16 September 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Chandrababu padhayatra - direction

Written By news on Saturday, September 22, 2012 | 9/22/2012







http://telugu.greatandhra.com/cinema/21-09-2012/chen_21.php

ఆ కాలం ఎంతో దూరం లేదు... జగన్ కోసం - 5 (పాఠకుల స్పందన)(sakshi)


నేను చిన్నప్పటినుంచి పక్కా కాంగ్రెస్ అభిమానిని. 70వ దశకంలో నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇందిరాగాంధి అంటే పిచ్చి అభిమానం. దానికి కారణం బహుశా అప్పటి మా టీచర్స్ అయుండవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో ఒకసారి ఇందిరాగాంధి గుంటూరుకు వచ్చారు. అప్పుడు సెక్యూరిటీ ఇప్పటిలాగా ఉండేది కాదు. మా స్కూల్ టీచర్స్ చాలామంది స్టేజి మీద ఇందిరాగాంధికి పాదాభివందనం చేయడం ఇప్పటికీ బాగా గుర్తు. మేం అభిమానించే, భయపడే టీచర్స్ అలా పాదాభివందనం చేసేసరికి మాకు కూడా ఇందిరాగాంధి అంటే ఒకవిధమైన ప్రేమ, అభిమానం కలిగి వుండవచ్చు. అప్పటి నుంచి నేను, మా ఫ్రెండ్స్ కాంగ్రెస్‌ను అభిమానించేవాళ్లం. అది మన వైయస్సార్‌గారి వరకు కొనసాగింది.

ముఖ్యంగా 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వైయస్సార్‌గారు పడిన శ్రమ, అలాగే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాభిమానం తరిగిపోకుండా కాపాడిన విధానం - కాంగ్రెస్‌మార్క్ గ్రూప్ రాజకీయాలు లేకుండా మేనేజ్ చేసిన విధానం... ముఖ్యంగా 2009లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావటానికి చేసిన కృషి... నన్ను వైయస్సార్ అభిమానిగా మార్చేశాయి. జగన్ కాంగ్రెస్‌లో ఉన్నంతకాలం ఇది కొనసాగింది. నిజం చెప్పాలంటే జగన్ కాంగ్రెస్‌ను వీడినా ఎక్కడో పాత అభిమానం ఉండేది. కానీ దాని తర్వాత కాంగ్రెస్ వాళ్ల బిహేవియర్ చూస్తే అదంతా పోయింది. జగన్ అంటే ప్రేమ, అభిమానం అంతకంతకూ పెరిగింది. అలాగే టిడిపి అన్నా, దానికి కొమ్ముకాసే మీడియా అన్నా అసహనం అంతకన్నా పెరిగింది. వీరందరూ కలిసి జగన్‌ని అణచాలని ఎంత ప్రయత్నించారో... ఎన్ని కుయుక్తులు పన్నారో చూస్తుంటే సినిమాల్లో కూడా ఇంతటి రాజకీయాలు ఉండవనిపిస్తోంది.

సిబిఐని వాడుకుంటున్న తీరు, తమకు నచ్చనివాళ్ల మీద దాని ప్రయోగం... దారుణమైన స్టేట్‌మెంట్స్ ఇవ్వటం, అవి కూడా కొన్ని పత్రికల్లో రావడం చూస్తుంటే.. వీళ్లు ఎంతకైనా తెగించగలరు అనిపిస్తోంది. కానీ ఒక్కటి మాత్రం నిజం... ఇప్పుడు ఏ పల్లెకెళ్లినా, ఎవర్ని అడిగినా చెప్తారు వీళ్లు ఆడే నాటకం. ఇంతెందుకు? నిన్నమొన్నటిదాకా రోజూ ఒకవర్గం మీడియాలో పుంఖానుపుంఖాలుగా వచ్చిన కథనాలు సిబిఐ జెడి కాల్‌లిస్ట్ బయటకు వచ్చిన తర్వాత ఠక్కున ఎందుకు ఆగిపోయాయి? సిబిఐ జెడి పేరు ఇప్పుడు మీడియా కథనాల్లో ఎందుకు రావడం లేదు. ఆఖరికి వీళ్లు న్యాయస్థానాన్ని భయపెట్టేస్థాయికి ఎందుకు ఎదిగారు? ఇవన్నీ నా ప్రశ్నలు కావు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 90 శాతం మంది ప్రజలవి. జగన్ నిజంగా తప్పు చేసి ఉంటే ప్రజలే శిక్షిస్తారు. అంతేకానీ లేనిపోని కేసులు పెట్టి, అసలు దొంగల్ని తప్పించి, జగన్‌ని ఏదో చేసేద్దామని అనుకుంటే ఆ ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. ఆ కాలం ఇంకెంతోదూరం లేదు.

- శైలజ .కె
రామ్‌నగర్, హైద్రాబాద్


అన్నా! ఎప్పుడొస్తావ్...!

ఓ గుప్పెడు దుఃఖం అయితే
గుండె పిడికిట్లో పట్టి
లేని ధైర్యాన్ని ధైర్యంగా నటించెయ్యొచ్చు
చిరునవ్వుని ముఖానికి అతికించుకొని
అసలేం జరగనట్టు అందర్నీ నమ్మించెయ్యొచ్చు!
కానీ గగనమంత దుఃఖం
శరీరాన్ని పట్టి కుదిపేస్తున్న దుఃఖం
జగనన్న జైల్లో ఉన్నాడని గుర్తొచ్చినప్పుడల్లా
క్షణ క్షణం కనపడని వేదన విచ్చుకత్తులతో
వెన్నాడుతున్నంత దుఃఖం
మాటతప్పని నేరానికే
మహాకుట్ర చేశారని తెలిసినా
తలవంచని నేరానికి
నిర్బంధంలోకి నెట్టారని తెలిసినా
అగ్నివిస్ఫోటనంలా...
జైలు గోడలు బద్దలు కొట్టుకుని
జగనన్న నవ్వుతూ
నిర్దోషిగా బయటకొస్తాడని తెలిసినా
‘అన్న ఎప్పుడొస్తాడన్నా’ అని
ఆత్మీయులు అడిగే ప్రతి ప్రశ్న
సూటిగా గుండెల్లో దిగుతున్నప్పుడల్లా
సుడితిరుగుతున్న దుఃఖం
విగ్రహమైన రాజన్నని చూసినా
వేదన మోస్తున్న విజయమ్మను చూసినా
బాధని దిగమింగుతున్న భారతమ్మను చూసినా
కట్టలు దాటి కమ్ముకునేంత దుఃఖం
చంచల్‌గుడా పైనుంచి వెళుతున్నప్పుడల్లా
నా చేతగానితనాన్ని
చర్నాకోలతో చెళ్ళున చరిచినంత దుఃఖం
ఈ దుఃఖం నాదికాదు
అన్న కోసం ఆశగా చూస్తున్న
ప్రతి చెల్లిది... తల్లిది... అన్నది... అక్కది...
తమ్ముడిది... తాతది... అవ్వది
అన్నని కళ్ళారా చూడాలని ఆశగా ఆర్తిగా
ఎదురుచూస్తున్న
కోట్లమంది తడి నిండిన కళ్ళది
రాజన్నని జగనన్నని ప్రేమించే ఈ రాష్ట్రానిది...!
అన్నా! ఎప్పుడొస్తావ్?!

- డి.బీ.చారి
హైద్రాబాద్


మా చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com

అన్నీ మీ వద్ద పెట్టుకుని వారికి నోటీసులు ఎందుకివ్వాల్సి వచ్చింది?(from namasthe telangana)

Written By news on Friday, September 21, 2012 | 9/21/2012

  నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు వాడిగా జరిగాయి. సీబీఐ తరఫున న్యాయవాది పీ కేశవరావు వాదనలు వినిపిస్తూ వాన్‌పిక్ సంబంధించి మొదట రాష్ట్ర ప్రభుత్వం, రస్‌అల్‌ఖైమా ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఆ తరువాత ఇందులోకి నిమ్మగడ్డ ప్రసాద్ భారతీయ భాగస్వామిగా వచ్చి చేరారంటూ అవగాహనా ఒప్పందానికి సంబంధించిన విషయాలను వివరించటం ప్రారంభించారు. ఆ దశలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి ఆ వివరాలన్నీ ఇప్పుడు అవసరం లేదని, ప్రసాద్‌కు బెయిల్ ఎందుకు ఇవ్వరాదో మాత్రమే చెప్పాలని సూచించారు. దీనిపై కేశవరావు బదులిస్తూ ''మీకు నేనెప్పుడైనా అనవసర విషయాలు చెప్పానా? ఈ వివరాలన్నీ కోర్టు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది'' అన్నారు. దాంతో న్యాయమూర్తి వాదనలు కొనసాగించాలని సూచించారు. వాన్‌పిక్‌లో రస్‌అల్‌ఖైమాకు 51% వాటా ఉందని, అందులో నవయుగ కంపెనీకి వాటా ఇవ్వటంతో అది 26.5 శాతానికి పడిపోయిందని వివరించారు. ఆ సమయంలో న్యాయమూర్తి సీబీఐ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌ను పరిశీలించి, దాంట్లో ఎక్కడా రస్‌అల్‌ఖైమా గురించి పూర్తిస్థాయిలో ప్రస్తావన లేకపోవటంపై కేశవరావును ప్రశ్నించారు. చార్జిషీట్‌లో ఒక్క నిమ్మగడ్డ ప్రసాద్ గురించిన ప్రస్తావన మాత్రమే ఉంది.. రస్‌అల్‌ఖైమా ప్రభుత్వ ప్రతినిధుల గురించి ప్రస్తావన ఎందుకు లేదు? వారి పరిస్థితి ఏమిటి? వారికి సంబంధించిన దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? వారిని నిందితులుగా ఎందుకు చేర్చలేదు? అంటూ ప్రశ్నలు కురిపించారు. దాంతో కేశవరావు తడబడి, ఆ విషయాలను తరువాత వివరిస్తానన్నారు. దీనికి అంగీకరించని న్యాయమూర్తి ముందుగా కోర్టు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పాలని, ఆ తరువాత మిగతా విషయాలకు వెళ్లాలని సూచించారు. తాను అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా కేశవరావు దాటవేస్తున్నారని గ్రహించిన న్యాయమూర్తి రెండుసార్లు సమాధానం చెప్పాలంటూ ఆదేశించారు. ఆ సమయంలో కోర్టు హాల్లోనే ఉన్న సీబీఐ డీఐజీ వెంక ఒక కాగితంపై ఏదో రాసి కేశవరావుకు పంపారు. అందులోని విషయాన్ని చదివిన అనంతరం కేశవరావు సమాధానమిస్తూ రస్‌అల్‌ఖైమా ప్రతినిధులకు నోటీసులు పంపించినట్టు చెప్పారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ''దర్యాప్తు దాదాపుగా పూర్తయ్యింది. మీ (సీబీఐ) వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. అవగాహన ఒప్పందం కూడా ఉంది. అన్నీ మీ వద్ద పెట్టుకుని వారికి నోటీసులు ఎందుకివ్వాల్సి వచ్చింది?'' అని ప్రశ్నించారు. మీరు సాగిస్తున్న దర్యాప్తును చూస్తే ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కరిపైనే జరిగినట్టుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దీనిపై కేశవరావు సమాధానమిస్తూ దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. విచారణ కీలకదశలో ఉందన్నారు. ఈ జవాబుపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఎవరు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా ప్రతిసారీ దర్యాప్తు కీలక దశలో ఉందని, పూర్తి కాలేదని చెబుతున్నారు. ఏ అంశానికి సంబంధించి దర్యాప్తు పూర్తి కాలేదో స్పష్టంగా చెప్పండి'' అన్నారు. ఆ తరువాత కేశవరావు తన వాదనలు కొనసాగిస్తూ వాన్‌పిక్ కోసం కేటాయించిన భూముల వివరాలను చెప్పటం ప్రారంభించగా న్యాయమూర్తి అప్పుడు కూడా రెండు ప్రశ్నలను సంధించారు. అంతకు ముందు నిమ్మగడ్డ ప్రసాద్ తరఫున న్యాయవాది రాజశేఖరరావు వాదనలు వినిపిస్తూ సీబీఐ తీరును తప్పుపట్టారు. తప్పుడు ఉద్దేశాలను మనసులో పెట్టుకుని సీబీఐ విచారణ జరుపుతోందని వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ ప్రసాద్ విజయవంతమైన వ్యాపారవేత్త అని పేర్కొంటూ మూతబడ్డ ఎన్నో వ్యాపార సంస్థలను ఆయన కొనుగోలు చేసి, నిలబెట్టారన్నారు. 3కోట్ల రూపాయలకు మ్యాట్రిక్స్ ల్యాబ్‌ను కొన్న నిమ్మగడ్డ ప్రసాద్ ఆరేళ్లలోనే దానిని ఆరువేల కోట్ల రూపాయలకు చేర్చారని తెలియచేశారు. ఒక పెట్టుబడిదారుడు ఏ విధంగా ఆలోచించి పెట్టుబడులు పెడతారో.. అదే విధంగా నిమ్మగడ్డ ప్రసాద్ కూడా జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టారని చెప్పారు. ఈ పెట్టుబడుల ద్వారా ఆయన లాభాలు కూడా సంపాదించారని వివరించారు. నిమ్మగడ్డ ప్రసాద్ నిజానికి వైఎస్ చనిపోయిన తరువాత జగతిలో పెట్టుబడులు పెట్టారన్నారు. బీవోటీ పద్ధతిలో చేపట్టిన వాన్‌పిక్ వల్ల ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండానే ప్రభుత్వం భవిష్యత్తులో రెండు పోర్టులకు యజమాని అవుతుందన్నారు. ఈ అంశాన్ని సీబీఐ పరిగణలోకి తీసుకోవటం లేదని చెప్పారు. వాన్‌పిక్‌కు ప్రభుత్వం భూములను ఉచితంగాగానీ, రాయితీపైగానీ కేటాయించలేదన్నారు. భూముల కేటాయింపు పూర్తి పారదర్శకతతో జరిగిందని చెప్పారు. బెయిల్ రాకుండా చేయటానికే సీబీఐ అధికారులు అర్థం లేని ఆరోపణలు చేస్తూ, కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ ప్రసాద్‌కు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారంటున్న సీబీఐ అధికారులు దానికి ఎలాంటి ఆధారాలను చూపించటం లేదన్నారు. వాదనలు ముగిసేసరికి కోర్టు సమయం ముగియటంతో తదుపరి విచారణను న్యాయమూర్తి శుక్రవారానికి వాయిదా వేశారు.

http://m.newshunt.com/Namasthetelangaana/Telangaana/16650442/996

బాపూజీ మృతికి విజయమ్మ సంతాపం


హైదరాబాద్ : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ మృతిపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు వైఎస్ విజయమ్మ శుక్రవారం సంతాపం తెలిపారు. బాపూజీ కుటుంబ సభ్యలుకు కూడా ఆమో తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. 

1952 నాన్-ముల్కి ఉద్యమమం, 1969 తెలంగాణ ఉద్యమంలో బాపూజీ క్రియాశీలకంగా పనిచేశారని, తెలంగాణ ప్రజల ఆర్థిక, రాజకీయ ప్రగతి కోసం అహర్నిశలు తపించిన వ్యక్తి అని విజయమ్మ పేర్కొన్నారు. తుదిశ్వాస విడిచేవరకూ తెలంగాణ ప్రజల బాగు కోరుకున్నారని, బాపూజీ మరణం తీరని లోటు అని ఆమె అన్నారు.

YSRC honorary president YS Vijayamma has condole the death of freedom fighter Konda Laxman Bapuji.
She offered condolences to the family of the late freedom fighter, who was part of the freedom struggle along with Mahatma Gandhi.
Vijayamma said that Bapuji had fought for the cause of Telangana till his last breath and will remain in the hearts of people despite leaving his body.

source:  sakshi

ప్రజలను ఆకట్టుకునే తీరు తెన్నులపై సలహాలు తీసుకోవడానికి చంద్రబాబు ప్రముఖ దర్శకులతో సంప్రదింపులు?

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్రకు సినిమా టచ్ ఇస్తున్నారు. సుద్దాల అశోక్ తేజ ,అనంత శ్రీరామ్ వంటి వారు పాదయాత్ర కోసం ప్రత్యేకంగా రాసిన పాటలను ప్రముఖ గాయకుడు వందేమాతం శ్రీనివాస్ పాడుతున్నారు.ఇది రికార్డింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని ప్రముఖ సినీ నటుడు ఎవిఎస్ చెప్పారు. కాగా తన పాదయాత్రను సఫలం చేయడానికి, ప్రజలను ఆకట్టుకునే తీరు తెన్నులపై సలహాలు తీసుకోవడానికి చంద్రబాబు ప్రముఖ దర్శకులతో సంప్రదింపులు జరిపినట్లు కధనాలు వస్తున్నాయి. ముప్పై ఐదేళ్లుగా రాజకీయాలలో ఉంటూ , ఎనిమిదేళ్ల ఎనిమిది నెలలు ముఖ్యమంత్రిగా, తొమ్మిదేళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ప్రజలలో కలిసిపోవడానికి సలహాలు ఇవ్వాలని ప్రముఖ దర్శకులు రాజమౌళి, తేజ వంటివారిని అడిగారని ఒక పత్రిక రాసింది. దీనికి ఆ పత్రిక భాష్యం ఎలా చెప్పినా, చంద్రబాబు నాయుడు తన పాదయాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఆ నేపధ్యంలో కొన్ని కొత్త మెరుపుల కోసం ఆయన ప్రయత్నించడంలో తప్పు ఉండకపోవచ్చు. అయితే అన్నిటిని మించి ప్రజల భావాలకు అనుగుణంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, అలాగే చంద్రబాబు ప్రజలకోసమే పాటు పడుతున్నారన్న విశ్వాసం ఈ పాదయాత్ర కలిగించాలని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు.

http://kommineni.info/articles/dailyarticles/content_20120921_3.php

రాస్తారోకోలు, ధర్నాలతో హోరెత్తిన రాష్ట్రం



హైదరాబాద్, న్యూస్‌లైన్: విపక్షాల నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, నేతల అరెస్టులతో రాష్ట్రం హోరెత్తిపోయింది. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా గురువారం రాష్ట్రంలో జరిగిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వామపక్షాలు, బీజేపీ నేతలు సహా వేలాదిమంది పార్టీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా అరెస్టయ్యారు. బంద్ ప్రభావంతో విద్యా, వ్యాపార సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. రవాణాసేవలపై పాక్షిక ప్రభావం కనిపించింది. ఆర్టీసీ దూరప్రాంత బస్సులను నిలిపివేసింది. రాజధానితోపాటు ఇతర ప్రాంతాల్లో సిటీ బస్సులు పాక్షికంగా తిరిగాయి. రైళ్లు ఆలస్యంగా నడిచాయి. 

థియేటర్లలో ఉదయం ఆటలు నిలిచిపోయాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలు స్తంభించాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉదయం పూట షిఫ్ట్‌లను సాయంత్రానికి మార్చుకున్నాయి. కరెంటు కోతలతో కొన్ని పరిశ్రమలు ఇప్పటికే మూతపడగా.. మరికొన్నింటిని బంద్‌కు మద్దతుగా మూసేశారు. అత్యవసర సేవలను బంద్ నుంచి మినహాయించడంతో ఆందోళనకారులు వాటికి ఎటువంటి ఆటంకాలు కలిగించలేదు. అటు కాంగ్రెసేతర పక్షాల ఎమ్మెల్యేలు శాసనసభ ఎదుట రాస్తారోకో చేసి, అరెస్టయ్యారు. బంద్ విజయవంతమైందని ప్రతిపక్షాలు ప్రకటించాయి. 

రాఘవులుకు స్పల్ప గాయాలు..

ఉదయం ఆరింటికే రోడ్ల మీదకు వచ్చిన లెఫ్ట్, టీడీపీ కార్యకర్తలు డిపోల ఎదుట బస్సులను అటకాయించారు. హైదరాబాద్‌లోని ఇమ్లిబన్ బస్‌స్టేషన్ వద్ద సీపీఐ నేతలు కె.నారాయణ, కె.రామకృష్ణ, చాడ వెంకటరెడ్డి, సీపీఎం నాయకుడు పి.మధు ఆధ్వర్యంలో రాస్తారోకో జరిపారు. దీంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లి బస్ స్టేషన్‌కు టీడీపీ నేతలు తాళాలు వేసి నిరసన తెలిపారు. నారాయణగూడ చౌరస్తాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, సీపీఐ నేత అజీజ్‌పాషా, టీడీపీ నేతల నేతృత్వంలో కార్యకర్తలు రోడ్లను దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన తోపులాటలో రాఘవులు సహా పలువురికి స్వల్పగాయాలయ్యాయి. 

డీఎస్పీ తరుణ్‌జోషి రాఘవులు పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అటు బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు తదితరుల నాయకత్వంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో రాస్తారోకో చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. అరెస్టుల సందర్భంగా వివిధ పార్టీల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. యూపీఏ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకునేంత వరకూ పోరాటం సాగుతుందని వామపక్షాలు ప్రకటించాయి. 

అసెంబ్లీకి ఎమ్మెల్యేల నిరసన ప్రదర్శన..

బంద్‌కు మద్దతుగా టీడీపీ, సీపీఐ, సీపీఎం, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గురువారం ఉదయం గన్‌పార్క్ నుంచి అసెంబ్లీకి నిరసన ప్రదర్శనగా వెళ్లారు. కట్టెల పొయ్యిలతో వంటచేసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగితే.. మున్ముందు కట్టెలపొయ్యిలు, సైకిళ్లు, ఒంటెద్దు బండ్లే దిక్కంటూ నిరసించారు. సీపీఐ ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, చంద్రావతి, యు.యాదగిరిరావు నల్లబ్యాడ్జీలతో పాదయాత్ర చేశారు. సీపీఎం శాసనసభా పక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి, పయ్యావుల కేశవ్, నన్నపనేని రాజకుమారి నాయకత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు, హరీష్‌రావు నాయకత్వంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకుని ఊరేగింపుగా అసెంబ్లీకి వెళ్లారు. సభ వాయిదా పడిన అనంతరం విపక్షాల ఎమ్మెల్యేలు అసెంబ్లీ మెయిన్‌గేట్ ఎదుట రాస్తారోకో జరిపారు. 

మూడు నిమిషాల్లో ముగిసిన నిరసన

టీడీపీ, సీపీఎం, సీపీఐ చేపట్టిన రాస్తారోకో కేవలం మూడు నిమిషాల్లోనే ముగిసింది. సభ వాయిదా పడిన వెంటనే టీడీపీ, సీపీఐ, సీపీఎం సభ్యులు ప్రదర్శనగా అసెంబ్లీ నుంచి రవీంద్రభారతి చౌరస్తాకు చేరుకున్నారు. వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలు రోడ్డుకు అడ్డంగా అలా నిలబడ్డారో లేదో పోలీసులు ఇలా రంగంలోకి దిగి అరెస్టు చేయటం ప్రారంభించారు. 12.40 గంటలకు రాస్తారోకో ప్రారంభించగా పోలీసులు 12.43 గంటలకు అరెస్టు చేశారు. ఆ తరువాత వారినందరిని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు తరలించి, అక్కడ విడిచిపెట్టారు. 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల బైఠాయింపు..

అసెంబ్లీ గేటు బయట ఉన్న రహదారిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. శాసనసభ అర్ధంతరంగా శుక్రవారానికి వాయిదా పడిన తరువాత ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. వీరు రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, భూమన కరుణాకర్ రెడ్డి, శోభా నాగిరెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, బాలరాజు, జి.బాబూరావు, బాలినేని శ్రీనివాసరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, వై.బాలనాగిరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు ఈ నిరసనలో పాల్గొన్నారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు వారిని అరెస్టు చేశారు. కొందరిని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు తీసుకెళ్లగా.. మరికొందరిని నాంపల్లి స్టేషన్‌కు తరలించి, ఆ తర్వాత వదిలిపెట్టారు.

source: sakshi


కాంగ్రెస్-సీబీఐ-రాజకీయం!


‘‘వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు మా అస్త్రాలు మాకున్నాయి’’- కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మాత్యులు వీరప్ప మొయిలీ నోటి నుంచి వెలువడిన మాటలివి. ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైఎస్ జగన్ ప్రభంజనం ఖాయమని ప్రముఖ ఆంగ్ల వార్తా చానల్ ఎన్డీటీవీ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. ఈ సందర్భంగా ఎన్డీటీవీ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మొయిలీ ఈ మాట అన్నారు. ఇదే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న జగన్ సతీమణి వైఎస్ భారతి.. మీ అస్త్రం సీబీఐయేనా అంటూ మొయిలీని ప్రశ్నించడంతో ఆయన నీళ్లు నమలక తప్పలేదు. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థగా అవతరించిన సీబీఐ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ జేబు సంస్థగా పరిణామం చెందడం నడుస్తున్న చరిత్ర చెబుతున్న సత్యం.

తన మాట వినని వారిపైకి సీబీఐని ఉసిగొల్పడంలో కాంగ్రెస్ ప్రదర్శించే ‘చాతుర్యం’ బహిరంగ రహస్యం. సీబీఐ పేరుతో అసమ్మతి నేతలను అదిమి పట్టడంలో హస్తం పార్టీ ఆరితేరిపోయిందన్న ఆరోపణలు కోకొల్లలు. వ్యతిరేక గళం వినిపించే నాయకుల నోళ్లు నొక్కేందుకు, మాట వినని వారిని తన దారిలోకి తెచ్చేందుకు సీబీఐవైపే కాంగ్రెస్ చూస్తుందన్న విమర్శల వెల్లువకు అంతేలేదు. దర్యాప్తులో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’- అధికార పార్టీల సేవలో తరిస్తుండడం సంప్రదాయంగా వస్తోంది. ద్వంద్వ ప్రమాణాలతో ప్రధాన దర్యాప్తు సంస్థ ప్రతిష్ట క్రమక్రమంగా మసకబారుతోంది. కాంగ్రెస్ పార్టీ సొంత ప్రయోజనాల కోసం సీబీఐని సోపానం వాడుకుంటుందోనని గళమెత్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీన్ని బట్టే అర్థమవుతోంది సీబీఐని కాంగ్రెస్ ఎంత ‘సమర్థవంతం’గా వాడుకుంటుందో?

కాంగ్రెస్-సీబీఐ బంధంపై తాజాగా బీజేపీ జాతీయ నాయకుడు ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆసక్తికర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం అత్యంత విశ్వసనీయ భాగస్వామి సీబీఐ మాత్రమేనని, ఆ సంస్థ ఎంతకాలం శక్తిమంతంగా ఉంటే అంతకాలం యూపీఎ ప్రభుత్వం ఉంటుందని ఆయన అన్నారు. యూపీఏ.. సీబీఐని అడ్డంపెట్టుకుని మైనారిటీని మెజారిటీగా, మెజారిటీని మైనారిటీగా తారుమారు చేస్తోందన్నారు. యూపీఏ ప్రభుత్వం ప్రస్తుతం మైనారిటీలో పడిందని, అధికారంలో కొనసాగే హక్కు కోల్పోయిందని అన్నారు. సీబీఐ కేసుల సాకుతో కొన్ని పార్టీలను బెదిరిస్తోందని ధ్వజమెత్తారు. పార్లమెంటును, దేశ ప్రజలను చివరకు తనతో కలిసొచ్చే భాగస్వామ్య పక్షాలనూ వంచించిన యూపీఏ ప్రభుత్వం ఇంకా అధికారంలో కొనసాగితే మరింత అభాసుపాలవుతుందని చెప్పారు.

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నోసార్లు ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అంటూ సీబీఐని నిర్వచించారు. ఆయనే కాదు చాలా మంది నేతలు ఇదే రకమైన అభిప్రాయాన్ని అనేక సందర్భాల్లో వ్యక్తపరిచారు. ఎవరేమన్నా పట్టించుకోకుండా... ‘నవ్విపోదురు నాకేటి సిగ్గు’ చందంగా సీబీఐతో కాంగ్రెస్ తన అనుబంధాన్ని కొనసాగిస్తోంది. తన రాజకీయ అవసరాల కోసం ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థను దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు పోరుపెడుతున్నా చెవికెక్కించుకోకుండా చెలరేగిపోతోంది. యూపీఏ సంకీర్ణ సర్కారును కాపాడుకునేందుకు మాయావతి, ములాయం సింగ్ యాదవ్ లాంటి నాయకులను సీబీఐ కేసుల పేరుతో కాంగ్రెస్ తన దారికి తెచ్చిందన్న ఆరోపణలు చాలా కాలంగా వినబడుతున్నాయి.

వచ్చే ఎన్నికల్లోనూ తమ ‘ఆయుధం’కు పదును పెడతామని వీరప్ప మొయిలీ చెప్పడంతో కాంగ్రెస్ వైఖరి తేటతెల్లమయింది. పజలు గమనిస్తున్నారన్న జంకు కూడా కాంగెస్‌కుఉన్నట్టు కనబడడం లేదు. అధికారంతో ఏమైనా చేయొచ్చని వీర్రవీగుతోంది. తమకు ‘పవర్’ ప్రసాదించిన ప్రజలను పట్టించుకోకుండా, అధికారాన్ని కాపాడుకునేందుకు పాకులాడుతున్న ‘పురాతన పార్టీ’ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నది యధార్థం. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పే తిరుగులేని ఆయుధం. దీని ముందు ఏ అస్త్రమైనా దిగదుడుపే.

http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=49408&Categoryid=28&subcatid=0

ఈ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు ముగుస్తుంది? జగన్ కోసం - 4


జగన్ మీద ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి 13 నెలలు దాటింది. ఒకటి కాదు రెండు కాదు పదమూడు నెలలు. ఈ 13 నెలల్లో ఏమి సాధించారు? పోనీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నవాళ్లు ఏమైనా సామాన్యులా? పెద్ద పెద్ద అధికారులు. గొప్ప గొప్ప తెలివితేటలు గలవాళ్లు. బాగా చదువుకుని న్యాయం చేయగలిగినా, చేయలేకపోయినా వ్యక్తులను తప్పుడు కేసుల్లో ఎలా ఇరికించాలో, చట్టంలో ఉన్న లొసుగులను, వెసులుబాట్లను ఎలా వాడుకోవాలో, వాటితో ప్రత్యర్థులను ఎంత ఎక్కువ ఇబ్బంది పెట్టాలో, సాక్షులకు మాటలు చెప్పి అవసరం అయితే బెదిరించి వారి చేత అబద్ధపు సాక్ష్యం ఎలా రాయించుకోవాలో... వీటన్నింటిలో ఆరితేరిన మేధావులు. ఇన్ని కళలు వీరికి ఉన్నా ఎంతకీ అయిపోదు ఇన్వెస్టిగేషన్. ఎందుకు? ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి జీతాలు తీసుకుంటున్న వీళ్లంతా ప్రజలకు సమాధానం చెప్పాలి.

ఎన్ని ఫైల్స్... ఎంత హడావిడి... ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో టీమ్స్... అయినా అయిపోని ఇన్వెస్టిగేషన్. ఇదంతా ఏ కసబ్‌ని పట్టుకోవడానికో ఏ గోకుల్‌చాట్ బాంబింగ్‌ను ఛేదించడానికో ఎంతో ప్రాణహానికి కారణమైన ఏ ట్రైన్‌లో మంటలు పెట్టేవారిని ఇన్వెస్టిగేట్ చేయడానికో కాదు. నిజానికి ఆ కేసుల్లో కూడా ఇంత ఆర్భాటం చేసి ఉండరు. మరెందుకు ఇంత చేసినట్టు? ఎందుకంటే మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమబాటలో నడిపించిన ఒక మహానేతను, చివరి నిమిషం వరకూ ప్రజాశ్రేయస్సు కోసం తపించి ప్రాణాన్ని పణంగా పెట్టిన నాయకుణ్ణి దోషిగా నిరూపించడానికి... నిత్యం ప్రజల మధ్య ఉన్న జగన్‌ను జైలు గోడల మధ్య బందీ చేయడానికి. ఇందుకే. పోనీ ఈ ఇన్వెస్టిగేషన్‌లో ఇంతా చేసి కొత్తగా ఏం కనుక్కున్నారు? ఈనాడు రూ.100 షేర్లను రూ.5,00,000లకు అమ్మిన నేపథ్యంలో సాక్షి ఈనాడులో సగం విలువ కట్టి రూ.10 షేర్లను రూ.350కి అమ్మిందని కనుక్కున్నారా? దానికి ఇంత హంగు, ఆర్భాటం దేనికి? సాక్షి సంస్థే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిందే.

సాక్షిలో లెక్కలేనన్ని సార్లు వివరణ ఇచ్చిందే. ఈనాడులో రిలయన్స్ పెట్టుబడుల సంగతి దాచినట్టుగా సాక్షి తన పెట్టుబడుల సంగతి దాచలేదే. అలా మాకు దాచిపెట్టవలసిన అవసరం లేదు కూడా. అయినా ఇన్నిరోజులు ఇన్వెస్టిగేషన్ చేశారు. కొత్త విషయం ఏమైనా కనుక్కున్నారా? సింగపూర్‌లో మాకు హోటల్ ఉందనో, బినామీ పేర్లతో మద్యం సిండికేట్లు ఉన్నాయనో, విదేశీ అకౌంట్లు ఉన్నాయనో చెప్పగలరా? కొండను తవ్వి తవ్వి ఎలుక కూడా దొరకలేదనే అసహనంతోనేనా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది?

అసలు ఎందుకు అయిపోవడం లేదు ఇన్వెస్టిగేషన్? ఇంకా ఎన్ని చార్జ్‌షీట్స్ వేస్తే మీకు తృప్తి కలుగుతుంది? దానిని ముగించకుండా జగన్‌కు కావలసిన మనుషులను ఇబ్బంది పెట్టడానికి ఎందుకు ఈ నాటకాలు చేస్తున్నారు? ఇన్వెస్టిగేషన్ చేసే పెద్దలు అబద్ధపు లీకులు ఇవ్వడంలో, సాక్షులను బెదిరించడంలో, చట్టంలోని లొసుగులను వెతకడంలో చూపించే చిత్తశుద్ధి ఇన్వెస్టిగేషన్ మీద చూపించి ఉంటే ఎప్పుడో అది అయిపోయేది. వాళ్లకు మంచి పేరు వచ్చేది. చట్టాన్ని అమలు చేయవలసిన ఇలాంటి వాళ్లు అన్యాయంగా చట్టాలతో ఆడుకుంటూ ఉంటే చరిత్రహీనులు అవుతారు తప్ప, ఒకరికి మార్గదర్శకం ఎన్నటికీ కాలేరు.

ఇంతా చేసి సాధించింది ఏమిటంటే- మన రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను సక్సస్‌ఫుల్‌గా పక్క రాష్ట్రాలకు పంపించడం. ఏ పని చేస్తే ఏమవుతుందో అనే అభద్రతలోకి అధికారులను నెట్టేయడం, వారి చేతులు కట్టేయడం. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలను ఇన్వెస్టిగేషన్ పేరుతో ఇబ్బందులు పెట్టారు. తద్వారా రాష్ట్రంలో అభివృద్ధి తిరుగుముఖం పట్టేలా చేశారు. వైఎస్‌ఆర్‌గారు రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ముందుకు తీసుకువెళ్తే రాజకీయ స్వార్థంతో రాజకీయ నాయకులతో కలిసి 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. ప్రజలకు ఇదంతా కళ్లకు కట్టినట్టు కనపడుతోంది. అందుకే వాళ్లు ఈ బూటకపు ఇన్వెస్టిగేషన్‌ను అప్రజాస్వామిక లీకులను నమ్మడం లేదు.

ప్రేమ, పారదర్శకత, మంచితనం, న్యాయం, మానవత్వం ద్వారానే మనుషుల ప్రేమ, గౌరవం, నమ్మకం మనం పొందగలమని మా మామగారు మాకు నేర్పించారు. ఒకరిని ఇబ్బంది పెట్టి, భయపెట్టాలని ప్రయత్నించి, మనసులో కుట్ర, కుళ్లు, అన్యాయం ఉంచుకుంటే అవి అలా వాటిని పెట్టుకున్నవారిని ఎంత వికృతంగా మారుస్తాయో ఇప్పుడు పెద్దలుగా చలామణి అవుతున్న కొందరిని చూస్తే అర్థమవుతుంది.

ఇదంతా ఒక ఎత్తయితే- బెయిల్‌కు అడ్డుపడటం ఇంకో ఎత్తు. అధికార దుర్వినియోగం వల్ల అన్యాయంగా అరెస్ట్ కావడమే ఒక బాధ అయితే, తొంభై రోజుల తర్వాత బెయిల్ పొందే రాజ్యాంగపరమైన హక్కును కూడా వీళ్లు అప్రజాస్వామికంగా అపుతూ ఉంటే ఇక ఆ కుటుంబం పడే బాధ, వేదన తప్పకుండా దేవుడికి అందుతుంది. న్యాయం అక్కడి నుంచే మాకు వస్తుంది. మన న్యాయవ్యవస్థ తప్పకుండా మా పక్షాన న్యాయం చేస్తుందనే నమ్మకం నాకు ఉంది.

పాఠకులకు ఆహ్వానం: జగన్ పక్షాన, జనం పక్షాన నిలబడి వాదన వినిపించాలనుకుంటున్న పాఠకులకు ఆహ్వానం. జగన్ అక్రమ అరెస్టును, వైఎస్ కుటుంబంపై సాగుతున్న వేధింపులను, ప్రత్యర్థుల ప్రచారాన్ని ఎండగట్టే మీ మీ వాదనలను మాకు రాయండి. మీ అభిప్రాయాలు చేరవలసిన చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com


http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=49366&Categoryid=11&subcatid=23

Heritage fresh exempted from Bandh

Written By news on Thursday, September 20, 2012 | 9/20/2012

విజయమ్మతో ఆర్ కృష్ణయ్య సమావేశం!

