రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైందని ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని ఆ భగవంతుడే కాపాడాలని రాయపాటి అన్నారు. ప్రస్తుత రాజకీయాలకు తాను సరిపోనని.. అయితే త్వరలోనే రాజకీయ సన్యాసంపై ఓ నిర్ణయం తీసుకుంటానని ఎంపీ రాయపాటి అన్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితి ఉందని.. అయితే 2014 సంవత్సరం వరకు ప్రభుత్వాన్ని లాగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
9/01/2012
కాంగ్రెస్ పరిస్థితి దారుణం: రాయపాటి
Written By news on Saturday, September 1, 2012 | 9/01/2012
9/01/2012
ఫీజు ప్రభుత్వమే భరించాలి: విజయమ్మ
హైదరాబాద్: పేద విద్యార్థుల ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వైఎస్‌ఆర్‌సీపీ ఉద్యమబాట చేపట్టనున్నట్టు విజయమ్మ తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ తీరు నిరసిస్తూ ఈ నెల 6, 7న హైదరాబాద్‌లో నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు విజయమ్మ తెలిపారు. పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తింపచేయాలని ప్రభుత్వానికి విజయమ్మ సూచించారు.
9/01/2012
వైఎస్ నిర్ణయాలు మేలు చేశాయి: ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి
నల్గొండ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు మేలు చేశాయని కాంగ్రెస్ పార్టీ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి గతంలో మంత్రిగా చేసిన అనుభవం లేకపోవడంతో రాష్ట్రం అనేక సమస్యల్లో చిక్కుకుందన్నారు. అనుభవ లేమి కారణంతోనే రాష్ట్రంలోని యంత్రాంగం స్తంభించిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
9/01/2012
'విజయమ్మ ఓటు అడిగితే కాదంటారా?'
గుంటూరు: కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు భయపడుతుంటే..ఎన్నికలు పెట్టాలని అడగడానికి చంద్రబాబు భయపడుతున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. టీడీపీ - కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి, వైఎస్ విజయమ్మ ఓటు అడిగితే కాదనే వ్యక్తి ఉంటాడా అని అంబటి అన్నారు.
వంగవీటి మోహనరంగా బతికున్న రోజుల్లో కాంగ్రెస్ నుంచి బయటకు పంపేందుకు కొందరు ప్రయత్నించగా వైఎస్‌ఆర్ అండగా ఉన్నారని అంబటి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంబటి, లేళ్లఅప్పిరెడ్డి, రామివెంకటరమణ సమక్షంలో 200 మంది వైఎస్‌ఆర్ సీపీలో చేరారు.

వైఎస్సార్ విగ్రహాల ఏర్పాటుకు అడ్డంకులు
తిరుపతి: చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో వైఎస్సార్ విగ్రహాల ఏర్పాటుకు పోలీసులు అడుగడునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. విగ్రహాల ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటూ ఆటంకాలు సృష్టిస్తున్నారు.భారీగా పోలీసులను మోహరించి విగ్రహాల ఏర్పాటును అడ్డుకుంటున్నారు. రేపు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా150 విగ్రహాల ఏర్పాటుకు వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి సర్వ సిద్ధం చేశారు. దీనిలో భాగంగా చంద్రగిరిలో విగ్రహాల ఏర్పాటు చేస్తుండగా పోలీసులు విగ్రహాల ఏర్పాటును అడ్డుకున్నారు. సర్కారు విగ్రహాల ఏర్పాటును అడ్డుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదని వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
పేద ప్రజలకు మూడు పూటలా అన్నం పెట్టిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డని, అటువంటి మనిషి విగ్రహాల ఏర్పాటును అడ్డుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదని భాస్కరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ విగ్రహాల ఏర్పాటుకు మూడ అడుగుల స్థలం ఇవ్వకపోవటం బాధాకరమని ఆయన అన్నారు.

The website contains links to other sites that are not owned or controlled by us. Please be aware that we are not responsible for the privacy practices of such other sites.
YSR Congress Party Offficial website: www.ysrcongress.com
Copy Right & Discliamer
© 2012 www.ysrcongress.net | All rights reserved
This is not official website.This website is for YSR and YS Jagan Mohan Reddy fans.
The views expressed in this blog are endorsed by neither Mr. Y.S.Jagan nor YSR Congress Party
This site should be viewed purely as a source of information and should not be taken to guarantee or warranty for performance of any activity
We are not responsible for any aspect of any web site it does not control, nor does it accept any responsibility for sites linked from this one. Creating a link does not imply that we endorse the views expressed on that linked website.
The website contains links to other sites that are not owned or controlled by us. Please be aware that we are not responsible for the privacy practices of such other sites.
YSR Congress Party Offficial website: www.ysrcongress.com
9/01/2012
మరణానంతర జీవితం!
babu On 9/1/2012 7:39:00 PM | |
|
9/01/2012
'ఫీజు'పై 6,7 తేదీల్లో విజయమ్మ దీక్ష
ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్న కాంగ్రెస్ సర్కార్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమరభేరీ మోగించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అమలులో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆమె ఈనెల 6,7 తేదీల్లో హైదరాబాద్ లో నిరాహార దీక్ష చేయనున్నారు. పేద విద్యార్థుల ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని, అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలని వైఎస్ విజయమ్మ శనివారం డిమాండ్ చేశారు.
9/01/2012
'వైఎస్ హయాంలో అన్నివర్గాలకు లబ్ధి'
నల్గొండ : వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అందరూ లబ్ది పొందాయని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అన్నివర్గాలకు మేలు చేశాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం లేకపోవటంతో రాష్ట్రంలో పాలనా యంత్రాంగం స్తంభించిపోయిందన్నారు. బీసీలకు వంద సీట్లు కాదని... అసెంబ్లీలో వందమందిని కూర్చోపెట్టాలని పురుషోత్తంరెడ్డి అన్నారు.
9/01/2012
వైఎస్ఆర్ సీపీలోకి చెంగల వెంకట్రావు
విశాఖ : విశాఖలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే, టిడిపి సీనియర్ నేత చెంగల వెంకట్రావు పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 15న వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు శనివారమక్కడ తెలిపారు. పాయకరావుపేట ఉప ఎన్నికల్లో తనను తెలుగుదేశం పార్టీ అవమానపరిచిందని అన్నారు. సొంతపార్టీ నేతలే తన ఓటమికి కారణం అయ్యారని చెంగల వ్యాఖ్యానించారు.
9/01/2012
'ఫీజు'పై 6,7 తేదీల్లో విజయమ్మ దీక్ష
ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్న కాంగ్రెస్ సర్కార్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమరభేరీ మోగించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అమలులో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆమె ఈనెల 6,7 తేదీల్లో నిరాహార దీక్ష చేయనున్నారు. పేద విద్యార్థుల ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని, అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలని వైఎస్ విజయమ్మ శనివారం డిమాండ్ చేశారు.
9/01/2012
'ఒంటికన్ను' ఆపరేషన్
|
9/01/2012
ఇడుపులపాయకు మహిళలు
చిత్తూరు : మహానే వైఎస్ రాజశేఖరరెడ్డిని మరవలేమని చిత్తూరు జిల్లా మహిళలు తెలిపారు. మహిళలను లక్షాధికారులను చేసిన ఘనత ఆయనదే వారు తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం నుంచి 29 డ్వాక్రా గ్రూపుల మహిళలు ఇడుపులపాయకు పయనం అయ్యారు. ఈరోజు తెల్లవారు జామున మూడు గంటలకు వీరంతా మహానేత వైఎస్‌ఆర్ ఘాట్‌ను దర్శించుకోవడానికి ఇడుపులపాయ బయల్దేరారు. మహానేత అంటే తమకు ప్రాణమని మహిళలు తెలిపారు.
9/01/2012
జగన్ బెయిల్‌పై కౌంటర్‌కు వారం గడువు
తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో బెయిల్ ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీబీఐకి సుప్రీంకోర్టు వారం రోజులు గడువిచ్చింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని, అందుకు అనుమతివ్వాలంటూ సీబీఐ న్యాయవాది చేసిన అభ్యర్థనకు సుప్రీం కోర్టు అంగీకరించింది. సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన తరువాత బెయిల్ పిటిషన్ తిరిగి విచారణకు వచ్చే అవకాశాలున్నాయి.
9/01/2012
టీవీ9, ఏబీఎన్, ఈటీవీ చానళ్లపై శోభానాగిరెడ్డి ధ్వజం
|
9/01/2012
బంద్‌ను నీరు గార్చాలని చూశారు: వాసిరెడ్డి పద్మ
సర్కారుకు ప్రధాన ప్రతిపక్షం మద్దతు స్పష్టమైందని ధ్వజం
విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించటంలో రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనానికి నిరసనగా తమ పార్టీ చేపట్టిన బంద్‌ను నిర్వీర్యం చేయటానికి ఓ వైపు నుంచి అధికారపక్షం మరో వైపు నుంచి ప్రధాన ప్రతిపక్షం ప్రయత్నించాయని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. కరెంటు లేక చీకటి బాధలు అనుభవిస్తున్న ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరిస్తుంటే పోలీసులు రంగంలోకి దిగి బలవంతంగా వాణిజ్య సంస్థలు, షాపులను తెరిపించారని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ బంద్‌కు సహకరించరాదని తమ కార్యకర్తలందరికి టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారని.. దీన్నిబట్టి ఆ పార్టీ ప్రభుత్వానికి ఎంత మద్దతునిస్తోందో అర్థం అవుతోందని ఈసడించారు. ఆమె శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బంద్‌కు సహకరించొద్దని ఎర్రబె ల్లి చెప్పటమంటే.. విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించటంలో ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీ సమర్ధించినట్లే కదా అని నిలదీశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పోలీసులను భారీగా మోహరించి తమ పార్టీ శ్రేణులపై అణచివేత చర్యలకు దిగిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌టీసీ బస్సులను తిప్పాల్సిందిగా ప్రభుత్వమే ఆదేశాలిచ్చింద ని, పోలీసులు కూడా అతిగా జోక్యం చేసుకున్నారని ధ్వజమెత్తారు. సాధారణంగా అయితే బలవంతంగా షాపులు మూయించే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి కానీ.. అందుకు భిన్నంగా దుకాణదారులు స్వచ్ఛందంగా మూసేసుకుంటూ ఉంటే పోలీసులు బలవంతంగా తెరిపించారని పేర్కొన్నారు. తమ పార్టీకి చెందిన నాయకులను ఇష్టమొచ్చినట్లు అరెస్టు చేశారంటూ ఖండించారు. బంద్ ప్రారంభమయ్యీ కాక ముందే.. బంద్ ప్రభావం ఏమీ లేదంటూ ఓ వర్గం మీడియా అదే పనిగా ప్రసారాలు చేశారని.. తప్పుపట్టారు. ‘‘ఉదయం ఎనిమిది గంటలకే ప్రభుత్వ కార్యాలయాలను చూపించి ఇంకా మూయలేదని అంటున్నారు.. వాస్తవానికి అవి పనిచేసేది పది గంటలకు కదా!’’ అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా విజయవంతంగా జరిగిందంటూ.. పాల్గొన్న ప్రజలందరికీ కతజ్ఞతలు తెలిపారు. ఇది బలవంతపు బంద్ ఏమీ కాదని ప్రభుత్వ వైఫల్యంపై ఆగ్రహంతో ప్రజలందరూ మౌనంగా తమ సంఘీభావాన్ని తెలిపారని ఆమె అభివర్ణించారు.

కాంట్రాక్టర్లతో అధికారుల కుమ్మక్కు
ప్లాంట్లకు వచ్చే దారిలోనూ యథేచ్ఛగా దోపిడీ.. వేబ్రిడ్జిల్లోనూ దొంగలెక్కలు
బయట అమ్ముకుంటూ భారీగా సొమ్ము చేసుకుంటున్న అధికారులు
ఒక్క కేటీపీపీ నుంచే రూ.40 కోట్ల
విలువైన నల్లబంగారం మాయం!
అన్ని విద్యుత్ ప్లాంట్లలోనూ ఇదే పరిస్థితి!
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఒకపక్క కేంద్రంలో ‘కోల్‌గేట్’ యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేస్తుంటే.. మరోపక్క రాష్ర్టంలో భారీ బొగ్గు కుంభకోణాలు వెలుగుచూస్తున్నాయి. ఏకంగా జెన్‌కో విద్యుత్ ప్లాంట్లకు చెందిన బొగ్గే మాయమైపోతోంది. విద్యుత్ ప్లాంట్లకు రైల్వేవ్యాగన్లలో వచ్చిన బొగ్గు.. లారీలకొద్దీ అక్రమంగా బయటకు తరలిపోతోంది. కొన్నిచోట్ల ఎక్కువ బొగ్గు వచ్చినట్లు లెక్కలు చూపిస్తూ.. ఆ అదనపు బొగ్గుకు సరిపడా మొత్తాన్ని అధికారులు దిగమింగుతున్నారు. మరికొన్ని చోట్ల సిసలైన బొగ్గును కొంతమేరకు మార్గమధ్యంలోనే నొక్కేసి ఆ మేరకు రాళ్లు, రప్పలు లారీల్లో నింపి ప్లాంట్లకు పంపుతున్నారు. కాంట్రాక్టర్లతో కలిసి అధికారులు ఆడుతున్న నాటకం రోజుకు రెండు వ్యాగన్లు, ఆరు లారీలుగా సాగిపోతోంది. జెన్‌కో ప్లాంట్ల బొగ్గును కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన అధికారులు బయట అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ‘నల్ల బంగారానికి’ సంబంధించి వెలుగుచూస్తున్న కోట్ల విలువైన అవకతవకలు చూసి జెన్‌కో సిబ్బందే ‘తెల్ల’బోతున్నారు. సింగరేణికి అధిక ధర చెల్లించి మరీ జెన్‌కో కొనుగోలు చేస్తున్న బొగ్గు ఈ విధంగా అక్రమంగా తరలిపోతున్నా పట్టించుకున్న నాధుడే లేడు. ఇటీవల వరంగల్ జిల్లాలోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంటు (కేటీపీపీ)లో గత మూడు నెలల లెక్కలు తీస్తే... ఏకంగా 50 వేల టన్నుల బొగ్గు లెక్క తేలలేదు. సింగరేణి నుంచి కొంటున్న టన్ను బొగ్గు ధర (రవాణాతో కలుపుకుని) సుమారు రూ.2 వేల మేరకు ఉంటుందని అంచనా. ఈ లెక్కన ఒక్క కేటీపీపీలోనే రూ.10 కోట్ల విలువైన బొగ్గు కుంభకోణం జరిగింది. అదీ కేవలం మూడు నెలల కాలానికి మాత్రమే. అంటే ఏటా రూ.40 కోట్ల విలువైన బొగ్గు కేటీపీపీ నుంచి బయటకు తరలిపోతోందన్నమాట. జెన్‌కోకు చెందిన ఇతర విద్యుత్ ప్లాంట్లలోనూ ఇదే పరిస్థితి ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో అవకతవకలు వందల కోట్లలో ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇలా దిగమింగుతున్నారు..!
విద్యుత్ ప్లాంటులోకి బొగ్గుతో వచ్చిన ప్రతి వ్యాగను, లారీ బరువు కొలిచేందుకు ప్లాంటులో వే బ్రిడ్జ్ ఉంటుంది. బొగ్గుతో ఉన్నప్పుడు వ్యాగన్/లారీ ఎంత బరువు ఉంది? బొగ్గును అన్‌లోడ్ చేసిన తర్వాత ఎంత లోడ్ ఉందనే విషయాన్ని ఆటోమేటిక్‌గా ఈ వే బ్రిడ్జ్ నమోదు చేస్తుంది. అయితే ఈ వే బ్రిడ్జ్‌లోని లెక్కలనే అధికారులు తారుమారు చేస్తున్నారు. అధిక బరువు ఉన్నట్టు నమోదు చేస్తున్నారు. వాస్తవంగా తక్కువ బొగ్గు సరఫరా అయినప్పటికీ అధిక బొగ్గు వచ్చినట్టుగా లెక్కల్లో చూపుతున్నారు. అదనంగా చూపించిన మొత్తానికి బయట డబ్బులు వసూలు చేసుకుంటూ.. ప్లాంట్లలో బొగ్గు అధికంగా వినియోగమవుతుందని లెక్కలు చూపడం ద్వారా లెక్కలను సరిసమానం చేసేస్తున్నారు. వర్షాల వల్ల బొగ్గు తడిచి వస్తోందని... అందువల్ల విద్యుత్ ప్లాంట్లలో బాయిలర్‌ను మండించేందుకు ఎక్కువ బొగ్గును వినియోగించాల్సి వస్తోందని సాకులు చెబుతున్నారు. జెన్‌కోలో ఈ తతంగం చాలా కాలం నుంచే నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బొగ్గు స్థానంలో రాళ్లు, మట్టి!
కరీంనగర్ జిల్లాలోని ఉప్పల్ రైల్వేస్టేషన్‌కు వ్యాగన్ల ద్వారా సింగరేణి రామగుండం మైన్స్ నుంచి బొగ్గు సరఫరా అవుతుంది. ఉప్పల్ రైల్వే స్టేషన్ నుంచి సుమారు 65 కిలోమీటర్ల మేరకు రోడ్డు మార్గం ద్వారా భూపాలపల్లి కేటీపీపీకి లారీల్లో బొగ్గును రవాణా చేస్తున్నారు.ప్రతిరోజూ 200 లారీల బొగ్గు సరఫరా అవుతోంది. లారీల ద్వారా బొగ్గును సరఫరా చేసే కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై దారి మధ్యలో లారీలను పక్కదారి పట్టిస్తున్నారు. లారీకింత చొప్పున సిసలైన బొగ్గును తీసివేసి... ఆ స్థానంలో రాళ్లు, మట్టి, ఇసుక, సున్నపురాళ్లతో నింపుతున్నారు. బయటకు తీసిన బొగ్గును అధిక ధరకు సిమెంటు ఫ్యాక్టరీలకు, ఇతర పరిశ్రమలకు విక్రయిస్తున్నారు. లారీలకు సెక్యూరిటీగా ఉండాల్సిన పోలీసులకు నెలవారీ మామూళ్లు అందుతుండటంతో అక్రమ దందా యధేచ్చగా సాగిపోతోందనే ఆరోపణలున్నాయి. విద్యుత్ ప్లాంటులోని పై స్థాయి అధికారుల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద ఎత్తున బొగ్గును అక్రమంగా తరలించడం సాధ్యం కాదనీ చెబుతున్నారు. కేవలం కేటీపీపీలోనే కాకుండా జెన్‌కోకు చెందిన అన్ని విద్యుత్ ప్లాంట్లలోనూ బొగ్గు అక్రమంగా బయటకు తరలిపోతోందని తెలుస్తోంది. కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు (ఆర్‌టీపీపీ)లోకి రైల్వే వ్యాగన్ల ద్వారా వచ్చిన బొగ్గును లారీల ద్వారా బయట విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఫిర్యాదులు కూడా ఉన్నతాధికారులకు అందినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో జెన్‌కోలో భారీయెత్తున జరుగుతున్న బొగ్గు కుంభకోణంపై తక్షణమే దర్యాప్తు జరిపించాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.
అంతిమంగా ప్రజలపైనే భారం..!
రాష్ట్రంలో జెన్‌కోకు వివిధ ప్రాంతాల్లో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు (థర్మల్) ఉన్నాయి. విజయవాడలో 1760 మెగావాట్ల నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్‌టీటీపీఎస్), ఖమ్మం జిల్లాలో 1440 మెగావాట్ల కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్), వైఎస్సార్ జిల్లాలో 1050 మెగావాట్ల రాయలసీమ థర్మల్ విద్యుత్ ప్లాంటు (ఆర్‌టీపీపీ), వరంగల్ జిల్లాలో 500 మెగావాట్ల కాకతీయ థర్మల్ పవర్ ప్లాంటు (కేటీపీపీ), కరీంనగర్ జిల్లాలోని రామగుండం వద్ద 60 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంటు ఉన్నాయి. వీటి మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 4,410 మెగావాట్లు. ఈ విద్యుత్ ప్లాంట్లకు సుమారు 80 వేల టన్నుల బొగ్గు అవసరం. ఈ బొగ్గును మహానది కోల్‌ఫీల్డ్స్, సింగరేణి నుంచి జెన్‌కో సేకరిస్తుంది. అయితే మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి బొగ్గు సక్రమంగా సరఫరా కావడం లేదు. అందువల్ల సింగరేణి నుంచి ఒప్పందం కంటే ఎక్కువ బొగ్గును అధిక ధర చెల్లించి మరీ జెన్‌కో తీసుకుంటోంది. అయినప్పటికీ అవసరాలు తీరకపోవడంతో విదేశాల నుంచి టన్నుకు ఏకంగా సుమారు రూ.5,600 చెల్లించి బొగ్గును కొనుగోలు చేస్తోంది. థర్మల్ ప్లాంట్లలో బొగ్గు మాయమవుతుండటంతో... బొగ్గు ఎక్కువ అవసరమై విద్యుత్ ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతుంది. ఈ విధంగా పెరిగిన వ్యయాన్ని విద్యుత్ చార్జీల రూపంలో వినియోగదారులపైనే మోపుతారు. అంటే అంతిమ భారం ప్రజలపైనే పడుతుందన్నమాట.
జెన్‌కోలో వందల కోట్ల బొగ్గు కుంభకోణం

బంద్ విఫలమంటూ ఓ వర్గం మీడియా వివక్షాపూరిత ధోరణి
ప్రజా సమస్యలను పరిష్కరించటానికి తమ వంతు కృషి చేయాల్సిన మీడియాలోని ఒక వర్గం.. విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజలకు మద్దతుగా చేపట్టిన బంద్ పట్ల కూడా వివక్షా పూరితంగా వ్యవహరించటం పట్ల సీనియర్ పాత్రికేయులు, మీడియా రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆది నుంచీ వైఎస్సార్ కాంగ్రెస్ తమకు బద్ధ శత్రువన్నట్లు వ్యవహరిస్తున్న ఆ వర్గం మీడియా చానళ్లు.. విద్యుత్ సంక్షోభంపై ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన బంద్ పిలుపును.. మీడియా ప్రమాణాల ప్రకారం కనీసం ప్రసారం కూడా చేయలేదు.
ఆ పిలుపు ప్రజల వద్దకు వెళ్లకుండా చూసే ఉద్దేశంతోనే అలా వ్యవహరించాయన్న విమర్శలూ ఉన్నాయి. మరోవైపు.. శుక్రవారం తెల్లవారీ తెల్లవారకముందే అవే టీవీ చానళ్లు బంద్ విఫలం అంటూ ప్రత్యేక కథనాలు ప్రసారం చేయటం మొదలు పెట్టాయి. బస్సులు తిరుగుతున్నాయని, కార్యాలయాలు తెరవకముందే తెరిచారని కథనాలు అల్లుతూ.. బంద్ ప్రభావం ఏమీ లేదన్నట్లుగా ప్రజలకు భ్రాంతి కలిగించేందుకు ప్రయత్నించాయి. ఈ వివక్షా పూరిత ధోరణిని మీడియా రంగ నిపుణులు సైతం తప్పుపడుతున్నారు.

బంద్‌ను నీరుగార్చేందుకు సర్కారు దమననీతి
ఎక్కడికక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ నేతల అరెస్టులు
ఎమ్మెల్యేలు, మహిళా నేతలపైనా దౌర్జన్యకాండ
రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మంది శ్రేణుల నిర్బంధం
వాణిజ్య సంస్థలను బలవంతంగా తెరిపించిన వైనం
పోలీసు బందోబస్తు మధ్య బస్సులు తిప్పే యత్నం
బంద్‌కు సహకరించవద్దంటూ టీడీపీ ప్రచారం
బంద్ విఫలమంటూ ఒక వర్గం మీడియా కట్టుకథలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పడిన విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించటంలో రాష్ట్ర ప్రభుత్వ ఘోర వైఫల్యాన్ని, సర్కారు నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర బంద్ సంపూర్ణంగా ప్రశాంతంగా జరిగింది. పార్టీ శ్రేణులపై ప్రభుత్వ అణచివేత వైఖరి, పోలీసుల అక్రమ నిర్బంధాలు, పెద్ద ఎత్తున అరెస్టుల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అయితే.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ బంద్‌ను విఫలం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం దమననీతిని ప్రదర్శించింది. బంద్‌కు ముందు రోజు అర్ధరాత్రి నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్య నేతలందరినీ అరెస్ట్ చేశారు. శుక్రవారం తెల్లవారుజాము సమయానికే వేలాది మందిని నిర్బంధించారు. ఉదయం రోడ్లపైకి వచ్చిన వారిని వచ్చినట్లు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బంద్ సందర్భంగా తమ నియోజకవర్గాల్లో ఊరేగింపుల్లో పాల్గొంటూ ఉండగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. కొందరిని వారి ఇళ్ల వద్దనే నిర్బంధంలోకి తీసుకున్నారు. జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కన్వీనర్లను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ జెండా పట్టుకుని కార్యకర్తలు కనిపిస్తే చాలు వారిని బలవంతంగా పోలీసులు వ్యాన్‌లోకి ఎక్కించి తరలించుకుపోయారు. బంద్‌ను నిర్వీర్యం చేయాలన్న ఏకైక లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులను ప్రభుత్వం చక్రబంధంలో ఇరికించింది.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 వేల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను రోజంతా నిర్బంధంలో ఉంచారు. జిల్లాల్లోనూ, పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలోపోలీసులను మోహరించారు. రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన ప్రధానమైన విద్యుత్ సమస్యపై ప్రభుత్వంలో కదలిక తెచ్చే లక్ష్యంతో క్రియాశీల ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ బంద్‌కు పిలుపునివ్వగా.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మాత్రం.. ప్రజల కష్టనష్టాలను, ప్రజా ప్రయోజనాలను విస్మరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ బంద్ కనుక ఎవరూ సహకరించవద్దంటూ ప్రచారం చేసింది. మరోవైపు.. వైఎస్సార్ కాంగ్రెస్‌పై కక్ష కడుతున్నట్లు ప్రవర్తిస్తున్న ఒక వర్గం మీడియా కూడా.. బంద్ పిలుపు ప్రజల్లోకి వెళ్లకుండా చేసేందుకు ప్రయత్నించింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే బంద్ విఫలమైందంటూ ఆ వర్గం మీడియా ప్రత్యేక కథనాలు ప్రచారం చేయటం విస్తుగొలిపింది. అయితే.. ప్రభుత్వ, ప్రధాన ప్రతిపక్ష, ఎల్లో మీడియా ప్రయత్నాలను వమ్ము చేస్తూ.. విద్యుత్ కోతలతో సతమతమవుతున్న ప్రజలు తమ వ్యాపార, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసేసి బంద్ పాటించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. జేఎన్‌టీయూ, ద్రవిడ, ఆంధ్రా విశ్వ విద్యాలయాల్లో శుక్రవారం జరగాల్సిన పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలను పోలీసు బందోబస్తు మధ్య తెరచినప్పటికీ హాజరు అంతంతమాత్రంగానే వుంది. కొన్నిచోట్ల పోలీసులు ఉదయం నుంచి రోడ్లపైనే మకాం వేసి దుకాణాలను తెరిపించారు. గురువారం సాయంత్రం నుంచే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు ఫోన్ చేసి బంద్ పాటించవద్దంటూ హెచ్చరించారు. పాఠశాలల వద్ద బందోబస్తు పెట్టారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు బంద్‌లో పాల్గొనవద్దని ఉన్నతాధికారులు ఫోన్ల ద్వారా హెచ్చరించారు.
రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం...

ప్రజా రవాణా వ్యవస్థపై కూడా బంద్ తీవ్రమైన ప్రభావం చూపింది. ఆర్‌టీసీ బస్సులను పోలీసులే బలవంతంగా డిపోల నుంచి బయటకు తీయించి ప్రయాణికులు లేక వెలవెల పోతున్నా నడిపించారు. ఉదయం వేళల్లో రాష్ట్రవ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితం కాగా.. మధ్యాహ్నం తర్వాత చాలా సర్వీసులను పునరుద్ధరించారు. కర్నూలు, గుంటూరు, కడప, చిత్తూరు, శ్రీకాకుళం, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఆర్‌టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. పలుచోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు డిపోల ముందు బైఠాయించటం.. రోడ్డెక్కిన బస్సులను అడ్డుకోవటంతో ఉదయం పూట సర్వీసులను ఆర్‌టీసీ రద్దు చేసింది. నేతలు, కార్యకర్తలను ఆర్‌టీసీ డిపోల వద్ద అరెస్టు చేసి అందరినీ తొలగించిన తరువాత పోలీసులు బస్సులను బయటకు వచ్చేలా చేశారు. వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను అరెస్టు చేయటంతో ఆగ్రహించిన కార్యకర్తలు 8 బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. పలు బస్సుల టైర్లలో గాలి తీసేశారు. బంద్ కారణంగా ఆర్‌టీసీకి శుక్రవారం రూ. 4 కోట్ల ఆదాయం నష్టపోయింది.
అరెస్టుల పర్వం
తెలంగాణ ప్రాంతంలో...

- వరంగల్ జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 986 మంది పార్టీ నేతలను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని.. శుక్రవారం సాయంత్రం వదిలిపెట్టారు. డోర్నకల్‌లో మాత్రం ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపించారు.
- నిజామాబాద్ జిల్లాలో సుమారు 300 మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసకున్నారు. నిజామాబాద్‌లో బస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేసిన కేంద్రపాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా కన్వీనర్ వెంకటరమణారెడ్డి తదితరులను అరెస్టు చేశారు.
- ఖమ్మం జిల్లాలో దాదాపు వెయ్యి మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మంలో పార్టీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్, మహిళా విభాగం కన్వీనర్ బాణోత్ పద్మావతి తదితరులను అదుపులోకి తీసకున్నారు.
- కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంకలో ప్రశాంతంగా బంద్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. వేములవాడలో పార్టీ కేంద్ర నిర్వాహక మండలి సభ్యుడు ఆది శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ పుట్ట మధు తదితరులతో సహా.. మొత్తం 418 మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
- మెదక్ జిల్లాలో 170 మందిని అదుపులోకి తీసుకుని శుక్రవారం సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మెదక్ పట్టణంలో బంద్ చేయాల్సింగా విజ్ఞప్తి చేస్తున్న పార్టీ జిల్లా కన్వీనర్ బట్టి జగపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డిలో ఉదయం ఆరు గంటల ప్రాంతంలో బస్సు డిపో ఎదుట బైఠాయించిన యువజన విభాగం జిల్లా కన్వీనర్ గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
- నల్లగొండ జిల్లాలో సుమారు 900 మందికిపైగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డిని సూర్యాపేటలో.. జిల్లా కేంద్రంలో బంద్‌లో పాల్గొన్న నిజామాబాద్ జిల్లా పరిశీలకుడు గాదె నిరంజన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిశీలకుడు జిన్నారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సూరేపల్లి సత్యకుమారి ఇతర నాయకులను ఆర్‌టీసీ బస్టాండు సమీపంలో అరెస్టు చేసి రూరల్ స్టేషన్‌కు తరలించారు.
- ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 350 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే సోయం బాబూరావు, జిల్లా నాయకుడు బి.అనిల్‌కుమార్‌లతో పాటు 50 మందిని తెల్లవారు జామున్నే అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాయలసీమలో జిల్లాల్లో...
- అనంతపురం జిల్లాలో 2,500 మందికి పైగా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డితో పాటు 40 మంది కార్యకర్తలను అరెస్టు చేసి నగరంలోని వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్ పోలీసుస్టేషన్లలో ఉంచారు.
- చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రెండు వేల మందికి పైగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అంబేద్కర్ విగ్రహం నుంచి పార్టీ కార్యకర్తలతో కలిసి శాంతియుతంగా ర్యాలీగా వెళ్తుండగా.. ఆయనతో పాటు పార్టీ జిల్లా కన్వీనర్ కె.నారాయణస్వామి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో శుక్రవారం ఉదయం కేంద్ర ఆర్థికవుంత్రి చిదంబరం వాహనాన్ని వైఎస్సార్ సీపీ మహిళా నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
- కర్నూలు జిల్లాలో పార్టీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి.మోహన్‌రెడ్డితో పాటు దాదాపు 250 మంది పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు.
- వైఎస్సార్ జిల్లా పులివెందులలో యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కడప నగరంలో తెల్లవారుజామునే పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, నగర కన్వీనర్ అంజాద్‌బాషలను అరెస్టు చేశారు.
కోస్తాంధ్ర జిల్లాల్లో...
- శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 538 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 200 మందికి పైగా ముందస్తుగా అదుపులోకి తీసుకుని వదిలేశారు.
- ప్రకాశం జిల్లాలో గిద్దలూరు, కనిగిరి, ఒంగోలు, ఎస్‌ఎన్ పాడు, మార్కాపురం, కందుకూరు నియోజకవర్గాల్లో 133 మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
- కృష్ణా జిల్లాలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, గుంటూరు జిల్లా ఎన్నికల పరిశీలకుడు పూనూరి గౌతంరెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. సిటీ కన్వీనరు జలీల్‌ఖాన్, మహిళా విభాగ కన్వీనరు తాతినేని పద్మావతిలను హౌస్ అరెస్టు చేశారు. విజయవాడ నగరంలో 263 మంది, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 105 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు.
- పశ్చిమగోదావరి జిల్లాలో 140 మంది నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. కొయ్యలగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజును అదుపులోకి తీసుకుని బైండోవర్ చేశారు.
- తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 800 మంది నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామినాయుడు, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి తదితరులను అరెస్టు చేశారు.
- విశాఖ జిల్లాలో విశాఖ జిల్లాలో వేయి మందికిపైగా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పార్టీ విశాఖ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్, నేతలు డాక్టర్ జహీర్‌అహ్మద్, కొయ్య ప్రసాదరెడ్డి, చొక్కాకుల వెంకట్రావు, పసుపులేటి ఉషాకిరణ్, పిన్నింటి వరలక్ష్మి, జి.వి.రవిరాజ్ తదితరులు అరెస్టు అయ్యారు.
- విజయనగరం జిల్లాలో పోలీసులు శుక్రవారం తెల్లారేసరికే మాజీ ఎమ్మెల్యేలు పెద్దింటి జగన్మోహనరావు, గద్దే బాబూరావు, పార్టీ నాయకులు తూముల రాంసుధీర్, గొర్లె వెంకటరమణతో సహా పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు.
- శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలపై దౌర్జన్యానికి పాల్పడటంతో పాటు.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 119 మందిని అరెస్ట్ చేశారు.
మాచర్ల ఎమ్మెల్యేపై పోలీసుల దౌర్జన్యం
గుంటూరు జిల్లా మాచర్లలో శుక్రవారం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రశాంతంగా నిర్వహిస్తున్న ధర్నాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించటంతో కొద్దిసేపు ఉద్రిక్తత తలెత్తింది. సీఐ దురుసుగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేను నెట్టివేస్తూ.. ఒక చేత్తో తుపాకీ పట్టుకొని బెదిరించే ధోరణితో మాట్లాడటంతో తోపులాట జరిగింది. ఎమ్మెల్యేను సీఐ ధర్మేంద్రబాబు, డీఎస్పీ రావుల గిరిధర్‌లు బలవంతంగా పట్టుకొని నెట్టుకుంటూ తీసుకె ళ్లారు. అడ్డగించిన కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. ఎమ్మెల్యేను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో ఎమ్మెల్యే చొక్కా చిరిగిపోయింది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే ఉదయం నుంచి సాయంత్రం వరకు రూరల్ పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా రూరల్ ఎస్‌పీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి వందలాది మంది కార్యకర్తలతో రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని నిరసన వ్యక్తం చేయబోయారు. ఆ సమయంలో పోలీసులు మళ్లీ లాఠీచార్జి చేశారు. నిరసనకారులు సాగర్ రింగ్‌రోడ్డు, రాయవరం జంక్షన్, కొత్తపల్లి జంక్షన్, కంభంపాడు ఆర్టీసీ బస్సులను నిలిపివేసి టైర్లుకు గాలితీశారు. సాయంత్రం ఐదు గంటలకు ఎమ్మెల్యేను విడుదల చేశారు.
అక్రమ నిర్బంధాలను అధిగమిస్తూ వెల్లువెత్తిన జన నిరసన

- రోడ్డుపై ఈడ్చివేసి దుర్భాషలాడిన మహిళా ఎస్‌ఐ నారీమణి
- ప్రశ్నించిన ఎమ్మెల్యే కృష్ణదాస్‌పై దౌర్జన్యం.. ఆయన చేతికి గాయం
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: శ్రీకాకుళం జిల్లాలో శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియపై పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు. పద్మప్రియ మరో ముగ్గురు మిహ ళా నేతలతో కలసి శుక్రవారం ఉదయం బంద్‌ను పర్యవేక్షిస్తూ పట్టణంలో తిరుగుతుండగా ఆర్‌టీసీ బస్టాండ్ వద్ద పోలీసులు వారిని అడ్డగించారు. మహిళా ఎస్‌ఐ నారీమణి వచ్చి అరెస్టు చేస్తున్నట్టు చెప్పారు. తాము ఎవరినీ బలవంతం చేయటం లేదని.. ఎందుకు అరెస్టు చేస్తారని పద్మప్రియ ప్రశ్నించారు. ఇదేమీ వినిపించుకోని ఎస్సై తన సిబ్బందితో కలసి వారిని బలవంతంగా పోలీసు జీపులోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బొడ్డేపల్లి పద్మజను అమాంతంగా ఎత్తి జీపులో పడేశారు. మరో నేత వరుదు కల్యాణిని కూడా బలవంతంగా జీపులోకి నెట్టివేశారు. పద్మప్రియ, ఆమెతో పాటు ఉన్న మాజీ సర్పంచి ఇందిరలను అలాగే నెట్టివేయబోగా వారు ప్రతిఘటించారు. తాము నడుచుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు వస్తామని చెప్పి నడక ప్రారంభించారు. ఎస్సై నారీమణి తన సిబ్బందితో వారిని అడ్డుకుని పద్మప్రియను రోడ్డుపై పడవేసి ఈడ్చివేశారు. పద్మప్రియ ప్రతిఘటించగా పోలీసులు ఆమెపై చేయిచేసుకుని బలవంతంగా పోలీసు జీపులో పడవేశారు. పెనుగులాటలో ఆమె దుస్తులు చిరిగిపోయినా పట్టించుకోలేదు. జీపులో తీసుకువెళుతున్నప్పుడు కూడా నారీమణి పద్మప్రియను ఏకవచనంతో సంభోదిస్తూ పరుష పదజాలంతో దూషించారు. పోలీస్ స్టేషన్‌లో పెట్టి కొడతామని కూడా బెదిరించారు. పద్మప్రియను పోలీసు జీపులోనే పట్టణంలోని పలు పోలీసు స్టేషన్లకు తిప్పుతూ మానసికంగా హింసించారు.
ఎమ్మెల్యే కృష్ణదాస్‌పైనా దౌర్జన్యం...
పద్మప్రియ భర్త, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ విషయం తెలుసుకుని పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. పోలీసు జీపులో ఉన్న పద్మప్రియను పలకరించబోతే ఎస్‌ఐ నారీమణి ఆయన్ను అడ్డుకున్నారు. తమ అదుపులో ఉన్న ఆమెతో మాట్లాడటానికి వీల్లేదని తూలనాడారు. దాంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ సందర్భంగా కృష్ణదాస్‌పై నారీమణి దౌర్జన్యం చేయటంతో ఆయన చేతి వేలికి తీవ్రగాయమైంది. నెత్తురోడుతున్న చేతితోనే ఆయన పద్మప్రియను తీసుకుని నేరుగా కలెక్టర్ సౌరభ్‌గౌర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. గతంలో నరసన్నపేట ఎస్‌ఐగా నారీమణి పనిచేసినప్పుడు ఆమె తప్పుడు పనులను ప్రశ్నించినందునే కక్షగట్టి ఇప్పుడు పద్మప్రియపై దౌర్జన్యం చేసినట్టు కలెక్టర్‌కు వివరించారు. ఎమ్మెల్యేనని కూడా చూడకుండా తనపై దౌర్జన్యం చేసి గాయపరిచిన తీరును చెప్పారు. అనంతరం ఎస్‌పీ వి.వి.గోపాలరావును కూడా కలిసి నారీమణిపై ఫిర్యాదు చేశారు. కలెక్టర్, ఎస్‌పీలతో మాట్లాడుతున్న సందర్భంలో ఆవేదనను నియంత్రించుకోలేక ఎమ్మెల్యే కృష్ణదాస్, పద్మప్రియ కన్నీటిపర్యంతమయ్యారు. ఎస్‌పీ సూచన మేరకు నారీమణిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు ఎమ్మెల్యే కృష్ణదాస్‌ను రిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లి గాయానికి చికిత్స చేయించారు. పద్మప్రియ, కృష్ణదాస్‌లపై ఎస్‌ఐ నారీమణి దౌర్జన్యానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు శ్రీకాకుళం వైఎస్సార్ సర్కిల్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. నారీమణిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌పీ కె.వి.వి.గోపాలరావు ఎమ్మెల్యే కృష్ణదాస్‌తో ఫోన్లో మాట్లాడారు. విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని చెబుతూ ధర్నా విరమించాల్సిందిగా కోరారు. దీంతో ధర్నాను విరమించారు.
స్పీకర్‌కు కృష్ణదాస్ ఫిర్యాదు..
ఎమ్మెల్యేనైన తనపై దౌర్జన్యానికి పాల్పడి గాయపరిచిన ఎస్‌ఐ నారీమణిపై చర్య తీసుకోవాలని కోరుతూ ధర్మాన కృష్ణదాస్ అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు పంపించారు. శాసససభ్యుల హక్కుల పరిరక్షణ కింద ఎస్‌ఐ నారీమణిపై చర్య తీసుకోవాలని కోరారు. డీజీపీ దినేష్‌రెడ్డికి కూడా ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎస్‌ఐ నారీమణి.. ఎమ్మెల్యే కృష్ణదాస్ తన విధుల నిర్వహణకు ఆటంకం కలిగించారంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటం కొసమెరుపు. తమ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం జిల్లా పార్టీ కన్వీనర్ పద్మప్రియలపై దౌర్జన్యానికి పాల్పడిన గార ఎస్‌ఐ నారీమణిని వెంటనే సస్పెండ్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి డిమాండ్ చేశారు.
శ్రీకాకుళంలో పోలీసుల దాష్టీకం

రేపు నల్లకాల్వలో రక్తదాన శిబిరం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మూడో వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, రోగులకు పండ్ల పంపిణీ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి పార్టీ శ్రేణులను కోరారు. హెలికాప్టర్ దుర్ఘటనలో రాజశేఖరరెడ్డి మరణించిన కర్నూలు జిల్లా నల్లకాల్వ వద్ద ఆదివారం పెద్దఎత్తున రక్తదాన శిబిరం, అన్నదానం, కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టనున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు.
8/31/2012
150 విగ్రహాల ఆవిష్కరణకు ఏర్పాట్లు
Written By news on Friday, August 31, 2012 | 8/31/2012
తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను150 ఆవిష్కరించడానికి ఏర్పాట్లు చేసినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి చెప్పారు. అయితే విగ్రహాల ఏర్పాటును అడ్డుకోవడానికి పోలీసులు, రెవెన్యూ యంత్రాగం ప్రయత్నిస్తాయి. ఎట్టిపరిస్థితులలోనూ విగ్రహాలు ఏర్పాటు చేసితీరుతామని భాస్కర రెడ్డి చెప్పారు.
8/31/2012
మీడియాకు శోభానాగిరెడ్డి హితవు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ విజయవంతమైనా రాష్ట్రంలోని కొన్ని టీవీ చానళ్లు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని వైఎస్ఆర్ సీఎల్పీ డిప్యుటీ ఫ్లోర్ లీడర్ శోభా నాగిరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో బంద్ జరగనేలేదని టీవీ 9 వంటి చానళ్లు ప్రత్యేక బులిటిన్స్ ప్రసారం చేశాయన్నారు.
నాడు ఓదార్పు యాత్ర విషయంలోనూ ఇలాగే కొన్ని చానళ్లు వ్యతిరేక కథనాలు ప్రసారం చేశాయని ఆమె విమర్శించారు. కరెంట్ సమస్య తీవ్రంగా ఉన్న విషయంపై ప్రత్యేక వార్తా కథనాలు ప్రసారం చేసిన ఆ చానళ్లు నేడు ఇలాంటి వార్తలు ఎందుకిస్తున్నాయని సూటిగా ప్రశ్నించారు. దయచేసి ఇలాంటి వార్తలు మానుకుని వాస్తవాలను ప్రసారం చేయాలని ఆమె హితవు పలికారు.

మైనార్టీలపై పోలీసుల దాడి
విద్యుత్ కోతలకు నిరసనగా హైదరాబాద్‌లో శాంతియుతంగా ర్యాలీ చేపట్టిన మైనార్టీలపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ర్యాలీలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ హెచ్ ఏ రెహమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశాంతంగా ర్యాలీ చేస్తున్నవారిని అడ్డుకుని వారి వాహనాల తాళాలను పోలీసులు లాక్కున్నారు.
వందలాది మంది కార్యకర్తలను, మైనార్టీ నేతలను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. పోలీసుల తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. మరోవైపు మెహదీపట్నం నుంచి సెక్రటేరియేట్ వైపు వెళుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల ర్యాలీని రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. వారిని పోలీసులు విచరణరహితంగా కొట్టారు.

బంద్ ప్రశాంతం: శోభా నాగిరెడ్డి
కరెంట్ కోతలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్ శుక్రవారం ప్రశాంతంగా జరిగిందని పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి అన్నారు. ఆమె పార్టీ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడుతూ బంద్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్టు అన్యాయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కరెంట్ కోతలతో జనం విసిగిపోయి ఉన్నారని, అందుకే బంద్ లో స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారని ఆమె స్పష్టం చేశారు. ఫలితంగా రాష్ట్ర బంద్ విజయవంతమైందని చెప్పారు. పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న బంద్ రాజకీయ లబ్ది కోసం కాదని, ప్రజలకు మేలు చేకూర్చే లక్ష్యంతోనే చేశామని శోభానాగిరెడ్డి చెప్పారు. బంద్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల అరెస్ట్
విద్యుత్ కోతలకు నిరసనగా శాంతియుతంగా బంద్ పాటిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా రెండు వందలమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టులను నిరసిస్తూ పలుచోట్ల కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్‌కు అనూహ్య మద్దతు లబించింది. బంద్‌ను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు తెల్లవారుజామునుంచే రోడ్డెక్కారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ ఆర్టీసి డిపో ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు.
నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పార్టీ బంద్‌కు విద్యా, వ్యాపార, వాణిజ్య రంగాలు పూర్తిగా మద్దతు పలికాయి. పోలీసుల సహకారంతో బస్సులు నడపాలని అధికారులు ప్రయత్నించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అరెస్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పశ్చిమగోదావరిజిల్లాలో ఫైర్ స్టేషన్ సెంటర్‌లోని మహానేత వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బంద్‌కు పూనుకున్నారు. బస్టాండ్ల వద్ద బస్సులను శాంతియుతంగా అడ్డుకుంటున్న వారిని పోలీసులు అత్యుత్సాహంతో అదుపులోకి తీసుకున్నారు. పలు ప్రాంతాల్లో పోలీసుల జులుం కనిపించింది.

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న బంద్
హైదరాబాద్ : ఒకవైపు పారిశ్రామిక రంగం, మరోవైపు వ్యవసాయ రంగం విద్యుత్ కోతలతో సంక్షోభంలో కూరుకుపోతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. సర్కార్ ధోరణికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహిస్తోంది. బంద్‌కు అన్నివర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. అయితే బంద్‌ను భగ్నం చేయడానికి పోలీసులు విఫలయత్నాలు చేస్తున్నారు. గత అర్థరాత్రి నుంచే గృహనిర్బంధాలు, అరెస్టులు చేస్తున్నారు. బంద్‌పై పోలీసులు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేస్తున్నారు.
కాగా కరెంట్ కోతలకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన వైఎస్ఆర్ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. బంద్ చేసుకునే హక్కు కూడా లేదన్నట్లు పోలీసులను ప్రయోగిస్తోందని విమర్శించారు. హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు , పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అరెస్ట్ అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డికి కూడా చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని గట్టు రామచంద్రరావు అన్నారు.
విశాఖపట్నంలో కూడా పోలీసులు జులం ప్రదర్శిస్తున్నారు. చాలామంది కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. పోలీసుల అరెస్ట్‌కు నిరసనగా అయిదో టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్‌కు ప్రజలు మద్దతు పలికారు. పాఠశాలలు, వ్యాపార వర్గాలు స్వచ్చందంగా బంద్‌కు మద్దతు తెలిపాయి. అయితే పోలీసులు మాత్రం తమ అత్యుత్సాహన్ని ప్రదర్శించారు. అర్థరాత్రి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తల అరెస్ట్‌లపై పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లాలో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బలవంతంగా అదుపులోకి తీసుకుంటున్నారు. అర్థరాత్రి నుంచే పార్టీ నాయకులను గృహ నిర్బందంలో ఉంచిన పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌లు దిగుతున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన బంద్‌ను భగ్నం చేయడానికి వరంగల్‌లో పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను, నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. చాలా మందిని గృహనిర్బంధం చేశారు.
నిజామాబాద్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్‌కు అనూహ్య మద్దతు లభించింది. బంద్‌ను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు తెల్లవారుజామునుంచే రోడ్డెక్కారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ ఆర్టీసి డిపో ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు.

ప్రభుత్వ వైఖరిపై భూమన మండిపాటు
తిరుపతి : కరెంట్ కోతలకు నిరసనగా తిరుపతిలో నిరసన తెలుపుతోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పోలీసులు విరుచుకుపడ్డారు. మహిళలని కూడా చూడకుండా జీపుల్లోకి ఈడ్చిపడేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
బంద్‌ను అణచడానికి ప్రభుత్వం కర్కశంగా వ్యవహారిస్తోందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల కష్టాలను, సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా పోలీసులను ప్రయోగిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. పోలీసులు మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల నోళ్లు మూయించే ప్రయత్నం చేశారు.

అంధకారాంధ్రప్రదేశ్!
ముందు చూపులేని పాలకుల వల్ల రాష్ట్ర ప్రజానీకం బతుకుల్లో చీకట్లు ముసురుకున్నాయి. దాదాపు పది నెలల క్రితం విద్యుత్ కోతలతో మొదలైన వ్యవహారం చివరకు విద్యుత్తే లేని స్థితికి చేరుకుంది. ఏటా వేసవి కాలానికి మాత్రమే పరిమితమయ్యే కోతలు గత ఏడాది అక్టోబర్ నుంచే ప్రారంభమయ్యాయి. ఎందరు ఎన్నిసార్లు కలిసినా, గోడు వెళ్లబోసుకున్నా అంగుళం కూడా కదలికలేని రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో సకల రంగాలూ నీరసించిపోయాయి.
పర్యవసానంగా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల దగ్గర్నుంచి పొలాల్లో ఆరుగాలం కష్టపడే రైతు వరకూ అందరి పరిస్థితీ ఒక టే. వేలాది చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు మూతపడగా, భారీ పరిశ్రమలు సైతం బిక్కు బిక్కుమంటున్నాయి. చేసేందుకు పనిలేక కార్మికుడు దిగాలుగా కూర్చుంటే పొలంలోని పంటకు కాసిన్ని నీళ్లయినా పారించేదెలాగో అర్ధంకాక రైతు అయోమయంలో ఉన్నాడు. చిన్నా చితకా వ్యాపారస్తులు సైతం దెబ్బతిన్నారు.
రోజులో దాదాపు 20 గంటలపాటు కోతలే అమలవుతుండటంతో మునిసిపాలిటీలు, పంచాయతీలు ప్రజలకు తాగునీటిని అందించలేకపోతున్నాయి. గ్రామ సీమల్లో రోజుకు కనీసం రెండు, మూడు గంటలైనా విద్యుత్ సరఫరా ఉండటం గగనమవుతున్నదంటే పరిస్థితి ఎంతగా విషమించిందో అర్ధమవుతుంది. ప్రజాజీవన రంగాలన్నిటితోనూ ఇంతగా పెనవేసుకుపోయి, మనిషి మనుగడకి ప్రాణావసరంగా మారిన విద్యుత్తు గురించి రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలకు పోయింది. పుట్టి మునుగుతున్నదని ఎందరు హెచ్చరించినా మందబుద్ధిని వదుల్చుకోలేకపోయింది. ఇప్పుడు అందర్నీ కష్టాల్లోకి నెట్టేసి చోద్యం చూస్తోంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయానికి ఏడు గంటల కరెంటిస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ ఉత్త గాలి కబుర్లని తేలిపోయింది. విద్యుత్ సంక్షోభం వ్యవసాయ క్షేత్రాల్లో సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. లక్షల వ్యయంతో బోర్లు వేయించుకుని, అటు తర్వాత మరింత ఖర్చుచేసి పంటలు వేసిన రైతులు... వేళకురాని విద్యుత్ కారణంగా ఎండుతున్న పంటను చూసి రోదిస్తున్నారు. చేసిన అప్పుల్ని ఎలా తీర్చాలో తెలియక మనోవ్యధతో ప్రాణాలు తీసుకుంటున్నారు. పచ్చగా కళకళలాడుతూ ఉండాల్సిన పంటభూములు నెర్రెలుబారి చిన్న బోయాయి. అసలు తొలకరి సమయానికే రుణ ప్రణాళిక ప్రకటించి, విత్తనాలను సిద్ధం చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. బ్యాంకుల్లో అప్పు పుట్టకపోవడంతో రైతులంతా వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించాల్సి వచ్చింది. సబ్సిడీ విత్తనాలు అందక బ్లాక్ మార్కెట్‌లో రెట్టింపు, అంతకన్నా ఎక్కువ చెల్లించి కొనుక్కోవాల్సివచ్చింది. సర్కారు సృష్టించిన ఇన్ని సమస్యలను అధిగమించి సాగు మొదలెట్టిన రైతులకు విద్యుత్‌ను సైతం అందించక పాలకులు వారి ఉసురు పోసుకుంటున్నారు. ప్రాంతం ఏదైనా రైతు బతుకు సమస్తం దయనీయంగా మారింది.
పన్నెండో పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలుగా ‘రాష్ట్రంలో దాదాపు లక్షన్నర కోట్ల పెట్టుబడులతో 660 భారీ పరిశ్రమల ఏర్పాటు, 60,000 వరకూ చిన్నతరహా పరిశ్రమలు, 10.62 లక్షల ఉద్యోగావకాశాలు’ అని చెప్పుకున్న మన సర్కారు ఉన్న పరిశ్రమలను సక్రమంగా నడవనీయడం లేదు. కనీవినీ ఎరుగని కరెంటు కోత కారణంగా లక్షలాదిమంది కార్మికులు వీధినపడ్డారు. ఉత్పత్తి వ్యయం, నిర్వహణ వ్యయం పెరిగిపోయి... తెచ్చిన రుణాలపై వాయిదాలు కట్టలేక, కార్మికులకు వేతనాలు చెల్లించలేక, పెరిగిపోతున్న వడ్డీ భారాన్ని భరించలేక చిన్న తరహా పారిశ్రామికవేత్తలు కూడా చావే శరణ్యమనే స్థితికి చేరుకుంటున్నారు. వీరే ఇలావుంటే, వేతనాలపై ఆధారపడివుండే కార్మిక కుటుంబాల పరిస్థితి చెప్పనవసరమే లేదు. అది గార్మెంట్స్ పరిశ్రమ కావొచ్చు... మరమగ్గం కావొచ్చు... స్పిన్నింగ్ కావొచ్చు... సిరామిక్స్ కావొచ్చు...గ్రానైట్ కావొచ్చు... కర్మాగారమేదైనా, ఏ స్థాయిదైనా విద్యుత్ అందక మూతబడిపోతున్నాయి. కొన్నిచోట్ల అద్దెకిస్తామంటూ బోర్డులు వెలుస్తున్నాయి.
రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న సంగతి వాస్తవమే. ఎప్పటికప్పుడు వాటిని మదింపువేసి, అందుకు అనుగుణమైన ప్రణాళికలను రచించాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంటుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తన పాలనాకాలంలో డిమాండ్‌కూ, సరఫరాకూ మధ్య అంతరం పెరగకుండా చూశారు. నష్టాల్లో ఉన్న జెన్‌కోకు జవసత్వాలు కల్పించారు. విద్యుదుత్పత్తి పెంచడానికి చర్యలు తీసుకుంటూనే తక్షణావసరాలను తీర్చడం కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా విద్యుత్‌ను కొనడం, థర్మల్ కేంద్రాలకు అవసరమైన బొగ్గును అందుబాటులో ఉంచడంలాంటి పనులు చేశారు. జనహితం కోరే నేతలు ఎలా వ్యవహరించాలో ఆచరణాత్మకంగా చూపారు.
ఇలాంటి ఉదాహరణలేవీ మన సర్కారుకు మార్గదర్శకం కాలేకపోయాయి. ప్రాప్తకాలజ్ఞతలో కూరుకు పోయిన రాష్ట్ర ప్రభుత్వం సరే... దాన్ని మేల్కొల్పి సరైన దారిలో పెట్టాల్సిన కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ఏమైపోయినట్టు? రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకాన్ని చూసైనా తక్షణం రంగంలోకి దిగి ఆదుకోవాల్సిన యూపీఏ సర్కారు ఏం చేస్తోంది? 33 మంది కాంగ్రెస్ ఎంపీలను ఇచ్చి, యూపీఏ మనుగడకు మూలాధారంగా నిలిచిన మన రాష్ట్రానికి ఈ కష్టకాలంలో బాసటగా ఉందామన్న స్పృహ కూడా దానికి కరువైనట్టు కనిపిస్తోంది. ఇటు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన తెలుగుదేశం సైతం ఆ తానులోని ముక్కగానే కాలం వెళ్లదీస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ ఇవాళ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌లో వ్యక్తమయ్యే ప్రజల ఆగ్రహావేశాలైనా సర్కారును కార్యాచరణ దిశగా కదిలించగలవేమో చూడవలసి ఉంది.

బంద్‌కు కార్మిక సంఘాలు, రైతు సంఘాల మద్దతు
* బంద్‌కు కార్మిక సంఘాలు, రైతు సంఘాల మద్దతు
* పలు కళాశాలలు, విద్యాసంస్థల స్వచ్ఛంద సెలవు
* ఆర్‌టీసీ ముందస్తు చర్యలు.. పోలీసుల బందోబస్తు
* జేఎన్‌టీయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా
* శాంతియుత బంద్ పాటించాలని వైఎస్సార్ సీపీ విజ్ఞప్తి
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఒకవైపు పారిశ్రామిక రంగం, మరోవైపు వ్యవసాయ రంగం విద్యుత్ కోతలతో సంక్షోభంలో కూరుకుపోతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం బంద్ నిర్వహిస్తోంది. నీరు లేక ఎండిపోతున్న పంటలను చూసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారులో స్పందన కరువైందని ఆ పార్టీ ధ్వజమెత్తింది. విద్యుత్ కోతలు, పవర్ హాలిడేల కారణంగా పరిశ్రమలు దివాలా దశకు దిగజారుతున్నా.. లక్షలాది మంది కార్మికులు ఉపాధిలేక పస్తులుంటున్నా.. సర్కారులో చలనం లేకపోవటంపై వైఎస్సార్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర విద్యుత్ సంక్షోభంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆందోళనకు మద్దతుగా శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది.
బంద్ జరపటానికి ముందు గత మూడు రోజులుగా వివిధ రూపాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, దీక్షలు చేపట్టింది. శుక్రవారం నాటి బంద్‌కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని పార్టీ నేతలు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ తలపెట్టిన బంద్‌కు పలు కార్మిక సంఘాలు, పరిశ్రమల సమాఖ్యలు, రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. రాష్ట్రంలో పలు చోట్ల కళాశాలలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్‌టీసీ) కూడా ముందస్తు చర్యలు చేపట్టింది. బంద్‌ను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు.
జేఎన్‌టీయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా
వైఎస్సార్ కాంగ్రెస్ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ కారణంగా.. జేఎన్‌టీయూహెచ్ పరిధిలో శుక్రవారం జరగాల్సిన ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, బీఫార్మసీ పరీక్షలను వాయిదా వేశారు. ఎంబీఏ సెకండ్ సెమిస్టర్, ఎంసీఏ మూడో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబర్ 1న, బీటెక్, బీఫార్మసీ పరీక్షలు 4 న నిర్వహించనున్నట్లు డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్ తెలిపారు.
కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయి: వాసిరెడ్డి పద్మ
విద్యుత్ సంక్షోభంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టనున్న బంద్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా సమాచారం అందిందని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హింసను, విధ్వంసాన్ని ప్రేరేపించటానికి అసాంఘిక, రాజకీయ శక్తులు పథకం పన్నినట్లు సమాచారం ఉన్న నేపథ్యంలో కార్యకర్తలు, ప్రజలు శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మాత్రమే తీవ్ర నిరసన తెలపాలని ఆమె ఒక ప్రకటనలో కోరారు.
* పలు కళాశాలలు, విద్యాసంస్థల స్వచ్ఛంద సెలవు
* ఆర్‌టీసీ ముందస్తు చర్యలు.. పోలీసుల బందోబస్తు
* జేఎన్‌టీయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా
* శాంతియుత బంద్ పాటించాలని వైఎస్సార్ సీపీ విజ్ఞప్తి

బంద్ జరపటానికి ముందు గత మూడు రోజులుగా వివిధ రూపాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, దీక్షలు చేపట్టింది. శుక్రవారం నాటి బంద్‌కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని పార్టీ నేతలు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ తలపెట్టిన బంద్‌కు పలు కార్మిక సంఘాలు, పరిశ్రమల సమాఖ్యలు, రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. రాష్ట్రంలో పలు చోట్ల కళాశాలలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్‌టీసీ) కూడా ముందస్తు చర్యలు చేపట్టింది. బంద్‌ను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు.
జేఎన్‌టీయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా
వైఎస్సార్ కాంగ్రెస్ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ కారణంగా.. జేఎన్‌టీయూహెచ్ పరిధిలో శుక్రవారం జరగాల్సిన ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, బీఫార్మసీ పరీక్షలను వాయిదా వేశారు. ఎంబీఏ సెకండ్ సెమిస్టర్, ఎంసీఏ మూడో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబర్ 1న, బీటెక్, బీఫార్మసీ పరీక్షలు 4 న నిర్వహించనున్నట్లు డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్ తెలిపారు.
కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయి: వాసిరెడ్డి పద్మ
విద్యుత్ సంక్షోభంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టనున్న బంద్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా సమాచారం అందిందని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హింసను, విధ్వంసాన్ని ప్రేరేపించటానికి అసాంఘిక, రాజకీయ శక్తులు పథకం పన్నినట్లు సమాచారం ఉన్న నేపథ్యంలో కార్యకర్తలు, ప్రజలు శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మాత్రమే తీవ్ర నిరసన తెలపాలని ఆమె ఒక ప్రకటనలో కోరారు.
8/31/2012
టీడీపీ నిజస్వరూపం మరోసారి బయటపడింది
* ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు
* అత్యవసరాలకు మినహాయింపు: జూపూడి
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో తీవ్రస్థాయిలో ఉన్న విద్యుత్ సంక్షోభాన్ని ఎలుగెత్తి చాటి, ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు శుక్రవారం నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. బంద్ నుంచి అత్యవసరాలైన పాలు, నీళ్లు, మందులు సరఫరా చేసే వాహనాలకు మినహాయింపు ఉంటుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు తెలిపారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘రాష్ట్రాన్ని కనీవినీ ఎరుగని విద్యుత్ సంక్షోభం చుట్టుముట్టింది. కోతలతో మొదలై అసలు కరెంటే లేని పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ, పారిశ్రామిక, వ్యాపార రంగాలతోపాటు మొత్తం జన జీవితాన్నే అతలాకుతలం చేస్తోంది. ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వానికి, అందుకు సహకరిస్తున్న ప్రధాన ప్రతిపక్షానికి తగిన బుద్ధి చెప్పాలి. విద్యుత్ సంక్షోభాన్ని ఎలుగె త్తి చాటేందుకు శుక్రవారం జరిగే రాష్ట్రవ్యాప్త బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, విజయవంతం చేయాలి’’ అని కోరారు.
ప్రజల అవసరాలను గుర్తించి, ప్రజల కోసం చేపట్టిన ఈ బంద్‌ను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తన శ్రేణులకు చేస్తున్న విజ్ఞప్తి అని చెప్పారు. బంద్‌లో విద్యా సంస్థలు, కార్మికులు, రైతులు అన్ని వర్గాల వారు పాల్గొనాలని, శాంతియుతంగా నిర్వహించే బంద్‌లో పోలీసులు అతిచేయవద్దని జూపూడి కోరారు.
టీడీపీ నిజస్వరూపం మరోసారి బయటపడింది
రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యపట్ల ప్రభుత్వంలో చలనం తెచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని టీడీపీ చెప్పడంతో ఆ పార్టీ నిజ స్వరూపం మరోసారి బయటపడిందని జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. విద్యుత్ సంక్షోభం కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఇచ్చిన బంద్‌ను అడ్డుకోవాలని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పడం సరైందికాదన్నారు.
ప్రభుత్వం చేయాల్సిన ప్రకటనను ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ చేయడం దురుదృష్టకరమన్నారు. టీడీపీకి చేతనైతే ప్రభుత్వం మెడలు వంచడానికి ఎలాంటి ప్రజా ఉద్యమాలు చేపట్టాలో ఆలోచించాలని చెప్పారు. ప్రజా సమస్యలపట్ల ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ వైఖరేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకుల వైఖరి కారణంగా ఆ పార్టీ సర్వనాశనమైందని ఇండియాటుడే, ఎన్డీటీవీ, ది హిందూలు జరిపిన సర్వేలు రుజువు చేస్తున్నాయని జూపూడి తెలిపారు.

సీఐడీ దర్యాప్తు అవసరమా?
* ప్రాథమిక ఆధారాలను చూస్తే సీఐడీ వంటి సంస్థ దర్యాప్తు చేయాల్సిన కేసు కాదు
* కాల్‌లిస్ట్ పొందటమనేది పెద్ద నేరమేమీ కాదు.. నేరమని ఐటీ చట్టంలో ఎక్కడా లేదు
* కాల్‌లిస్టు బహిర్గతమైనంత మాత్రాన నిబద్ధత కలిగిన అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతినదు
* తన హక్కులకు భంగం వాటిల్లితే సీబీఐ జేడీ పరువు నష్టం దావా వేయవచ్చు
* ముగ్గురికి ముందస్తు బెయిల్ మంజూరు
హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ కాల్‌లిస్ట్ వ్యవహారంలో నిందితులుగా ఉన్న ఇద్దరితో పాటు, ఆయన సహాధ్యాయి చంద్రబాల కేసులో ఒకరికి హైకోర్టు గురువారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు బెయిల్ పొందిన వారిలో నాచారం సీఐ శ్రీనివాసరావు, బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి హనుమంతరావు, మిక్ ఎలక్ట్రానిక్స్ ఎండీ ఎం.రమణరావులు ఉన్నారు. వీరందరూ సెప్టెంబర్ 13 లోపు ఆరో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. లొంగిపోయిన తరువాత ఒక్కొక్కరు పది వేల రూపాయల పూచీకత్తులు సమర్పించాలని, దీని ఆధారంగా వారికి బెయిల్ మంజూరు చేయాలని కింది కోర్టును ఆదేశించారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సముద్రాల గోవిందరాజులు ఉత్తర్వులు జారీ చేశారు.
కాల్‌లిస్ట్ వ్యవహారంలో కింది కోర్టు తమకు ముందస్తు బెయిల్ తిరస్కరించటంతో వారు కింది కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను గురువారం జస్టిస్ గోవిందరాజులు విచారించారు. మొదట పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తరువాత పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. సీబీఐ వంటి ఉన్నతస్థాయి దర్యాప్తు సంస్థకు జాయింట్ డెరైక్టర్‌గా ఉన్న వి.వి.లక్ష్మీనారాయణ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని తెలిపారు. కాల్‌లిస్ట్‌ను బహిర్గతం చేయటం ద్వారా లక్ష్మీనారాయణ వంటి అధికారులు నైతిక స్థైర్యం కోల్పోతారని, అంతేకాక ఈ మొత్తం వ్యవహారంలో ఆయన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిందని పీపీ వివరించారు. అందువల్లే ఈ కేసు విచారణను సీఐడీ చేపట్టిందని తెలిపారు.
ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘కాల్‌లిస్ట్‌ను బహిర్గతం చేసి, దాని ఆధారంగా కథనాలు ప్రచురించడం, ప్రసారం చేయడం వల్ల నిబద్ధత కలిగిన అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని నేను భావించడం లేదు. అతని వ్యక్తిగత హక్కులకు కొంత మేర భంగం కలిగి ఉండొచ్చు. అయితే అందుకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించిన వారిపై లక్ష్మీనారాయణ పరువునష్టం దావా దాఖలు చేసుకోవచ్చు. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఈ కేసు సీఐడీ వంటి సంస్థ దర్యాప్తు చేయాల్సినంతది మాత్రం కాదు. ఇంతకంటే తీవ్రమైన కేసులున్నాయి. ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్న కేసులూ ఉన్నాయి.
వాటన్నింటినీ పక్కన పెట్టి సీఐడీ ఇటువంటి కేసులో దర్యాప్తు చేస్తుండటం సరికాదు. పోలీసు విభాగంలో సీఐడీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇటువంటి కేసులను దర్యాప్తు చేయడం ద్వారా దాని విలువను కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ సందర్భంలో నాకు ఓ పాత సామెత గుర్తుకొస్తోంది. గతంలో కొత్వాల్ (పోలీస్) ఎక్కడంటే కుక్కను వెతకడానికి వెళ్లాడట..! ప్రస్తుత కేసులో కూడా సీఐడీ పరిస్థితి అలానే ఉంది. కాల్‌లిస్ట్ పొందడమనేది పెద్ద నేరమేమీ కాదు. ఐటీ చట్టం అమలులోకి రావడం వల్ల కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కాల్‌లిస్ట్ పొందడం నేరమని ఎక్కడా లేదు’ అని వ్యాఖ్యానించారు.
‘పిటిషనర్లు దర్యాప్తుకు పూర్తిగా సహకరించారని వారి తరఫు సీనియర్ న్యాయవాదులు చెప్తున్నారు. దర్యాప్తు కూడా పూర్తయింది. కేవలం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నుంచి నివేదిక మాత్రమే రావాల్సింది. పిటిషనర్లు సాక్ష్యాలను తారుమారు చేస్తారనే భయాందోళనలు ఎవరికీ లేవు. అందువల్ల వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నా’ అని జస్టిస్ గోవిందరాజులు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
* కాల్‌లిస్ట్ పొందటమనేది పెద్ద నేరమేమీ కాదు.. నేరమని ఐటీ చట్టంలో ఎక్కడా లేదు
* కాల్‌లిస్టు బహిర్గతమైనంత మాత్రాన నిబద్ధత కలిగిన అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతినదు
* తన హక్కులకు భంగం వాటిల్లితే సీబీఐ జేడీ పరువు నష్టం దావా వేయవచ్చు
* ముగ్గురికి ముందస్తు బెయిల్ మంజూరు

కాల్‌లిస్ట్ వ్యవహారంలో కింది కోర్టు తమకు ముందస్తు బెయిల్ తిరస్కరించటంతో వారు కింది కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను గురువారం జస్టిస్ గోవిందరాజులు విచారించారు. మొదట పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తరువాత పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. సీబీఐ వంటి ఉన్నతస్థాయి దర్యాప్తు సంస్థకు జాయింట్ డెరైక్టర్‌గా ఉన్న వి.వి.లక్ష్మీనారాయణ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని తెలిపారు. కాల్‌లిస్ట్‌ను బహిర్గతం చేయటం ద్వారా లక్ష్మీనారాయణ వంటి అధికారులు నైతిక స్థైర్యం కోల్పోతారని, అంతేకాక ఈ మొత్తం వ్యవహారంలో ఆయన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిందని పీపీ వివరించారు. అందువల్లే ఈ కేసు విచారణను సీఐడీ చేపట్టిందని తెలిపారు.
ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘కాల్‌లిస్ట్‌ను బహిర్గతం చేసి, దాని ఆధారంగా కథనాలు ప్రచురించడం, ప్రసారం చేయడం వల్ల నిబద్ధత కలిగిన అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని నేను భావించడం లేదు. అతని వ్యక్తిగత హక్కులకు కొంత మేర భంగం కలిగి ఉండొచ్చు. అయితే అందుకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించిన వారిపై లక్ష్మీనారాయణ పరువునష్టం దావా దాఖలు చేసుకోవచ్చు. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఈ కేసు సీఐడీ వంటి సంస్థ దర్యాప్తు చేయాల్సినంతది మాత్రం కాదు. ఇంతకంటే తీవ్రమైన కేసులున్నాయి. ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్న కేసులూ ఉన్నాయి.
వాటన్నింటినీ పక్కన పెట్టి సీఐడీ ఇటువంటి కేసులో దర్యాప్తు చేస్తుండటం సరికాదు. పోలీసు విభాగంలో సీఐడీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇటువంటి కేసులను దర్యాప్తు చేయడం ద్వారా దాని విలువను కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ సందర్భంలో నాకు ఓ పాత సామెత గుర్తుకొస్తోంది. గతంలో కొత్వాల్ (పోలీస్) ఎక్కడంటే కుక్కను వెతకడానికి వెళ్లాడట..! ప్రస్తుత కేసులో కూడా సీఐడీ పరిస్థితి అలానే ఉంది. కాల్‌లిస్ట్ పొందడమనేది పెద్ద నేరమేమీ కాదు. ఐటీ చట్టం అమలులోకి రావడం వల్ల కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కాల్‌లిస్ట్ పొందడం నేరమని ఎక్కడా లేదు’ అని వ్యాఖ్యానించారు.
‘పిటిషనర్లు దర్యాప్తుకు పూర్తిగా సహకరించారని వారి తరఫు సీనియర్ న్యాయవాదులు చెప్తున్నారు. దర్యాప్తు కూడా పూర్తయింది. కేవలం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నుంచి నివేదిక మాత్రమే రావాల్సింది. పిటిషనర్లు సాక్ష్యాలను తారుమారు చేస్తారనే భయాందోళనలు ఎవరికీ లేవు. అందువల్ల వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నా’ అని జస్టిస్ గోవిందరాజులు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Subscribe to:
Posts (Atom)