11 November 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Sharmila's speech at Daivam denni in Kurnool

Written By news on Saturday, November 17, 2012 | 11/17/2012

YSRCP ready to no-trust motion if TDP supports : Sharmila

Probe Subramanian Swamy's charges against Rahul Gandhi: EC

Mysura Reddy comments on Chandrababu

అవిశ్వాసంపై డొంకతిరుగుడు సమాధానాలు వద్దని, చెప్పేది నేరుగా, స్పష్టంగా చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరా రెడ్డి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుని కోరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు తన పాదయాత్రలో ప్రతిచోట ఈ ప్రభుత్వానికి పాలించే అర్హతలేదని చెబుతున్నారని, అటువంటప్పుడు అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్ట్రని అయన ప్రశ్నించారు. అవిశ్వాసంపై ఒంకరిటింకరి మాటలు, ఆయోమయ ప్రకటనలు చేయవద్దన్నారు. శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టమని చెప్పారు. ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరగడంలేదని, అయినప్పటికీ స్పష్టంగా ప్రకటించాలన్నారు. తమకు సంఖ్యాబలం ఉంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేవారమని ఆయన చెప్పారు. బలప్రదర్శనకు, అవిశ్వాసానికి తేడా ఉందని ఆయన వివరించారు. ప్రభుత్వంలోని మంత్రులు, కాంగ్రెస్ శాసనసభ్యులే పరిపాలనపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో గుర్తింపు పొందిన ప్రతిపక్షంగా అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి ఎందుకు ముందుకు రావడంలేదని ఆయన ప్రశ్నించారు. అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెడితే మద్దతు ఇస్తామని టిఆర్ఎస్ కూడా చెబుతోందన్నారు. తాము కూడా మద్దతు తెలుపుతామని ఆయన చెప్పారు. ప్రభుత్వాన్ని బలవంతంగా కూలదోయాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. తాము ప్రజల నుంచే అధికారం పొందుతామని చెప్పారు.

ఠాక్రే మృతిపై విజయమ్మ సంతాపం

శివసేన అధినేత బాల్ ఠాక్రే మృతిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సంతాపాన్ని వెలిబుచ్చారు. పలువురు స్థానిక, జాతీయ ప్రముఖులు కూడా ఠాక్రే మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఢిల్లీలో భారతీయ జనతాపార్టీ సినియర్ నేత సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ టైగర్ (ఠాక్రే) మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

పార్టీ నేత షానవాజ్ హుస్సేన్ మాట్లాడుతూ దేశం ఒక యోధుడిని కోల్పోయిందన్నారు. ఠాక్రే అంతిమ యాత్రలో పార్టీ శ్రేణులు పాల్గొంటాయని వెల్లడించారు. శివసేనతో తమ అనుబంధం కొనసాగుతుందని పేర్కొన్నారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నేడు బీజేపీ నేతలకు ఏర్పాటు చేసిన విందును ఠాక్రే మృతి కారణంగా, ప్రధాని మన్మోహన్ రద్దు చేసుకున్నారు.

కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివసేన అధినేత బాల్ ఠాక్రే శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్ జైల్ ధ్రువీకరించారు. ఠాక్రే శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు కన్నుమూశారని వైద్యులు ప్రకటించారు. దీంతో ముంబైవాసులే కాక, దేశవ్యాప్తంగా ఉన్న ఠాక్రే అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన కన్నుమూసిన మాతోశ్రీ వద్దకు అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.


source:sakshi

కే.తిమ్మాపురంలో షర్మిల రచ్చబండ

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ ను బాబు ఎన్నికల కోసం వాడుకుని వదిలేశారని... వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేశారని ఆమె గుర్తు చేశారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకమని, దానికి విద్యుత్, మోటర్లు అవసరమన్నారు.

అయితే విద్యుత్, మోటార్లు సమకూర్చటానికి ప్రభుత్వానికి మూడు సంవత్సరాలు సరిపోలేదని షర్మిల విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే నీటి సమస్యను తీర్చుతారన్నారు. కే తిమ్మాపురంలో రచ్చబండలో షర్మిల మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.

వైఎస్ వల్లే కాంగ్రెస్‌కు ఢిల్లీ పీఠం: షర్మిల

వైఎస్ మరణిస్తే తట్టుకోలేక వందల గుండెలు ఆగిపోయాయి
ఆ బాధిత కుటుంబాలను ఓదార్చుతామన్న కాంగ్రెస్ నేతలు తర్వాత మర్చిపోయారు
ఈ ప్రభుత్వం ఒక్క రాజన్న కుటుంబాన్నే కాదు.. ప్రజలందరినీ కక్షగట్టి ిహ ంసిస్తోంది
అవిశ్వాసం పెట్టాల్సిన చంద్రబాబు.. ప్రభుత్వాన్ని పెంచి పోషిస్తున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 30, కిలోమీటర్లు: 388.90

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి కన్న తండ్రిలా తన రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించాడు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో చేసి చూపించాడు. ఒకటి కాదు, రెండు కాదు 30 ఏళ్లు కాంగ్రెస్‌కు సేవ చేసి.. రెండు సార్లు ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందంటే.. రాజన్న ఇచ్చిన ఎంపీల వల్ల కాదా? అని అడుగుతున్నాం. మరి అలాంటి రాజన్న చనిపోతే కొన్ని వందల గుండెలు తట్టుకోలేక బాధతో ఆగిపోతే.. ఒక్కరంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు.. ఒక్కటంటే ఒక్క కుటుంబాన్నైనా ఓదార్చారా? బాధిత కుటుంబాలను ఓదార్చుతామని చెప్పి, డబ్బు సాయం చేస్తామని చెప్పి.. వాళ్లని మరిచిపోయారు. చనిపోయిన వాళ్లంతా కాంగ్రెస్ పార్టీ వాళ్లే. అయినా పట్టించుకోలేదు ఆ పార్టీ’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ప్రజా సంక్షేమం పట్టని రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి, దానిపై అవిశ్వాస తీర్మానం పెట్టకుండాఆ సర్కారుతోనే కుమ్మక్కైన టీడీపీ రాజకీయాలకు నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 30వ రోజు శుక్రవారం కర్నూలు జిల్లా మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల పరిధిలో సాగింది. సాయంత్రం ఎమ్మిగనూరులో జరిగిన భారీ బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.

వైఎస్‌ను దోషిగా నిలబెట్టే యత్నం..

‘‘రాజశేఖరరెడ్డి ఏ పథకం తెచ్చినా ఇందిరాగాంధీ అని, రాజీవ్ గాంధీ అని వాళ్ల పేర్లే పెట్టాడు. అందుకు బహుమానంగా రాజశేఖరరెడ్డి గారి పేరును దోషిగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఇది అన్యాయం కాదా? ఇది వెన్నుపోటు కాదా అని అడుగుతున్నాం. రాజశేఖరరెడ్డి గారి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి.. మీ గుండెల్లో ఆయనను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం ఒక్క రాజన్న కుటుంబాన్నే కాదు.. రాష్ట్ర ప్రజలందరి మీదా కక్షగట్టి హింసిస్తోంది. ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేనే లేదు..’’ అని షర్మిల విమర్శించారు.

సిగ్గులేకుండా మరో అవకాశం ఇవ్వాలంటున్నాడు..

‘‘చంద్రబాబు హయాంలో వందల మంది చేనేత కార్మికులు, 4 వేల మంది రైతన్నలు ఆత్మహత్యకు పాల్పడినప్పుడు రాజన్న వారి కుటుంబాలకు సాయం చేయాలని చంద్రబాబును అడిగితే పైసా కూడా సాయం చేయలేదు. రాజన్న అధికారంలోకి వచ్చాక వారికి లక్షన్నర చొప్పున నష్ట పరిహారం ఇచ్చాడు. చంద్రబాబు ఇప్పుడు పాదయాత్ర అంటూ కొత్త డ్రామాలాడుతున్నారు. గ్రామాలను శ్మశానాలుగా మార్చి అదే గ్రామాల మీదుగా వెళుతూ ఇప్పుడు సిగ్గు లేకుండా మరో అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. నా మాట నమ్మాలంటూ మొసలి కన్నీరు కార్చుతున్నారు. ప్రజలు అమాయకులు కాదు. చంద్రబాబు అనుకుంటున్నట్టు పిచ్చోళ్లు అంతకన్నా కాదు’’ అని షర్మిల నిప్పులు చెరిగారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వాన్ని తిట్టినట్టు నటిస్తూనే మిత్రపక్షంగా ఉంటూ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారు. ఆయన చేస్తున్న పాదయాత్రకు, ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజూ అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు పెంచిపోషిస్తున్నారు..’’ అని షర్మిల మండిపడ్డారు.

కిక్కిరిసిన ఎమ్మిగనూరు..

ఉదయం 10.30కు హెచ్.మురవణి శివారులో ప్రారంభమైన పాదయాత్రలో తొలుత అక్కడి స్థానికులతో షర్మిల రచ్చబండ నిర్వహించారు. అక్కడి నుంచి నాలుగో మైలు(కంబదహాళ్ క్రాస్), కొత్తగొలలదొడ్డి మీదుగా సాయంత్రం ఎమ్మిగనూరు చేరుకున్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో శివారు నుంచే ప్రజలు ఘనస్వాగతం పలికారు. సాయంత్రం 5.30కు ఎమ్మిగనూరులో జరిగిన బహిరంగ సభకు జనం పోటెత్తారు. అక్కడ సభలో మాట్లాడిన తరువాత రాత్రి 7 గంటలకు శివారులోని రైస్‌మిల్లు వద్ద ఏర్పాటుచేసిన రాత్రి బసకు ఆమె చేరుకున్నారు. శుక్రవారం 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. ఇప్పటివరకు 30 రోజుల్లో మొత్తం 388.90 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తయింది.

షర్మిల పాదయాత్రలో ప్రముఖులు

కర్నూలు, న్యూస్‌లైన్ ప్రతినిధి: షర్మిల పాదయాత్రలో శుక్రవారం మాజీ మంత్రి, పార్టీ సీజీసీ సభ్యుడు కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం నుంచి షర్మిల వెంట యాత్రలో నడుస్తున్నారు. విశాఖ పట్టణానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, పార్టీ నేత తిప్పల నాగిరెడ్డి, ఏపీ టెక్నాలజీస్ సర్వీసెస్ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్‌రెడ్డి, ప్రకాష్ బాబు, ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, వై. బాలనాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరిత, సాయి ప్రసాద్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఉదయం పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ బస చేసిన క్యాంప్‌కు వచ్చి ఆమెతో మాట్లాడి వెళ్లారు.

ఎంపీనని జైల్లో పెడతారా?

అరెస్టు చేసి ఐదున్నర నెలలు దాటిందని నివేదన

‘‘అరెస్టు చేసిన 90 రోజుల్లోపు చార్జిషీటు దాఖలు చేయకపోతే నిందితుడికి విధిగా బెయిలివ్వాలి. సుప్రీంకోర్టు గత తీర్పులూ అదే చెబుతున్నాయి. ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉందని సీబీఐ చెబుతున్న ఏడు అంశాలకు కూడా 90 రోజుల గడువు వర్తిస్తుంది.’’

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘సాక్షి’ పెట్టుబడుల వ్యవహారంలో అరెస్టు చేసిన తనకు బెయిలు మంజూరు చేయాలంటూ కడప ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం సీబీఐ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు కోర్టులో ఆయన రెండు బెయిలు పిటిషన్లు దాఖలు చేశారు. తనను అరెస్టు చేసి ఇప్పటికే ఐదున్నర నెలలు దాటిందని గుర్తు చేశారు. అరెస్టు చేసిన 90 రోజుల్లోపు చార్జిషీటు దాఖలు చేయకపోతే విధిగా నిందితుడికి బెయిలివ్వాల్సి ఉందని పేర్కొంటూ సీఆర్పీసీ సెక్షన్ 167(2) కింద స్టాట్యుటరీ బెయిలు పిటిషన్ వేశారు. తనను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపింది తొలి చార్జిషీటుకు సంబంధించిన (సీసీ-8) కేసులో గనుక, దానిపై ఇప్పటికే దర్యాప్తు పూర్తయినందున బెయిలివ్వాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 437 కింద సాధారణ బెయిలు పిటిషన్ కూడా వేశారు. జగన్ తరఫున న్యాయవాది జి.అశోక్‌రెడ్డి వీటిని దాఖలు చేశారు.

‘‘ఇంకా ఏడు అంశాలపై దర్యాప్తు పెండింగ్‌లో ఉందని సుప్రీంకోర్టుకు సమర్పించిన నోట్‌లో సీబీఐ పేర్కొంది. కానీ అవేమీ దర్యాప్తు జరుగుతుండగా బయట పడ్డవేమీ కావు. 2012 ఆగస్టులో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కూడా పేర్కొన్నవే. కాబట్టి దర్యాప్తు చేయడానికి సీబీఐకి గడువు వర్తిస్తుంది. గడువు లోపు పూర్తి చేయకుంటే నిందితుడికి ఆటోమేటిగ్గా బెయిలు లభిస్తుంది. చట్ట ప్రకారం ఇది తప్పనిసరిగా ఇవ్వాల్సిన బెయిలు’’ అని పిటిషన్లో జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు గత తీర్పులను కూడా ఉదాహరించారు. రాజ్యాంగంలోని 19, 21 అధికరణాల కింద తనకున్న ప్రాథమిక హక్కులను సీబీఐ హరిస్తోందని ఆయన ఆరోపించారు. తన చట్టబద్ధ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఈ కోర్టు మీదే ఉందన్నారు. సీబీఐ ప్రత్యేక జడ్జి దుర్గాప్రసాదరావు పిటిషన్లను విచారణకు స్వీకరించారు. వాటిపై సీబీఐ సమాధానమేంటో చెప్పాలని ఆదేశిస్తూ విచారణను నవంబర్ 21కి వాయిదా వేశారు.

కోర్టుకెళ్లే ముందు అరెస్టు చేశారు...

‘‘2011 ఆగస్టు 17న సీబీఐ ఎఫ్‌ఐఆర్ (ఆర్‌సీ నెంబర్ 19(ఎ) నమోదు చేసింది. దాదాపు 9 నెలల పాటు దాదాపుగా దర్యాప్తు పూర్తి చేసి మూడు చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత, సరైన కారణాలు చూపకుండానే మే 27న నన్ను అరెస్టు చేసింది. నన్ను అరెస్టు చేసి ఆగస్టు 26 నాటికి 90 రోజులు దాటింది. నిజానికి ఆలోపే సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయాలి’’ అని జగన్ గుర్తు చేశారు. కోర్టు ముందు హాజరయ్యేందుకు కేవలం కొన్ని గంటల ముందు సీబీఐ తనను అరెస్టు చేసిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది వివక్షాపూరితమే గాక చట్టవిరుద్ధం కూడానని స్పష్టం చేశారు. ‘‘ఎఫ్‌ఐఆర్ ఆర్‌సీ నంబర్ 19(ఎ)లో సీబీఐ నన్ను మే 27న అరెస్టు చేసింది. మొదటి చార్జిషీట్ (సీసీ-8)లో నాకు కోర్టు సమన్లు అందాయి. నన్ను కనీసం విచారించకుండానే నాపై ఏకంగా మూడు చార్జిషీట్లు కూడా దాఖలు చేసేసిన సీబీఐ... మరో నాలుగు రోజుల్లో కోర్టు ముందు హాజరవాల్సి ఉండగా నన్ను విచారణకు పిలిచింది. 

మూడు రోజుల పాటు ఉదయం నుంచి రాత్రి దాకా విచారించింది. అందుకు పూర్తిగా సహకరించా. తెల్లవారితే, నేను కోర్టు ఎదుట హాజరయితే, ఇక కేసు మొత్తం కోర్టు పరిధిలోకి వస్తుంది. నాకు బెయిలు వచ్చే వీలుంటుంది. ఆ అవకాశాన్ని దెబ్బ తీయడానికే కోర్టుకు వెళ్లేందుకు కొన్ని గంటల ముందు నన్ను అరెస్టు చేశారు’’ అని ఆయన వివరించారు. సీసీ నంబర్ 14లో ఆరో నిందితుడిగా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావును, ఇతర నిందితులను సీబీఐ అరెస్టు చేయలేదని గుర్తు చేశారు. ‘‘వారిని కూడా నేరానికి ప్రధాన కారకులుగా సీబీఐ పేర్కొం టోంది. కానీ అరెస్టు మాత్రం చేయలేదు. అంటే, నిందితులను అరెస్టు చేయకుండా, రిమాండ్‌కు తరలించకుండా కూడా దర్యాప్తు కొనసాగించవచ్చనేగా అర్థం?’’ అని ప్రశ్నించారు. తన అరెస్టును చట్టవిరుద్ధమని సీబీఐ న్యాయస్థానం కూడా అభివర్ణించిందని గుర్తు చేశారు. ‘‘90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేయాలని హైకోర్టు చెప్పినా సీబీఐ చేయలేదు. కాబట్టి చట్టబద్ధంగా నాకు బెయిల్ మంజూరు చేయండి’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఎంపీనని జైల్లో పెడతారా?

ఒక వ్యక్తి హోదా గానీ, స్థాయి గానీ ఆయనకు వ్యతిరేకంగా మారకూడదని జగన్ పేర్కొన్నారు. తాను ఎంపీని గనక, తన పలుకుబడితో సాక్ష్యాలను తారుమారు చేయగలనని, సాక్షుల్ని ప్రభావితం చేయగలనని సీబీఐ చేస్తున్న వాదనను గట్టిగా ఖండించారు. ‘‘ఈయన ఈ పదవిలోకి రాకుండా ఉంటే బావుండేదనే స్థాయిలో ఒక వ్యక్తి తన హోదాను, స్థాయిని దుర్వినియోగం చేస్తే తప్ప అది ఆయనకు వ్యతిరేకంగా మారకూడదు. నేను ఎంపీగా ఎన్నికయింది ఇప్పుడు కాదు. సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసేనాటికే ఎంపీని. అలాంటిది నన్ను కనీసం విచారణ కూడా చేయకుండా నాపై మూడు చార్జిషీట్లు వేశారు. దానర్థం నేను, నా పదవి ఈ దర్యాప్తుకు ఏమాత్రం అడ్డంకి కాలేదనే కదా? మరి ఆ కారణంతో నా బెయిలునెలా అడ్డుకుంటారు? నేను భవిష్యత్తులో కూడా ఎంపీగా ఉండొచ్చు. ఆ కారణంతో నాకు బెయిలివ్వకపోవటం సమంజసమా?’’ అని ప్రశ్నించారు. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను, సాక్ష్యాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది గనుక దర్యాప్తును అడ్డుకునే, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశమే లేదని గుర్తు చేశారు. ‘‘ఎంపీగా, రాజకీయ పార్టీకి అధ్యక్షునిగా ఉన్న నన్ను ఉప ఎన్నికల ప్రచార సమయంలో అరెస్టు చేశారు. ఇదే కేసులో నిందితుడు, ప్రభుత్వంలో అత్యంత శక్తివంతుడు అయిన మంత్రి మాత్రం బయటే ఉన్నారు. అలాంటప్పుడు నన్ను అరెస్టు చేయాల్సిన అవసరమే లేదు. 

నన్ను రిమాండ్‌లో కొనసాగించడం పూర్తిగా వివక్షాపూరితం’’ అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో గత జూలై 27న తాను బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా.. తనను అరెస్టు చేసి అప్పటికి 90 రోజులు దాటనందున సీఆర్పీసీ సెక్షన్ 167(2) కింద తమ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని జగన్ చెప్పారు. గడువులోగా సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు వేయకపోతే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునే హక్కు తనకుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘‘కానీ సుప్రీం ఆదేశాలకు సీబీఐ అధికారులు వక్రభాష్యం చెబుతున్నారు. దర్యాప్తును ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పజాలమని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సుప్రీం నిర్దేశించలేదని సీబీఐ డెరైక్టర్, జాయింట్ డెరైక్టర్ ఇటీవల మీడియాకు తెలిపారు. దర్యాప్తు పేరుతో చార్జిషీటు దాఖలును జాప్యం చేసే ప్రయత్నం జరుగుతోంది’’ అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘‘ప్రత్యక్షంగా, పరోక్షంగా నేనెన్నడూ దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. నేను బెదిరించినట్టు ఒక్క సాక్షి కూడా ఆరోపించలేదు. తుది విచారణకు అందుబాటులో ఉంటా. కోర్టు ఎలాంటి షరతులు విధించినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నా. బెయిల్ మంజూరు చేయండి’’ అని కోరారు.

source:sakshi

కుమ్మక్కు కుట్రలు చూడలేకే బయటకొచ్చాను

చంచల్‌గూడ జైల్లో జగన్‌తో ములాఖత్
ప్రజల కోరిక మేరకే వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్టు టీడీపీ ఎమ్మెల్యే వెల్లడి

హైదరాబాద్, న్యూస్‌లైన్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాల కారణంగానే ఆ పార్టీని వీడాల్సి వస్తోందని చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని శుక్రవారం ఆయన పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు చంచల్‌గూడ జైల్లో ప్రత్యేక ములాఖత్ ద్వారా కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. టీడీపీని వదలాడానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు. ‘‘టీడీపీని స్థాపించినప్పటి నుంచి దాదాపు 30 ఏళ్ల పాటు సేవలందించిన నాపై పార్టీలో బురదజల్లే ప్రయత్నం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న చంద్రబాబు శైలిని తప్పుబట్టినందుకు పలమనేరు నియోజకవర్గంలో నాకు వ్యతిరేకంగా మరొకరిని ప్రొత్సహిస్తూ నీచ రాజకీయాలకు తెరతీశారు. నేను మరో పార్టీలో చేరే పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించను కూడా లేదు. పాలక కాంగ్రెస్‌తో కుమ్మక్కై టీడీపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లే నేను వైఎస్సార్‌సీపీలో చేరే పరిస్థితి ఏర్పడింది. నేనెప్పుడూ జగన్‌మోహన్‌రెడ్డిని నేరుగా చూసింది లేదు. ఆయన్ను కలిసింది ఇప్పుడే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతో లాభం చేకూర్చాయి. 

వాటిని మళ్లీ జగన్ నెరవేర్చగలడన్న నమ్మకం నాకుంది’’ అని అమర్‌నాథ్‌రెడ్డి చెప్పారు. పలమనేరు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషుల అభీష్టం మేరకు జగన్‌తో కలిసి పని చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ‘‘టీడీపీ నన్ను సస్పెండ్ చేయడం కాదు, ప్రజలే ఆ పార్టీని ఎప్పుడో డిలీట్ చేశారు (తొలగించారు)’’ అని ఒక ప్రశ్నకు బదులుగా ఆయన చెప్పారు.

ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. శుక్రవారం చంచల్‌గూడ్ జైలులో ఆయన జగన్‌ను కలిశారన్న సమాచారం అందగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్‌వీఎస్‌ఆర్కే ప్రసాద్ మీడియాకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం పంపారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున 92 మంది ఎమ్మెల్యేలుగా గెలవగా, ఇప్పటివరకు 14 మంది పార్టీని వీడారు. ప్రస్తుతం అసెంబ్లీలో టీడీపీ బలం 78కి తగ్గింది. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీని వీడటాన్ని టీడీపీ నేత దాడి వీరభద్రరావు తేలిగ్గా కొట్టిపారేశారు. పార్టీ నుంచి పోయే వారు పోతుంటారు, వచ్చే వారు వస్తుంటారన్నారు. ‘మీ కళ్ల ముందే బయటికి వెళ్లి విమర్శలు చేసిన వారు తిరిగి వచ్చి ఇదే వేదికపై కూర్చొని మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించడం చూస్తున్నారు కదా!’ అని విలేకరులతో ఆయన వ్యాఖ్యానించారు.

రెండున్నర దశాబ్దాలుగా టీడీపీలోనే...

అమరనాథరెడ్డి రెండున్నర దశాబ్దాలుగా టీడీపీలో క్రియాశీలకంగా పని చేశారు. పుంగనూరు నుంచి రెండుసార్లు, పలమనేరు నుంచి ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, చిత్తూరు డీసీసీబీ చైర్మన్‌గా కూడా చేశారు. 2004లో టీడీపీ అధికారం కోల్పోయిన క్లిష్ట సమయంలో జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ఎవరూ సాహసించని సమయంలో వాటిని భుజానికెత్తుకున్నారు. 2009 ఎన్నికల ముందు నుంచి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఆయన్ను అసంతృప్తికి గురిచేశాయి. కాంగ్రెస్ నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బయటికి వచ్చినప్పటి నుంచీ అమర్‌పై బాబు అనుమానం పెంచుకున్నారు. రాప్ట్రపతి ఎన్నికకు టీడీపీ దూరంగా ఉండాలన్న బాబు నిర్ణయం, తెలంగాణపై తేల్చాలని ప్రధానికి లేఖ రాయడంపై అమర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో ఆయన్ను సాగనంపే వ్యూహంతో పలమనేరు బాధ్యతలను మాజీ మంత్రి పట్నం సుబ్బయ్యకు బాబు అప్పగించారు. అమరనాథరెడ్డి కుటుంబం టీడీపీ ఆవిర్భావంనుంచీ అందులోనే కొనసాగింది. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కూడా వెన్నంటే నిలిచింది. 

అలాంటిది.. పార్టీకి ఎంతో సేవ చేసిన తన తండ్రి రామకృష్ణారెడ్డిపైనా బాబు తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని అమర్ జీర్ణించుకోలేకపోయారు. కార్యకర్తలు, నేతలతో ఆత్మీయ సభలు జరిపి, మెజారిటీ అభిప్రాయం మేరకు జగన్ నేతృత్వంలో పని చేయాలని నిర్ణయించుకున్నారు. వారం, పది రోజుల్లో పలమనేరులో భారీ బహిరంగ సభ నిర్వహించి, వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరాలని భావిస్తున్నారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కూడా ములకలచెరువులో బహిరంగ సభ నిర్వహించి, విజయమ్మ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాలని యోచిస్తున్నారు.

22న మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌లోకి షర్మిల పాదయాత్ర


22న మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌లోకి షర్మిల పాదయాత్ర

హైదరాబాద్, న్యూస్‌లైన్: త్వరలో తెలంగాణలో అడుగుపెట్టనున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత నేతల సమావేశం నిర్ణయించింది. ప్రజా సమస్యలను గాలికొదిలేసి కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై సాగిస్తున్న నీచ రాజకీయాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు ఆయన సోదరి షర్మిల.. అక్టోబరు 18న ఇడుపులపాయ నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ పాదయాత్ర తెలంగాణ ప్రాంతంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించేందుకు తెలంగాణ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం భేటీ అయ్యారు. అనంతరం పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్దన్, కె.కె.మహేందర్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాష్‌రావు, జిట్టా బాలకృష్ణారెడ్డి, బాల మణెమ్మ, ఎడ్మ కిష్టారెడ్డిలు విలేకరులతో మాట్లాడారు. షర్మిల పాదయాత్ర ఈ నెల 22న మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలో అడుగుపెట్టనున్న సందర్భంగా తెలంగాణ నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలకనున్నట్లు బాజిరెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి వైఎస్ ఎంతో కృషి చేశారని, తెలంగాణలో ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులున్న విషయాన్ని గుర్తుచేశారు. ‘‘వెనుకబడిన పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసేందుకు వైఎస్ చాలా కృషిచేశారు. 

నాలుగు సాగునీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేసి జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు బాటలు వేశారు. మహానేత ప్రారంభించిన పనులు దాదాపు 90 శాతం పూర్తయినా.. కేవలం 10 శాతం పనులను ఈ అసమర్థ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. పాదయాత్రలో భాగంగా అసంపూర్తిగా మిగిలిన ప్రాజెక్టులను షర్మిల సందర్శిస్తారు’’ అని ఆయన వివరించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆలంపూర్, గద్వాల, మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల మీదుగా సాగుతుందని చెప్పారు. అనంతరం రంగారెడ్డి జిల్లాలో అడుగుపెట్టనుందని తెలిపారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పాదయాత్ర ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయిన వారిలో సీజీసీ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు తెలంగాణకు చెందిన కేంద్ర పాలక మండలి (సీజీసీ), కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ), జిల్లా కన్వీనర్లు, కో-ఆర్డినేటర్లు, ఇతర నేతలు పాల్గొన్నారు.

source:sakshi

నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా..

 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శనివారం కోడుమూరు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పటి వరకు ఐదు నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించారు. 99.40 కిలోమీటర్లు నడిచి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. శనివారం 15 కిలోమీటర్లు నడవనున్నారు. 

శుక్రవారం రాత్రి షర్మిల బస చేసిన గణేష్ రైస్‌మిల్ నుంచి శనివారం ఉదయం పాదయాత్ర ప్రారంభమైంది. ఎమ్మిగనూరు, కలుగట్ల, కె. తిమ్మాపురం, దైవందిన్నె, కంపాడు వరకు పాదయాత్ర సాగుతుందని పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు.

30 రోజుల్లో మొత్తం 388.9 కి.మీలు

'మరో ప్రజాప్రస్థానం'లో శుక్రవారం 30వ రోజు పాదయాత్ర ముగిసింది. నేటి రాత్రికి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివార్లలోని గణేశ్ రైస్‌మిల్‌ వద్ద షర్మిల బస చేస్తారు. శుక్రవారం షర్మిల 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. 30 రోజుల్లో మొత్తం 388.9 కి.మీల దూరం నడిచారు. 
శుక్రవారం ఉదయం హెచ్.మొరవని నుంచి  ప్రారంభమైన షర్మిల పాదయాత్ర నాలుగో మైలు క్రాస్, ఎమ్మిగనూరు మార్కెట్ కమిటీ రోడ్డు, శ్రీనివాస్ సర్కిల్, ట్యాంక్‌బండ్ రోడ్, సోమప్ప సర్కిల్, జామియా మసీదు, ఎంబీ చర్చి, కలుగట్ల రోడ్డు మీదుగా గణేష్ రైస్‌మిల్లు చేరుకుంది. సోమప్ప సర్కిల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. నేటి పాదయాత్రలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు.

నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా..

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శనివారం కోడుమూరు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పటి వరకు ఐదు నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించారు. 99.40 కిలోమీటర్లు నడిచి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. శనివారం 15 కిలోమీటర్లు నడవనున్నారు.

శుక్రవారం రాత్రి షర్మిల బస చేసిన గణేష్ రైస్‌మిల్ నుంచి శనివారం ఉదయం పాదయాత్ర ప్రారంభమైంది. ఎమ్మిగనూరు, కలుగట్ల, కె. తిమ్మాపురం, దైవందిన్నె, కంపాడు వరకు పాదయాత్ర సాగుతుందని పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు.

ముగిసిన 30వ రోజు షర్మిల పాదయాత్ర

Written By news on Friday, November 16, 2012 | 11/16/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల మరో ప్రజాప్రస్థానం 30వ రోజు పాదయాత్ర ముగిసింది. ఈరోజు ఆమె 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఇప్పటి వరకు 388.9 కిలోమీటర్లు నడిచారు. ఈ రాత్రికి ఎమ్మిగనూరు శివారులోని గణేష్ రైస్‌మిల్లులో ఆమె బస చేస్తారు.

'జగన్ పిటిషన్లపై కౌంటర్ దాఖలుచేయాలి'

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్ సభ సభ్యుడు ఎంపి జగన్మోహన రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఈ నెల 21న కౌంటర్ దాఖలు చేయాలని నాంపల్లి కోర్టు సీబీఐని ఆదేశించింది. సాక్షి పెట్టుబడుల వ్యవహారంలో తనకు బెయిలు మంజూరు చేయాలని జగన్ సీబీఐ న్యాయస్థానంలో రెండు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

మరోప్రజాప్రస్థానం 22న తెలంగాణలోకి ప్రవేశం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ 22న మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రారంభమవుతుంది. అలంపూర్ నియోజకవర్గం పుల్లూరులో తెలంగాణలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. పాదయాత్రను విజయవంతం చేసేందుకు మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 14 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను నియామించారు. షర్మిల జిల్లాలోకి ప్రవేశించినప్పుడు లక్షమందితో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

మహబూబ్‌నగర్ తర్వాత రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్ హయాంలో మొదలై, ప్రస్తుతం ఆగిపోయిన ప్రాజెక్టులను షర్మిల సందర్శిస్తారు. మొత్తం ఏడు నియోజకవర్గాల మీదుగా జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుందని తెలంగాణ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్థన్ చెప్పారు.

source:sakshi

రైతన్నను ఏడిపిస్తున్న ప్రభుత్వం: షర్మిల

రాష్ట్రంలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణ ఓర్వలేకే పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని షర్మిల ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహిస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆమె మాట్లాడుతూ ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరని, అలాగే జగన్ ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో ప్రజలు ఎన్నడూ లేని కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.. కాంగ్రెస్ తో కుమ్మక్కైందని విమర్శించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు పింఛన్లు విడుదల చేస్తే, నేడు చేనేత రంగాన్ని ఆదుకునే నాథుడే కరువయ్యాడన్నారు. 

విద్యుత్ బకాయిను నాడు వైఎస్ 1300 కోట్లు మాఫీ చేశారని, కానీ నేడు కరెంటు కష్టాలు నానాటికీ పెరుగుతున్నాయని షర్మిల అన్నారు. రైతులకు విత్తనాలు, సబ్సిడీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, రానున్న కాలంలో జగన్ నేతృత్వంలో ప్రజలు రాజన్న రాజ్యాన్ని తప్పక చూస్తారని షర్మిల పేర్కొన్నారు. ఆమె ప్రసంగానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.

రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ఏ మాత్రం శ్రద్ధ లేదని షర్మిల విమర్శించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శుక్రవారం నిర్వహిస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆమె ప్రసంగిస్తూ రాష్ట్ర పాలక, ప్రతిపక్షాల వైఖరిని తీవ్రంగా ఆక్షేపించారు. రైతులపై మాత్రమే కాకుండా మహిళలు, విద్యార్థుల సమస్యలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్నారు. రైతులు తీవ్ర అప్పుల్లో కూరుకుపోయారని, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆ పరిస్థితి లేదని షర్మిల అన్నారు. నాడు మహిళలకు వైఎస్.. పావలావడ్డీ రుణాలు ఇప్పిస్తే, నేడు కిరణ్ సర్కారు వడ్డీలేని రుణాలు ఇస్తామని ప్రకటించి అమలులో విఫలమవుతోందని దుయ్యబట్టారు.

ధరల పెరుగుదల అరికట్టలేకపోవడంతోపాటు, గ్యాస్ సిలిండర్ల పరమితి విధించడం, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంతో పరిశ్రమలు మూతపడుతున్నాయని, పరిశ్రమలు రోడ్డున పడుతున్నాయన్నారు. వైఎస్ ఉన్నపుడు రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదన్నారు. వైఎస్ దుర్మరణం తట్టుకోలేక చనిపోయినవారిని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందన్నారు. నాడు వారంతా కాంగ్రెస్ కు ఓటేసిన వారే అని, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిర్లక్ష్యం వహించిందని అన్నారు. 

ఎలాంటి సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టినా రాజీవ్, ఇందిర పేర్లతో ప్రారంభించేవారని.. కానీ, వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ తీవ్ర ద్రోహం చేసిందని దుయ్యబట్టారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని, ప్రతి ఇంటి నుంచి పిల్లలు ఉన్నత విద్యావంతులు కావాలని వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రవేశపెడితే నేడు ప్రభుత్వం ఆ పథకాన్ని నానాటికీ మరుగునపరుస్తోందన్నారు. మరోవైపు ప్రతిపక్ష పాత్రను చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు మాట ఇవ్వడం, నిలబెట్టుకోవడం అంటే ఏమిటో తెలియదన్నారు.

source:sakshi

సిబిఐ నత్తనడక

http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=52610&Categoryid=28&subcatid=0

Written by Nagarjuna On 11/16/2012 7:00:00 PM
సిబిఐ తీరుని ఎంతమంది ఎన్నిరకాలుగా విమర్శించినా దానికి చీమకుట్టినట్లు కూడా లేదు. కాంగ్రెస్ కనుసన్నల్లో మెలుగుతూ సిబిఐ విశ్వసనీయత కోల్పోయిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్ సభ సభ్యుడు ఎంపి జగన్మోహన రెడ్డి ఆస్తుల కేసు విషయంలో కోర్టు ఆదేశాలు వెలువడిన 24 గంటల్లోనే ఆగమేఘాలమీద సిబిఐ రంగంలోకి దిగింది. ఇతర రాష్ట్రాల నుంచి 80 బృందాలను రప్పించింది. దర్యాప్తు పూర్తి చేయడంలో మాత్రం సిబిఐ తీవ్ర జాప్యం చేస్తోంది. జగన్ ను అరెస్ట్ చేసి అయిదు నెలలు దాటినా ఇప్పటివరకు ఛార్జిషీట్ దాఖలు చేయలేదు. విచారణ పూర్తి చేయకుండా, ఛార్జిషీట్ దాఖలు చేయకుండా జగన్ బెయిలుకు కూడా అడ్డుపడుతోంది. దర్యాప్తు ప్రారంభించడంలో సిబిఐ చూపిన వేగం, చురుకుదనం పూర్తిచేయడంలో కనిపించడంలేదు.

సాక్షి పెట్టుబడుల వ్యవహారంలో తనకు బెయిలు మంజూరు చేయాలని జగన్ సీబీఐ న్యాయస్థానంలో ఈరోజు రెండు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఆయన తరఫున దాఖలైన ఈ రెండు పిటిషన్లలో ఒకటి చట్టపరమైన(స్టాట్యుటరీ)ది కాగా, రెండవది సాధారణ బెయిల్ పిటిషన్‌. ఈ ఏడాది మే 27న సిబిఐ అధికారులు జగన్ ను అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన 90 రోజుల్లోగా ఛార్జిషీట్ దాఖలు చేయాలి. అయితే సిబిఐ ఇంకా దాఖలు చేయలేదని జగన్‌ తన పిటిషన్ లో పేర్కొన్నారు. 90 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయని పక్షంలో తప్పనిసరిగా బెయిలు మంజూరు చేయాలన్న నిబంధన చట్టంలో ఉంది. దాని ప్రకారం జగన్ కు బెయిలు మంజూరు చేయాలి. ఇదే విషయాన్ని జగన్‌ తన పిటిషన్ లో తెలిపారు. సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 167(2) కింద చట్టపరమైన బెయిల్ పిటిషన్‌ను, సెక్షన్‌ 437 కింద సాధారణ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు.

సాక్షి పెట్టుబడుల కేసుకు సంబంధించిన జగన్ ను మే 27న అరెస్టు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఆ ఎఫ్‌ఐఆర్‌లోని ఆర్‌సీ-19 కింద అరెస్టు చేసి, అదే నేరంలో జగన్ ను రిమాండ్‌కు ఇవ్వాలని కూడా సీబీఐ కోరింది. సీసీ నెంబరు 8 కింద కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు ఆదేశించింది. ఇదే కేసులో జగన్‌ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా దాన్ని సీబీఐ కోర్టు తిరస్కరించింది. దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా తిరస్కరించటంతో జులై 27న ఆయన సుప్రీం కోర్టుకు విన్నవించారు. అప్పటికి చట్టపరమైన బెయిల్ పొందడానికి నిర్దేశించిన 90 రోజుల గడువు పూర్తి కాలేదు. దాంతో సుప్రీంకోర్టు ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఎఫ్‌ఐఆర్‌లోని ఆర్‌సీ-19లో ఇంకా దర్యాప్తు పూర్తి కాకపోవటాన్ని ప్రస్తావిస్తూ, వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశిస్తూ ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.

నిజానికి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు అడిగినపుడు, అప్పటి నుంచి 90 రోజుల్లోగా దర్యాప్తు సంస్థ తన దర్యాప్తును పూర్తిచేయాలి. జగన్ ను సీసీ నెంబరు-8లో తెలిపిన ప్రకారం అరెస్ట్ చేశారు. ఆ కేసులోని ఇతర నేరాలకు సంబంధించి దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదన్న కారణంతో బెయిల్ తిరస్కరించారు. ఆ దర్యాప్తును 90 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సిబిఐ దర్యాప్తు పూర్తి చేయనందున చట్టపరమైన బెయిల్ కోసం పిటిషన్‌ను దాఖలు చేశారు. ఒక కేసులో దర్యాప్తు పూర్తికాని అంశాలకు సంబంధించి చట్టపరమైన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో, సీసీ నెంబరు 8కు సంబంధించి తనను రిమాండ్‌లో ఉంచటంలో అర్థం లేదని పేర్కొంటూ జగన్ తరపున మరో సాధారణ బెయిల్ పిటిషన్‌ను కూడా దాఖలు చేశారు.

దర్యాప్తు పూర్తి కాలేదన్న సాకుతో ఒక వ్యక్తిని సుదీర్ఘకాలం రిమాండ్ లో ఉంచడం భావ్యంకాదన్న భావనతోనే ఈ 90 రోజుల నిబంధనను చట్టంలో పొందుపరిచారు. జగన్ ను అరెస్ట్ చేసి 174 రోజులు గడిచినా దర్యాప్తు పూర్తి కాని పరిస్థితులలో బెయిల్ కు అడ్డుపడటం భావ్యంకాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జన నేత జగన్ కు బెయిల్ రావాలని రాష్ట్రంలోని అత్యధిక మంది జనం కోరుకుంటున్నారు. ఆయన బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ జనంలోకి వస్తారని ఆశిద్దాం.

YSRCP leader Bajireddy goverdhan reddy press meet

YS Sharmila's speech at Yemmiganur in Kurnool

మరో ప్రజా ప్రస్థానానికి నేటికి 30 రోజులు

మరో  ప్రజా ప్రస్థానం మొదలై నేటికి 30 రోజులు. ఈ 30 రోజుల్లో షర్మిల దాదాపు15 బహిరంగ సభల్లో ప్రసంగించారు. అనేక రచ్చబండలు నిర్వహించారు. చెట్ల కింద నుంచోని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వాన, ఎండ, చలిలోనూ పాదయాత్ర ఆపలేదు. జ్వరంలోనూ ముందుకు కదిలారు. కుమ్మక్కు కుట్రలపై విరుచుకుపడ్డారు. నీచ రాజకీయాలను కడిగిపారేశారు. అవిశ్వాసం పెట్టకుండా పాదయాత్ర  డ్రామాలేంటీ అంటూ ప్రశ్నించారు. 30 రోజుల్లో 375.3 కిలో మీటర్లు నడిచారు షర్మిల.
కుమ్మక్కు కుట్రలకు నిరసనగా, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అక్రమంగా అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన మరో ప్రజా ప్రస్థానాన్ని ప్రజలు అక్కున చేర్చుకున్నారు. వైఎస్‌ కుటుంబాన్ని నిలబెట్టుకుంటేనే తమ బతుకులు నిలబడేదంటూ షర్మిల అడుగులో అడుగేశారు. వైఎస్ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర ఆరు రోజుల తర్వాత అనంతపురం జిల్లాలోని  ధర్మవరం నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. అనంతపురం జిల్లాలో 17 రోజుల పాటు సాగిన పాదయాత్ర రాప్తాడు, ఉరవకొండ,  గుంతకల్ నియోజకవర్గాల్లో 195 కిలో మీటర్లు పాటు సాగింది. నవంబర్‌ 8న కర్నూలు జిల్లాలోకి మరో ప్రజా ప్రస్థానం అడుగు పెట్టింది.  మద్దెకెర నుంచి  కర్నూలు జిల్లాలో ప్రారంభమైన షర్మిల పాదయాత్ర పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయంల మీదుగా  ముందుకు కదులుతోంది. ఈ 30 రోజుల పాదయాత్రలో షర్మిల అనేక సమస్యలను తెలుసుకున్నారు . రైతులకు ధైర్యం చెప్పారు. తెలంగాణలో కూడా మరో  ప్రజా ప్రస్థానానికి అదిరిపోయే స్పందన వస్తుందని నేతలు ఆ ప్రాంత నేతలు చెప్పారు. 28వ రోజు పాదయాత్రలో పాల్గొన్న తెలంగాణ ప్రాంత వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు  వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి పాలన కోసం ఆ  ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.



source:sakshitv

చేనేతపురి.. అభిమాన ఒడి

 నమ్ముకున్న క్యాడర్, నమ్మకం ఉంచిన ప్రజల కోసం ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా వెనుదిరగని వైఎస్ కుటుంబానికి ఎమ్మిగనూరు ప్రజలు కొండంత అండగా నిలుస్తున్నారు. చేనేతలు అధికంగా ఉండే ఈ ప్రాంతంతో మూడు దశాబ్దాలుగా రాజకీయ బంధం పెనవేసుకున్న వైఎస్ కుటుంబంపై ప్రజలు అభిమానం చూపుతున్నారు. గతంలో మహానేత వైఎస్‌ఆర్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ విజయమ్మ వచ్చిన సమయంలో ఈ ప్రాంత ప్రజలు నీరాజనాలు పలికారు. 2012 ఎమ్మిగనూరు ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి మరో సారి వైఎస్‌ఆర్‌పై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పారు. 

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు కుమ్మక్కై ప్రజల విశ్వాసాన్ని ఒమ్ము చేసి.. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న తరుణంలో జనం కోసం మహానేత కుమార్తె షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ శుక్రవారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సోమప్ప సర్కిల్‌లో జరిగే బహిరంగ సభలో ఆమె ప్రసంగించనున్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రసంగించి అభిమానుల్లో ఉత్తేజం నింపిన సోమప్ప సర్కిల్‌లోనే షర్మిల ప్రసంగిస్తుండటం సర్వత్రా ఆసక్తిని పెంచుతున్న అంశం. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల ప్రజలు షర్మిల బహిరంగ సభ కోసం ఎదురు చూస్తున్నారు. ‘వై’ అంటే ఎమ్మిగనూరు.. ‘ఎస్’ సోమప్ప సర్కిల్ అనే నానుడికి సరిపోలే విధంగా వైఎస్ కుటుంబం రాజకీయ ప్రసంగాల వేదికగా సోమప్ప సర్కిల్ మారింది.

1980వ సంవత్సరం మాజీ ఎమ్మెల్యే కేఆర్ హనుమంతరెడ్డి చిన్న కుమారుడు వివాహం సందర్భంగా అప్పటి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డి, కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి సారిగా ఎమ్మిగనూరుకు వచ్చారు.
2000 మే 30న వగరూరులో దాడులకు గురైన కాంగ్రెస్ కార్యకర్తలను ఓదార్చేందుకు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎమ్మిగనూరుకు వచ్చి సోమప్ప సర్కిల్‌లో దీక్షా శిబిరం వద్ద ప్రసంగించారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన అనంతరం 2004 నవంబర్‌లో బస్సు యాత్ర సందర్భంగా వైఎస్‌ఆర్ ఎమ్మిగనూరుకు వచ్చి ప్రసంగించారు.
2006 జూన్ 3న సూగూరు రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి, 2008 సెప్టెంబర్ 21న పులికనుమ ప్రాజెక్టు శంకుస్థాపనకు వచ్చిన వైఎస్‌ఆర్ ఎమ్మిగనూరు బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ఓదార్పు యాత్రలో భాగంగా 2011 జూలై 31న ఎమ్మిగనూరుకు వచ్చిన జననేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమప్ప సర్కిల్‌లో మొదటి సారిగా ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు.
2012 మే 13న ఉప ఎన్నికలకు ముందుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మిగనూరు పర్యటనకు వచ్చి సోమప్ప సర్కిల్‌లో ప్రసంగించారు. చేనేత సమస్యలు, రైతు సమస్యలను ప్రధానంగా వివరించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు విశదీకరించారు.
2012 జూన్6న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమప్ప సర్కిల్‌లో ఉప ఎన్నికల బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఆ సభలో షర్మిల కూడా పాల్గొన్నారు.
శుక్రవారం సాయంత్రం అదే సర్కిల్‌లో షర్మిల ప్రసంగిస్తుండటం విశేషం.

రాజన్న భరోసా ఏదీ?


పులి కనుమ ప్రాజెక్టు వస్తే ఈ ప్రాంతంలోని 46వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని దివంగత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి భావించారు. అందుకే ఆ ప్రాజెక్టును ప్రారంభించి 75 శాతం పనులు పూర్తి చేశారు. ఆ మహానుభావుడు చనిపోయిన తరువాత మూడేళ్లలో ఈ ప్రభుత్వం 25 శాతం పనులు కూడా పూర్తిచేయలేదు. రాజన్న బతికుంటే మీకీ కష్టం వచ్చేదా?
- పెద్దకడబూరు బహిరంగ సభలో షర్మిల 

కర్నూలు, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘మరో ప్రజాప్రస్థానం’లో భాగంగా 29వ రోజు షర్మిల పెద్దకడబూరు మండలంలో 14.6 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించారు. పులి క నుమ ప్రాజెక్టుతో పాటు జిల్లాలో ఏ ప్రాజెక్టును కూడా తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గానీ, వైఎస్ తరువాత అధికారాన్ని అనుభవిస్తున్న సీఎంలు గానీ పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. 50వేల ఎకరాలకు సాగునీరు అందించే గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పనులకు రెండుసార్లు శిలాఫలకాలు వేసి చ ంద్రబాబు మరిచిపోతే వై.ఎస్. 

అధికారంలోకి వచ్చి పూర్తిచేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం సబ్‌స్టేషన్ పనులే ఆగిపోయాయని, అవి కూడా పూర్తయితే రైతులకు ఎంతో మేలు జరిగేదన్నారు. ఎల్‌ఎల్‌సీ కాలువను ఆధునికీకరించి తుంగభద్ర నుంచి నీరు కూడా తెప్పించుకోలేని అధ్వానపు ప్రభుత్వం ఇప్పుడు పాలన సాగిస్తోందని ఆమె వివరించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి రైతన్న ఏడుస్తున్నాడని, రైతు కడుపు కొడుతున్న ఈ ప్రభుత్వం 


ఎంతోకాలం కొనసాగదని షర్మిల అన్నారు. పాదయాత్రలో దారి వెంట వస్తుంటే రైతులు సాగునీటితో పాటు తాగునీరు లేక పడుతున్న బాధలు చెపుతుంటే కడుపు తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నన్ని రోజులు రాజులా బతికిన రైతు రోడ్డున పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాజన్నకు రైతంటే చాలా ఇష్టం. రైతుకు ఎంత చేసినా తక్కువే అని భావించేవారు. అందుకే ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైలు మీద సంతకం చేశారు. రూ. 12వేల కోట్ల రుణాలను మాఫీ చేశారు. రోజుకు ఏడుగంటల కరెంటు ఇచ్చారు. రైతుకు ఏ కష్టం లేకుండా చూశారు. కానీ ఈ ప్రభుత్వం రైతన్నల ఉసురు తీస్తోంది’ అని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వాన్ని పైకి తిడుతూ దుష్టపరిపాలన కొనసాగేలా కాపాడుతున్న చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నా ప్రజలు నమ్మరన్నారు. 

అక్కగా... చెల్లిగా... బాధ్యత ఎరిగిన తల్లిలా...
‘మరో ప్రజా ప్రస్థానం’లో భాగంగా అలుపెరగకుండా పాదయాత్ర సాగిస్తున్న షర్మిల దారివెంట గ్రామస్తులను, కూలీలను, విద్యార్థులను కలిసి వారితో ముచ్చటిస్తూ ముందుకు వెళుతున్న తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. అక్కా... అన్నా... అవ్వా.... తమ్ముడూ... అని ఆప్యాయంగా పలుకరిస్తూ వారు ఎదుర్కొంటున్న బాధలను ఓపిగ్గా వింటున్నారు. బడికి వెళ్లే పిల్లలు కలిసినప్పుడు తల్లిలా వారికి భవిష్యత్తు గురించి చెపుతున్నారు. ‘చదువుకోవాలమ్మా... బాగా చదువుకోవాలి. డిగ్రీ కంటే పెద్ద చదువులు చదవాలి. రాజన్న కలలు కన్నట్లు మీరు డాక్టరో, ఇంజినీరో కావాలి’ అని పెద కడుబూరు కస్తూరిబా పాఠశాలలో చదువుతున్న బాలికలకు ఉద్భోదించిన తీరు అమ్మను గుర్తుకు తెచ్చింది. 

ఫీజులు కట్టలేకనే, పిల్లలు సైతం పనికి వెళ్లకపోతే పూట గడవదనో చదువు మాన్పించిన తల్లులను కలిసినప్పుడు ‘ ఒక్క ఏడాది ఎలాగోలా చదివించండక్కా! తరువాత జగనన్న సీఎం అవుతారు. పిల్లలందరికీ చదువు ఫ్రీగా చెప్పిస్తాడు. వారిని స్కూలుకు పంపించినందుకు మీ అకౌంట్‌లో డబ్బులు కూడా వేస్తాడు’ అని ధైర్యం చెప్పి చదువు అవసరాన్ని పెద్ద కూతురులా తల్లులకు వివరిస్తున్నారు. రైతులు, కూలీలను ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు సాగుతున్నారు. 

భారీగా తరలివస్తున్న జనం
షర్మిల సాగిస్తున్న పాదయాత్రకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గురువారం పెద కడుబూరు మండలంలో సాగిన పాదయాత్రకు జీపులు, ఆటోలు, లారీల్లో భారీగా జనం తరలివచ్చారు. పెద కడుబూరు మండల కేంద్రంలో సాగిన బహిరంగసభను అదుపు చేయడం పోలీసులకు కష్టసాధ్యమైంది. మూడు రోడ్ల కూడలిలో ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి, నరవ రమాకాంత్ రెడ్డి విడివిడిగా ఏర్పాటు చేసిన రెండు వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించి అక్కడే బహిరంగసభలో మాట్లాడ గా, కిక్కిరిసిన జనంతో నిలబడడం కూడా కష్టంగా మారింది. పాదయాత్ర వెంట కూడా వేలాదిగా జనం తరలివచ్చారు. దాంతో దుమ్ము లేచి దారి పొడువునా పొగలా కమ్ముకుంది. 

పాదయాత్రలో ఉన్న ఇతర నాయకులు, ప్రజలు దుమ్ముకు భయపడి ముక్కులకు చేతిరుమాళ్లు అడ్డు పెట్టుకుంటే షర్మిల మాత్రం ఇబ్బందిగా ఉన్నా అలాగే పాదయాత్ర కొనసాగించారు. బుధవారం రాత్రి వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ షర్మిలతో పాటే బస చేసి గురువారం కూడా జిల్లాలోనే ఉన్నారు. గురువారం నాటి పాదయాత్రకు ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి(రాయచోటి), పి. రామకృష్ణారెడ్డి(మాచర్ల)లతో పార్టీ శాసనసభా పక్షం ఉపనేత శోభా నాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాల నాగిరెడ్డి, పార్టీ సీజీసీ సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరిత, సాయి ప్రసాద్ రెడ్డి, ఇతర నేతలు వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ మధుసూదన్, రమాదేవి, ఎం.ఎల్. కాంతారెడ్డి, నిడ్జూరి రాంభూపాల్ రెడ్డి, వై. సీతారామ రెడ్డి, దేశాయి కృష్ణ, అత్రి గౌడ్, మహేందర్ రెడ్డి, విరూపాక్షప్ప పాల్గొన్నారు.

హాస్టల్ విద్యార్థుల వెతలపై షర్మిల ఆవేదన

జైల్లో ఖైదీలకు కూడా రోజుకు రూ. 45 ఇస్తున్నారు
హాస్టల్‌లో ఏడాదికి 216 సిలిండర్లు వినియోగమవుతాయి
అందులో 6 మాత్రమే సబ్సిడీ మీద ఇస్తారట..
మిగతావన్నీ రూ.1,250 పెట్టి కొనుక్కోవాలట..
గ్యాస్ మీద భారం మోపి పిల్లల కడుపు కొడుతోందీ ప్రభుత్వం
సీఎం ఇంటికి ఎన్ని సిలిండర్లు వెళుతున్నాయో లెక్క తీయాలి
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 29, కిలోమీటర్లు: 375.90

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘హాస్టల్లో నెలకు 18 చొప్పున ఏడాదికి 216 సిలిండర్లు దాకా వాడాల్సిన అవసరముంటే.. వాటిలో ఆరు మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ మీద ఇస్తుందట. మిగిలినవి ఒక్కో సిలిండరూ రూ.1,250 పెట్టి కొనుక్కోవాలట. గ్యాస్ మీద భారం మోపి ఈ ప్రభుత్వం పిల్లల కడుపుమీద కొడుతోంది. అసలే పిల్లలకు రోజుకు రూ.17 మాత్రమే భోజనానికి వెచ్చిస్తుంటే.. ఇప్పుడు గ్యాస్ పేరుతో ఆ భోజనంలో కూడా కోత పెట్టే పరిస్థితి. రూ. 17తో అసలు పిల్లలకు రెండు పూటలా భోజనం ఎలా సరిపోతుంది? జైల్లో ఖైదీలకు కూడా రూ. 45 వెచ్చిస్తుంటే.. పిల్లలకు రూ. 17 మాత్రమేనా? ఇది అన్యాయం కాదా? అసలు కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంటికి ఎన్ని సిలిండర్లు వెళుతున్నాయో కనుక్కోవాలి..’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల మండిపడ్డారు. ప్రజల శ్రేయస్సును గాలికి వదిలేసి కుమ్మక్కైన కాంగ్రెస్, టీడీపీల కుట్ర రాజకీయాలకు నిరసనగా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆమె చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ 29వ రోజు గురువారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో సాగింది. 

పెద్దకడబూరు దాటాక క స్తూర్బా బాలికల విద్యాలయంలో షర్మిల విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కరెంటు ఉండడం లేదని, కాంపౌండ్ వాల్ లేదని, ప్లేగ్రౌండ్ లేదని, గ్యాస్ ధర పెరిగిందంటూ మెనూలో కోతపెడుతున్నారంటూ విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన షర్మిల గ్యాస్ పేరుతో పిల్లల పొట్ట మీద కొట్టడం అమానవీయమని అన్నారు. పాలు, గుడ్లు, అల్పాహారం అందుతున్నాయా? అని అడగడంతో పాలు ఇవ్వరని, గుడ్లు వారానికి మూడు ఇస్తారని విద్యార్థినులు తెలిపారు. పదో తరగతితో ఆపకుండా పెద్ద చదువులు చదవాలని, జగనన్న సీఎం అయ్యాక ఎంత పెద్ద చదువైనా ఉచితంగా చదివిస్తాడని షర్మిల వారికి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కలెక్టర్‌తో మాట్లాడి క్రీడామైదానం వచ్చేలా చూస్తారని షర్మిల హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌కు టీడీపీ మిత్రపక్షం: టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా కాకుండా కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా వ్యవహరిస్తోందని షర్మిల దుయ్యబట్టారు. మధ్యాహ్నం మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్దకడబూరులో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ‘చంద్రబాబు పాదయాత్ర అంటూ కొత్త డ్రామా ఆడుతున్నారు. గ్రామాలను శ్మశానాలుగా మార్చి మళ్లీ అక్కడికే వెళ్లి నాకో అవకాశం ఇవ్వాలంటూ మొసలికన్నీళ్లు కార్చుతున్నారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని కూల్చకుండా నిలబెడుతున్నారు. ఇప్పుడాయన ప్రతిపక్షం కాదు. టీడీపీ కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా మారింది. రెండూ కలిసి ఒక్కటై నీచమైన రాజకీయాలకు దిగాయి. అధికారం ఉందని సీబీఐని వాడుకుని జగనన్నను జైలుకు పంపాయి. జగనన్న బయట ఉంటే ఆ రెండు పార్టీలకు మనుగడ ఉండదని ఈ కుట్రపన్నాయి..’ అని ధ్వజమెత్తారు.

జనమే జనం: 29వ రోజు గురువారం యాత్రలో ఉదయం రంగాపురం శివారులో బయలుదేరిన షర్మిలకు మంత్రాలయం నియోజకవర్గ ప్రజానీకం అడుగడుగునా బ్రహ్మరథం పట్టింది. మధ్యాహ్నం పెద్దకడబూరు చేరేవరకు వేలాది మంది జనం షర్మిలతోపాటు కాలు కలిపి కదం తొక్కారు. యాత్ర సాగిన దారంతా మట్టిరోడ్డు కావడం, షర్మిల వెంట వేలాది మంది కదలి రావడంతో రోడ్డంతా తీవ్రమైన దుమ్ము, ధూళి రేగింది. మధ్యాహ్నం జరిగిన బహిరంగ సభ జనంతో కిక్కిరిసిపోయింది. తరువాత దొడ్డిమేకల మీదుగా రాత్రి హెచ్.మోరవాణి సమీపంలో ఏర్పాటుచేసిన రాత్రి బసకు 7.50కి షర్మిల చేరుకున్నారు. గురువారం 14.6 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ఇప్పటివరకు మొత్తం 375.90 కి.మీ. పాదయాత్ర పూర్తయింది.

రాజన్న ఉన్నప్పుడు రూ.120.. ఇప్పుడు 30

షర్మిల గురువారం సాయంత్రం దొడ్డిమేకల ప్రాథమిక పాఠశాల ఆవరణలో గ్రామస్తులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు. వారంతా తమకు కరువు పనికింద రూ. 30 మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వారి కష్టాలు విన్న షర్మిల.. ఇది శ్రమదోపిడీ అని, రాబందుల రాజ్యమని, ఈ ప్రభుత్వం మహిళలను హింసిస్తోందని మండిపడ్డారు. వారితో సంభాషణ ఇలా సాగింది..

షర్మిల: కరువు పని దొరుకుతోందా?

మహిళలు: కొద్దిరోజులే దొరుకుతుంది. దొరికినా రూ. 30 మాత్రమేకూలి ఇస్తున్నారు. పనులు లేక వలసలు పోవాల్సి వస్తోంది.

షర్మిల: రాజన్న ఉన్నప్పుడు రూ. 120 వరకూ వచ్చేది. ఇప్పుడు రూ. 30 మాత్రమే ఇస్తున్నారు. దీన్నే శ్రమదోపిడీ అంటారు. రాబందుల రాజ్యం ఇది. మహిళలను హింసిస్తోంది ఈ ప్రభుత్వం. కరువు పనులు ఇవ్వరు. రుణాలు ఇవ్వరు. పైగా వడ్డీ లేని రుణాలంటారు. 

మహిళలు: మాకు పావలా వడ్డీ కింద రుణాలు రావడం తక్కువే. వచ్చినా మేం కట్టేది రూ.2 వడ్డీ పడుతోంది. బయట తెచ్చుకోవాలంటే రూ.5 వడ్డీ పడుతోంది.

మరో మహిళ: నా భర్త కరెంట్ షాక్‌తో చనిపోయి ఆరు నెలలైంది. ప్రమాదవశాత్తూ చనిపోతే రూ. 50 వేలు వస్తాయన్నారు. అవి రావడానికి రూ.10 వేల వరకు ఖర్చు చేసినా ఇంతవరకు ఆ డబ్బులే రాలేదు. వితంతు పెన్షన్ కూడా రావడం లేదు.

షర్మిల: బాధపడకమ్మా.. జగనన్న సీఎం అయ్యాక వృద్ధులు, వితంతువులకు రూ. 700, వికలాంగులకు రూ. 1,000 పెన్షన్ ఇస్తాడు. పిల్లలను చదివిస్తే పదో తరగతి వరకు రూ.500, ఇంటర్ అయితే రూ. 700, డిగ్రీ అయితే రూ. 1,000 చొప్పున తల్లి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. పిల్లలను చదివించడం మాత్రం ఆపొద్దు. మీ కుటుంబాలు బాగుపడాలంటే పిల్లలను చదివించాలి.

మహిళలు: ఈ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం సరిగ్గా ఉండడం లేదు. పురుగులు వస్తున్నాయి. దాదాపు 200 మంది పిల్లలు వేరే ఊళ్లకు వెళ్లి చదువుకుంటున్నారు. వారికి బస్సులు లేవు. 

షర్మిల: ఎమ్మెల్యే ఈ విషయం మాట్లాడి భోజనం సరిగ్గా ఉండేలా చూస్తారు. బస్సుల గురించి ఎమ్మెల్యే ఇప్పటికే మాట్లాడారట. కానీ ఈ సర్కారు సామాన్యుడి సంగతి పట్టించుకునే పరిస్థితి లేదు. కరెంటు పరిస్థితి ఎలా ఉంది?

మహిళ: బిల్లులెక్కువ. కరెంటు తక్కువ.
షర్మిల: ఎంతొస్తుంది బిల్లు.. కరెంటు ఎంతసేపు వస్తోంది?
మహిళ: బిల్లు రూ. 200 వస్తుంది. కరెంటు మాత్రం నాలుగు గంటలు కూడా ఉండదు.
షర్మిల: పంటల పరిస్థితి ఏంటి?
మహిళ: మీ నాయన ఉన్నప్పుడు వానలు బాగా పడేవి. పంటలు బాగా పండేవి. ఇప్పుడు పంటలు లేవు. తినడానికి తిండి లేదు. వానలు లేక బుడ్లు(వేరుశనగ) ఎండిపోయాయి. పత్తి ఎండిపోయింది.
షర్మిల: రాజు మంచోడైతే దేవుడు కూడా దీవిస్తాడు. వర్షాలు కూడా బాగా పడతాయి.

వైఎస్సార్ సీపీలోకి చలమలశెట్టి సునీల్


గత ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ గురువారం వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. పాదయాత్ర సాగుతున్న కర్నూలు జిల్లాలోని పెద్దకడబూరు మండల కేంద్రానికి మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో వచ్చిన ఆయన్ను పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు గుంటూరు జిల్లాకు చెందిన ఐటీ శాఖ మాజీ కమిషనర్ పార్థసారథి పార్టీలో చేరారు. అలాగే తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా మాజీ కోశాధికారి సోమిశెట్టి శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. ఆయన రెండు నెలల క్రితమే తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి, జిల్లా కోశాధికారి పదవికి రాజీనామా చేశారు. టీడీపీ నాయకుల తీరు నచ్చకనే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు పార్టీలో చేరిన సందర్భంగా ప్రకటించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు ఈయన సోదరుడు.

షర్మిలకు ఎమ్మెల్యేల సంఘీభావం

కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిలకు ఇతర జిల్లాల ప్రజాప్రతినిధులు వచ్చి మద్దతు ప్రకటిస్తున్నారు. ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి(రాయచోటి), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(మాచర్ల) జిల్లాలోని పెద్దకడబూరు మండలంలో షర్మిలతో కలిసి యాత్రలో పాల్గొన్నారు. వారితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి(ఆళ్లగడ్డ), వై. బాల నాగిరెడ్డి(మంత్రాలయం), పార్టీ సీజీసీ సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, వై. సాయిప్రసాద్ రెడ్డి, పార్టీ నేతలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి తదితరులు పాల్గొన్నారు.

source:sakshi

అవిశ్వాసం మేమే పెడతాం .మీరు మద్దతిస్తారా?

టీడీపీని నిలదీసిన వైఎస్సార్ సీపీ నేత మైసూరా
ప్రజల పట్ల విశ్వసనీయత ఉంటే చంద్రబాబే అవిశ్వాసం పెట్టాలి
కానీ ఆ పని చేయకుండా ఆయన వీధులకెక్కి విమర్శలు చేస్తున్నారు
అవిశ్వాసం పెడితే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది
దీంతో ప్రజా సమస్యలు కొద్దిగానైనా పరిష్కారమయ్యే అవకాశముంది

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘ప్రభుత్వ వైఫల్యం కారణంగా రాష్ట్రంలో ప్రజలు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. సంక్షేమం పడకేసి పరిపాలన అస్తవ్యస్తమై ప్రజా జీవనం పూర్తిగా స్తంభించింది. ప్రజా శ్రేయస్సు కోరే ఏ రాజకీయ పార్టీకైనా శాసనసభ వేదికగా అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి ఇంతకన్నా అనువైన సమయం మరొకటి ఉండదు. ప్రజల పట్ల విశ్వసనీయత ఉంటే గుర్తింపు కలిగిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా టీడీపీ అధినేత చంద్రబాబు అవిశ్వాసం పెట్టాలి. అలా చేస్తే ప్రజాపక్షంగా మేం మద్దతిస్తాం. లేదంటే ప్రజల పక్షాన నిలిచేందుకు మేమే అవిశ్వాసం ప్రవేశం పెడతాం. మీరు మద్దతిస్తారా?’’ అని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. సీజీసీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వివరించారు. 

‘‘విద్యుత్ కోతల కారణంగా పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. కార్మికులు రోడ్డున పడుతున్నారు. అలాగే రైతుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. మరోవైపు అసలు చార్జీలకంటే సర్దుబాటు చార్జీల పేరిట రెండింతలు అదనంగా విధిస్తున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. ఇలా అన్ని విధాలుగా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. పరిపాలన చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి, మంత్రులకు లేదు. నిత్యం ఒకరికొకరు సయోధ్య కుదుర్చుకునేందుకు ఢిల్లీకి పరుగెత్తడానికే వారికి సమయం సరిపోదు’’ అని విమర్శించారు.

టీడీపీకీ అంతే బాధ్యత ఉంది..

ప్రజాశ్రేయస్సు పట్ల ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో అదే విధంగా ప్రధాన ప్రతిపక్షానికి అంతే బాధ్యత ఉంటుందని మైసూరా పేర్కొన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం చేతిలో అవిశ్వాసం అనేది ఒక ఆయుధం లాంటిదని వివరించారు. ‘‘అవిశ్వాసం ప్రవేశపెట్టడం ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవచ్చు. సభలో ప్రతి అంశంపై చర్చ జరుగుతుంది. వీటికి ముఖ్యమంత్రి, మంత్రులు కచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దీంతో ప్రజాసమస్యలు కొద్దిగానైనా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది’’ అని అన్నారు. అయితే ప్రతిపక్షనేత చంద్రబాబు మాత్రం ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని వీధుల్లో విమర్శలు చేస్తున్నారే తప్ప చేతిలో ఉన్న ఆయుధాన్ని ఉపయోగించడంలేదని విమర్శించారు. అదేమని నిలదీస్తే కుంటిసాకులు లేవనెత్తుతున్నారని దెప్పిపొడిచారు. అవిశ్వాసం ప్రవేశపెడితే ఎవరు బేరసారాలు కుదుర్చుకున్నారో తేలిపోతుంది కదా? అని చంద్రబాబును నిలదీశారు. లేకపోతే ఆయనే బేరసారాలు కుదుర్చుకోవడం వల్ల అవిశ్వాసం పెట్టడంలేదా? అని అనుమానం వ్యక్తం చేశారు.

సాంకేతిక అర్హత మీకే ఉంది..

ప్రజల పాలిట శాపంగా మారిన ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టే అర్హత వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఉండుంటే ఈపాటికి ఎప్పుడో చేసేవారమని మైసూరా స్పష్టం చేశారు. శాసనసభ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసే అర్హత సాంకేతికంగా టీడీపీకి మాత్రమే ఉందన్నారు. సభలో ఇప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు గుర్తింపులేదని తెలిపారు. ‘‘అవిశ్వాసం నోటీసులు ఇవ్వడానికి ఒక్క ఎమ్మెల్యే ఉన్నా సరిపోతుంది. కానీ అది చర్చకు రావాలంటే కనీసం 30 మంది సభ్యులు ఉండాలి. చర్చకు రాకుండా అవిశ్వాసం నోటీసులు ఇస్తే అది వృథా ప్రయాసే అవుతుంది. కనుక ప్రజాపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ నోటీసులు ఇవ్వడానికి సిద్ధం. దానికి మీరు మద్దతిస్తారా?’’ అని చంద్రబాబును నిలదీశారు.

ఆరు నెలల తర్వాత మా సత్తా చూస్తారు..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీకి సిద్ధంగా ఉందని మైసూరా తేల్చి చెప్పారు. తాము ఎవరి దగ్గరికీ వెళ్లాల్సిన పరిస్థితి లేదని, కాంగ్రెస్సే మా దగ్గరికి వచ్చేరోజు వస్తుందని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. రేపటి రోజున కేంద్రంలో కాంగ్రెస్‌కు 60కి మించి పార్లమెంటు స్థానాలు వచ్చే పరిస్థితి లేదన్నారు. మరో 6 నెలలు గడిస్తే మా సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ 25 నుంచి 30 దాకా పార్లమెంటు స్థానాలు దక్కించుకొని నంబర్ 2 స్థానంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అదే విధంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రధాన మంత్రులు అయ్యే అవకాశముందని అభిప్రాయపడ్డారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మాత్రమే స్నేహితుడు కాదని, దేశంలోని చాలా మంది నాయకులు మిత్రులుగా ఉన్నారని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. స్నేహం వేరు, రాజకీయాలు వేరని, అసదుద్దీన్ ఏవిధంగా మాట్లాడారో తనకు తెలియదని, మద్దతు ప్రతిపాదనలు వచ్చినప్పుడు ఆలోచన చేస్తామన్నారు.

source:sakshi

నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా..

వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం మంత్రాలయం నుంచి ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. హెచ్. మొరవణి నుంచి ఉదయం ప్రారంభమయ్యే షర్మిల యాత్ర నాలుగో మైలు క్రాస్, ఎమ్మిగనూరు మార్కెట్ కమిటీ రోడ్డు, శ్రీనివాస్ సర్కిల్, ట్యాంక్‌బండ్ రోడ్, సోమప్ప సర్కిల్, జామియా మసీదు, ఎంబీ చర్చి, కలుగట్ల రోడ్డు మీదుగా గణేష్ రైస్‌మిల్లు చేరుకుంటుంది. సోమప్ప సర్కిల్‌లో బహిరంగ సభ ఉంటుందని, రాత్రి బస గణేష్ రైస్ మిల్లు వద్దనేనని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, జిల్లా పార్టీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు.

దొడ్డిమేకలలో షర్మిల రచ్చబండ

Written By news on Thursday, November 15, 2012 | 11/15/2012

 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా దొడ్డిమేకల గ్రామంలో షర్మిల రచ్చబండ నిర్వహించారు. గ్రామస్థులు తమ గోడుకు షర్మిలకు చెప్పుకున్నారు. వర్షాలు, విద్యుత్ లేక పంటలు ఎండిపోయాయని తెలిపారు. సమయానికి బస్సులు రావడం లేదన్నారు. వైఎస్సార్ హయాంలో ఉపాధి కూలి రూ.120 వస్తే.. ఇప్పుడు రూ.30 కూడా రావడం లేదని వాపోయారు. పింఛన్ల విషయంలో ఈ ప్రభుత్వం చంద్రబాబును ఆదర్శంగా తీసుకుందని షర్మిల దుయ్యబట్టారు. వైఎస్‌ఆర్‌ హయాంలో విత్తనాలు, ఎరువుల ధరలు పెరగలేదని గుర్తు చేశారు. రాజన్నరాజ్యం మళ్లీ వస్తుందని, మీ సమస్యలన్ని తీరుతాయని వారికి షర్మిల భరోసా ఇచ్చారు.

అవిశ్వాసానికిదే సమయం: మైసూరారెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలో ఉందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి చంద్రబాబు వెనుకాడుతున్నారని బాజిరెడ్డి బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తి ఎదుగుతోందని బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. గురువారమిక్కడ జరిగిన వైఎస్ఆర్ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో జిట్టా బాలకిష్టారెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, బాలమణెమ్మలతో కలిసి వీరు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరగనున్న షర్మిల పాదయాత్రపై చర్చించారు. తెలంగాణ తెస్తానని ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని జిట్టా బాలకిష్టారెడ్డి, ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి ఇదే అనువైన సమయమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రజా జీవనం స్తంభించిందని, పరిపాలన అస్తవ్యస్థంగా మారిందన్నారు. బాధ్యత గల ప్రతిపక్షమైతే టీడీపీ వెంటనే అవిశ్వాసం పెట్టాలన్నారు. టీడీపీ అవిశ్వాసం పెడితే వైఎస్‌ఆర్‌ సీపీ మద్దతిస్తుందని స్పష్టం చేశారు.

వైఎస్సార్ పార్టీలో చేరిన చలమలశెట్టి

తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పీఆర్పీ మాజీ నేత చలమలశెట్టి సునీల్‌, గుంటూరుకు చెందిన ఇన్‌కంట్యాక్స్‌ మాజీ కమిషనర్‌ సీఎస్‌ పార్థసారథి గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్నూలు జిల్లా చిన్నకడబూరులో వైఎస్‌ విజయమ్మ, షర్మిల సమక్షంలో వారు పార్టీలో చేరారు.

source:sakshi

Mysura Reddy press meet at YSRCP office 15th Nov

Sharmila's speech at Pedakurapadu in Kurnool

వైఎస్సార్ పార్టీలోకి విక్రాంత్‌రెడ్డి

తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి విక్రాంత్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ నెల 21న వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ఆయన ప్రకటించారు. 




కర్నూలు: అధికార పార్టీ, ప్రతిపక్షాల కుట్ర వల్లే జగన్‌ జైల్లో ఉన్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. షర్మిల పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోందని ఆయన తెలిపారు. కర్నూలు భాగ్యనగర్‌లో వైఎస్‌ఆర్‌ సీపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలను వైఎస్‌ఆర్‌ సీపీ కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Sharmila padayatra reached chinnakadaburu at Kurnool

Kurnool nelapai Maro Prajaprasthanam 13th Nov 2012

రామోజీ ఫిలింసిటీ అసైన్డ్ భూముల్లో ఇందిరమ్మ ఇళ్లకు గ్రహణం

* రామోజీ ఫిలింసిటీ అసైన్డ్ భూముల్లో ఇందిరమ్మ ఇళ్లకు గ్రహణం 
* 2007 సంవత్సరంలో 14.30 ఎకరాల్లో 585 మంది పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు
* వైఎస్ హయాంలోనే సర్టిఫికెట్ల పంపిణీ
* లబ్ధిదారులను అడ్డుకున్న ఫిలింసిటీ సిబ్బంది
* పేదలకు అనుకూలంగా తీర్పునిచ్చిన లోకాయుక్త
* గత ఏడాది 162 ఇళ్లకు శంకుస్థాపన చేసిన సర్కారు
* ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకుంటున్న బడాబాబులు.. విద్యుత్, నీటి సౌకర్యానికి బ్రేకులు... పట్టించుకోని అధికారులు
* గూడు కోసం ప్రాణత్యాగానికీ సిద్ధమంటున్న లబ్ధిదారులు

రామోజీ ఫిలింసిటీలోని అసైన్డ్ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న వైఎస్ సర్కారు నిర్ణయానికి కొందరు పెద్దలు మోకాలడ్డుతున్నారు. సర్కారు స్థలం కేటాయించినా, ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసినా.. విద్యుత్, నీటి సరఫరాకు బ్రేకులు వేశారు. అధికారులు కూడా వారికి వంత పాడుతుండటంతో ఏళ్లు గడిచినా పేదల ఇళ్లు మోక్షానికి నోచుకోవడంలేదు. దీంతో ఇళ్లకోసం తాము ప్రాణత్యాగానికైనా వెనుకాడబోమని బాధితులు హెచ్చరిస్తున్నారు.
ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి), న్యూస్‌లైన్: వేల ఎకరాల్లో రాజభవనాలు నిర్మించుకున్న బడాబాబులు పేదల సొంతింటి కలకు మాత్రం మోకాలడ్డుతున్నారు. తమ పలుకుబడితో తెర వెనుక కుయుక్తులు నడుపుతూ పేదల బతుకులతో ఆడుకుంటున్నారు. ఆ కుట్రలకు అధికారులు కూడా వంతపాడుతూ రామోజీ ఫిలిం సిటీలో పేదల ఇళ్ల నిర్మాణానికి గ్రహణం పట్టించారు. ఏళ్లు గడుస్తున్నా తమ కలలు సాకారం కాకపోవడంతో ఆ పేదలు లబోదిబోమంటున్నారు. 

ఇళ్లు కట్టించి ఇవ్వకపోతే ప్రాణత్యాగానికైనా వెనుకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో సర్వే నంబర్లు 189, 189/1, 203ల్లో ప్రభుత్వ అసైన్డ్ భూములు 33.20 ఎకరాలుండగా, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2007లో అందులో 14.30 ఎకరాల్లో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. మండల పరిధిలోని రాయపోల్, నాగన్‌పల్లి, పోల్కంపల్లి, ముకునూరు తదితర గ్రామాలకు చెందిన 585 మంది పేదలకు ఫిలింసిటీలో ఇళ్ల స్థలాల సర్టిఫికెట్లను అందజేశారు. అంతేకాకుండా ప్రభుత్వమే లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కూడా అప్పట్లోనే నిర్ణయించారు. అయితే ఆ ఇళ్ల స్థలాల వద్దకు లబ్ధిదారులు రాకుండా ఫిలింసిటీ సిబ్బంది కట్టడి చేశారు. ఈ అన్యాయంపై గతంలో సాక్షి దినపత్రికలో కథనం రావడంతో లోకాయుక్త స్పందించి సుమోటోగా కేసు నమోదు చేసింది. విచారణ అనంతరం లోకాయుక్త తీర్పు కూడా పేదలకే అనుకూలంగా వచ్చింది. 

ఆ తర్వాత అనేక అడ్డంకులు, ఆందోళనల మధ్య గతేడాది (2011) జనవరి మొదటి వారంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 162 మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని హౌసింగ్ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా గతేడాది ఫిబ్రవరి ఒకటిన ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. ఇళ్ల నిర్మాణం కోసం అక్కడ బోరుతోపాటు కరెంటు సౌకర్యం కల్పిస్తామని అధికారులు అప్పట్లో ప్రకటించారు. దీంతో లబ్ధిదారులు తమకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి పూజలు కూడా జరిపారు. ఆ తర్వాత తెరవెనుక నుంచి కొన్ని శక్తులు పనిచేయడంతో అది కేవలం ప్రకటనలకే పరిమితమైంది. 

అక్కడ విద్యుత్‌తో పాటు నీటి సౌకర్యం కల్పించకపోవడంతో ఇళ్ల నిర్మాణాలకు బ్రేకులు పడ్డాయి. తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటూ లబ్ధిదారులు అనేక పర్యాయాలు హౌసింగ్ కార్యాలయం చుట్టూ కాళ్ల చెప్పులరిగేలా తిరిగినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఉన్నతస్థాయిలో వస్తున్న ఒత్తిడి కారణంగానే ఫిలింసిటీలో ఇళ్ల నిర్మాణానికి అధికారులు జంకుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఇళ్ల నిర్మాణం జరిగితే ఫిలింసిటీకి ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదనను అడ్డుకుంటున్నట్లు సమాచారం. 

అధికారులు అమ్ముడుపోయారు..
ఫిలింసిటీలో ఇళ్ల స్థలాలను పొందిన వారిలో నాగన్‌పల్లి గుడిసెవాసులు దాదాపు 50 మంది ఉన్నారు. తమకు ఇళ్లు కట్టించి ఇవ్వాలంటూ ఈ గుడిసెవాసులు మూడేళ్ల కిందట కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన కూడా చేశారు. అప్పట్లో వీరిలో కొందరు ఆత్మహత్యాయత్నానికి కూడా పూనుకున్నారు. ఆ తర్వాత ఇళ్ల గురించి ఈ గుడిసెవాసులు అనేక పర్యాయాలు హౌసింగ్ కార్యాలయం ఎదుట ధర్నాలు కూడా చేశారు. అయినా అధికారులు మాత్రం ఈ విషయం గురించి పట్టించుకోవడం మానేశారు. దీంతో అధికారులు రామోజీరావుకు అమ్ముడుపోయారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఫిలింసిటీలో ఇళ్లు కట్టించి ఇవ్వకపోతే చావడానికైనా వెనుకాడేది లేదని వారు హెచ్చరిస్తున్నారు. 

రాజశేఖరరెడ్డి ఉంటే ఇళ్లు కట్టించేవారు
రాజశేఖరరెడ్డి పుణ్యాన మాకు ఇళ్ల స్థలాలు వచ్చాయి. ఆయన జీవించి ఉంటే మాకు ఇళ్లు కట్టించి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అధికారులు ఎవరికో అమ్ముడుపోయి ఇళ్లను నిర్మించడానికి వెనుకాడుతున్నారు. ఇప్పటికైనా మాకు ఫిలింసిటీలో ఇళ్లు కట్టించి ఇవ్వాలి.
-పి. అరుణమ్మ, రాయపోల్


చావుకైనా వెనుకాడం...
ఫిలింసిటీలో మాకు ఇళ్లు కట్టించడానికి అధికారులు ఎందుకు వెనుకాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇళ్లు నిర్మించి ఇవ్వాలని గతంలో కలెక్టర్ ఆఫీసు ఎదుట ధర్నా చేసినా అధికారులు స్పందించలేదు. అప్పుడు నేను ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నించాను. ఇల్లు కోసం చావడానికైనా నేను సిద్ధం.
-ఒరుసు బాలమ్మ, నాగన్‌పల్లి 


గుడిసెల్లో ఉండలేకపోతున్నాం...
నాగన్‌పల్లిలో గుడిసెల్లో ఉండలేకపోతున్నాం. వర్షాలు పడితే గుడిసెల్లోకి నీరు వచ్చి నానా తిప్పలు పడుతున్నాం. రాత్రి వేళల్లో పురుగు, పుట్ర వచ్చి భయపడుతున్నాం. మాకు ఫిలింసిటీలో వెంటనే ఇళ్లు కట్టించి ఇవ్వాలి. ఇళ్లు కట్టించి ఇవ్వకపోతే మాకు చావే గతి.
-వల్లెపు చెన్నమ్మ, నాగన్‌పల్లి


విద్యుత్ సౌకర్యం లేక వాయిదా...
ఫిలింసిటీలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అక్కడ విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యుత్ సరఫరా గురించి ఆ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. కరెంటు సౌకర్యం ఏర్పాటు చేయగానే ఇళ్ల నిర్మాణం చేపడతాం.
-సుభా



source:sakshi

Popular Posts

Topics :