వైఎస్ విజయమ్మతో బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య భేటీ అయ్యారు. 34% బీసీ రిజర్వేషన్‌ను యథాతథంగా కొనసాగేలా పోరాడాలని వైఎస్ విజయమ్మకు ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాక రాజ్యాంగ సవరణకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. సెప్టెంబర్ 26న ఇందిరాపార్క్ వద్ద తాము చెపట్టనున్న బీసీ రణభేరికి వైఎస్‌ విజయమ్మను కృష్ణయ్యా ఆహ్వానించారు.

హైకోర్టు తీర్పును సాకుగా చూపి సీఎం కిరణ్‌ కుయుక్తులు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. పంచాయతీరాజ్‌ సంస్థలో బీసీ రిజర్వేషన్లు తగ్గించే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారని ఆయన అన్నారు. కృష్ణయ్య విజ్ఞప్తికి వైఎస్ఆర్ సీపీ నేత గట్టు రామచంద్రరావు స్పందించారు. రిజర్వేషన్ల విషయంలో బీసీల కోరిక సమంజసమేనని గట్టు రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. బీసీ రిజర్వేషన్‌ ఏమాత్రం తగ్గినా వైఎస్‌ఆర్ సీపీ చూస్తూ ఊరుకోదన్నార. బీసీలకు మేలు చేసేందుకు కృష్ణయ్య చేపట్టిన ఆందోళనకు వైఎస్‌ఆర్ సీపీ మద్దతు ఉంటుందని గట్టు రామచంద్రరావు అన్నారు. 

http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=454137&Categoryid=14&subcatid=0

Golla Babu Rao Press Meet 20th Sep 2012

హెరిటేజ్ కు బంద్ నుంచి మినహాయింపు

హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కార లక్ష్యంగా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ హెరిటేజ్‌కు మాత్రం మినహాయింపు ఇచ్చింది. బంద్ రోజున హెరిటేజ్ సంస్థల దుకాణాలను మూసివేయకుండా వ్యాపార కార్యకలాపాలు కొనసాగించారు. బంద్ రోజున అదనంగా కోట్లాది రూపాయల వ్యాపారాన్నిహెరిటేజ్ సంస్థలు చేశాయి. బంద్‌ సందర్భంగా హెరిటేజ్‌ సంస్థలకు మినహాయింపు ఇవ్వడంపై ప్రజాసమస్యలపై చంద్రబాబుకు ఏమేరకు చిత్తశుద్ది ఉందో తెలుస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=454133&Categoryid=14&subcatid=0

జగన్ కేసు: హైకోర్టు ఘాటువ్యాఖ్య, సిబిఐ ఉక్కిరిబిక్కిరి


వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు ఏకపక్షంగా సాగుతుందా అని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు గురువారం సిబిఐని ఘాటుగా ప్రశ్నించింది. జగన్ ఆస్తుల కేసులో అరెస్టై జైలులో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఈ రోజు విచారణ జరిగింది.
ఈ సందర్భంగా నిమ్మగడ్డ తరఫు న్యాయవాది... లాభాల కోసమే నిమ్మగడ్డ జగన్ సంస్థలలో పెట్టుబడులు పెట్టారని, పెట్టుబడులు అన్నీ సక్రమమే అని వాదించారు. నిమ్మగడ్డ న్యాయవాది వాదనలను సిబిఐ ఖండించింది. ప్రభుత్వం నిమ్మగడ్డ కంపెనీలకు కేవలం నాలుగు వేల ఎకరాలు కేటాయిస్తే నిమ్మగడ్డ మాత్రం 17వేల ఎకరాలు సేకరించారని కోర్టుకు తెలిపారు. ఇందుకు నాటి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం సహకరించిందని, ప్రతిఫలంగా నిమ్మగడ్డ జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు.
వాదనల సందర్భంగా హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. దర్యాఫ్తు ఏకపక్షంగా సాగుతుందా అని సిబిఐని ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి రస్ ఆల్ ఖైమాను ఎందుకు ప్రశ్నించలేదని కోర్టు సిబిఐని ప్రశ్నించింది. ఆ కంపెనీ పాత్ర గురించి ఎందుకు చెప్పలేదని, నిమ్మగడ్డ బెయిల్ పైన అభ్యంతరాలు చెప్పకుండా కేసు లోతుపాతులు ఎందుకని ప్రశ్నించింది. బెయిల్ పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని సూచించింది.
విచారణ ఇంకా ఎంత మిగిలి ఉందని ప్రశ్నించింది. అయితే కోర్టు ప్రశ్నకు సిబిఐ సమాధానమిచ్చింది. రస్ ఆల్ ఖైమాకు కూడా తాము నోటీసులు పంపామని తెలిపింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం కోర్టు నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్ పైన విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. మరోవైపు ఎమ్మార్ కేసులో విజయ రాఘవ నిందితుడని సిబిఐ ప్రత్యేక కోర్టులో తెలిపింది. విజయ రాఘవ బెయిల్ పిటిషన్ పైన విచారణను కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది.

http://telugu.oneindia.in/news/2012/09/20/andhrapradesh-high-court-questions-cbi-on-nimmagadda-bail-plea-105902.html

కాంగ్రెస్ నమ్మకమైన భాగస్వామి సిబిఐ-బిజెపి

కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన భాగస్వామి సిబిఐ అని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఎమ్.వెంకయ్య నాయుడు తీవ్రంగా విమర్శించారు. కొద్దికాలం క్రితం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి సిబిఐపై చేసిన వ్యాఖ్యల తరహాలోనే వెంకయ్య నాయుడు కూడా ఈ ఆరోపణలు చేశారు. సిబిఐని అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించాలని చూస్తోందని కూడా ఆయన విమర్శించారు. సిబిఐ తీరు తెన్నులపై రాజకీయ పార్టీలు విమర్శించడం సాధారణమే. కాని అదే సిబిఐ కూడా అందుకు అవకాశం ఇచ్చే విదంగా వ్యవహరిస్తోందన్న భావన సర్వత్రా ఉంది. వృత్తి నిపుణత కలిగిన అధికారులు ఉండే సిబిఐ ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా వ్యవహరించే పరిస్థితి రావడం బాదాకరమే.హైకోర్టు జగన్ కేసులో సిబిఐని ఉక్కిరిబిక్కిరి చేసిందన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో వెంకయ్య నాయుడు చేసిన విమర్శలకు ప్రాధాన్యం ఉంది. కాగా మూడో ఫ్రంట్ ఏర్పడడం భ్రమేనని, యుపిఎలో ఉన్నవారే మూడో ఫ్రంట్ అనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

source: kommineni

వాన్ పిక్ విచారణ ఏకపక్షంగా ఉందా-హైకోర్టు

జగన్ ఆస్తుల కేసులో హైకోర్టు కీలకమైన ప్రశ్నలు వేసింది. ముఖ్యంగా వాన్ పిక్ సంస్థలో పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్ ఒక్కరినే ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించడమే కాక, ఈ కేసులో ఏకపక్షంగా విచారణ జరుగుతోందా అని కూడా హైకోర్టు ప్రశ్నించడం ఆసక్తికరం. వాన్ పిక్ కేసులో రస్ ఆల్‌ ఖైమా పాత్ర గురించి ఎందుకు చెప్పడం లేదని హైకోర్టు సిబిఐని అడిగింది. నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ కు అభ్యంతరాలేమిటో చెప్పకుండా కేసు లోతుపాతుల గురించి చెబుతున్నారేమిటని కూడా హైకోర్టు అడగడం విశేషం.విచారణకు ఇంకేం మిగిలిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కాని, కేసు పూర్వాపరాలు కాని, హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చిన నేపధ్యం కాని హైకోర్టు న్యాయమూర్తులకు తెలియకుండా ఉండజాలవు. అయినా చట్టప్రకారం వారు జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అయితే జగన్ కేసు విచారణకు ఆదేశించినప్పుడు అలా జరగలేదన్న విమర్శను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటారు. అయితే కేసు విచారణ పురోగతిని బట్టి అనేక విషయాలు రావచ్చు. అయితే ఇప్పటికే సిబిఐ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను అరెస్టు చేయడంతో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వెనుకంజ వేసే పరిస్థితులు నెలకొన్నాయన్న విమర్శలు ఉన్నాయి. అయినప్పట్టికీ కేసును నిష్పక్షపాతంగా విచారిస్తే ఎవరు అభ్యంతరం చెప్పడానికి వీలులేదు.అలా జరుగుతుందా అన్నదే అందరిలోను వ్యక్తం అవుతున్న ప్రశ్న. అదే ప్రశ్నను ఇప్పుడు హైకోర్టు వేసినట్లు కనబడుతోంది.అయితే సిబిఐ తరపు న్యాయవాది మాత్రం వాన్ పిక్ కేసులో ఆల్‌ ఖైమా సిఇఓ కు నోటీసు జారీ చేసినట్లు తెలిపింది.కేసు విచారణను కోర్టు కొనసాగించడానికి అభ్యంతరం ఎవరికి ఉండదు. ఈలోగానే నిందితులను ఎక్కువకాలం జైలులో ఉంచడానికి సిబిఐ చేస్తున్న ప్రయత్నం మీదే విమర్శలు వస్తున్నాయి.ఏది ఏమైనా సమంజసమైన రీతిలో ఈ కేసులో నిర్ణయాలు వస్తాయని ఆశించాలి.
http://kommineni.info/articles/dailyarticles/content_20120920_10.php

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల ధర్నా, అరెస్ట్



హైదరాబాద్ : పెంచిన డీజిల్‌ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు గురువారం అసెంబ్లీ మూడో గేట్‌ ఎదుట ధర్నాకు దిగారు. ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకుండా అసెంబ్లీని అర్థాంతరంగా వాయిదా వేయడాన్ని ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా తప్పుపట్టారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ధర్నాకు దిగిన ఎమ్మెల్యేలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి పోలీసు స్టేషన్‌ వరకు తీసుకెళ్లి వదిలేశారు. 

http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=454123&Categoryid=14&subcatid=0


‘దేశం’లో మామను ముం(మిం) చే అల్లుడు (apherald)

‘దేశం’లో మామను ముం(మిం) చే అల్లుడునందమూరి వారిని నట్టేట ముంచడం ’నారా‘వారికే సాధ్యం. మహానటుడు ఎన్టీఆర్ ను నమ్మించి వంచించిన ఘనత ’నారా‘కే దక్కిందని చెప్పకతప్పదు. పిల్లనిచ్చిన మామపై మాయా రాజకీయం ప్రయోగించడం తెలుగుదేశంలో పరిపాటే. ఎన్టీఆర్ ను రోడ్లపాలు చేసిన ఖ్యాతి ఎవరిదో అందరికీ విధితమే.   పార్టీ వ్యవస్థాపకుడినే నా నా అవస్థలపాలు చేసిన నాయుడుగారు తెలుగుదేశంలో మరో ప్రయోగానికి తెరతీశారు. బాలయ్యకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించి లోకయ్యను సహాయకునిగా నియమించనున్నారు. మరి లోకయ్య తన మామ బాలయ్యను ముంచిన అల్లుడవుతాడా? పితృదేవుడు ‘నారా’ నేర్పిన రాజకీయ పాఠాలు బాలయ్యబాబుకూ అప్పజెపుతాడా? పిల్లనిచ్చిన పాపానికి పదవి పోతే పోయింది కానీ పరువుపోతే ఇంకేమైనా ఉందా..? అవశానదశలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కొత్త రక్తం కావాలని నాయుడుగారు తలచారు. ఇతరులకు అప్పగిస్తే పార్టీని ఇట్టే ఎగురేసుకుపోతారని భావించినట్టున్నాడు.  ‘దేశం’ వారసుడు బాలయ్యను బరిలోకి దింపేందుకు అక్టోబర్ 2న ముహుర్తం ఖరారు చేశాడు.    కాగా వియ్యంకుడైన బాలయ్యకు చేదోడువాదోడుగా తన వారసుడైన లోకేష్ బాబును నియమించడంలో నిమగ్నమైయ్యారు. దీంతో తెలుగుదేశంలో మళ్ళీ మామా అల్లుళ్ళ శకం ప్రారంభం కానుందనే చెప్పాలి. జనాభిమానం గల బాలయ్యకు పార్టీ పగ్గాలు అందించి ధనాభిమానం గల లోకేష్ కు సైతం కీలక బాధ్యతలు అప్పగిస్తే తన భాధ్యత తీరినట్టేనని ‘బాబు’ దృఢనిశ్చయానికి వచ్చేశాడు. తెలుగుదేశం పార్టీలో ‘నారా’ నందమూరీ వారి కనుసన్నల్లోనే నడవాలన్నది చంద్రబాబు ఆకాంక్ష. ఈక్రమంలో అన్ని పార్టీలు యువతకు పెద్దపీఠ వేస్తుండటంతో తెలుగుదేశం సైతం అదే పద్దతిని కొనసాగిస్తుందని చాటిచెప్పడానికి ఈ ప్రయత్నం చేస్తున్నట్టు వినికిడి.  అంతేకాకుండా దాదాపు దశాబ్డకాలంగా ప్రతిపక్ష గ్రహణంతో విసిగివేసారిన ‘చంద్రుడు’ ఇక తెరచాటు రాజకీయాలు నెరపాలని నిశ్చయించకున్నట్టు తెలియకనే తెలుస్తోంది. ప్రస్తుతానికి పార్టీలో అన్ని బాధ్యతలు తానే చూసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా అయిన వారికి తన కనుసన్నల్లో నడుచుకునే వారికి కొన్ని విభాగాలు అప్పగిస్తే కొంత విశ్రాంతి దొరుతుందని ఆలోచించినట్టుసైతం అవగతమవుతోంది. ఇదిలాఉండగా మామను నట్టేట ముంచి పదవి దక్కించుకున్న సాంప్రదాయం ఉన్న తెలుగుదేశంలో మరోసారి మామాఅళ్ళుళ్ల రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయన్న పార్టీలో చర్చనీయాంశంగా మారింది.  తెలుగుదేశంలో చోటుచేసుకోబోతున్న సరికొత్త రాజకీయాల్లో ఈసారి మామను అల్లుడు కట్టడిచేస్తాడా? లేక మామే తన అల్లుడి రాజకీయ ఆటలను కట్టిపాడేస్తాడా? అన్నది వేచిచూద్దామా మరి..? 

source: http://www.apherald.com/Politics/ViewArticle/4682/

Who should be in jail? Who should be free? : YS Bharathi

Would all this happen if we had struck a secret deal? : YS Bharathi

WOULD ALL THIS HAPPEN IF WE HAD STRUCK A SECRET DEAL? - YS BHARATHI


The vicious propaganda launched against the YSRCP today, reminds me of the Cuddapah by-election.
At that t
ime as well, a torrent of malicious lies was unleashed against Jagan, by his detractors hoping that they would win the election, but the masses saw through their game. The man on the street can discern between political opportunists and leaders who would always be prepared to make any sacrifice for them and remain committed to their word.
At that time, Jagan’s detractors alleged that he had struck a deal with the BJP! Soon, they changed track and accused the YSRCP of having a pact with the Congress! Does a party which swept 15 of the 18 seats for which elections were held in June, have any need to strike a deal with a party that managed to win just 2 seats? In truth, the false cases foisted on Jagan began well before the Cuddapah by-polls. But, we remained unperturbed then and
continue to be unruffled today.
We harbour no fear because neither my father-in-law nor Jagan did anything wrong and did not indulge in any  behind-the-scene, backdoor activities.
During the Cuddapah by-polls, twenty cabinet ministers descended on the scene, their suitcases filled with money, aiming to buy votes and win the elections. They made 10 candidates under the name of Vijayamma, filed their nominations to the Assembly seat and 20 under the name of Jagan Mohan Reddy for the Cuddapah Lok Sabha seat! Their intention was to confuse the masses and fool the people. They even went to the extent of instigating Jagan’s uncle to contest against him. His political opponents indulged in cheap politics — it was Jagan pitted against all of them. But, by God’s grace and the
overwhelming support of the people, both Jagan and my mother-in-law won by record margins.
Even today, when conspiracy after conspiracy is being hatched, when the ruling party and the opposition have ganged up to try to ensure that bail is denied by implicating Jagan in false cases, I draw strength and solace from God. I have implicit trust in Him. It is my fervent belief that people will teach a lesson to such political leaders who only know how to indulge in cheap and petty politics.
If this isn’t injustice, then what is? When Rajiv Gandhi was assassinated, the CBI removed his name from the chargesheet filed in the Bofors case. We have been witnessing what the CBI is now doing — after a leader’s death, it has deleted the name of ‘government’ in the FIR and has substituted it with his name! In the EMAAR case, Chandrababu Naidu has not even been called in for questioning!
People are watching how a woman first lost her husband — who meant everything to her, a man of such standing and stature, in tragic circumstances. She now finds her son on whom all her hopes rest, implicated in false cases and put behind bars. People are watching how the ruling party and opposition have ganged up against Jagan with their despicable politics. And above all, God is watching the goings-on. When the time comes, people will bless Jagan in a spectacular, memorable manner.
Tormenting Jagan is the sole objective of his detractors, who have thrown all norms of morality to the winds. Every citizen is entitled to bail after 90 days; it has been 114 days since his unlawful arrest was effected. Yet, motives are being ascribed to us when Jagan's bail petition is coming up for hearing!
They claim we have struck a secret deal. We don’t enjoy the power and authority his detractors do, nor do we have any clandestine pacts with those in power. However, God and the masses are with us—it is this belief that has kept us going for more than three months now.
Come to think of it—if Jagan had struck a secret deal with someone, would he be behind bars today? Chandrababu, who allocated lands to EMAAR, was not even questioned in the case, forget about being arrested! Similarly, wouldn’t Jagan have been a free bird, instead of being in prison, if he had done a covert deal with his tormentors? Would he find himself implicated in false cases in this fashion?

source: http://www.sakshipost.com/index.php/news/oped/3372-would-all-this-happen-if-we-had-struck-a-secret-deal-ys-bharathi

బంద్‌ను విజయవంతం చేయండి

యూపీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా గురువారం తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని శ్రేణులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. డీజిల్ ధరను ఎన్నడూ లేని విధంగా పెంచడం, గ్యాస్ సిలిండర్లపై పరిమితి విధించడంతో పాటు చిల్లర వర్తక రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారాలు తెరవడాన్ని పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ప్రజా వ్యతిరేక చర్యలను తక్షణం ఉపసంహరించుకునేలా ఒత్తిడి తేవడానికి బంద్‌ను నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

పొత్తు ఉంటే ఇలా జరుగుతుందా? జగన్ కోసం - 3

రాజీవ్‌గాంధి చనిపోయాక బోఫోర్స్ కేసులో సిబిఐ ఆయన పేరును ఛార్జిషీటు నుంచి తొలగించడం మనం చూశాం. ఇప్పుడు ఒక నేత చనిపోయిన తర్వాత ఎఫ్‌ఐఆర్‌లో ‘ప్రభుత్వం’ అనే మాట తీసివేసి చనిపోయిన ఆ నేత పేరును పెట్టడం చూస్తున్నాం. ఎమ్మార్ కేసులో తప్పుచేసిన చంద్రబాబు వంటి వారిని కనీసం విచారణకు కూడా పిలవని పరిస్థితులను కూడా చూస్తున్నాం.


వైఎస్‌ఆర్‌సిపి మీద ఇవాళ జరుగుతున్న ప్రచారం చూస్తే నాకు 2011 కడప ఎలక్షన్ గుర్తుకు వస్తోంది. అప్పుడూ ఇంతే. అబద్ధాలను ప్రచారం చేసి గెలవాలనుకున్నారు. కానీ ప్రజలకు తెలుసు - ఎవరు మాట మీద నిలబడతారో, ఎవరు మాట కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతారో. 

ఆ రోజు బిజెపితో పొత్తు అన్నారు. అంతలోనే కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నారు. ఉపఎన్నికలలో 15 సీట్లు వచ్చిన వైయస్‌ఆర్‌సిపికి 2 సీట్లు వచ్చిన కాంగ్రెస్‌తో ఏమి అవసరం వుంటుంది? నిజానికి ఈ తప్పుడు కేసులు ఇప్పుడు మొదలు కాలేదు... కడప ఎలక్షన్స్‌కు ముందే మొదలయ్యాయి. కాని మేము భయపడలేదు. ఈరోజు కూడా భయపడవలసిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మామగారు గాని, జగన్‌గాని ఏ తప్పు చేయలేదు కనుక. దాచిపెట్టి, చీకటిలో చాటుమాటుగా పనులు చేసే అలవాటు మామగారికి కాని, జగన్‌కు కానీ లేవు కనుక.

కడప ఎలక్షన్స్‌కు 20 మంది మంత్రులు సూట్‌కేసుల నిండా డబ్బులు తెచ్చి, ఓటర్లను గందరగోళ పరచాలని 10 మంది విజయమ్మ పేరు గలవారి చేత, 16 మంది జగన్‌మోహన్‌రెడ్డి పేరు గలవారి చేత నామినేషన్స్ వేయించారు. జగన్ చిన్నాయననే జగన్‌కు ప్రత్యర్థిగా ఉసిగొలిపారు. నీచ రాజకీయాలు చేశారు. జగన్ ఒక్కడు - వాళ్లు అంతమంది. అయినా దేవుని దయతో, ప్రజల ప్రేమాశీస్సులతో కనీవినీ ఎరుగని మెజారిటీలతో ప్రజలు తల్లిని, బిడ్డను దీవించారు.

ఇప్పుడు కూడా ఇన్ని కుట్రలు జరుగుతున్నా, తప్పుడు కేసులు పెట్టి బెయిల్ రాకూడదని అధికార, ప్రతిపక్షాలు నానాతంటాలు పడుతున్నా నా మనస్సుకు ఇదే ధైర్యాన్ని ఇస్తోంది- దేవుడు ఉన్నాడని, ఆయనను నమ్ముకున్న వాళ్లకు ఆయన ప్రతిఫలం దయచేస్తాడని. అన్యాయం జరుగుతూ వుంటే ప్రజలు చూస్తూ వుండరని - ఈ కుట్రలు తప్ప వేరొకటి తెలియని నీచ రాజకీయ నాయకులకు తప్పకుండా బుద్ధి చెప్తారని నా నమ్మకం.

అన్యాయం కాకపోతే చూడండి... రాజీవ్‌గాంధి చనిపోయాక బోఫోర్స్ కేసులో సిబిఐ ఆయన పేరును ఛార్జిషీటు నుంచి తొలగించడం మనం చూశాం. ఇప్పుడు ఒక నేత చనిపోయిన తర్వాత ఎఫ్‌ఐఆర్‌లో ‘ప్రభుత్వం’ అనే మాట తీసివేసి చనిపోయిన ఆ నేత పేరును పెట్టడం చూస్తున్నాం. ఎమ్మార్ కేసులో తప్పుచేసిన చంద్రబాబు వంటి వారిని కనీసం విచారణకు కూడా పిలవని పరిస్థితులను కూడా చూస్తున్నాం.

ఇంటికి పెద్దదిక్కయిన భర్తను పోగొట్టుకున్న ఒక ఆడమనిషికి మగదిక్కయిన ఒక్క కొడుకును కూడా తీసుకెళ్లి అప్రజాస్వామికంగా, అన్యాయంగా జైలులో పెట్టి వింత చూస్తున్న ఈ అధికార, విపక్షాల వికృత చేష్టలను ప్రజలు గమనిస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు వాళ్లు తప్పక ఊహించని రీతిలో జగన్‌ను ఆశీర్వదిస్తారు.

అసలు వీళ్లకు నీతి న్యాయాలు జరగాలని కాదు తపన - జగన్‌ను ఎలా ఇబ్బందిపెట్టాలా అనేదే వీళ్ల లక్ష్యం. బెయిల్ అనేది 90 రోజుల తరువాత రాజ్యాంగం ప్రతి పౌరునికి కల్పించే హక్కు. అటువంటిది అక్రమంగా అరెస్టుచేసి 114 రోజులు దాటుతూ వుంది. అయినా సరే- ఇప్పుడు బెయిల్ రాబోతూ ఉందంటే దానికి కూడా ఉద్దేశాలు ఆపాదిస్తారా? కలిసిపోయారు అంటారా? మాకు మీ మాదిరి అధికారం లేదు, అధికారంలో వుండే వాళ్లతో చీకటి పొత్తులు లేవు. కాని దేవుడు ఉన్నాడు, ప్రజలు న్యాయం చేస్తారు అనే నమ్మకం మమ్మల్ని 3 నెలలు దాటినా నడిపిస్తున్నాయి.

ఆలోచించండి. ఎవరితోనైనా పొత్తు పెట్టుకొని ఉంటే జగన్ ఇలా ఉండేవాడా? ఎమ్మార్ సంస్థకు భూములు కేటాయించిన చంద్రబాబులా అరెస్టు కాదు కదా కనీసం ప్రశ్నించను కూడా ప్రశ్నించకుండా దర్యాప్తు ముగించేలా మాట్లాడుకుని దర్జాగా బయట వుండడా? ఇలా కేసులలో ఉంటాడా? పొత్తు వుంటే జైలుకు వెళతాడా?

పాఠకులకు ఆహ్వానం: జగన్ పక్షాన, జనం పక్షాన నిలబడి వాదన వినిపించాలనుకుంటున్న పాఠకులకు ఆహ్వానం. జగన్ అక్రమ అరెస్టును, వైఎస్ కుటుంబంపై సాగుతున్న వేధింపులను, ప్రత్యర్థుల ప్రచారాన్ని ఎండగట్టే మీ మీ వాదనలను మాకు రాయండి. మీ అభిప్రాయాలు చేరవలసిన చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1,బంజారాహిల్స్, హైద్రాబాద్-34.

source:  http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=49283&Categoryid=11&subcatid=22

జగన్‌కు వైఎస్సార్ గణేశుని ఆశీర్వాదం!


చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మహానేత వైఎస్సార్ రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడు ఆశీర్వదిస్తున్నట్టు కంచరపాలెం వాడపేట మెయిన్‌రోడ్డులో ఏర్పాటు చేసిన సెట్టింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సిటీ కింగ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సెట్టింగ్‌పై రాసిన ‘జైలుగోడలు, సంకెళ్లు సమరాన్ని ఆపలేవు.. దేవుడు, నీ తల్లిదండ్రులు, ప్రజల దీవెనలు నీకుం టాయి.. ఇపుడు నీవు ముళ్ల బాటలో ఉన్నావ్.. రానున్న కాలంలో అదే నీకు పూలబాట’ అన్న నినాదాలను ముద్రించారు. ‘దేవుడు ఉండాల్సింది దేవాలయంలో.. మంచి మనిషి ఉండాల్సింది ప్రజల మధ్య’ అంటూ భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. 
- న్యూస్‌లైన్, విశాఖపట్నం 

source:

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=453903&Categoryid=1&subcatid=33

వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో గణపతి పూజ


హైదరాబాద్, న్యూస్‌లైన్: స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం గణపతి పూజను ఘనంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

source: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=453674&Categoryid=1&subcatid=33

ఎవరు లోపల ఉండాలి? ఎవరు బయట? (sakshi)

Written By ysrcongress on Wednesday, September 19, 2012 | 9/19/2012


19 Sep 2012 02:16, 
(19 Sep) నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్ధం సముద్రాలు దాటి వస్తుందని అంటారు. జగన్ విషయంలో ప్రచారం అవుతున్న అబద్ధాలను చూస్తుంటే ఈ మాటే అనాలనిపిస్తోంది. జగన్ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడని అంటున్నారు. అందుకని గత 113 రోజులుగా జైలులో పెట్టారు. కాని అసలు సాక్షులను ప్రభావితం చేస్తున్నది ఎవరు? సాక్షులను ప్రభావితం చేస్తున్నవారిని నిజంగా జైలులో పెట్టవలసి వస్తే లోపల ఉండ వలసింది ఎవరు? అబద్ధాలు రాయించేవారూ... వాళ్లకు తెలిసిన విషయాలను వక్రీకరించి ఏవేవో ఊహించి రాయించేవారూ... లేదా అలాంటి రాతలను రాయించిన తరువాత వాటిమీద స్టేట్‌మెంట్స్ ఇచ్చేవారూ... పోయిన సంవత్సరం ఆగస్టు నెల నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆ టైము నుంచి అంటే ఇన్వెస్టిగేషన్ మొదలైనప్పటి నుంచి పది నెలల పాటు జగన్ బయటనే ఉన్నాడు. ఆ పది నెలలలో ఆయన ఫలాన మనిషిని పిలిచి మాట్లాడాడనిగాని, ఫలానా మనిషికి ఫోన్ చేశాడనిగాని వీళ్ల దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా? రెండు వేల ఫోన్లను టాప్ చేసిన మీకు తెలియకుండా ఆ పని సాధ్యమా? అయినా పొద్దున తొమ్మిది నుంచి రాత్రి పదకొండు వరకు ప్రజల మధ్యలో ఉండే మనిషికి సాక్షులను ప్రభావితం చేయగల సమయం, వీలు, మైండ్‌సెట్ ఉంటాయా? ఆలోచించండి. ఒక మనిషి రోజంతా పద్నాలుగు పదిహేను గంటలు అందరితో ఓపికతో ప్రేమగా మాట్లాడి మిగిలిన టైమ్‌లో ఇతరులను బెదిరిస్తూ అదిలిస్తూ దౌర్జన్యం చేస్తూ ఉండగలడా? ఇంత విరుద్ధంగా ప్రవర్తించగలరా ఎవరైనా? అసాధ్యం. జగన్ సాక్షులను ప్రభావితం చేస్తాడు అంటున్నవాళ్లు అబద్ధాలకోర్లు అనే కదా అర్థం? ఇంకా చెప్పాలంటే పక్షపాతంతో కక్షపూరితంగా జగన్‌ను ఎలా ఇరికించాలా అన్న ఆలోచనలతో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారనే కదా అర్థం.

 రెండు పత్రికలు, మూడు చానెళ్లు ఎలాగూ చేయూతనిస్తున్నాయని, ఎల్లో మీడియా వెంట ఉందని బరితెగించి జనం గమనిస్తున్నారన్న సంకోచం లేకుండా, సమాధానం చెప్పవలసిన దేవుడికి వెరవకుండా వ్యక్తుల హక్కులను కాలరాస్తున్న వీళ్లు ప్రజా రక్షకులు కాదు ప్రజాభక్షకులు. నేను అడుగుతున్నాను- అసలు సాక్షులను ప్రభావితం చేస్తున్న వాళ్లెవరన్నది బయటపడాలి ముందు. ఆ నిజం బయటపడి తీరాల్సిందే. మూడు తరాలుగా మా కుటుంబంలో వ్యక్తిగా ఉన్న సాయిరెడ్డిని సైతం జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వమని, లేదంటే అరెస్టు చేస్తామని కేసులు పెడతామని బెదరించింది ఎవరు? మా దగ్గర పెట్టుబడి పెట్టినవారిని కేసుల పేరుతో వేధించింది ఎవరు? సాక్షులను ప్రభావితం చేస్తారని జైలులో పెట్టవలసి వస్తే జైలులో ఉండవలసింది ఎవరు? వ్యాపారరంగంలో మన రాష్ట్రాన్ని అంతర్జాతీయ చిత్రపటంపై పెట్టిన మాట్రిక్స్ ప్రసాద్‌గారిని కేవలం జగన్‌ను అరెస్ట్ చేయడానికని అరెస్ట్ చేశామన్న మాట వాస్తవం కాదా? నాకు బాగా గుర్తున్నాయి ప్రసాద్ గారి భార్య ఆషా నాతో చెప్పిన మాటలు - ''ప్రసాద్‌ను అరెస్టు చేయకముందు వాళ్లు ప్రసాద్‌తో జగన్‌కు వ్యతిరేకంగా చెపితే మిమ్మల్ని అరెస్టు చేయము అన్నారు''. ఈ మాటలను బట్టి ఏం అర్థం చేసుకోవాలి? వీళ్లు నిర్దోషులను దోషులుగా మారుస్తారు, దోషులను సాక్షులుగా మార్చేస్తారు అనేగా? ఇదీ ప్రభావితం అంటే. సాక్షులను భయపెట్టి బెదిరించి 161, 164ల కింద స్టేట్‌మెంట్లకు వత్తిడి తీసుకొని రావడమే ప్రభావితం అంటే. ఇక్కడ చిత్రం ఏమిటంటే ప్రభావితం చేయదగ్గ పదవి, అధికారం ఉన్నవారూ... ప్రభావితం చేస్తున్నవారు బయట ఉన్నారు. వారి వేధింపులు భరిస్తూ కష్టాలు నష్టాలు పడుతూ అయినా సరే అవన్నీ లెక్క చేయకుండా ఎండనకా వాననకా క్షణం తీరిక లేకుండా ప్రజలతో మమేకమైన వ్యక్తి, మాటకోసం నిలబడ్డ ఆ వ్యక్తి లోపల ఉన్నాడు.

 తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు ఏ అధికారికీ, ఏ మంత్రికీ ఫోన్ చేయడం గాని కలవడంగాని చేయని జగన్, ఏ రోజూ సెక్రటరియేట్‌లో కాలు కూడా పెట్టని జగన్, బెంగుళూరులో కుటుంబం, పిల్లలతో నివాసం ఉన్న జగన్ పది నెలల ఇన్వెస్టిగేషన్ తర్వాత కొత్తగా సాక్షులను ప్రభావితం చేస్తాడట. అందుకే ఎలక్షన్స్‌కు 15 రోజుల ముందు, న్యాయస్థానంలో హాజరుకావాల్సిన ఒకరోజు ముందు హటాత్తుగా జ్ఞానోదయమై అరెస్టు చేశారట. పిల్లలు కూడా విని నవ్విపోయే ఇలాంటి కథలను ఇంకా ఎంతకాలం చెప్తారు? దేవుడు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వారు తెలివిలేనివారు కాదు. వారు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వారినే మోసం చేయాలనుకోవడం మూర్ఖత్వం. ఈ మొత్తం నాటకానికి కర్తలు ఎవరో, ఎవరు ఎవరిని ఆడిస్తున్నారో, ఎవరు ఎవరిని ప్రభావితం చేస్తున్నారో, ఎవరు జైలులో ఉండాలో ఎవరు బయట ఉండాలో అంతా ప్రతిదీ ప్రజలకు తెలుసు. అందుకే ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారీ బుద్ధి చెప్తున్నారు. తమ ఓటు హక్కుతో జగన్‌కు బాసటగా నిలుస్తున్నారు. ఇది కూడా ఆ కర్తలకు తెలుసు. కాని వాళ్లు కళ్లు మూసుకొని పాలు తాగే పిల్లులు. చెవులుండీ వినలేనివారు, కళ్లుండీ చూడలేనివారు. - వైఎస్ భారతి w/o వైఎస్ జగన్ పాఠకులకు ఆహ్వానం: జగన్ పక్షాన, జనం పక్షాన నిలబడి వాదన వినిపించాలనుకుంటున్న పాఠకులకు ఆహ్వానం. జగన్ అక్రమ అరెస్టును, వైఎస్ కుటుంబంపై సాగుతున్న వేధింపులను, ప్రత్యర్థుల ప్రచారాన్ని ఎండగట్టే మీ మీ వాదనలను మాకు రాయండి. మీ అభిప్రాయాలు చేరవలసిన చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34

source:
http://m.sakshi.com/Sakshi/Features-Wednesday/16607321/993

కేంద్రానికి మమతా బెనర్జీ షాక్

Written By ysrcongress on Tuesday, September 18, 2012 | 9/18/2012

కేంద్ర ప్రభుత్వంనుంచి తృణమూల్ కాంగ్రెస్ వైదొలగాలని మంగళవారం సాయంత్రం నిర్ణయించుకుంది. కేంద్రం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడానికి ముందు తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ నాయకత్వంలో కలకత్తాలో ఆ పార్టీ సీనియర్ నాయకులు సమావేశమయ్యారు. తృణమూల్‌కు చెందిన కేంద్ర మంత్రులు శుక్రవారంనాడు తమ పదవులకు రాజీనామా చేస్తారని తృణమూల్ వర్గాలు వెల్లడించాయి. 

కాంగ్రెస్ నాయకత్వంలోని యు.పి.ఎ. సంకీర్ణ ప్రభుత్వం నుంచి నిష్క్రమించాలని కలకత్తా సమావేశంలో నిర్ణయించారు. అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ బొగ్గు కుంభకోణంనుంచి దేశం దృష్టిని మరల్చడానికే కేంద్రం ఎఫ్.డి.ఐ.లను రంగంమీదికి తీసుకువచ్చిందని ఆరోపించారు. కేంద్రం పదే పదే ధరలు పెంచుతున్నందున తమకు గత్యంతరం లేని పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆమె చెప్పారు. కేంద్రంలో తమకు సరైన గౌరవం లభించడం లేదని, డీజిల్ ధరల పెంపు విషయంలో గాని, గ్యాస్ సిలిండర్ల తగ్గింపు విషయంలో గాని, రిటైల్ రంగంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విషయంలో గాని కేంద్ర ప్రభుత్వం తమతో సంప్రదించలేదని తృణమూల్ కాంగ్రెస్ అసంతృప్తితో ఉంది. 

20 వైఎస్ఆర్ సిపి రాష్ట్రవ్యాప్త ఆందోళన

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగనుంది. డీజిల్ ధర పెంపు, సిలెండర్ల కోత, రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఈ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ నెల 20న నిరసనలు, రాస్తారోకోలు, హర్తాళ్లు చేపట్టాలని ప్రజలకు పిలుపు ఇచ్చింది. ప్రజా వ్యతిరేక చర్యలను తక్షణం ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. యూపీఏ వైఖరి వల్ల కోట్లాది మంది సామాన్యులపై మరింత భారం పడుతుందని పార్టీ తెలిపింది.


source:

http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=452975&Categoryid=14&subcatid=0

'కరువు మండలాలు ప్రకటించాలి'

ప్రభుత్వం వెంటనే కరువు మండలాలు ప్రకటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు డిమాండ్ చేశారు. శాసనమండలిలో ఈరోజు కరువు పరిస్థితిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మేకా మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో గ్రామాల్లో కరువును ఎదుర్కోవాలన్నారు. వైఎస్ఆర్ గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని కరువు నివారణ చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. పంటల బీమా ప్రవేశపెట్టిన ఘనత ఆయనదేనన్నారు. కులవృత్తుల ప్రోత్సాహానికి ప్రభుత్వం ఏవిధమైన చర్యలు తీసుకోలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రశాంతంగా గడిచిన రోజు లేదు....ఇన్ని చేసినా ఇంత వేధించినా జగన్ భయపడలేదు.


ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే ఆయన చేసిన తప్పు అన్నట్టుగా జగన్‌పై కేసుల మీద కేసులు పెట్టారు. ఇళ్లు సోదాలు చేయించారు. అనుక్షణం వెంటపడ్డారు. అన్ని పార్టీలవాళ్లు కలిసి చేస్తున్న దాడి ఒకవైపు వారికి సపోర్టుగా విషం చిమ్ముతున్న కొన్ని పత్రికలు, కొన్ని చానెల్సు మరోవైపు. పాములు కూడా ఇంతగా పగపట్టవు.

ఈ రోజుకి మా మామగారు వైఎస్ రాజశేఖరరెడ్డిగారు మా మధ్య నుంచి వెళ్లిపోయి 3 సంవత్సరాల 13 రోజులైంది. జగన్‌ను జెయిల్‌లో పెట్టి 112 రోజులైంది. కాని ఈ మూడు సంవత్సరాలలో ముప్ఫయి ఏళ్లకు సరిపడా కష్టాలు చూసినట్టుగా ఉంది.

మా మామగారు రాష్ట్రానికి పెద్ద దిక్కు. నా పార్టీ నీ పార్టీ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి సమస్య తన సమస్యగా భావించి పరిష్కరించడానికి చూసేవారు. ప్రతి ఒక్కరి కంటి తడి తుడవడానికి చూసేవారు. ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా ఇంటి పెద్దగా ఒక్కరోజు కూడా బాధ్యతను విస్మరించేవారు కాదు. మాకు సలహాలు ఇచ్చేవారు. ప్రతి పనిలో సూచనలు చేసేవారు. చిన్నా పెద్దా అని లేదు. అందరికీ ఆలోచనలో సాయం చేసేవారు. ఏదైనా సమస్య వస్తే ఆయన ధైర్యం చెప్పినట్టుగా ఎవరూ చెప్పలేరు. అసలు ఆయన ఉండటమే పెద్ద ధైర్యం.

అలాంటి మనిషిని, మాకు కొండంత అండని, అంతపెద్ద ఆసరాని మా నుంచి అకస్మాత్తుగా దేవుడు తీసుకెళ్లాడు. మా కాళ్ల కింద నేల కదిలిపోయినట్టుగా అనిపించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ సంతోషంగా ప్రశాంతంగా గడిచిన రోజు లేదు. ఈ కష్టంలో మేముంటే ఆదరించాల్సినవాళ్లే ఓదార్పు పలకాల్సినవాళ్లే పరాయివాళ్లయ్యారు. పగవారయ్యారు. మమ్మల్ని వేధించేవాళ్లయ్యారు. వాళ్లు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా ఎన్ని సమస్యలు తెచ్చి పెట్టినా దేవుని దయవలన మా మామగారిని ప్రేమించిన ప్రజల అండ వలన జగన్ ముందుకు నడిచాడు. ప్రజలకు నేనున్నానన్న ధైర్యం ఇచ్చాడు. తన తండ్రిలానే వారిని గుండెలకు హత్తుకున్నాడు. ప్రజలూ వైఎస్‌ను అభిమానించినట్టే ఆయననూ అభిమానించారు. కాని దానిని వాళ్లు సహించలేకపోయారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే ఆయన చేసిన తప్పు అన్నట్టుగా జగన్‌పై కేసుల మీద కేసులు పెట్టారు. ఇళ్లు సోదాలు చేయించారు. అనుక్షణం వెంటపడ్డారు. అన్ని పార్టీలవాళ్లు కలిసి చేస్తున్న దాడి ఒకవైపు, వారికి సపోర్టుగా విషం చిమ్ముతున్న కొన్ని పత్రికలు, కొన్ని చానెల్సు మరోవైపు. పాములు కూడా ఇంతగా పగపట్టవు. మధ్యలో గులాంనబీ గారు ఉపఎన్నికల ప్రచారంలో ‘మా పార్టీలో జగన్ ఉంటే కేంద్ర మంత్రిని చేసేవాళ్లం, ఆ తర్వాత ముఖ్యమంత్రిని కూడా చేసేవాళ్లం’ అని అనడం చూస్తే, వాళ్ల మాటలతో విభేదించడం వల్లే జగన్‌ను జైలుపాలు చేశారని తెలుస్తోంది. ఆ మాటలు గుర్తుకువచ్చినప్పుడల్లా తూటాల్లా తగిలి గుండెను పిండివేస్తున్నంత బాధ కలుగుతుంది.

కాని ఇన్ని చేసినా ఇంత వేధించినా జగన్ భయపడలేదు. నమ్మినదారి విడువలేదు. ఆ సమయంలో మాతో అనేవాడు- నాయనను ప్రేమించిన ప్రతి గుండె తోడుగా ఉన్నంతవరకూ, పై నుంచి నాయన, దేవుడు నన్ను చూసి ఆశీర్వదిస్తున్నంత వరకూ నాకే భయం లేదు- అని! నిజమే. ప్రజలతో నడుస్తున్న జగన్ ప్రజల కోసం నడుస్తున్న జగన్ ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? ఇది వారికి నచ్చలేదనుకుంటా. అరెస్టు చేశారు. అలా చేస్తే అయినా జగన్ భయపడతాడేమోనని చూశారు. అలా జరగలేదు. జగన్ భయపడలేదు. చెదరలేదు. బెదరలేదు. కాబట్టి బెయిల్ రాకుండా చేయాలని ఇప్పుడు నానా తంటాలు పడుతున్నారు. నానా రాతలు రాస్తున్నారు. ఒకరోజు మేము లాయర్‌ని మార్చామని. ఒకరోజు సిబిఐ లాయర్‌ని మార్చిందని. ఏం చేసినా ఎవరు చేసినా తప్పే. ఏం చేయకపోయినా తప్పే. వీళ్ల పెన్నుల్లో ఉన్నది ఇంకు కాదు. బురద.

రాష్ట్రంలో నిత్యం ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఎన్నో సమస్యలతో అల్లాడుతున్నారు. అయినా సరే టిడిపికి ఇవన్నీ పట్టవు. దానికి జగనే లక్ష్యం. వాళ్లు గనక జగన్ మీద మాట్లాడినన్ని మాటలు ప్రజాసమస్యలపై మాట్లాడి ఉంటే కొద్దో గొప్పో విశ్వసనీయత వచ్చి ఉండేది. కాంగ్రెస్‌లో తమ అధికారం కాపాడుకోవడం కోసం జగన్ మీద మాట్లాడినన్ని మాటలు జనం కోసం మాట్లాడి ఉంటే వారి స్థానం పదిలంగా ఉండేదేమో.

మా మామగారు కూడా 32 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు. కాని ఏ రోజూ అవతలివాళ్లను దొంగదెబ్బ తీసి పైకి రావాలని అనుకోలేదు. ఆయన ఈరోజు ఉంటే ఇలా చేసేవారా? ఒక చంద్రబాబు కొడుకునో, ఒక కిరణ్‌కుమార్ కొడుకునో, ఒక బొత్స కొడుకునో, ఒక రామోజీ కొడుకునో లక్ష్యంగా చేసుకొని పీడించి ఉండేవారా అని ఆలోచిస్తే చేసేవారు కాదనే అనిపించింది. ఒక్కరిని చేసి చుట్టుముట్టి బాధ పెట్టి వికృత ఆనందం పొందే నీచత్వానికి దిగజారి ఉండేవారా? ముమ్మాటికి కాదు. ఆయనది అన్నం పెట్టిన చరిత్ర. చేయూతనిచ్చిన చరిత్ర. పగవారిని సైతం ప్రేమించిన చరిత్ర. అందుకే ఆయన చరిత్రకెక్కారు.

ఇవాళ మమ్మల్ని చుట్టుముట్టింది అందరూ పెద్దవాళ్లే. పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్లే. కాని వారి కంటే ఏమీ చదువుకోని వాళ్లు ఏమీ లేని నిరుపేదలు తమ కుటుంబాలలో ఒకడిగా ఇవాళ జగన్‌ను అక్కున చేర్చుకున్నారు. మానవత్వం చూపారు. తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న జగన్‌ను చూసి రాజకీయాలు తెలియని అవ్వలు, తాతలు, అక్కలు, చెల్లెళ్లు, అన్నలు, తమ్ముళ్లు నువ్వు ఒంటరివి కాదు మేమున్నామని చెప్పారు. 17 ఎమ్మెల్యే స్థానాల్లో, 2 ఎంపి స్థానాల్లో జగన్ అభ్యర్థులను జయజయధ్వానాలతో గెలిపించారు. ఇవాళ ఇండియా టుడే, ఎన్‌డిటివి వంటి విశ్వసనీయ సంస్థల సర్వేల్లో మేమంతా జగన్ పక్షమే అని ఎలుగెత్తి చాటారు. జరుగుతున్నది అన్యాయమని పెద్దలకు వినపడేలా చెప్పారు. ఇంతకంటే ఏం కావాలి?

జగన్‌కు నీచ రాజకీయాలు కుమ్మక్కు ఆలోచనలు తెలియదు. అందుకే అనుకుంటా ఆయనను అందరూ కలిసి ఒంటరిని చేశారు.

- వైఎస్ భారతి
w/oవైఎస్ జగన్

source:sakshi news

Not a day of peace...: YS Bharathi

సమస్యలపై స్పందించండి: విజయమ్మ

తెలంగాణతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా అనేక సమస్యలపై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అసెంబ్లీలో అన్నారు. బీఏసీలో అన్ని పార్టీలు కలిసి తెలంగాణ సమస్యపై చర్చించ పరిష్కరించవచ్చని, సభలో ఎలాంటి తీర్మానం చేస్తారంటూ అన్ని ప్రాంతాల ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ఎక్కువ సమయం లేనందున, ఇప్పటికే ఒకరోజు ముగిసిందని, ప్రజా సమస్యలపై స్పందించి నిర్ణయం తీసుకుంటే మంచిదని విజయమ్మ అన్నారు.

విజయమ్మతో అసదుద్దీన్ ఒవైసీ భేటీ

 ఎంఐఎం పార్లమెంట్‌ సభ్యులు అసదుద్దీన్‌ ఒవైసీ మంగళవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షులు వైఎస్‌ విజయమ్మతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అంటూ వైఎస్‌తో తనకున్న అనుబంధాన్ని విజయమ్మతో అసదుద్దీన్ పంచుకున్నారు.

ప్రజా సమస్యలకు వైఎస్‌ తక్షణం పరిష్కారం చూపేవారని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కుటుంబం అంటే తమకెంతో గౌరవమని అసుదుద్దీన్ కొనియాడారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తరచుగా తాను వైఎస్సార్‌ తో సమావేశమయ్యేవాడినని ఇప్పుడు వైఎస్‌ విజయమ్మకూడా ప్రజాసమస్యలపై పోరాడుతున్నారని అసదుద్దీన్ అన్నారు.

తీవ్ర ఇబ్బందుల్లో రైతాంగం: శోభా

కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు శోభా నాగిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వారు మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ ఇంతవరకూ ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీ రాలేదన్నారు.

రైతులు రోడ్డున పడే దుస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో విద్యుత్ సంక్షోభంపై చర్చ సమయంలో కుట్రపూరితంగా సభను వాయిదా వేశారని వారు ఆరోపించారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవటం వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని ఎమ్మెల్యేలు విమర్శించారు.

చీమకుట్టినట్టు కూడా లేదు!

*పరిశ్రమల జేఏసీ దీక్షకు మద్దతు
*వైఎస్ హయాంలో కోతల్లేవు... చార్జీలను తగ్గించారు
*ఈ ప్రభుత్వం చార్జీలను పెంచి, కోతలు విధిస్తోంది.. రాష్ట్రానికి రావాలంటే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు
*మా పార్టీ అధికారంలోకి వచ్చేవరకూ ఓపిక పట్టండి
*వైఎస్ సువర్ణయుగాన్ని మళ్లీ జగన్ అందిస్తాడు

హైదరాబాద్, న్యూస్‌లైన్: విద్యుత్ కోతలతో పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని వైస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. వేలాది పరిశ్రమలు మూతపడుతున్నాయని, చిన్నతరహా పారిశ్రామికవేత్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల జేఏసీ దీక్షలకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి తదితరులతో కలిసి విజయమ్మ దీక్షాస్థలికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక (ఎంఎస్‌ఎంఈ) సంఘాల జేఏసీ ఇందిరాపార్కు వద్ద చేపట్టిన రిలే నిరాహారదీక్షలు సోమవారానికి ఆరో రోజుకు చేరుకున్నాయి. జీడిమెట్ల నుంచి పి. కృష్ణ, రామకృష్ణ, గంగారెడ్డి, కొండల్‌రావు, సాయికిషోర్, బొల్లారం నుంచి ఆదినారాయణ, రాంబాబు, ప్రసాద్ తదితరులు దీక్ష చేపట్టారు. 

కోతలు ఎత్తివేసేవరకూ పోరాటం కొనసాగిస్తామని జేఏసీ కన్వీనరు ఎంఎం రెడ్డి, అధికార ప్రతినిధి ఏపీకే రెడ్డి, జాయింట్ కన్వీనర్ హన్మంతరావులు ప్రకటించారు. పరిశ్రమలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని విజయమ్మ హామీనిచ్చారు. పరిశ్రమలకు విద్యుత్ కోతలను వెంటనే ఎత్తివేయాలని, రుణాలను రీ-షెడ్యూల్ చేయాలని, వడ్డీలను మాఫీ చేయాలని కోరుతూ సీఎంకు లేఖ రాసినట్టు చెప్పారు. ఈ సమస్యలపై ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని సీఎంను కోరినప్పటికీ స్పందనలేదని విమర్శించారు. ‘‘రాష్ట్రంలోని పరిశ్రమల పరిస్థితి చూస్తే బాధేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత మూడు సంవత్సరాలుగా విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల నాడి బాగా తెలిసిన మనిషి. చాలా ముందు దృష్టి కలిగిన నేత. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాగా ఆయన భావించారు. ఎంఎస్‌ఎంఈలకు చేయూతనందించారు. వైఎస్ హయాంలో విద్యుత్ కోతలు లేవు. పరిశ్రమలకు యూనిట్‌కు 75 పైసల చొప్పున విద్యుత్ చార్జీలు తగ్గించారు. ఈ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచి, కోతలు విధిస్తోంది. నెలకు 15 నుంచి 18 రోజుల వరకూ విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఇప్పటికే 11 వేల పరిశ్రమలు మూతపడ్డాయి. ఇద్దరు చిన్నతరహా పారిశ్రామికవేత్తలు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. నెల రోజులుగా పారిశ్రామిక జేఏసీ ప్రయత్నిస్తున్నప్పటికీ సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వడపోవడం దారుణం’’ అని ఆమె విమర్శించారు. 

ఉన్న ఉద్యోగాలు కాపాడండి చాలు

కొత్తగా 15 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పిస్తామని సీఎం అంటున్నారని.. ఉన్న ఉద్యోగాలను కాపాడితే చాలని విజయమ్మ ఎద్దేవా చేశారు. 108, 104లో ఉద్యోగాలు కోల్పోతున్న వారికి ఉద్యోగాలు ఇవ్వలేమంటున్నారని విమర్శించారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేందుకు పారిశ్రామికవేత్తలు భయపడుతుండగా రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని సీఎం అనడం విడ్డూరంగా ఉందన్నారు. పారిశ్రామికవేత్తలు దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలోని నేతలెవ్వరూ రాని విషయాన్ని గుర్తుచేశారు. జగన్ బయట ఉంటే ఆయనే ఈ దీక్షకు వచ్చేవారన్నారు. వైస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేవరకూ ఓపిక పట్టాలని, వైఎస్ స్వర్ణయుగాన్ని జగన్ మళ్లీ తీసుకువస్తారని హామీనిచ్చారు.

వైఎస్ ఏనాడూ చార్జీలు పెంచలేదు

వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందులు లేవు. విద్యుత్ కోతలు లేకుండా చూశారు. చార్జీలు కూడా పెంచలేదు. పైగా చార్జీలు పెంచేందుకు ట్రాన్స్‌కో అధికారులు ప్రతిపాదనలు పెడితే తిరస్కరించారు. కానీ, ఈ ప్రభుత్వం 40 శాతం మేరకు రెగ్యులర్ చార్జీలు పెంచింది. ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్‌ఎస్‌ఏ) పేరుతో మరో 40 శాతం చార్జీల భారాన్ని మోపింది. మరోవైపు వారానికి 3 రోజులు విద్యుత్ కోతలను అమలు చేస్తోంది.
-ఎంఎం రెడ్డి, కన్వీనరు, పారిశ్రామిక సంఘాల జేఏసీ

వైఎస్‌ఆర్ మహనీయుడు 

దివంగత నేత వైఎస్ హయాంలో పరిశ్రమలకు స్వర్ణయుగంగా ఉండేది. ఆ మహానీయుడు పరిశ్రమలకు విద్యుత్ కోతలు లేకుండా చూశారు. పరిశ్రమలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు అదనపు విద్యుత్‌ను కొనుగోలు చేశారు. పరిశ్రమలకు చార్జీలు పెంచలేదు. పైగా తగ్గించారు. కానీ ఈ ప్రభుత్వం చార్జీలు పెంచింది. పైగా కోతలు కూడా అమలు చేస్తోంది.
-మీసాల చంద్రయ్య, నాచారం పారిశ్రామికవాడ మాజీ ఉపాధ్యక్షుడు

సీబీఐ దుర్బుద్ధి బయటపడింది

2000లో ప్రారంభమైన ఒప్పందాల తీరును ఎందుకు ప్రశ్నించలేదు? 
బాబుకు రక్షణ కవచంలా కాంగ్రెస్, సీబీఐ
వైఎస్ కుటుంబం టార్గెట్‌గా దర్యాప్తు
సునీల్‌రెడ్డినే దోషిగా చూపింది... కాంగ్రెస్ పెద్దలను వదలివేసింది

హైదరాబాద్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆయన కుటుంబీకులను అప్రతిష్టపాలు చేసే దురుద్దేశంతోనే సీబీఐ ఎమ్మార్ కుంభకోణంలో దర్యాప్తును పూర్తి చేసిందని... ఒప్పందాలు జరిగినపుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడిని ఏ మాత్రం విచారించకుండా వదలివేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఎమ్మార్ సంస్థను భారతదేశానికి తెచ్చిన చంద్రబాబును కనీసం ప్రశ్నించలేదని, దీనిని బట్టి సీబీఐ దుర్బుద్ధి ఏమిటో బయటపడిందని చెప్పారు. ఆమె సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ కుటుంబం మీద, వారి మనుషుల మీద కక్ష గట్టినట్లుగా సీబీఐ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ‘‘ఎమ్మార్ సంస్థను రాష్ట్రానికి తెచ్చింది చంద్రబాబునాయుడు... టౌన్‌షిప్, హోటల్, గోల్ఫ్ కోర్సు నిర్మాణానికి 535 ఎకరాల భూమిని కేటాయించిందీ ఆయనే. వాస్తవానికి ఈ వ్యవహారమంతా 2000 సంవత్సరం నుంచే మొదలైంది. రెండుసార్లు నోటిఫికేషన్లు జారీ చేసి బిడ్డింగ్‌లో పాల్గొన్న ఐదు సంస్థల్లో మిగతా నాలుగింటిని తప్పుకునేలా చేశారు. 

అలా తప్పుకున్న వారికి ప్రతిఫలంగా ఇతర ప్రాజెక్టులను అప్పగించారు. ఒక్క సంస్థే బిడ్డింగ్‌లో మిగిలితే రద్దు చేయాలన్న నిబంధన ఉన్నా... దానిని తుంగలో తొక్కి తనకు బాగా సన్నిహితుడు, తన బినామీ అయిన కోనేరు ప్రసాద్‌కు మేలు చేయడానికి ఎమ్మార్‌కే భూమిని కేటాయించారు. తొలుత 230 ఎకరాలే అనుకున్న భూమిని రాత్రికి రాత్రి బాబు ఒక నోట్‌ఫైల్ ద్వారా 535 ఎకరాలకు పెంచారు. ఎకరా రూ. 29 లక్షలకు కారు చౌక ధరకు కేటాయించారు. వాస్తవానికి అదే పరిసరాల్లో బాబుకు ఉండిన మూడెకరాల సొంత భూమిని ఎకరా రూ.కోటికి అమ్మారు. ఆ తరువాత మూడో పార్టీ ఒప్పందంలో ప్రవేశించడానికి వీలుగా చంద్రబాబు హయాంలోనే కొలాబరేషన్ ఒప్పందానికి ఆస్కారం కల్పించారు. 

అసలు మొత్తం కుంభకోణానికి ఈ కొలాబరేషన్ ఒప్పందమే కారణమని రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఈ వ్యవహారంపై ఆదేశించిన విజిలెన్స్ విచారణ నివేదికలో తేల్చారు. కానీ సీబీఐకి మాత్రం ఇవేమీ కనిపించలేదు. సుప్రీంకోర్టు ఆదేశించినా బాబును మాటమాత్రంగానైనా ప్రశ్నించలేదు. దర్యాప్తు ముగిశాక వేసిన చార్జిషీటు చూస్తే వైఎస్ కుటుంబానికి దూరంగా ఎక్కడో ఉన్న ఒక లింకును కలపడానికి ప్రయత్నం చేసినట్లుగా ఉంది. బాబును, ఇదే వ్యవహారంతో ఉన్న కొందరు కాంగ్రెస్ పెద్దలను వదలి వేసి సునీల్‌రెడ్డి అనే వ్యక్తిని ఇరికించి ఆయన చుట్టూ ఉచ్చును బిగించేందుకు సీబీఐ కృషి చేసింది’’ అని పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను ఇరికించడానికి కాంగ్రెస్‌కు చంద్రబాబు సహకరిస్తున్నారు కనుక ఆయనను రక్షించేందుకు కాంగ్రెస్, సీబీఐ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు నిజాయతీపరుడని ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో చెప్పించగలరా? అని పద్మ సవాల్ చేశారు. 

గ్యాస్, డీజిల్‌పై విజయమ్మ నేతృత్వంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల నిరసన

ఎడ్లబండి తోలిన వైఎస్ విజయమ్మ
రోడ్డుపై కట్టెల పొయ్యితో వంటా వార్పు

హైదరాబాద్, న్యూస్‌లైన్: డీజిల్ ధరల పెంపు, వంట గ్యాస్‌పై ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో మరింత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు, శాసనసభపక్ష నేత వై.ఎస్.విజయమ్మ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఎడ్లబండి, సైకిల్ రిక్షాలను తోలుతూ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మార్గం మధ్యలో రోడ్డుపైన కట్టెలపొయ్యి ఏర్పాటు చేసి వంటా వార్పు నిర్వహించారు. 

స్వయంగా విజయమ్మే ఎడ్లబండిని తోలుతూ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. పెంచిన డీజిల్ ధరలను, వంటగ్యాస్‌పై ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గతంలో గ్యాస్ ధరలను కేంద్రం పెంచినప్పుడు ఆ భారం ఆడపడుచులపై పడకూడదనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని ప్రభుత్వమే భరించేలా చూశారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే ఆలోచన చేయాలని తమ పార్టీ డిమాండ్ అని, అందుకే ఈ నిరసనకు దిగామని వివరించారు. గ్యాస్ అంశంతో పాటు విద్యుత్ విషయాన్ని కూడా సభలో ప్రస్తావించి, ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునాఅడ్డుకునే ప్రయత్నం చేశారు. పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ కంచెలు వేసి అడ్డుకున్నారు.

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నేతలు

వైఎస్ విజయమ్మ నేతృత్వంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ శాసనసభాపక్ష ఉపనాయకులు మేకతోటి సుచరిత, భూమా శోభానాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి టి.బాలరాజు, సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, ఆకేపాటి అమరనాథరెడ్డి, గొల్లబాబురావు, కాపు రామచంద్రారెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వై.బాలనాగిరెడ్డి, ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, దేవగుడి నారాయణరెడ్డి, డా.దేశాయ్ తిప్పారెడ్డి ఉన్నారు. వీరితో పాటు పార్టీ మైనారిటీ విభాగం కన్వీనర్ హెచ్.ఎ.రెహమాన్, యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి, పార్టీ నేత, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, హైదరాబాద్ కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్‌లతో పాటు నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

Popular Posts

Topics :