2014 ఎన్నికల కోసమే ఈ హైడ్రామా అంతా . - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 2014 ఎన్నికల కోసమే ఈ హైడ్రామా అంతా .

2014 ఎన్నికల కోసమే ఈ హైడ్రామా అంతా .

Written By news on Sunday, January 27, 2013 | 1/27/2013

2014 ఎన్నికల కోసమే ఈ హైడ్రామా అంతా
కుట్రలతో తెలుగు ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటు సీమాంధ్రలోనూ, అటు తెలంగాణ ప్రాంతంలోనూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి తెలుగు ప్రజల్ని చంపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. శనివారం గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అసలు కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశానికి ఎందుకు పిలిచిందో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు హాజరైతే సురేష్‌రెడ్డి మాట్లాడాక సీమాంధ్ర ప్రతినిధి గాదె వెంకటరెడ్డి మాట్లాడే ప్రయత్నం చేయబోగా ఒకరితో మాట్లాడాం చాలని షిండే అన్నారని తెలిపారు. రాష్ట్రంలో డిసెంబర్ 28 తరువాత నుంచి రెండు ప్రాంతాల్లో అలజడి, అభివృద్ధి నిరోధక శక్తులు పెరిగిపోయాయని చెప్పారు. హోంమంత్రి షిండే నెలరోజుల్లోగా తెలంగాణపై తమ అభిప్రాయం చెబుతామని అన్నారని, చివరికి చెప్పాల్సిన తేదీ సమీపిస్తున్నప్పుడు ఆయన మాట్లాడకుండా ఆజాద్‌తో మాట్లాడిస్తున్నారన్నారు. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం లాగా కేంద్ర ప్రభుత్వ చెలగాటంతో రాష్ట్రప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 28 ప్రకటన తరువాత సమస్యలన్నింటికీ ఫుల్‌స్టాప్ పడుతుందని, ఏదో ఒక పరిష్కారంతో రెండు ప్రాంతాల్లో ప్రశాంతత నెలకొంటుందని భావించామని, దీనికి భిన్నంగా రాష్ట్రంలో పరిస్థితి ఉందన్నారు. జై ఆంధ్ర ఉద్యమం తారస్థాయికి చేరినప్పుడు నాడు ఇందిరాగాంధీ పార్లమెంటులో ప్రకటన చేసి ఉద్యమంపై నీళ్లు చల్లారని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు సోనియాగాంధీతో ఎందుకు ప్రకటన చేయించడం లేదని ఆయన ప్రశ్నించారు. నిజంగా రాష్ట్రాభివృద్ధి కోరుకున్నవారైతే అలా ప్రకటన చేయించి, రెండు ప్రాంతాల ఉద్యమాలపై నీళ్లు చల్లవచ్చు కదా అన్నారు. కుట్రలతో తెలుగుప్రాంత అభి వృద్ధిని అడ్డుకుంటున్నారన్నా రు. 

తెలంగాణ నేతలు మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్, గుత్తా, కేకే, రాజయ్య, మరికొందరు తెలంగాణ నేతలు సీమాంధ్ర నేతల్ని ఇష్టానుసారంగా తిడుతున్నారని, సీమాంధ్రనేతలంతా దొంగలని, దోపిడీదారులని మాట్లాడుతున్నారని, కొందరైతే ఇంకో అడుగు వుుందుకేసి సీమాంధ్ర నేతలు ఢిల్లీలో రేపిస్టులకన్నా ఘోరంగా ఉన్నారని మాట్లాడుతున్నారని చెప్పారు. సీమాంధ్ర నేతలు లగడపాటి, ఉండవల్లి, టి.జి. వెంకటేష్, శైలజానాథ్, జోగి రమేష్, మల్లాది విష్ణులు తెలంగాణనేతలను రజాకారులంటూ దూషిస్తున్నారన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ జీరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ ఎప్పుడో పోయిందని, ఇటు సీమాంధ్ర ప్రాంతంలోనూ, అటు తెలంగాణ ప్రాంతంలోనూ కాంగ్రెస్‌కు ఏమాత్రం ప్రజాదరణ లేదని, అందుకే అధిష్టానం విద్వేషాల ద్వారా ఓ ప్రాంతంలోనైనా ఓట్లు పొందవచ్చని, ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ హైడ్రామా అంతా 2014 ఎన్నికల కోసమేనన్నారు. రాష్ట్రంలో సక్రమపాలన రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా ఒక్క జగన్‌తోనే సాధ్యమని 8 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారని, దీన్ని ఓర్వలేక జగన్‌ను అణచివేయాలని, రాష్ట్రంలో అశాంతిని పెంచాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. 

తెలుగుప్రజల మధ్య అలజడి సృష్టించి, ఆ అలజడితో ఓట్లు ఏరుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌పార్టీ తెలుగు ప్రజలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌పార్టీ అభిప్రాయం ఏమిటి, అసలు రాష్ట్ర విభజన జరుగుతుందా, లేక సమైక్యంగా ఉంటుందా, ప్యాకేజీలతో అభివృద్ధి చేస్తారా అనే దానిపై స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్ని కుట్రలు జరిగినా జగన్‌కున్న ప్రజాదరణ ఆపలేరని, ప్రజలతో ఆడుకోవడం ఇకనైనా మానుకుని సమస్యలకు పరిష్కారం చూపిం చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాజకీయ లబ్ధికోసమే పాకులాడుతోందని,అసలు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భవించాక ఘోరంగా నష్టపోయింది తెలుగుదేశం పార్టీయేనని అంబటి పేర్కొన్నారు.
Share this article :

0 comments: