జగన్ బెయిల్ పై తీర్పు 23కు వాయిదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ బెయిల్ పై తీర్పు 23కు వాయిదా

జగన్ బెయిల్ పై తీర్పు 23కు వాయిదా

Written By news on Tuesday, January 22, 2013 | 1/22/2013

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి జగన్మోహన రెడ్డి బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. భోజనవిరామం తర్వాత జగన్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి, సిబిఐ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ అశోక్ భాను తమ వాదనలు వినిపించారు. 

ఒక్క సీసీ8 లోనే కాకుండా, అన్ని అంశాలకు సంబంధించి జగన్ ను రిమాండ్ లోకి తీసుకున్నారని నిరంజన్ కోర్టుకు తెలిపారు. కేవలం దాఖలుచేసిన ఛార్జిషీటుకు సంబంధించి మాత్రమే రిమాండ్ లోకి తీసుకోలేదన్నారు. వీలైనంత త్వరలో దర్యాప్తు పూర్తిచేస్తామని సీబీఐ సుప్రీం కోర్టుకు చెప్పిందని, అయితే దర్యాప్తు ముగింపునకు అంతం ఎక్కడ? అని ఆయన ప్రశ్నించారు. ఎంతకాలం అంటే అంతకాలం జగన్ ను జైలులో ఉంచుతారా? అని అడిగారు. 90 రోజులకు మించి ఎట్టి పరిస్థితుల్లోనూ కస్టడీలో ఉంచకూడదని ఆయన వాదించారు. 

దర్యాప్తు పూర్తిచేయడానికి సమయం పడుతుందని సిబిఐ హైకోర్టుకు తెలిపింది. ఎంతకాలం పడుతుంది? ఎన్నేళ్లు పడుతుంది? అని సీబీఐపై హైకోర్టు మండిపడింది. దర్యాప్తు పూర్తిచేయడం కష్టంగా ఉందని సీబీఐ తెలిపింది. దర్యాప్తునకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం అందడంలేదని చెప్పింది. ఈ విషయాన్ని చెప్పడానికి తాము సంకోచించడంలేదని సిబిఐ హైకోర్టుకు తెలిపింది.

2012 అక్టోబర్ అయిదో తేదీన సుప్రీం కోర్టు జారీ చేసిన నిర్దేశం వెలువడిన అనంతరం పరిస్థితుల్లో ఎన్నో మార్పులొచ్చాయనీ, ఈ మార్పులను గమనికలోకి తీసుకుని, దిగువ న్యాయస్థానాలు విచారణ చేపట్టవచ్చుననీ నిరంజన్ రెడ్డి వాదించారు. తన వాదనకు మద్దతుగా ఆయన, బాబూ సింగ్ వర్సస్ ఉత్తరప్రదేశ్ స్టేట్ కేసులోనూ, కళ్యాణ చంద్ర సర్కార్ వర్సస్ రాజేష్ రంజన్ కేసులోనూ వెలువడిన తీర్పులను ఉదాహరించారు. ‘‘సీసీ నం 8-2012 (2012 సంవత్సరం ఎనిమిదో నంబరు కేసు)కు సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చెయ్యాలని గానీ, రిమాండ్‌లో ఉంచాలనిగానీ తామెన్నడూ కోరలేదని సీబీఐ ఇప్పుడు వాదిస్తోంది. ప్రస్తుత బెయిల్ పిటిషనుపై దాఖలు చేసిన కౌంటర్‌లోని నాలుగు, అయిదు పేరాలు ఈ విషయాన్ని స్పష్టీకరిస్తున్నాయి. ఈ వాదన 2012 అక్టోబర్‌లో సుప్రీం కోర్టు ముందు చేసిన వాదనలకు భిన్నంగా ఉండడం గమనార్హం. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయినందువల్లనూ, ఇంకా దర్యాప్తు చెయ్యాల్సిన విషయాలేం మిగిలి లేనందువల్లనూ, పిటిషనర్ (వైఎస్ జగన్ మోహన్ రెడ్డి)కి బెయిల్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నా’’మని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. 
Share this article :

0 comments: