21 October 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

YS Sharmila's speech at Chegicharla in Ananthapur

Written By news on Saturday, October 27, 2012 | 10/27/2012

Bhumana Karunakar Reddy Press Meet 27th Oct 2012

YS Sharmila suffering from fever

YS Sharmila fire on Chandrababu naidu

'షర్మిల పాదయాత్రకు అనూహ్యస్పందన'

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల పాదయాత్రకు అనూహ్యస్పందన లభిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. షర్మిల పాదయాత్ర చారిత్రాత్మకమైనదన్నారు. ఇప్పటి వరకు ఆమె 38 గ్రామాల్లో 137 కిలో మీటర్లు పాదయాత్ర చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు 6 లక్షల మంది ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నట్లు చెప్పారు. స్వల్ప జ్వరం కారణంగా నేడు ఆమె పాదయాత్రను 6 కిలో మీటర్లకు కుదించినట్లు చెప్పారు. రేపటి నుంచి యథావిధిగా ఆమె పాదయాత్ర సాగిస్తారన్నారు. వైఎస్ జగన్ ఎక్కడున్నా దృష్టంతా ప్రజల సమస్యలపైనేనన్నారు. 

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర విషాదయాత్రగా సాగుతోందన్నారు. ప్రజల్లో చంద్రబాబుకు ఏమాత్రం విశ్వాసం లేదని చెప్పారు.

షర్మిల పాదయాత్ర చిగిచర్ల వరకు కుదింపు

అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల జ్వరంతో బాధపడుతున్నారు. విశ్రాంతి తీసుకోవాలని డాక్లర్లు ఆమెకు సూచించారు. అయినప్పటికీ ఆమె పాదయాత్ర కొనసాగిస్తానన్నారు. ఈ రోజు షర్మిల పాదయాత్రను చిగిచర్ల వరకు కుదించినట్లు పార్టీ నేత తలశిల రఘురాం చెప్పారు.

తెలుగుదేశం పార్టీకి మరో షాక్

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత తెలుగుదేశం పార్టీని వదలి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరవచ్చని చెబుతున్నారు. దీనికి ముఖ్యకారణం కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే , టిడిపి సీనియర్ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు పార్టీకి గుడ్ బై చెప్పి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరుతుండడమే. ఆయనకు ముఖ్య అనుచరుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బాబాజీరావు కుమార్తె వనతి. ఆ రాజకీయ సంబందాల రీత్యా కృష్ణారావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని టిడిపి ఎమ్మెల్యేను కూడా తనతోపాటు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి తీసుకు వెళితే అది తనకు ప్రతిష్టగా ఉంటుందని ఆయన భావించి ఉంటారు. ఇటీవలే చింతలపూడి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేశ్ కూడా పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అదే జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యే వనిత కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వైపు వెళ్లడం వల్ల ఆ పార్టీకి కొంత బలం పెరుగుతుంది.

http://kommineni.info/articles/dailyarticles/content_20121027_7.php

బుడంగపల్లిలో మహిళలతో షర్మిల రచ్చబండ

అనంతపురం: మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా పదవరోజు జిల్లాలోని గొల్లపల్లిలో షర్మిల శనివారం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా బడంగపల్లి చేరుకున్న షర్మిల అక్కడి వేరుశనగ పంటలు పరిశీలించి రైతుల కష్టనష్టాలు తెలుసుకున్నారు. అనంతరం శనివారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.


అనంతపురం: జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న షర్మిల బుడంగపల్లెలోని మహిళలతో సమావేశమయ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు రచ్చబండ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ తమ ప్రాంతంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉందన్నారు. ప్రభుత్వం తమ కష్టాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ సీఎం భార్య కూడా 3 కిలోమీటర్లు నడిచి తాగునీరు తెచ్చుకుంటే తప్ప ప్రజలు బాధలు తెలుసుకోలేరని విమర్శించారు. అక్కడ క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి నిక్షేపంగా ఉన్నారని, ఇక్కడ మాత్రం ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు.

Special edition on Ananta Aadaranalo

TDP MLA Vanita thinks to resign

Anna Rajanna..Anna Rajanna...a song for Maro Prajaprasthanam

Dont worry about Sharmila's health: Vasireddy Padma

maro praja prasthanam

ప్రత్యర్థులు బెదిరిపోయేలా మిన్నంటిన జగన్నినాదాలు


జనం.. జనం.. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా జనమే.. దిక్కులు పిక్కటిల్లేలా.. ప్రత్యర్థులు బెదిరిపోయేలా మిన్నంటిన జగన్నినాదాలు.. అడుగులో అడుగేస్తూ కదంతొక్కిన జనసందోహం.. ఇదీ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు జిల్లాలో నాలుగో రోజు వచ్చిన జనస్పందన. 

ఈనెల 18న ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం నాటికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. మన జిల్లాలో నాలుగో రోజుకు చేరుకుంది. గురువారం రాత్రి తుమ్మల శివారులో రోడ్డు పక్కన వేసిన గుడారాల్లో బస చేసిన షర్మిల శుక్రవారం ఉదయం 10.20 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించారు. అక్కడి నుంచి నదిలా ప్రారంభమైన జనప్రవాహం ధర్మవరం చేరుకునే సరికి సముద్రాన్ని తలపించింది. 

తుమ్మల క్రాస్ నుంచి ధర్మవరం పట్టణానికి చేరుకునే మార్గమధ్యలో వేరుశనగ పొలంలో గుంటక పాస్తున్న మల్లేనిపల్లికి చెందిన రైతు కురుబ వెంకటేశును షర్మిల పలకరించారు. చేనులోకి ఎవరూ వెళ్లొద్దని సూచించిన షర్మిల.. పరిస్థితులపై రైతుతో ఆరా తీశారు. ‘అన్నా ఎన్ని ఎకరాల్లో వేరుశనగ వేశావు. ఎంత ఖర్చయింది.. ఎంత దిగుబడి వచ్చింది’ అంటూ ఆత్మీయంగా అడిగారు. ఇందుకు రైతు స్పందిస్తూ.. ‘అమ్మా మూడెకరాల్లో వేరుశనగ వేశా. రూ.30 వేల పెట్టుబడి వచ్చింది.. ఐదు బస్తాల దిగుబడి వచ్చింది. అమ్మితే రూ.పది వేలు కూడా రావు.. మొత్తమ్మీద రూ.20 వేల నష్టం వచ్చింది’ అంటూ వివరించారు.

‘అన్నా.. ప్రభుత్వం ఏమైనా నష్టపరిహారం ఇచ్చిందా? ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చిందా?’ అంటూ ఆరా తీశారు. ‘అమ్మా.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ కచ్చితంగా వచ్చేది. ఇప్పుడు ఆ ధైర్యం మాకు లేదు. ఏటా అప్పులు చేసి పంట సాగు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల ధరలు పెంచేసి.. వ్యాపారులకు, దళారులకు లాభం చేకూర్చుతోంది. రైతులను నాశనం చేస్తోంది’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘అన్నా.. అధైర్యపడొద్దు.. ఈ కష్టాలు కొన్ని రోజులే. రాజన్న రాజ్యం వస్తుంది. జగనన్న సీఎం అవుతారు. మహానేత రాజన్నలానే రైతుల పక్షాన పనిచేస్తారు. అందరికీ మేలు చేస్తారు’ అంటూ భరోసా ఇచ్చారు.





SHARMILA'S WALKATHON LEAVES AN INDELIBLE FOOTPRINT


.
The YSR congress president YS Jagan Mohan Reddy's sister, Sharmila set out on her 'Maro Praja Prasthanam' padayatra on October 18, creating history of sorts.
Perhaps for the first time in the history of post-independent India, a political leader and a woman at that has embarked upon a challenging mission of mass contact galvanizing the people of the state.
To date, no other youth leader except Jagan, has drawn the kind of crowds she has, wherever she has gone on her walkathon. Importantly, people who have been thronging her meetings and rallies have not been mobilised by the party workers. Rather, they have come forth of their own accord. Equally important is the fact that women of all ages have been attending her meetings in large numbers indicating the support of the fairer sex to the YSRCP.
It is important to bear in mind that the state has no prominent, active youth icon at this point barring YS Jagan Mohan Reddy and his sister Sharmila.
Today, youth constitute 60 per cent of India's population and can hardly find political leaders they can identify themselves with. In such a scenario, Jagan and Sharmila fill the void in Andhra Pradesh as no one else can.
Judging by the crowds at Sharmila's padayatra, the results of by-elections held in June and surveys conducted by reputed media houses, it is clear that the YSRCP is all set to storm the Congress citadel in AP in the next round of  general elections, whenever they are held.
For someone who is used to a life of ease and comfort to endure the rough day-to-day life in villages is certainly not a facile task. But Sharmila has continued her padayatra braving rains, and the heat and dust of the parched Rayalaseema region, taking everything in her stride. It must be remembered that she has to make do with the barest of facilities and minimal comforts—be it food or shelter.
In this historic mission, Sharmila has taken on her political opponents manfully and has widened the reach of the party.
While the popularity of the YSRCP continues to soar in popular imagination, it poses a major threat to all other parties as can be seen from the fact that it is attracting important leaders from across the political spectrum. Party workers in Congress and TDP feel that the YSRCP would be a safer bet today as opposed to their own parties and seem to repose greater faith in this fledgling party. Even as the YSRCP wings its way higher on the strength of Sharmila's padayatra and Jagan's charisma, the TDP and ruling Congress are getting jittery by the hour!
-Sakshipost

http://www.sakshipost.com/index.php/news/state/5604-sharmila-s-walkathon-leaves-an-indelible-footprint

వచ్చే నెల 6న కర్నూలు జిల్లాలో షర్మిల పాదయాత్ర

వైఎస్‌ఆర్‌సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభా నాగిరెడ్డి

కర్నూలు, న్యూస్‌లైన్: చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్టుతో వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌పై మాజీ స్పీకర్ యనమల రామక్రిష్ణుడు దిగజారుడు మాటలు మాట్లాడటం తగదని వైఎస్‌ఆర్‌సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ భూమా శోభా నాగిరెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యవర్గ సమావేశం అనంతరం శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంచల్‌గూడ జైలులోని జగన్‌మోహన్‌రెడ్డి ములాఖత్‌ల పేరిట రాజకీయాలు చేస్తున్నారని విమర్శించడం, ఫోన్లలో మాట్లాడుతున్నారని చెప్పడం చూస్తుంటే టీడీపీ నాయకులు ఎంత దిగజారారో అర్థమవుతోందన్నారు. ఓ వైపు చంద్రబాబు పాదయాత్రలు చేస్తుంటే మరో వైపు ఆ పార్టీ నాయకులు పార్టీని వీడుతున్నారన్నారు. తెలుగుదేశం నాయకులపై అనుమానాలుంటే పార్టీ ఆఫీసులో పెట్టి తాళాలు వేసుకోవాలని సూచించారు. వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పార్టీ ఉనికి కోసం బాబు పాదయాత్రలు చేస్తున్న విషయం ప్రజలకు తెలియనిది కాదన్నారు. అధికార పక్షం, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం కుమ్మక్కవడం వల్లే షర్మిల పాదయాత్రలు చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమ న కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రజా ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. 

వచ్చే నెల 6న జిల్లాలో షర్మిల పాదయాత్ర

కర్నూలు జిల్లాలో వచ్చే నెల 6వ తేదీ నుంచి షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభమవుతుందని భూమా నాగిరెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని కసాపురం నుండి కర్నూలు జిల్లా మద్దికెరలోకి షర్మిల ప్రవేశిస్తారన్నారు. అక్కడి నుండి పత్తికొండ మీదుగా ఆలూరు, ఆదోని, మంత్రాలయం, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గం నుంచి మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్‌లో ప్రవేశిస్తారని వెల్లడించారు.

29న భువనగిరిలో వైఎస్సార్ సీపీలో జిట్టా చేరిక


హైదరాబాద్, న్యూస్‌లైన్: చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం జైలు బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 29న భువన గిరిలో తలపెట్టిన బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. అలాగే ఆర్టికల్ 3 ప్రకారమే కేంద్రం.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని జిట్టా డిమాండ్ చేశారు. తెలంగాణపై జగన్ చిత్తశుద్ధితో ఉన్నట్లు తెలిపారు.

ప్రజలకేం చేశారని మీ యాత్రలు?

15 వేల కోట్ల రూపాయల విద్యుత్ సర్‌చార్జీలు పెంచినందుకా?
మీ హయాంలో గ్రామాలను శ్మశానాలుగా మార్చినందుకా?
బాబు తన పాలనలో పల్లెలను శ్మశానాలుగా మార్చారు
ఇప్పుడు అవే గ్రామాల గుండా పాదయాత్రలు చేస్తున్నారు
ప్రజల కాళ్లు పట్టుకున్నా ఆయన పాపం పోదేమో
15 లక్షల ఉద్యోగాలిస్తామన్న సీఎం.. ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారు
మీకు ఒక్కరోజు కూడా పాలించే అర్హత ఉందా అని అడుగుతున్నా
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 9, కిలోమీటర్లు: 130.9


మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: అడ్డగోలుగా చార్జీలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్న సర్కారుపై, అవిశ్వాస తీర్మానం పెట్టకుండా ప్రభుత్వానికి అన్ని విధాలా అండగా నిలుస్తూ పాదయాత్ర పేరుతో డ్రామాలాడుతున్న టీడీపీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. ప్రజలకు ఏం చేశారని ఇందిరమ్మ బాట పేరుతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. ‘వస్తున్నా మీకోసం’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యాత్రలు చేస్తున్నారని ప్రశ్నించారు. 

‘‘ముఖ్యమంత్రి గారూ.. ఏం ఘనకార్యం చేశారని ఇందిరమ్మ బాట పట్టారు మీరు? 15 వేల కోట్ల విద్యుత్తు సర్‌చార్జీల భారం ప్రజలపై వేసి పెద్ద ఘనకార్యం చేశామని చెప్పుకోవడానికా? లేక మూడు సార్లు బస్ చార్జీలు పెంచినందుకా..?’’ అని విజయమ్మ నిలదీశారు. ‘‘చంద్రబాబు పాదయాత్ర అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారు. తన హయాంలో శ్మశానాలుగా మార్చిన గ్రామాల గుండా ఆయనే ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. ఆ ప్రజల కాళ్లు పట్టుకొని క్షమాపణలు అడిగినా ఆయన పాపం పోదేమో అనిపిస్తుంది’’ అంటూ షర్మిల మండిపడ్డారు. మరో ప్రజాప్రస్థానం తొమ్మిదో రోజైన శుక్రవారం అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన బహిరంగ సభలో షర్మిల, విజయమ్మ మాట్లాడుతూ.. పాలక, ప్రతిపక్షాల తీరును కడిగిపారేశారు. పెద్దఎత్తున పోటెత్తిన జనాన్ని ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. వారేమన్నారో వారి మాటల్లోనే..

బాబూ... ఈ డ్రామాలెందుకు?: షర్మిల

ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలని చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది అసాధ్యం. ప్రజలకు ఆయన చరిత్ర తెలుసు. ఇప్పుడు చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలూ తెలుసు. అసలు ఆయన కు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందా? తన హయాంలో శ్మశానాలుగా మార్చిన గ్రామాల గుండా ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. నేరుగా ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి కాంగ్రెస్ పార్టీని దించేయకుండా ఈ డ్రామాలు ఎందుకు? వారి లక్ష్యమొక్కటే. ఈ రాష్ట్రంలో రెండే పార్టీలు ఉండాలి. మరో పార్టీ ఉండకూడదు. బాబు హయాంలో 9 సార్లు కరెంటు చార్జీలు పెరిగాయి. రైతులు కరువు కోరల్లో చిక్కుకుని అప్పుల్లో మునిగారు. కానీ చంద్రబాబు మాత్రం బిల్లులు కట్టాలని వేధించారు. కేసులు పెట్టారు. అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు రెండుసార్లు శిలాఫలకం వేసి వదిలేసిన హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.4 వేల కోట్లు వెచ్చించి 95 శాతం పూర్తిచే శారు. కానీ ఈ ప్రభుత్వం ఆ 5 శాతం పనులను మూడేళ్లలో పూర్తిచేయలేకపోయింది. వైఎస్ ఉన్నప్పుడు పెన్నా రిజర్వాయర్‌కు 10 టీఎంసీల నీటిని తెచ్చి ప్రజలను రక్షించాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భూగర్భ జలాలు పడిపోయాయి. తాగునీరు కూడా లేదు. ఏం తిని బతకాలని రైతన్న అడుగుతున్నాడు. వీటికి సర్కారే సమాధానం చెప్పాలి. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు కిరణ్‌తో పోటీపడి నిద్రపోతున్నారు. ఈ కుమ్మక్కు రాజకీయాలు ఎంతో కాలం సాగవు. దేవుడున్నాడు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్నను కూడా ఎవరూ ఆపలేరు.

సిలిండర్ల ధర వెయ్యి చేస్తున్నామని చెబుతారా: విజయమ్మ

సీఎం గారూ.. ఏం ఘన కార్యం చేశారని ఇందిరమ్మ బాట పట్టారు? అన్ని ధరలు పెంచి ఘనకార్యం చేశామని చెప్పుకొంటారా? సిలిండర్ల ధర వెయ్యి రూపాయల వరకు చేస్తున్నామని చెప్పుకోవడానికి వెళుతున్నారా? కనీసం 7 గంటలు ఉచిత విద్యుత్తు ఇవ్వాల్సిన చోట రెండు గంటలు కూడా ఇవ్వలేకపోతున్నామని చెప్పుకోవడానికా? ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చినందుకా? 108లో డీజిల్ కూడా లేదని చెప్పుకోవడానికా? 15 లక్షల ఉద్యోగాలిస్తామన్నారే.. నెలకు 15 రోజుల పాటు పరిశ్రమలకు విద్యుత్ సెలవు ఇచ్చి 25 లక్షల మందిని రోడ్డు పాలుచేశారేం? వారందరికీ ఉద్యోగాలిస్తారా? 104 ఉద్యోగులనే వదిలించుకున్నారు. మీరు 15 లక్షల ఉద్యోగాలిస్తారా? 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి 6 నెలలైంది.. ఏవీ? రైతులకు వడ్డీ లేని రుణాలని ఆగస్టులో చెప్పారు? ఏమైంది. ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు? ఒక్క రోజు కూడా మీకు పాలించడానికి అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తారట. ఆయన హయాంలో రైతులు కరువు కోరల్లో విలవిల్లాడుతుంటే ఎందుకు చేయలేదు? నేతన్న పరిస్థితి దారుణంగా తయారైంది. ముడి సరుకు ధర బాగా పెరిగింది. కానీ పట్టు చీరల ధర మాత్రం 10 శాతం మించి పెరగలేదట. నేతన్నల కోసం వైఎస్‌లా పరితపిస్తున్న నాయకుడు జగన్ ఒక్కడే. వారి కోసం 2010లో మహాధర్నా చేశారు. 2011లో 103 డిగ్రీల జ్వరంలోనూ దీక్ష చేశాడు. జగన్ అధికారంలోకి వస్తే ప్రభుత్వమే నూలు సరఫరాచేస్తుంది. కుటుంబానికి కాకుండా మగ్గం యూనిట్‌గా సబ్సిడీ ఇస్తుంది.

దద్దరిల్లిన ధర్మవరం

మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ధర్మవరం దద్దరిల్లింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానానికి బ్రహ్మరథం పట్టింది. తుమ్మల వైపు నుంచి ధర్మవరంలో ప్రవేశించిన షర్మిలకు.. బహిరంగ సభ ప్రాంతమైన ఎన్టీఆర్ సర్కిల్‌కు చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టింది. వీధులు పోటెత్తడంతో కిలోమీటరు దూరం నడిచేందుకే రెండు గంటల సమయం పట్టింది. శుక్రవారం ఉదయం 10.20 గంటలకు తుమ్మల సమీపం నుంచి షర్మిల పాదయాత్ర మొదలైంది. యాత్ర ఆసాంతం అశేష జనవాహిని మధ్య సాగింది.

మధ్యాహ్నం 12.30కు ధర్మవరం శివారులో ఏర్పాటుచేసిన మధ్యాహ్న భోజన బసకు షర్మిల చేరుకున్నారు. అనంతరం రామకృష్ణ అనే చేనేత కార్మికుడి ఇంటికి చేరుకుని వారి కష్టాలను తెలుసుకున్నారు. తర్వాత ధర్మవరం సభలో మాట్లాడారు. వీధుల్లో షర్మిల ప్రవేశించాక కిలోమీటరు దూరంలో ఉన్న బహిరంగ సభ స్థలానికి చేరేసరికి 5.30 అయ్యింది. ధర్మవరం జనసంద్రమవడంతో నడవడం ఆలస్యమైంది. సభ ముగిశాక రాత్రి 8.30కు గొల్లపల్లి వద్ద రైల్వేగేటు పడ్డప్పుడు ఆ గ్రామవాసి నాగలక్ష్మి అనే మహిళ షర్మిలను కలిసి తన దీన పరిస్థితి వివరించింది. దీంతో ఆమె నలుగురు ఆడపిల్లల్లో ఒక కూతురిని తానే చదివిస్తానని షర్మిల ఆమెకు భరోసానిచ్చారు. రాత్రి 8.35 గంటలకు గొల్లపల్లి క్రాస్‌కు సమీపంలో పాదయాత్ర ముగించి, రోడ్డు పక్కన వేసిన గుడారంలో షర్మిల బస చేశారు. తొమ్మిదో రోజు పాదయాత్రలో పార్టీ నేత ఎంవీ మైసూరారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు గురునాథ రెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జులు పాల్గొన్నారు. విజయమ్మ ధర్మవరంలో కాసేపు పాదయాత్రలో పాల్గొన్నారు.

ధర్మవరంలో కేబుల్ ప్రసారాల నిలిపివేత

మరో ప్రజాప్రస్థానానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో శుక్రవారం ధర్మవరంలో అధికార పార్టీ నేతలు కేబుల్ నెట్‌వర్క్‌లో ప్రసారాలు నిలిపివేశారు. ఇది ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పనేనని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచే ఎమ్మెల్యే అనుయాయులకు చెందిన కేబుల్ వారు సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేశారు.

రైతుతో కలిసి.. విత్తనాలు వేసి..

తుమ్మల సమీపంలోని మల్లేనిపల్లె రైతు జంగల వెంకటేశ్ వేరుశనగ విత్తనాలు వేస్తుండగా.. షర్మిల అక్కడికి వెళ్లి తానూ విత్తనాలు వేశారు. అక్కడికి వచ్చిన రైతులు, రైతు కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు కూలీలు షర్మిలతో మాట్లాడుతూ కరెంటు, నీటి కష్టాలను చెప్పుకున్నారు. అనంతరం షర్మిల పేరం చంద్రశేఖర్‌రెడ్డి అనే రైతు పొలానికి చేరుకున్నారు. అక్కడ ఆయన పురుగు మందుల డబ్బాలు చూపుతూ ‘‘రాజన్న ఉన్నప్పుడు రూ.100 ఉన్న డబ్బా ఇప్పుడు రూ. 360 అయ్యింది. కాంటాఫ్ డబ్బా అప్పట్లో రూ. 75 ఉండేది. ఇప్పుడు రూ. 300 అయ్యింది. పంట పండినా దళారులకే తప్ప మాకేం లాభం లేదు..’’ అని కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ ‘‘జగనన్న సీఎం అయ్యాక ఏ రైతూ తన పంట నష్టానికి అమ్ముకోకుండా ధరల స్థిరీకరణకు నిధి ఏర్పాటు చేస్తాడు’’ అని భరోసా ఇచ్చారు.

మరో ప్రజాప్రస్థానం వెబ్‌సైట్ ప్రారంభం

పెదవాల్తేరు (విశాఖపట్నం), న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడానికి పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ అదీప్‌రాజు వెబ్‌సైట్‌ను రూపొందించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల రాష్ట్ర సమన్వయకర్త కొణతాల రామకృష్ణ బీచ్‌రోడ్డులోని తమ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ షర్మిల చేపట్టిన పాదయాత్రకు రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. పాదయాత్రలో పాల్గొన లేకపోయిన వైఎస్ అభిమానులు, ఆ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ వెబ్‌సైట్ దోహదపడుతుందన్నారు. 

www.maroprajaaprasthanam.com లో పాదయాత్ర పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని అదీప్‌రాజు చెప్పారు.

బక్రీద్ పండుగ శుభాకాంక్షలు: విజయమ్మ


హైదరాబాద్, న్యూస్‌లైన్: బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు, సోదరీమణులకు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, దైవత్వానికి ప్రతీకైన బక్రీద్‌ను ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

గొల్లపల్లి నుంచి షర్మిల పాదయాత్ర

అనంతపురం: మరోప్రజాప్రస్థానం పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్ర శనివారం పదోరోజుకు చేరనుంది. గొల్లపల్లి క్రాస్ నుంచి ప్రారంభం కానున్న శనివారం పాదయాత్ర.. గరుడంపల్లి క్రాస్, వసంతపురం క్రాస్, చిగిచర్ల, ఉప్పునేసినపల్లి క్రాస్, హంసాపురం క్రాస్ ల మీదుగా కొనసాగుతుంది. షర్మిల రాక కోసం ఆయా ప్రాంతాల్లోని ప్రజలు, వైఎస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

source:sakshi

పెనుకొండ నియోజక వర్గంలో కాంగ్రెస్‌కు షాక్

Written By news on Friday, October 26, 2012 | 10/26/2012

అనంతపురం: జిల్లాలోని పెనుకొండ నియోజక వర్గంలో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత జేసీ దివాకరరెడ్డికి ముఖ్య అనుచరుడైన బ్రహ్మ సముద్రం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన పార్టీ నుంచి వైదొలగనున్నారు. ఈ నెల 28న రాప్తాడులో జరిగే షర్మిల సభలో ఆయన వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

జగన్ ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు: షర్మిల

ధర్మవరం: ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి, తన అన్న జగన్మోహన రెడ్డిని కూడా ఎవరూ ఆపలేరని షర్మిల అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి ఈ సాయంత్రం షర్మిల పాదయాత్ర చేరుకుంది. అధిక సంఖ్యలో జనం వచ్చి ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జనసద్రమైన ధర్మవరంలో భారీస్థాయిలో మహాప్రస్థానం బహిరంగ సభ జరిగింది. అశేష జనవాహిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ అనంతపురం అల్లుడని, తన తల్లి విజయమ్మ ఈ జిల్లా ఆడపడుచు అని చెప్పారు. జగన్ మీ మేనల్లుడు అన్నారు. షర్మిల మాటలకు జనం నుంచి అద్వితీయమైన స్పందన లభించింది.

రాజస్థాన్ తర్వాత అతితక్కువ వర్షపాతం నమోదైయ్యేది అనంతపురమేనని, అందుకే వైఎస్ఆర్‌కు ఈ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ ఉండేదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్ట్‌కు చంద్రబాబు 2 సార్లు శిలాఫలకం వేసి వదిలేశారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ 4వేల కోట్లతో పనులు చేపట్టారని, ప్రస్తుతం 40 కోట్ల రూపాయలు విడుదల చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. ఫీజు రీయింబర్స్ విషయంలో అరకొర నిధులు కేటాయిస్తున్నారని విమర్శించారు. సీఎం కిరణ్ నిద్రపోతున్నారని అనుకుంటే, పోటీగా చంద్రబాబు కూడా నిద్రపోతున్నారన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, మద్యపాన నిషేధాన్ని చంద్రబాబు తంగలో తొక్కారన్నారు. చంద్రబాబుది మాటమీద నిలబడే నైజం కాదని విమర్శించారు. చంద్రబాబుకు మునీశ్వరుడి శాపం ఉందని, నిజం చెబితే తల వెయ్యిముక్కలవుతుందన్నారు.
జగన్‌పై టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకున్నారన్నారు. తన అవినీతిపై విచారణ వద్దని, ప్రతిఫలంగా అవిశ్వాసం పెట్టనని బాబు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాదయాత్ర డ్రామా ఆడుతున్నారన్నారు.

ధర్మవరం రైల్వేస్టేషన్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ విజయమ్మ, షర్మిలలు పూలమాలు వేసి నివాళులర్పించారు.

SHARMILA IN DHARMAVARAM: CABLE TV SERVICES CUT OFF


.
 Sharmila's walkathon, titled "Maro Praja Prasthanam" is all set enter the Dharmavaram in Anantapuram district today. Sharmila, accompanied by a massive crowd started at Tummala cross and headed towards Mallenipalli.
Along the way, a farmer requested Sharmila to sow seeds in his fields to which she readily obliged. When she questioned the farmers on the difference between Dr YSR's regime and the current dispensation, they replied that they were plagued with power cuts and shortage of seeds at present. "This was never the case during YSR's tenure," they lamented.
Meanwhile, it is learnt that the cable TV services have been cut off on purpose in Dharmavaram. Added to this, power supply has also been curtailed in the town to prevent YSRCP supporters and the public at large from following the walkathon on television channels.

http://sakshipost.com/index.php/news/state/5571-sharmila-in-dharmavaram-cable-tv-services-cut-off#.UIpYqduqbDE.facebook

YS Vijayamma Speech in Dharmavaram

పోటీచేస్తానంటే, సురేఖకు ఆహ్వానం: బాలినేని

ప్రకాశం: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాలో పోటీ చేయాలని కొండా సురేఖ భావిస్తే.. తాము ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నామని వైఎస్‌ఆర్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. త్వరలో చంద్రబాబు మైండ్ సెట్ పై క్యాసెట్ ను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. సినిమా వాళ్ల డైరెక్షన్ లో చంద్రబాబు యాత్ర చేయడం సిగ్గుచేటని బాలినేని విమర్శించారు.

ప్రకాశం: వచ్చే ఎన్నికల్లో పరకాలలోనే పోటీచేసి గెలుస్తానని వైఎస్ఆర్ సీపీ నేత కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నేతలకు దోచుకోవడం తప్ప ప్రజాసమస్యలు పట్టడంలేదని సురేఖ ధ్వజమెత్తారు. చంద్రబాబు పాదయాత్ర పేరుతో దొంగజపం చేస్తున్నారని కొండా సురేఖ అన్నారు.

source:sakshi

'బాబు హయాంలో చిద్రమైన బతుకులు'

అనంతపురం: టిడిపి అధ్యక్షుడు చంద్ర బాబు హయాంలో రైతులు, చేనేత కార్మికుల బతుకులు చిధ్రమైయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే విజయమ్మ అన్నారు. ధర్మవరంలో ఈ సాయంత్రం జరిగిన మహాప్రస్థానం భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. చంద్రబాబు హయాంలో ఆప్కో దుస్థితిని ఆమె గుర్తు చేశారు. 

ధర్మవరంలో చేనేత బతుకులు చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి, చేనేత వస్త్రానికి మద్దతు ధర లేదని అమె అన్నారు. నూలు, మగ్గం, షెడ్డు సౌకర్యాలు కల్పిస్తామని వైఎస్ఆర్ హామీ ఇచ్చారన్నారు. అధికారులు కూడా వారంలో ఒకసారి చేనేత వస్త్రాలు ధరించాలని వైఎస్ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ హామీలను ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. అనంత రైతులకు గతంలో ఉన్న 32 టీఎంసీల నీటిని ఇప్పుడు 23 టీఎంసీలకు కుదించారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తాగునీటి పథకాలన్నీ దిష్టిబొమ్మల్లా తయారయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో పంటలకు, తాగడానికి నీరు లేని దుస్థితి నెలకొందన్నారు. అప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్ ప్రజల మధ్యలో ఉండి వారి కష్టాలు తెలుసుకుంటున్నారని చెప్పారు. 12 వేల కోట్ల రూపాయల రుణమాఫీలో అనంతపురం జిల్లా వాటాగా 555 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు హయాంలో రైతులకు 90 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, వైఎస్ఆర్ హయాంలో 900 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆమె చెప్పారు.

source:sakshi

ధర్మవరంలో షర్మిలకు ఘనస్వాగతం

అనంతపురం: అనంతపురం జిల్లా ధర్మవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల పాదయాత్రకు ఘనస్వాగతం లభించింది. ధర్మవరంలో గతంలో ఏ నేతకు రానంత ప్రజా స్పందన కనిపించింది. పట్టణ ప్రజలు షర్మిల అడుగులో అడుగువేశారు. పట్టణం అంతా జనంతో కిక్కిరిసిపోయింది. వీధులు, మేడలు, మిద్దెలు జనంతో నిండిపోయాయి. ఇసుకవేస్తే రాలనంతగా జనం చుట్టుపక్క గ్రామాల నుంచి తరలి వచ్చారు. 'మరో ప్రస్థానం' బహిరంగ సభా స్థలం వద్ద జనం భారీ సంఖ్యలో గుమ్మిగూడారు. ఈ ప్రాంతంలోని చేనేత కార్మికులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

After one year ys jagan Will be CM -MLA Alla nani

YSRCP MLA Shobha Nagi Reddy Fires on TDP and Congress

Sharmila's Maro Prajaprasthanam reach to Dharmavaram

కాసేపట్లో ధర్మవరం చేరుకోనున్న షర్మిల

అనంతపురం: మరో ప్రజాప్రస్థానం పేరిట షర్మిల చేస్తున్న పాదయాత్ర మరికాసేపట్లో ధర్మవరం చేరుకోనుంది. తుమ్మల క్రాస్ నుంచి శుక్రవారం అశేష జనవాహిని మద్దతుతో ప్రారంభమైన పాదయాత్ర మల్లేనిపల్లి వద్ద కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓ రైతు షర్మిలను తన పొలంలో విత్తనాలు వేయాలని కోరడంతో అందుకు ఆమె అంగీకరించారు. అనంతరం రాజన్న పాలనకు, ఇప్పటి ప్రభుత్వ పాలనకు తేడా ఏంటని అడగడంతో రైతులు కరెంట్ కోతలు, విత్తనాల కొరత తదితర సమస్యలను ప్రస్తుతం ఎదుర్కొంటున్నామని చెప్పారు. 

మరోవైపు ధర్మవరంలో కేబుల్ ప్రసారాలు నిలిపివేసినట్టు తెలుస్తోంది. అంతేకాక ఉదయం నుంచి కరెంట్ సరఫరాను కూడా నిలిపివేశారని సమాచారం. షర్మిల చేపట్టిన పాదయాత్రకు సంబంధించి వివరాలను వైఎస్ అభిమానులు తెలుసుకోకుండా ఉండేందుకే కాంగ్రెస్ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

Special edition on Ananta Aadaranalo

మల్లేనిపల్లి చేరుకున్న షర్మిల

అనంతపురం: మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల శుక్రవారం జిల్లాలోని మల్లేనిపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు షర్మిలకు సాదర స్వాగతం పలికారు. షర్మిల ప్రసంగం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

Peoples share with Sharmila on our problems

Sharmila's Maro Prajaprasthanam padayatra 9th day schedule

నేడు 9వరోజు షర్మిల పాదయాత్ర

అనంతపురం: మరో ప్రజాప్రస్థానం పేరిట వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్ర 9వ రోజున శుక్రవారం తుమ్మలక్రాస్‌నుంచి ప్రారంభం కానుంది. మల్లేనిపల్లి, ధర్మవరం, శివానగర్‌, పేరు బజార్‌, అంజుమన్‌సర్కిల్‌, గాంధీనగర్‌, గొల్లపల్లి మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. పీఆర్టీ సర్కిల్‌ వద్ద బహిరంగ సభ జరగనుంది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొననున్నారు.

100 కిలోమీటర్ల మైలు రాయి దాటిన ప్రజాప్రస్థానం

జగనన్న సీఎం కావాలి 
రాజన్న రాజ్యం మళ్లీ రావాలని నినాదాలు
ఈ ప్రభుత్వం టమాటాకు బీమా కూడా ఇవ్వట్లేదని ఆవేదన
వచ్చే రాజన్న రాజ్యంలో బీమా ఇప్పిస్తామన్న షర్మిల 
100 కిలోమీటర్ల మైలు రాయి దాటిన ప్రజాప్రస్థానం
పండుగ పూట పోటెత్తిన పల్లెలు 
‘అనంత’లో షర్మిల వెంట కదులుతున్న జనసైన్యం

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోర్లు ఎత్తిపోయాయి. పంటలు ఎండిపోయాయి. పరిహారం ఇచ్చే దిక్కులేదు. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు మూడుసార్లు పరిహారం అందింది. ఇప్పుడు పరిహారం ఊసే లేదు. ఇన్‌పుట్ సబ్సిడీలు లేవు. ఎరువులు అడిగితే ఇచ్చే నాథుడే లేడు.. ఈ పాలన మాకొద్దు. జగనన్న సీఎం కావాలి.. రాజన్న రాజ్యం మళ్లీ రావాలి’’ అంటూ ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రలో పలువురు రైతులు షర్మిలతో మొరపెట్టుకున్నారు. అనంతపురం జిల్లాలో బుధ, గురువారాల్లో పాదయాత్ర సాగిన ధర్మవరం నియోజకవర్గంలో పలు చోట్ల రైతులు తమ ఎండిపోయిన పంటలను ఆమెకు చూపి ఆవేదన వ్యక్తంచేశారు. అనంతపురం జిల్లా తమ్మాపురంలో తమకు బీమా వర్తింపజేయడం లేదని టమాటా రైతులు, తుమ్మల క్రాస్‌రోడ్డు వద్ద వేరుశనగ రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనికి స్పందనగా తమ్మాపురం బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. ‘రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. టమాటా లాంటి పంటలకూ బీమా వర్తింపజేస్తుంది..’ అని హామీ ఇచ్చారు.

100 కి.మీ. దాటిన యాత్ర: షర్మిల యాత్ర విజయదశమి రోజు తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామం వద్ద 100 కిలోమీటర్ల మైలురాయి దాటగా.. మరుసటి రోజు గురువారం నాటికి 119.9 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ‘అనంత’ జనసైన్యంతో ఆమె ఉత్సాహంగా పరుగులు తీస్తుండగా.. జనంతో మమేకమై పోయిన షర్మిల చెరగని చిరునవ్వుతో ఆత్మీయంగా పల్లెలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను తెలుసుకుంటూ ముందకు సాగుతున్నారు. బుధవారం ఉదయం 10.35కు దాడితోట శివారు నుంచి బయలుదేరిన షర్మిలను చిల్లకొండాయపల్లిలో గొర్రెల కాపర్లు కలిసి తమ నీటి కష్టాలపై ఫిర్యాదు చేశారు. దీనిపై పార్టీ తరపున ధర్నా నిర్వహించి సమస్య పరిష్కారానికి పోరాడుతామని ఆమె భరోసా ఇచ్చారు. జిల్లా శాసనసభ్యులు గురునాథ్‌రెడ్డి, కాపు రాంచంద్రారెడ్డిలు స్థానిక సమస్యలపై పోరాటం చేస్తామని వారికి హామీ ఇచ్చారు.

గ్యాస్ అక్కర్లేనివారికే ఇస్తుందీ ప్రభుత్వం: చిల్లకొండాయపల్లి బహిరంగ సభలో మాట్లాడుతూ రాజన్న కుటుంబం తరఫున విజయదశమి శుభాకాంక్షలు అంటూ షర్మిల అభివాదం చేశారు. ఈ సందర్భంగా అన్ని ధరలూ పెరిగాయని మహిళలు ఆందోళన వ్యక్తంచేయడంతో ‘గ్యాస్ అవసరం లేని వారికే ఈ ప్రభుత్వం గ్యాస్ ఇస్తుందట. దీపం పథకం కింద ఉన్నవాళ్లకు ఆరు సిలిండర్లకంటే ఎక్కువ అవసరం ఉండదు. కానీ వారికే ఇస్తానని మొసలి కన్నీరు కారుస్తోంది. లెక్కల గారడీలో ఈ ప్రభుత్వానికి డాక్టరేట్ ఇవ్వొచ్చు..’ అని షర్మిల ఎత్తిపొడిచారు. పాదయాత్రకు వచ్చిన నార్పల మండలానికి చెందిన వెంకటరెడ్డి అనే యువకుడు కెనాల్ కింద భూమి పోగా నష్టపరిహారం రాలేదని ఫిర్యాదుచేయడంతో పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించి డబ్బులు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు.

పండు ముదుసలికి వయసుందా?: చిల్లకొండాయపల్లి సమీపంలో పాదయాత్ర సాగుతున్న తరుణంలో కదిరి నుంచి వికలాంగులు వచ్చి షర్మిల వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. రెండు కళ్లూ లేక 80 ఏళ్ల వయస్సున్నా తనకు పెన్షన్ ఇవ్వలేదని, వయసుందని అంటున్నారని ఓ వృద్ధురాలు మొరపెట్టుకోవడంతో ‘ఈ పండుటాకుకు పెన్షన్ ఇవ్వలేరా? ఈ ప్రభుత్వం గుడ్డిదా? ఈమెకు ఇంకా వయసుందా?’ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. పెన్షన్ లేదని, తిండి లేదని, వైఎస్ హయాంలో ఇచ్చిన పెన్షన్‌ను రద్దు చేశారని మరికొందరు ఆవేదన వ్యక్తంచేశారు. రెండు కాళ్లూ లేని వికలాంగులూ అక్కడికి తరలిరావడంతో షర్మిల చలించిపోయారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ జగనన్న సీఎం అయ్యాక పెన్షన్ లభిస్తుందని ఓదార్చారు.

కిడ్నీ ఆపరేషన్‌కు ఏర్పాట్లు: చిల్లకొండాయపల్లి వద్దకు వచ్చిన బత్తలపల్లికి చెందిన నిరుపేద మహిళ లక్ష్మీదేవి తన భర్త నర్సింహకు కిడ్నీ ఫెయిలైందని, ఆపరేషన్ తప్ప మార్గం లేదని వైద్యులు చెప్పారని, కూలిపని చేసుకునే తమకు ఆపరేషన్ చేయించే స్తోమత లేదని విలపించడంతో షర్మిల చలించిపోయింది. అప్పటికప్పుడే వివరాలు తీసుకుని ఆపరేషన్ చేయించే బాధ్యత తనదీ అని హామీ ఇచ్చి.. హైదరాబాద్‌లో ఉన్న వైద్యులతో మాట్లాడారు. అక్కడికెళ్లాలని లక్ష్మీదేవికి దారి ఖర్చులు కూడా ఇచ్చారు. వైద్య ఖర్చులు తామే భరిస్తామని, అధైర్యపడొద్దని ఓదార్చారు.

విజయద శమి రోజు పూజలు: విజయదశమి రోజు మధ్యాహ్నం 1.30కు పెద్దకోట్ల గ్రామంలోని పెద్దమ్మగుడిలో షర్మిల పూజలు చేశారు. అనంతరం ఆ గుడి పూజారి పెద్దరాజు-వరాలమ్మ దంపతుల ఇంట ఓలిగ, చిత్రాన్నం తిన్నారు. శివ్వంపల్లి దాటాక రాత్రి 8 గంటలకు బస చేశారు. దసరా రోజు మొత్తం 15 కిలోమీటర్లు నడిచారు. పండుగ రోజు సైతం జనం షర్మిల వెంటే నడుస్తూ ‘అనంత’ పల్లెలు ఆమెతోనే తమ పండుగ చేసుకున్నాయి. మరుసటి రోజు ఉదయం 9.30కు బయలుదేరిన షర్మిలను.. మార్గమధ్యంలో కలిసిన ప్రజలు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. మధ్యాహ్నం 2 గంటలకు అప్రాచెరువు సమీపంలో భోజన విరామం తీసుకున్న ఆమె 4.30కు యాత్ర ప్రారంభించారు. అప్రాచెరువులో స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. రాత్రి 7.40కి తుమ్మల సమీపంలో ఏర్పాటుచేసిన బసస్థలానికి చేరుకున్నారు. పార్టీ నాయకుడు ఎం.వి. మైసూరారెడ్డి గురువారం రోజంతా ఆమె వెంట పాదయాత్రలో పాల్గొన్నారు.

జనం కష్టాలు తీర్చని ఆ పదవులు ఎందుకు?

అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను కడిగేసిన షర్మిల
ప్రజలకు కనీసం గుక్కెడు తాగునీళ్లు ఇవ్వలేరా?
మూడేళ్లుగా హంద్రీనీవా పూర్తిచేయలేదెందుకు?

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారా? ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేరా? ముఖ్యమంత్రిలా మీరూ నిద్రపోతున్నారా? కుర్చీలు, ఢిల్లీ తప్ప మీకు జనం సమస్యలు పట్టవా? జనం కష్టాలు తీర్చని మీకు ఆ పదవులు ఎందుకు?..’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల నిప్పులు చెరిగారు.

అనంతపురం జిల్లాలో సాగుతున్న ‘మరో ప్రజాప్రస్థానం’లో భాగంగా బుధ, గురువారాల్లో ఆమె ధర్మవరం నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ప్రజలు షర్మిలకు తమ సమస్యలపైన, అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపైన ఫిర్యాదులు చేశారు. ప్రతి గ్రామంలో ఈ ఫిర్యాదులు అందాయి. ‘సాగునీటి మాట దేవుడెరుగు.. మాకు తాగునీళ్లు ఇచ్చే నాథుడే లేడు. కేవలం మేం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నామని మా ఎమ్మెల్యే మమ్మల్ని వేధిస్తున్నాడు.. మీరొస్తున్నారని ఫ్లెక్సీలు కూడా కట్టుకోకూడదట’ అని సమస్యలు ఏకరువు పెట్టారు. దీనిపై షర్మిల స్పందిస్తూ ‘వైఎస్ ఉన్నప్పుడు పెన్నా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు 10 టీఎంసీల నీటిని తెచ్చారు. జీవో ఇచ్చి రెండేళ్లు అమలు చేశారు. కానీ ఈ మంత్రులు అలా ఎందుకు చేయడం లేదు? తుంగభద్ర నుంచి నీటిని తేవడంలో ఆలస్యం చేస్తున్నారేం?’ అని ప్రశ్నించారు. ‘హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి చంద్రబాబు నాయుడు రెండుసార్లు శిలాఫలకం వేసి పక్కకు తప్పుకొన్నారు. కానీ మన రాజన్న రూ. 4,500 కోట్లతో ఈ పథకాన్ని ఐదేళ్లలో 90 నుంచి 95 శాతం పనులు చేస్తే.. ఈ మూడేళ్లలో ప్రభుత్వం ఒక్క రాయి కూడా కదపలేదు’ అని షర్మిల అన్నారు.

బాబూ ఎందుకు పాదయాత్ర?

‘ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు వారికే మద్దతుగా నిలుచున్నారు. ఇప్పుడు దొంగ పాదయాత్రలు చేస్తున్నారు. అసలు ఆయనకు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముంది? మేం ఏమీ చేయలేం కాబట్టి మేం పాదయాత్ర చేసినా అర్థం ఉంది. కానీ ఆయనకు ఎందుకు పాదయాత్ర? నేరుగా అవిశ్వాసం పెట్టి ఈ ప్రభుత్వాని దింపొచ్చుగా..’ అని షర్మిల ప్రశ్నించారు. ‘రాజన్న పాదయాత్ర చేసినప్పుడు, హామీలు ఇచ్చినప్పుడు చంద్రబాబు ఏమన్నాడో తెలుసా? రాజశేఖరరెడ్డి ఇచ్చే హామీలన్నీ నెరవేరాలంటే హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకోవాలన్నాడు. కానీ రాజన్న పాదయాత్ర చేశాడు. వాగ్దానాలు ఇచ్చాడు. వాటిని అమలు చేసి చూపాడు. చంద్రబాబు గారూ ప్రజలకు మీ పాలన చరిత్ర తెలుసు. కేవలం రాజన్న పాదయాత్రను కాపీ కొట్టారు. ఆయన ఇచ్చిన హామీలనే ఇప్పుడు మీరు ఇస్తున్నారు..’ అంటూ ప్రతిపక్ష నేతను కడిగిపారేశారు.
భూమి లేని నిరుపేదలకు ఎకరా భూమి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు జగన్ ఇచ్చిన హామీలను షర్మిల జనం ముందుకు తీసుకెళుతున్నారు. భూమి లేని నిరుపేదలకు ఎక రా భూమి, రైతులకు, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతోపాటు పిల్లలను బడికి పంపించే తల్లులకు అమ్మ ఒడి పథకం కింద రూ. 500, ఇంటర్ విద్యార్థులు ఉన్న తల్లులకు రూ. 700, డిగ్రీ చదివే విద్యార్థులున్న తల్లులకు రూ. 1,000 వారి ఖాతాలో వేస్తామని ప్లీనరీ నిర్ణయాలను గుర్తుచేశారు. కోటి ఎకరాలకు సాగునీరు, రాష్ట్రంలో గుడిసే లేకుండా ప్రతి ఒక్కరికీ ఇల్లు వైఎస్ కల అని, వీటిని జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నెరవే రుస్తాడని హామీ ఇచ్చారు.

మధ్య తరగతికి మొండిచేయేనా?: అంబటి


దీపం లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ కింద తొమ్మిది సిలిండర్లు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. 1.60 కోట్ల గ్యాస్ సిలిండ ర్ కనెక్షన్లలో దీపం పథకానికి చెందిన 39 లక్ష ల వారికి మాత్రమే సబ్సిడీ ఇస్తే మిగతా పేద, మధ్యతరగతి పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తొమ్మిది సబ్సిడీ సిలిండర్లు ఇస్తారన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రకట న సైతం ఇక్కడ అమలుకు నోచుకోవడం లేదన్నారు. అంబటి గురువారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. దీపం లబ్ధిదారులు ఏటా ఆరు సిలిండర్లలోపే వాడుతుండగా వారికి మరో మూడు సిలిండర్లు ఇస్తామంటూ... నిజంగా ఎక్కువ సిలిండర్లు వాడే పేద, మధ్యతరగతి వారికి మొండిచేయి చూపడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. బడుగు, బలహీనవర్గాల పిల్లలు చదువుతున్న సంక్షేమ హాస్టళ్ల విషయంలోనూ సర్కారు అదే మొండివైఖరితో ఉండటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇచ్చే బొటాబొటి మెస్‌చార్జీలు ఇక గ్యాస్‌కే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్సిడీల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతారని ‘మనసులో మాట’ పుస్తకంలో రాసిన చంద్రబాబు ఇప్పుడు 10 సబ్సిడీ సిలిండర్లు ఇస్తామనటం ఎవరిని మోసం చేసేందుకుని ప్రశ్నించారు. అధికారంలోకి వ చ్చాక తొలి సంతకం రుణమాఫీపై చేస్తానంటున్న చంద్రబాబు... ఆ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిందనే విషయం ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు.

జగన్ రిమాండ్ 8 వరకు పొడిగింపు

హైదరాబాద్, న్యూస్‌లైన్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్ జగన్ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు నవంబర్ 8 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, వాన్‌పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్‌ఏఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డిల రిమాండ్‌ను కూడా వచ్చేనెల 8 వరకు పొడిగించింది. రిమాండ్ ముగియడంతో గురువారం వీరిని చంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపరిచారు.

షర్మిల యాత్రకు అద్భుత స్పందన: మైసూరా

Written By news on Thursday, October 25, 2012 | 10/25/2012

అనంతపురం: మరో ప్రజాప్రస్థానం పేరిట షర్మిల చేపట్టిన పాదయాత్రకు వస్తున్న ప్రజా స్పందన అద్భుతమని వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మైసూరారెడ్డి అన్నారు. జిల్లాలోని ఆత్మకూరులో ఆయన షర్మిలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైసూరా మాట్లాడుతూ రాజన్న రాజ్యం తెస్తానని షర్మిల ఆత్మవిశ్వాసంతో చెబుతుంటే బాబు తన పాలన గురించి ఎందుకు చెప్పుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. 

అందుకే షర్మిల మరో ప్రజాప్రస్థానానికి, చంద్రబాబు పాదయాత్రకు అసలు పోలికే లేదని స్పష్టం చేశారు. పాదయాత్రలో షర్మిల ప్రజలతో మమేకవుతున్న తీరు తలపండిన రాజకీయ నేతలను స్ఫురిస్తోందని మైసూరా అన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రజలు స్వచ్ఛందంగా మరో ప్రజాప్రస్థానానికి తరలివస్తున్నారని చెప్పారు.

రాజన్న రాజ్యం ఖాయం: షర్మిల

అనంతపురం: జిల్లాలో షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర తంబాపురం చేరుకుంది. ఈ సందర్భంగా హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరని, అలాగే ప్రజా సేవకు పరితపించే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

రానున్న కాలంలో జగన్ జైలునుంచి బయటికి వచ్చి ప్రజలకు రాజన్న రాజ్యాన్ని అందించడం ఖాయమని అమె అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ముందుండేందుకు నిర్ణయించుకున్న జగన్ ను అణిచి వేసేందుకు పాలక ప్రతిపక్షాలు చేస్తున్నకుట్రలను ఆమె ఎండగట్టారు. ఈ కుట్రలకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

'ప్రభుత్వానికి చంద్రబాబు ప్రధాన సలహాదారు'

అనంతపురం: మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా తంబాపురంలో షర్మిల మాట్లాడుతూ ప్రభుత్వంతోపాటు, ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు, ప్రాజెక్టులు కట్టడం నష్టమరి అనుకున్నారని విమర్శించారు. ప్రజలకు ఏదైనా మేలు చేస్తే సోమరిపోతులుగా తయారవుతారని చంద్రబాబు తన పుస్తకంలో రాసుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ విషయాలన్నీ నచ్చడంతో ప్రభుత్వం బాబును ప్రధాన సలహాదారుగా నియమించుకుని ప్రజా సంక్షేమానికి తీరని నష్టం చేకూరుస్తోందని విమర్శించారు.

సిలిండర్లు అవసరం లేనివారికి సబ్సిడీలు ఇస్తామంటోందని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. రైతులకు కనీసం నాలుగైదు గంటలు కూడా సరిగా కరెంట్ ఇవ్వలేని రీతిలో ప్రభుత్వం ఉందన్నారు. పదవిలో ఉన్నా లేకున్నా రైతుల గురించి ఆలోచించింది ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డే అని షర్మిల స్పష్టం చేశారు. ఇలా ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ షర్మిల ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది.

ఆత్మకూరు చేరుకున్న షర్మిల

అనంతపురం: జిల్లాలోని శివంపల్లి నుంచి గురువారం ఉదయం ప్రారంభమైన షర్మిల మరో ప్రజాప్రస్థానం 8వ రోజు పాదయాత్ర.. ఆత్మకూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తాము ఎదుర్కొంటున్న కష్టాలను షర్మిలకు మొరపెట్టుకున్నారు. మరోవైపు ధర్మవరం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి తమను వేధింపులకు గురి చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ ఎవరూ అధైర్యపడవద్దని, ముందు ముందు మంచి రోజులు వస్తాయని ధైర్యం చెప్పారు.

'జగన్ ను ఎదుర్కోలేకే కుట్రలు'

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న అపూర్వ ఆదరణ చూసి అధికార, ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని జగన్ సోదరి షర్మిల విమర్శించారు. మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా ఆత్మకూరులో ఆమె మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే ఇప్పుడు ఆయనను కూడా జైల్లో పెట్టేవారేమో అని అనుమానం వ్యక్తం చేశారు.

తన పాదయాత్రతో కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టిన వైఎస్ఆర్ కుటుంబానికి వేధింపులు తప్పడం లేదన్నారు. జగన్ బయట ఉంటే తమ ఆటలు సాగవనే జైల్లో పెట్టించేందుకు కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు.

Happy vijayadasami to all

Written By news on Wednesday, October 24, 2012 | 10/24/2012


YS Vijayamma's speech at Daditota in Anantapur

Special Edition: Kutralapai Sharmilastram

బిడ్డల మీద ప్రమాణం చేయగలరా?

నేను, నా భర్తను కలవడానికి వెళ్లినపుడు ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వీడియో కెమెరాలు పెట్టారు ఈ ప్రభుత్వ పెద్దలు. అంటే భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా వీళ్లు చెవులు పెట్టి రికార్డు చేసి అంతా వినాలని. దీనినిబట్టి మీరే చెప్పాలి - ఇంతకంటే గొప్ప సౌకర్యం ఏముంటుందో! మా పెళ్లిరోజు నేను జగన్‌ను చూడడానికి వెళ్లినపుడు నాకు, జగన్‌కు పది అడుగుల దూరంలో ఒక పోలీసును కూర్చోబెట్టారు. ఇంత గొప్ప సౌకర్యాలు మాకు ఇస్తున్నారు.

రెండు మూడు రోజులుగా టిడిపి పెద్దలు - జగన్‌కు జైలులో సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ కొత్త కథను తెరమీదికి తెచ్చారు. 2010 డిసెంబర్ మొదలుకుని టీడీపీ - కాంగ్రెస్‌తో కలిసి ఆడుతున్న నాటకంలో ఇది ఇంకొక మెట్టు. ఈ 18-20 నెలలుగా ఈ రెండు పార్టీలు ఆడుతున్న రాజకీయ క్రీడను గమనిస్తున్న ఎవరికైనా, రాజకీయాలలో ఓనమాలు రాని నాలాంటి వారికైనా స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే - జగన్‌ను ఇబ్బందిపెట్టడానికి ఒక పార్టీ ప్రతిపాదిస్తుంది... రెండవ పార్టీ దాన్ని బలపరుస్తుంది అని! కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావు గారు లెటర్ రాశారు... టిడిపి నాయకుడు ఎర్రంనాయుడుగారు, మరికొందరు దానితో జతకలిశారు. కోర్టుకు రాస్తారు... అక్కడ మొదలుకుని మొన్న బెయిల్ వరకు టిడిపి, కాంగ్రెస్ కలిసి ప్రతి మలుపులో జగన్‌ను ఇబ్బంది పెట్టడానికి వేయని నాటకం లేదు.

నాకు అర్థంకానిది ఒకటే - వీళ్లందరూ - రెండు పార్టీలవారు తలపండిన రాజకీయ నేతలు - 20-30 సంవత్సరాల రాజకీయ అనుభవం కలవారు - జగన్ రాజకీయ వయస్సు 3 సంవత్సరాలు. మరి జగన్‌ను ఎదుర్కోవడం వీరికి ఎంతో సులభం. ఒక పిహెచ్‌డి వ్యక్తి ఫస్ట్‌క్లాస్ పిల్లాడితో తలపడినట్లే. వాళ్ల అనుభవానికి, వాళ్ల ప్రజాసేవ చరిత్రకి వాళ్లు ఇంతగా జగన్‌ని చూసి ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. కానీ, ఇలా ఎందుకు వాళ్లు దొడ్డిదారిన, దొంగతనంగా జగన్‌తో తలపడుతున్నారో నాకు, ఈ రాష్ట్రంలోని సామాన్య ప్రజలకు అర్థం కాని విషయం.

ఈరోజు టీడీపీ పెద్దలు జైలులో జగన్‌కు సౌకర్యాలు అంటున్నారు. జగన్ జైలులో సెల్‌ఫోన్ వాడుతున్నాడు అన్నారు. జగన్ జైలులో సెల్‌ఫోన్‌లో మాట్లాడలేదు అని నేను నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలను. మిగతా విషయాల్లో మీ సత్యసంధత తరువాత సంగతి... ఈ విషయంలోనైనా మీ బిడ్డల మీద ప్రమాణం చేసి జగన్ జైలులో సెల్‌ఫోన్ వాడుతున్నాడని మీరు అనగలరా?

జగన్‌ను ఈరోజు అన్యాయంగా విచారణ పేరుతో అరెస్టు చేసినా, బెయిల్ రాకుండా మీరు ఇంతమంది కుట్రలు చేస్తున్నా జగన్ గురించి నాకు తెలిసింది ఒక్కటే - జగన్ నియమ నిబంధనలు పాటించే మనిషి. జగన్ ఎంచుకున్న మార్గం కష్ట మార్గమని తను పార్టీ నుంచి బయటికి వచ్చిన రోజే చెప్పాడు - ‘‘నాతో వస్తే కష్టాలు వుంటాయి. వాటికి తట్టుకుని నిలబడగలిగితేనే నాతో రండి’’ అని. ఎంతటి ఆటుపోట్లకు గురిచేసినా చెదరని మనిషి, జైలు నియమ నిబంధనల దగ్గర మారతాడా. అసలు జగన్ మీరన్నట్టు రాజీపడి రాజకీయాలు చేసేవాడైతే ఇంతదూరం రావలసిన పనిలేదు. జైలుకు వెళ్లవలసిన పనిలేదు. సుఖంగా బెంగుళూరులో వుండి వ్యాపారాలు చేసుకుంటూ, కుటుంబంతో హాయిగా వుంటే, గులాంనబీ ఆజాద్‌గారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీలోనే వుంటే ఎప్పుడో వారే సెంట్రల్ మినిస్టర్‌ని చేసేవారు... తర్వాత ముఖ్యమంత్రిని కూడా చేసేవారు. అంతవరకు ఎందుకు అనుకుంటే - కొందరు పెద్దల మాదిరి చీకట్లో చిదంబరం గారిని కలుసుకుని అన్నీ చక్కబెట్టుకునేవాడు.

నేను ఈరోజు జగన్‌కు జైలులో సౌకర్యాలు అనే అంశం మీద రాష్ట్ర ప్రజలకు జైలులో జరిగిన రెండు సన్నివేశాల గురించి చెప్పదలచుకున్నాను.

నేను, నా భర్తను కలవడానికి వెళ్లినపుడు ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వీడియో కెమెరాలు పెట్టారు ఈ ప్రభుత్వ పెద్దలు. అంటే భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా వీళ్లు చెవులు పెట్టి రికార్డు చేసి అంతా వినాలని. దీనినిబట్టి మీరే చెప్పాలి - ఇంతకంటే గొప్ప సౌకర్యం ఏముంటుందో! మా పెళ్లిరోజు నేను జగన్‌ను చూడడానికి వెళ్లినపుడు నాకు, జగన్‌కు పది అడుగుల దూరంలో ఒక పోలీసును కూర్చోబెట్టారు. ఇంత గొప్ప సౌకర్యాలు మాకు ఇస్తున్నారు. అంతా టీడీపీ పెద్దల చలవే!

అసలు ఇన్ని సౌకర్యాలు మన దేశంలోనే కాదు కదా, భూమి మీద ఏ దేశంలోనూ ఉండవు. ఇన్ని చేస్తున్నా ఓర్చుకొని ఉన్నాం. మా ఆయన ఒక ఎంపీ, ఒక పార్టీ అధ్యక్షుడు. మా మామగారు రాష్ట్రానికి ఎంతో సేవచేసి, స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని సంక్షేమాన్ని, అభివృద్ధిని రాష్ట్రానికి అందించిన మహానాయకుడు. ప్రజాసేవలోనే తుదిశ్వాస విడిచారు. అటువంటిది మీరు (టీడీపీ - కాంగ్రెస్) మమ్మల్నే ఇంత వేధిస్తున్నారంటే ఇక సామాన్య ప్రజల మాటేమిటి?

ఈరోజు ప్రజలకు నేను రెండు మాటలు చెప్పదలచుకున్నాను. మొదటిది - ఎవరైనా ధైర్యం వుంటే ఎదురుగా నిలబడి పోరాడాలి. అంతేకాని, ఇలా దొంగగా పోరాడేది పిరికిపందలే. జగన్‌ను నేరుగా ఎదుర్కోలేక జైలులో పెట్టారు. ఇప్పుడు బయట ఉన్నది ముగ్గురు ఆడవాళ్లు. రాజకీయాల్లోకి కాదు కదా, ఏరోజూ బయటికే రాని ఆడవాళ్లు. వాళ్లను కూడా ఈ టీడీపీ, కాంగ్రెస్ పెద్దలు నేరుగా ఎదుర్కోలేకుండా వున్నారంటే మీరే చెప్పండి - మేమేం చెయ్యాలో.

రెండవది - ప్రజల ముందు మరొకటి చెబుతున్నా - జగన్‌కు జైలులో సౌకర్యాలు అని టీడీపీ చేసే ఆరోపణలు రాబోతున్న మరో కుట్రకు సంకేతం. టీడీపీ వాళ్ల మాటలకు అనుగుణంగా కాంగ్రెస్ ఏమైనా జగన్‌కు ప్రతికూలంగా చర్యలు తీసుకుంటే - ఈ కుట్రలకు, ఈ చీకటి ఒప్పందాలకు మీరే సాక్షులు. కొన్నిరోజుల క్రితం నేను డీజీ గారికి ‘జైల్ మాన్యువల్ ప్రకారం నా భర్తను నేను వారానికి మూడుసార్లు కలవడానికి వీలు కల్పించమ’ని లెటర్ రాశాను. ఆ విషయంలో కానీ, మరే విషయంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం (కేంద్ర, రాష్ట్ర) ఈ టీడీపీ ఆరోపణల నేపథ్యంలో ప్రతికూలంగా స్పందిస్తే అది వారి అపవిత్ర కలయికకు మరో నిదర్శనం అవుతుంది. దానికి ప్రజలే సాక్షులు.

నిజం చెప్పండి - మా మీద పెట్టిన ఈ కేసులు, జగన్ అరెస్టు, 3 సంవత్సరాలుగా వేధింపులు - వీటికి కారణం మాకున్న ఆస్తులా లేక మా మామగారు, ఆ తరువాత నా భర్త సంపాదించుకున్న ప్రజాభిమానం అనే కొండంత ఆస్తా. నిజం చెప్పండి... ఈ కేసులకు మూలం - సాక్షి పత్రిక, టీవీ ఛానల్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ - వీటి మీద ప్రజలు చూపుతున్న ఆకాశమంత అనురాగమా, లేక మేము తప్పు చేశామనా? సమాధానాలు అందరికీ తెలుసు.

అయినా ఇన్ని ప్రజా సమస్యలుంటే అవేవీ పట్టనట్టు జైల్లో వున్న జగన్ మీదే వాళ్ల ధ్యాసంతా.

ఈ కుట్రలను కుతంత్రాలను దేవుడు చూస్తున్నాడు. ప్రజలు చూస్తున్నారు. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడే కాలం ఎంతోదూరంలో లేదు. దేవుని ఆశీస్సులతో ఇవన్నీ దాటుకుని బయటకు వస్తాం. అంతవరకూ మా ఈ పోరాటం ఆగదు.


- వైఎస్ భారతి
w/oవైఎస్ జగన్

అవిశ్వాసం పెట్టరేం?

ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాసం పెట్టాలి
కానీ పెట్టరు.. ఎందుకంటే జగన్ సీఎం అవుతారని భయం
సాగునీటికి వైఎస్ ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు వెచ్చించారు
మీరు తొమ్మిదేళ్లలో 10 వేల కోట్లయినా ఖర్చు పెట్టారా?
మీ హయాంలో 4 వేల రైతు ఆత్మహత్యలు నిజం కాదా?
కరెంటు బిల్లు కట్టకపోతే జైల్లో పెట్టించింది మీరు కాదా?
వారింట్లో సామాను లాగేసుకుంది మీరు కాదా?
ప్రజల్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతుంది మీరు కాదా?
ఇంకా ఎందుకు పాదయాత్ర నాటకాలు చంద్రబాబూ?
ఆరో రోజు వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో కలిపి 15.1 కి.మీ. పాదయాత్ర చేసిన షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారంపై టీడీపీ అధినేత చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, అందుకే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా, పాదయాత్ర పేరుతో నాటకాలాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల విమర్శించారు. ‘ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలి. కానీ పెట్టరు. ప్రభుత్వం పడిపోతే జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయనకు భయం..’ అని దుయ్యబట్టారు. ఆరో రోజు మంగళవారం ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా ఆమె పలు చోట్ల ప్రసంగించారు. ‘రైతులు కష్టాల కడలిలో ఉంటే చంద్రబాబు పాలించిన 9 ఏళ్లలో సాగునీటికి కనీసం రూ.10 వేల కోట్లయినా ఖర్చు చేయలేదు. 

అదే రైతు పక్షపాతి రాజన్న 5 ఏళ్లలో రూ. 50 వేల కోట్లు నీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టారు. చంద్రబాబు మనసులోని మాటను ఆయనే పుస్తక రూపంలో బయటపెట్టుకున్నారు. వ్యవసాయం దండగ అని రాసుకున్నారు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వొద్దని, ఇస్తే సోమరిపోతులు అవుతారని రాసుకున్నారు. ప్రాజెక్టులు కడితే నష్టమని రాసుకున్నారు. ఇప్పుడు పాదయాత్రల పేరుతో ఎల్లో డ్రామాలు ఆడుతూ మొసలి కన్నీరు కార్చుతున్నారు. కరువు కోరల్లో కరెంటు బిల్లులు కట్టకపోతే వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలులో పెట్టింది మీరు కాదా చంద్రబాబూ? వారింట్లో సామాను లాగేసుకుంది మీరు కాదా? మీ హయాంలో 4 వేల రైతు ఆత్మహత్యలు నిజం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతోంది మీరు కాదా? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుమ్మక్కవడం నిజం కాదా? ఇంకా ఎందుకు నాటకాల పాదయాత్రలు?’ అని షర్మిల ధ్వజమెత్తారు.

దొందూ దొందే..

‘చంద్రబాబుకు కిరణ్‌కుమార్‌రెడ్డి ఏమాత్రం తీసిపోలేదు. దొందూ దొందే అన్నట్టుగా చంద్రబాబు ప్రజలను గాలికి ఒదిలేయగా.. రాజశేఖరరెడ్డి తెచ్చిన పథకాలన్నింటికీ కిరణ్‌కుమార్‌రెడ్డి తూట్లు పొడిచారు..’ అని షర్మిల విమర్శించారు. ఆరో రోజు మంగళవారం ఉదయం 10 గంటలకు వైఎస్సార్ జిల్లా సరిహద్దులోని నేర్జాంపల్లి నుంచి ఆమె పాదయాత్ర కొనసాగించారు. నేర్జాంపల్లి దాటాక మార్గం మధ్యలో ఉన్న గండికోట-చిత్రావతి ఎత్తిపోతల పథకం వద్ద ఆగారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక నేత వైఎస్ అవినాష్‌రెడ్డి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టు వివరాలు తెలిపారు. అనంతరం షర్మిల స్పందిస్తూ.. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను గండికోట-చిత్రావతి ఎత్తిపోతల పథకం ద్వారా చిత్రావతి రిజర్వాయర్‌కు తెచ్చేందుకు వైఎస్ తాను చనిపోయేనాటికి 90 శాతం పనులు పూర్తి చేస్తే.. ఆయన చనిపోయిన మూడేళ్లలో ఈ ప్రభుత్వం కనీసం రాయి కూడా కదపలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 

‘ఈ పథకం పూర్తయితే చిత్తూరు జిల్లా నగరి వరకు నీళ్లొచ్చే అవకాశం ఉందట. కానీ ఆ చిత్తూరులో పుట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈ పథకం పూర్తిచేయాలని ఎందుకు లేదు? అక్కడే పుట్టిన చంద్రబాబు ఈ పథకం ఎందుకు పూర్తిచేయలేదని ఎందుకు నిలదీయలేదు? రాజశేఖరరెడ్డి పుట్టిన జిల్లా అంటే అంత కక్షా? ఈ నిర్లక్ష్యం, ఈ రాక్షస పాలన కొనసాగడానికి ఇక వీల్లేదు. ఇంతమందికి అన్నంపెట్టే ఈ ప్రాజెక్టుకు అన్యాయం చేసే ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలవదు. జగనన్న సీఎం అయిన ఒకటి, రెండు నెలల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తిచేస్తారు..’ అని హామీ ఇచ్చి అక్కడి నుంచి కదిలారు.

అధికారులను నిలదీసిన షర్మిల

ఒంటిగంటకు వైఎస్సార్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న చిత్రావతి జలాశయం వద్దకు షర్మిల చేరుకున్నారు. 9 టీఎంసీల నీరు నిండాలని, తాగునీటికి, సాగునీటికి కొరత ఉండకూడదని రాజశేఖరరెడ్డి కన్న కల కలగానే మిగిలిపోతోందని రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు. పులివెందులకు తాగునీటి కోసం 1.5 టీఎంసీల నీరిస్తానని చెప్పిన అధికారులు ఆ మేరకు నీళ్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో అక్కడే ఉన్న ప్రాజెక్టు డీఈని షర్మిల ప్రజల తరఫున నిలదీశారు. ‘ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు?’ అని ప్రశ్నించగా.. ‘పై నుంచి ఆదేశాల మేరకే మేం నడుచుకుంటున్నాం’ అని సమాధానం ఇచ్చారు. 

షర్మిల ‘అంటే చంద్రబాబు హయాంలో కంటే అధికంగా ఇప్పుడు రైతులు, ప్రజలు ఆత్మహత్య చేసుకోవాలని ఈ ప్రభుత్వ ఉద్దేశమా?’ అని ప్రశ్నించారు. ‘సాధ్యం అయినంతవరకు వనరులను బట్టి చేస్తున్నాం’ అని అధికారి బదులిచ్చారు. ‘ప్రజల కష్టాలను పట్టించుకోకపోవడం సరికాదు కదా. మీరు బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకపోతే ప్రజలకు ఆత్మహత్యలే శరణ్యమవుతాయి. ఇది సరికాదు. ప్రజలకు న్యాయం చేయా లి..’ అని కోరారు. అనంతరం జలాశయం సమీపంలో భోజనానికి ఉపక్రమించారు. తిరిగి సాయంత్రం 3.45కు అక్కడి నుంచి బయలుదేరి అనంతపురం జిల్లా సరిహద్దులోకి చేరుకున్నారు.

40 లక్షల చదరపు అడుగుల స్టోరేజ్

అనంతపురం జిల్లా దాడితోట గ్రామ సమీపంలోని రత్నమ్మ అనే రైతుకు చెందిన టమాట తోట ఎండిపోవడంతో అక్కడ ఆగారు. ఇప్పటికే రెండు లక్షల అప్పు ఉందని, ఇప్పుడు టమాట తోట ఎండిపోయి నష్టపోయామని, బోరు ఎత్తిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని రత్నమ్మ వాపోయారు. ఇప్పుడు వరిపొలం కూడా ఎండిపోయే పరిస్థితి ఉందని వివరించారు. ‘చిత్రావతికి ఇంత సమీపంలో రైతు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈప్రభుత్వానికి మనసే లేదు..’ అని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ‘టమాటాలను రైతు 2 రూపాయలకు అమ్ముకునే పరిస్థితి ఉంది..’ అని రైతులు వివరించగా ‘జగనన్న సీఎం కాగానే రాష్ట్రంలో ఇప్పుడున్న 40 లక్షల చదరపు అడుగుల నిల్వ సామర్థ్యానికి అదనంగా మరో 40 లక్షల చదరపు అడుగుల నిల్వ సామర్థ్యం పెంచుతార’ని షర్మిల హామీ ఇచ్చారు. అక్కడి నుంచి దాడితోటకు వచ్చి సాయంత్రం 5.40కి అక్కడి బహిరంగ సభలో మాట్లాడారు. రాత్రి 7.45కు దాడితోట శివారులో రాత్రి బసకు చేరుకున్నారు. ఆరో రోజైన మంగళవారం మొత్తం 15.1 కిలోమీటర్లు నడిచారు. వైఎస్సార్ జిల్లాలో 7.3 కిలోమీటర్లు, అనంతపురం జిల్లాలో 7.8 కిలోమీటర్లు నడిచారు.

source:sakshi

ఆడబిడ్డను ఆత్మీయంగా..

వైఎస్సార్ జిల్లా నుంచి ‘అనంత’లోకి పాదయాత్ర

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ తనయ, జగన్ సోదరి, వైఎస్సార్ జిల్లా ఆడపడుచు షర్మిలకు ఆ జిల్లా ప్రజలు జిల్లా సరిహద్దుల్లో ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. మంగళవారం పార్నపల్లిలో బహిరంగ సభతో జిల్లాలో యాత్ర పూర్తయింది. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అక్కడి వంతెన దాటే సమయంలో జిల్లా మహిళలు షర్మిలకు గాజులు, కుంకుమ, పూలతో సాంప్రదాయకంగా వీడ్కోలు పలికారు. జిల్లా ప్రజలు ఆదరించిన తీరుకు షర్మిల శిరస్సు వంచి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఐదున్నర రోజుల్లో 82.5 కిలోమీటర్లు పాదయాత్ర సాగింది.

అక్కున చేర్చుకున్న అనంత: మంగళవారం సాయంత్రం అనంతపురం జిల్లాకు చేరుకున్న మరో ప్రజాప్రస్థానానికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికి షర్మిలను అక్కున చేర్చుకున్నారు. దాదాపు 10 వేల మంది ప్రజలు సరిహద్దులోకి వచ్చి స్వాగతం పలికారు. యాత్ర ప్రవేశించిన దాడితోట నుంచి షర్మిల బసచేసిన ప్రాంతం వరకు జనం బారులు తీరి ఆత్మీయంగా ఆదరించారు. జిల్లా ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు.

పాదయాత్రలో ఎమ్మెల్యేలు: వైఎస్సార్ జిల్లాలో ఐదున్నర రోజులు 82.5 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ వీలైనప్పుడల్లా ఐదు రోజుల పాటు పాదయాత్రలో పాల్గొనగా.. పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి పూర్తిస్థాయిలో పాదయాత్రలో కొనసాగుతున్నారు. వైఎస్సార్ జిల్లా ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, కె.శ్రీనివాసులు పూర్తిస్థాయిలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ డి.నారాయణరెడ్డి కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. ఇక పొరుగు జిల్లాల నుంచి పలువురు శాసనసభ్యులు యాత్రలో ఒకటి రెండు రోజులు నడిచారు. వీరిలో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, శోభానాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రెండు రోజులు పాదయాత్రలో నడిచారు. ఎమ్మెల్యే కాపు రాంచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి మొదటి నుంచీ నడుస్తున్నారు. ఎమ్మెల్సీలు శేషుబాబు, దేశాయి తిప్పారెడ్డి తదితరులు వైఎస్సార్ జిల్లాలో పాదయాత్రలో పాల్గొన్నారు. మాజీ మంత్రి కొండాసురేఖ, పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, కేకే మహేందర్‌రెడ్డి తదితరులు తొలి మూడురోజులు యాత్రలో పాల్గొన్నారు.

source:sakshi

జగన్‌పై మరో కుట్ర


వైఎస్సార్ కాంగ్రెస్ నేత గట్టు ధ్వజం

హైదరాబాద్ , న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మరో కుట్రకు తెర లేపుతున్నారని, అందుకే జైల్లో ఉన్న ఆయనపై టీడీపీ నేతలు అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... జగన్ జైల్లో నుంచి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించిందని యనమల రామకృష్ణుడు వంటి టీడీపీ నేతలు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా చూస్తుంటే ఏదో కుట్ర జరుగుతున్నట్టుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ‘‘ఈ ఆరోపణలు చేసేముందు సిగ్గుండాలి. నిజంగా మీ వద్ద ఆధారాలుంటే నిరూపించండి. లేకుంటే అలా మాట్లాడ్డం మానుకోండి’’ అని గట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీడీపీ నేతలు ఆరోపణలు చేసినపుడల్లా జగన్‌పై ఏదో ఒక కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. ‘‘బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనాన్ని ఎందుకు ఇచ్చారని టీడీపీ ప్రశ్నించిన వెంటనే పోలీసులు జగన్‌ను వ్యాన్‌లో తీసుకెళ్లారు. అంతకుముందు అరెస్టు చేయాలని డిమాండ్ చేయగానే ఆయన్ను సీబీఐ జైల్లో పెట్టింది. బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చేటపుడు టీడీపీ నేతలు ఢిల్లీకి వెళ్లి చిదంబరాన్ని కలిశారు. ఆ తరువాతనే ఈడీ ఎటాచ్‌మెంట్ నోటీసులిచ్చింది. టీడీపీ ఏం చెబితే అది జరుగుతోంది, ఇదంతా కుట్రలో భాగమే’’ అని ఆయన అన్నారు. జగన్‌ను జైల్లో కొందరు వెళ్లి కలుస్తున్నారంటే.. తమ పార్టీవారు ఎక్కడ జారిపోతారోనన్న భయం వారికి పట్టుకుందని, అందుకే ఆయనపై టీడీపీ అబద్ధపు ఆరోపణలు చేస్తోందని గట్టు మండిపడ్డారు. పాముకు తలలోనూ, తేలుకు తోకలోనూ విషం ఉంటుందని, చంద్రబాబు వంటి దుర్మార్గునికి ఒళ్లంతా విషమే ఉంటుందని గట్టు సుమతీశతకంలోని పద్యాన్ని ఉదహరిస్తూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆ విషంతోనే తన పార్టీ నేతలతో జగన్‌పై చంద్రబాబు ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. పులివెందులలో షర్మిల పాదయాత్ర చేస్తున్నపుడు కొందరు మహిళలు తమకు తెల్లకార్డులు లేవని చెప్పిన విషయాన్ని యనమల ప్రస్తావిస్తూ సొంత నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించడం ఎమ్మెల్యే బాధ్యత కాదా? అని ప్రశ్నించడాన్ని ఆయన తప్పుపట్టారు. ‘‘అయితే చంద్రబాబు తన యాత్రలో టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో తిరుగుతున్నపుడు అక్కడి ప్రజలూ సమస్యల గురించి చెబుతున్నారు. ఆ సమస్యలు పరిష్కారం కాలేదంటే టీడీపీ ఎమ్మెల్యేలదే బాధ్యత అని చెబుదామా?’’ అని రామచంద్రరావు ప్రశ్నించారు. 

బాబుది తెచ్చిన జనంతో సాగుతున్న యాత్ర

బాబు యాత్రకు వస్తోంటే తమ ఊళ్లకు రావద్దని గ్రామాల ప్రజలు చెబుతున్నారని, ఆయన పరిస్థితి ‘ఓ స్త్రీ రేపురా...’ అన్నచందంగా తయారైందని గట్టు ఎద్దేవా చేశారు. తెచ్చిన జనంతో బాబు యాత్ర సాగుతోంటే వచ్చిన జనంతో షర్మిల యాత్ర జరుగుతోందని, ఇది చూసి టీడీపీ అధ్యక్షునికి చిన్నమెదడు చిట్లిపోయిం దని, ఆయనకు పెద్ద మెదడు ముందే లేదని ఆయన వ్యాఖ్యానించారు. షర్మిల యాత్రకు లభిస్తున్న అపూర్వ స్పందనను చూసి టీడీపీ నేతలకు మతిపోతోందని అన్నారు. 

మందకృష్ణా..‘ దేశం’లో చేరిపో: నల్లా

మాదిగల అభ్యున్నతికోసమంటూ ఆల్ ఫ్రీ వాగ్దానాలు చేస్తున్న చంద్రబాబుకు ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మద్దతు ఇవ్వటం మాదిగల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టటమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాశరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పూటకో మాట, రోజుకు ఒకరికి మద్దతిస్తూ మంద కృష్ణ విచిత్రంగా వ్యవహరించే బదులు టీడీపీలో చేరిపోవాలని ఆయన సూచించారు. గడిచిన ఎన్నికల్లో మాదిగల కోసమంటూ ప్రత్యేక పార్టీ పెట్టిన మంద కృష్ణ.. తాను స్వయంగా మధిర స్థానం నుంచి పోటీ చేశారని, అయితే ఆ నియోజకవర్గంలో 60 వేల మాదిగల ఓట్లు ఉంటే ఆయనకు 20 వేల ఓట్లు కూడా దాటలేదని గుర్తు చేశారు. 

source:sakshi

'జగన్ ప్రభంజనం తప్పదు'

Written by Rajababu On 10/23/2012 8:17:00 PM
ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరిస్తున్న తీరు, షర్మిల 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రకు వస్తున్న ఆదరణ బట్టి రానున్న కాలంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం తప్పదని స్పష్టమవుతోంది. జగన్ ప్రభంజనాన్ని తట్టుకోలేక కాంగ్రెస్, తెలుగుదేశం, సీబీఐలు ఒక్కటయ్యారని ప్రజల గొంతుక ఒక్కటై కూస్తోందనేది వాస్తవం. రాష్టంలో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ సాధించిన ఘనవిజయం ప్రజల్లో విశ్వాసాన్ని, భరోసాని నింపింది. రానున్నది రాజన్న రాజ్యమేనని ప్రజలు ఎదురు చూస్తున్నారని రాష్టంలో ముఖచిత్రం స్పష్టంగా కనిపిస్తొంది.

ఎన్ని శక్తులు ఏకమైనా రాష్ట్రంలో యువనేత జగన్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని.. కాంగ్రెస్ టీడీపీలు కుమ్మక్కైనా గత ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనమని వైఎస్ఆర్ సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కానీ.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజల కష్టాలు ప్రభుత్వానికి తెలియజేయాలనే లక్ష్యంతో పాటు.. భవిష్యత్తులో స్వర్ణయుగం సాకారం కానుందనే భరోసా ఇస్తూ చేయాలనుకున్న మరో ప్రస్థానం పాదయాత్రను.. తొలుత జగన్‌మోహనరెడ్డి చేయాలని యోచించారు. ప్రజల్లో తిరుగుతున్నారన్న ఒక్క కారణంతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై జైల్లో పెట్టించడంతో అన్న ఆశయాన్ని ప్రస్తుతం షర్మిల ముందుకు తీసుకువెళ్తున్నారు. షర్మిల పాదయాత్రకు వస్తున్న ఆరదణ చూస్తుంటే.. జగన్ పై విశ్వాసంతోనే గత రెండు ఎన్నికల్లోనూ వైఎస్‌ను చూసే జనం ఓట్లేశారని, సోనియాను చూసి కాదన్న విషయం కాంగ్రెస్‌నాయకులకు ఇప్పుడిప్పుడే బోధపడుతోంది.

రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు సాగునీరందించే పోలవరం వంటి ప్రాజెక్టులకు వైఎస్ శ్రీకారం చుడితే వాటిని ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తొంది. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను, పథకాలను చేపట్టలేమని ప్రభుత్వం ఎప్పుడో చేతులెత్తేసింది. వైఎస్ హయాంలో అన్నివర్గాలవారికీ న్యాయం జరిగిందనీ, ప్రస్తుతం ప్రభుత్వం ఉందా అన్న అనుమానం ప్రజల్లో బలంగా నాటుకుపోతోంది. ప్రజాసమస్యలపై పోరాటం చేయడమే లక్ష్యంగా జగన్‌మోహనరెడ్డి పార్టీని ముందుకు నడిపిస్తున్న తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ప్రజల్ని మభ్యపెట్టడానికి చంద్రబాబు తెరలేపిన పాదయాత్రను, ఆయన చేస్తున్న అమలు కాని వాగ్దానాలను జనం నమ్మడం కష్టమేనని ఆపార్టీకి చెందిన నేతల్లో అనుమానాలున్నాయి.

తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు పనితీరు.. కాంగ్రెస్తో ఆడుతున్న నాటకాన్ని జనం చూస్తున్నారు. జగనన్న ఆశయంతో పాదయాత్ర చేస్తూ జనంలోకి వచ్చిన షర్మిలకు ప్రజలు బ్రహ్మరధం పడుతూ.. అక్కున చేర్చుకోవడం చూస్తే రానున్నది జగన్ ప్రభంజనం..రాజన్న రాజ్యమేనని ప్రజల కళ్లలో ఆశలు చిగురిస్తున్నాయనడంలో సందేహం అక్కర్లేదు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజానాయకుడు వై.ఎస్.రాజశేఖరరెడ్డి అయితే ఆయన తనయుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తన కంటిచూపుతో ప్రజావిప్లవం తేగల యువనాయకుడని వైఎస్ఆర్ సీపీ నేత కొణతాల రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు వాస్తవ రూపం దాల్చడానికి మరి ఎంతో దూరం లేదని అనిపిస్తోంది.

Popular Posts

Topics :