరెంటు వస్తుండగా, ఏకంగా పదిసార్లు ట్రిప్ అవుతోంది. దాంతో రైతులు 24 గంటలూ తిండీతిప్పలు మానుకుని పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది.

సీఎం నియోజకవర్గంలోనూ..!

చిత్తూరు జిల్లాలో సీఎం కిరణ్ సొంత నియోజకవర్గం పీలేరులో కూడా ఉచిత కరెంటు 3 గంటలకు మించడం లేదు. దానికి కూడా వేళాపాళా ఉండటం లేదు. దాంతో ఆటోమేటిక్ స్టార్టర్లు ఏర్పాటు చేసుకున్నా ఫలితం లేకుండా పోతోంది. వరదయ్యుపాళెం వుండలం వూవిళ్లపాడులోనైతే 215 ఎకరాలను రైతులు బీడుగా వదిలేశారు. పొట్ట దశలో ఉన్న పైరును కూడా పశువుల మేతకు వదిలేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో ఇప్పటికే చాలా మండలాల్లో బోరుబావుల కింద వరి ఎండిపోతోంది. దానికి తోడు రోజుకు కనీసం ఆరుసార్లయినా కరెంటు ట్రిప్ అవుతుండటంతో మోటార్లు కాలిపోతున్నాయి. కృష్ణా జిల్లాలోకెల్లా అత్యధికంగా వ్యవసాయ కరెంటు కనెక్షన్లున్న నూజివీడు నియోజకవర్గంలో రోజుకు కేవలం అరగంట మాత్రమే సరఫరా జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా సోంపేట, గార, ఇచ్ఛాపురం, నందిగాం, రణస్థలం, లావేరు మండలాల్లో నీరందక పంటలు ఎండిపోతున్నాయి. లోడ్ హెచ్చుతగ్గుల దెబ్బకు తరచూ మోటార్లు కాలిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం హాజీపూర్‌లో మొత్తం 600 ఎకరాలకు గాను సగం భూములను బీడుగా వదిలేశారు! లక్సెట్టిపేట మండలం ఇటిక్యాలలో కేవలం 2 గంటలే కరెంటు ఇస్తుండగా, కనీసం రెండుసార్లు ట్రిప్ అవుతోంది. దాంతో నారుమళ్ల కోసం రైతులు రూ.600 ఖర్చుతో జనరేటర్లు అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఖానాపూర్ మండలం బాదన్‌కుర్తిలో బుధవారం ఉదయమే ఏకంగా 12 సార్లు కరెంటు పోయింది! కర్నూలు జిల్లా ఆదోని మండలం హువ్వనూరులో 300 ఎకరాల్లో పత్తి, మిరప, ఉల్లి, వేరుశనగ సాగవుతున్నాయి. కానీ వారం రోజులుగా రెండు విడతలూ కలిపి కూడా కనాకష్టంగా కేవలం గంటా 45 నిమిషాలే కరెంటందుతోంది. దాంతో మొత్తం పంటలూ ఎండిపోయే పరిస్థితి నెలకొంది.

రోజంతా 45 నిమిషాలే: గుంటూరు జిల్లా నాదెండ్ల, చిలకలూరిపేట మండలాల్లో బోర్ల కింది పంటల్ని ఎలాగోలా దక్కించుకునేందుకు జనరేటర్లు, ఆయిల్ ఇంజన్లతో రైతులు పాట్లు పడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎమర్జెన్సీ లోడ్ సాకుతో పలుచోట్ల కేవలం 2 గంటలే కరెంటిస్తున్నారు. కొన్ని గ్రామాలకు 5 గంటలు ఇస్తున్నా విడతలవారీగా సరఫరా చేస్తుండటంతో ప్రయోజనం లేకుండా పోతోంది. నెల్లూరు జిల్లాలో ఏకంగా సగం గ్రామాల్లో 2 గంటలు కూడా సరఫరా కావడం లేదు. వరికుంటపాడు మండలం కేంద్రంలో అయితే రోజంతా కలిపి కేవలం 45 నిమిషాలతో సరిపెట్టారు. ఖమ్మం జిల్లాలో పలుచోట్ల వరి, పత్తి రైతులు కూలీలను పెట్టి పొలాలకు బిందెలతో నీళ్లు చల్లిస్తున్నారు! ఇందుకు రోజుకు కనీసం రూ.600 ఖర్చవుతోంది. విశాఖ జిల్లాలో 26 వేల వ్యవసాయ బోర్లపై ఆధారపడి వివిధ పంటలు సాగు చేసిన 17,790 హెక్టార్ల పరిస్థితి దైవాధీనంగా మారింది. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం మాచాపూర్‌లోనైతే సాగుకు కేవలం 45 నిమిషాల కరెంటుతో సరిపెట్టారు! అప్రకటిత కోతలు తప్పడం లేదని ఏపీఎన్‌పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ ఎ.నగేశ్ అంగీకరించారు. ఏకంగా 1.9 లక్షల మంది రైతులు బోర్లనే నమ్ముకునే మహబూబ్‌నగర్ జిల్లాలో పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది! ఎటు చూసినా ఎండిపోతున్న పంటలే దర్శనమిస్తున్నాయి. దాంతో జిల్లా అంతటా కరువు ఛాయలు అలముకుంటున్నాయి. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం లాల్‌గాడి మలక్‌పేటలో వరి పూర్తిగా ఎండిపోయింది. తాండూరు, పరిగి, వికారాబాద్ డివిజన్లలో లో ఓల్టేజీ సమస్యతో మోటార్లే గాక కొన్నిచోట్ల ఏకంగా ట్రాన్స్‌ఫార్మర్లే కాలిపోయి మూలన పడుతున్నాయి!

పరిశ్రమలు టు-లెట్.కుదేలవుతున్న పారిశ్రామికవేత్తలు


బ్యాంక్‌ల నుంచి తీసుకున్న అప్పులనైనా చెల్లించవచ్చన్న ఆశతో టు-లెట్ బోర్డులు
ఇప్పటికే పలు పరిశ్రమల మూసివేత.. మరికొన్ని నేడో రేపో

టులెట్ బోర్డు.. దీన్ని మనం ఇళ్ల ముందు చూశాం.. వాణిజ్య సంస్థల భవన సముదాయాల ముందూ చూశాం.. అయితే, ప్రస్తుతం ఈ బోర్డు మన రాష్ట్రంలోని పారిశ్రామికవాడల్లోని పరిశ్రమల ముందు వేలాడుతోంది.. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభ తీవ్రతకు గుర్తుగా.. పారిశ్రామికవేత్తల దైన్యానికి చిహ్నంగా..
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇల్లు, వాణిజ్య సంస్థకు భవనాన్ని అద్దెకు తీసుకున్న తరహాలో ఇకపై పరిశ్రమలను కూడా అద్దెకు తీసుకునే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. విద్యుత్ కోతల వల్ల పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించేందుకు హైదరాబాద్‌లోని నాచారం, మల్లాపూర్ పారిశ్రామికవాడలను ‘న్యూస్‌లైన్’ సందర్శించింది. ఈ సందర్భంగా అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యుత్ కోతల వల్ల ఇప్పటికే అనేక పరిశ్రమలు మూతపడగా.. మరికొన్ని నేడో రేపో అన్నట్లున్నాయి. కరెంటు కోతల వల్ల పరిశ్రమను పూర్తిస్తాయిలో నడపలేక.. కార్మికులకు వేతనాలు చెల్లించలేక.. భారీగా వస్తున్న విద్యుత్ బిల్లులను భరించలేక పారిశ్రామికవేత్తలు అవస్థలు పడుతున్నారు. అయితే, పరిశ్రమను మూసివేసేందుకు మనసురాక.. కొందరు వాటిని అద్దెకు ఇచ్చేందుకు నిర్ణయిస్తున్నారు. కనీసం అద్దెకు ఇస్తే.. బ్యాంకు వద్ద తీసుకున్న అప్పులనైనా కొంతమేరకు చెల్లించవచ్చని వారు ఆశపడుతున్నారు. ఎందుకంటే అప్పులను మూడు నెలల పాటు చెల్లించలేకపోతే నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ)గా ప్రకటించే ప్రమాదముంది. అందుకే తమ పరిశ్రమలకు టులెట్ బోర్డులను తగిలిస్తున్నారు. మరోవైపు కార్మికులది మరింత దుర్భర పరిస్థితి. పరిశ్రమలు మూతపడుతుండటంతో వేలాది మంది రోడ్డున పడుతున్నారు. పనిచేస్తున్న పరిశ్రమల్లోనూ వారికి 15 రోజుల జీతమే గతి అవుతోంది.

కోతలతో ఆర్డర్లు పూర్తి చేయలేకపోతున్నాం..

రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలన్నీ దాదాపుగా అనుబంధ పరిశ్రమలే. ఈ పరిశ్రమల ఉత్పత్తులకు ప్రధానంగా ఆర్డర్లు వచ్చేది బయుటి రాష్ట్రాల నుంచే. ఇందుకు కారణం రాష్ట్రంలో ప్రధాన పరిశ్రమలు పెద్దగా లేకపోవడమే. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి ఆర్డర్లను ఎంతో కష్టపడి తెచ్చుకోవాల్సి ఉంటుంది. కష్టపడి ఆర్డర్లు తెచ్చుకున్నా.. కరెంటు కోతల వల్ల వాటిని సకాలంలో అందించలేకపోతున్నామని పారిశ్రామిక వేత్తలు వాపోతున్నారు. దీంతో కొత్తగా ఆర్డర్లు రావడం లేదని అంటున్నారు. వచ్చిన కొద్దిపాటి ఆర్డర్లను కిందామీదా పడి డెలివరీ చేస్తున్నా.. ఆలస్యం చేయడం వల్ల పెనాల్టీ పడుతుందని.. దాని వల్ల కొద్దిపాటి మార్జిన్ కూడా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నేను బేరింగ్స్ తయూరుచేస్తుంటాను. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రల నుంచి ఆర్డర్లు వస్తుంటాయి. అనుకున్న సమయానికి డెలివరీ చేయకపోతే 10 నుంచి 15 శాతం వరకూ జరిమానా విధిస్తారు. దీంతో పరిశ్రమ నడిపినప్పటికీ లాభం ఏమీ మిగలడం లేదు. పైగా కొన్నిసార్లు నష్టాలొస్తున్నాయి’ అని చంద్రయ్య అనే పారిశ్రామికవేత్త వాపోయారు.

ఆ రోజుల్లోనూ కోతలు.. వెతలు..

విద్యుత్ కోతలు నిరంతరం నడిచే పరిశ్రమలకు(కంటిన్యూయుస్ ప్రాసెసింగ్) కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. ఈ పరిశ్రమలు నిరంతరం నడవాలంటే నిరంతరాయంగా కరెంటు ఉండాల్సిందే. అయితే, కోతలు లేని రోజుల్లోనూ సాయంత్రం నాలుగు గంటల పాటు విద్యుత్‌ను కట్ చేయడం వల్ల ప్రధానంగా రబ్బరు, ప్లాస్టిక్, స్టీలు, క్యాస్టింగ్, ఫోర్జింగ్, ఐస్ తయూరీ, ఫార్మా వంటి పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. విద్యుత్ కోతల వల్ల బాగా వేడి చేసిన ఫర్నేస్‌ను మళ్లీ వేడి చేయూల్సి వస్తోంది. తద్వారా అదనపు విద్యుత్‌తో పాటు తయారవుతున్న ఉత్పత్తులు కూడా అనుకున్న విధంగా వచ్చే అవకాశం ఉండదని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. ఉదాహరణకు.. బేరింగ్‌లు తయూరు చేసేందుకు ఫర్నేస్‌ను 800 డిగ్రీల వరకు వేడి చేయూల్సి ఉంటుంది. ఇందుకు 12 గంటల సమయం పడుతుంది. తర్వాత మరో పది గంటల పాటు ఉడకపెట్టాల్సి(సాకింగ్) ఉంటుంది. వురో 10-13 గంటల పాటు బ్యాలెన్సింగ్ చేయూలి. అప్పుడే బేరింగ్ అనుకున్న విధంగా తయారవుతుంది. అయితే, కరెంటు ఉన్న రోజుల్లోనూ 4 గంటల పాటు విద్యుత్ నిలిచిపోతుండటంతో ఆ సమయంలో వేడి అయిన ఫర్నేస్ మళ్లీ చల్లబడుతుంది. దీంతో దాన్ని మళ్లీ వేడిచేయూల్సి ఉంటుంది. అంటే మొత్తం వ్యవహారం మొదటికొస్తుందన్నమాట. అంతేకాదు.. దీని వల్ల తయారుచేయాల్సిన బేరింగ్ కూడా దెబ్బతినే ప్రమాదముంది. అటు కరెంటు బిల్లుల రూపంలో పారిశ్రామికవేత్తలపై అదనపు భారం పడుతోంది.

వేతనం..15 రోజులే..

విద్యుత్ కోతల వల్ల కార్మికులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటి వల్ల నెలలో 15 రోజులకు మించి పరిశ్రమలు నడవడం లేదు. ఈ కోతలు గతేడాది అక్టోబర్ నుంచీ అమల్లో ఉన్నాయి. మొదట్లో పరిశ్రమ 15 రోజులు నడిచినప్పటికీ నెల జీతాన్ని కార్మికులకు చెల్లించేవారమని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. తర్వాత మాత్రం 15 రోజుల పనికి నెల జీతం చెల్లించడం తమ వల్ల కావడం లేదని వాపోతున్నారు. అందువల్ల ‘నో వర్క్-నో పే’ సూత్రాన్ని పాటిస్తున్నామని చెబుతున్నారు. తద్వారా కార్మికులకు కేవలం 15 రోజుల వేతనమే లభిస్తోంది. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు సగటున నెలకు రూ.7 వేల నుంచి 8 వేల జీతం వస్తుంది. ప్రస్తుతం ఇది రూ.3,500 నుంచి 4 వేలకు పడిపోయింది. ఈ కాస్త జీతంతో బతుకును వెళ్లదీయుడం కష్టంగా మారిందని కార్మికులు వాపోతున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అనేక పరిశ్రమల్లో పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరంతా స్వరాష్ట్రాలకు తరలిపోతున్నారు. కేవలం 15 రోజుల వేతనంతో పనిచేయుడం మా వల్ల కాదు మహాప్రభో అంటూ రెలైక్కి సొంత ఊర్లకుపోతున్నారు. మరోవైపు పరిశ్రమలు కూడా దీని వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నాయి. నిపుణులైన కార్మికులు వెళ్లిపోతుండటంతో పరిశ్రమ నడపడం కష్టమవుతోందని వారంటున్నారు.


రాష్ట్రంలో పరిశ్రమలు..
భారీ పరిశ్రమలు 4,351
పనిచేస్తున్న కార్మికులు 10.22 లక్షలు
పెట్టిన పెట్టుబడి రూ.1,11,928 కోట్లు
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 1.88 లక్షలు
పనిచేస్తున్న కార్మికులు 20.36 లక్షలు
పెట్టుబడి రూ. 33,811 కోట్లు



బిల్లులతో గుండె గుభేల్..

ఏప్రిల్‌లో మొత్తం కరెంటిచ్చారు. జూలైలో 15 రోజులే ఇచ్చారు. అయితే, కరెంటు చార్జీలు పెంచిన తర్వాత ఏప్రిల్‌లో నా కంపెనీకి వచ్చిన బిల్లు రూ.7,17,393. జూలై నెలకుగానూ ఆగస్టులో వచ్చిన బిల్లు ఏకంగా రూ.9,83,778. కోతల సమయంలోనే ఎక్కువ బిల్లులు వస్తున్నాయి. విద్యుత్ కోతల వల్ల ఫర్నేస్‌ను మళ్లీ వేడి చేసేందుకు ఎక్కువ విద్యుత్ అవసరమవుతోంది. ఉత్పత్తి సరిగా కాకున్నా.. బిల్లు మాత్రం ఎక్కువ వస్తోంది. కోతల వల్ల పరిశ్రమ నడవకపోవడమే కాదు.. నడిచిన రోజులకూ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చి నష్టపోతున్నాం.

-చంద్రయ్యు, నాచారం, పారిశ్రామికవాడ సంఘం ఉపాధ్యక్షుడు


మూసేసుకోవాల్సిందే..
గతంలో ఎన్నడూ ఇంతటి విద్యుత్ కోతలను చూడలేదు. గత వారం రోజుల నుంచి పూర్తిగా కరెంటు లేదు. మాకు సమాచారమూ ఇవ్వడం లేదు. కోతల వల్ల పరిశ్రమను మూసుకునే పరిస్థితి వస్తోంది. డీజిల్‌తో పరిశ్రమను నడపలేం. డీజిల్ సెట్ కొనాలంటే 40 లక్షల మేరకు అవుతుంది. ఉత్పత్తి చేస్తే ఒక యూనిట్ రూ.15 అవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన డీజిల్‌పై వ్యాట్ రీయింబర్స్‌మెంట్ వల్ల మాకు పెద్దగా ఉపయోగం లేదు.
-పీఎస్‌ఎస్ నాయుడు, వుల్లాపూర్ పారిశ్రామిక యూనిట్ల సంక్షేవు సంఘం అధ్యక్షుడు

బతుకు వెళ్లదీయడం కష్టంగా ఉంది..
ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాను. నెలంతా కరెంటు ఉన్నప్పుడు జీతం 8 వేల వరకూ వచ్చేది. ఇప్పుడు 15 రోజులే కరెంటు ఉంటోంది. దీంతో నెలకు 4 వేలే వస్తోంది. దీంతో బతుకు వెళ్లదీయడం చాలా కష్టంగా ఉంది. నాతో వచ్చిన వాళ్లందరూ ఇళ్లకు తిరిగెళ్లిపోయారు.
-సమర్ బహద్దూర్, నాచారం పారిశ్రామికవాడలో కార్మికుడు

సీట్లపై రాజకీయం చేయొద్దు

- బీసీలకు ఇచ్చిన మాటను జగన్‌బాబు నిలబెట్టుకుంటాడు: వైఎస్ విజయమ్మ
- నల్ల కాలువ వద్ద ఇచ్చిన మాట కోసమే ఇంత దూరం ప్రయాణించాడు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి. ఆయన కుమారుడు జగన్ నల్లకాలువ వద్ద ఇచ్చిన మాట కోసం ఇంత దూరం ప్రయాణించాడు. నేను చెబుతున్నా.. బీసీలకు ఇచ్చిన మాటను జగన్‌బాబు తప్పకుండా నిలబెట్టుకుంటాడు. బీసీలకు ఎన్నికల్లో వంద టికెట్లు ఇవ్వడం కాదు.. వంద మంది బీసీలను శాసన సభకు పంపిద్దామనేది జగన్ ప్రతిపాదన. అన్ని పార్టీలూ దీనిని రాజకీయం చేయకుండా చిత్తశుద్ధితో బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నించాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు.

బీసీలకు వంద సీట్లివ్వాలని ప్రతిపాదించినందుకు ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో పలు సంఘాల నాయకులు బుధవారం విజయమ్మను ఆమె నివాసంలో కలుసుకొని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి విజయమ్మ ప్రసంగిస్తూ.. ‘‘వంద సీట్ల ప్రతిపాదన జగన్ కొత్తగా చెప్పలేదు. 2011లో స్థానిక ఎన్నికలు ప్రకటించినప్పుడే 33 శాతం స్థానాలను బీసీలకు కేటాయిద్దామని ప్రకటించారు’’ అని గుర్తు చేశారు. వైఎస్‌ను ప్రశంసిస్తూ పలువురు నాయకులు చేసిన ప్రసంగాలకు విజయమ్మ స్పందిస్తూ.. ‘‘ఆయన మీ హృదయాల్లో ఇంతగా నిలిచిపోయారంటేనే ఆయన చేసిన మేలు ఎంతగా గుర్తుంచుకున్నారో అర్థమవుతుంది. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని వైఎస్ మరణించే వరకూ పరితపించారు’’ అని అన్నారు.

ఈ ప్రతిపాదన చరిత్రాత్మకం : కృష్ణయ్య
బీసీలకు వంద స్థానాలు ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదన చరిత్రాత్మకమైనది, మహత్తరమైనదని ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీలకు వంద టికెట్లు ఇస్తామని టీడీపీ ప్రకటిస్తే, విజయమ్మ ఓ అడుగు ముందుకు వేసి వంద మందిని అసెంబ్లీకి పంపిద్దామని చెప్పడం హర్షణీయమని చెప్పారు. ఈ ప్రతిపాదనను రాజకీయాలతో ముడి పెట్టకుండా అన్ని పార్టీలూ సానుకూలంగా స్పందించాలని కోరారు. బీసీల పట్ల వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఉన్న నిజమైన ప్రేమ, నిజాయతీ, అంకితభావం ఈ ప్రతిపాదనలో కనిపిస్తున్నాయని చెప్పారు. వంద స్థానాలను లాటరీ ద్వారా ఎంపిక చేయడమా లేక ఇతర పద్ధతిని అనుసరించాలా అనేది మేధావులు, కుల సంఘాలు, జర్నలిస్టులు కూర్చుని విసృ్తతంగా చర్చించాలని సూచించారు. 

విజయమ్మ ప్రతిపాదనపట్ల రాష్ట్రంలోని బీసీ వర్గాలన్నీ ఆనందం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. తాను వైఎస్ పక్షపాతినని చాలా మంది చెబుతుంటారని, అయితే వాస్తవంగా వైఎస్ రాజశేఖరరెడ్డే బీసీల పక్షాన చేరారని కృష్ణయ్య అన్నారు. ఎందుకంటే.. వైఎస్ తీసుకున్న ప్రతి చర్యా బీసీలకు మేలు చేసేదిగా ఉండేదని చెప్పారు. విద్య, వైద్యం, ఆర్థికంగా బీసీలు పరిపుష్టం కావడానికి వైఎస్ కృషి చేశారని అన్నారు. వైఎస్ సంక్షేమ పథకాలనే ఎజెండాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పతాకంలో పేర్కొన్నది కనుక జగన్ కూడా వైఎస్ స్ఫూర్తితో బీసీలు, బడుగులకు మేలు చే యాలని ఆయన కోరారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని, అది చరిత్రాత్మకమైనదని తెలిపారు. ఈ పథకం ద్వారా గుడిసెలో నివసించే పేద పిల్లవాడు కూడా ఇంజనీరో, డాక్టరో కాగలిగాడని చెప్పారు. వైఎస్ హయాంలో హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను ఒకసారి 25 శాతం, మరోసారి 40 శాతం పెంచారని వివరించారు. 18 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలకు రుణాలను మాఫీ చేసిన ఘనత వైఎస్‌దేనని చెప్పారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ కన్వీనర్ గట్టు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఓరుగంటి వెంకటేశం (తెలంగాణ బీసీ సంఘం జేఏసీ), రాజేందర్ ముదిరాజ్ (రాష్ట్ర బీసీ హక్కుల పోరాట సమితి), ఉదయగిరి మురళి (రాష్ట్ర రజక సంఘం), అల్మెన్ రాజు (దక్షిణాది రాష్ట్రాల బీసీ సంఘం), జాజుల శ్రీనివాస్ గౌడ్ (బీసీ యువజన సంఘం), జి.శ్రీరమాదేవి (బీసీ సంక్షేమ సంఘం), అంగిరెల్లి నాగరాజు (బీసీ కులాల ఐక్య వేదిక), ర్యాగ రమేష్ (బీసీ విద్యార్థి సంఘం), గుజ్జ కృష్ణ (బీసీ ప్రజా సమితి), గొరిగె మల్లేష్ యాదవ్ (బీసీ ఫ్రంట్), ఎ.రామకోటి ముదిరాజ్ (బీసీ ఐక్య వేదిక).

మల్లేష్ యాదవ్ (బీసీ సంఘర్షణ సమితి), గజేంద్రుల రవి (బీసీ యువజన సంఘం), మల్కచర్ల శ్రీనివాస్ (బీసీ విద్యార్థి సంఘం), ఎస్.వెంకట్ యాదవ్ (బీసీ మేధావుల ఫోరం), నీల వెంకటేష్ (బీసీ సేన), అశోక్ గౌడ్ (బీసీ న్యాయవాదుల సంఘం), ఎల్.ఎ.శివరామయ్య (బీసీ బలిజ సంఘం), సింగం నాగేష్ గౌడ్ (బీసీ ఫెడరేషన్), ఎ.ఆదిశేషుయాదవ్ (బీసీ సంఘం), డాక్టర్ శ్రీనివాసు (బీసీ హక్కుల పోరాట సమితి), జూడి విన్సెంట్ (దళిత క్రిస్టియన్), దండుగుల అశోక్ (వడ్డెర సంఘం యువజన విభాగం), మండల రామకృష్ణ (బోయ సంఘం), కూన దేవయ్య (మహేంద్ర సంఘం), ధర్మరాజు (వడ్డెర సంఘం), కె.రాజేశ్వరరావు (వీరభద్రాయి సంఘం), కాటపల్లి వీరస్వామి (వీరముష్టి సంఘం), అన్నం శివరాఘవయ్య (కృష్ణ బలిజ సంఘం) తదితరులు విజయమ్మను అభినందించారు. రాష్ట్ర, జాతీయస్థాయిలో బీసీల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై విజయమ్మకు కృష్ణయ్య వినతిపత్రం సమర్పించారు.

ఖాతాలపై సాక్షి యాజమాన్యానికి హైకోర్టు అనుమతి

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ల్లోని సాక్షి కరెంటు ఖాతాల నిర్వహణకు తగిన బ్యాంకు గ్యారంటీలు సమర్పించిన తర్వాత ఏవైనా మొత్తాలు మిగిలితే వాటిని ఎస్‌బీఐకి మళ్లించి, ఆ బ్యాంకు నుంచే లావాదేవీలన్నింటినీ నిర్వహించుకునేందుకు సాక్షి యాజమాన్యానికి హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు న్యాయమూర్తి బెజ్జారం చంద్రకుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఐ స్తంభింపజేయని కెనరా బ్యాంకు ఖాతాల్లో ఉన్న మొత్తాలను బ్యాంకు గ్యారంటీలను సమర్పించేందుకు ఉపయోగించుకునేందుకు అనుమతినివ్వాలంటూ జగతి పబ్లికేషన్స్ హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. గతవారం ఇదే వ్యవహారానికి సంబంధించి వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు.. తమ అనుమతి లేకుండా ఎటువంటి బ్యాంకు ఖాతాల లావాదేవీలను నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జగతి పబ్లికేషన్స్ ఈ అనుబంధ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని బుధవారం జస్టిస్ చంద్రకుమార్ విచారించారు.

గతంలో ఇదే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కరెంటు ఖాతాల నిర్వహణకు బ్యాంకు గ్యారంటీలు సమర్పించాల్సి ఉందని, అయితే అందుకు అవసరమైన మొత్తాలు కెనరా బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయని.. వాటిని ఉపయోగించుకునేందుకు అనుమతినివ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి కోర్టును కోరారు. ఆ ఖాతాల నిర్వహణకు అనుమతిస్తే బ్యాంకు గ్యారంటీలు సమర్పించగలమని ఆయన వివరించారు. కోర్టు అనుమతిస్తే ఎస్‌బీఐ నుంచే అన్ని లావాదేవీలను నిర్వహించుకుంటామని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. బ్యాంకు గ్యారంటీలు సమర్పించిన తరువాత.. మిగిలిన మొత్తాలను ఎస్‌బీఐకి మళ్లించి, ఆ బ్యాంకు ద్వారానే లావాదేవీలు నిర్వహించుకోవాలని జగతి పబ్లికేషన్స్‌కు స్పష్టం చేశారు. అంతేకాక జిల్లాలో ఉన్న కెనరా బ్యాంకు ఖాతాలను మూసివేసి, ఆ మొత్తాలను ఎస్‌బీఐకి మళ్లించుకోవచ్చునని స్పష్టం చేశారు. బ్యాంకు గ్యారంటీల సమర్పణకు ముందు కెనరా బ్యాంకు ఖాతాల వివరాలను సీబీఐకి సమర్పించాలని.. సీబీఐ ఆ ఖాతాల వివరాలను పరిశీలించి, మూడు వారాల్లో ఆమోదముద్ర వేయాలని.. ఆ తర్వాతే ఎస్‌బీఐకి కెనరా బ్యాంకు ఖాతాల్లోని నిధులను మళ్లించుకోవచ్చునని తేల్చి చెప్పారు.

అధిష్టానం కుట్రకు మంత్రులు బలి

- జగన్‌ను అణగదొక్కడానికి కాంగ్రెస్ కుట్ర
- జీవోలకు మంత్రులదే పూర్తి బాధ్యత
- వాస్తవాలను ధైర్యంగా చెప్పే దమ్ము మంత్రులకు ఉందా? 

గుంటూరు, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డే లక్ష్యంగా చేస్తున్న నీచ రాజకీయ కుట్రలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరినైనా బలిచేయడానికి వెనకాడబోదన్న సంగతి మరోసారి స్పష్టమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. కేవలం జగన్‌ను రాజకీయంగా బలహీనపర్చాలని, బెయిల్ రాకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం కుట్రపన్ని గోతులు తవ్వుతోందని, చివరకు ఆ గోతిలో కాంగ్రెస్ పార్టీనే పడిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర మంత్రుల్ని కూడా బలిపశువుల్ని చేయడానికి వెనకాడకుండా కాంగ్రెస్ అధిష్టానం పనిచేస్తోందని ఆరోపించారు.

బుధవారం గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడారు. మంత్రులందరూ దివంగత వైఎస్సార్ సంతకాలు పెట్టమంటేనే పెట్టామని చెప్పడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మంత్రులుగా మీరందరూ ఏంచేశారో ఒక్కసారి వాస్తవాలను గమనించి నిర్భయంగా నిజాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆ దమ్ము మీకుందా అని ప్రశ్నించారు. వైఎస్ సంతకాలు పెట్టమన్నారని, జగన్ ఒత్తిడి తెచ్చారని, ఇలా అవాకులు చెవాకులు పేలితే సహించబోమని హెచ్చరించారు. 

ఆనం రామనారాయణరెడ్డి మరీ స్థాయి మించి మాట్లాడుతున్నారని, వై.ఎస్.విజయమ్మ ఏ పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అంబటి అన్నారు. ‘‘వైఎస్ కోసం మంత్రులు, ఐఏఎస్‌లు సంతకాలు చేశారనేది అవాస్తవం. మంత్రులేమీ అనాగరికులు కాదు కదా! మనమంతా ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం.. వైఎస్ ఇప్పుడు లేరు, తిరిగి రాలేరు కాబట్టే బురదజల్లుతున్నారు’’ అని అంబటి ధ్వజమెత్తారు. మంత్రులుగా మీకు బుద్ధి, జ్ఞానం ఉంటే వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు డైమండ్‌బాబు, మామిడి రాము, అల్తాఫ్, చిన్నప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వీరా మన మంత్రులు!

శాసనసభ్యులుగా ఎన్నికై, రాష్ట్రంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్న మంత్రులు చిన్నపిల్లల్లా మాట్లాడటం ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం.

మన రాష్ట్ర మంత్రుల మాటలు వింటుంటే నవ్వొస్తుంది. కీలకమైన ఫైళ్లపై సంతకాలు చేసిన విషయంలో వారు చెబుతున్న కథనాలు చిన్నపిల్లలకు కూడా నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి. వీరు ఏమైనా చిన్న పిల్లలా? లేక జనాన్ని చిన్న పిల్లలు అనుకుంటున్నారా? జనం ఏమైనా అనుకుంటారని సిగ్గుకూడా వారికి ఉన్నట్లులేదు. శాసనసభ్యులుగా ఎన్నికై, రాష్ట్రంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్న మంత్రులు ఇలా మాట్లాడటం ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. ఇటువంటివారిని ఎన్నుకున్నందుకు జనం సిగ్గుపడాలా? ఇలా మాట్లాడుతున్నందుకు ఆ మంత్రులు సిగ్గుపడాలా? 

లేని క్విడ్ ప్రోకోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిపై రుద్దారు. రాజకీయంగా ఆయనని అణచివేసేందుకు ప్రధాన ప్రతిపక్షంతో కలిసి అధికార కాంగ్రెస్ నేతలు కుట్రపన్నారు. ఆ కుట్ర క్రమక్రమంగా బట్టబయలవుతోంది. తాము తీసుకున్న గోతిలో తామే పడినట్లు వారికి ఇప్పటికిగానీ అర్ధంకాలేదు. ఆనాడు జగన్ పై క్విడ్ ప్రోకో ఆరోపణలు చేసినప్పుడు నోరుమూసుకొని కూర్చున్న మంత్రులకు ఇప్పుడు తమదాకా వస్తేగానీ తెలిసిరాలేదు. 

తాము ఒత్తిళ్లకు లోనై సంతకాలు చేశామని కొందరు మంత్రులు వ్యాఖ్యానించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రులేమన్నా రబ్బరు స్టాంపులా లేక నిరక్షరాస్యులా అని జనం ప్రశ్నిస్తున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాతో ఠారెత్తిన మంత్రులు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలీని స్థితిలో ఉన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు మంత్రులు వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడవుతున్న అభిప్రాయాలు విచిత్రంగా ఉన్నాయి. ఎవరో చెబితే తాము ఎక్కడెక్కడో ఉండి కూడా సంతకాలు చేశామని బాధ్యతారహితంగా వాదిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి పట్టుమని మూడు మంత్రిమండలి సమావేశాలు కూడా నిర్వహించలేని దుస్థితిలో ఉంది. ఆనాడు మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి హయాంలో నెలకు కనీసం రెండు సార్లు మంత్రి మండలి సమావేశాలు జరిగేవి. ఆ సమావేశాల్లో సదరు మంత్రులు తమ అనుమానాలను ఎందుకు నివృత్తి చేసుకోలేదు?

26 జీఓల న్యాయబద్ధతను హైకోర్టు ప్రశ్నించినపుడే కౌంటర్ వేయాల్సిన కనీస బాధ్యతని ఈ ప్రభుత్వం విస్మరించింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరించింది. జగన్ ని ఇరుకున పెట్టాలని వారు పన్నిన కుట్ర ఇపుడు రుజువవుతోంది. ఆనాడు జగన్, మంత్రి మోపిదేవి వెంకట రమణ అరెస్ట్ అవడానికి, నేడు మరి కొందరు మంత్రులు అరెస్ట్ అయ్యే పరిస్థితి తలెత్తడానికి ప్రభుత్వ మౌనమే ప్రధాన కారణమని స్పష్టమైంది. అప్పుడు మౌనంగా ఉన్న మంత్రులు ఇపుడు తమదాకా వచ్చేసరికి బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని కోరి అప్పటి ప్రభుత్వం మంత్రి మండలి ద్వారా తీసుకున్న ఉమ్మడి విధాన నిర్ణయాల ఆధారంగానే ఆ 26 జీవోలు జారీ చేశారు. అవి ఏ ఒక్కరి వ్యక్తిగత ప్రయోనాలకు ఉద్దేశించినవి కావు. ఆ విషయం మంత్రులకూ తెలుసు. ఆ జీఓలు సక్రమమైనవేనని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ నాడు మంత్రి మండలి ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఆ జీఓలను జారీ చేసినట్లు ప్రభుత్వం తరపున హైకోర్టుకు తెలిపి ఉంటే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేదికాదు. వాస్తవాలను విస్మరించి జగన్ ను క్విడ్ ప్రోకో కింద ఇబ్బందులకు గురి చేసిన వారిమెడకే చుట్టుకోవడంతో ఇప్పుడు వారు మింగలేక కక్కలేక సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. 

సుప్రీం కోర్టు నోటీసులు: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 26 జీఓలకు సంబంధించి నెల్లూరు జిల్లాకు చెందిన పి.సుధాకర రెడ్డి అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ఆరుగురు మంత్రులకు, 8 మంది ఐఎఎస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. మంత్రులు పి.సబిత ఇంద్రా రెడ్డి, జె.గీతారెడ్డి, ధర్మాన ప్రసాద రావు, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణ, మోపిదేవి వెంకట రమణలకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఆ జీఓలు జారీ చేసిన ఐఎఎస్ అధికారులు ఎస్.వి.ప్రసాద్(ప్రస్తుతం పదవీ విరమణ చేశారు), సివిఎస్ కె శర్మ, ఎం.శామ్యూల్, వై.శ్రీలక్ష్మి, ఆదినారాయణ దాస్, కె.రత్నప్రభ, బి.శ్యామ్ బాబు, మన్మోహన్ సింగ్ లకు కూడా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. 26 వివాదాస్పద జీఓలు జారీ అవడానికి ప్రధాన కారకులు ఈ 14 మంది అని సుధాకర రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.

Popular Posts

Topics :