జగన్ కోసం: 242 రోజులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ కోసం: 242 రోజులు

జగన్ కోసం: 242 రోజులు

Written By news on Wednesday, January 23, 2013 | 1/23/2013

జగన్ కోసం: 242 రోజులు

ఇటీవల సీనియర్ జర్నలిస్టు తవ్లీన్‌సింగ్ రాసిన ‘దర్బార్’ అనే పుస్తకాన్ని చదువుతున్నప్పుడు నా మనసు ఒకచోట తీవ్రమైన అలజడికి లోనైంది. 1978 డిసెంబరు నాటి ఒక శీతాకాలపు సాయంత్రం.. అత్తగారైన ఇందిరాగాంధీ వెంట జైలు వరకు తోడుగా వెళ్లేందుకు పార్లమెంటు భవనం బయట వేచి ఉన్న సోనియాగాంధీకి, తనకు మధ్య నడిచిన సంభాషణను తవ్లీన్ ఆ పుస్తకంలో గుర్తుచేసుకున్నారు. ‘‘భారతదేశపు రాజకీయాలను చూసి భీతిల్లుతున్నారా?’’ అని తవ్లీన్ అడిగినప్పుడు - సోనియా నవ్వుతూ ‘‘ఇప్పుడిప్పుడే అలవాటుపడుతున్నాను. ముందుముందు మరింత బాగా అర్థంచేసుకోగలనేమో. కానీ, పిల్లల గురించే (రాహుల్, ప్రియాంక) నా ఆందోళనంతా. వాళ్లను బాధించే ‘ఈ రాజకీయాలను’ ద్వేషించవలసి వస్తుందేమో’’ అన్నారు. వాళ్ల నాయనమ్మని జనతా ప్రభుత్వం జైలుపాలు చెయ్యడం గురించే సోనియా ‘ఈ రాజకీయాలు’ అనే మాట వాడారు.

పుస్తకంలోని ఈ భాగాన్ని చదువుతున్నప్పుడు నాకొకటి అనిపించింది, సోనియా ఎప్పుడైనా వై.ఎస్.జగన్ పిల్లలు ఎంత బాధపడుతుంటారో ఆలోచించి ఉంటారా అని! నాన్నకు జరిగిన అన్యాయాన్ని, అమ్మ పడుతున్న ఆవేదనని చూసి విలవిలలాడుతున్న ఆ చిన్నారులను సోనియా ఒక్క క్షణమైనా తలచుకుని ఉంటారా అని! అందరు పిల్లలూ తన పిల్లల్లాంటి వారేనని సోనియా అనుకోలేకపోయారా! తన పిల్లలు సున్నితమైనవారు, ఇతరుల పిల్లలు కారా! ఎంత కాఠిన్యం?! ఇలాంటి వ్యక్తి నేతృత్వంలో ఒక ప్రజాస్వామిక దేశం క్రమంగా పోలీసు రాజ్యంగా మారనున్న దృశ్యాన్ని మనం అసహాయంగా చూడబోతున్నామా?

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో దేశంలోని అనేక ప్రాంతాలలో పట్టుకోల్పోతున్న వాస్తవాన్ని కాంగ్రెస్ నాయకత్వం, ఆ పార్టీలోని అగ్రశ్రేణి నాయకులు ఇటీవలి చింతనా శిబిరాలలో గుర్తించడంపై జాతీయ వార్తా చానళ్లలో ప్రస్తుతం జరుగుతున్న చర్చను చూశాక నాకు విస్మయం కలిగింది! పార్టీకి ప్రజలు దూరమవుతున్నారన్న సంగతిని తెలుసుకోడానికి చింతనా శిబిరమే కావాలా? యువరాజుకు పట్టం కట్టేందుకు తప్ప ఈ శిబిరాలకు వేరే పరమార్థమే లేదన్నది స్పష్టమౌతూనే ఉంది. అంతేనా, ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ప్రజలు కట్టబెట్టిన దాన్ని మించి ప్రాంతీయ పార్టీలు అధికారాన్ని చెలాయిస్తున్నాయన్న ఓర్వలేని తనమేదో అకస్మాత్తుగా వారిని నిద్రలేపినట్లుగా కనిపిస్తోంది.

ఉదయం శిబిరం అనగా, 17వ తేదీ రాత్రి గడియారం 12 కొట్టగానే వీరికీ సత్యం బోధపడిందని అనుకోవాలా? అయినా సరే వీళ్లను ఇంత సౌకర్యవంతంగా, ధీమాగా ఉంచుతున్న కారణాలేమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సమాధానం కోసం నేను పైసా కూడా ఖర్చుపెట్టదలచుకోలేదు. ఎందుకంటే - దేశంలోని ప్రతి ఒక్కరికీ... చదువుకున్న వారికీ, అంతగా చదువుకోని వారికీ అందరికీ తెలుసు... ప్రజాదరణ నానాటికీ తగ్గిపోతున్నప్పటికీ ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఏ ధైర్యంతో నిమ్మళంగా ఉన్నారో. వారి చేతి కింద సి.బి.ఐ., ఇంకా అలాంటివే కొన్ని సంస్థలు ఉన్నాయి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభాల్లా ఉండవలసిన ఈ సంస్థలను పావులుగా చేసుకుని కాంగ్రెస్‌పార్టీ అనుచితమైన వ్యూహాలకు పాల్పడుతోంది.

వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి విషయంలోనూ కాంగ్రెస్ పెద్దలు ఇదేవిధమైన కుతంత్రాలను పన్నారు. ఇవాళ ఎవరి కుమారుడికో జరిగింది. రేపు వాళ్ల కుమారుడికే జరగొచ్చని తెలీదా? నమ్మిన ధర్మానికి విరుద్ధంగా అధిష్టాన నిర్ణయాలకు లోబడి ఉండలేని ఒక యువకుడు, ఒంటిచేత్తో పార్టీని వరుసగా రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన తన తండ్రి స్ఫూర్తితో ప్రజలతో మమేకం కావాలనుకున్న యువకుడు తన దారి తను చూసుకోవలసిన పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ కల్పించింది!

మేడమ్ సోనియా ఇప్పుడు ఏ మధ్యతరగతి సంక్షేమం గురించైతే కళ్లుతెరిచారో ఆ మధ్యతరగతి జీవితాలను మెరుగుపరిచేందుకు దివంగత ముఖ్యమంతి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏనాడో శ్రమించారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం లోటులేని వర్తమానాన్ని, ఢోకాలేని భవిష్యత్తుని వీక్షించింది. కేంద్రంలో సైతం కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చినందుకు కూడా సోనియా ఆయనకు రుణపడి ఉండాలి. ఇంత ప్రజాదరణ ఉన్న నాయకుడు కనుకనే ఆయన మరణం తర్వాత ఆయన కుమారుడు శక్తిమంతమైన నాయకుడుగా ఎదుగుతాడేమోనన్న కాంగ్రెస్ భయం... అతడికి అడుగడుగునా అవరోధాలు కల్పించడంలో స్పష్టంగా వ్యక్తమయింది. కేంద్రంలో, రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకోడానికి కాంగ్రెస్ పార్టీ అత్యంత క్రూరంగా వ్యవహరించింది. జగన్‌పై అనుచితమైన నిందారోపణలు చేసింది.

నాకైతే...‘నిర్భయ’ అత్యాచారంలో జరిగిన దౌర్జన్యమే, ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్న కాంగ్రెస్ ధోరణిలోనూ కనిపిస్తోంది. మరి కాంగ్రెస్‌పై ఎఫ్.ఐ.ఆర్. నమోదు అవుతుందా? కాంగ్రెస్‌కు మరణశిక్ష విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తారా? న్యాయం జరుగుతుందా?
- దుష్యంత్‌రెడ్డి, హైదరాబాద్

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: