జగన్ కోసం: 221 రోజులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ కోసం: 221 రోజులు

జగన్ కోసం: 221 రోజులు

Written By news on Wednesday, January 2, 2013 | 1/02/2013

పాలకపక్షానికి తెలియదు... ముందుంది పోయే కాలం అని!

జైల్లో ఉన్నా, బయట ఉన్నా జగన్ జగనే. ఈ రోజు ఆయనను జైల్లో పెట్టామని ప్రధాన, ప్రతిపక్ష పార్టీలు, ఎల్లో మీడియా, సీబీఐ సంస్థలు చాలా సంబరపడుతున్నాయి. కానీ వాళ్లకి తెలియని నిజమేమంటే జగనన్న ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నాడని! మన ప్రియతమ నేత వైఎస్సార్ ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు- ‘ఏమి జరిగినా మన మంచికే అని అనుకుని ముందుకు సాగాలి’ అని. ఇదంతా చూస్తుంటే ఇప్పుడు నాకనిపిస్తుంది, జగనన్న మంచికే ఇదంతా జరుగుతోందని! కనిపించని దేవుళ్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్లందరికీ మనం పూజలు చేస్తాం. కానీ కనిపించే దేవుడు మన వైఎస్సార్. అందుకే ఆయన మరణానంతరం ఈ రాష్ట్ర ప్రజలు ఆయన విగ్రహాలు, చిత్రపటాలను తమ ఊళ్లలో, ఇళ్లలో పెట్టుకుని పూజిస్తున్నారు. 

ఆయన కొడుకైన జగనన్న విలువలు, విశ్వసనీయతలకు కట్టుబడి, మానవత్వం ఇంకా బతికే ఉంది అని నమ్మకం కలిగేటట్లుగా, ఆనాడు నల్లకాలువ దగ్గర ఇచ్చిన మాటకు లోబడి, ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. కానీ జగనన్నకు పెరిగిపోతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోయారు. జగనన్నను జైల్లో పెట్టించారు. కానీ ఈ రాష్ట్ర ప్రజల మాట ఒక్కటే - ‘రాజన్న రాజ్యం, జగనన్నతోనే సాధ్యం’. ఇది జగమెరిగిన సత్యం. వైఎస్సార్ అంటే గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ జగనన్నకు తోడుగా, అండగా ఉంటారు. 


మరోవైపు- రాష్ట్రానికి సేవ చేయాల్సిన వ్యక్తి ‘ముందుంది మంచి కాలం’ అంటూ ఢిల్లీ పెద్దలకు సేవ చేస్తున్నాడు. కానీ ఈ పాలక పక్షానికి తెలియదు ‘ముందుంది పోయే కాలం’ అని! ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన వ్యక్తి. కానీ అదే ప్రభుత్వంతో కుమ్మక్కై మీడియాను అడ్డం పెట్టుకుని ‘వస్తున్నా మీకోసం’ అంటూ పాదయాత్ర చేస్తున్నాడు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, బాబు వస్తున్నది తమ కోసం కాదు, తన కోసమని! అంతేకాదు, నిష్కలంకమైన జగనన్నను, ఆయన వెన్నంటి ఉన్న ప్రజాబలాన్ని చూసి స్వచ్ఛందంగా వైఎస్సార్‌సీపీలో చేరుతున్న ఎమ్మెల్యేలను గొర్రెలతో పోల్చడం చంద్రబాబు నీచ బుద్ధికి తార్కాణం.

చంద్రబాబు లాంటివాళ్లు ఎన్ని అపవాదులు, అపనిందలు వేసినా జగనన్న జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటికి వస్తారు. తిరుగులేని మెజారిటీతో 2014లో ముఖ్యమంత్రి అవుతారు.
- సూరసాని కిరణ్‌రెడ్డి, పాండురంగాపురం, పాల్వంచ, ఖమ్మం


జగనే ప్రజలు... ప్రజలే జగన్
స్వార్థపూరిత రాజకీయ నాయకులతో నడుస్తున్న ఈ ప్రభుత్వం, ప్రజలకేమి చెయ్యకపోగా పదవులు కాపాడుకునేందుకు చెయ్యరాని పనులెన్నో చేస్తూ రోజులు గడుపుకుంటోంది. ప్రజలె లా పోతే మాకేమిటి మా పనులు అయితే చాలని అనుకుంటూ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా వాటి ఖర్చులకు సరపడా సంపాదనలో పడ్డారు మన నాయకులు. కాని ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా తగిన గుణపాఠం నేర్పడానికి ఎదురు చూస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రజల వల్ల గెలిచి, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ఇద్దరే ఇద్దరు. అన్నగారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావుగారు, మహానేత శ్రీ వై.ఎస్.రాజశేఖరరెడ్డిగారు. మిగతా వాళ్లందరూ ఢిల్లీ నుండి సీల్డ్ కవర్‌లో నామినేట్ నాయకులే. ఆ నాయకులకు ఇప్పుడు జగన్ అంటేనే వణుకుపుడుతోంది. జగన్ ఒక వ్యక్తి కాదు, అది ఒక వ్యవస్థ. జగన్ ప్రజల మనిషి. ఆయనే ప్రజలు. ప్రజలే ఆయన. మనసున్న మనిషంటే గిట్టని ఈ స్వార్థపర రాజకీయ చతురులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. 

జగన్‌కు జరిగిన అన్యాయం చూస్తుంటే అసలు ప్రస్తుతమున్నది నేనెరిగిన గాంధీ, నెహ్రూ, ఇందిరమ్మ కాంగ్రెస్సేనా అనే అనుమానం వస్తోంది. ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనిపిస్తోంది. ఒకప్పుడు మేధావులైన కమ్యూనిస్టు, ఇతర పార్టీల నాయకులు ప్రజల కోసం ఎన్నో మాట్లాడేవాళ్లు. కాని అప్పటి ప్రభుత్వాలు ఎన్నడూ వారిని జైళ్లల్లో పెట్టలేదు. కానీ ఇదేమిటి? ‘నేను మాటమీద నిలబడి, మా నాన్నకోసం మరణించినవాళ్లను పరామర్శించాలి’ అనంటే అదొక తప్పన్నట్లు జగన్‌పై కేసులు పెట్టి జైల్లో పెట్టడం, మానసికంగా చిత్రవధ చేయడం ఏమిటో ఈ సమాజంలో అర్థం కాని ప్రశ్నగా నిలిచింది. ఏది ఏమైనా చివరికి భగవంతుడు, ప్రజలు నిర్ణయిస్తారు. సరైన సమయంలో జగన్ మన మధ్యకు వస్తారు. అతనొక ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసం ఎన్నుకోబడిన నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడుపుతాడు. ఆ నమ్మకం మాకుంది.
- ఏకాంబరం, రిటైర్డ్ ఉద్యోగి, హైదరాబాద్

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=55247&Categoryid=11&subcatid=21

Share this article :

0 comments: